తపస్సుకాలం రెండొవ ఆదివారము
ఆది 12: 1 -4
2 తిమోతి 1: 8 -10
మత్తయి 17: 1 - 9
క్రిస్తునాధుని యందు ప్రియా సహోదరి సహోదరులారా
ఈనాడు తల్లి తిరుసభ తపస్సుకాలం రెండొవ ఆదివారములోనికి ప్రవేశిస్తూఉన్నది. ఈ వారమును మనము దివ్యరూపధారణ వారముగా కొనియాడుతూ ఉన్నాము. ఎందుకు అని అంటే యేసు ప్రభువు తన యొక్క సిలువ శ్రమలను అనుభింవించడానికి ముందు యేసు ప్రభువు తన యొక్క పవిత్రతను తన యొక్క శిష్యులకు తెలియపరుస్తూ వారిని తన యొక్క దైవ రాజ్య వ్యాప్తికై వారిని సంసిద్ద పరుస్తూ ఉన్నారు. తాబోరు పర్వతముపై శిష్యులకు యేసు ప్రభువు తన యొక్క దివ్యరూపాన్ని వారికి తెలియపరుస్తూ, ఈ దర్శనమును గూర్చి తాను సిలువ శ్రమలను అనుభించదోవు వరకు ఎవ్వరికి కూడా తెలియపరచ వద్దని వారిని ఆదేశిస్తూఉన్నారు.
మరి ఈనాడు ఈ దివ్య రూపధారణ మహోత్సవము ద్వారా తల్లి తిరుసభ మనలను అందరిని కూడా మన యొక్క పాపాలను విడనాడి, పవిత్రమైన జీవితములోనడువమని మన అందరికి ఆహ్వానాన్ని పలుకుచున్నది.
ఈనాటి మూడు దివ్య గ్రంథ పఠనాలు ధ్యానించుకున్నట్లైతే మూడు పఠనాలు కూడా పవిత్రతను గూర్చిన సందేశమును మనకు తెలియపరుస్తూఉన్నాయి. తండ్రి దేవుని వాక్కుకు అనుకూలంగా మనము ఏ విధంగా జీవించాలి అని పవిత్ర వచనాలలో మనము చూస్తూ ఉన్నాము. ఈ పవిత్ర జీవితాన్ని జీవించాలి అంటే మనము చేయవలసిన పని ముందుగా దేవుని యొక్క పిలుపును ఆలకించి తరువాత ఆ పిలుపుకు సాక్షిగా జీవిస్తూ అటుపిమ్మట నూతన జీవితాన్ని కలిగి, మన మనసులు రూపాంతరము చెంది, ఆ పిలుపు పట్ల పవిత్రతను కలిగి జీవించడమే ఈ యొక్క పవిత్ర జీవితాన్ని సాకారం చేసుకోవడానికి మనం చేయవలసిన ప్రయత్నము.
మూడు పఠనాలను
చూసినట్లయితే మొదటి పఠనంలో విశ్వాసానికి తండ్రి అయిన అబ్రహాము యొక్క పిలుపును
గూర్చి మనము చూస్తున్నాము. అదేవిధంగా దేవుడు అబ్రహామునకు ఇచ్చిన వాగ్దానమును గుర్తుచేస్తూ. నేను నిన్ను
ఒక మహా జాతిగా తీర్చిదిద్దుతానని మరియు ఆశీర్వదిస్తానని,
తన ద్వారా ఒక సమస్త జాతి జనులను దీవింతును అని యావే దేవుడు
తన ఆశీర్వాదమును పలుకుచున్నాడు. కానీ దీని
కంటే ముందు దేవుడు ఒక షరతు పెడుతున్నాడు, అది ఏమిటంటే నీ బంధువులను,
నీ దేశమును వాడాలి నేను చూపే దేశమునకు వెళ్ళమని షరతు
పెడుతున్నాడు, ఆ సమయంలో అబ్రాహాము వయస్సు డెభై ఐదు ఏండ్లు. దేవుని మాటకు విధేయుడై తాను ముసలి
ప్రాయంలో ఉన్న అని చూడకుండా దేవుడు చెప్పినటువంటి ప్రదేశానికి వెళ్లాలని తన వారిని
అందరిని కూడా వదలి సిద్దమయ్యాడు. తన నమ్మకాన్ని దేవునిపై పెట్టి, మాటకు విధేయుడై
నడుచుకున్నాడు. ఏ విధంగానంటే మత్తయి సువార్త 16
: 24 - 25 వచనాలలో చూస్తున్నాము
అది ఏమిటంటే "నన్ను వెంబడింపగోరిన యెడల,
తన్నుతాను ఉపేక్షించుకొని,
తన సిలువనెత్తి కొని నన్ను వెంబడింపవలెను.
తన ప్రాణమును రక్షించు కొనగోరువాడు దాని పోగొట్టుకొనును;
నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాని దక్కించు
కొనును." అను వాక్యమును మనం అబ్రహాము జీవితంలో చూస్తున్నాము.
మన జీవితంలో కూడా అబ్రాహాము వాలే దేవుని యొక్క మాటకు
విధేయులై జీవిస్తు ఉన్నామా లేదా? మన విశ్వాసము ఏ విధంగా ఉంది అని ఆత్మ పరిశీలన చేసుకుందాం.
ఈ నాటి రెండొవ
పఠనంలో మనం ఆవిదమైనటువంటి పిలుపును కలిగియున్నామో పునీత పౌలు గారు మనకు
తెలియపరుస్తున్నారు 2 తిమోతి 1 : 9 వ
వచనంలో మనము చూస్తున్నాము "మనం చేసిన కార్యములవలనగాక తన యొక్క అనుగ్రహ
పూర్వకమగు ఉద్దేశ్యముతోడను తన యొక్క బిడ్డలుగా జీవించు పిలచియున్నారు". మన
జీవితంలో ఈ యొక్క అంశాన్ని మనం చూస్తున్నాము. మన చేసే ప్రతి కార్యాన్ని కూడా
మనయొక్క తలంపు వలన జరుగుతున్నవి అని మనం అనుకుంటాము కానీ మన జీవితంలో జరిగే ప్రతి
కార్యం కూడా దేవుని యొక్క అనుగ్రహం వలన జరుగుతున్నవి అని మనం తెలుసుకోవాలి.
విశ్వాసులకు తండ్రి అయిన అబ్రాహాముకు అందిన పిలుపు కూడా దేవుని యొక్క అనుగ్రహం వలన
తనకు బిడ్డగా జీవించడానికి అందినటువంటి పిలుపు. అదే విధంగా యేసు ప్రభు పౌలును ఏ
విధంగా తన దైవ రాజ్య వ్యాప్తికై వినియోగించుకున్నారో కూడా మనం చూస్తున్నాము 2
తిమోతి 1 : 10 వచనంలో
మనం చూస్తున్నాము. "యేసు ప్రభు తన యొక్క సిలువ శ్రమల ద్వారా మనకు నిత్యా
జీవితాన్ని ప్రదర్శించుయున్నారు", ఈ నిత్య జీవితాన్ని పొందిన మనము దేవునికి సాక్షులుగా
జీవించాలి, ఈ విషయమై మీరు దేనికిని బయపడవలదు అంతకు మించి దేవుని యొక్క వాక్కును
వ్యాపింపచేయడానికై సిగ్గుపడవలదు అని పవిత్ర గ్రంధములో మనం చూస్తున్నాము. మనము కూడా
ఈ యొక్క నిత్య జీవితాన్ని బాప్తిస్మ రూపంలో పొందియున్నాము,
కానీ దాని యొక్క సార్ధకతను మనము మరచి జీవిస్తుం ఉన్నాము.
మనం చేసే ప్రతి యొక్క పనిలో కూడా ఒక సార్థకత అనేది ఉంటుంది ఆ యొక్క సార్దకతను మనం
అర్ధం చేసుకోకుండా ఆ యొక్క కార్యాలను చేసినట్లయితే అవి వట్టి అలంకారంగా మాత్రమే
మిగులుతు ఉంటాయి. ప్రియ సహోదరులారా,
దేవుడు మన అందరికి కూడా తన యొక్క అనుగ్రహ పూర్వకమైన
పిలుపును తన యొక్క బిడ్డలుగా జీవించడానికి మనలను పిలిచియున్నారు. తండ్రి అబ్రాహాము
వాలే ఆ పిలుపు యొక్క సార్థకతను అర్థం చేసుకొని జీవించడానికి ప్రయత్నిద్దాము,
ప్రయాసపడుదాము.
ఈనాటి సువిశేష పఠనాన్ని చూచినట్లయితే రు ప్రభువు యొక్క దివ్యరూపధారణ గూర్చి మనం చూస్తూన్నాము. యేసు ప్రభువు తనయొక్క ముగ్గురు శిష్యులను ఉన్నతపర్వతము అయిన తాబోరు పర్వతము పైకి తీసుకొనిపోయి వారి ఎదుట తన యొక్క మహిమను తెలియజేస్తూఉన్నారు. ఈ యొక్క పరమ రహస్యమును ద్వారా యేసు ప్రభువు తాను పొందబోయే సిలువ శ్రమలను తెలియపరచడమే కాకుండా మనలను దేవునిలో మమేకమై జీవించడానికి ప్రభువు పిలుస్తూఉన్నారు.
ఈ యొక్క దర్శన సమయంలో యేసుప్రభువు తనయొక్క శిష్యులకు ఏ విధంగా కనిపించారు అని అంటే ప్రధాని యొక్క ముఖము సూర్యునివలె ప్రకాశవంతముగాను, వస్త్రములు వెలుగువలె తెల్లగాను ప్రతిబింబించుచున్నవి అని సువిశేష పట్నంలో మనం చూస్తూ ఉన్నాము. మనలను మనం ఏ విధంగా పవిత్ర పరచుకోవాలి అనేది ఈ యొక్క వచనాలు మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. పాపముతో మాలినమై అంధకారంలో ఉన్న మనయొక్క మనసులు రూపాంతరము చెందాలి. ఎలా అంటే అంధకారంలో జీవిస్తున్న మనము వెలుగులోనికి ప్రవేశించడం ద్వారా అనగా మన యొక్క పాపపు జీవితాన్ని విడనాడి ఎటువంటి మలినము లేకుండా మనలను మనం మలచుకొని జీవించాలి.
కాబట్టి ప్రియా సహోదరి సహోదరులారా, మనము మనం జీవించేటువంటి జీవితాన్ని విడనాడి ప్రభువు చూపిన పవిత్ర మార్గములో జీవించడానికి ప్రయత్నించాలి. క్రైస్తవ జీవితం అనేది ఒక పవిత్ర జీవితమునకు పిలుపు. తండ్రి దేవుడు తన యొక్క అనుగ్రహ పూర్వకముగా ఒసగిన ఆ
పిలుపును స్వీకరించి మన యొక్క హృదయాలను రూపొందించుకొని జీవించడానికి దేవునికి
దగ్గరగా దేవునిలో మమేకమై జీవించడానికి ప్రయత్నిద్దాము, ఆమెన్.
బ్రదర్.
పవన్ కుమార్ ఓ సి డి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి