ఇరువదినాలుగవ సామాన్య ఆదివారము :
సీరా:27:30-28:7 రోమి : 14:7-9; మత్త: 18:21-35
ఈనాటి మూడు పఠనాల ద్వారా దేవుడు మనకు ఏమి తెలియజేస్తున్నాడు అంటే, “హద్దులు లేని క్షమాపణ” కలిగి జీవించాలని తెలియజేస్తున్నాడు.
మొదటి పఠనము:
1.పగ- కోపములకు దూరముగా ఉండాలి:
ఈనాటి మొదటి పఠనములో పగ కోపము మహా గోరమైనవి. పాపి ఆ రెండిటికి వశుడగును. అని తెలుపుతుంది. ఎందుకంటే ఈ పగ కోపములు మనలను మానవులనుండి, దేవునినుండి వేరుచేస్తాయి.
ఆది:4:5-15 లో చూస్తే, కయ్యిను కోపపడ్డాడు. దేవుని ఆజ్ఞలకు విరోధముగా పాపము కట్టుకున్నాడు. తన సొంత తమ్ముడిని చంపివేసాడు.
సంఖ్యా:22:21-31లో బిలాము మీద దేవుడు కోపపడుతున్నాడు. ఎందుకంటే తాను మోవాబు నాయకులతు చేతులు కలిపి దేవుని ప్రజలగు ఇశ్రాయేలీయులకు విరుద్ధముగా మాట్లాడబోవుచున్నాడు.
సామె:29:22“కోపిష్టి తగవులుతెచ్చి పాపము పెంచును అని చెప్పుచున్నది”.
యోహా: 2:14-15 లో చూస్తే, “దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారిని, డబ్భులు మార్చువారిని ఆయన చూచెను. ఆయన త్రాలతో కొరడా పేని, గొర్రెలను, ఎడ్లను అన్నిటిని, ఆలయ వెలుపలకు తోలెను. డబ్భులు మార్చువారి నాణెములను చిమ్మివేసి బల్లలను పడత్రోసి వీనిని ఇక్కడినుండి తీసుకుపొండు. నా తండ్రి ఆలయమును వ్యాపారస్థలముగా చేయవలదు అని చెప్పెను.ఇక్కడ మనము యేసుప్రభువు యొక్క కోపాన్ని మనం చూస్తున్నాం. అయితే, దేవుని కోపం మనలను మార్చడానికి అయితే మనకోపము మాత్రం ఆదేవునినుండి మన తోటివానినుండి వేరుపడి సంభంధం లేకుండా జీవిస్తున్నాం.
కానీ మొదటి పఠనములోదేవుడు అంటున్నాడు, దేవుని ఆజ్ఞలు స్మరించి,
పొరుగువానిమీద కోపం మానుకోవాలి అని తెలుపుచున్నాడు. ఎప్పుడయితే మనము మనలో ఉన్నటువంటి కోపాన్ని తొలగించి ప్రేమను క్షమాగుణాన్ని నింపుకుంటామో అప్పుడు దేవుడు మన జీవితములో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు. అదే మనము సువిశేష పఠనములో చూస్తున్నాం.
సువిశేష పఠనము:
సువిశేష పఠనములో పేతురు గారు యేసుప్రభువు దగ్గరకు వచ్చి, “ప్రభూ! నా సహోదరుడు నాకు ద్రోహము చేసిన యెడల ఎన్ని పర్యాయములు క్షమించాలి? ఏడూ పర్యాయములా? అని అడుగుతున్నాడు. అపుడు యేసు ప్రభువు,
ఏడుకాదు ఏడు డెబ్బది పర్యాయములు అని సమాధాన మిచ్చాడు”. అంటే ఇక్కడ మనము చూసినట్లయితే, పేతురుగారు దేవుని ముందు గొప్పవానిగా ఎంచబడాలని తాను ఏడు పర్యాయములు క్షమాపణ గూర్చు అడుగుతున్నాడు. పాత నిబంధన గ్రంధములో మనం చూస్తే, ఒక వ్యక్తిని మూడు పర్యాయములు మాత్రమే మన పొరుగు వానిని క్షమించాలి అని తెలుపబడుతుంది. కానీ పేతురు మాత్రం ఏడు పర్యాయములు అని తెలుపుతున్నాడు.సాధారణముగా బైబిల్ గ్రంధములో చూస్తే ఏడు అను పదము పరిపూర్ణతకు గుర్తు. ఒక వేళ పేతురుగారు కూడా అలాగే అనుకోని ఏడుసార్లు అను ఉండవచ్చు. అంటే, ఒక మానవుడు ఒక విషయాన్ని గూర్చి రెండింతలు ఆలోచిస్తే,
మరి నిన్ను నన్ను కన్న దేవుడు మనయందు ఎన్నిసార్లు ఆలోచించాలి.
పాత నిబంధనా గ్రంధములో మనము చూస్తే, నిర్గ: 21:24,
లో కంటికి కన్ను, పంటికి పన్ను అని తెలుపుతుంది. ఇక్కడ ఒక వ్యక్తి మనకు విరోధముగా చేసినట్లయితే, ఆ వ్యక్తికి అదే విధముగా బుద్ధి చెప్పాలి. నిన్ను తాను కొడితే తనని కూడా అలాగే కొట్టాలి అని మనకు అర్ధం అవుతుంది. కానీ, నూతన నిబంధన గ్రంధములో దేవుడు అలా అనడం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి పైన క్షమాగుణాన్ని గురించి తెలియజేస్తున్నాడు.
మత్త: 5:38 కంటికి కన్ను,
పంటికి పన్ను అని పూర్వము చెప్పబడిన దానిని మీరు వినియున్నారుగదా! నేనిప్పుడు మీతో చెప్పున దేమన: నీకు అపకారము చేసిన వానికి ప్రతీకారము చేయకుము. నీ కుడి చెంపపై కొట్టిన వానిని నీ ఎడమ చెంపపై కూడా కొట్టనిమ్ము" అని యేసు ప్రభువు తెలియజేస్తున్నాడు.
ఒక రోజు పునీత. రెండవ జాన్ పాల్ పోపు గారిని 13-05-1981 సవంత్సరంలో "మెహ్మెత్ అలీ అఙ్క" అను వ్యక్తి తనను తుపాకీతో కాల్చినప్పుడు,
తనను కొన్ని రోజుల తరువాత జైలులో వున్నా తనను పరామర్శించి, తనను హృదయ పూర్వకముగా క్షమించాడు. ఈనాడు నువ్వు నేను చేయ వెలిసిన పని కూడా ఇదే. క్షమాగుణాన్ని కలిగి జీవించడం.
అయితే యేసు ప్రభువు దీనిని మనకు క్లుప్తముగా వివరించడానికి ఒక ఉపమానమును తెలియజేస్తున్నాడు. అదే క్షమా ధర్మములఉపమానము.
ఇక్కడ రాజు దేవునికి సూచన.
ఋణస్థుడు మనకు సూచన.
ఈరాజు తన దగ్గర తీసుకున్న కోట్ల వరహాల వ్యక్తిని తన యొక్క దీన స్థితిని చూసి క్షమిస్తున్నాడు. కానీ అదే క్షమను పొందిన ఆ ఋణస్థుడు మాత్రం తనదగ్గర కొన్ని రూకలను రుణపడియున్న వ్యక్తిని క్షమించలేక పోయాడు.
2.క్షమా గుణాన్ని కలిగి ఉండాలి:
ఈ క్షమాగుణాన్ని కలిగి జీవించాలి అంటే ముందుగా మన గురించి మనము తెలుసుకోవాలి. నాజీవితము ఎలావుంది. నేను ఎలా జీవిస్తున్నాను అని. అయితే ఒక రోజు పు. మాథెర్ థెరెసా గారు ఒకరోజు తన దగ్గర వున్నా పిల్లల ఆహారంకోసం వీధి వీధి వెళ్లి సహాయాన్ని అర్ధిస్తున్నప్పుడు ఒక వ్యాపారి దగ్గరకు వచ్చి,
అయ్యా! నా పిల్లలు ఆహారంకోసం అల్లాడిపోతున్నారు. మీకు తోచినంత వారికి ఇవ్వండి అని చేయిచాచి అడిగినప్పుడు ఆ వ్యాపారి ఆమె వైపు కోపంగా చూసి తన చేతిలో ఉమ్మును ఉసాడు. అప్పుడు పు. మాథెర్ థెరెసా గారు తన వైపు,
ఆ ఉమ్ము వైపు దీనంగా చూస్తూ,
అయ్యా! ఇది నాకోసము మీరు ఇచ్చారు. మరి నా పిల్లలకు ఏమి ఇస్తారు అన్నప్పుడు ఆ వ్యాపారి ఆ మాటలకు కలత చెంది కన్నీరు కారుస్తూ,
అమ్మా నేను చేసినది చాలా తప్పు. నన్ను క్షమించండి. నేను మీ పిల్లలకు ఎంతయినా సహాయముచేస్తానని చెప్పి వారికి సహాయము సహసాడు. ఇలాంటి జీవితమునే మనంకూడా కలిగి ఉండాలి. మత్త: నీ కుడిచెంపపైకొట్టిన వానికి నీ ఎడమ చెంపకూడా చూపుము అని దేవుడు అంటున్నాడు. అంటే,
వారిని క్షమించమంటున్నదే కానీ వారిపై తెరగబడయును అని అనడం లేదు. దీనికి ఉదాహరణ మన దేవుడవైన యేసుప్రభువు. ఎందుకంటే మన దేవుడు క్షమించే దేవుడు.
యోహా:8:1-11 లో వ్యభిచారము పట్టుబడిన స్త్రీని క్షమియించాడు". అందరూ ఆమెను ద్వేషించినా కానీ యేసు ప్రభువు మాత్రం హృదయపూర్వకముగా క్షమించాడు.
మత్త:26:75,నేను నిన్ను ఎరుగను అని మూడు సార్లు పలికిన పేతురుని క్షమించాడు.
లూకా: 23:40-43సిలువమీద వున్న దొంగను క్షమించాడు.
లూకా: 15:18-24 తప్పిపోయిన కుమారుని క్షమించాడు.
తనను సిలువపై కొట్టి, ఉమ్మివేసి,
గెలిచేసి,
ముళ్లకిరీటముపెట్టి,
ఇతడు ద్రోహి అని నిందిచి, ఇతడు పాపి సుంకరులతో,
పాపులతో కలిసి భుజిస్తాడు,
ఇతడు తిండిబోతు అని ఎంతోమంది తనను అని దూషించినా,
కొట్టినా,
ఇబంది పెట్టినా ఒక్కరిని కూడా పల్లెత్తి ఒక్క మాటకూడాఆ అనలేదు. కానీ థానే చివరికి తండ్రీ! వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు. వీరిని క్షమించండి అని ప్రార్ధన చేస్తున్నాడు. ఈనాడు మనము కూడా చేయ వలసిన ప్రార్ధన కూడా ఇదే.మనకు మన దేవుడవైన యేసుప్రభువు నేర్పించిన పరలోక ప్రార్ధనలో ప్రతిరోజు మనము జపిస్తూనే వున్నాం. అది ఏమిటంటే, మాయొద్ద అప్పుపడిన వారిని మేము క్షమించునట్లు మా అప్పులను కూడా క్షమించుము అని మత్త: . అయితే ఒకవేళ మన పొరుగు వారిని మనము క్షమించకుండా ఎప్పుడు దేశిస్తూనే ఉంటే మన ప్రార్ధన దేవుడు ఆలకించాడు ఇంక మన పాపములను క్షమించడు. కాబట్టి ఎప్పుడయితే దేవుడు మనకు దయచేసి దయార్ద్ర హృదయముతో మన పొరుగువారికి క్షమించాలి. అప్పుడే మన జీవితానికి ఒక అర్ధము పరమార్ధము ఉంటుంది. అయితే ఈనాటి రెండవ పఠనంలో పు. పౌలు గారు మనకు మన జీవితము గురించి క్లుప్తముగా తెలియజేస్తున్నాడు.
రెండవ పఠనము:
3.మనజీవితము మనకొరకు కాదు ఇది కేవలము దేవుని కొరకే:
పు.పౌలుగారు అంటున్నారు, "మనలో ఎవడును తనకొరకు జీవింపడు. తనకొరకు మరణింపడు. మనము జీవించినా ప్రభువు కొరకే జీవించుచున్నాము. మరణించునా ప్రభువు కొరకే మరణించుచున్నాము" అని. దీని అర్ధం ఏమిటంటే,
మన జీవితము మనకొరకు కాదు. మనకు ఈ జీవితాన్ని ఇచ్చిన దేవుని కొరకు. ఎందుకంటే మనలను తన కొరకే సృజించుకున్నాడు. తనతో ఉండటానికి,
తన ఆజ్ఞలను పాటించడానికి.
కాబట్టి తనతో ఉండాలి అంటే తన ఆజ్ఞలను పాటించాలి. తన ఆజ్ఞలు మనకు ఏమి నేర్పిస్తున్నాయి అంటే,
1.దేవుని ప్రేమించమని
2.మన పొరుగువారికి ప్రేమించమని.
మనము ఎప్పుడయితే దేవుని ప్రేమిస్తామో, అప్పుడు మనము మన పొరుగువానిని కూడా ప్రేమిస్తాము. కానీ ఎప్పుడయితే మన దేవుని ద్వేషిస్తామో అప్పుడు మన పొరుగు వానినికూడా ద్వేషిస్తాము. కాబట్టి ఈనాటి మూడు దివ్యగ్రంధ పట్టణాల ద్వారా దేవుడు మనకు బోధించేది, ఒకరిపై ఒకరికి కోపము పగ లేక ఇతర మనస్పర్థలు లేకుండా పరస్పర సహోదరా భావము కలిగి ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరినొకరు క్షమించుకుంటూ జీవించాలని భోదిస్తున్నాయి.
కాబట్టి ఈనాటి ఈ దివ్య బలిపూజలో పాల్గొంటున్న మనమందరము ఈ క్షమా గుణాన్ని కలిగి జీవిస్తూ దేవుని ప్రేమను పొందుతూ ఒక ఆదర్శవంతమయిన క్రైస్తవ బిడ్డలుగా జీవించాలి అని ఈ దివ్యబలిపూజలో ప్రార్ధన చేద్దాం.
బ్రదర్. శాంసన్
డీకన్. సునీల్ ఓ సి డి.
డీకన్. జోసెఫ్ మారియో ఓ సి డి.