15, ఏప్రిల్ 2023, శనివారం

పాస్కా 2వ ఆదివారం

పాస్కా 2వ ఆదివారం

అ. కా. 5: 12-16

దర్శ 1: 9-11, 12-13, 17-19

యోహాను 20 : 19 - 31

ఈరోజు తల్లి శ్రీసభ దివ్యకారుణ్య పండుగను కొనియాడుచున్నది. ఈరోజు దివ్య పఠనాలు కూడా దేవుని యొక్క దయా, కరుణ గురించి బోధిస్తున్నాయి. దేవుని యొక్క కరుణ చల్లని చూపు అందరికి అవసరం దాని ద్వారానే మనం ప్రభువు యొక్క అనుగ్రహాలు పొందుచున్నాము, బ్రతుకుచున్నాం.

దివ్య కారుణ్య పండుగ భక్తి పునీత పౌస్టీనా ద్వారా ప్రారంభమైంది. ప్రభువు ఆమెకు ఏప్రిల్ 30 , 2000 లో ఇచ్చిన దర్శనంలో ప్రభువు ఆమెతో ఈ విధంగా అన్నారు "మానవజాతి, నమ్మకంతో తన కరుణను ఆశ్రయిస్తే వారికి శాంతి లభిస్తుందని" తెలిపారు. పరిశుద్ధ రెండవ జాన్ పాల్ పాపుగారు ఈ పండుగ ప్రతి సంవత్సరం జరుపుకోవాలని ప్రకటించారు. పరిశుద్ధ ప్రాన్సిస్ పాపుగారు దీనిని అధికారికంగా జరుపుకోవాలని తెలిపారు.

పౌస్టీనా గారికి దేవుడు మూడు ముఖ్యమైన బాధ్యతలను అప్పజెప్పారు.

1 . ఆత్మల కోసం ప్రార్ధించుట : దేవుని యొక్క అనంతమైన కరుణకు ఈ ఆత్మలను సమర్పించి వారి కొరకు ప్రార్ధించుట

2 . ఈ ప్రపంచముకు దేవుని యొక్క గొప్ప మనస్సు, కారుణ్య మనస్సు తెలియజేయుట.

3 . దేవుని యొక్క కరుణ చాటుట, విశ్వాసమును ప్రకటించుట దేవుని ప్రేమను విశ్వసించుట అంటే ఆయన యొక్క కరుణను విశ్వసించుటయే కాబట్టి ఈ రోజు దేవుడు మనకు చూపిస్తున్న కరుణ మనం ధ్యానించుకోవాలి.

యేసు ప్రభువు యొక్క దివ్య కారుణ్య picture మనం చూస్తే రెండు రకాలైన కిరణాలు కనబడతాయి. ఎర్రని కిరణాలు - దేవుని యొక్క రక్తంకు గుర్తు. ఆయన రక్తం చిందించటం ద్వారా మనం రక్షించబడ్డాం అని అర్ధం. తెల్లని కిరణాలు మన యొక్క జ్ఞానస్నానంకు గుర్తు. జ్ఞానస్నానం ద్వారా దేవుని బిడ్డలుగా చేయబడుతున్నాం. పవిత్రులుగా చేయబడుతున్నాం.

ఈనాటి మొదటి పఠనంలో యేసు ప్రభువు తన యొక్క శిష్యుల ద్వారా చూపిన కరుణ గురించి తెలియజేస్తుంది. అనారోగ్యంతో ఉన్నవారికి ప్రభువు తన యొక్క అనంత కరుణను చూపిస్తున్నారు. 15 వ వచనంలో పేతురుగారి నీడపడినా చాలు మేము స్వస్థత పొందుతాం అనే అంత గొప్ప విశ్వాసం ప్రజలలో చూస్తున్నాం. ఇలాంటి ఒక విశ్వాసం గెన్నేసరెతు ప్రజలలో కూడా చూస్తున్నాం. కేవలం యేసు ప్రభువు యొక్క అంగీని తాకితే చాలు మేము స్వస్థత పొందుతాం అని అనుకున్నారు. మత్తయి 14 : 34 - 36 .

దేవుని యొక్క దీవెనలు, కరుణ పొందటానికి ప్రజలు తమ జీవితాలను తాము సంసిద్ధం చేసుకొని వున్నారు. విశ్వాసమును కలిగి వున్నారు. యెరూషలేములో సొలొమోను మంటపం దగ్గర వున్నా విశ్వాసులు పేతురు గారిలో పవిత్రాత్మ శక్తి ఉందని గ్రహించారు. ఆయన దేవుని శిష్యుడని తెలుసుకున్నారు, ఆయనకు స్వస్థత నిచ్చే శక్తి వుందని గ్రహించారు.

పేతురు గారు బలహీనుడు, యేసు ప్రభువును మోసం చేశారు అయినా సరే ఆయనలో అంత శక్తి ఎలా దాగివుంది ఆయన తన జీవితమును మార్చుకున్నాడు. హృదయ పరివర్తనం చెందాడు, పవిత్రాత్మ శక్తిని పొందాడు, దేవుని చిత్తం ప్రకారం జీవించారు అందుకే దేవుని యొక్క స్వస్థత పరిచే శక్తి ఆయనకు వచ్చింది ఇది దేవుని యొక్క అనుగ్రహం. దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేయాలంటే మనంలో విశ్వాసం ఉండాలి.

ఈనాటి రెండవ పఠనంలో పునీత యోహాను గారు తనకు వచ్చిన దర్శనం గురించి తెలుపుచున్నారు. పునరుత్తానుడైన క్రీస్తు ప్రభువు యొక్క దర్శనం గురించి పలుకుచున్నారు. పునరుత్తానుడైన క్రీస్తు ప్రభువు తాను సజీవుడని, మృత్యు లోకమునకు అధికారి అని తెలుపుచున్నారు. ఈ పఠనం ద్వారా ప్రభువు తానే విశ్వాధిపతి అని తెలుపుచున్నారు. ఈ లోకంలో ఎదురయ్యే కష్టాలకు ఇబ్బందులకు కృంగిపోక దైవశక్తి మీద ఆధారపడి జీవించమని కోరుచున్నారు.

ఈనాటి సువిశేష పఠనంలో యేసు ప్రభువు తన యొక్క శిష్యులకు చూపిన కరుణ గురించి తెలుపుచున్నారు. శిష్యులకు కరుణ చూపించి యేసు ప్రభువు తన యొక్క సువార్త బాధ్యతలను అప్పజెప్పుచున్నారు. దేవుని యొక్క అనంత ప్రేమ, కరుణ, క్షమ గురించి తెలియజేయుటయే ప్రభువు శిష్యులకు అప్పజెప్పిన బాధ్యత .

యేసు ప్రభువు తన శిష్యులకు దేవుని యొక్క కరుణ కొనసాగించుటకు క్షమించే వరం చేస్తున్నారు. ఈ సువిశేషంలో ప్రభువు చాలా విషయాల గురించి బోధిస్తున్నారు. యేసు ప్రభువు తన యొక్క శిష్యులకు దర్శనం ఇచ్చి వారిని బలపరుస్తున్నారు. ఎందుకు ప్రభువు వారిని బలపరుస్తున్నారంటే ఒక్కసారి మనం చూసిన దానిని, గ్రహించిన దానిని, విన్న దానిని గట్టిగా ప్రకటించగలం. పేతురు గారు అంటారు మా కనులారా చూసిన దానిని చెవులారా వినిన దాని గురించి ప్రకటించకుండా ఉండలేదు అని అ.పో. 4 : 20

శిష్యులు దేవున్ని గురించి తెలుసుకున్నారు కాబట్టియే తరువాత అంత గొప్పగా ప్రభువు గురించి ప్రకటించగలిగారు. యేసు ప్రభువు ఉత్తానమైన తరువాత ఇది ఎనిమిదవ రోజు అయితే శిష్య్లఅందరు కూడా భయంతో వున్నారు ఎందుకంటే ఇప్పటి వరకు క్రీస్తే నాయకుడు అని అనుకున్నారు. ఆయన వారి వెన్నెముక అని, రాజు వారు భావించారు. వారందరి యొక్క ఆలోచనలకు బిన్నంగా క్రీస్తు ప్రభువు మరణించారు.

యుద్ధంలో రాజు చనిపోతే సాధారణంగా సైనికులకు భయ వేస్తుంది అదే విధంగా అప్పటివరకు ధైర్యంగా వున్నశిష్యులు క్రీస్తు మరణంగా ధైర్యంగా కోల్పోయారు. క్రీస్తే వారి ధైర్యం, క్రీస్తే వారి శక్తి, క్రీస్తే వారి నమ్మకం అన్నీ కోల్పోయిన సందర్బంలో ప్రభువు వారికి ధైర్యంనిస్తున్నారు. భయపడే వారికి దేవుడు ఎప్పుడూ ధైర్యంనిస్తున్నారు. అదేవిధంగా వారికి తోడుగా నిలబడుచున్నారు.

- మోషే ఫరో వద్దకు వెళ్ళుటకు భయపడ్డాడు

- యెషయా భయపడ్డాడు - 41 : 10

- యిర్మీయా భయపడ్డారు

- శిష్యులు భయపడ్డారు

వారందరికీ దేవుడు ధైర్యంనిస్తున్నారు, వారిని బలపరుస్తున్నారు.

యూదులు ఎప్పుడు ప్రాణహాని కలుగచేస్తారా అని భయాందోళనతో వున్నారు. ఎప్పుడు ఏ క్షణంలో ఏమి జరుగుతుందో తెలియదు. కాబట్టి వారందరు ఒకే చోట బిక్కి బిక్కి మంటు లోపల దాగుకొని ఉంటున్నారు. గురువును కోల్పోయిన భాధ, ఆశలు అడియాశలు అయ్యాయి. ప్రభువు వారి యొక్క అవసరత గుర్తించి వారి యొక్క అలజడి మనస్సులను, జీవితాలను ప్రశాంతంగా ఉంచుటకై మొదటిగా వారికి కావలసిన శాంతిని ఒసగుతున్నారు.

మన జీవితంలో మొదటిగా దేవుని వరం ఏం కావాలో అది దేవుడు ఇస్తారు.

చేతులను ప్రభువు ప్రక్కకు చూపుచున్నారు. దీని ద్వారా దేవుడు తనను తాను శిష్యులకు ఎరుక పరచుకుంటున్నారు. గాయపడిన చేతులను అదే విధంగా మేకులుదించిన చేతులు చూసినప్పుడు వారి నమ్మకం ఇంకా ఎక్కువైంది. వారికి సంతోషంగా తిరిగివచ్చింది. కోల్పోయినది తిరిగి పొందారు. చేతులు పక్కకు చూపటం అనేది ఆహ్వానంకు కూడా గుర్తు శిష్యులను దేవుడు తన చెంతకు ఆహ్వానిస్తున్నారు అని ఆదం. భారముచే అలసిసొలసిన సమస్త జనులారా........ మత్తయి 11 : 28. తన చెంతకు శిష్యులను ఆహ్వానిస్తున్నారు.

యేసు ప్రభువు శిష్యులను వేద ప్రచారంకై పంపిస్తున్నారు. తండ్రి కుమారుని పంపినవిధంగా నేను మిమ్మల్ని పంపిస్తున్నాను అని అంటున్నారు 21 వ వచనంలో.

తండ్రి కుమారున్ని - రక్షించుటకు పంపారు

- ప్రేమించుటకు

- క్షమించుటకు

- సేవ చేయుటకు

- తండ్రి చిత్తమును తెలియజేయుటకు

- విధేయత చూపుటకు

- త్యాగ జీవితం జీవించుటకు

- నిస్వార్ధ సేవ చేయుటకు

తండ్రి, పవిత్రాత్మల జీవితమును తెలియజేయుటకు పంపిన విధంగా మిమ్మల్ని కూడా పంపిస్తున్నాను అని అంటున్నారు. ఆయన యొక్క శిష్యులుగా మనందరం కూడా క్రీస్తు ప్రభువు జీవించిన విధంగా జీవించాలి. వారిని పంపించేటప్పుడు యేసు ప్రభువు శ్వాసను ఊది పవిత్రాత్మను ఒసగుచున్నారు.

- దేవుడు ఆదాముకు శ్వాసను ఊది జీవమిచ్చారు (ఆది 2: 7)

- ఏలియా ప్రవక్త వితంతువు కుమారునికి దేవుని ప్రవచన శ్వాసను ఊది జీవం ఇచ్చారు (1 రాజు 17: 21 - 23)

- ఎండిన ఎముకలకు దైవవాక్కును ప్రకటించి జీవాన్ని ఇచ్చినట్లుగా (యెహెఙ్కేలు 37: 9 - 10) శిష్యులకు దేవుడు శ్వాసను ఊది జీవమిచ్చారు.

- శ్వాసనూదటం ద్వారా దేవుడు మరలా శిష్యులలో నూతన జీవం నింపుచున్నారు.

మొదటి తల్లిదండ్రులు పాపం చేయటం ద్వారా శాంతి సమాధానాలు నశించాయి. దేవునికి మానవునికి మధ్య బంధం తెగిపోయింది. దేవునికి దూరమయిన మానవున్ని క్రీస్తు ప్రభువు తండ్రి చెంతకు చేర్చుతున్నారు. మానవునిపై తన శ్వాసను ఊది నూతన సృష్టిని, నూతన మానవున్ని రూపొందిస్తున్నారు. ఆదిలో మానవుడు కోల్పోయిన శాంతిని ఇప్పుడు క్రీస్తు తన శిష్యులకు కలుగజేస్తున్నారు. ఈ శాంతి ఆ శిష్యులు ప్రజలందరికి అందజేయాలి.

శాంతిని ప్రతి ఒక్కరు కలిగివుండాలి కోరుకుంటాం. ప్రశాంతగా ఉండాలి, కోరుకుంటారు చాలామంది దేశాల మధ్య శాంతి కావాలనుకుంటాం రాష్ట్రాల మధ్య కుటుంబాల మధ్య మతాల మధ్య శాంతి కావాలనుకుంటాం. కాబట్టి మొట్ట మొదటిగా వ్యక్తి గతంగా మన శాంతియుతంగా ఉండాలి అప్పుడే అది ఇతరులకు అందజేయవచ్చు.

దేవుని యొక్క శాంతి, కరుణ తెలియజేయుట కోసమే శిష్యులకు ప్రభువు క్షమించే అధికారమును ఇస్తున్నారు. పాపం చేసిన వారి శాంతిగా జీవించలేదు అందుకే వారిని ఆ పాపబంధం నుండి విముక్తులను చేసి శాంతిగా జీవింపచేయుటకు వారికి దేవుడు పాపమన్నింపును దయచేస్తున్నారు. క్షమాపణ లేకుండా శాంతికి మనుగడలేదు.

యేసు ప్రభువు శిష్యులకు దర్శనం ఇచ్చిన సందర్భంలో తోమాసు గారు లేరు. ఆయన ప్రభువును చూస్తేగాని నమ్మను అనే అవిశ్వాసంలో వున్నాడు. తోమాసు గారు మొదటిలో అవిశ్వాసిగా ఉంటున్నారు. ఆయన జీవితం గురించి ఒక్కసారి ఆలోచిస్తే ఆయన ఒక ధైర్యవంతుడు అని తెలుస్తుంది ఎందుకంటే శిష్యులందరు భయపడి లోపల ఉంటే తోమాసు గారు మాత్రం బయట ధైర్యంగా వున్నాడు - యోహాను 11 : 16 .

మన గురువు భాధను తట్టుకోలేక ఒంటరిగా ధ్యానిస్తున్నారు. దేవుడిని వ్యక్తి గతంగా చూడాలనుకున్నాడు. వక్తిగత అనుభవం కావాలనుకున్నారు. తోమాసు గారు యేసు ప్రభువు చేతిలో వ్రేళ్ళు పెడితేనే నమ్మను అని అన్నారు కానీ అది చేయలేదు, ప్రభువుని విశ్వసించారు.

విశ్వసం వివిధరకాలుగా వస్తుంది:

- వినుట వలన విశ్వాసం కలుగుతుంది ( రోమా 10 : 17 )

- శిష్యులు ఖాళీ సమాధి చూసి విశ్వసించారు ( యెహాను 20 : 8 )

- యేసు ప్రభువు పిలిచినప్పుడు మరియ మగ్దలేనమ్మ విశ్వసించింది ( యోహాను 20 : 16 )

- శిష్యుల దర్శనం వల్ల విశ్వసించారు ( 20 వ వచనం)

- క్రీస్తును చూడటం వల్ల తోమాసు గారికి విశ్వాసం పెరిగింది (25 వ వచనం)

ఆయన సందేహాలను అధిగమించగలిగాడు క్రీస్తును తన దేవునిగా గుర్తించాడు. యేసు ప్రభువు సజీవునిగా లేచారని గుర్తించారు. యేసు ప్రభువే రక్షకుడని తెలుసుకున్నాడు. తోమాసు గారికి దేవుడు తన కరుణ తెలియజేశారు. తోమాసు గారు క్రీస్తు యొక్క అనుభూతి ద్వారా తాను సువార్త సేవకై వివిధ ప్రాంతాలకు వెళ్లుచున్నారు. ప్రభువు మనందరితో కూడా చూడక నమ్మేవారు ధన్యులని పిలుస్తున్నారు. కొన్ని సందర్భాలలో మనం ఆధారాలు వుంటేనే నమ్ముతాం. ఎంతమంది చెప్పిన తోమాగారు వినలేదు, చేతిలో వ్రేళ్లు పెడితేగాని ఆధారాలు వుంటేగాని నమ్మను అని అన్నారు. అయినా ప్రభువు వారికి దర్శనం ఇస్తున్నారు, ఆయన్ను కరుణిస్తున్నారు.

దేవుని కరుణ మన మీద వున్నట్లే మనం కూడా కరుణ, జాలి, దయ, ప్రేమ కలిగి జీవించాలి. దేవున్ని తెలుసుకొని జీవించాలి.

Fr. Balayesu OCD

పాస్కా ఆరవ ఆదివారం

పాస్కా ఆరవ ఆదివారం  అపో 10:25-26, 34-35,44-48 1యోహను 5:7-10 యోహాను 15:9-17 ఈనాటి పరిశుద్ధ గ్రంథములు పఠనములు దేవుని యొక్క ప్రేమ గురించి మరియు...