4, ఫిబ్రవరి 2022, శుక్రవారం

అయిదవ సామాన్య ఆదివారము (2)

అయిదవ సామాన్య ఆదివారము
 యెషయా   6:1-8
 1 కొరింతి 15:1-11
  లూకా  5:1-11

నేటి దివ్యపఠనాలు దేవుని సేవకు ఎన్నుకొనబడిన వారి జీవితం గురించి భోదిస్తుంది. ప్రభువు యొక్క సేవ చేయడానికి ఆయన యొక్క పవిత్ర వాక్యం బోధించడానికి అలాగే దేవుని ముంగిట నిలబడడానికి ఎన్నుకొన్న బడిన వారి యొక్క అయోగ్యత గురించి తెలుపు చున్నాయి.
అర్హత లేని వారిని ఎన్నుకొని, వారిని బలపరిచి తన యొక్క సేవకు వినియోగించిన విధానం నేడు మూడు పఠనాలు ద్వారావింటున్నాం.

ఈనాటి మొదటి పట్టణములో దేవుడు యెషయా ప్రవక్తను తన యొక్క పని నిమిత్తము  పిలిచినా విధానం తెలుసుకుంటున్నాం. దేవుని యొక్క ప్రణాళికలను, భోధనలనుతెలియజేయుటకు దేవుడు యెషయా ప్రవక్తను ఎన్నుకొంటున్నాడు. క్రీస్తు పూర్వం ఎనిమిదవ శతాబ్దములో దేవునియొక్క ప్రజలు రెండుగా విభజింపబడ్డారు. ఉత్తర రాజ్యమును ఇశ్రాయేలుగా, దక్షణ రాజ్యము యూదాగా విభజింపబడ్డాయి. యెషయాను దేవుడు క్రీస్తు పూర్వం 742 వ సంవత్సరములో పిలిచి, ప్రవక్తగా ఎన్నుకొంటున్నారు. ఆయన ప్రవక్తగా పిలుపుని పొందిన సమయములో అస్సిరియా సేనలు బలంగా ఉండేవి. దానితోపాటు సిరియా కూడా బలంగా ఏర్పడుచున్న సమయమది. అయితే అప్పటి యూదా, ఇశ్రాయేలు ప్రజలు పెద్దలు వారియొక్క రాజ్యములను సంరక్షించుకొనుటకు వారు భద్రముగా ఉండుటకు రాజకీయ పరంగా అస్సిరియులకు మిగతా బలంగా వున్నా సైనిక రాజ్యాలకు సహకరించి జీవించేవారు. దేవుణ్ణివారు నమ్మకుండా వేరే మానవ శక్తులను, బలాలను నమ్ముకొని వారిమీద ఆధారపడే సమయములో దేవుడు యెషయాను పిలిచి ఆయనయొక్క సందేశం అందించుటకు ఆయన్ను ఎన్నుకొంటున్నారు.

దేవునియొక్క విలువైన ప్రతిమాటను రాజులకు, మతపెద్దలకు, ప్రజలకు తెలియజేయుటకు దేవుడు ప్రవక్తను ఎన్నుకొంటున్నారు. యెషయా దైవపిలుపును అందుకొన్న సమయములో యూదా రాజ్యాన్ని యోతాము,ఆహాసు, హిజ్కియా రాజులు పరిపాలించేవారు.

యెషయా ప్రవక్త యొక్క ఎన్నిక ప్రత్యేకమైనది. ఎందుకంటే, స్వయముగా దేవుడు తన దర్శనం కలుగజేస్తూ, తనయొక్క మహిమను వెల్లడిస్తూ తనయొక్క పనికోసం ఎన్నుకొన్నారు. యెషయా ప్రవక్త యెరూషలేము దేవాలయములో ప్రార్ధిస్తున్నప్పుడు ఆయనకు ఈ దర్శనం కలిగినది. దేవునియొక్క సమక్షంలో తన యొక్క అయోగ్యతను గుర్తించాడు.

 యెషయా  ప్రవక్త  తనకు కలిగిన దర్శనంలో దేవుని యొక్క పవిత్రతను గుర్తించాడు 
ఎందుకంటే దేవదూతల విలువైన మాటలు చెవులారా విన్నాడు.
-పవిత్ర మూర్తి అయినా దేవుణ్ణి చూసినప్పుడు, దేవుణ్ణి గురించి విన్న స్తుతిగానాలు యెషయా ప్రవక్త దేవుని యొక్క సన్నిదిలో తాను ఎంత పాపియే తెలుసుకుంటున్నాడు.
-దేవుని ముంగిట నూలువబడటానికి ప్రజలు ఎంతటి అనర్హులో గ్రహిస్తున్నాడు, అయినప్పటికీ దేవుడు మరలా  బలహీనులను పాపాత్ములైన జనుల మధ్య నుండే తన సేవకు ఎన్నుకుంటున్నారు. 

మనం దేవునికి ఎంత దగ్గరవుతామో అప్పుడు అంట తెల్లగా మన యొక్క పాపపు జీవితం అర్థమవుతుంది. 
-ఇంకొక విధంగా చెప్పాలంటే మనము వెలుగులోనో లేక వెలుతురుకు దగ్గరగా వెళ్తే మన మీద వున్నా మరకలు, మచ్చలు, మురికి అంత స్పష్టంగా కనిపిస్తుంది. 
-అదేవిధంగా ఈ లోకానికి వెలుగైయున్న పవిత్ర మూర్తి అయినా దేవునికి దగ్గరగా వస్తే మనయొక్క అపవిత్రత తెలుస్తుంది.
-యెషయా దేవునికి దగ్గరగా వున్నాడు కాబట్టియే తనయొక్క పాపపు జీవితం గుర్తుకువచ్చింది. 
-ఆ సమయంలో దేవుని యొక్క సెరాఫీము దూతలు ఆయన్ను పవిత్రపరిచారు. 
-సెరాఫిక్ అంటే జ్వలితాలు, మండుచున్నవారు. వీరు నిత్యం పవిత్రతతో జ్వలించే వారు, పవిత్రతతో ప్రకాశించేవారు. 

-రెండవ పఠనంలో పునీత పౌలుగారు తన యొక్క ఎన్నిక గురించి బోధిస్తున్నారు. 
-పౌలుగారు కొరింతునగరంలో సువార్త పరిచర్య చేసే సమయంలో యేసు క్రీస్తు ప్రభుని పునరుత్తానం గురించి అనేక ప్రశ్నలు ప్రజలలో ఉండేవి. కొందరు క్రీస్తు పునరుత్తానం అవ్వలేదని మరికొందరు అయ్యారని అలాగే పౌలుగారి యొక్క సువార్త భోదన్ను కూడా ప్రశ్నించే వారు ఆ సందర్భంలో పౌలుగారు వారందరికీ సాక్ష్యములతో తెలియచేస్తున్నారు .
-క్రీస్తు ప్రభువు నిజంగా ఉత్తానమైనవారు ఆయన మొదటిగా పేతురుకు తరువాత ఆపోస్తులకు, ఐదువేలమందికి దర్శనం ఇచ్చారు అని వారికీ తెలియచేస్తున్నారు. 
-దేవుడు నిజంగా ఉత్తానమై ఉన్నారు దానికి సజీవ సాక్షులు మన మధ్య వున్నారు అని తెలుపుచున్నారు.
ఆయన  యొక్క  మరణ పునరుత్తానములను ప్రకటించుటకే నేను ఎన్ను కోన బడ్డాను అని పౌలుగారు తెలుపుచున్నారు. 
-ఆయన ఎన్నికలో తన యొక్క అయోగ్యతను గుర్తిస్తున్నారు తాను అపోస్తులుడుగా పిలువబడుటకు అర్హుడను కాని ఎందుకంటే దేవుని ప్రజలను హింసించాను కాబట్టి అయినా దేవుడు తన్ను ఎన్నుకొన్నారు అది ఆయన గొప్పతనం అని పలుకుచున్నారు.
-దేవునియొక్క పునరుత్తానం ప్రకటించుటకు దేవుని కృప తనకు తోడుగా ఉందని తెలుపుచున్నారు. దేవుని కృపవలెనే నేను ఇప్పుడు న్న స్థితిలో  వున్నాను అని తెలుపుచున్నారు. 1 కొరింతి 15: 10 
-పౌలు గారు అర్హతలేని నన్ను దేవుడు ఎన్నుకొన్నారు, ఆయన పునరుత్తానమునకు నేనే నిజమైన సాక్షి అని తెలుపుచున్నారు. 

ఈ నాటి సువిశేష పఠనంలో దేవుడు శిష్యులను ఎన్నుకొనే విధానం చూస్తున్నాం. ఆ యన ఎంతో మంది గొప్పవారిని జ్ఞానులను, సమాజంలో పేరున్న వారిని విడిచి పెట్టి ఏమి లేనటువంటి సాధారణమైన ప్రజలను తన సేవకు ఎన్నుకొంటున్నారు.
 
-సామాన్యమైన చేపలు పట్టేవారిని దేవుడు ఎన్నుకొని మనుష్యులను పట్టేవారినిగా చేస్తున్నారు. 
- ఈ సువిశేష భాగంలో చాల విషయాలు మనం ధ్యానించుకోవచ్చు.
- గెన్నేసరేతు ప్రజలయొక్క విశ్వాస జీవితం - ఆ ప్రజల దేవుని యొక్క పవిత్రమైన మాటలను ఆలకించటానికి నెట్టుకొనుచు వస్తున్నారు. దేవునియొక్క మాటలు నిత్య జీవం ఇచ్చే మాటలు అని గ్రహించారు అందుకే నెట్టుకొంటున్నారు . ఇది వారి యొక్క విశ్వాస జీవితానికి నిదర్శనం. 
-మార్కు 6 :53 - 56 వచనాలలో వింటాం యేసు ప్రభువు వారి మధ్యకు వచ్చారని విని ఊరిలో ఎక్కడెక్కడో వున్నా అనారోగ్యులను ప్రభువు చెంతకు తీసుకొనివస్తున్నారు. వచ్చిన అవకాశం కోల్పోకూడదని భారమైన, కష్టమైన రోగులను , యేసుప్రభువు దగ్గరకు మోసుకొని వచ్చారు. వారికి స్వస్థత కావాలి ఆ స్వస్థత దేవుడే ఇస్తారు అని గ్రహించి యేసు ప్రభువు దగ్గరకు వచ్చారు అలాంటి  గొప్ప విశ్వాసం కలిగి వున్నా వారు గెన్నేసరేతు ప్రజలు.

-గెన్నేసరేతు ప్రజలకు విశ్వాసం ఎక్కువగా ఉన్నదియే కాబట్టి ఆయన వాక్కు ఆలకించటానికి నెట్టుకొని పోతున్నారు.
-ఏం సమయంలో మనం నెట్టుకొని పోతాం? మనకు ఏదైనా ముఖ్యమైనది పొందాలంటే అందరికన్నా ముందే వెళ్తా అని తక్కువుగా ఉంటె నెట్టుకొని పోతాం.
-ఇంకా మనం పలానా సమయంలో వెళ్లకపోతే ఇక ఇది మనకు దొరకదు అనే సమయంలో నెట్టుకొని పోతాం. 
-ఉదా; 2020 లో కరోనా వచ్చినప్పుడు కొన్ని నెలలు ముందు పాపులు శ్రమలేదు ఎప్పుడైతే ఆ షాపులు ఓపెన్ చేశారో జనాలు ఒకరినొకరు నెట్టుకుంటూ రెండు మూడు కిలోమీటర్ల వరకు క్యూలో వున్నారు. 
-ఎందుకంటే ఆ టైయంలో వెల్లకపోతే ఇక ముందు దొరకదు అని వారు భావించిన సందర్భంలో నెట్టుకుంటున్నారు. 
-క్రొత్త సినిమా రిలీజ్ అయినా అదే సంగతి. 
-గెన్నేసరేతు ప్రజలు విశ్వాసంతో జీవించే ప్రజలు. వారు నెట్టుకొని వచ్చింది కేవలం దేవుని యొక్క వాక్కును ఆలకించటానికి వస్తున్నారు. 

- ఈ ప్రజలు దేవుని యొక్క వాక్కు ఆ సమయంలో ఆలకించక పోతే ఎదో మేము కోల్పోతాం అని భావించారు. కాబట్టియే దాని   కోసం నెట్టుకొని పోతున్నారు.
-యేసు భోదన, మాటలు కొత్తగా ఉంది ఆ సందేశం ప్రేరణగా ఉంటుంది, ఆ సందేశం చాల గొప్పదని భావించారు. కాబట్టియే ఆ వాక్కు కోసం ఆలా తహ తహ లాడుచున్నారు. 

1. దేవుని యొక్క వాక్కు అయస్కాంత వాక్కు, అయస్కాంతం ఇనుమును ఆకర్షించిన విధముగానే దేవుని యొక్క వాక్కు విశ్వాసులను ప్రజలను అకార్చిస్తుంది. చాల సందర్భాలలో అన్యులు యేసు అనుచరులుగా మారటం చూస్తాం ఎందుకంటే వాక్కు వారిని ఆకర్శించింది కాబ్బటి 
ఉదా: సాధు సుందర్ సింగ్ 

2. దేవుని యొక్క వాక్కు పుట్టించే వాక్కు లూకా 8 : 4 
దేవుని యొక్క వాక్కు మనలో ప్రేమను పుటిస్తుంది
దేవుని యొక్క వాక్కు మనలో క్షమా పుటిస్తుంది 
దేవుని యొక్క వాక్కు మనలో ప్రేరణ పుటిస్తుంది 
దేవుని యొక్క వాక్కు మనలో హృదయ పరివర్తన పుటిస్తుంది 
దేవుని యొక్క వాక్కు మనలో దయను పుటిస్తుంది 
దేవుని యొక్క వాక్కు మనలో క్రొత్త జీవితం పుటిస్తుంది.

3 దేవుని వాక్కు నేర్పించే వాక్కు మనం ఎలా జీవించాలన్నది నేర్పిస్తుంది. 

4 దేవుని వాక్కు స్వస్థతను ఇచ్చే వాక్కు అనేక మందికి మాటలతో స్వస్థతను ఇచ్చారు దేవుడు
గన్నేసరెతు ప్రజలు ఈ వాక్యం యొక్క గొప్ప తనం తెలుసుకొని  ఈ వాక్యం వినకపోతే అలాగే ఈ వాక్యం ప్రకారం జీవించకపోతే మేము ఎదో కోల్పోతామని భావించారు కాబ్బటియే అంత అతృతతో ఉన్నారు.
వారి యొక్క వాక్యం యొక్క ఆకలి తీసివేయబడింది ఇప్పుడు ఉన్న రోజులో దేవుని యొక్క వాక్కు కోసం అంతగా ఆకలితో ఉన్నామా? ఎదురు చుస్తున్నామా? ఆసక్తిగా ఉన్నామా?
ii వారు తమ యొక్క వలలు శుభ్రపరుస్తున్నారు, ఆ సమయంలో దేవుడు వారి పడవలో ప్రవేశిస్తునాడు, మన జీవితంలో పాపమును కడిగివేస్తే పాపాలు ఒప్పుకొని పచ్చాత్తాపం పడితేనే దేవుడు మన జీవితంలోకి ప్రవేశిస్తాడు.
iii విశ్వాస జీవితంలో దేవుని ఆశీర్వాదాలు దొరకాలంటే, మన యొక్క విశ్వాస జీవితంలో లోతుగా వెళ్ళాలి.
- ఒడ్డున వలవేస్తే ఏమి జరగదు, దొరకదు అలాగే నమ మాత్రపు క్రైస్తవ జీవితం జీవిస్తే మనకు అనుగ్రహాలు కూడా దొరకవు. 
- దేవునితో ప్రయాణం చేసినప్పుడు లోతుగా వెళ్ళాలి గాఢమైన విశ్వాసం కలిగి ఉంటె అలాగే దేవునితో ఆ అనుబంధం కలిగి ఉంటేనే దేవుడు మనలను దివిస్తాడు.
- మనం కూడా ప్రార్థనలో లోతుగా వెళ్ళాలి, కష్టపడాలి అప్పుడే దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు.
- విధేయత చూపుట ద్వారా ఆశీర్వాదాలు వస్తాయి. పేతురును అన్ని తెలిసినాకూడా దేవుడు చెప్పిన మాట విని నమ్మకం ఉంచి వాలా వేసాడు, తన జీవితంలో అద్భుతం దేవిని శక్తి చూశాడు అందుకే వాలా చినిగే అన్ని చేపలు బడ్డాయి. 
- నోవా విదేయించాడు - రక్షణ పొందాడు 
- అబ్రాహాము విదేయించాడు - దీవెనలు పొందాడు 
-కాన పల్లి సేవకులు విదేయించాడు - వారు దీవెన పొందారు 
- మరియా తల్లి విడియించారు - దేవుని తల్లి అయారు
- మనం విదేఇస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు.
 -సెరెఫాతు వితంతువు విడియించింది- నూనె సంవృద్ధిగా పొందింది.  (1 రాజు :17 :8 -16 )

మనం కూడా విధేయులై జీవిస్తే మనలోకూడా దేవుని ఆశీర్వాదాలు సంవృద్ధిగా వస్తాయి. నిరాశలో వుండే వారికి దేవుడు తనయొక్క ఓదార్పునిస్తాడు. పేతురుగారిని దేవుడు తనయొక్క సువార్తా  పనికోసమై ఎన్నుకొంటున్నారు. పేతురు దేవునితో సంభాషించే వేళలో తనయొక్క పాపపు జీవితం గుర్తుకు తెచ్చుకొని తనయొక్క అయోగ్యతను గుర్తించి నేను పాపాత్ముడను అని ఒప్పుకొంటున్నారు. పేతురు హన సంభాషణ ద్వారా తనకు దగ్గరైన కొలది తనయొక్క పాపపు జీవితం గుర్తుకుతెచ్చుకొని నన్ను వదలిపొండు అని ప్రభువుతో అంటున్నాడు.  దేవుడు అతడ్ని విడిచిపెట్టడంలేదు. మనంకూడా దేవునితో సంభాషిస్తే అయన సాన్నిధ్యం మనజీవితములో అనుభవిస్తే, మన పాపాలు గుర్తుకు వస్తాయి.మనంకూడా పశ్చాత్తాపపడతాం. పేతురుగారిని దేవుడు ఎన్నుకొని పవిత్రపరచి తనయొక్క రాజ్య స్థాపనకై నాయకుడిగా నియమిస్తున్నారు. తన వాక్యాన్ని, తన రాజ్యాన్ని స్థాపించుటకు దేవుడు సామాన్యమైన వారిని ఎన్నుకొని బలపరిచి, దీవించి వారికి కావలిసిన వరములను ఇస్తున్నాడు. అయోగ్యులైనాకూడా  వారిని తన ప్రేమతో ఎన్నుకొని వారిని నియమించిన గొప్పదేవుడు ప్రభువు. ప్రభువు.

     ఈ మూడు పఠనాల ద్వారా తెలియజేయబడిన వ్యక్తులు యెషయా, పౌలు, పేతురు గార్లు దేవునికి విధేయులై దేవుని కొరకు జీవించిన విధంగా మనం కూడా జీవించాలి.
Rev. Fr. Bala Yesu OCD

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...