26, ఫిబ్రవరి 2026, గురువారం

25 వ సామాన్య ఆదివారం

 25  సామాన్య ఆదివారం

యెషయ 55:6-9

 ఫిలిప్పీ 1:20, 24,27

 మత్తయి 20:1-16

 

ఈనాటి దివ్య పఠణములు దేవుడు తన ప్రజలకు చేయు న్యాయమును గురించి  అలాగే మానవుల పట్ల ఆయన చూపే దయ గురించి కూడా తెలుపుచూ ఉన్నారుప్రభువు అందరి యెడల సమన్యాయంను చూపిస్తారుఎవరి పట్ల కూడా పక్షపాతం చూపించరుకొన్ని కొన్ని సందర్భాలలో మనకు జరిగేటటువంటి సంఘటనలను బట్టి ఏది న్యాయమోఏది అన్యాయముతెలియదు కాబట్టి మన యొక్క ఆలోచన ప్రకారం దానిని తీర్పు చేస్తామున్యాయం అందరికీ ఒకలాగై ఉండాలని వాదించడం సహజం కానీ చాలా సందర్భంలో మనం స్వార్ధంగా ఉండి మనకు అనుకూలంగా తీర్పు గానిన్యాయం గాని ఇచ్చుకుంటాందేవుని యొక్క దృష్టిలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాదు అందరూ కూడా ఆయనకు సరి సమానులే.

ఈనాటి మొదటి పఠణంలో యెషయా ప్రవక్త బానిసత్వం ముగించుకొని యూదాకు తిరిగి వెళ్లే యూదులకు  సంతోషకరమైన వార్తను తెలియచేస్తున్నారుప్రభువు వారికి చేరువలోనే ఉన్నారు అనియెషయా తన ప్రజలకు ప్రతిసారి గుర్తు చేసే అంశం ఏమిటంటే దేవుడు  ఎలాంటి కష్ట సందర్భముల నుండి  వారిని కాపాడి ఉన్నారు తెలుసుకోమని  గుర్తు చేస్తున్నారుయెషయా గ్రంథము 40 అధ్యాయము నుండి 55 అధ్యాయం వరకు బాబిలోనియా బానిసత్వం ముగించే అంశము గురించి ప్రవక్త  తెలుపుచున్నారుఈనాడు చదివిన మొదటి పఠణంలో ఇశ్రాయేలు ప్రజలకు ప్రభువు వారికి చేరువులో ఉండి విముక్తిని కలుగ చేస్తున్నారు అని తెలుపుచున్నారు మాటలు వారిని విశ్వాసంలో బలవంతులుగా చేస్తుంది అలాగే దేవుని యందు నమ్మకమును కూడా పెంచుతుంది.

ప్రవక్త ప్రజలకు మరొకసారి గుర్తు చేస్తున్నారు వారి యొక్క అవిశ్వాసనీయతయే వారిని బానిసత్వంలోకి నడిపించినది.యెషయ అంటున్నారు "ప్రభువు దొరికినప్పుడే ఆయనను వెదకుడుఆయన చేరువులో ఉన్నప్పుడే ఆయనకు ప్రార్థన చేయుడి".  మాటల యొక్క అర్థం ఏమిటంటే ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలో మగ్గిపోయేటటువంటి సందర్భంలో దేవుడు మమ్ములను విడిచిపెట్టారుమమ్ము మరచిపోయారుమేము ఎవరూ లేనటువంటి అభాగ్యులము ఆలోచనతో ఉన్న సందర్భంలో దేవుడు వారికి చేరువులోనే ఉన్నారని గుర్తు చేస్తున్నారు విముక్తిని కలుగ చేయటం అనేది దేవుడు తన ప్రజలకు దగ్గరగా ఉన్నారు అని అర్థం.

 బానిసత్వం ఎందుకంటే వారు చేసిన తప్పుకు పశ్చాత్తాపడి దేవుని చెంతకు తిరిగి రావడం కొరకేఇశ్రాయేలు ప్రజలు తమ యొక్క ప్రాంతమునకు వెళ్లేటటువంటి శుభ ఘడియలలో ప్రవక్త గుర్తుచేసే ఇంకొక అంశం ప్రభువుని వెదకమని చెప్తున్నారుదేవుడిని ఎప్పుడూ కూడా మనము వెదుకుతూ ఉండాలిఅప్పుడు మాత్రమే ఆయనను మనము కనుగొనగలముపవిత్ర గ్రంథంలో కొన్ని కొన్ని ఉదాహరణలు మనందరికీ కూడా  అంశమును విశిదీకరిస్తాయిఆయన చేరువులో ఉన్నప్పుడు ఆయనను సమీపించుటకు కొన్ని ఉదాహరణలు:

1. జక్కయ్య ఏసుప్రభు తన ఇంటి గుండా వెళుతున్నారని ఆయనను సమీపించి ఉన్నారు.

2. భర్తిమయి ఏసుప్రభు  మార్గము గుండా వెళుతున్నారని విని ఆయనను సంప్రదించారు.

3. పదిమంది కుష్ట రోగులు ప్రభువు చెరువులో ఉన్నప్పుడు ఆయనను సంప్రదించారు.

 విధంగా చాలా మంది ప్రభువు చేరువులో ఉన్నప్పుడు ఆయనను సంప్రదించారు దాని ద్వారా వారు దేవుని యొక్క ఆత్మీయ అనుభూతునిఆశీర్వాదము పొందారు కాబట్టి మరొకసారి ప్రవక్త గుర్తుచేసే అంశం ఏమిటంటే దేవుడు చేరువులో ఉన్నప్పుడు ఆయనకు ప్రార్థన చేయమంటున్నారు ప్రార్థన ద్వారా వారు మన యొక్క దేవుడు తమకు అండగా నిలబడుతున్నారు అనే నమ్మకమును కలిగిస్తుంది.

 

ప్రభువు యొక్క అనంతమైనటువంటి దయ కూడా  మొదటి పఠణంలో మనకు అర్థమవుతుంది ఆయన దుర్మార్గులు తమ యొక్క పాపపు జీవితమును విడిచిపెట్టి వచ్చినప్పుడు వారి మీద దయ చూపిస్తానంటున్నారు అదేవిధంగా వారి పాపములను క్షమిస్తాను అంటున్నారుమామూలుగా మనము దుర్మార్గులను క్షమించడానికి ఇష్టపడము కానీ ప్రభువు యొక్క విధానం మాత్రం అది కాదు ఎందుకంటే ఆయన మన అందరిని కూడా క్షమించేవారుఅంగీకరించేవారుప్రభు అంటున్నారు నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కాదుమీ మార్గముల నా మార్గముల వంటివి కావుదేవుని యొక్క ఆలోచనలు మానవుని యొక్క ఆలోచనలకు భిన్నంగా ఉంటాయి ఎందుకంటే మనందరం కూడా తప్పు చేసిన వాడు శిక్షించబడాలనుకుంటాంకానీ ప్రభువు మాత్రం తప్పు చేసినటువంటి వ్యక్తి కూడా హృదయ పరివర్తనము చెంది రక్షణ పొందాలి అని భావిస్తూ ఉంటారుతప్పు చేసిన వానిని మానవుడు క్షమించలేడు తనకు ద్రోహం చేసిన వారిని ప్రేమించలేడు మన్నించలేడు దేవుడు ప్రతినిత్యం కూడా పాపులను మన్నించటానికి సిద్ధంగా ఉంటారు.

మన యొక్క ఆలోచనలు దేవుని యొక్క ఆలోచనలకు భిన్నంగా ఉంటాయి ఎందుకంటే దేవుడు నిస్వార్థముతో ఆలోచన చేస్తూ ఉంటారుఆయన ఎంతో దయ కలిగినటువంటి వారుఆయన స్వభావము ఉదారమైనదిమానవుల ఎడల దేవునికి ఉన్నటువంటి ప్రేమ చాలా గొప్పదైనదితల్లి తన బిడ్డను మరిచిపోయినా కానీ దేవుడు మాత్రం మనలను మరిచిపోరు అదేవిధంగా ప్రభువు మనందరి యొక్క పేర్లను తన యొక్క అరచేతిలో రాసుకొని మనలను అనునిత్యం గుర్తుంచుకుంటారు అంటే ప్రభువుని యొక్క మనస్సులో మనందరం కూడా ఎప్పుడూ ఉండేటటువంటి వ్యక్తులమే.(యెషయ 49:15-16, 43:1-4) కాబట్టి మనము మన జీవితంలో దేవుడిని అంటిపెట్టుకొని ఆయన వలె దయార్ధ హృదయాన్ని కలిగి జీవించాలి.(కీర్తన 145:8-9).

 

ఈనాటి రెండవ పఠణంలో పౌలు గారు అన్ని సమయములయందు ఆయనకు దేవుడు ఇచ్చిన అనుగ్రహములను వినియోగించి దేవునికి మహిమనుగౌరవమును చేకూర్చుతానని తెలుపుచున్నారుదేవుని కొరకు మరణించుటకు సంతోషముగా ఉన్నాను అని తెలియజేస్తున్నారుబహుశా పౌలు గారు ఈయన చెరసాలలో ఉండి  యొక్క లేఖ రాసి ఉండవచ్చు అందుకనే ఆయన క్రీస్తు కొరకు మరణించుట సంతోషంగానే భావిస్తున్నానన్నారు.మన యొక్క జీవిత విధానము క్రీస్తు సందేశానుసారముగా ఉండాలి అన్నదే పౌలు గారి యొక్క ముఖ్యమైన సందేశంకావున మన జీవితంలో ఉత్తమమైనటువంటి మార్గములను ఎన్నుకొని దేవుడు ఇచ్చిన అనుగ్రహాల ద్వారా ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ అందరికీ సమన్యాయం చేస్తూ దేవుని వలె మంచిగాదయ కలిగిన హృదయముతో జీవించాలి.

మన జీవితం ద్వారా దేవునికి గౌరవమును కలిగించాలి.

ఈనాటి సువిశేష భాగములో ఏసుప్రభు పరలోక రాజ్యము  విధముగా ఉంటుంది అలాగే దేవుని యొక్క జాలి హృదయం గురించి తెలుపుచున్నారుఒక యజమాని ద్రాక్ష తోటలో పనిచేయుట కొరకై వివిధ సమయాలలో కూలీలను పంపిస్తున్నారువారితో రోజుకు ఒక్కొక్క దినారం చొప్పున ఇస్తాను అని ఒప్పందం చేసుకున్నారుయజమానుడు తన యొక్క ఉదార స్వభావంతో పని లేక సంతలో ఖాళీగా ఉన్నటువంటి వారందరికీ కూడా పనిని సమకూరుస్తున్నారుప్రాఃతకాల సమయమున కొందరినిఉదయం 9 గంటలకు కొందరిని, 12 గంటలకు కొందరిని,  గంటలకు కొందరిని మరియు 5 గంటలకు కొందరిని పనిచేయుటకు నియమిస్తున్నారు.

సాయం సమయమున యజమాని పనివారికి ఒక్కొక్కరికి ఒక దినారము చొప్పున  కూలినివ్వటం ప్రారంభించాడుచివరిగా వచ్చిన వారికి ఒక దినారమిచ్చుట చూచిన వాళ్లు మొదటిగా పనిచేయడానికి వచ్చిన మనకు  ఎక్కువగా వస్తుంది అని ఆశించారుయజమాని మాత్రం తాను ఇచ్చిన మాట ప్రకారంగా అందరికీ ఒక్కొక్క దినానము చొప్పున ఇస్తూ సమన్యాయమును చేసి ఉన్నారుఎవరికి ఎటువంటి అన్యాయం చేయలేదుఒక విధంగా ఆలోచన చేస్తే  యజమాని ఒక్క ప్రవర్తన కొద్దిగా వింతగా ఉంటుంది ఎందుకంటే చివరి ఘడియల్లో వచ్చిన వారికి కూడా ఒక దినారం ఇవ్వటం చాలా అరుదుఅయితే దానిలో ఒక అర్థం దాగి ఉన్నది అది ఏమిటంటే  కాలంలో కూలి వాని యొక్క వేతనం ఒక రోజుకు ఒక దినారం.

 ఒక దినారం ఒక రోజుకు ఒక కుటుంబ పోషణకు సరిపోయే కూలితో సమానంయజమాని తన పనివారలకు అంతకు తక్కువ కూలిస్తే  రోజు వారి కుటుంబాలు ఆకలితో అలమటించాల్సిందేకూలి వారి యొక్క స్థితి చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి అదే విధముగా వారికి రోజు పని దొరకడం కష్టం కాబట్టి యజమాని కనీసం  దినారముతోనైనా  కుటుంబములు తన వలన సంతృప్తిగా భోజనం చేసి ఉండాలి అన్నదే ఆయన యొక్క ఆశ సువిశేష వచనములను ఒకసారి గమనించినట్లయితే కూలి పని చేసేవారు డబ్బులు లేనందున ఉదయం నుండి సాయంకాలం వరకు కూడా ఎదురు చూస్తూనే ఉన్నారు అంటే వారు ఎంత పేదరికంలో ఉన్నారు అర్థం చేసుకోవాలి.

మనం కూడా కొన్ని కొన్ని సార్లు సిటీల్లోసంతలలో చూస్తూ ఉంటాం పనిచేయటానికి అందరు కూడా ఒక స్థలంలో ఉంటారు యజమానులు వచ్చి వారిని పిలుచుకుని వెళ్తుంటారు ఇది ఉదయం సమయంలో మాత్రమే జరుగుతుంది కానీ ఇక్కడ చెప్పబడినటువంటి వ్యక్తులు మాత్రము ఉదయము నుండి సాయంకాలం ఐదు గంటలు వరకు కూడా ఎదురు చూస్తూనే ఉన్నారు వారికి  సంపాదన ఎంత అవసరమోవిలువైనదో మనము గ్రహించుకోవాలి.

 ఎదురుచూసిన వారికి తగినటువంటి ప్రతిఫలము యజమానుడు ఇస్తున్నాడుఎదురు చూసే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ప్రతి ఫలము దొరుకుతుందిరక్షకుని కొరకు ప్రజలు ఎదురు చూశారు వారికి రక్షకుడు దొరికారు అలాగే పని కోసం ఎదురుచూసే వారికి పని దొరుకుతున్నది వాస్తవముగా చెప్పాలంటే యజమానుడు ఎవరికినీ అన్యాయం చేయలేదు ఎందుకంటే వారితో ఆయన చేసుకున్నటువంటి ఒప్పందము ప్రకారమే ఆయన ప్రతి ఒక్కరితో న్యాయంగా ప్రవర్తించారుకానీ ఉదయం నుండి రోజంతా పనిచేసిన వారికి అసూయ కలిగినది స్వార్థంతో వారు ఆలోచించి ఉన్నారుయజమానుడి యొక్క మాటలు మరచిపోయాయి అందుకని మనసులో గొనుగుతున్నారుఆకలితో అలమటించే సోదరుడికి కూడా అన్నం దొరికిందని సంతోషించకుండా ఎదుటి వ్యక్తి లబ్ది పొందాడు అని  సహనంతో ఉన్నారుమనం కూడా ఎదుటి వ్యక్తి అభివృద్ధి చెందుతూ ఉంటే సహించలేకపోతుంటాంఅందుకే మనం గ్రహించవలసింది ఏమిటంటే దేవుడు మనకన్నా మిన్నగా ఆలోచన చేస్తూ ఉంటారుఅందరి యెడల ప్రేమ కలిగి ఉంటారు.

 దేవుడు ఎల్లప్పుడూ తాను చేసినటువంటి వాగ్దానములకు విధేయుడై జీవిస్తారుఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానం చేసి ఉన్నారు "నేను మీకు తండ్రినై ఉంటాననిఆయన  వాగ్దానం నెరవేర్చి ఉన్నారు కానీ ప్రజలే మరచిపోయారు దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోలేకపోయారుదేవుడు అందరూ కూడా సంతోషంగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా సమన్యాయం చేస్తున్నారు.

 యొక్క ఉపమానములో యజమానుడి యొక్క ఉదార స్వభావము మనకు అర్థమవుతుందిఆయనకు దారాళంగా ఇచ్చేటటువంటి మనస్సు ఉన్నది.

 సువిశేష భాగములో మనము గమనించుకోవలసిన ఇంకొక విషయం ఏమిటంటే ఎప్పుడు వచ్చాము అన్నది ముఖ్యం కాదు ఎలా  పని చేసాముజీవించాము అన్నది ముఖ్యంఉదాహరణకు పుట్టు క్రైస్తవుల కన్నా కొత్తగా క్రీస్తుని తెలుసుకున్నటువంటి విశ్వాసులే మిన్నమొదటి వారు కడపటి వారందరూ అని ప్రభువు అంటున్నారు అంటే ఎవరైతే చివరిగా వచ్చినా మంచిగా జీవిస్తారో వారు తప్పనిసరిగా దేవుని దృష్టిలో మంచి వారిగాప్రదములుగా పరిగణింపబడతారు అని అర్థం.

కాబట్టి మనము కూడా ఉదార స్వభావం కలిగి ఉండాలితోటి సోదరుల పట్ల దయ కలిగి ఉండాలిఎవరికి అన్యాయం చేయకుండా న్యాయముగా జీవించుటకు ప్రయత్నం చేయాలి.

Fr. Bala Yesu OCD

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాస్కా ఆరవ ఆదివారం

 పాస్కా ఆరవ ఆదివారం  అపో 10:25-26, 34-35,44-48 1యోహను 5:7-10 యోహాను 15:9-17 ఈనాటి పరిశుద్ధ గ్రంథములు పఠనములు దేవుని యొక్క ప్రేమ గురించి మరియ...