26, ఆగస్టు 2023, శనివారం

21వ సామాన్య ఆదివారం

21 వ సామాన్య ఆదివారం
యెషయ 22:19-23, రోమియులు 11:33-36, మత్తయి 16:16-20
ఈనాటి దివ్య పఠణాలు అధికారం గురించి బోధిస్తున్నాయి. మానవాళికి దేవుడు అధికారం ఇచ్చినది సరైనటువంటి పాలన చేస్తూ అందరిని కూడా దేవుని వలే సన్మార్గంలో నడిపించాలి అని ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి అధికారం ఇచ్చి ఉన్నారు. దేవుడు తన అధికారాన్ని తన దగ్గరే వుంచుకొనకుండా మానవాళితో పంచుకుంటున్నారు. ఒక విధముగా చెప్పాలి అంటే ఈ ఆదివారాన్ని అధికార ఆదివారం అని పిలవవచ్చు ఎందుకంటే మూడు పఠణాలు కూడా ఇదే అంశము గురించి ఈ ప్రస్తావిస్తూ ఉన్నాయి. ఈనాటి మొదటి పఠణంలో దేవుడు అవిశ్వాసులు, స్వార్ధపరులైన అధికారుల పట్ల నిరుత్సాహపడినటువంటి రీతిని, శిక్షించిన రీతిని మనం యెషయా గ్రంథం ద్వారా చదువుకుంటున్నాము. ఎవరైతే తమ అధికారాన్ని స్వార్ధం కోసం వినియోగించుకుంటారో వారిని దేవుడు తమ యొక్క అధికారాన్ని నుండి తొలగిస్తారు. ఈనాటి మొదటి పఠణంలో తన యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్న ప్రధానమంత్రి షెబ్నా యొక్క జీవిత పరిణామం గురించి, ఆయన్ను దేవుడు శిక్షించిన రీతిని గురించి వింటూ ఉన్నాం . క్రీస్తుపూర్వం ఎనిమిదవ శతాబ్దంలో షెబ్నా హెజెకియా రాజు వద్ద గృహ నిర్వాహకుడుగా నియమింపబడ్డాడు. ఆ కాలంలో అస్సిరియా రాజ్యం యూదాపై యుద్ధం చేయటానికి వచ్చే సందర్భంలో హెజెకియా రాజు భయపడుతున్నాడు అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలు ఐగుప్తు రాజ్యం యొక్క సహాయం కోరమని రాజును కోరారు ఆ యొక్క మాటలకు ప్రధానమంత్రి అయిన షెబ్నా ఎక్కువ ప్రోత్సాహాన్ని అందజేశాడు. నిజ దేవుడైన ఈ యావే మీద ఆధారపడి దేవుని సహాయమును కోరమని యెషయా ప్రవక్త తెలియచేశారు. యెషయా అన్య రాజ్యముల మీద ఆధారపడకుండా, వారి సైనిక బలం మీద నమ్మకం ఉంచవద్దని  ముందుగానే హెచ్చరించారు అయినప్పటికీ షెబ్నా గర్వంతో దేవుని యొక్క మాట వినకుండా అన్య రాజుల మీద ఆధారపడాలని కోరుకున్నాడు హెజెకియా రాజును దాని కొరకు ప్రోత్సహించాడు. దేవుని యొక్క మాటను ధిక్కరించి గర్వంతో, అవిశ్వాసిగా జీవించిన షెబ్నాను దేవుడు తన యొక్క అధికారం నుండి తొలగిస్తున్నారు. అదే విధముగా షెబ్నా తనకున్నటువంటి ధనంతో అధికారంతో యెరుషలేము లోనే ఒక మంచి సమాధిని తన కొరకై నిర్మించుకున్నాడు తన మరణించిన తర్వాత దానిలో పాతి పెట్ట పడటానికి కానీ ఆయన తన యొక్క దనమను, అధికారాన్ని దుర్వినియోగం చేసుకొనుట ద్వారా దేవుడు తనని శిక్షిస్తున్న ఆయన బానిసత్వం లోనే చనిపోతున్నారు. దేవునికి విధేయత చూపించకుండా గర్వంతో అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నటువంటి షెబ్నా నుండి అధికారం తొలగించి హిల్కియా కుమారుడు ఎలియాకీము కు అధికారమును ఇస్తున్నారు. షెబ్నా దేవుని మార్గములకు దూరంగా ఉంటే ఎల్యా కీమా మాత్రం దేవునికి దగ్గరగా ఉన్నారు. ఆయనకు విధేయత చూపించారు, దేవుని మీద ఆధారపడ్డాడు. ప్రభువు ఈ విధంగా పలకు చున్నారు నీ అధికార వస్త్రములను నీ నడికట్టును అతనికి కట్టుబెట్టుదును, నీ అధికారమును అతనికి అప్పగించును అలాగే దావీదు వంశపు రాజు తాళపు చెవిని అతడు తన భుజముల మీద దాల్చినట్లు చేయుదును (21,22(. షెబ్నా యొక్క పూర్తి బాధ్యతలన్నిటిని దేవుడు ఎలియాకీముకు ఇస్తున్నారు. తాళపు చెవి అధికారాన్ని సూచిస్తూ ఉన్నది. ఎందుకంటే దేవుడే స్వయముగా పేతురు గారికి పరలోకపు తాళంలను అప్పజెప్పి అధికారాన్నిస్తున్నారు. ఒక విచారణ గురువు ఇంకొక విచారణకు బదిలీ అయి వెళ్లేటప్పుడు కొత్తగా వచ్చిన విచారణ గురువుకు ఆయన అప్ప చెప్పేది దివ్య మందసము యొక్క తాళపు చెవి. ఆ తాళపు చెవి తన యొక్క విచారణ బాధ్యతలను అధికారాన్ని సూచిస్తుంది. కాబట్టి ఈ మొదటి పఠణంలో మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే దేవుడు మనకు ప్రసాదించిన అధికారమును మనము మంచి కొరకై వినియోగించుకోవాలి అంతేకానీ దుర్వినియోగం చేసుకోకూడదు స్వార్థంగా జీవించకూడదు. పవిత్ర గ్రంథంలో చాలామంది తమ యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నారు దాని ప్రతిఫలంగా దేవుని యొక్క శిక్షణ పొందుతున్నారు.
- సౌలును దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు మొదటి రాజుగా చేశారు కానీ తన యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నారు. దేవుడు అతడిని తన పదవి నుండి తొలగిస్తున్నారు.
- సొలోమోనుకు దేవుడు ఎవరికి ఇవ్వనటువంటి జ్ఞానమిచ్చారు కానీ ఆయన కూడా తన యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని అనేకమంది అన్యులను వివాహమాడి తన దేశములోనికి అన్య  దేవుళ్ళను ఆహ్వానించారు దాని ప్రతిఫలంగా దేవుడి నుండి దూరమయ్యారు.
-ఆహాబును దేవుడు ఇశ్రాయేలుకు రాజుగా ఎన్నుకున్నారు కానీ ఆయన యెసబేలు రాణి వివాహమాడి తన రాజ్యంలో బాలుదేవతలను ఆరాధించుట ప్రారంభించారు దాని ప్రతిఫలంగా దేవుని యొక్క కోపమును, శిక్షను పొందుకున్నాడు.
-హామానుకు దేవుడు అధికారము కానీ అతడు హెబ్రీయులను హతమార్చాలనుకున్నాడు కానీ ఆయనే చనిపోయాడు.
-యూదా ఇస్కారియతకు దేవుడు అధికారం ఇచ్చారు కానీ ఆయన తన ధనమును దుర్వినియోగం చేసుకొని దేవుడిని అప్పగించాడు దాని ప్రతిఫలంగా ఆత్మహత్య చేసుకున్నారు.
ఈ విధంగా చాలామంది పవిత్ర గ్రంథంలో దేవుడు ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకోకుండా తమ స్వార్థం కోసం దానిని వినియోగించి దేవుని శిక్షకు పాత్రులగు చున్నారు. అధికారమివ్వబడినది మంచి కోసం. కాబట్టి వినయం కలిగి మంచిని చేస్తూ జీవించాలి.
ఈనాటి రెండవ పఠణంలో పౌలు గారు దేవుని యొక్క వివేకం గురించి గొప్పగా చెప్తున్నారు ఎందుకంటే దేవుడు అన్యుల ద్వారా కొంతమంది యూదులు మారే విధముగా చేశారు. పౌలు గారి యొక్క సువార్త పరిచర్య ద్వారా అనేకమంది యొక్క రక్షణకు దేవుడు కారకుడయ్యారు అందుకని దేవుని యొక్క మనసు ఎవరికి తెలుసు దేవుని యొక్క వివేకం చాలా గొప్పది ఆయన అందరి యొక్క రక్షణకు పాత్రుడు అని పౌలు గారు దేవుని యొక్క గొప్పతనం గురించి ఈనాటి రెండవ పఠణంలో తెలియచేస్తున్నారు.
ఈనాటి సువిశేష భాగంలో యేసు ప్రభు శిష్యులను ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్న అడుగుతున్నారు అది ఏమిటంటే ప్రజలు నా గురించి ఏమని భావిస్తున్నారు అని. ఎందుకు ఏసుప్రభు తన గురించి ఏమని అనుకుంటున్నారు అంటే ఆయన ఉన్నటువంటి ప్రదేశం కైసరియా ఫిలిప్పీ ఆ ప్రాంతం రాజకీయపరంగా పేరు ప్రసిద్ధిగాంచినది అక్కడే సీజర్,  సీజర్ ఆగస్టస్ ఇంకా చాలా మంది రాజకీయపరంగా ప్రసిద్ధిగాంచారు అలాగే ఏసుప్రభు యొక్క పుణ్యకార్యాలు చూసినటువంటి ప్రజలు కూడా ఆయనను పొలిటికల్(రాజకీయ) మెస్సేయగానే చూశారు కానీ రక్షకునిగా గ్రహించలేకపోయారు అందుకే ఏసుప్రభు ప్రజలు నన్ను ఏమని భావిస్తున్నారు అని అడుగుతున్నారు అయితే శిష్యులు వివిధ రకాలైనటువంటి సమాధానములు ఇస్తున్నారు. -కొందరు బప్తిస్మ యెహను  అంటున్నారు, ఎందుకంటే బప్తిస్మ యోహానును అన్యాయంగా శిక్షించారు ఆయన  ఎటువంటి పాపం చేయకుండా దేవుడికి విధేయుడై జీవించారు కాబట్టి ఒకవేళ ఆయన మరలా వచ్చి ఉండవచ్చని కొంతమంది యొక్క అభిప్రాయం.
- కొందరు ఏలియా అంటున్నారు ఎందుకంటే ఆయన ప్రవక్తల అందరిలో గొప్ప ప్రవక్త అలాగే మెస్సయ్య కన్నా ముందుగా వస్తాడు అని ఏలియా ముందుగానే చెప్పారు కాబట్టి  కొందరూఏలియా అనుకుంటున్నారు మలాకి 4:5. -కొంతమంది యిర్మీయా అని మరికొందరు యెషయా అని అనుకుంటున్నారు ఎందుకంటే దేవుడు ఇర్మియాను అలాగే యెషయాను సహాయం చేయుటకు పంపిస్తానని తెలియజేస్తున్నారు. అదే విధంగా కొంతమంది ప్రవక్తలలో ఒకరిని భావిస్తున్నారు ఎందుకంటే ఏసుప్రభు యొక్క పరిచర్య కూడా ధైర్యంగా అన్యాయమును ఎదిరించే విధముగా, ప్రజల కొరకు నిలబడే విధంగా ఉన్నది. కాబట్టి ప్రవక్తలలో ఒకరు అని భావిస్తున్నారు ఇది ప్రజల యొక్క అభిప్రాయం అయితే ఏసుప్రభు తన శిష్యులను కూడా అడుగుతూ ఉన్నారు మీరు నన్నే మని భావించుచున్నారు అందుకు పేతురు నీవు సజీవుడవగు దేవుని కుమారుడైన క్రీస్తువు అని సమాధానం ఇస్తున్నారు ఇది వ్యక్తిగతమైన సమాధానం. పేతురు గారు దేవుని యొక్క ప్రేరణ వలన ఈ సమాధానమిచ్చారు అలాగే పేతురు తన యొక్క వ్యక్తిగత అనుభవమును బట్టి కూడా ఈ సమాధానము చెప్పి ఉండవచ్చు ఎందుకంటే ఆయన జీవితంలో యేసు ప్రభువుతో పనిచేసిన సందర్భంలో అనేక రకములైన అద్భుత కార్యములు, ఎవరూ చేయనటువంటి గొప్ప కార్యములు తన యొక్క కనులారా తాను స్వయంగా చూసి ఉన్నారు కాబట్టి ఇంతటి మహత్తర కార్యములు చేసేది కేవలం దేవుడి అని ఆయన విశ్వసించి ఉన్నారు అందుకని నీవు సజీవుడవగు దేవుని కుమారుడైన మెస్సయ్య అని అందరికంటే ముందుగా సమాధానమిస్తున్నారు. పేతురు గారిని ఈ సమయంలో ఏసుప్రభు మెచ్చుకుంటూ తనమీద తన యొక్క సంఘమును నిర్మిస్తానని తెలియజేస్తున్నారు ప్రభువు పలికిన విధంగానే పేతురు యొక్క సమాధి మీద తిరుసభ నిర్మించబడినది.(Vatican St. Peter's Basilica). పేతురు గారికి ప్రభువు పరలోకపు తాళపు చెవులను అప్పగిస్తున్నారు అంటే పేతురు గారికి నాయకత్వ బాధ్యతలను అప్పజెప్తున్నారు. పేతురు గారు తన యొక్క బాధ్యతలను అన్నియు కూడా సక్రమముగా నెరవేర్చి దేవునికి విధేయత చూపించారు కాబట్టి ఈరోజు మనందరం కూడా దేవుడు మనకు ఇచ్చిన అధికారమును ఏ విధముగా మనందరం సద్వినియోగం చేసుకుంటున్నాం అని ధ్యానించుకోవాలి 
ఒక తల్లిగా బాధ్యతలు ఇవ్వబడ్డాయి, తండ్రిగ, గురువుగా ఉపాధ్యాయునిగా అనేక విధాలుగా మనకు బాధ్యతలు ఇవ్వబడ్డాయి వాటిని ఏ విధంగా నెరవేరుస్తున్నాం. కేవలము దేవుని యొక్క అనుభూతి ద్వారానే మనందరం ప్రభువు ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చగలం దానికి నిదర్శనం పునీత పేతురు గారి యొక్క జీవితం కాబట్టి వ్యక్తిగతంగా దేవుని యొక్క అనుభూతి పొందుతూ మంచిని చేస్తూ దేవుడికి ఇష్టకరమైన జీవితం జీవించుదాం.
Fr. Bala Yesu OCD

 

21వ సామాన్యఆదివారం

మొదటి పఠనం: యెషయా 22:15, 19-23

రెండొవ పఠనం: రోమియులు 11:33-36

సువార్త: మత్తయి 16:13-20

 

 

క్రీస్తునాధునియందు ప్రియమైనటువంటి సహోదరి, సహోదరులారా ఈనాడు మనమందరం  కూడా సామాన్యకాలపు 21  ఆదివారంలోనికి ప్రవెశించియున్నాం. ఈనాటి మూడు దివ్యగ్రంధ  పఠనాలను మనం ధ్యానించినట్లైతే  మూడు పఠనాలు మనకు తెలియజేసే అంశం ఏమిటంటే. దేవుడు మనకు ఇచ్చిన అధికారాన్ని విశ్వాసంతో పాటించినట్లయితే మన జీవితాలలో గొప్ప అద్భుతాలు జరుగుతాయని ఈ మూడు పఠనాలు మనకందరికీ తెలియజేస్తున్నాయి. ఆలా కాకుండా దేవునికి వ్యతిరేకంగా లేక ఇష్టానుసారంగా జీవించినట్లైతే షబ్న వాలే మన మందరము కూడా దేవుని యొక్క దండనకు గురి అవుతామని చెబుతున్నాయి.

నేటి సమాజంలో మనం చూస్తుంటాము అనేక మంది ఉన్నత అదికారాలలో ఉన్నపుడు వారు వారి ఇష్టానుసారంగా జీవిస్తున్న సమయాలలో వారి జీవితంలో  మనశాంతి లేకుండా పోతుంది  దానికి కారణం వారు దేవునికి విధేయులై జీవించకపోవటం. క్రైస్తవులమైన మన జీవితాలలో కూడా అంతే, ఎందుకంటే మనం దేవునికి ఇస్తానుసారంగా జీవిస్తే మన జీవితాలలో అద్భుతాలు జరుగుతాయి ఆలా కాకుండా దేవునికి వెతిరేకంగా జీవిస్తే కష్టాలు తప్పవు. దీనికి ఉదాహరణ  మనం ఈ మొదటి పఠనములో చూస్తున్నాము.

యెషయా గ్రంధంలో, యెషయా ప్రవక్తగా ఎన్నిక చేయబడిన రోజులలో షబ్న అనే అధికారి దేవునికి వెతిరేకంగా జీవిస్తున్నపుడు దేవుడు యెషయా ప్రవక్తను అతని యొద్దకు పంపిస్తూ తన అధికారం నుండి తనని తొలగించి ఎల్యాకీమును అతని స్థానములో రాజు యొక్క భవనంలో అధికారిగా చేయటం చూస్తున్నాము.అసలు దేవుడు షబ్నను ఎందుకు అధికారంలోనుండి తీసివేస్తునాడో ఇప్పుడు మనమందరము కూడా ఈ మొదటి పఠనములో చూద్దాము. షబ్న హిజ్కియా రాజు పరిపాలన కాలంలో షబ్న ఒక ఉన్నత అధికారిగా నియమింపబడ్డాడు.

రాజా భవనంలో ఒక అధికారి అంటే ఆటను రాజు తరవాత రాజు వంటి వాడు. అట్టి స్థానాన్ని పొందిన షబ్న, ఒక నాడు అసిరియా రాజు యూదా రాజ్యంపై దండెత్తి వస్తున్న సమయంలో హిజ్కియా రాజు యెషయా ప్రవక్తను పిలిచి యుధం గురించి అడిగినప్పుడు యెషయా ప్రవక్త చెబుతున్నాడు మీరు దేవునిపై ఆధారపడి, దేవునిపై విశ్వాసం ఉంచి ముందుకు బయలుదేరండి అంత మీకు మంచి జరుగును అని చెప్పినప్పుడు, షబ్న ప్రవక్తకు మరియు దేవునికి వెతిరేకంగా వెళుతూవున్నాడు అదేమిటంటే దేవునిపై ఆధారపడకుండా ఐగుప్త  రాజునూ సహాయమాడగమని చెబుతూ హిజ్కియా రాజును తప్పు దారిలో నడిపిస్తున్నాడు అందుకే దేవుడు షబ్నను తన అధికారంనుండి తొలగించి, ఆ అధికారాన్ని ఎల్యాకీముకు యిచ్చియున్నాడు.

ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏమిటంటే మనము కూడా మన జీవితంలో దేవునికి వెతిరేకంగా జీవిస్తూ ఉంటె మన జీవితాలలో కూడా కష్టాలు వస్తాయని మొదటి పఠనం తెలియజేస్తుంది. దేవుడు వివేకమంతుడు, విజ్ఞానవంతుడు కాబట్టి ఆయనయందు ఎవరైతే విశ్వాసంతో జీవిస్తారో అతి వారు దేవుని యొక్క బిడ్డలుగా ఎన్నుకోబడతారని తెలియజేస్తుంది.ఇక్కడ మనం అప్పుడైతే దేవుడు ఇచ్చిన మార్గంలో జీవిస్తామో దేవుడు మనలందరినీ నూరంతలాగా దివిస్తాడని రెండొవ పఠనము మనకు తెలియజేస్తుంది.

చివరిగా సువిశేష పతనాన్ని మనం ధ్యానించినట్లతే క్రీస్తు ప్రభు శిస్యులను అడుగుచున్నాడు, అదేమిటంటే మీరు నన్ను గూర్చి ఏమి అనుకొనుచున్నారు అని. అప్పుడు సీమోను పేతురు ప్రభువుతో అంటున్నారు నీవు సజీవ దేవునియొక్క కుమారుడని. ఇక్కడ మన గమనించాలి ఏవిధంగానైతే క్రీస్తు ప్రభు శిస్యులను అడిగాడో అదేవిధంగా ఈ రోజు నిన్ను నన్ను క్రీస్తుప్రభు అడుగుచున్నారు మీరు నా గురించి ఏమనుకుంటున్నారు అని. మరి మన సంధానం ఏమిటి పేతురు వాలే ఉందా లేదా అని మనలను మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే పేతురు క్రీస్తు ప్రభును దేవునిగా అంగికరించి క్రీస్తుపై విశ్వాసం ఉంచి జీవించాడు కాబ్బటి, క్రీస్తు ప్రభు తన అధికారాన్ని పేతురుకు అప్పజెబుతునాడు. మరి అధికారం ఏమిటని మనం ఛుసినట్లతే ఎవిధంగానైతే తండ్రి దేవుడు షెబ్నా యొక్క అధికారాన్ని ఎల్యాకీముకు ఇచ్చాడో  అదే విధంగా క్రీస్తు ప్రభు పరలోక రాజ్యపు యొక్క తాళాలను పేతురు చేతికి ఇస్తున్నాడు.

కాబట్టి క్రిస్తునాధునియందు ప్రియా సహోదయులారా ఈ రోజు మనమందరము కూడా ప్రార్ధించుకుందాం ఎటువంటి జీవితాన్ని నేను జీవిస్తున్నాను అని. పేతురు వాలే విశ్వాసం కలిగి ఎల్యాకీము వాలే ఉన్నత అధికారాన్ని అందుకుంటున్నానా లేక షబ్న వాలే అవిశ్వాసంతో జీవిస్తున్నానా అని. మనలను మనం ప్రశ్నించుకుంటూ ఈ యొక్క పూజ బలిలో పాల్గొందము.

 

Dn. Johannes VeeraPogu OCD

సామాన్యకాలపు ఇరవై ఏడవ ఆదివారము

సామాన్యకాలపు ఇరవై ఏడవ ఆదివారము  ఆదికాండము 2:18-24 హెబ్రీయులకు 2:9-11 మార్కు 10:2-16 క్రీస్తునాధునియందు ప్రియ సహోదరీ సహోదరులారా, దేవుని బిడ్డ...