ఇరువదిఎనిమిదవసామాన్యఆదివారము
యెష:25:6-9 ;ఫిలి:
4:12-14,19-20
;మత్త: 22: 1-14
"పిలువబడినవారుఅనేకులు,
ఎన్నుకున్నవారుకొందరే".
మొదటి పఠనము:
1.రాబోవుయేసుక్రీస్తుగురించితెలియజేస్తుంది.
అయన వస్తే ఏంజరుగుతుంది, ఎం జరుగబోతోందో తెలియజేస్తుంది.
ఒక సారి చారిత్రక నేపధ్యాన్ని చూసినట్లయితే, క్రీస్తు పూర్వం లో ఉజ్జియా రాజు మరణించిన తరువాత అర్ధ శతాబ్దం పాటు ఇశ్రాయేలీయులు అశూరు రాజుల ద్వారా దాడులను ఎదుర్కొన్నారు. అట్టి పరిస్థితులలో యెషయా ప్రవక్తను దేవుడు ఎన్నుకొని వారితరఫున మాట్లాడటానికి వారికి ఊరటను రక్షణను కలుగజేయడానికి వారి చెంతకు పంపిస్తున్నాడు.
అయితే ఇక్కడ ప్రవక్త పర్వతము మీద ఒక విందు జరుగబోతోంది అని తెలియ జేస్తున్నాడు.
ఈవిందు పర్వతముపైన జరిగే యేసుక్రీస్తు యొక్క బలిదానం.
యేసుప్రభువుయొక్క భాలిద్వారానే ప్రజలకు రక్షణ వాటిల్లుతుంది. అది, వారి పాపపు ముసుగును తీస్తుంది :పశ్చాత్తాప పడిన పాపులు నూతన నిబంధనలో పండగచేసుకోవడం మనం చూస్తున్నాం.ఉదాహరణకు సుంకపుమెట్టుదగ్గర కూర్చున్న మత్తయి గారు. యేసు ప్రభువు ఎప్పుడయితే తనను అనుసరింపమనిచెప్పాడో వెంటనే అంతా విడిచిపెట్టి ఆ యేసుప్రభువుని అనుసరించాడు. తరువాత వెంటనే తన ఇంటిలోనే అందరిని పిలిచి భోజనముపెడుతున్నాడు. అది దీనిలో వున్నా పరమార్ధము. (మత్త:9:9-10).
కన్నీళ్లను తుడిచి వేస్తుంది:
వ్యభిచారము పట్టుహాదిన స్త్రీ యేసుప్రభువు దగ్గర పశ్చాత్తాపముతో కన్నీరు కార్చింది. (యోహా:8:11).
అవమానములను తొలగిస్తుంది:
బెతానియాలో మరియమ్మ పరిమళ ద్రవ్యముతో వచ్చి తన అవమానమును తొలగించుకోవడానికి తన వెంట్రుకలతో పరిమళ ద్రవ్యమును తెచ్చి యేసు పాదములను తుడిచెను. (యోహా:
12:3)
ఇంకా మృత్యువును సహితము నాశనము చేస్తుంది:
లాజరుని దేవుడు తిరిగి మరణమునుండి లేపాడు( యోహా:11:42, “పిమ్మట యేసు బిగ్గరగా లాజరూ! వెలుపలికి రమ్ము” అని పలికెను. వెంటనే అతడు జీవము పొందెను.
ఇదంతా ఎప్పుడు సంభవిస్తుంది అంటే, ఆదేవాతి దేవుని పైనా అచెంచలమయినా విశ్వాసము ఉంచి తనదగ్గరకు వచ్చినప్పుడు జరుగుతుంది. కానీ మనము మాత్రము చాలా సార్లు మన ఇష్టానుసారం జీవించడానికి ప్రయత్నించి మనకోసం వచ్చిన వారిని కండి స్తాము.
సువిశేష పఠనము:
ఈనాటి సువిశేష పఠనమును యేసుప్రభువు అక్కడవున్న ప్రజలకు ఒక ఉపమాన రీతిగా తెలియజేస్తున్నాడు. అసలు ఏంటి ఈ ఉపమానము అంటే, పెండ్లి పిలుపు గురించి.
మన రోజువారీ జీవితములో మన కుటుంబములలో పెళ్లి జరుగుతుంది అంటే కొన్ని నెలల ముందు నుంచే ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. ఎవరెవరిని పిలవాలి, ఎంతమందిని పిలవాలి. ఎం వంటలు చేయాలి అని చాలా బాగా ప్లాన్ చేస్తాం. ఇలా చేసినతరువాత మనం పిలిచినా వారు రాకపోతే,
మన ఆతిధ్యాన్ని స్వీకరించకుండా వారి వారి పనులకు వెళ్ళిపోతే మనకు ఎలా ఉంటుందో ఈ ఉపమానము ద్వారా దేవుడు తెలుపుతున్నారు. కాబట్టి ముందుగా సువిశేషములో చూపిన కొన్ని సూచనలను మనం గుర్తిదాం:
పరలోక రాజ్యము= రక్షణ
రాజు= ఆ తండ్రి దేవుడు
కుమారుడు= యేసుక్రీస్తు ప్రభువు
రాజ సేవకులు= ప్రవక్తలు, న్యాయాధిపతులు,
అపొస్తలులు
పిలువబడినవారు= ఇశ్రాయేలు ప్రజలు
ఎన్నుకోబడినవారు=జ్ఞానస్నామును పొందిన ప్రతి ఒక్కరు.
విందు= సంతోషము, ఆకలి తీర్చబడటం( ఆధ్యాత్మిక,
భౌతిక),
అందరూ కలసి భుజించడం ఇంకా చెప్పాలి అంటే దివ్య సప్రసాదము.
ఇక్కడ మనము పరిశీలించినట్లయితే, దేవుడు వారి వారి స్వంత జీవితమునుండి రక్షణ మార్గమునకు ఆహ్వానించినప్పుడు ప్రజలు తాను ఎన్నుకున్న వారు మాత్రం దేవునినుండి దూరముగా వెడలిపోతున్నారు. ప్రవక్తలు, న్యాయాధిపతులు ఇలా ఎంతోమంది వచ్చి దేవుని గురించి దైవ రాజ్యం గురించి బోధించిన ప్రజల జీవితములో మాత్రం ఎటువంటి మార్పు రావడం లేదు. తాను ఎన్నుకున్న ప్రజలే దేవుని అర్ధం చేసుకోలేకపోతున్నారు. ఉదాహరణకు యెషయా గ్రంధములో చూస్తే,“భూమ్యాకాశములారా వినుడు! నేను పెంచి పెద్ద చేసిన బిడ్డలే నామీద తీరుగా బడిరి”. అని పలుకుచున్నాడు. (యెష: 1:2).కానీ ఎన్నుకున్న ప్రజలు మాత్రం అర్ధం చేసుకోలేక పోయారు.
మరి దేవుడు మన జీవితములలో ఎన్ని గొప్ప కార్యాలు చేస్తున్నాకానీ మనం మాత్రం మన స్వలాభాముకోసమే చూస్తాము. పాత నిబంధన గ్రంధములో చూస్తే, ఇశ్రాయేలు ప్రజలు ఎన్నోసార్లు దేవునికి విరోధముగా ఎదురుతిరిగారు. కానీ దేవుడు మాత్రం వారిని ప్రేమించివున్నాడు. కానీ కొన్నిసార్లు మాత్రమే వారిని శిక్షించి వున్నాడు. ఎందుకంటే,
ఇకనయినా వారు మారతారేమోఅన్న చిన్ననమ్మకం వారిపైన.
రాజు తన సేవకులు:
రాజుదగ్గర వుండే సేవకుల పని ఏమిటంటే తన రాజుగారు చెప్పిన పనిని నిర్వర్తించడమే వారికున్న పని. ఎంత కష్టం వచ్చిన ఎన్ని భాధలు ఎదురయినా వెనుతిరగకుండా ఆపనిని పూర్తిచేసేవాడే నిజమైన సేవకుడు. అయితే ఇక్కడ రాజు అంటే అర్ధం ఆ తండ్రి దేవుడు. అయన తనకు మారుగా తన పేరిట తన సేవకులను తాను ఎంచుకున్న ప్రజలదగ్గరికి పంపిస్తున్నాడు. మోషే ప్రవక్తను తన ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశీయుల దాస్య విముక్తి చేయడానికి, పాలు తేనె జాలువారు దేశమునకు తీసుకొని వెళ్ళడానికి ఎన్నుకొనుచున్నాడు. (నిర్గ:3:4-8)
సమువేలు. ఇతడిని తన చిన్న ప్రాయమునందే ఎన్నుకొని ఎంతోమంది రాజులకు, ప్రజలకు తీర్పరిగా ఉండటానికి రాజులను అభిషేకించడానికి ఎన్నుకున్నాడు. (సమువేలు:
3:10).ఇలా ఎంతోమంది యిర్మీయాను, యెషయాను ఇంకా చాలా మంది సేవకులను ఎన్నుకొని వారిద్వారా దేవుడు మాట్లాడాడు. వారిని ఒక మంచిబాటలో పయనింపచేయడానికి ప్రయాసపడ్డాడు. కానీ ఈనాటి సువిశేష పఠనంలో రాజు మాత్రం తన సేవకులను పంపిస్తున్నాడు. వారు నిరాకరించినా మరొకసారి పంపిస్తున్నాడు. ఇది రాజుకి తన వారిమీద నమ్మకం. దేవునికి కూడా ఇలాంటి నమ్మకం వుంది మనమీద. అందుకే తన సేవకులను మనకోసం పంపిస్తున్నాడు. మరి మన పూర్వికులు మాత్రం ఎప్పుడూవారిని నిరాకరిస్తూ,
తప్పుపడుతూ, ఎన్నో హింసలకు గురిచేస్తూ,
చంపివేస్తూ వచ్చారు.యూదా ప్రజలు చేసిన పనులు ఇవే. వారికోసం పంపించిన యిర్మీయాను చిత్రహింసలు పెట్టారు. మోషే ప్రవక్తను ఇబంది పెట్టారు, ఎన్నోసార్లు నిందించి వారి స్వంత దేవుళ్లను చేసుకొని పూజించారు (నిర్గ:32:1,4).
అయినా కానీ దేవుడు మాత్రం తన ప్రేమను మాత్రం మనమీద కుమ్మరించడానికి ఎప్పుడూ వెనుకాడలేదు. ఎప్పుడూ తన రాజ్యంలో చేర్చుకోవాలని చూస్తుంటాడు. తనతోపాటు జీవించాలని చూస్తుంటాడు.
కానీ మనము మాత్రం దేవుని కంటే మన స్వంత పనులకే ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తుంటాము. ఈనాటి సువిశేషములో అదేమనము చూసాము. తాను పిలిచినా ప్రజలు తన పిలుపును నిరాకరించారు,
తత్ఫలితముగా వారు దేవుని రాజ్యములో పాలిభాగస్థులు కాలేక పోయారు.
ఆహ్వానింపబడినవారు:
వీరు ఎవరయ్యా అంటే, యూదులు ఇశ్రాయేలు ప్రజలు. దేవుడు వీరిని ఎంతగానో ప్రేమించి వారి కన్నీటిని చూసి వారి బలహీనతను చూసి వారిని ఎన్నుకుంటే,
వారు మాత్రం అయన నుండి అన్ని పొందిన తరువాత తన దగ్గరనుంచి ఏమి పొందలేదు అన్నట్లు జీవించడం మొదలు పెట్టారు.
వారి బాధలను కళ్ళారా చూసాడు నిర్గ: 3:7. తొమ్మిది అరిష్టములనుండి కాపాడాడు. నిర్గ:6-10.
సముద్రమును రెండుపాయలుగా చీల్చి దానిని దాటేలా చేసాడు నిర్గ: 14:16-19
ఎడారిలో మన్నా ని పురుడు పిట్టలను భుజించారు నిర్గ: 15: 31-35.రాతినుండి నీళ్లు తాగారు నిర్గ:17:6.
ఇలా ఎన్నో రకాలుగా వారిని నడిపిస్తూ, రక్షిస్తూ ప్రథయొక్కదానిని వారికి ఇస్తూ వస్తుంటే వారు మాత్రం రోజురోజుకి దేవునికి విరోధముగా జీవించారు కానీ దగ్గరగా జీవింపలేకపోయారు.వీరిని రక్షించడానికి ఎంతో మందిని పంపిస్తే వీరు మాత్రం వారిని కూడా లెక్కచేయకుండా వారి ఇష్టానుసారం జీవిచి చివరికి వారిని కూడా హత్యలకు,
శ్రమలకు గురిచేశారు. అందుకే దేవుడు వారిని ఈనాడు విడనాడుతున్నాడు. ఒకవేళ మనజీవితము కూడా ఇలానే ఉంటే ఈరోజు నీ జీవితము నాజీవితం దేవుడినుండి విడనాడబడి శ్రమలు జీవితాన్ని జీవిస్తూ మరణానికి గురికావలిసి వస్తుంది.
రాజు యొక్క ఉగ్ర రూపం:
రాజుయొక్క ఉగ్రరూపాన్నిదేవునియొక్క ఉగ్రరూపానికి సూచన. మనం చూస్తున్నాం.ద్వితి:4:24,
" మీ ప్రభువైన యావే దహించివేయు అగ్నివంటివాడు,
అసూయపరుడైన దేవుడు". దేవుడు కోపవాడేవాడు. నిర్గ:32:10:“నీవు నాకు అడ్డు రావలదు. నాకోపము గన గన మంది వారిని బుగ్గిచేయును. ఇది సోదోము గొమొఱ్ఱా ప్రాంతములో ఏవిధముగా నయితే నాశనము జరిగినదో అదేవిధముగా దేవుడు ఈ ప్రజలను హతమారుస్తున్నాడు. ఎందుకంటే వీరికి తనపై వినయము లేదు. తన మాటను దిక్కరించారు.దేవుని చులకనగా చూసారు. దానికి నిదర్శనంగా వారిని నాశనము చేస్తూ,
ఒక కొత్త ప్రజలకు అవకాశమును కల్పిస్తున్నాడు. ఆ కొత్త ప్రజలే అన్యులు, వెలివేయబడిన వారు. పాపులుగా ఎంచబడినవారు. ఈనాడు మనమందరము కూడానా ఈకోవలోకే చేరుతాం. కానీ దేవుడు మాత్రం మనల్ని ఎప్పుడూ అలా చూడడు ఎందుకంటే ఆయనకు మనమంటే ఎంతో ప్రేమ.
పాట: చాలా గొప్పోడు చాలా చాలా గొప్పోడు నేను నమ్మినా నా యేసుడు.
అయితే దేవుడు వారు అనుకోని ఆలోచించని ప్రజలను ఎంపిక చేసుకొని తన గృహమునకు ఆహ్వానిస్తున్నాడు. తన కుమారుని పెండ్లి విందుకు ఆహ్వానిస్తున్నాడు. ఈ పెండ్లి విందు యేసు ప్రభుని మరణ పునరుత్తానము. ఎవరైతే ఈయొక్క మరణ పునరుతానములలో పాలి భాగస్థులవుతారో వారే రక్షణ మార్గములో కూడా పాలిభాగస్థులవుతారు.
కుమారుడు:
ఈకుమారుడు యేసు ప్రభువుకి సూచన. అయన తన ఏకైక కుమారుని ఒక పెండ్లికుమారుడిగా పోల్చుతూ, తనదగ్గరకు వచ్చేవారిని అయన సంతోషముగా పంపిస్తాడు అని తెలియజేస్తున్నాడు. యేసు ప్రభువు జ్ఞానస్నానము పొందు సమయమున తండ్రి దేవుడు పలికిన మాటలు ఒకసారి చూస్తే, మత్త: 3:17,
ఈయన నా ప్రియమైన కుమారుడు ఈయననుగూర్చి నేను అధికముగా ఆనందించుచున్నాను". తన కుమారుడైన యేసుక్రీస్తునందు ఆనందించుచున్నాడు కాబట్టి తన వివాహము అంటే, శ్రమలు, మరన, పునరుత్తాన సమయములో అందరికి ఆహ్వానము పంపుతున్నాడు. ఆ ఆహ్వానమును అంగీకరించి ఎవరయితే వారికి వారు సంసిద్ధత చేసుకొని వస్తారో వారు ఆ ఆనందముతో పాలి భాగస్థులవుతారు.
వివాహ వస్త్రము:
ఇక్కడ వివాహ వస్త్రము పవిత్ర జీవితము. ఎవరయితే పవిత్ర జీవితమును జీవిస్తారో వారే ఆ దేవుని వింది అనే సంతోషకరమైన రాజ్యములో ప్రవేశిస్తారు. అయితే ఈనాడు చూసినట్లయితే,
మనమందరము కూడా జ్ఞానస్నానమును పొంది దేవుని బిడ్డలుగా తిరుసభకు బిడ్డలుగా మారి,ఆ దేవాతి దేవుని మన జీవితములలోనికి దివ్య సప్రసాదము ద్వారా స్వీకరిస్తూ వున్నాం.అయితే, ఈ వింది అన్నే దివ్య సప్రసాదమును సీకరించాలి అంటే ముందుగా మనల్ని మనము శుద్దులను చేసుకొని దాని తరువాత స్వీకరించాలి. అందుకే ఈనాడు చూస్తున్నాం,
వివాహ వస్త్రం లేని వారిని తొలగించి కాలు సేతులు కట్టి, వెలుపల వున్న చీకటిలో త్రోసివేస్తున్నారు. కాబట్టి ఈ వివాహ వస్త్రం అనే పరిశుద్ధతను కప్పుకొని దేవుని చెంతకు చేరాలి. నిర్గమా కాండములో చూస్తే,
ఎప్పుడయితే మోషే ప్రవక్త దేవునితో మాట్లాడి వచ్చేటప్పుడు తనపై ఒక ముసుగును ధరిస్తుండెడివాడు. ఎందుకంటే, తన ముఖము కాంతివంతముగా మారి ప్రజలకు భయాన్ని పుట్టించేదిలా ఉండేది. నిర్గ: 34:34; "అతడు యావే సన్నిధిని మాటలాడుటకు వెళ్ళినప్పుడల్లా అటనుండి తిరిగివచ్చువరకు మొగముమీద ముసుగును తొలగించెడివాడు, మరలా ప్రభువు సన్నిధికి వేళ్ళు వరకు ముఖమును ముసుగుతో కప్పుకొనెడివాడు".దర్శన గ్రంధములో చూస్తే,
వస్త్రం దయించడం అంటే,
నిజాయితీ కలిగిన జీవితాన్ని జీవించడం.
పాపము తొలగిపోవడం.
క్షమను పొందటం.
ఉదా: తప్పిపోయిన కుమారుడు. తన తండ్రి తన పాత, మురికిగా వున్న వస్త్రాలను తీసి రాజ వస్త్రాలను ధరింపచేస్తున్నాడు. దీని అర్ధం పాపము తొలగింపబడి పరిశుద్ధతను,
నిజాయితీ జీవితమును పొందుకోవడం (లూకా: 15:22).
రెండవ పఠనము:
పునీత పౌలు గారు, క్రీస్తు అనుగ్రహించు శక్తితో ఎటువంటి పరిస్థితినయినా ఎదుర్కొనగలగాలి అని తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈనాడు మనమందరము కూడా ఆదేవాతి దేవుడు ఇచ్చినటువంటి పిలుపుని అంగీకరించి అయన ప్రియమైన కుమారులుగా,
సేవకులుగా జీవిస్తూ అయన రాజ్యములో పాలి బాగస్తులవుతూ, అయన ఇచ్చు వరములను అనుగ్రహములను పొందుకుంటూ, ఆయనకు తగిన బిడ్డలుగా జీవించడానికి ప్రయాసపడదాం. అప్పుడు క్రీస్తు యేసు నందలి మహిమైశ్వర్యముల కనుగుణముగా మన అవసరములను తెరుస్తూ,
మనతో ఎప్పుడూ చిరకాలము వుండాలని దానికంటే ముందు అదేవాతి దేవునికి సదా కృతజ్ఞతలు తెలియజేస్తూ జీవించడానికి ప్రయాసపడదాం. ఆమెన్.