16, సెప్టెంబర్ 2023, శనివారం

24 వ సామాన్య ఆదివారం

24 వ సామాన్య ఆదివారం
సిరాకు27:30-28:7, రోమా 14:7-9, మత్తయి 18:21-35
ఈనాటి దివ్య పఠణములు క్రైస్తవ జీవితంలో‌ కలిగి ఉండవలసిన ఒక ముఖ్యమైన లక్షణం/గుణం గురించి తెలియజేస్తూ ఉన్నవి‌. అది ఏమిటంటే క్షమాగుణం. మనలను గాయపరిచిన వ్యక్తులను క్షమించుట అలాగే వారితో సఖ్యత పడి జీవించుట కష్టం అయినప్పటికీ ప్రభువు దానిని మన జీవితంలో పాటించమని బోధిస్తున్నారు. చాలా సందర్భాలలో చాలామంది వ్యక్తులు అనేక రకాలైనటువంటి పాపాలు, మోసాలు, తప్పిదాలు చేస్తూ ఉంటారు అలాంటి వారిని క్షమించుట కష్టం కానీ ఈనాటి పఠణములు మనందరం కూడా క్షమించే మనస్సును కలిగి ఉండాలని తెలుపుచున్నవి. అన్యాయం చేసిన వారిని ద్వేషిస్తూ ఉంటాం అలాగే దూరం పెడుతూ ఉంటాం. మోసం చేసిన వారిని ఎన్నడూ కూడా క్షమించలేకపోతున్నాము, అబద్ధం ఆడిన వారిని సహించలేకపోతున్నాం. దేవుడు మనము తన యొక్క అనుచరులుగా ఉండాలి అంటే మన క్రైస్తవ జీవితం పరిపూర్ణం కావాలంటే మనందరం కూడా ఈ క్షమాభావమును కలిగి ఉండి పరస్పరము క్షమించుకొని అంగీకరించుకొని జీవించమని ప్రభువు కోరుచున్నారు. ఏసుప్రభు క్షమా అనే అంశమును పరాకాష్టకు తీసుకుని వెళ్లారు. క్షమించుట ద్వారా మనకు బంధం ఏర్పడుతుంది అలాగే ఎదుటి వ్యక్తిని మరొకసారి మనము నమ్ముతున్నాం.
ఈనాటి మొదటి పఠణంలో యావే దేవుడు 'ఏ వ్యక్తియు పగ, కోపము పెంచుకోకుండా ఒకరి తప్పిదములు ఇంకొకరు క్షమించుకొని జీవించమని తెలుపుచున్నారు.  సిరాకు 27:30 వ వచనములో‌ ప్రభువు పలికే మాటలు ఏమిటంటే పగ, కోపము ఘోరమైనవి అని. పాపి ఈ రెండిటికి వశుడగును అని తెలుపుచున్నారు. దేవుని యెడల భయము విశ్వాసము కలిగినటువంటి వ్యక్తి  తన యొక్క జీవితములో పగ పెంచుకొనుటకు, కోపమును కొనసాగించుటకు ఎన్నడూ ఇష్టపడడు ఎందుకంటే దేవుని యొక్క వాక్యానుసారంగా ఆయన/ఆమె జీవించాలి అనుకుంటున్నారు కాబట్టి అతడు/ఆమె తన జీవితమును సరి చేసుకుని దేవుని యొక్క వాక్కునుసారముగా జీవిస్తూ ఉంటారు.ఎవరైతే దైవ భయము లేకుండా పాపములో జీవించాలి అనుకునేటటువంటి వారు మాత్రమే బ్రతికినంత కాలం  పగ, కోపము పెట్టుకొని జీవిస్తూ ఉంటారు అలాంటి వారిని ప్రభువు శిక్షిస్తానంటున్నారు వారి పాపములను, క్షమించమంటున్నారు, వారి ప్రార్థనలను ఆలకించనంటున్నారు.ప్రభువు నరుల యొక్క పాపములెల్ల గమనించును ఎవరైతే పగ తీర్చుకుంటూ ఉంటారో వారి మీద ప్రభువు కూడా పగ తీర్చుకుంటా అంటున్నారు. మన యొక్క అనుదిన జీవితంలో ఎదుటి వ్యక్తి చేసినటువంటి తప్పిదములను పరస్పరము క్షమించుకుని ముందుకు వెళ్ళాలి. చాలా సందర్భాల్లో మన యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటాయంటే కంటికి కన్ను, పంటికి పన్ను అలాగే దెబ్బకు దెబ్బ మనందరం కూడా ప్రతీకారం తీర్చుకోవడానికి పరుగులెడుతుంటాం. అన్యాయం చేసిన వారి యెడల పగ, ద్వేషం అసూయ, కోపము మొదలైనటువంటి దుర్గుణాలన్నీ కూడా పెంచుకొని పోతుంటాం. ద్రోహం చేసిన వ్యక్తిపై మనము పగ సాధించుట సర్వసాధారణం అయిపోతుంది. కాబట్టి ప్రభువు ఇవన్నీ కూడా విడిచి పెట్టేసి మన పాపాలు క్షమించబడాలి అంటే మనము కూడా ఇతరుల యొక్క పాపాలు క్షమించమని తెలుపుచున్నారు.
 క్షమాపణ లేని చోట ప్రేమ ఉండదు, ప్రేమ లేని చోట శాంతి, సమాధానం, సంతోషం ఉండవు శాంతి సమాధానము లేని చోట నిజమైన క్రైస్తవ జీవితం లేదు కాబట్టి ఒకరిని ఒకరు క్షమించుకోవాలి. మనము ఎదుటి వ్యక్తి యొక్క పాపములు మన్నించినచో అప్పుడు దేవుడు కూడా మన యొక్క అనేక అపరాధములను మన్నిస్తారని తెలుపుచున్నారు. అదే విధముగా ప్రభువు పరులు చేసిన తప్పులను మీరు క్షమింపనీ ఎడల మీ తండ్రి మీ తప్పులను క్షమింపరు అని తెలుపుచున్నారు (మత్తయి 16:15). మన సోదరీ సోదరులను మనము అంగీకరించకపోతే దేవుడు మనల్ని తన బిడ్డలగా స్వీకరించరు. ఈ మొదటి పఠణంలో చాలా చక్కగా రచయిత మనము ఇతరులను క్షమించి అలాగే దేవుని క్షమాపణ కోరమంటున్నారు. అనేకసార్లు మనము దేవుడిని మన పాపాలు క్షమించమని కోరుతున్నాము కానీ ఎదుటి వ్యక్తి యొక్క తప్పిదాలను క్షమించడానికి మనకి ఏమాత్రం మనస్సు రావటం లేదు కొన్నిసార్లు దేవుడి యొక్క వాక్యము హెచ్చరించినప్పటికీ దీనిని అంతగా ఎవరు పట్టించుకొ‌నుటలేదు. అనేక సందర్భాలలో ప్రభువు అంటున్నారు బలిపీఠ సన్నిధికి నీ కానుకలను తెచ్చినప్పుడు నీ సోదరుడిపై నీకు వ్యాజ్యమునట్లయితే, ఆ కానుకను పీఠము చెంతనే వదిలిపెట్టి, పోయి, నీ సోదరునితో సఖ్యపడి తిరిగి వచ్చి నీ కానుకను చెల్లింపుము అని ప్రభువు పలుకుచున్నారు (మత్తయి 5:23-24). మన యొక్క కోపము పగ మనల్ని ఇంకా పాపం చేయటానికి కారణం అవుతూ ఉంది కాబట్టి ఆ రెండిటిని మనందరం కూడా విడిచిపెట్టుటకు ప్రయత్నం చేయాలి. పౌలు గారు ఈ విధంగా అంటున్నారు ఒకవేళ మీకు కోపం వచ్చినచో ఆ పాపము మిమ్ములను పాపములోకి లాగుకొనిపోకుండ చూచుకొనుడు. సూర్యుడు అస్తమించులోగా కోపం చల్లారిపోవలయును (ఎఫే4:26). మన కోపం మొత్తము సాయంత్రంలోగా నశించిపోయి ఇతరులతో సఖ్యపడాలి అప్పుడు మాత్రమే సంతోషంగా జీవించగలుగుతాం. మన జీవితం శాశ్వతం కాదు కాబట్టి ఏదో ఒక రోజున మరణిస్తాము, అలాగే మన దేహం కూడా కుళ్ళిపోవును. మనమే శాశ్వతం కాదు కాబట్టి మరి పగలను ఎందుకు బ్రతికినంత కాలం ఉంచుకోవాలి? కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తూ మన కోపము మానుకొని, తప్పిదాలు క్షమించుకుని ఇతరులతో కలిసిమెలిసి జీవించాలి అన్నది ఈనాటి మొదటి పఠణం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నారు. .
ఈనాటి రెండవ పఠణంలో పునీత పౌలు గారు మనము జీవించునను, మరణించినను ప్రభువుకు చెందినవారమే అని పలుకుతున్నారు అనగా దేవునికి చెందినవారు ఎల్లప్పుడూ స్వార్థం లేకుండా ఎటువంటి మనస్పర్ధలు లేకుండా కలసి మెలసి అన్యోన్యంగా జీవించాలిని తెలుపుచున్నారు. దేవునికి చెందినవారము కాబట్టి దేవుని యొక్క జీవితమును ఈ లోకంలో ఉన్న వ్యక్తులకు చూపించాలి. దేవుని జీవితం క్షమా, దయ, ప్రేమ, జాలి, కలిగినటువంటి జీవితం వాటన్నిటినీ కూడా మన జీవితంలో పాటించాలి.
ఈనాటి సువిశేష భాగములో పేతురు గారు ఏసుప్రభువుని ఒక ప్రశ్న అడుగుతున్నారు "నా సోదరుడు నాకు ద్రోహం చేయుచుండా నేను ఎన్ని పర్యాయములు అతనిని క్షమింపవలెను?". దానికి సమాధానంగా ప్రభువు ఒక ఉపమానములు తెలియజేస్తూ దేవుడు ఏ విధంగా  మానవాళిని క్షమిస్తున్నారు అని తెలుపుచున్నారు అదేవిధంగా మానవుడు క్షమింపబడిన తర్వాత తన తోటి మానవుడిని క్షమించుట మరచిపోతున్నాడు అనే సత్యమును కూడా వెల్లడి చేస్తున్నారు. యూదా మత బోధకుల ప్రకారము తప్పు చేసిన సహోదరుని కనీసం మూడుసార్లు మన్నించాలి. దీనికి సంబంధించిన ఆధారాలు ఆమోసు గ్రంథంలో మనందరికీ కనిపిస్తాయి.(ఆమోసు 1:3, 6,9,11,13; 2:1,4,6). మూడు తప్పులు వరకు దేవుడు మన్నిస్తాడు నాలుగవసారి శిక్షిస్తాడు అని ఆనాటి యొక్క యూదా బోధకుల అభిప్రాయం. అయితే పేతురు గారు మూడుకు తన యొక్క ఉదార స్వభావంతో ఇంకొక నాలుగు సార్లు  అనుసంధానం చేసి మొత్తం 7 సార్లు క్షమించాలి అని అడుగుతున్నారు. 7 యూదులకు పవిత్ర సంఖ్య, పరిపూర్ణతకు గుర్తు అందుకని పేతురు గారు ఏడు సార్లు క్షమించాలా అని అడుగుతున్నారు. దానికి సమాధానంగా ప్రభువు ఏడు కాదు ఏడు డెబ్బది సార్లు అని చెప్తున్నారు. ఏసుప్రభు యొక్క ఉద్దేశం ప్రకారము క్షమాపణకు హద్దులు లేవు అది నిరతము జరుగుతూ ఉండాలి, ద్రోహిని ఎన్నిసార్లైనా క్షమించటానికి సిద్ధంగా ఉండాలి. హద్దులు లేనటువంటి క్షమాపణ నిజమైన మన్నింపు. క్షమాపణ అనేది కేవలం పెదవుల ద్వారా మాత్రమే కాకుండా హృదయపూర్వకముగా ఉండాలి ఎందుకంటే చాలా సందర్భాలలో మనము క్షమిస్తాము కాని వారు చేసినటువంటి గాయమును మరిచిపోవు. మనం హృదయపూర్వకంగా ఇతరుల యొక్క తప్పిదాలు క్షమిస్తేనే మనము వారి యొక్క గాయమును మరిచిపోతాం. మనము అన్నివేళలా, అన్నిచోట్ల దేవుని యొక్క క్షమా గుణాన్ని కలిగి క్షమించే జీవించాలి. క్షమించుట కష్టమే కానీ అసాధ్యము కాదు. మానవులమైన మనందరికీ ఇది కష్టమైనప్పటికీ దేవుని యొక్క సహకారంతో మన గర్వాన్ని అనుచుకొని వినయంతో జీవించినట్లయితే క్షమించుట మనకు సాధ్యపడుతున్నది. ఏసుప్రభు క్షమించుటలో మనందరికీ ముఖ్య నిదర్శనంగా ఉంటున్నారు. ఆయన సిలువ మీద వేలాడుచు తన తండ్రికి చేసిన చివరి ప్రార్థన "తండ్రి వీరు చేయనదేమో వీరు ఎరుగరు వీరుని క్షమింపుము" అని పలుకుచున్నారు  (లూకా23:34). ఆయన ఎడల తప్పిదాలు చేసిన వారందరినీ కూడా ప్రభువు ప్రేమతో క్షమించారు. కావున దేవుని యొక్క సహకారంతో మనల్ని మనం తగ్గించుకొని ఇతరులను క్షమించాలి. ఈ సువిశేష భాగములో క్షమింపబడిన వ్యక్తిని మనందరం కూడా పోలివున్నాం, ఎందుకంటే ఆయన యొక్క అప్పు మొత్తం కూడా మన్నించబడినప్పటికీ, తన దగ్గర కొంత రుణము ఉన్నటువంటి వ్యక్తిని ఆయన క్షమింపలేకపోతున్నారు. మనం కూడా అనేకసార్లు దేవుని యొక్క క్షమను పొందుతాం. ప్రతి ఒక్కరికి తెలుసు తాను వ్యక్తిగతంగా, రహస్యంగా, చీకటిలో ఎన్ని తప్పులు చేస్తున్నారని, ఎవరికీ తెలియకుండా ఎన్ని మోసాలు చేస్తున్నారని అయినప్పటికీ దేవుడిని క్షమాపణ కోరుకున్న సమయంలో దేవుడు వారి పాపాలు క్షమిస్తున్నారు కానీ క్షమాపణ పొందిన వ్యక్తులే తమ తోటి వారిని క్షమించలేకపోతున్నారు. క్షమాగుణం ద్వేషపు సంకెళ్లను తెంచి వేస్తుంది. అది ప్రేమ ఔన్నత్యాన్ని తెలియజేస్తుంది. క్షమించే గుణం రోజు మనము అలవర్చుకోవాలి పవిత్ర గ్రంథంలో చాలా ఉదాహరణలు ఉన్నాయి తప్పు చేసిన వారిని తమ తోటి వారు ఏ విధంగా క్షమించారని.
- ఏసావు యాకోబును క్షమించారు
- ఏసేపు తనను అమ్ముకున్న అన్నలను క్షమించారు
- యావే దేవుడు ఇశ్రాయేలీయుల పాపములను క్షమించారు
- దావీదు తనను చంపివేయాలనుకున్న సౌలును క్షమించారు
-తప్పిపోయిన కుమారుడి యొక్క తప్పిదములను తండ్రి క్షమించారు
-ఏసుప్రభు వ్యభిచారమున పట్టుబడిన స్త్రీ యొక్క పాపమును క్షమించారు
ఈ విధంగా మనందరం చాలా మందిని చూస్తూ ఉన్నాం. ఎదుటి వ్యక్తి ఎంత అన్యాయం చేసినప్పటికీ దానిని మనసులో ఉంచుకొనకుండా క్షమించటం వీరి ద్వారా మనందరం కూడా నేర్చుకోవాలి. వాస్తవానికి దేవుడు మనందరి నుండి కూడా కోరుతూ ఉన్నది ఇలాంటి జీవితమే క్షమా గుణాన్ని కలిగి జీవించి ఒకరితో ఒకరు స్నేహ సంబంధము కలిగి ఉండమని. కాబట్టి పగలకు, ప్రతీకారాలకు పోకుండా, ద్వేషాలు- ఈర్షలు పెంచుకోకుండా సోదర భావంతో క్షమాగుణము కలిగి జీవించుదాం. ఈ భూలోకంలో ఉండగానే మన జీవితాలను సరి చేసుకొని అందరితో కలిసి మెలిసి జీవించడానికి ప్రయత్నించేద్దాం.
Fr. Bala Yesu OCD

పాస్కా ఆరవ ఆదివారం

పాస్కా ఆరవ ఆదివారం  అపో 10:25-26, 34-35,44-48 1యోహను 5:7-10 యోహాను 15:9-17 ఈనాటి పరిశుద్ధ గ్రంథములు పఠనములు దేవుని యొక్క ప్రేమ గురించి మరియు...