26, ఫిబ్రవరి 2026, గురువారం

క్రీస్తు దివ్యరూపధారణ మహోత్సవం

 

 క్రీస్తు దివ్యరూపధారణ మహోత్సవం

దానియేలు 7 : 9 -10 , 13 -14, 2 పేతురు 1: 16 -19, మత్తయి 17 : 1 -9

బ్రదర్సుభాష్ఓ.సి.డి

 

ఈరోజు తిరుసభ క్రీస్తు దివ్యరూపధారణ మహోత్సవాన్ని కొనియాడుతుంది

ఈనాటి మూడు పఠనాలద్వారా తల్లి తిరుసభ మనందరినీకూడా క్రీస్తువలె దివ్యరూపాన్నిదాల్చి తండ్రి దేవుని ప్రియమైన పుత్రులుగా పిలువబడాలని ఆహ్వానిస్తోంది.

  

దివ్యరూపధారణ అంటే క్రీస్తుప్రభువు ఒక మానవుడిగా ఉంటూనేతన దైవరూపాన్ని పొందుతున్నాడుదివ్యరూపాన్ని శిష్యులకు తెలియపరుస్తున్నారుతన దైవత్వాన్ని పొందుతున్నాడుమానవులకోసం మానవునిగా పుట్టిమానవులను దేవుని బిడ్డలుగా చేయడానికిదైవ ప్రజలుగా మార్చడానికి క్రీస్తు మరణించబోతున్నాడుతన శరీరము కొరడాలతో కొట్టబడితన రూపాన్ని కోల్పోయాడుక్రీస్తుని ముఖం వికృతిగావించబడిందిశ్రమల ద్వారా సిలువలో క్రీస్తు దివ్యరూపం వికృతికావడం ద్వారామానవులందురుకుడా , పాపం అనే వికృతరూపం నుండిపాపపు జీవితం నుండి దేవుని బిడ్డలుగా మారుతున్నాం  ఇక్కడ క్రీస్తు దివ్యరూపందాల్చడం అంటే ఆయన పాపం చేసాడనికాదు అర్థంమానవులకోసమై ఆయన మరణించబోతున్నాడు.

 ఈ సంఘటనని ప్రతిరోజూ మనందరమూ దివ్యబలిపూజలో గుర్తుచేసుకుంటాం.

గోధుమఅప్పము ద్రాక్షారములు క్రీస్తుని దివ్యశరీర రక్తలుగా రూపంతరం చెందుతున్నాయి.

వాటిని స్వీకరించిన మనం కూడా మన పాపాన్ని వదిలి క్రీస్తువలె దివ్యముగా జీవించాలి

మొదటిపఠనం

దానియేలు మానవరూపంలో ఉన్నటువంటి దైవదర్శనం పొందాడు.

ఈదర్శనములో ఇశ్రాయేలు ప్రజలు పొందబోయే శాంతి రాజ్యాన్ని సూచిస్తుంది.

మొదటిపఠనం యొక్క చరిత్ర చూస్తేదేవుని ప్రజలు బబులోనియా బానిసత్వంలో ఉన్నారుప్రజలకు మంచిరోజులు రాబోతున్నాయిదేవునిరాజ్యం సమీపిస్తుందని, విశ్వాసముతో వేచియుండుమనిదేవుని ప్రజలను దేవుడు రక్షిస్తాడు” అనే ఒక ఆశను వారిలో పురికొల్పుతున్నాడుప్రజలకు ఒక కోరిక (ఆశను దానియేలు ప్రవక్తకు ఈదర్శనం ద్వారా దేవుడు దయచేస్తున్నాడు.

ఈ ప్రస్తుత అధ్యాయానికి ముందు చూస్తేదానియేలు ప్రవక్త బబులోనియా దేశంలో బానిసగా కొనిపోబడిఅక్కడ రాజుగారి మన్నను పొంది ఒక గొప్ప స్థాయికి చేరుకుంటాడుకానీ ఆరాజ్యంలో ఉన్న మిగిలిన అధికారులకు నచ్చకదానియేలు ప్రవక్తని ఎలాగైనా హతమార్చాలని నిర్ణయించు కుంటారుఅందరు కలిసి రాజు చెంతకు వెళ్లి ఒక ఆదేశాన్ని జారీచేయిస్తారుఅదే బబులోనియా దేవుళ్లనుదేవతలను తప్ప ముప్పది సంవత్సరాల వరకు వేరే దేవుళ్లనుదేవతలను ఆరాధించకూడదు లేదా పూజించకూడదు అని ఒక ఆదేశాన్ని జారీచేస్తారు.

కానీ దానియేలు ప్రవక్త మాత్రం తన గదిలోనికి వెళ్లి , తలుపులు మూసిరహస్యముగా తమ స్వదేశమైన యెరూషలేము వైపు కిటికీలు తీసి యావే దేవుడిని మాత్రమే ఆరాధిస్తారుఇది చూసినటువంటి అధికారులుఎలాగైనా దానియేలు ప్రవక్తని మట్టు పెట్టాలని రాజు చెంతకు తీసుకెళ్లిప్రవక్తని సింహాల బోనులో ఉంచుతారుదానియేలు ప్రవక్తకు దేవుడి మీదవున్నా విశ్వాసమువలెనే ప్రవక్తకి ఎలాంటి హాని కలగకుండా దేవదూతలచే రక్షించబడ్డాడుఆసంఘటనతో బబులోనియా రాజుకుఆరాజ్యంలో ఉన్న ప్రజలందరికీ యావేదేవుడంటే ఎవరో తెలియపరుస్తున్నారుఈఅద్భుతం ద్వారా యావేదేవుడిని అందరికి తెలియపరుస్తున్నారు.

చివరిగా ఈ మొదటి పఠనంలో రాబోయే దేవుని రాజ్యాన్ని గురించిదానియేలు ప్రవక్త విశ్వాసం గురించి మనము గ్రహించవచ్చుఇశ్రాయేలు ప్రజలు తమ బానిసత్వం నుండి స్వేచ్చా జీవితంలోకి రావడాన్ని రూపాంతరం చెందడం అని కూడా మనం అర్థం చేసుకోవచ్చుబానిసత్వం నుండిఅన్యుల దేశం నుండి స్వదేశానికి వస్తున్నారుస్వేచ్చా బిడ్డలుగా జీవించబోతున్నారుఆదర్శన్నే దేవుడు దానియేలు ప్రవక్తకు ఇస్తున్నారు.

సువిశేషం

సువిశేష పఠనాన్ని మనం ధ్యానించినట్లయితేక్రీస్తుని దివ్యరూపాన్ని పొందటం మనం చదువుతున్నాంమరియు ఆకాశము నుండి తండ్రి దేవుడు క్రీస్తుని ప్రియమైన కుమారుడిగా పిలవడంమరియు క్రీస్తుని విశ్వసించమని చెప్పటం కూడా మనం గమనిస్తున్నాం.

దివ్యరూపధారణ : ఆసమయంలో క్రీస్తుతో పాటు మోషే మరియు ఏలీయా ప్రవక్తలు వీరు ముగ్గురు కూడా  ఇశ్రాయేలు ప్రజల రక్షణకు దేవునికి సహకరించినవారు.

ఇప్పుడు తాబోరు కొండమీద రాబోతున్నటువంటిక్రీస్తు పొందబోతున్నటువంటి శ్రమలుమరణ పునరుత్తానాల గురించి చర్చిస్తున్నారుక్రీస్తు తన మరణం పునరుత్తానం ద్వారా సమస్త ప్రజలందరూకూడాక్రీస్తు నిజమైన దేవుని కుమారుడా గుర్తించబడతారు.

ఆచర్చలో క్రీస్తు తాను దేవుని చిత్తాన్ని అంగీకరించిమరణించాడని కూడా సిద్దమయ్యాడు.

ఈ అధ్యాయానికి ముందు అధ్యయాలు అన్ని కూడావిశ్వాసం గురించి తెలిచేస్తాయి.

క్రీస్తుప్రభువుదైవరాజ్యాన్నిగురించిభోదిస్తున్నప్పుడు,యూదులు,ధర్మశాస్త్రబోధకులు,పరిశయ్యులుక్రీస్తుని తిరస్కరిస్తున్నారుఆయనను రూపుమాపాలని పన్నాగాలు పడుతున్నారు.

ఆ సందర్భంలోనే క్రీస్తుప్రభువు తన శిష్యులను ఈవిధంగా అడుగుతున్నారు.  నేను ఎవరినని మీరు విశ్వసిస్తున్నారు ? వెంటనే పేతురుగారు “ నీవు సజీవుడైన దేవుని కుమారుడవు” అని బదులు పలికెను.

అందుకే క్రీస్తుప్రభువు నిరాతిమీద నారాజ్యాన్నినాసంఘాన్ని నిర్మిస్తాను అన్నాడు.

ఈనాటి సువిశేషంలో కూడా తండ్రి దేవుడుఆసత్యాన్నే ఈముగ్గురు శిష్యుల ఎదుటవారికీ తెలిసేలా క్రీస్తుని గురించి “ఈయన నా ప్రియమైన కుమారుడుఇతనిని విశ్వసించండి అని తెలుపుతున్నారు”.

ఈనాటి సువిశేషంలో కూడా తండ్రి దేవుడుఆసత్యాన్నే ముగ్గురు శిష్యుల ఎదుట వారికీ తెలిసేలా క్రీస్తుని గురించి “ఈయన నా ప్రియమైన కుమారుడుఇతనిని విశ్వసించండి అని తెలుపుతున్నారు”. క్రీస్తు యొర్దాను నదిలో జ్ఞానస్నానం పొందినప్పుడు కూడా , దేవుని స్వరం ఈవిధంగా పలుకడం మనం గమనించవచ్చుఅప్పుడు కూడా క్రీస్తు ప్రభువు మానవుల రక్షణ చర్యలో దేవుని చిత్తాన్ని అంగీకరించాడుఅందుకుగాను దేవుని స్వరం ఆవిధంగ పలికింది .

ఎవరైతే దేవుని చిత్తాన్ని అంగీకరించి నెరవేరుస్తారో వారిని దేవుడు కూడా ప్రిమయైన బిడ్డలుగా పిలుస్తారు.

అంటే లోకాన్ని పాపము నుండి విముక్తి గావించాడనిరక్షించాడనికి వచ్చినది క్రీస్తే అని విశ్వసించండి అని తండ్రి దేవుడు తెలియచేస్తున్నారు.

మానవులకు దైవరూపాన్ని ఇవ్వుటకు క్రీస్తు తాను సిలువలో వికృతరూపం దాల్చుటకు సిద్ధమవుతున్నారు

కాబట్టి మనం కూడా మనకోసం మరియు ఇతరుల కోసం రూపాంతరం చెందడానికి మనల్ని మనం వికృతీకరించుకోవాలి

రెండవపఠనం

రెండవపఠనంలోపేతురుగారు క్రీస్తుని గొప్పతనాన్ని వివరిస్తున్నారుపేతురుగారు క్రీస్తుప్రభువు దివ్యరూపధారణ సమయంలో ఉన్న ప్రత్యక్ష సాక్షిఅందుకే అంటున్నారుతండ్రి దేవుడు క్రీస్తుని గూర్చి చెప్పిన సందేశాన్నిమాటలనునాకన్నులార క్రీస్తుని దివ్యరూపాన్ని గాంచితినిదేవుని స్వరమును స్వయముగా , చెవులారా వింటిని అంటున్నారు.

కావున క్రీస్తుని విశ్వసించండిఏలయన క్రీస్తుప్రభువే మన అంధకార జీవితాలను , మానవ జీవితాలనుదేవుని బిడ్డలుగాపవిత్ర జీవితాలుగా మార్పు చెందించే దేవుడుమన అంధకార జీవితాలకు వేకువ జామున

వెలుగునిచ్చే వేగుచుక్కవంటివాడు ఆయనను విశ్వసించండి అని బోధిస్తున్నారుఆయన మానవుడిగా రూపందాల్చి

మానవులందరికి దైవరూపాన్ని ఇవ్వాలని సిలువలో మరణించాడుకనుక ఆయేసును మీరు విశ్వసించండి అని బోధిస్తున్నారు.

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాస్కా ఆరవ ఆదివారం

 పాస్కా ఆరవ ఆదివారం  అపో 10:25-26, 34-35,44-48 1యోహను 5:7-10 యోహాను 15:9-17 ఈనాటి పరిశుద్ధ గ్రంథములు పఠనములు దేవుని యొక్క ప్రేమ గురించి మరియ...