30, సెప్టెంబర్ 2023, శనివారం

26 వ సామాన్య ఆదివారం

26 సామాన్య ఆదివారం

యెహెజ్కేలు 18:25-28

ఫిలిప్పీ 2:1-11

మత్తయి 21:28-32

 

 ఈనాటి పరిశుద్ధ దివ్య గ్రంథములు మానవుల యొక్క జీవితంలో దేవుని యొక్క చిత్తమును నెరవేర్చుటకు మంచిని చేయుటకు మారుమనస్సు కలిగి జీవించుట అనే అంశము గురించి తెలియజేస్తున్నాయి. ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితంలో ఎంతో మందికి మాటిస్తూ ఉంటాం కానీ అన్నిసార్లు మాటను నిలబెట్టుకోలేక ఉంటూ ఉంటాం అందుకని మన యొక్క జీవితంలో మన మాటలకు అలాగే మన క్రియలకు ఒక పొందిక అవసరం.

ఇచ్చినటువంటి మాట ప్రకారం మనందరం కూడా జీవించటానికి ప్రయత్నం చేయాలి దేవుడు మానవునుండి కోరేది హృదయమే కానీ పెదవులు కాదు అనగా కేవలం మాటలు మాత్రమే చెప్పడం కాదు మాటలకు తగినటువంటి క్రియలు కూడా ఉండాలి అనే అంశమును ప్రభువు బోధిస్తున్నారు.

ఈనాడు మనము చదివేటటువంటి మొదటి పట్టణంలో దేవుడు యెహెజ్కేలు ప్రవక్త ద్వారా పుణ్యాత్ముడు పతనమైనప్పుడు అదేవిధంగా పాపాత్ముడ పరివర్తనము చెందినప్పుడు కలిగేటటువంటి ప్రతిఫలం గురించి తెలుపుచున్నారు. ఇశ్రాయేలు ప్రజలు బావిలోనియా దేశంలో బానిసత్వ బ్రతుకు బ్రతికేటప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దుఃఖ సాగరంలో మునిగి జీవితంపై ఆశలను కోల్పోయారు అలాగా బాధలో నిరాశలో జీవితంపై నమ్మకం లేనటువంటి సందర్భంలో దేవుడు వారిని ఓదార్చటానికి యెహెజ్కేలు ప్రవక్తను పంపిస్తున్నారు. ప్రవక్త వారికి దేవుని యొక్క ప్రేమను గురించి మన్నింపులు గురించి తెలియజేశారు అలాగే వారి పాపాలు తెలుసుకొని పశ్చాతాపపడిమని కూడా ప్రవక్త బోధించారు.

ప్రవక్త హృదయ పరివర్తనము చందమని సందర్భంలో ప్రజలు తనతో వాగ్వాదానికి దిగి ఉన్నారు వారి యొక్క ఆలోచన ప్రకారం తమ యొక్క పూర్వం చేసినటువంటి తప్పిదములకు వారు శిక్షను అనుభవిస్తున్నారు అందుకనే ఇప్పుడు పక్షవాతం వలన కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటి అని ప్రవక్తతో వాదోపవాదానికి దిగి ఉన్నారు. బావిలోనిలో ఇశ్రాయేలు ప్రజలు తమ దుస్థితిని ఒక సామెత పూర్వకంగా వర్ణించారు అదేమిటంటే తండ్రులు దాక్షాపండులను తినిరి. పుత్రుల పండ్లు కోరలు పోయెను.(18:2).

అనగా తండ్రులు చేసినటువంటి పాపాలకు కుమారులు శిక్షను అనుభవిస్తున్నారని వారు భావించారు అయితే ఇలా వీరు భావించటానికి కూడా ఒక అర్థం ఉంది ఎందుకంటే యావే దేవుడు మోషే ద్వారా ప్రజలకు సిద్ధాంతాన్ని ఇచ్చి ఉన్నారు నాకు విరోధులుగా ఉన్న వారిని నేను వారి పితరుల పాపముల నిమిత్తము వారి కుమారులను మూడు నాలుగు తరముల వరకు శిక్షించెదను (నిర్గమ 20:5) అలాగే ద్వితీయోపదేశకాండములో విధంగా చెప్పబడినది నాకు విరోధులుగా తయారైన వారిని నేను వారి పితరుల పాపముల నిమిత్తము కుమారులను మూడు నాలుగు తరముల వరకు శిక్షించెదరు (5:9). ఇది అందరినీ ఉద్దేశించి చెప్పబడినటువంటి మాటలు. కాలక్రమేన దేవుడు యొక్క సిద్ధాంతమును విడిచిపెట్టి ప్రజలకు వ్యక్తిగత బాధ్యతను అప్పచెప్పారు.

దేవుడు ప్రజల యొక్క ఆనాటి స్వభావమును బట్టి మొదటి సిద్ధాంతాన్ని వాళ్లు అనుకరించేలాగా చేశారు కానీ వాస్తవానికి ప్రభువు రెండవ సిద్ధాంతానికి ప్రాముఖ్యత ఇచ్చారు. పట్టణము ద్వారా వ్యక్తిగత బాధ్యత సిద్ధాంతాన్ని బలపరుస్తున్నారు అనగా ఎవరు చేసినటువంటి తప్పిదములకు వారే బాధ్యులు తండ్రులు చేసినటువంటి పాపాల వలన కుమారులకు శిక్ష రాదు. ఇకమీదట ఎవరైతే పాపం చేస్తున్నారు వారి యొక్క పాపమునకు వారు మాత్రమే బాధ్యులు అని తెలుపుతున్నారు. మొదటి పఠణంలో ప్రభువు సజ్జనుడను ఎల్లప్పుడూ కూడా మనిషిని మాత్రమే చేస్తూ జీవించమని తెలుపుచున్నారు. మంచి మార్గము నుండి వైదొలగకుండా ఎల్లప్పుడూ కూడా పుణ్యకార్యాలు చేస్తూనే జీవించాలని తెలుపుతున్నారు ఎందుకంటే ఒకవేళ తన యొక్క మంచితనము నుండి ఆయన వైద్యులకి పాపపు క్రియలు చేసినట్లయితే కేవలము తాను చేసినటువంటి పాపము వాళ్ళని తాను మరణించును తన యొక్క పాపములకు తానే బాతుడు అని తెలుపుచున్నారు. ఆదిలో దేవుడు ఆదామును సృష్టించినప్పుడు అంతగా బాగుగా ఉండెను అతడిని మంచి వానిగా సృష్టించి ఉన్నారు కేవలం మంచి నుండి వైదొలిగి చెడును అలవర్చుకున్న సందర్భంలోనే ఆదాముకు మరణము వచ్చినది కాబట్టి దేవుడు మనలను మనిషి వారిని సృష్టించారు కాబట్టి ఎల్లప్పుడు కూడా మంచి చేయుటకు మనము ప్రయత్నం చేయాలి.

పాపాత్ములను సైతం ప్రభువు వారి యొక్క దుర్మార్గముల నుండి వైదొలిగిన్యాయ సమ్మతమైన పనులను చేసి తన యొక్క ప్రాణమును కాపాడుకోమని ప్రభువు తెలుపుచున్నారు. విధముగా చేయుట ద్వారా పాపాత్ములు సైతము తమ యొక్క ప్రాణాలు కాపాడుకుంటున్నారు. దానికి ముఖ్యమైన నిదర్శనము నిలవే పట్టణ వాసులు తమ యొక్క దుష్టత్వము నుండి మారు మనసు పొంది దేవుని యొక్క మాట ప్రకారంగా వారు నడుచుకున్నారు. ఇద్దరు వ్యక్తులలో మనము చూసే అంశం ఏమిటంటే మనసు మార్చుకొనుట అది విధంగానంటే మంచివారు తమ యొక్క మంచితనము నుండి మనసు మార్చుకొని దుష్టక్రియలకు పాల్పడుతున్నారు రెండవ వారు అనగా చెడువారు పాపములో జీవించిన వారు తమ యొక్క పాపపు జీవితము నుండి ఆలోచనలను నడవడికను మార్చుకొని హృదయ పరివర్తనము చెంది దేవుని చెంతకు రావాలి. ఆలోచనలు మార్చుకొనుట ద్వారానే తమ యొక్క ప్రాణాలు కాపాడుకోగలుగుతున్నారు కాబట్టి దేవుడు వారికి మారుమనసు పొందుటకు అవకాశాన్ని ఇస్తున్నారు అదేవిధంగా మనకి కూడా ప్రభువు అవకాశాన్ని ఇస్తూనే ఉన్నారు కాబట్టి ఎల్లప్పుడూ మంచిని అలవర్చుకొని జీవించుదాం. ఒకవేళ మన బలహీనతల వలన దేవుని యొక్క మార్గములకు దూరమైనప్పుడు దేవుని యొక్క వాక్కు ద్వారా హెచ్చరింపబడినప్పుడు మన మార్గాలు సరిచేసుకొని ఆలోచనలను సరిచేసుకుని దేవుని చెంతకు తిరిగి రావాలి.

ఈనాటి రెండవ పఠణంలో క్రీస్తు ప్రభువు యొక్క అనుచరులుగా జీవించే వారికి ఉండవలసినటువంటి కొన్ని లక్షణాలు గురించి తెలుపుచున్నారు వారు తమ జీవితంలో దయ కలిగి, పరస్పరమ ప్రేమతో జీవించాలి. పౌలు గారు ఆనాటి ఫిలిప్పు ప్రజలను ఐక్యంగా ఉండుటకు పిలిచి ఉన్నారు. ఐక్యముగా ఉండాలి అంటే ప్రతి ఒక్కరిలో ఎటువంటి అహంభావం లేకుండా వినయంతో జీవించాలి అని తెలుపుచున్నారు దానిలో భాగంగా పౌలు గారు క్రీస్తు ప్రభువుని ఒక సుమాత్రికగా అందరికీ చూపిస్తున్నారు.

ఆయన "తనను తాను తగ్గించుకొని మానవ శరీరమును ధరించి ఒక సేవకున్ని వలె జీవిస్తూ తండ్రి చిత్తమును నెరవేర్చారు. ప్రభువు పరలోకంలోనే ఉండాలి అనేటటువంటి స్వార్థం విడిచి మానవుల మధ్యకు ఒక సామాన్యమైన వ్యక్తిగా వచ్చి ఉన్నారు ఇది కేవలము ఆయన యొక్క వినయము వలనే సాధ్యం. వినయం కలిగి జీవించినప్పుడు అందరితో కూడా కలసి మెలసి జీవించగలం ఎవరినీ చులకనతో చూడము అందరు కూడా సరి సమానులే అనే భావం కలిగి ఉంటాం. కాబట్టి అందరూ ఐక్యంగా ఉండాలి అంటే మన యొక్క మనస్తత్వాలు మార్చుకొని వినయం కలిగి ఉండాలి అన్నది పౌలు గారు ఏసుప్రభు జీవితం ద్వారా తెలియచేస్తున్నారు.

ఈనాటి సువిశేష భాగములు ఏసుప్రభు ఇద్దరు కుమారుల యొక్క ఉపమానమును చెబుతున్నారు. ఇద్దరు కుమారులని తండ్రి ప్రేమిస్తున్నాడు, సరి సమానంగా బాధ్యతలను అప్పచెప్తున్నారు. పోయిన వారం సువిశేషములో వలె యజమానుడిలాగా తండ్రి తన ఇద్దరు కుమారులను తన యొక్క ద్రాక్ష తోటలో పనిచేయుటకు వెళ్ళమని చెబుతున్నాడు.

మొదటిగా తన పెద్ద కుమారుడితో వెళ్లి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పినప్పుడు పెద్ద కుమారుడు నిరాకరించాడు కానీ తరువాత మనసు మార్చుకుని తండ్రి చెప్పిన విధంగా ద్రాక్ష తోటలోకి వెళ్లి పని చేశారు. ఇక్కడ పెద్ద కుమారుడు యొక్క మారే మనస్తత్వం చూస్తున్నాం అలాగే వేరొకరి యొక్క చిత్తము తన జీవితంలో నెరవేర్చేటటువంటి మనసు కలిగిన విధానమును తెలుసుకుంటున్నాం. అదేవిధంగా రెండవ కుమారుడుతో తండ్రి పనిచేయుటకు ద్రాక్ష తోటకు వెళ్ళు అని చెప్పినప్పుడు ఆయన వెంటనే వెళతాను అని మాట ఇచ్చి వెళ్లలేదు.

ఇద్దరు వ్యక్తులను ప్రభువు తెలియచేస్తూ ఎవరు తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు అని పరిసయ్యలను, ధర్మశాస్త్ర బోధకులను అడుగుతున్నారు అందుకు అందరూ మొదటి వ్యక్తియే తండ్రి చిత్తమును నెరవేర్చారు. అందుకు సమాధానంగా ప్రభువు సుంకరులను పాపులను సుమాత్రకులుగా ఇస్తున్నారు ఎందుకంటే వారి మొదటిలో దేవుని యొక్క సందేశాన్ని నిరాకరించినప్పటికీ తరవాత మనసు మార్చుకొని దేవుని యొక్క మాటలను అంగీకరించి యొక్క దైవ వాక్కునుసారముగా జీవింప సాగారు అందుకే వారు మిగతా పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకుల కంటే పరలోక రాజ్యంలో ముందుగా ప్రవేశిస్తారు అని ప్రభువు తెలుపుచున్నారు. కొంతమంది యూదులు రెండవ కుమారుడుని పోలి ఉన్నారు వారు మాట ఇచ్చి మాట ప్రకారం గా జీవించలేకపోయారు తమ యొక్క సొంత చిత్తమునే నెరవేర్చుటకు ఇష్టపడ్డారు.

ఏసుప్రభు చేసిన అనేక అద్భుతం కార్యములు చూసినప్పటికీ కూడా వారి యొక్క మనసులు మార్చుకోవటానికి వారు సిద్ధంగా లేరు వారు విధంగా ఉన్నారంటే "నేను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అని గట్టిగా నమ్మి ఇక మార్పు చెందుటకు ఇష్టం లేనటువంటి వారుగా ఉన్నారు అందుకని వారు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కష్టమని ప్రభువు తెలుపుచున్నారు. ఉపమానములో వ్యక్తుల యొక్క విధేయతను చూస్తున్నాం,‌ ఇతరుల  యొక్క చిత్తమును నెరవేర్చుటను చూస్తూ ఉన్నాం కాబట్టి మనము కూడా అభివృద్ధి చెందాలన్నా?, విశ్వాసములో ఎదగాలన్నా? మనసు మార్చుకుని జీవించాలి. అప్పుడు మాత్రమే దేవుడికి దగ్గరవుతాం. మనం కూడా మన జీవితంలో దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ జీవించాలి.

Fr. Bala Yesu OCD


ఆగమన కాలం మొదటి ఆదివారం

ఆగమన కాలం మొదటి ఆదివారం  యిర్మీయా 33:14-16, 1 తెస్స3:12,4:2, లూకా 21:25-28,34-36 ఈనాడు తల్లి శ్రీ సభ ఆగమన కాలమును ప్రారంభించినది. ఆగమన కాలంత...