4, ఆగస్టు 2023, శుక్రవారం

సామాన్య కాలపు

పద్దెనిమిదవ ఆదివారం

(రక్షకుని దివ్యరూపధారణ మహోత్సవము)

దానియేలు : 7: 9-10,13-14

2పేతురు:1: 16-19

మత్తయి : 17: 1-9

దేవుని సేవలో సదా జీవిస్తున్నటువంటి ప్రియా సహోదరి సహోదరులారా !

ఈనాడు తల్లి శ్రీ సభసామాన్య కాలపు పద్దెనిమిదవ ఆదివారం మరియు రక్షకుని దివ్యరూపధారణ మహోత్సవాన్ని కొనియాడుతుంది.

ఈనాటి మూడు పఠనాలు ఏమి తెలియజేస్తున్నాయంటే, ప్రతి ఒక్కరు కూడా విశ్వాస పాత్రులుగా దేవుని యందు జీవిస్తూరక్షకుని దివ్యరూపం ధారణ వలె  పవిత్రతతో  జీవించమనిఆహ్వానిస్తున్నాయి.

మొదటి పఠనంలో చూసినట్లయితే  దానియేలు ప్రవక్త  దైవ దర్శనాన్ని పొంది తనలో దైవ స్ఫూర్తిని తన ప్రజలకు చాటి చెప్పి వారిలో దైవ భక్తి అనే విత్తనమును నాటి వృక్షమువలె విశ్వాస బలమును వారి హృదయాలలో ఏర్పరిచినటువంటి గొప్ప ప్రవక్త  ప్రియా సహోదరి సహోదరులారా .అదే విధంగా రెండవ పఠనంలో పునీత పేతురుగారుయేసుప్రభు యొక్క  దివ్యరూపాన్నిగాంచి తన ప్రజలకు విధంగానైతే తన అనుభవాన్ని తెలియపరుస్తూ ఇదిగో మీరందరు కూడా నిజ స్వరూపుడు అయినటువంటి రక్షకుడి పై విశ్వాసముంచి పవిత్రతతో నిర్మలమగు హృదయముతో  కలిగి ఉండమని తెలియజేస్తున్నాడు.

అదే విధంగా సువిశేషములో మనము క్లుప్తంగా పరిశీలించినట్లయితే, పూర్వ వేదములో దేవుడు  మోషే, ఏలీయాకు కొండా మీదనే దర్శనమిచ్చాడు. ఇవిరెండు సంఘటనలు క్రీస్తునందు నెరవేరాయాన్నీ భావించవచ్చు ప్రియా సహోదరి సహోదరులారా. పేతురుకి దర్శనం వల్ల గొప్ప దైవాను భూతి  కలిగింది. కనుక అతడు మనం ఇక్కడనేఉండుట మంచిది అని మీ అనుమతైనిచో  నేను నీకు, మోషేకు, ఏలీయాకు మూడు శిబిరములను నిర్మింతును అని పలికియున్నాడు ప్రియా సహోదరి సహోదరులారా. ఇలాంటి సంఘటన మన జీవితములో చూస్తుంటాము.

ఉదాహరణకు, మనం సినిమా చూస్తున్నపుడు ఏదైనా మంచి సన్నివేశం ప్రదర్శించినప్పుడు సన్నివేశాన్ని అలానే ఉంచండి అని మేనేజరుతో చెప్పలేం కదా ! చెప్పినా ఆయన ఉంచడు కదా! అలాంటిదేజీవితం కూడా ప్రియా సహోదరి సహోదరులారా. ఎందుకంటే, కొన్ని సార్లు పవిత్రమైన విషయములు కానీ వస్తువులైనా కానీ కొద్దీ సేపు ఉండాలని అనిపిస్తుంది. అదేవిధంగా పేతురు కూడా ఉండాలని అనుకున్నాడు కానీ అది సాధ్యం కాలేదు. మన జీవితములో కూడా మనము చాల కోల్పోతూ ఉంటాము కానీ సమయము వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించాలిప్రియా సహోదరి సహోదరులారా.

చివరిగా దివ్యరూపధారణ మనకు విధంగా సూచిస్తుందంటే, ఒక పవిత్రతను తెలియపరుస్తుంది. ఇదిగో నేను నా యొక్కా పవిత్ర రూపాన్ని మీకు అందించాను. మీరు కూడా పవిత్రులుగా ఉండి, ఇతరులను తమ యొక్కాబలహీనుతలనుండివైదొలగి పవిత్రులుగా చేసి నా యొక్కా నామాన్ని సాటి చెప్పండి అనే భావాన్ని చూస్తున్నాము ప్రియా సహోదరి సహోదరులారా. ఎంతోమంది యొక్కా ఉన్నతమైన, మహిమపరపబడిన పవిత్రతను పొందుటకు ఎన్నో విధాలుగా సాహసిస్తుంటాము. ఎందుకంటే ప్రస్తుత కాల జీవితము మీద విరక్తి కలిగి ఇదిగో నేను ఒక క్రైస్తవుడుని, క్రైస్తవురాలిని అని అలోచించి  పవిత్రమైన జీవితాల కోసము ప్రాకులాడుతుంటాం. మరి ముఖ్యముగా పూర్వ కాలములో ఎంతో మంది పునీతులు కూడా పవిత్రతకోసం ఎన్నో విధాలుగా తమ యొక్కా శరీరాన్ని బంధించి వ్యామోహాల బంధాలను త్యజించి క్రైస్తవ జీవితం కోసం తమ ప్రాణాలను సమర్పించిన పవిత్రతను పొంది ఇప్పుడు గొప్ప దేవుని రాజ్య బిడ్డలుగా మరియు పునీతులుగా మన తల్లి శ్రీ సభలో పిలువబడుతున్నారు ప్రియా సహోదరి సహోదరులారా.   

బ్రదర్ స్టాలిన్ ఓ సీ డీ

 

 


31 వ సామాన్య ఆదివారము

31 వ సామాన్య ఆదివారము  ద్వితియెపదేశకాండము 6:2-6 హెబ్రీయులు 7:23-28 మార్కు 12:28-34             ప్రియా దేవుని బిడ్డలరా ఈ రోజు మనమందరము కూడా 3...