11, సెప్టెంబర్ 2021, శనివారం

24 వ సామాన్య ఆదివారము

యెయా గ్రంధము 50: 5 -9

యాకోబు 2: 14 - 28

మార్క్ 8: 27 - 35

క్రీస్తునాధుని యందు ప్రియమైన సహోదరి సహోదయులారా ఈనాడు మనమందరం కూడా 24 సామాన్య ఆదివారంలోనికి ప్రవేచించియున్నాము. ఈనాటి దివ్య గ్రంథ పఠనాలను మనం ధ్యానించినట్లైతే ఇవి ముఖ్యముగా మానవుని విశ్వాసము అనేది  క్రియల ద్వారా నిరూపించబడుతుందని మరియు విశ్వాసం ద్వారా క్రీస్తు మనకు ఎవరు అని ఈనాటి పఠనాలు తెలియజేస్తున్నాయి.

ముందుగా మొదటి పఠనంలో చూస్తున్నాము మానవునికి ఎన్ని ఆపదలు మరియు ఆటంకాలు వచ్చినా కూడా దేవునిపై మనకున్న విశ్వాసాన్ని కోల్పోకూడదని తెలియజేస్తుంది. రెండొవ పఠనంలో యొక్క విశ్వాసాన్ని మనయొక్క క్రియలద్వారా ఇతరులకు నిరూపించవచ్చు అన్నీ పునీత యాకోబు  గారు మనకు తెలియజేస్తున్నారు. మరియు మనం సువిశేష పఠనంలో క్రీస్తు ప్రభు మన యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి అపోస్తులను రెండు ప్రశ్నలు అడగటం మనం చూస్తున్నాము, యొక్క ప్రశ్నలకు పునీత పేతురు గారు తన యొక్క విశ్వాసం క్రీస్తుపై ఉండటం ద్వారా నీవు దేవుని కుమారుడని చెప్పడము  మనమందరం కూడా వింటున్నాము .

మూడు దివ్య గ్రంథ పఠనాలు మనకు తెలియజేసేది ఏమిటంటే మనము దేవునితో ఎప్పుడైతే ఏకమై జీవిస్తామో అప్పుడే దేవుడు ఎవరని మనం తెలుసుకోగలుగుతామని, మనం తెలుసుకున్న దానిని ఇతరులతో పంచగలుగుతామని నాటి దివ్యగ్రంథ పఠనాలు క్రైస్తవులమైన మనకందరికీ కూడా తెలియజేస్తున్నాయి.

మొదటి పఠనము యెషెయా గ్రంధము 50: 5 -9

నాటి మొదటి పఠనంలో చూసినట్లయితే ఇందులోనుండి మనం గ్రహించవలసినది ఒకటి ఉంది అది ఏమిటంటే రాబోయే దైవసేవకుడు దేవునికి అనుగుణంగా విధేయుడై జీవిస్తాడని మరియు దేవునికి సంపూర్ణంగా విశ్వాసంలో జీవిస్తాడని దానికి ఫలితంగా అతని యొక్క జీవితంలో బాధలు మరియు హింసలు వస్తాయని, ఇవి అన్ని వచ్చిన కూడా ఓర్పుతో సహిస్తాడని అంతేకాకుండా, ఎన్ని అవమానాలు వచ్చినా కూడా, దెబ్బలు తిన్న కూడా మౌనంగా జీవిస్తాడని, అందరు ఎంత చీదరించుకున్న, అతనిపై ఉమ్మి వేసిన కూడా దేవునిపై నమ్మకము ఉంచి ఇది అంతాకూడా దేవుని యొక్క సంకల్పంతో జరుగుతుందని నమ్మకంతో జీవిస్తాడు. చివరికి దేవుడు అతనికి  అన్ని కష్టాలనుండి మరియు బాధలనుండి విముక్తి కలిగించి అతని యొక్క నమ్మకాన్ని వమ్ము చేయలేదు. చివరకు దేవునికి విశ్వాస పాత్రునిగా జీవించినటువంటి సేవకుని మహిమ పరచి తనకు ఇష్టమైన యాజకునిగా ప్రకటించాడు అతడే క్రీస్తు ని  ఈనాటి మొదటి పఠనము తెలియజేస్తుంది. ఎందుకంటే ఈయొక్క యెషయా ప్రవచనాలు నూతన గ్రంధములో యేసు క్రీస్తు యొక్క జీవితములో జరగబోయెటువంటి అంశాల గురించి యెషయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేస్తున్నాడు. ఈయొక్క వచనాలు మొత్తం యేసు క్రీస్తు యొక్క జీవితములో అక్షరాలా నెరవేరిందని మనమందరము కూడా నూతన నిబంధనములో చూస్తున్నాము.

రెండొవ పఠనము యాకోబు 2: 14 - 28

ప్రియా దేవుని బిడ్డలారా విశ్వాసం అంటే ఏమిటో మనం మొదటి పఠనంలో చుసిన విధంగా ఈయొక్క రెండొవ పఠనము కూడా మనకు తెలియజేసేది ఏమిటంటే క్రైస్తవులమైన మనమందరము కూడా మనయొక్క విశ్వాసాన్ని క్రియల ద్వారా చూపించాలని లేదా నిరూపించాలని  పునీత యాకోబు గారు రెండొవ పఠనంలో తెలియజేస్తున్నారు. 2 : 18 వ వచనంలో చూస్తున్నాము క్రియలు లేకుండా నీయొక్క విశ్వాసము ఎట్లాఉండునో నాకు తెలియజెప్పుము, నా క్రియల ద్వారా నాయొక్క విశ్వాసాన్ని నేను నీకు ప్రదర్శింతును అని చెపుతున్నారు . అంతేకాకుండా పాత నిబంధనములో చుసిన విధంగా అబ్రాహాము అయన క్రియల ద్వారా తన విశ్వాసాన్ని నిరూపించుకున్నాడు, అందుకే తండ్రి దేవుడు అబ్రాహామును నీతిమంతునిగా పరిగణించాడు.

కాబట్టి క్రైస్తవులమైన మనయొక్క విశ్వాసం ఎటువంటిది అని మనం గమనించినట్లయితే మనయొక్క విశ్వాసము యదార్ధమైన విశ్వాసంగా ఉండాలి. ఎందుకంటె క్రైస్తవుల యొక్క విశ్వాసము దేవుని యొక్క ఆదేశాలను తూచాతప్పకా పాటిస్తుండాలి. అదేవిధంగా యదార్ధమైన విశ్వాసమే కలిగి ఉంటె వారి జీవితాలు పూర్తిగా యేసుక్రీస్తు ప్రభువుతో ఉంటాయని యాకోబు గారు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా మనమందరం గమనించినట్లయితే యాకోబు గారు చెప్పిన విధంగా, యోహాను గారు తనయొక్క మొదటి లేఖలో తెలియజేస్తున్నారు 1 యోహాను 3 -17 లో క్రైస్తవ విశ్వాసం అనేది చేతలతో నిరూపించబడే ప్రేమ అని. ఇంకా పునీత పౌలు గారు అంటున్నారు ప్రేమ ద్వారా పని చేయు విశ్వాసమే క్రైస్తవ జీవితమని స్పష్టం చేస్తున్నారు(గలతి 5 :6 ). ఇవే మాటలను తన సొంత మాటలుగా యాకోబు గారు అంటున్నారు కార్య రూపం లేదా సేవారుపం చేసినపుడే  అదే మన క్రైస్తవ విశ్వాసం అవుతుందని తేల్చిచెబుతున్నారు.

అందుకే క్రీస్తు ప్రభు తనయొక్క క్రియల ద్వారా ఎన్నో అద్భుతాలు చేసి మానవాళి కొరకై తనయొక్క ప్రాణాన్ని బలిగా చేసి అయొక్క సిలువపై చూపిస్తున్నాడు. ఆలా చూపించడమే కాకుండా తనలాగా క్రైస్తవులందరూ కూడా పాటించాలని క్రీస్తు ప్రభువు ఒక గొప్ప ఉదాహరణను మనందరికీ ఇచ్చియున్నాడు, కనుక , మనమందరము కూడా మనయొక్క విశ్వాసాన్ని క్రియల ద్వారా చూపించాలని ఈనాటి రెండొవ పతనం మనకు తెలియజేస్తుంది.

సువిశేష పఠనం మార్క్ 8: 27 - 35

యేసుప్రభు తన యొక్క శిష్యుల విశ్వాసాన్ని పరీక్షించుటకు వారిని రెండు ప్రశ్నలు అడుగుచున్నారు. రెండు ప్రశ్నలు కూడా శిష్యులకు యేసుప్రభువుపై  ఉన్నటువంటి విశ్వాసం ఎంతో తెలియజేస్తున్నాయి. రెండు ప్రశ్నలు మన ధ్యానించినట్లైతే

1) ప్రజలు నేను ఎవరని చెప్పుకొనుచున్నారు

2) మరి నన్ను గూర్చి మీరు ఏమనుకుంటున్నారు. అని యేసుప్రభు వారిని అడిగెను.

ముందుగా మొదటి దానిని మనం చూసినట్లయితే

1)   ప్రజలు నేను ఎవరని చెప్పుకొనుచున్నారు

అను దానిని మనం వివరించినట్లైతే ప్రభువు  వారిని ప్రశ్న అడిగినప్పుడు వారు రాకరాకల సమాధానాలు చెప్పియున్నారు, ఎందుకంటే ఒకరి గురించి ఇంకొకరు నుమానించుకొనుచున్నారు .

ఎందుకంటే నూతన నిభందనలో చూస్తున్నాము కొంతమంది ముఖ్యమైన వ్యక్తులు ఏమనుకొనుచున్నారో మరియు వీరందరికి యేసుప్రభు లోకరక్షకుడని తెలిసి వారి యొక్క ఉదేశ్యాలను విధంగా తెలియజేస్తున్నారు.

వారు ఎవరు అంటే .

1. బాప్తిస్మ యోహాను గారు అంటున్నారు క్రీస్తు ప్రభువు  దేవుని గొర్రెపిల్ల లోకము యొక్క పాపములను పరిహరించువాడు అని (యోహాను 1: 29) బాప్తిస్మ యోహాను తెలియజేస్తున్నారు.  

2. నీకొదేము అంటున్నాడు ,మీరు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడువాని (యోహాను 3: 2), అంతే కాకుండా

3. సమారియా స్త్రీ  యేసు క్రీస్తు మాటలు విని ఈయన నిజముగా క్రీస్తు ఏమో అని (యోహాను 4: 29) లో మనకు తెలియజేస్తుంది, మాటలు విన్నాటువంటి సమరియులందరు వచ్చి క్రీస్తును చూసి ఈయన నిజముగా లోక రక్షకుడని మనకు తెలియును అని అంటున్నారు.

వీరి ముగ్గురిని మనం చూసినట్లయితే, వ్యక్తులు ముగ్గురు కూడా యేసుప్రభును రెండు లేదా మూడు సార్లు చూసి లేదా మాట్లాడి యేసుప్రభు గురించి ఎందరికి తెలియజేసారో మనమందరము చూస్తున్నాము.

అదేవిధంగా యేసుప్రభు మన దగ్గరకు వచ్చి నా గురించి మీరు ఏమి అనుకుంటున్నారు అన్ని మనలను అడిగినప్పుడు మన యొక్క సమాధానం ఏమిటి అన్ని మనం రెండొవ ప్రశ్న  వింటున్నాము .

2) మీరు నన్ను గూర్చి ఏమి అనుకుంటున్నారు ని   రోజు క్రీస్తు మనందరినీ అడుగుచున్నారు అంతేకాక మనయొక్క విశ్వాసాన్ని పరీక్షించుచున్నారు. మరి  క్రీస్తు అడిగిన ప్రశ్నకు మన దగ్గర సమాధానం ఉన్నదా అన్ని మనం చూసినట్లయితే పునీత పేతురు గారు క్రైస్తవుల యొక్క విశ్వాసాన్ని ఏవిధంగానైతే వెలుగులోనికి తీసుకోని వచ్చారో అదేవిధంగా క్రీస్తును నివ్వు "క్రీస్తువు" అని గట్టిగా వక్కాణించి యేసుప్రభుతో పలుకుచున్నారు, అంతే కాకుండా దేవుని యొక్క శ్రమలలో పేతురు క్రీస్తును మూడు సార్లు నాకు అయన ఎవరో తెలియదు అని తృణీకరించిన, క్రీస్తు మాత్రం పేతురును తన యొక్క శ్రీసభకు పేతురును అధిపతిగా నియమించాడు.

కావున క్రీస్తునాధునియందు ప్రియా దేవుని బిడ్డలారా క్రీస్తు ప్రభువు నిజంగా మన దగ్గరకు వచ్చి నివ్వు నా గురించి ఏమనుకుంటున్నావు అని అడిగినప్పుడు మన యొక్క ప్రత్యుత్తరము ఏమిటి, క్రైస్తవులమైన మనము పుట్టుకతోనే బాప్తిసము ద్వారా క్రీస్తు యొక్క అనుచరులుగా నియమింపబడ్డాము, కానీ క్రీస్తుపై విశ్వాసం ఏమిటి అని ఒక్క సారి ధ్యానించుకున్నామా? అని మనం చుసినట్లైతే లేనే లేదు, ఎందుకంటే, మనకు  క్రైస్తవులని  పేరే తప్ప మన యొక్క విశ్వాసం మాత్రం అంతంత మాత్రమే, ఎందుకంటే కొన్ని కుటుంబ జీవితాలలో చుస్తే చాల మంది క్రైస్తవులు ప్రార్థన జీవితం అనే పేరే మరచిపోతున్నారు, ఎప్పుడు శారీరక అవసరాలు మాత్రమే ఆలోచిస్తారు తప్ప, వారికీ నిత్యా జీవితాన్ని మరియు వాటినంటిని ఇచ్చేటువంటి దేవుని మాత్రం మరచిపోతున్నారు. క్రైస్తవులమైన మనము ఎప్పుడైతే విశ్వాసంతో మరియు ప్రార్థన జీవితం జీవిస్తామో అప్పుడే మనం క్రీస్తుతో ఏకమౌతామని మరియు క్రీస్తు ఎవరో తెలుసుకుంటామని అంతేకాకుండా ఏవిధంగానైతే పేతురు తనయొక్క విశ్వాన్ని క్రీస్తుకు చుపించాడో అదేవిధంగా మనము కూడా యేసు క్రీస్తు సాక్షాత్తు  లోకరక్షకుడని చెప్పగలమా? అని మనలను మనము ప్రశ్నించుకోవాలి, మరియు క్రీస్తును నువ్వు లోకరక్షకుడవని మనమందరము కూడా చెప్పగలగాలి, ఆలా చెప్పడమే కాకుండా దేవునితో ఐక్యమై మన యొక్క విశ్వసన్ని  ఇతరులతో పంచాలని ప్రార్దించుదాము. "ఆమెన్"

Br.v. Johannes ocD

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...