26, ఫిబ్రవరి 2026, గురువారం

26వ సామాన్య ఆదివారం

 దేవుని తోటలో పని

26 సామాన్య ఆదివారం

యెహెజ్కేలు 18:25-28

ఫిలిప్పీ 2:1-11

మత్తయి 21:28-32

దేవుని తోటలో పని

మనం  లోకంలో దుష్క్రియలుగాకసత్క్రియలను చేయాలిమన క్రియలకు మనమే బాధ్యులం మన బాధ్యతలను మనం సక్రమంగా నెరవేర్చాలిదేవుని చిత్తమునునెరవేర్చడంలో క్రీస్తే మన ఆదర్శం: “నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటయుఆయన పనిని పూర్తిచేయుటయే నా ఆహారము" (యోహాను 4:34). కనుకమనం కూడా స్వార్థంతోగాకనిస్వార్థ బుద్ధితో జీవించాలనేది నేటి సందేశం.

            ఈనాటి సువిశేష పఠనంలో ఇద్దరు కుమారుల ఉపమానాన్ని వింటున్నాంప్రభువు  ఉపమానాన్ని ప్రధానార్చకులకు పెద్దలను ఉద్దేశించి చెప్పాడుయేసు దేవాలయంలో ప్రవేశించి బోధిస్తున్నప్పుడు ప్రధానార్చకులుపెద్దలు వచ్చి, “ అధికారంతో నీవు  పనులు (బోధనలుస్వస్తతలుఅద్భుతాలుచేస్తున్నావునీకు  అధికారమిచ్చిన వాడె వడుఅని ప్రశ్నించారు (మత్తయి 21:23).  సందర్భంలో ప్రభువు మూడు ఉపమానాలు చెప్పాడుఅందులో మొదటిది “ఇద్దరు కుమారుల ఉపమానం.”  ఉపమానంలో రెండు వేరువేరు వ్యక్తిత్వాలను చూడవచ్చుఒకటి ప్రధానార్చకులుపెద్దలుమరొకటి సుంకరులుజారిణులుమొదటి కుమారునిద్రాక్షాతోటలో పనిచేయమని తండ్రి పిలిచినప్పుడుమొదట అతడు “వెళ్లడం నాకిష్టం లేదు” అని చెప్పినా తర్వాత తన మనస్సు మార్చుకొని వెళ్ళాడు.ఇతనుబలహీనులనుఅవివేకులనుపాపాత్ములనుఅన్యులను సూచిస్తున్నాడుదేవుడు అన్యులను (మనలనుపిలువకముందుమొదటి కుమారుని మనస్తత్వాన్ని కలిగియున్నారులోకాశలతో జీవించారుదేవునికి వ్యతిరేకంగా జీవించారుమొదటగా అవిధేయించినా దేవుని వాక్యాన్ని (బాప్తిస్మ యోహానుక్రీస్తు బోధనల ద్వారాఆలకించివిశ్వసించిమారుమనస్సు పొందియున్నారురెండవ కుమారుడు మొదట “నేను వెళ్ళుచున్నాను” అని చెప్పినా పనికి వెళ్ళలేదుఇతను కపట వేషదారులను (తమను తాము నీతిమంతులుగా పరిగణించే వారుసూచిస్తున్నాడుఅతను గొప్ప వాగ్దానం చేసాడు కాని పాటించలేదుపని చేయాలనే ఉద్దేశ్యం కూడా అతనికి లేదుమాటకుచేతకు పొంతన లేదుఇలాంటి వారు అబద్ద మాడువారు. (చదువుములూకా 6:45).

ఇద్దరు కుమారులు పాపాత్ములేఒకడు అవిధేయించాడుఇంకొకడు చేస్తానన్న పనిని చేయలేదుఒకడు నోటిమాటతో తండ్రిని బాధపెట్టాడుఇంకొకడు చేతలతో బాధపె ట్టాడుఇచ్చట “మారుమనస్సు” చాలా ముఖ్య మైనదిమనమందరం పాపం చేస్తాంకానిచేసిన తప్పును తెలుసుకొని మారుమనస్సు పొందితప్పును సరిదిద్దుకోవాలని దేవుడు కోరుతున్నాడుపెద్దకుమారుడు వెళ్లనని చెప్పినా మనసు మార్చుకొని వెళ్ళాడుతద్వారాఅతను తండ్రి ఆజ్ఞను పాటించిన వాడయ్యాడురెండవ వాడు విధంగానూ మారుమనస్సు పొందలేదుకనుకమనం  లోకంలో చేసే పనులుకార్యాలు దేవుని ఆజ్ఞను పాటించే విధంగా ఉండాలి.

ప్రధానార్చకులుపెద్దలుపరిసయ్యులు  తమ్ముతాము నీతిమంతులుగా పరిగణించుకొనే వారుదేవుని గురించి ఎన్నో విషయాలను ప్రజలకు బోధించేవారుకానివారు చేసే పనులు అందుకు విరుద్ధంగా ఉండేవిదైవ రాజ్యానికి వారే వారసులు అని భావించేవారుకాని వారు సువార్తను విశ్వసించలేదుయేసును మెస్సయ్యగా (క్రీస్తుగాఅంగీకరించ లేదుహృదయ పరివర్తన చెందలేదుబాప్తిస్మ యోహాను బోధించిన నీతి మార్గాన్ని వారు విశ్వసించలేదువారిని గురించి ప్రభువు సామాన్య ప్రజలతో ఇలా అన్నారు: “ధర్మశాస్త్ర బోధకులునుపరిసయ్యులును మోషే ధర్మాసన మున కూర్చొని ఉన్నారుకాబట్టి వారి క్రియ లనుగాక వారి ఉపదేశములను అనుసరించి పాటింపుడుఏలయన వారు బోధించునది వారే ఆచరింపరు (మత్తయి 23:1-3). వారి బోధనలుఉపదేశాలు అద్భుతంగా ఉంటాయికానిబోధించిన విధంగా వారు జీవించడం లేదుకానిపాపాత్ములుసుంకరులుజారిణులు సువార్తను (యేసువిశ్వసించారుస్యాన హృదయ పరివర్తన చెందారుకనుక వీరు ముందుగాదేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు అని ప్రభువు చెప్పారు ఉపమానంలో కుమారుల వ్యక్తిత్వాలు వేరైనా వారికి తండ్రి ఒక్కడేఅనగా సర్వ మానవాళికి (క్రైస్తవులు-క్రైస్తవేత్తరులుదేవుడు (తండ్రిఒక్కడే అని అర్థం చేసుకోవాలిఇరు వురికి ఒకే ఆజ్ఞ ఇవ్వబడినది. "కుమారులారానేడు మీరు మన ద్రాక్షాతోటలోనికి పోయి పని చేయండి” అనితల్లిదండ్రులు తమ పిల్లలను సోమరులుగా పెంచరాదుమనమందరం దేవునికి వారసులం అయినప్పటికీ మనం పని చేయాలని దేవుడు ఆజ్ఞాపించాడు ఆజ్ఞ ప్రతి ఒక్కరికి ఇవ్వబడిందిఆది తల్లిదండ్రుల అవిధేయత (పాపంవలన మనం దేవుని (ద్రాక్షాతోట నుండి గెంటివేయబడికష్టపడి పని చేయవలసి వచ్చిందిమరల యేసుక్రీస్తు కృపవలనదేవుని ద్రాక్షాతోటలో పనిచేసే అవకాశాన్ని పొందాముదేవుని ద్రాక్షాతోటలో పని చేయడానికి మనకు కావలసింది వినయంవిధేయతప్రతి ఒక్కరం కూడా దేవుని పని (చిత్తముచేయడానికి పంపబడి నాముతండ్రి తోటలో పని చేయడం అంటే మన కొరకు పని చేయడమేఇచ్చట మరియు తల్లిని మనం ఉదాహరణగాఆదర్శంగా తీసు కోవచ్చు (లూకా 1:38). ఆమె  లోకంలో తనకు అప్పజెప్పబడిన పనిని నూరుశాతం పరిపూర్ణంగా నెరవేర్చిందిమనకు గొప్ప ఆదర్శ తల్లిగా నిలిచింది.

డీకన్మనోజ్ చౌటపల్లి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాస్కా ఆరవ ఆదివారం

 పాస్కా ఆరవ ఆదివారం  అపో 10:25-26, 34-35,44-48 1యోహను 5:7-10 యోహాను 15:9-17 ఈనాటి పరిశుద్ధ గ్రంథములు పఠనములు దేవుని యొక్క ప్రేమ గురించి మరియ...