26, ఫిబ్రవరి 2026, గురువారం

ఇరువదినాలుగవ సామాన్య ఆదివారము

 

ఇరువదినాలుగవ సామాన్య ఆదివారము 

 సీరా:27:30-28:7  రోమి : 14:7-9;  మత్త18:21-35
ఈనాటి మూడు పఠనాల ద్వారా దేవుడు మనకు ఏమి తెలియజేస్తున్నాడు అంటే, “హద్దులు లేని క్షమాపణ కలిగి జీవించాలని తెలియజేస్తున్నాడు.
మొదటి పఠనము:
1.పగకోపములకు దూరముగా ఉండాలి:
   ఈనాటి మొదటి పఠనములో పగ కోపము మహా గోరమైనవిపాపి  రెండిటికి వశుడగునుఅని తెలుపుతుందిఎందుకంటే  పగ కోపములు మనలను మానవులనుండిదేవునినుండి వేరుచేస్తాయి.
ఆది:4:5-15 లో చూస్తేకయ్యిను కోపపడ్డాడుదేవుని ఆజ్ఞలకు విరోధముగా పాపము కట్టుకున్నాడుతన సొంత తమ్ముడిని చంపివేసాడు.
సంఖ్యా:22:21-31లో బిలాము మీద దేవుడు కోపపడుతున్నాడుఎందుకంటే తాను మోవాబు నాయకులతు చేతులు కలిపి దేవుని ప్రజలగు ఇశ్రాయేలీయులకు విరుద్ధముగా మాట్లాడబోవుచున్నాడు.
సామె:29:22“కోపిష్టి తగవులుతెచ్చి పాపము పెంచును అని చెప్పుచున్నది.
యోహా: 2:14-15 లో చూస్తేదేవాలయములో ఎడ్లనుగొర్రెలనుపావురములను అమ్మువారినిడబ్భులు మార్చువారిని ఆయన చూచెనుఆయన త్రాలతో కొరడా పేనిగొర్రెలనుఎడ్లను అన్నిటినిఆలయ వెలుపలకు తోలెనుడబ్భులు మార్చువారి నాణెములను చిమ్మివేసి బల్లలను పడత్రోసి వీనిని ఇక్కడినుండి తీసుకుపొండునా తండ్రి ఆలయమును వ్యాపారస్థలముగా చేయవలదు అని చెప్పెను.ఇక్కడ మనము యేసుప్రభువు యొక్క కోపాన్ని మనం చూస్తున్నాం. అయితేదేవుని కోపం మనలను మార్చడానికి అయితే మనకోపము మాత్రం ఆదేవునినుండి మన తోటివానినుండి వేరుపడి సంభంధం లేకుండా జీవిస్తున్నాం.
 కానీ మొదటి పఠనములోదేవుడు అంటున్నాడుదేవుని ఆజ్ఞలు స్మరించిపొరుగువానిమీద కోపం మానుకోవాలి అని తెలుపుచున్నాడుఎప్పుడయితే మనము మనలో ఉన్నటువంటి కోపాన్ని తొలగించి ప్రేమను క్షమాగుణాన్ని నింపుకుంటామో అప్పుడు దేవుడు మన జీవితములో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడుఅదే మనము సువిశేష పఠనములో చూస్తున్నాం.
 సువిశేష పఠనము:
        సువిశేష పఠనములో పేతురు గారు యేసుప్రభువు దగ్గరకు వచ్చి, “ప్రభూనా సహోదరుడు నాకు ద్రోహము చేసిన యెడల ఎన్ని పర్యాయములు క్షమించాలిఏడూ పర్యాయములాఅని అడుగుతున్నాడుఅపుడు యేసు ప్రభువుఏడుకాదు ఏడు డెబ్బది పర్యాయములు అని సమాధాన మిచ్చాడుఅంటే ఇక్కడ మనము చూసినట్లయితేపేతురుగారు దేవుని ముందు గొప్పవానిగా ఎంచబడాలని తాను ఏడు పర్యాయములు క్షమాపణ గూర్చు అడుగుతున్నాడుపాత నిబంధన గ్రంధములో మనం చూస్తేఒక వ్యక్తిని మూడు పర్యాయములు మాత్రమే మన పొరుగు వానిని క్షమించాలి అని తెలుపబడుతుందికానీ పేతురు మాత్రం ఏడు పర్యాయములు అని తెలుపుతున్నాడు.సాధారణముగా బైబిల్ గ్రంధములో చూస్తే ఏడు అను పదము పరిపూర్ణతకు గుర్తుఒక వేళ పేతురుగారు కూడా అలాగే అనుకోని ఏడుసార్లు అను ఉండవచ్చుఅంటేఒక మానవుడు ఒక విషయాన్ని గూర్చి రెండింతలు ఆలోచిస్తేమరి నిన్ను నన్ను కన్న దేవుడు మనయందు ఎన్నిసార్లు ఆలోచించాలి.
  పాత నిబంధనా గ్రంధములో మనము చూస్తేనిర్గ21:24లో కంటికి కన్నుపంటికి పన్ను అని తెలుపుతుంది. ఇక్కడ ఒక వ్యక్తి మనకు విరోధముగా చేసినట్లయితే వ్యక్తికి అదే విధముగా బుద్ధి చెప్పాలినిన్ను తాను కొడితే తనని కూడా అలాగే కొట్టాలి అని మనకు అర్ధం అవుతుందికానీనూతన నిబంధన గ్రంధములో దేవుడు అలా అనడం లేదుఎందుకంటే ప్రతి ఒక్కరి పైన క్షమాగుణాన్ని గురించి తెలియజేస్తున్నాడు.
మత్త5:38 కంటికి కన్నుపంటికి పన్ను అని పూర్వము చెప్పబడిన దానిని మీరు వినియున్నారుగదానేనిప్పుడు మీతో  చెప్పున దేమననీకు  అపకారము చేసిన వానికి ప్రతీకారము చేయకుమునీ కుడి చెంపపై కొట్టిన వానిని నీ ఎడమ చెంపపై కూడా కొట్టనిమ్ము" అని యేసు ప్రభువు తెలియజేస్తున్నాడు.
      ఒక రోజు పునీతరెండవ జాన్ పాల్ పోపు గారిని 13-05-1981 సవంత్సరంలో  "మెహ్మెత్ అలీ అఙ్క" అను వ్యక్తి తనను తుపాకీతో కాల్చినప్పుడుతనను కొన్ని రోజుల తరువాత జైలులో వున్నా తనను పరామర్శించితనను హృదయ పూర్వకముగా క్షమించాడుఈనాడు నువ్వు నేను చేయ వెలిసిన పని కూడా ఇదేక్షమాగుణాన్ని కలిగి జీవించడం.
    అయితే యేసు ప్రభువు దీనిని మనకు క్లుప్తముగా వివరించడానికి ఒక  ఉపమానమును  తెలియజేస్తున్నాడుఅదే క్షమా ధర్మములఉపమానము.
ఇక్కడ రాజు దేవునికి సూచన.
 ఋణస్థుడు మనకు సూచన.
ఈరాజు తన దగ్గర తీసుకున్న కోట్ల వరహాల వ్యక్తిని తన యొక్క దీన స్థితిని చూసి క్షమిస్తున్నాడుకానీ అదే క్షమను పొందిన  ఋణస్థుడు మాత్రం తనదగ్గర కొన్ని రూకలను రుణపడియున్న వ్యక్తిని క్షమించలేక పోయాడు. 
2.క్షమా గుణాన్ని కలిగి ఉండాలి:
        క్షమాగుణాన్ని కలిగి జీవించాలి అంటే ముందుగా మన గురించి మనము తెలుసుకోవాలినాజీవితము ఎలావుందినేను ఎలా జీవిస్తున్నాను అనిఅయితే ఒక రోజు పుమాథెర్ థెరెసా గారు ఒకరోజు తన దగ్గర వున్నా పిల్లల ఆహారంకోసం వీధి వీధి వెళ్లి సహాయాన్ని అర్ధిస్తున్నప్పుడు ఒక వ్యాపారి దగ్గరకు వచ్చిఅయ్యానా పిల్లలు ఆహారంకోసం అల్లాడిపోతున్నారుమీకు తోచినంత వారికి ఇవ్వండి అని చేయిచాచి అడిగినప్పుడు  వ్యాపారి ఆమె వైపు కోపంగా చూసి తన చేతిలో ఉమ్మును ఉసాడుఅప్పుడు పుమాథెర్ థెరెసా గారు తన వైపు ఉమ్ము వైపు దీనంగా చూస్తూఅయ్యాఇది నాకోసము మీరు ఇచ్చారుమరి నా పిల్లలకు ఏమి ఇస్తారు అన్నప్పుడు  వ్యాపారి  మాటలకు కలత చెంది కన్నీరు కారుస్తూఅమ్మా నేను చేసినది చాలా తప్పునన్ను క్షమించండినేను మీ పిల్లలకు ఎంతయినా సహాయముచేస్తానని చెప్పి వారికి సహాయము సహసాడుఇలాంటి జీవితమునే మనంకూడా కలిగి ఉండాలిమత్తనీ కుడిచెంపపైకొట్టిన వానికి నీ ఎడమ చెంపకూడా చూపుము అని దేవుడు అంటున్నాడుఅంటేవారిని క్షమించమంటున్నదే కానీ వారిపై తెరగబడయును అని అనడం లేదుదీనికి ఉదాహరణ మన దేవుడవైన యేసుప్రభువుఎందుకంటే మన దేవుడు క్షమించే దేవుడు.
యోహా:8:1-11 లో వ్యభిచారము పట్టుబడిన స్త్రీని క్షమియించాడు". అందరూ ఆమెను ద్వేషించినా కానీ యేసు ప్రభువు మాత్రం హృదయపూర్వకముగా క్షమించాడు.
మత్త:26:75,నేను నిన్ను ఎరుగను అని మూడు సార్లు పలికిన పేతురుని క్షమించాడు.
లూకా23:40-43సిలువమీద వున్న దొంగను క్షమించాడు.
లూకా:  15:18-24  తప్పిపోయిన కుమారుని క్షమించాడు.
 తనను సిలువపై కొట్టిఉమ్మివేసిగెలిచేసిముళ్లకిరీటముపెట్టిఇతడు ద్రోహి అని నిందిచిఇతడు పాపి సుంకరులతోపాపులతో కలిసి భుజిస్తాడుఇతడు తిండిబోతు అని ఎంతోమంది తనను అని దూషించినాకొట్టినాఇబంది పెట్టినా ఒక్కరిని కూడా పల్లెత్తి ఒక్క మాటకూడాఆ అనలేదుకానీ థానే చివరికి తండ్రీవీరేమి చేయుచున్నారో వీరికి తెలియదువీరిని క్షమించండి అని ప్రార్ధన చేస్తున్నాడుఈనాడు మనము కూడా చేయ వలసిన ప్రార్ధన కూడా ఇదే.మనకు మన దేవుడవైన యేసుప్రభువు నేర్పించిన పరలోక ప్రార్ధనలో ప్రతిరోజు మనము జపిస్తూనే వున్నాంఅది ఏమిటంటేమాయొద్ద అప్పుపడిన వారిని మేము క్షమించునట్లు మా అప్పులను కూడా క్షమించుము అని మత్త:   అయితే ఒకవేళ మన పొరుగు వారిని మనము క్షమించకుండా ఎప్పుడు దేశిస్తూనే ఉంటే మన ప్రార్ధన దేవుడు ఆలకించాడు ఇంక మన పాపములను క్షమించడుకాబట్టి ఎప్పుడయితే దేవుడు మనకు దయచేసి దయార్ద్ర హృదయముతో మన పొరుగువారికి క్షమించాలిఅప్పుడే మన జీవితానికి ఒక అర్ధము పరమార్ధము ఉంటుందిఅయితే ఈనాటి రెండవ పఠనంలో పుపౌలు గారు మనకు మన జీవితము గురించి క్లుప్తముగా తెలియజేస్తున్నాడు.
రెండవ పఠనము:
3.మనజీవితము మనకొరకు కాదు ఇది కేవలము దేవుని కొరకే:
పు.పౌలుగారు అంటున్నారు, "మనలో ఎవడును తనకొరకు జీవింపడుతనకొరకు మరణింపడుమనము జీవించినా ప్రభువు కొరకే జీవించుచున్నాముమరణించునా ప్రభువు కొరకే మరణించుచున్నాముఅనిదీని అర్ధం ఏమిటంటేమన జీవితము మనకొరకు కాదుమనకు  జీవితాన్ని ఇచ్చిన దేవుని కొరకుఎందుకంటే మనలను తన కొరకే సృజించుకున్నాడుతనతో ఉండటానికితన ఆజ్ఞలను పాటించడానికి.
కాబట్టి తనతో ఉండాలి అంటే తన ఆజ్ఞలను పాటించాలితన ఆజ్ఞలు మనకు ఏమి నేర్పిస్తున్నాయి అంటే,
1.దేవుని ప్రేమించమని
2.మన పొరుగువారికి ప్రేమించమని.
మనము ఎప్పుడయితే దేవుని ప్రేమిస్తామోఅప్పుడు మనము మన పొరుగువానిని కూడా ప్రేమిస్తాముకానీ ఎప్పుడయితే మన దేవుని ద్వేషిస్తామో అప్పుడు మన పొరుగు వానినికూడా ద్వేషిస్తాముకాబట్టి ఈనాటి మూడు దివ్యగ్రంధ పట్టణాల ద్వారా దేవుడు మనకు బోధించేదిఒకరిపై ఒకరికి కోపము పగ లేక ఇతర మనస్పర్థలు లేకుండా పరస్పర సహోదరా భావము కలిగి ఒకరినొకరు ప్రేమించుకుంటూఒకరినొకరు క్షమించుకుంటూ జీవించాలని భోదిస్తున్నాయి.
కాబట్టి ఈనాటి  దివ్య బలిపూజలో పాల్గొంటున్న మనమందరము  క్షమా గుణాన్ని కలిగి జీవిస్తూ దేవుని ప్రేమను పొందుతూ ఒక ఆదర్శవంతమయిన క్రైస్తవ బిడ్డలుగా జీవించాలి అని  దివ్యబలిపూజలో ప్రార్ధన చేద్దాం.
            బ్రదర్శాంసన్
                                                                        డీకన్సునీల్  సి డి.
డీకన్జోసెఫ్ మారియో   సి డి.
 
 
 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాస్కా ఆరవ ఆదివారం

 పాస్కా ఆరవ ఆదివారం  అపో 10:25-26, 34-35,44-48 1యోహను 5:7-10 యోహాను 15:9-17 ఈనాటి పరిశుద్ధ గ్రంథములు పఠనములు దేవుని యొక్క ప్రేమ గురించి మరియ...