28, అక్టోబర్ 2023, శనివారం

30 వ సామాన్య ఆదివారం

30 వ సామాన్య ఆదివారం
 నిర్గమ  22: 20-26, 1 తెస్సలోనిక 1:5-10, మత్తయి 22‌‌:34-40

ఈనాటి దివ్య పఠణములు క్రైస్తవ జీవితంలో అనుసరించవలసిన రెండు ప్రధానమైన ఆజ్ఞల గురించి తెలియజేస్తున్నాయి అవి దైవ ప్రేమ మరియు సోదర ప్రేమ ఆజ్ఞలను పాటించుట. ఈ రెండు ఆజ్ఞలను పాటించుటయే నిజమైన క్రైస్తవ జీవితం. ఈ రెండు ఆజ్ఞలలో ఏ ఆజ్ఞ పాటించుట విఫలమైన అది సంపూర్ణమైన క్రైస్తవ జీవితం కాదు. ఈనాటి మొదటి పట్టణంలో దేవుడు ఇచ్చిన రెండవ ఆజ్ఞ అయిన సోదర ప్రేమను పాటించమని తెలియజేస్తుంది. మొదటి వచనము(22) మనము గమనించినట్లయితే ఈ యావే దేవునికి కాదని అన్యదైవములకు బలులు సమర్పించిన వారిని కఠినంగా శిక్షించాలి అని తెలియజే స్తునారు. వేరే దేవుళ్ళు లేరు అని దీని యొక్క అర్థం వాస్తవానికి ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుండి బయటకు తీసుకుని వచ్చినది యావే దేవుడు కాబట్టి అతనికి మాత్రమే బలులు సమర్పించాలి అని ప్రభువు కోరుచున్నాను. పాత నిబంధన గ్రంథములో అనేక సందర్భంలో ప్రభువు తెలియచేసిన అంశం ఏమిటి అంటే దేవుడు ఒక్కరే, అది కూడా యావే దేవుడు మాత్రమే, ఇక ఏ దేవుడు లేరు అని అర్థం.. రెండవదిగా ప్రభువు పరదేశులకు ఎటువంటి హాని చేయవద్దు అని తెలుపుచున్నారు అంటే యూదులు కాకుండా మిగతా అన్యులకు ఎవరికి కూడా ఎటువంటి అపాయము కానీ అన్యాయం కానీ చేయకుండా వారిని ప్రేమించమని పలుకుతున్నారు. సోదర ప్రేమ అనే అంశము గుర్తు చేస్తూ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఏ విధముగా పరదేశులుగా జీవించి ఉన్నారో అక్కడ వారు దేవుని యొక్క ప్రేమను పొందుకున్న విధముగా అదే ప్రేమను వ్యక్తపరచమని తెలుపుతున్నారు. మూడవదిగా సమాజంలో ఉన్నటువంటి వితంతువులను, అనాధలను ప్రేమించమని తెలుస్తుంది. వితంతువులు,అనాధలు ఎటువంటి బలము లేనటువంటి వారు దేవుడే వారికి అండగా నిలబడుతున్నారు కావున ప్రతి ఒక్కరు కూడా వారి యెడల జాలి, దయ, ప్రేమను చూపిస్తూ మెలగవలసినదిగా ప్రభువు కోరుచున్నారు. ఎవరైతే వితంతువునుగాని పరదేశులు గాని అనాధలను కానీ భాదిస్తూ ఉంటారో వారి యొక్క బాధను చూసిన ప్రభు తప్పక బాధపెట్టే వారిని శిక్షిస్తాను అని తెలియజేస్తున్నాను కాబట్టి
ఇది ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత పొరుగువారి యెడల ప్రేమను వ్యక్తపరిచి జీవించుట. ఇంకా ప్రభువు చెప్పే మాట ఏమిటంటే ఏ వ్యక్తికి అయితే మనము అప్పు ఇస్తూ ఉంటామో ఆ వ్యక్తి దగ్గర ఎటువంటి వడ్డీ కూడా తీసుకోవద్దు తెలియజేస్తున్నారు ప్రస్తుత కాలంలో ఎవరు కూడా వడ్డీ లేకుండా ఏ అప్పు ఇవ్వటలేదు. ఎందుకు ప్రభువు ఈ విధంగా చెప్పారు అంటే మనకు ప్రేమ ఉన్న యెడల ఎదుటివారి మీద మనము భారము వేయము. వడ్డీ తీసుకొనుట ఒక విధముగా వారి మీద భారం వేసినట్లే కాబట్టి ప్రభువు వడ్డీని కూడా తీసుకోవద్దని తెలియజేస్తున్నాను. అప్పుడే మనం ఎదుటి వ్యక్తి మీద  ప్రేమను వ్యక్తపరుస్తుంటాం. ఈనాటి రెండవ పఠణంలో పునీత పౌలు గారు తెస్సలోనియ ప్రజల యొక్క విశ్వాస జీవితాన్ని మెచ్చుకుంటున్నారు ఎందుకంటే  మొదటిగా వారు అన్యులైనప్పటికిని, వేరే సాంప్రదాయములు అనుసరించినప్పటికిని దేవుని యొక్క సువార్త ప్రకటించినప్పుడు ప్రభువు యొక్క సువార్తను ప్రేమతో స్వీకరించి, దేవుని యొక్క వాక్యం అనుసారంగా జీవించినందుకు వారి యొక్క విశ్వాసము గొప్పదిగా ఉన్నందుకు పౌలు గారు వారి జీవితమును మెచ్చుకుంటున్నారు. విశ్వాసము కొరకై అనేక బాధలు అనుభవించినప్పటికిని కూడా ప్రభువు నందు విశ్వాసము కోల్పోకుండా జీవించినందుకు పౌలు గారు వారిని మెచ్చుకుంటున్నారు అదేవిధంగా సోదర ప్రేమను కలిగి జీవించమని తెలియజేస్తున్నారు.
ఈనాటి సువిశేష భాగములో పరిసయ్యులు యేసు ప్రభువుని ప్రధానమైన ఆజ్ఞ ఏమిటి అని అడుగుతున్నారు ఇది కేవలము యేసు ప్రభువుని పరీక్షించుట కొరకై వారి ఈ విధంగా అడుగుతున్నారు ఎందుకంటే వాస్తవానికి ఏసుప్రభు సద్దుకయ్యలు నోరు మూయించారని తెలుసుకొని పరిసయ్యులు కూడా ఏసుప్రభుని పరీక్షించాలనుకున్నారు అందుకే ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏమి అని అడుగుతున్నారు. ఆ కాలంలో యూదులకు దాదాపు 613 ఆజ్ఞలు ఉండేవి. యావే దేవుడు మోషేకు సీనాయి పర్వతం దగ్గర ఇచ్చిన 10 ఆజ్ఞలు కాలక్రమేనా 613 ఆజ్ఞలుగా చేయబడ్డాయి అందుకనే ప్రజలు ఏ ఆజ్ఞ ముఖ్యమో, ఏ ఆజ్ఞముఖ్యము కాదో తెలుసుకొన లేకపోయారు అందుకు ఆజ్ఞల్లో ప్రధానమైన ఆజ్ఞ ఏది అని అడుగుచున్నారు అందుకు ప్రభువు మొట్టమొదటిగా దేవుడిని పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో ప్రేమించాలి అని తెలుపుచున్నారు. మనము దేవుడిని ప్రేమించిన ఆయన యొక్క ఆజ్ఞలలో పాటిస్తాము, ఆయన యొక్క చిత్తమును నెరవేరుస్తాను అదేవిధంగా ఆయన కొరకు జీవిస్తూ ఉంటాం. ప్రభు ప్రేమించమని తెలుపుచున్నారు ఎందుకంటే ప్రేమకు సమస్తము సాధ్యము కాబట్టి. మనము ప్రేమ కలిగి జీవించినట్లయితే దేవుని కొరకు ఏమి చేయటానికైనా సిద్ధపడి ఉంటాము. ప్రభువు మన నుండి పూర్ణ ప్రేమ కోరుచున్నాను. కొన్ని కొన్ని సందర్భాలలో స్వార్థంగా ఉంటాం. దేవునికి ఇవ్వవలసినది పూర్ణంగా ఇవ్వలేము, చందాలు వేసేటప్పుడు కానీ, దేవునికి కానుకలు ఇచ్చేటప్పుడు కానీ, ప్రార్థించేటప్పుడు కానీ మనము పూర్ణ మనసుతో పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో దేవునికి సమర్పించు కాబట్టి అది సగం సగం గానే సమర్పించబడుతుంది ఆ యొక్క సగం ప్రేమ మాత్రమే మనము దేవుడి మీద చూపిస్తుంటాం కాబట్టి మనము దేవుడిని నిస్వార్థంతో సంపూర్ణంగా ప్రేమించాలి.
 రెండవ ఆజ్ఞ నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించమని ప్రభువు తలుపుచున్నారు. మన యొక్క అనుదిన జీవితంలో మొదటి ఆజ్ఞను పాటించుట  చాలా తేలిక ఎందుకంటే దేవుడిని ప్రతి ఒక్కరూ ప్రేమించగలరు. కానీ పొరుగు వారిని ప్రేమించుట మాత్రం కష్టం. దేవుడు కనపడరు కావున ఆయన ప్రేమిస్తారు కానీ కనిపించేటటువంటి తోటి మానవుడిని ప్రేమించుట అసాధ్యం. అనేక సందర్భాలలో ప్రభువు మనకు తెలియచేసిన విషయం ఏమిటంటే మీ శత్రువులను ప్రేమించమని కోరుతున్నారు, హింసించే వారి కొరకు ప్రార్థించమంటున్నారు అదేవిధంగా ఏ వ్యక్తి అయితే దేవుడిని ప్రేమిస్తున్నానని చెప్పుకుంటారో అట్టి వ్యక్తి తన తోటి వారిని ప్రేమించకపోతే అసత్య వాది అని తెలుపుచున్నారు కాబట్టి మనము దేవుడిని ప్రేమిస్తున్నాము అని ఎప్పుడూ నిరూపిస్తాము అంటే దేవుని యొక్క ప్రేమ తోటి మానవాళి మీద చూపించినప్పుడే మనకు దైవ ప్రేమ ఉన్నది. దేవుడిని ప్రేమించే వారు తప్పనిసరిగా తమ పొరుగు వారిని కూడా ప్రేమించాలి ఎందుకంటే పొరుగు వారిని ప్రేమించుట అనేది దైవ ప్రేమ నుండి జన్మించినది కాబట్టి మనందరం కూడా దైవ మానవ ప్రేమ కలిగి సోదర భావంతో జీవించాలి.

Fr. Bala Yesu OCD

11వ సామాన్య ఆదివారం

11వ సామాన్య ఆదివారం  యెహెజ్కేలు17:22-24, 1 కొరింతి 5:6-10, మార్కు 4:26-34 ఈనాటి పరిశుద్ధ గ్రంధ పఠణములు దేవుని యొక్క రాజ్య విస్తరణ గురించి బో...