మూడవ సామాన్య ఆదివారం
యోనా 3:1-5
1కొరింతి 7:29-31
మార్కు 1:14-21
ఈనాటి పరిశుద్ధ గ్రంథ పట్టణములు ప్రభు యొక్క రాకడ కొరకై హృదయ పరివర్తనం చెంది జీవించాలి అనే అంశము గురించి బోధిస్తున్నాయి. హృదయ పరివర్తనం మరియు పాపమునకు పశ్చాత్తాప పడటం ఒక కొత్త జీవితం నాంది పలుకుతుంది.
ఈనాటి మొదటి పఠణంలో దేవుడు యోనా ప్రవక్తను నినెవే పట్టణమునకు హృదయ పరివర్తనం బోధించుటకు పంపిన విధానమును చదువుకుంటున్నాం. దేవుని యొక్క పిలుపును మొదటిగా స్వీకరించినప్పుడు యోనా ప్రవక్త నీనెవే వెళ్ళుటకు నిరాకరించారు ఎందుకంటే నినెవే వాసులు ఇశ్రాయేలు ప్రజలకు వ్యతిరేకంగా జీవించి అనేక సందర్భంలో యుద్ధంలో ఆధిపత్యమును సాధించారు. అందుకనే యోనా నినెవే పట్టణవాసులు నాశనమైతే బాగుండు అని భావించి ఆయన తర్షీషునకు ప్రయాణం ప్రారంభించాడు కానీ తన ప్రయాణం గమ్యమునకు చేరలేదు మార్గమధ్యంలోని దేవుడు ఆయనను పంపవలసిన గమ్యమునకు పంపిస్తున్నారు. యోనా ప్రవక్త నినెవే పట్టణము చేరి అక్కడ ప్రభువు యొక్క హృదయ పరివర్తన సందేశమును ప్రకటించగానే రాజు దగ్గర నుండి చిన్నపిల్లల వరకు కూడా దేవుని యొక్క సందేశము శ్రద్ధగా ఆలకించి, స్వీకరించి వారు హృదయ పరివర్తన మనకు చేయవలసిన ప్రతి పనిని కూడా చేస్తున్నారు. ఇక్కడ గమనించవలసిన అంశం ఏమిటి అంటే వారు అన్యులు అయినప్పటికీ కేవలం ఒకే ఒక దైవ సందేశమును ఆలకించగానే హృదయ పరివర్తనము చెందటానికి సిద్ధపడుతున్నారు మరి మనము దేవుని యొక్క వాక్యము విన్న సందర్భంలో హృదయ పరివర్తనము చెందటానికి సిద్ధపడుచున్నాము. నినెవే వాసులు మరణము వస్తుంది అని విన్న వెంటనే గోనె దాల్చి, బూడిద పూసుకొని ఉపవాసం చేసి ఉన్నారు. మనం మరణము గురించి కూడా ధ్యానించినట్లయితే ప్రతి ఒక్కరు హృదయ పరివర్తనం చెంది జీవిస్తారు.
ఈనాటి రెండవ పఠణములో పునీత పౌలు గారు ఇక సమయము లేదు అని తెలుపుచున్నారు కావున హృదయ పరివర్తనము చెంది చెడు మార్గములను విడిచి పుణ్యమార్గములను అలవర్చుకోవాలి. ఈ లోక సంబంధమైన వాంఛలతో కానీ ఆశలతో కానీ జీవించకుండా దేవుని కొరకు జీవించమని తెలుపుచున్నాను. దేవుని కొరకు జీవించాలి అంటే ఇప్పుడు మనము నడుస్తున్న చెడు మార్గము కానీ పాపపు మార్గము కానీ విడిచి పెట్టాలి అప్పుడే మనలో కొత్త జీవితం పుడుతుంది.
ఈనాటి సువిశేష భాగములో ఏసుప్రభు తన మొదటి సువార్త పరిచర్య హృదయ పరివర్తనము అనే అంశము ద్వారా ప్రారంభించి ఉన్నారు. కాలము సంపూర్ణమైనది హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసించండి అని క్రీస్తు ప్రభువు పరిచర్య ప్రారంభించారు. హృదయ పరివర్తనం అనగా ఒక యు టర్న్ (U- Turn)తీసుకోవటమే ఎందుకంటే మనము మిస్సయినటువంటి మార్గమును మనము మరల అనుసరించటం.
పాపము చేసిన సందర్భంలో దేవుని యొక్క మార్గమును విడిచి మన సొంత మార్గంలో ప్రయాణం చేస్తాం కాబట్టి ఈ యూటర్న్ అనేది మరొకసారి దేవుని యొక్క మార్గమును అనుసరించుటయే. హృదయ పరివర్తన ప్రతి ఒక్కరి జీవితంలో అవసరం లేనియెడల మనందరం మన యొక్క జీవితమును యధావిధిగా కొనసాగిస్తూ ఉంటాం అయితే ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవలసిన అంశం ఏమిటంటే కాలము సంపూర్ణమైనది. కాలము సంపూర్ణమైనది అనగా దేవుని యొక్క కాలము ప్రారంభమైనది కాబట్టి దానికి అనుగుణంగా మనము హృదయ పరివర్తనం చెందాలి.
హృదయ పరివర్తనము మన యొక్క వ్యసనములు నుండి, పాపపు జీవితము నుండి, మూడు నమ్మకముల నుండి ఇంకా చెడు సుగుణముల నుండి హృదయ పరివర్తనం చెందాలి. హృదయ పరివర్తన ప్రతి ఒక్కరు కోరుకునే అంశం కొన్నిసార్లు దేవుడు ప్రజల హృదయ పరివర్తనం చెందాలనుకుంటారు, కొన్నిసార్లు బిడ్డలు తల్లిదండ్రులు హృదయ పరివర్తనం చెందాలనుకుంటారు మరి కొన్నిసార్లు భర్త భార్య హృదయ పరివర్తనం చెందాలనుకుంటారు అలాగే భార్య భర్త హృదయపరివర్తనం చెందాలనుకుంటారు ఈ విధంగా చాలామంది ఒకరి పట్ల ఒకరు హృదయ పరివర్తనం కోరుకుంటారు కాబట్టి మనం హృదయ పరివర్తనం చెంది జీవించాలి.
Fr. Bala Yesu OCD