16వ సామాన్యఆదివారం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
16వ సామాన్యఆదివారం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

22, జులై 2023, శనివారం

పదహారవసామాన్యఆదివారం

సొ.జ్ఞాన 12:13,16-19

రోమ 8:26-27

మత్తయి 13:24-43

                                                                                                                    బ్రదర్. సుభాష్. . సి. డి 

 

మొదటిపఠనం: దేవుడుతానున్యాయంమరియుదయగలదేవుడిగాచూపిస్తున్నాడు.

దేవుడు తన ప్రజలు పశ్చాత్తాపపడాలని ఎదురు చూస్తున్నాడు, దేవుడు తన ప్రజలు నీతిగా జీవించాలని కోరుకుంటాడు. దేవుడు తన ప్రజలకు నీతిమంతమైన జీవితాన్ని గడపడానికి స్వేచ్ఛనిచ్చాడు.

మళ్లీమళ్లీ పాపంచేయడం మరియు తప్పుచేయడం మానవత్వం, దయ మరియు క్షమించడం దైవత్వంఅని మొదటిపఠనం వివరిస్తుంది. దేవుడు న్యాయమైన మరియు దయగలతండ్రి, అతను ప్రతిఒక్కరినీ సమానంగా చూస్తాడు. ఆయన మనందరికీ రక్షణపొందే అవకాశాన్ని కల్పిస్తాడు. మరియు ఎవరైనా దేవునిశక్తిని అనుమానించినప్పుడు, దేవునిశక్తి వివిధమార్గాల్లో ప్రజలకు చూపబడుతుంది. మానవులనుఖండించడానికిదేవునికిఅధికారంఉంది, కానీ ఆయన ఇంకా మనల్ని ఓపికగా భరిస్తున్నాడు.

Vs.19. దేవుడు తన ప్రజలు పశ్చాత్తాపపడుటకు వేచియుండుట మరియు ఆయన వారిని క్షమించుట మనము చూస్తాము. అలాగే దేవుడు మనలను కూడా తానుచేసినట్లుగాఒకరినొకరు క్షమించాలని కోరుకుంటున్నాడు. తన ప్రజలు నీతిగా జీవించాలని ఆయన కోరుకుంటాడు. దయ మరియు క్షమాపణవంటి దేవుని లక్షణాలను కలిగి ఉండమని ఆయన మనలను ఆహ్వానిస్తున్నాడు.

మంచిచేసేవారు దేవుని బిడ్డలని మరియు చెడుచేసేవారు సాతాను బిడ్డలని తెలియచేస్తున్నారు .

కావున దేవుడు మనలను తన మంచిబిడ్డలుగా ఉండమనికోరుచున్నాడు

 

కీర్తన: 86:5-6,9-10,15-16 : ఇది దయకోసం దేవునికి ప్రార్థన.

 

రెండవ పఠనం: ఆత్మ మనకొరకు దేవునితో విజ్ఞాపన చేస్తుంది.

స్వభావరీత్యా మానవులు బలహీనులు, పాపంవైపు సులభంగా పడిపోతారు. మనము తరచుగా పాపపుఉచ్చులో పడిపోతాము, మన సోదరులను ప్రేమించడంలో విఫలమవుతాము, ఇతరులను క్షమించడంలో విఫలమవుతాము, మరొకరి అవసరంలో మనం కనికరంచూపడంలో విఫలమవుతాము.

కానీ ఆత్మ అలాంటి వారందరికీ సహాయం చేయడానికి మరియు అవసరమైనది చేయడానికి సహకరిస్తుంది అని పునీత పౌలుగారు చెపుతున్నారుఆత్మమనలోఉంది, మన తరపున తండ్రికి విజ్ఞప్తి చేస్తుంది మరియు దేవుణ్ణి తండ్రి అని సంభోదించుటకు వీలు కల్పిస్తుంది. కాబట్టి మానవులుగా మనం శరీరానికి వ్యతిరేకంగా, మన కోరికలు మరియు స్వార్థపూరిత వైఖరితో పోరాడుతామని పౌలుగారు చెపుతున్నారు. మనం యేసు ద్వారా మనతండ్రికి ప్రార్థిస్తున్నప్పుడు ఆత్మ నిజానికి మనలో మూలుగుతూ ఉంటుంది. మరియు యేసుక్రీస్తుద్వారా మనం ప్రార్థనలో ఏది అడిగినా తండ్రి అయిన దేవుడు మనకు సమాధానం ఇస్తాడు లేదా దయచేస్తాడు అని పునీత పౌలుగారు చెపుతున్నారు.

సువిశేషం:ఈ సువార్తపఠనం గత ఆదివారం యేసు చేసిన ప్రసంగం యొక్క కొనసాగింపు.

నేటి సువార్తలో, యేసు పరలోక రాజ్యం గురించి వివరించడానికి మూడు ఉపమానాలు చెప్పాడుయేసు జన సమూహంతో ఉపమానాలుగా ఎందుకు మాట్లాడతాడో మరియు శిష్యులకు విత్తువాడు యొక్క ఉపమానాన్ని ఎందుకు వివరించాడో కూడా తెలియచేస్తుంది.

మొదటి ఉపమానం పరలోకరాజ్యం విత్తువాడు (దేవుడు)తో పోల్చబడిందని చెబుతుంది. మరియు పొలమును ప్రపంచం తోపోల్చారు, మరియు మంచి విత్తనాలను గోధుమలతో (దేవునిబిడ్డలుగా) మరియు చెడువిత్తనాలను కలుపు మొక్కలతో (సాతానుబిడ్డలుగా) శత్రువును (చెడు)గా పోల్చారు.

ఇక్కడవిత్తువాడు కలుపు విత్తనాలను పొలములో చల్లెనా?

లేదు. కానీ ఒక శత్రువు అసూయతో అలాచేశాడు.

దేవుడుచెడ్డవారినిసృష్టించాడా?

లేదుకానీ దుర్మార్గుడు సాతాను చెడును మంచిదని చూపించడం ద్వారాప్రజలను ప్రలోభపెట్టడం లేదా ప్రజలను పాపపు మార్గాన నడిపిస్తున్నాడు .ప్రజలు చెడు వైపు ఎందుకు మొగ్గుచూపుతారు,  ఎందుకంటే

-చెడు ఆకర్షణీయంగా ఉంటుంది.

- చెడు ప్రలోభపెడుతుంది.

- చెడు అందంగా కనిపిస్తుంది.

-చెడు మంచివలె నటిస్తుంది.

సుఖాలు, శక్తి,  లేదా సంపద మొదలైన వాటి రూపంలో చెడు మానవుడిని ప్రలోభపెడుతుందిఅయితే, గోధుమలు మరియు కలుపుమొక్కలు కలిసి పెరుగుతాయి మరియు పంటలను సేకరించేవరకు అవి గుర్తించబడవు. అదేవిధంగా ప్రపంచంలో మంచివ్యక్తులు (దేవునిబిడ్డలుగా) మరియు చెడ్డవ్యక్తులు (చెడుబిడ్డలుగా) కలిసిజీవిస్తారుతుది తీర్పు వరకు ఏది మంచి మరియు చెడు అనేది గ్రహించబడదు.

విత్తువాడు చివరి వరకు ఓపికపట్టి. గోధుమలు మరియు కలుపుమొక్కలను వేరుచేస్తాడు. అలాగే దేవుడు కూడా చాలా ఓపికగా ఉంటాడు, చెడ్డ వ్యక్తులు మంచి వారిగా మారాలని ఎదురుచూస్తాడు. మరియు తీర్పు రోజున అతను మంచి మరియు చెడులను వేరుచేస్తాడు. మంచి వ్యక్తులు దేవునిబిడ్డలుగా అవుతారు మరియు వారు పరలోక రాజ్యాన్ని వారసత్వంగా పొందుతారు. మరియు చెడుప్రజలు చెడుబిడ్డలుగా,  నిత్య నరకాగ్ని వారికి వారసత్వంగా ఉంటుంది.

ఉపమానం దేవుని సహనాన్ని మరియు దీర్ఘశాంతాన్ని నొక్కి చెబుతుంది, ఎందుకంటే అతను గోధుమలు మరియు కలుపు మొక్కలను రెండింటినీ పంట వరకు కలిసి పెరగడానికి అనుమతించాడు, ఇది చివరి తీర్పు  మరియు పశ్చాత్తాపానికి ప్రతీక.

ఎదుగుదల మరియు ఫలవంతం: విశ్వాసుల జీవితాల్లో ఆధ్యాత్మిక వృద్ధి మరియు ఫలవంతమైన ప్రాముఖ్యతను ఉపమానం వివరిస్తుంది.ఇది గోధుమల ద్వారా ప్రాతినిధ్యం వహిస్తుంది, నిజమైన విశ్వాసం మరియు నీతివంతమైన జీవనం యొక్క అవసరాన్ని నొక్కి చెబుతుంది.

రెండవ ఉపమానం ధ్యానించి నట్లయితే, దేవుని రాజ్యం ఆవగింజలాంటి దని, అది ఒకపెద్ద చెట్టుగా మారి ఆకాశ  పక్షులకు ఆశ్రయం అవుతుంది. క్రైస్తవమతం యొక్క విశ్వాసం ప్రారంభంలో చిన్నదికావచ్చు కానీ తరువాత అది పెరుగుతుంది మరియు అనేక మంది ప్రజలు, సంస్కృతులు మరియు దేశాలు, దేవుని ప్రేమను అర్థం చేసుకొనిదేవుని రాజ్యం మనం ఊహించిన దానికంటే భిన్నమైనదని గ్రహిస్తారు.దేవుని రాజ్యం దయ మరియు కరుణతో నిండి ఉంది అని గ్రహిస్తారు.

మనం నిద్రలో ఉన్నప్పుడు అంటే అజాగ్రత్తతో ఉంటె శత్రువు ఉద్దేశపూర్వకంగానే నాశనం చేయడానికి వచ్చి పొలంలో కలుపు మొక్కలను చల్లుతారు. అంటే మనం మెలుకువగా ఉండాలి లేదా మన చుట్టూ ఉన్నచెడు గురించి జాగ్రత్తలుతెలుసుకోవాలి. పునీత పేతురు గారు తన లేఖలలో నిబ్బరమైన బుద్ధిగల వారై మెలకువగా ఉండుడి; మీ విరోధియైన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు.” (1పేతురు 5:8).

కాబట్టి ఈ ఉపమానం మనలను ప్రార్థనలో అవగాహన కలిగి ఉండాలని బోధిస్తుంది. విఫలమవ్వకుండానిత్యమూ ప్రార్థన చెయ్యమనికోరుతున్నాడు. ఎందుకంటే సాతాను మనవెంటే పొంచి ఉంటుంది.

మూడవ ఉపమానం ద్వారా మనందరం కూడా పులిసిన పిండి వలె ఉండమని , మనం కుటుంబాల్లో మరియు సమాజాలలో, దేవుని ప్రేమ మరియు దయను వ్యాప్తిచేయడం లేదా ఇతరులకు మంచితనాన్ని పంచుకోవడంలో పులిసిన పిండిలాగా ఉండాలి. మనం కూడా భూమిపై దేవుని రాజ్యాన్ని విస్తరింపచేయాలని ఈమూడుపఠనాలు మనల్నికోరుతున్నాయి.


లూకా 17:11-19

 సమరియుని కృతజ్ఞత  యేసు సమరియా, గలిలియా ప్రాంతముల మీదుగా యెరూషలేమునకు పోవుచుండెను. ఒక గ్రామమున అడుగు పెట్టగనే పదిమంది కుష్ఠ రోగులు ఆయనకు ఎదు...