19, జూన్ 2021, శనివారం

12 వ సామాన్య ఆదివారం

 


యోబు: 38 : 1 , 8 - 11

2 కొరింతి 5 : 14 - 17

మార్క్ 4 : 35 – 41

 

క్రీస్తునాధునియందు ప్రియా సహోదరి సహోదులారా ఈనాడు మనమందరం 12 సామాన్య ఆదివారం లోనికి ప్రవేశించియున్నాము. నాటి మూడు దివ్య పఠనములను మనము ధ్యానించినట్లైతే, ఎవరైతే దేవుని యందు మరియు క్రీస్తుయందు విశ్వాసం ఉంచుతారో అటువంటివారికి ఎన్ని కష్టాలు, ఇబందులు, ఆటంకాలు వచ్చిన కూడా వారి యొక్క విశ్వాసమే వారిని రక్షిస్తుందని, మరియు దేవుడు వారికీ తోడుగా ఉంటాడని నాటి మూడు పఠనాలు తెలియజేస్తున్నాయి.

నాడు మనమందరం మన యొక్క జీవితాలను ఒక పడవ ప్రయాణంలాగా సాగించాలి ఎందుకంటే పడవ యొక్క ప్రయాణం ఒక తీరం వరకు కాదు, పడవ యొక్క ప్రయాణం అనేది అది దానియొక్క గమ్యాన్ని చేసుకునేంతవరకు, ఎందుకంటే ఎప్పుడైతే మన జీవితాలను యొక్క పడవ ప్రయాణంలాగా రెండు విషయాలను గమనించాలసింది మరియు చేయాలసింది.

1 . మనం చేప్పట్టిన దానిని కొనసాగించలేక చేతగానితనంగా తిరిగి మరల వెన్నకి రావటం.

2 . మన యొక్క జీవితాన్ని ముందుకు కొనసాగించి ఒక అంకిత భావంతో మరియు కష్టపడి మన యొక్క గమ్యాన్ని చేరుకోవటం.

ఇందుట్లో మూడో మార్గం అనేది లేదు ఎందుకంటే మూడో మార్గం ఉంది అంటే అది మనయొక్క వినాశనం యందుకంటే పడవ ఏవిధంగానైతే తన యొక్క గమ్యాన్ని చేరుకోలేక మరియు తిరిగి వెన్నక్కి రాలేక మార్గం మధ్యలో నశించి పోతుందో అదే విధంగా మన యొక్క జీవితం కూడా అదే విధంగా జరుగుతుంది.

మానవుని యొక్క జీవితం నీటిలో ఉన్నటువంటి పడవవంటిది, ఇక్కడ మనకు జీవితం అనగానే గుర్తుకు రావలసింది ఏమిటంటే జీవితం అనేది ఒక అద్భుతం. జీవితం అనేది సాగుతూ ఉండాలి తప్ప ఒక్క సరిగా ఆగిపోకూడదు, ఒక్క సరి ఆగిందా అంతటితో మన జీవితం నీటిలో కూలిపోయినటువంటి పడవ వంటిది.

ఒక్కసారి మనం జీవితాన్ని సాగించినాము అది ఇలాగె సాగాలి తప్ప, ఓటమి వచ్చిందని బాధపడకుండా ఓడిపోయిన పర్వాలేదు కానీ అయొక్క ఓటమితో మనయొక్క జీవితం ముగిసిపోకూడదు.

అందుకే ఈనాటి మొదటి పఠనము మనకు తెలియజేస్తుంది (యోబు 38 : 10) లో చూస్తున్నాము, దేవుని యొక్క ఆజ్ఞ లేనిదే సముద్రము గీత దాటాడు, అయన ఆజ్ఞతోనే గర్జించు సముద్రం కూడా శాంతించును అని (మార్క్ 5 : 39) లో చూస్తున్నాము. ఏవిధంగానైతే ఆకాశంలో ఉరుములు, మెరుపులు వచ్చినప్పుడు పిల్లలు బయపడి తమ తండ్రి లేదా తల్లి దగ్గరకు పరుగెట్టుకొని వస్తారో, అదేవిధంగా ఈనాటి సువిశేష పఠనంలో (మార్క్ 5 : 38) లో శిస్యులు తుఫానును చూసి ప్రాణ భయంతో భయపడుతూ యేసు వద్దకు పరుగెట్టుకొని వచ్చి మేము చనిపోవుచున్నాము అని చెప్పినపుడు.

యేసు ప్రభు లేచి గాలిని శాంతింపుము అన్ని సముద్రంతో చెప్పినపుడు అది శాంతించింది, అప్పుడు ప్రభు వారితో ఇట్లు అనుచున్నాడు మీరింత భయపడితీరేలా? మీకు విశ్వాసం లేదా? అన్నదానిని మనం గమనించినట్లయితే శిష్యులు అల్ప విశ్వటంతో ఉన్నపుడు వారు తుఫాను గాలికి భయపడ్డారు. అంతే కాకుండా లోక రక్షకుడు వారితో ఉన్నాడని వారు, లోకాని తాను సృష్టించి తన ఆదీనంలో ఉంచుకున్నాడని, తన హస్తం వారిపై ఉన్నాడని తెసిలి కూడా, వారికీ వచ్చిన సమస్య గురించి వారు అందుకు ఆలోచించాలి మరియు భయపడాలి. దేవుడు మనతో ఉన్నపుడు మనం దేనికి కూడా బయపడకూడదని ఈనాటి నాలు మనకు తెలియజేస్తున్నాయి.

పూర్వ నిభందనములో చూసినట్లయితే విశ్వాసమునకు తండ్రి ఐనటువంటి అబ్రహం గారు. తన ప్రాణం కొరకై తన భార్య అయినటువంటి సారాను తన చెల్లి ని రాజుతో చెప్పి తన ప్రాణాలను కాపాడుకోవాలని అనుకున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు అబ్రహంతో ఉన్న కూడా తాను ఈయొక్క లోకానికి సమందించినటువంటి మానవునికి భయపడుతూ తనకుంటువంటి విశ్వాసాన్ని కోల్పోవడం మనం చూస్తున్నాము. కానీ తండ్రి దేవుడు మాత్రం అబ్రాహామును విడువలేదు. తనయొక్క విశ్వాసాన్ని కోల్పోకుండా తిరిగి సారాను అబ్రాహామునకు అప్పగించటం మనం చూస్తున్నాము.   

అదే విధంగా ఈనాటి సువిశేష పఠనంలో చూస్తున్నాము శిష్యుల యొక్క విశ్వాసాన్ని కోల్పోకుండా వారికీ తిరిగి విశ్వాసాన్ని యేసు ప్రభు దయచేయటం మనం చూస్తున్నాము.

కాబట్టి మన యొక్క జీవితంలో మీ జరుగుతుందని మనం శిష్యుల వాలే  కంగారు పడకూడదు, ఎందుకంటే యేసు క్రీస్తు యొక్క హస్తన్ని  మనతో ఉంచుతున్నారు, అందుకే (రొమాన్స్ 8 : 31) లో చూస్తున్నాము క్రీస్తు మనతో ఉండగా ఇంకెవరు మనకు వెతిరేకంగా నిలుస్తారని. మనమందరం కూడా భయంతో జీవించకుండా విశ్వాసంతో జీవించాలని ఈనాటి సువార్త పఠనంలో చూస్తున్నాము. క్రీస్తు నిద్రిస్తున్నకాని నిజానికి యేసు క్రీస్తుకు తెలియకుండా లోకంలో మీ జరగదు.

మనము అనేక సార్లు లోకంలో ఉన్నటువంటి అనేక ప్రాణులకూ కానీ, మనుషులకు గాని బయపడుతుంటాము, ముఖ్యంగా కొన్ని మన జీవితాలలో వస్తున్నటువంటి సందర్భాలలో ఈవన్నీ కూడా వచ్చేది మనతో దేవునిపై విశ్వాసం లేనందువల్లనే, ఎందుకంటే విశ్వాసంలేనిదే మనము మీ చేయలేము. ఎప్పుడైతే మనం విశ్వాసంతో జీవిస్తామో అప్పుడే మనకున్నటువంటి భయం అనేది తొలగిపోతుంది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా ఈనాడు మనమందరం కూడా అయొక్క దేవాతి దేవునికి మొరపెట్టుకుందాం మనలో గొప్ప విశ్వాసాన్ని దయచేయమని మరియు క్రీస్తుపై నమ్మకం ఉంచి ముందుకు సాగాలని కోరుకుందాం.

   by .Br . JOHANNES

 

15, మే 2021, శనివారం

క్రీస్తు మోక్షారోహణ మహోత్సవము

       క్రీస్తు మోక్షారోహణ మహోత్సవము

 అ. పో 1: 1-11

 ఎఫెసీ 1: 17-23

 మార్కు 16: 15-26

క్రీస్తు నాధుని యందు ప్రియ సహోదరీసహోదరులారా, ఈ రోజు మనము క్రీస్తు మోక్షరోహణ పండుగ జరుపుకుంటున్నాము. ఇది అత్యంత ముఖ్యమైన పండుగ. క్రైస్తవ జీవితాలకు ఇది మరో మహోన్నతమైన మలుపును దిద్దే పండుగ. ఈ పండుగ మనలను దేవునికి సాక్షులుగా ఉండ ఆహ్వానిస్తుంది.

క్రీస్తు ప్రభువు మరణించిన పిదప, నలువది దినముల పాటు తాను స్వయముగా పలుమారులు శిష్యులకు కనిపించుచు, తాను సజీవుడని వారి సందేహములు తొలగునట్లుగా ఋజువు పరచు కొనెను. వారికి కనబడటమే కాక దేవుని రాజ్యము గూర్చి వారికి బోధించెను. ఈ మాటలు పలికిన పిమ్మట వారు చూచుచుండగా అయన పరలోకమునకు కొనిపోబడెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కమ్మివేసెను (అ. పో 1: 3-9). క్రీస్తు ఉత్తానుడైన పిదప నలువది దినములకు ఈ మోక్షరోహణము అపొస్తలుల ఎదుట జరిగింది. అప్పటి నుండి శిష్యులు ఈ గొప్ప రహస్యాన్ని విశ్వసించి ప్రకటించడము ప్రారంభించారు. 


 దైవ సహాయముతో


పవిత్రాత్మ మీపై దిగివచ్చినప్పుడు
, మీరు శక్తిని పొందుతారు. మీరు నా సాక్షులుగా రాజిల్లుతారు. ఈ మాటలు ప్రభువు తన  తండ్రితో పరలోక మహిమలో ప్రవేశించే ముందు పలికిన చివరి
మాటలు.  ఈ మాటలు ఆయన రక్ష సాధన కర్తవ్యాన్ని, ఆయన రక్షణ కార్యానికి సాక్షులుగా నిలవాల్సిన శిష్యుల కర్తవ్య  బాధ్యతను ఎత్తి చూపుతున్నాయి.  వారి కర్తవ్యము, బాధ్యత సువార్తను ప్రకటించడము,  రక్షణ  సువార్తను ఇశ్రాయేలు ప్రజలకే కాక, ప్రపంచములోని అన్ని జాతుల వారికి ప్రకటించడము.  

ఎందుకంటే దేవుని ప్రేమ రక్షణానుగ్రహము ఏ కొందరికో లేక ఏ ఒక్కజాతికో పరిమితమైనది కాదు.  అది ప్రపంచానికంతటికి, అంగీకరించే ప్రతి ఒక్కరికి చెందినది. దేవుని సువార్త అనేది ప్రజలను తమ అపరాధ, పాప బానిసత్వాలనుండి, భారము నుండి విడుదల చేసే దేవుని శక్తి గలది. మనలను స్వస్థపరచి పునరుద్ధరించి పరిపూర్ణులను చేయగల శక్తిమంతమైనది దేవుని వాక్కు. ఆ వాక్కును ప్రకటించడానికి దేవుడు శిష్యులను ఎన్నుకుని వారిలో పవిత్రాత్మను నింపాడు.

 అనునిత్యము ప్రకటించండి

    సువార్త వ్యాప్తి అనేది నిరంతరము కొనసాగించవలసినది. ఎందుకంటే క్రీస్తు ప్రేషిత కార్యము అన్ని కాలాలకు సంభందించినది. అయితే ఈ కర్తవ్య నిర్వహణ బాధ్యత కేవలము అభిషేకము పొందిన కొందరికి మాత్రమే అప్పగింపబడలేదు. క్రీస్తే నిజమైన రక్షకుడని విశ్వసించే అందరికి అప్పగింపబడినది. ఆనాటి క్రైస్తవ సంఘము ఈ ఆజ్ఞను బాగా అర్ధము చేసుకుని, చక్కగా పాటిచింది. కనుకనే సువార్త సందేశము వేగముగా విస్తరించింది. అయితే ఈ నాటి కాలములో సువార్త పరిచర్యలో ఏర్పడిన అధికార కేంద్రీకరణ కారణముగా అది మలుపు తిరిగి కేవలము అభిషిక్తుల ప్రధాన పరిచర్యగా మారిపోయింది.

ఉత్తాన ప్రభువు అప్పగించిన ఈ గొప్ప బాధ్యత, శ్రీ సభలోని విశ్వాసులందరికి  చెందినదన్న నిజాన్ని గ్రహించాల్సిన సమయము వచ్చింది. రెండవ వాటికన్ మహాసభ అందించిన, "గృహస్థ క్రైస్తవుల అపోస్తొలిక" అను అధికార పత్రములో తెల్పిన  విధముగా, సువార్త ప్రకటన అనేది బాప్తిస్మము స్వీకరించిన ప్రతి ఒక్కరికి ప్రభువు అప్పగించిన బాధ్యత. క్రైస్తవునిగా జీవించడము అంటేనే ప్రభువుకు సాక్ష్యము పలుకడము. ప్రభువు సువార్తను ప్రకటించడము. పునీత అస్సిసి పూరి ఫ్రాంచీసువారు  చెప్పిన విధముగా మాటలలోనే కాదు, చేతలలోను, జీవిత విధానములో కూడా సువార్తను ప్రకటించవచ్చు.

జీవిత సాక్ష్యము:

సమాజములో ఒక మంచి వ్యక్తిగ పేరు తెచ్చుకున్న ఒక వ్యక్తి, తన వృధాప్యములో తన ముగ్గురు కుమారులను పిలిచి నేను మరణించిన తరువాత మీరు నా పేరును ఎలా నిలబెడతారుఅని అడిగాడు. పెద్ద కొడుకు అందుకు సమాధానము చెబుతూ, మీలో ఉన్న గుణాలను అన్నిటిని వివరిస్తూ ఒక పుస్తకాన్ని ముంద్రించి, అందరికి పంచుతాను. దానిని చదివిన ప్రతి ఒక్కరు మీ గురించి తెలుసుకుంటారు అని అన్నాడు. ఇక రెండవ వాడు తండ్రి గౌరవార్థము నగరము మధ్యలో ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తానని, అప్పుడు  అందరికి తండ్రి పేరు ప్రతిష్టలు స్థిరముగా తెలుస్తాయని, అప్పుడు తండ్రి పేరు నగరములో చిరస్థాయిగా నిలుస్తున్నాడని అన్నాడు. కానీ చిన్న కుమారుడు మాత్రము అందరు నన్ను మీ కుమారునిగా గుర్తించే విధముగా మీ అడుగుజాడలలో నడుస్తూ  మంచిగా జీవిస్తాను అని అన్నాడు.
పుస్తకాన్ని ప్రచురించడము ద్వారా, విగ్రహాన్ని ప్రతిష్టించడము ద్వారా కుమారులు తమ  తండ్రికి జీవిత సాక్ష్యాన్ని ప్రదర్శించడము లేదు. కానీ ఆయనలా మంచిగా జీవించడము
ద్వారా ఆయన మంచితనము ఎల్లయెడల వ్యాపిస్తుంది. అదే విధముగా క్రీస్తు సువార్తను 
మనము మాటల ద్వారా, పుస్తకాల ద్వారా, మందిరాల ద్వారా కన్నా, మన జీవిత సాక్ష్యము ద్వారా మరింత స్పష్టముగా తెలియజెప్పిన వారలమవుతాము. కాబట్టి దేవుని  వాక్యాన్ని విందాము, పాటిద్దాము, ఆయన సాక్షులుగా జీవిద్దాము.ఆమెన్


Bro. Ratnaraju Abbadasari OCD

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...