17, జూన్ 2023, శనివారం

11 వ సామాన్య ఆదివారం

11 వ సామాన్య ఆదివారం

నిర్గమ 19:2-6

రోమి 5:6-11

మత్తయి 9:36-10:8

 ఈనాటి దివ్య పఠనాలు దేవుని యొక్క సేవకుల గురించి తెలియజేస్తున్నాయి. మనందరిని కూడా దేవుని యొక్క సువార్త పరిచర్యకు ప్రభువు ఎన్నుకొన్నారు. మనం కూడా పరిచర్య చేస్తూ ఈ లోకంలో ఉన్న వారిని పరలోకం వైపు నడిపించాలి.

ఈనాటి మొదటి పఠనం లో యావే దేవుడు ఇశ్రాయేలు ప్రజల పట్ల ఉన్న ప్రేమను చూపిస్తున్నారు.

యావే  దేవుడు ఇశ్రాయేలును ప్రత్యేకంగా ప్రేమించి, ఎన్నుకొని తన సొంత వారిని గా చేశారు.

ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఐగుప్తు నుండి విడిపించిన తరువాత ఏ విధంగా వారిని ఎడారిలో నడిపించి వారి యొక్క ప్రతి అవసరంలో తోడుగా ఉన్నారో తెలిపారు.

ఏ విధంగానైతే గరుడ పక్షి తన పిల్లలను రెక్కల మీద మోసుకొని పోవునో  అలాగే తాను కూడా ఇస్రాయేలు ప్రజలను మోసుకొని వచ్చారు అని తెలిపారు.

ప్రజలందరిలో కన్నా ఇశ్రాయేలు ప్రజలే మొదటిగా ఎక్కువగా ప్రేమించబడ్డారు. అందుకనే దేవుడు  వారికి అంత ప్రాధాన్యత ఇచ్చి వారిని కంటికి రెప్పలాగా కాపాడారు.

గరుడ పక్షి తన బిడ్డలకు ఎటువంటి ఆపద కలగకుండా కాపాడినట్లు దేవుడు కూడా ఇస్రాయిలను కాచి కాపాడారు. ఇస్రాయేలు ప్రజలు ఎడారిలో ప్రయాణించినప్పుడు ఎటువంటి ఇబ్బందులు కలగలేదు దేవుడు వారికి సకాలంలో అంతయు సమకూర్చారు.

ఈ మొదటి పఠనం లో  యావే దేవుడు ఇశ్రాయేలు ప్రజలను యాజక రూపమైన రాజ్యాంగాను, పరిశుద్ధమైన జనం గాను ఎన్నిక చేసిన విషయంను వెల్లడిస్తున్నారు.

ఎందుకు దేవుడు ఇశ్రాయేలు ప్రజలందరినీ యాజకులు రూపమైన రాజ్యాంగ చేశారంటే ప్రజలందరిలో ఇశ్రాయేలు ప్రజలు సుమాతృకమైన జీవితాన్ని జీవిస్తూ ఇతరులను దేవుని చెంతకు చేర్చాలని ప్రభువు కోరిక.

యాజక రూపమైన రాజ్యం, పరిశుద్ధమైన జనం ఎందుకంటే ఇస్రాయేలీయులు వెలుగుగా ఉండుట కొరకు, ఆ వెలుగు ఇతరులను యావే దేవుని చెంతకు నడిపించుటకు ప్రభువు వారిని యాజక రాజ్యంగా చేశారు.

యాజకుడు ప్రజలను దేవుని చెంతకు నడిపించిన విధంగా ఇశ్రాయేలీయులు కూడా అన్యులను దేవుని చెంతకు నడిపిస్తారని.

యావే దేవుడు ఇస్రాయేలు ప్రజల పట్ల అంత ప్రేమ చూపటానికి కారణం ఏమిటంటే సమస్త జనుల కంటే వారు లెక్కకు తక్కువే వారికి సైనిక బలం తక్కువే నిరాకరించబడిన వారే  అందుకే తక్కువ కలిగిన వారిని ప్రభువు ప్రేమిస్తూ వారిని విముక్తులను చేసి తన సొంత ప్రజలుగా చేశారు.

దేవుడు అందరినీ ప్రేమించారు అందరూ ఆయనకు చెందినవారే, ఒక ప్రజలను ఎన్నుకొని తన యొక్క గొప్పతనం, ప్రేమను చాటి చెప్పాలన్నది ప్రభువు ప్రణాళిక.

అన్యుల  యొక్క నిమిత్తమే ఆయన ఇశ్రాయేలు ప్రజలను ఎన్నుకున్నారు, మానవులందరి రక్షణార్థం ఆయన ఇశ్రాయేలు ప్రజలను ఒక సాధనంగా ఏర్పరుచుకున్నారు.

యాజకులు దేవునికి మానవులకు ఏ విధంగా మధ్యవర్తులుగా ఉన్నారో  అలాగే ఇస్రాయేలు ప్రజలు కూడా అన్యజాతి ప్రజలకు మధ్యవర్తులే, అందుకనే దేవుడు వారిని యాజక రూపమైన రాజ్యమని, పరిశుద్ధమైన రాజ్యమని సంబోధించారు.

ఈనాటి రెండవ పఠనం లో  పౌలు గారు యేసు క్రీస్తు ప్రభువు మన మీద చూపించిన అపారమైన ప్రేమను గురించి తెలుపుచున్నారు.

మనం పాపాత్ములుగా ఉన్నప్పటికీని, బలహీనుల మైనప్పటికిని, దేవుడు మనలను అధికంగా ప్రేమించారు. ఆయన ప్రేమను పొందుటకు అనర్హులమైనప్పటికిని ఆయన తన కుమారుని రక్తం చేత మనలను రక్షించి నీతిమంతులను చేశారు, కాబట్టి మనం కూడా దేవుని యొక్క సొంత ప్రజలం దేవుని చేత ఎన్నుకోబడిన ప్రజలం పవిత్ర జనం కాబట్టి ఆయన యందు మనం ఆనందించాలి.

ఈనాటి సువిశేష పఠనం లో   యేసు ప్రభువు శిష్యులను సువార్త  సేవకు పంపిచ్చుట విధానంను చదువుకుంటునాం. ఈ లోకంలో ఉన్న ప్రజలందరిని సువార్త పరిచర్య ద్వారా పవిత్రపరచుటను దేవుని ప్రజలుగా చేయుటకు శిష్యులను ఎన్నుకొని వారిని వివిధ ప్రాంతాలకు సేవ నిమిత్తమై పంపిస్తున్నారు. ఏసుప్రభువు ఈ 12 మంది శిష్యులను తన యొక్క సాధనములుగా ఎన్నుకుంటున్నారు. వారిని ఎన్నుకొని వారి ద్వారా మిగతా వారిని కూడా తన వారిగా ఎన్నుకుంటున్నారు.

ఈ పన్నిద్దరు  శిష్యులు నూతన యాజక ప్రజలకు పునాది. ఈ సువిశేషంలో మనం గమనించినట్లయితే యేసు ప్రభువు కాపరిలేని ప్రజలను చూసి ఆయన కడుపు తరుగుకొని పోయాను అని చెప్పారు తన యొక్క కరుణ వలన ప్రభువు మన వైపు తిరిగి మనలను ప్రేమించారు.

దేవుడు పని ఇద్దరిని ఎన్నుకున్నది పంపించుట కొరకే - మార్కు 3-13-14.

ప్రజల యొక్క అత్యవసరాలను ప్రభువు గుర్తించి వారిని రక్షించుట కొరకు 

ప్రభువు శిష్యులను పంపిస్తున్నారు శిష్యులను రెండు రకాలైన బాధితులను శిష్యులకు అప్పచెప్పుచున్నారు:

1. ప్రకటించుట

2. స్వస్థపరచుట

1. ప్రకటించుట :

మొట్టమొదటిగా ప్రభుశులను దైవ రాజ్యం సమీపించినది అని ప్రకటించమని కోరుచున్నారు. శిష్యులను అన్నింటిలో సంసిద్ధం చేసిన తర్వాత ప్రభువు వారిని దైవ రాజ్యం గురించి ప్రకటించమన్నారు. దైవ ప్రేమ దేవుని యొక్క రక్షణ గురించి అదే విధంగా పవిత్రంగా జీవించుట గురించి ప్రకటించమని ప్రభువు ఆదేశించారు.

జ్ఞానేస్నానం పొందిన మనందరం కూడా ప్రభువును గురించి ప్రకటించాలి. దేవుని యొక్క కరుణ మంచితనం, జాలి, అన్నిటి గురించి ప్రకటించాలి. ఏసుప్రభు యొక్క అపోస్తులు తమ యొక్క వ్యక్తిగత ఆలోచనలు కాదు ప్రకటించవలసింది కేవలం దేవుని సందేశమే దేవుని దగ్గర నుండి స్వీకరించినది మాత్రమే ప్రకటించాలి.

బాప్తిస్మ యోహాను ప్రకటించింది అదియే - మత్తయి 3:2

ఏసుప్రభు సందేశం అదియే - మత్తయి 4:17,23

అలాగే ప్రతి ఒక్కరూ ప్రభువుని యొక్క రక్షణ సందేశంను ప్రకటించాలి.

2. స్వస్థత పరచుట:

ఏసుప్రభు శిష్యునికి అధికారం ఇచ్చి వ్యాధులను నయం చేసి అనుగ్రహంను దయచేసి ప్రభువు శిష్యులను స్వస్థతపరిచె అనుగ్రహం ఇచ్చారు. ఎందుకంటే వారి యొక్క స్వస్థత వరం ద్వారా ప్రజలందరూ కూడా ఏసుప్రభువు శారీరక గాయాలను అనారోగ్యాలను మాన్పుతారు అని. అదేవిధంగా ఆధ్యాత్మిక సంబంధమైన స్వస్థతను కూడా ప్రభు దయచేశారు. మన ఈ నాటి పట్టణాల ద్వారా నేర్చుకోవలసిన అంశాలు ఏమిటంటే.

1. మనం ఎన్నుకొనబడిన ప్రజలు కాబట్టి పవిత్రంగా జీవించాలి.

2. వెలుగుగా ఉంటూ ఇతరులను వెలుగులోనికి నడిపించాలి.

3. క్రీస్తు ప్రభువు గురించి ప్రకటించాలి.

4. స్వస్థత నిచ్చే వ్యక్తులుగా మనం మారాలి.


FR. BALAYESU OCD

ఇరవై ఎనిమిదవ ఆదివారము

సొలొమోను జ్ఞానం గ్రంధం 7:7-11 హెబ్రియులు 4:12-13 మార్కు 10:17-30  క్రీస్తునాదునియాందు ప్రియా సహోదరి సహోధులరా, ఈనాడు మనమందరం కూడా సామాన్య కాల...