ద్వితీయోపదేశకాండము 26:4-10, రోమీయులకు 10:8-13,
లూకా 4:1-13.
క్రీస్తునాధునియందు మిక్కిలి ప్రియా దేవుని భక్త జనులరా , ఈ రోజున మనమందరము తపస్సుకాలపు మొదటి ఆదివారంలోనికి ప్రవేశిస్తున్నాము, ఈ నాటి మూడు దివ్య గ్రంథ పఠనములను మనం ద్యానించినట్లయితే, ఈ మూడు పఠనలు కూడా మనకు ముఖ్యమైనటువంటి కొన్ని అవసరమైనటువంటి అంశముల గురించి తెలియజేస్తునాయి. అవి విశ్వాసం, విధేయత మరియు దేవుని యొక్క విశ్వసనీయత యొక్క ప్రాముఖ్యతను గురించి చెబుతున్నాయి.
ముందుగా మనము మొదటి పఠనమును గమనించినట్లయితే ఈ యొక్క మొదటి పఠనములో. దేవుని కృపకు గుర్తుగా ఇశ్రాయేలీయుల యొక్క పంట మొదటి ఫలాలను దేవునికి అర్పించేటువంటి ఆచారాన్ని గురించి వివరిస్తుంది.
అంతే కాకుండా దేవుడు ఐగుప్తు దేశములో బానిసలుగా ఉన్నప్పుడు వారిని విడిపించి, వాగ్దాన భూమికి నడిపించిన విధానాన్ని కూడా మనకు గుర్తుచేస్తుంది.
అంతే కాకుండా దేవుడు తన ప్రజలకు చేసిన మంచి పనులను గుర్తుచేసుకోవడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది.
మన జీవితంలో కూడా దేవుడు అనేక సార్లు అనేక విధాలుగా ఎన్నెన్నో చేసిన మేలులను ఈ సమయాన మనము గుర్తుచేసుకొని, దేవునికి కృతజ్ఞతలు చెప్పడం చాలా ముఖ్యం. ఎందుకంటే పాపం అనే జీవితములో మనము అనేక సార్లు దేవునికి వెతిరేకంగా చేసిన కూడా అయన మనలను క్షమించి మరల అయన చెంతకు తీసుకున్నాడు. కాబ్బటి మనము కూడా ఇజ్రాయెల వాలే దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తిరిగి అయన చెంతకు రావాలని మొదటి పఠనము మనలను ఆహ్వానిస్తుంది.
రెండొవ పఠనములో రోమీయులకు 10:8-13లో
యేసుక్రీస్తును ప్రభువుగా అంగీకరించడం మరియు మన జీవితములో విశ్వసించడం ద్వారా రక్షణ పొందవచ్చని మనకు తెలియజేస్తుంది. ఎందుకంటే మనం ఎప్పుడైతే యేసు ప్రభువు ప్రభువు అని విశ్వాసిస్తామో అప్పుడే మనము అయన ద్వారా రక్షింపబడతాము(10:9). ఇక్కడ విశ్వాసం యొక్క సార్వత్రిక స్వభావాన్ని నొక్కి వక్కనించి చెబుతుంది, ఇక్కడ యూదుడని గ్రీసుదేశస్థుడని భేదములేదు. అందరూ కూడా ఒకటేనాని ఒక్క ప్రభువే అందరికి ప్రభువైయునాడని. ఆయనను నమ్మడం ద్వారా ఎవరైనా రక్షణ పొందవచ్చు అని తెలియజేస్తుంది. ఇక్కడ మనము పూర్తిగా గమనించినట్లయితే ఇది మనకు దేవుని ప్రేమను, ఆయన రక్షణ ప్రణాళికను గురించి తెలియజేస్తుంది. కాబ్బటి మనము కూడా అదే విశ్వాసాన్ని దేవుని పట్ల చూపిస్తూ జీవించాలని రెండొవ పఠనము మనకు వివరిస్తుంది.
చివరిగా సువిశేష పఠనములో యేసు ఎడారిలో శోధించబడిన వృత్తాంతాన్ని గురించి వివరిస్తుంది. యేసు సాతాను శోధనలను లేఖనాల ద్వారా జయించాడు. ఇక్కడ విశ్వాసం మరియు దేవుని వాక్యానికి విధేయత గురించి చెబుతుంది. యేసు శోధనలను ఎదుర్కొన్నప్పుడు, ఆయన దేవుని వాక్యంపై ఆధారపడ్డాడు. మనం కూడా అనేక సార్లు అనేక విధాలుగా శోధనలను ఎదుర్కొనేటప్పుడు, దేవుని వాక్యం మనకు ఎంతగానో సహాయం చేస్తుంది. బలహీనలుగా ఉన్నా మనలను దేవుని వాక్యం బలవంతులను చేస్తోంది. కాబ్బటి మనము ముందుగా దేవుని యొక్క వాక్యానికి ప్రాముఖ్యత ఇచ్చినట్లయితే దేవుడు మనకు కూడా ప్రాముఖ్యతను ఇస్తాడు.
కాబట్టి ప్రియా దేవుని బుడ్డలారా మనం దేవునిపై విశ్వాసం ఉంచాలి, ఆయన వాక్యానికి విధేయత చూపాలి మరియు ఆయన చేసిన మేలులను గుర్తుచేసుకోనీ కృతజ్ఞతలు చెల్లించుకుందాము.
Fr. Johannes OCD