6, మే 2023, శనివారం

పాస్కా 5 వ ఆదివారం

 పాస్కా 5 వ ఆదివారం

అపో 6:1-7

1 పేతురు 2:4-9

యోహాను 14:1-12

    ఈనాటి దివ్య పఠనాలు క్రైస్తవ జీవితం యొక్క ఔన్నత్యమును, గొప్పతనం గురించి వ్యాప్తి గురించి తెలియజేస్తూ ఉన్నాయి. 

ఈనాటి మొదటి పఠనంలో అపోస్తులలు సువార్త పరిచర్యకు సహాయంగా ఉండుటకు ఏడుగురు సోదరులను ఎన్నుకుంటున్నారు. పెంతుకోస్తు పండుగ తర్వాత అపోస్తులలు తమ యొక్క విలువైన సమయమును మొత్తము కూడా సువార్త ప్రకటన చేయుటకు స్వస్థత నిచ్చుటకు కేటాయించిరి. అయితే శ్రీ సభ ప్రారంభమైన సమయంలో గ్రీకులకు యూదులకు మధ్య కొన్ని సాంప్రదాయ ప్రకారంగా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. గ్రీకుల యొక్క వితంతువులు నిరాకరించబడ్డారని నిర్లక్ష్యం చేయబడ్డారని వారి మధ్య వారు సనుగు కొనసాగరి, అయితే దానికి పరిష్కారం ఇచ్చుటకు అపోస్తులలు ఇంకా కొంతమంది సేవకులను ఎన్నుకుంటున్నారు.

 ఏసుప్రభు ఎలాగైతే తన యొక్క సువార్త సేవకు మొదట్లో శిష్యులను సహకరించుటకు పిలిచి ఉన్నారో అదే విధముగా ఈ పనిని ఇద్దరు అపొస్తలులు కూడా ఏడుగురు వ్యక్తులను స్వార్థ సేవ నిమిత్తమై అదేవిధంగా సమాజంలో ఉన్న వితంతువులకు సహాయం చేయుట నిమిత్తమై వారిని ఎన్నుకుంటున్నారు. ఈ పనిని పన్నిద్దరూ శిష్యులు తాము ఎందుకు దైవ పిలుపును పొందాము అనే ఉద్దేశమును అక్కడి విశ్వాసులకు తెలియచేస్తున్నారు అదేమిటంటే "వారి సమయం అంతా ప్రార్ధించుటకు అదే విధముగా వాక్య పరిచర్య చేయుటకు" వినియోగిస్తారు అని పలికారు. ఏసుప్రభు కూడా ఈ ఉద్దేశ్యం కొరకే తన శిష్యులను తన సేవకై పిలిచారు. (మార్కు 3:13-14).

ఇక్కడ మనము గమనించవలసిన అంశం ఏమిటంటే ఈ ఏడుగురు విశ్వాసుల కూడా గ్రీకు దేశస్తులే. వారే తమ ప్రజల గురించి అడిగారు కాబట్టి వారు అయితేనే సక్రమంగా న్యాయం చేస్తారు అనే ఉద్దేశంతో క్రైస్తవులుగా మారిన గ్రీకు వారిని ఎన్నుకుంటున్నారు. ఈ ఏడుగురు విశ్వాసులు అపోస్తుల యొక్క పరిచర్యకు సహకరిస్తున్నారు. మనందరం కూడా తీరు సభ యొక్క కట్టడిలో నేర్చుకుంటున్నాం, ఆరవ శ్రీ సభ కట్టడ మనకు తెలియచేసే అంశం ఏమిటంటే విచారణ గురువులకు సహాయం చేయుదువుగాక. ఈ విశ్వాసులు ఏడుగురు అపోస్తులకు సహకరిస్తున్నారు, వారి యొక్క బాధ్యతను నెరవేరుస్తున్నారు. దేవుని సేవకై ఉండేవారికి ఎలాంటి లక్షణాలు ఉండాలో అపోస్తులులు తెలియచేస్తున్నారు. అపోస్తులు మూడు ప్రధానమైన అంశాల గురించి తెలియజేస్తున్నారు.

1. వారు పవిత్రాత్మతో నిండిన వ్యక్తులై ఉండాలి.

2. జ్ఞానము కలిగిన వారై ఉండాలి.

3. సమాజంలో మంచి పేరు మరియు గౌరవం కలిగిన వారై ఉండాలి.

ఒక్క దైవ సంఘమును నడిపించుటకు మరియు దేవుని యొక్క స్వార్థ సేవ చేయుటకు సంఘ కాపరులకు ఈ మూడు లక్షణాలు ఉండాలి.

- పవిత్రాత్మతో నింపబడిన వారు అనగా దేవుని యొక్క సేవకు తమను తాము ఎల్లప్పుడూ కూడా  సిద్ధం చేసుకుంటూ దేవుని యొక్క ఆజ్ఞల పాటిస్తూ జీవించేవారు,  ప్రార్థించేటటువంటి వ్యక్తులు, దేవునికి విధేయత చూపించేటటువంటి వ్యక్తులు, పాపము చేయకుండా ఆదర్శంగా జీవించేవారు అలాగే దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించేటటువంటి వ్యక్తులు.

-  జ్ఞానము కలిగిన వారిని ఎందుకు ఎన్నుకుంటున్నారంటే వారు తమ యొక్క జ్ఞానం వలన మంచినీ -  చెడును, పాపమును,  పుణ్యమును విశ్వాసులకు తెలియచేసి వారి యొక్క దైవ జ్ఞానముతో ప్రజలను దేవుని వైపుకు నడిపిస్తారు. వారి యొక్క జ్ఞానము అవిశ్వాసము అనే అజ్ఞానమును ప్రజల నుండి తొలగించేలాగా చేస్తుంది. ఈ ఎన్నుకొనబడిన వారికి దైవ జ్ఞానము ఉన్నది కాబట్టి వారు అనేకమందిని పరలోకం వైపు నడిపిస్తున్నారు.

- సమాజంలో పేరు ఉన్న వారిని ఎందుకు ఎన్ను కొవాలి అంటే వారు చెప్పేటటువంటి ఒక మాటకు అంత పలుకుబడి అదే విధముగా గౌరవం ఉంటుంది. మన జీవితంలో సమాజంలో సుమాతృకుగా లేనటువంటి వారి మాట మనం వినుము ఎవరైతే మంచినీ బోధిస్తారు మంచి పేరు కలిగి ఉంటారు మంచిగా జీవిస్తారో వారి యొక్క మాటలే మనం ఎక్కువగా పాటిస్తూ ఉంటాం అందుకని అపోస్తులలు దేవుని యొక్క సేవ నిమిత్తమై పవిత్రాత్మ కలిగిన వ్యక్తులను జ్ఞానము కలిగిన వ్యక్తులను సమాజంలో పేరు ఉన్నటువంటి ఏడుగురును ఎన్నుకుంటున్నారు. ఈ ఏడుగురు మీద చేతులుంచి ప్రార్థిస్తూ వారు దేవుని యొక్క ఆత్మను కృపను పొందే లాగా ఈ అపోస్తులు వారికి తోడుగా ఉంటున్నారు.

మోషే ప్రవక్త దేవుని యొక్క సేవ నిమిత్తమై ఏ విధంగానైతే 70 మందిని ఎన్నుకుంటున్నారో అదే విధముగా క్రైస్తవత్వం విస్తరిల్ల చేయుటకు అలాగే క్రీస్తు ప్రభువు యొక్క గొప్పతనమును చాటిచెప్పుటకు శిష్యులు ఇంకా కొంతమందిని దైవ సేవ నిమిత్తమై ఎన్నుకుంటున్నారు.

ఈనాటి రెండవ పఠనంలో ఏసు క్రీస్తు ప్రభువు ఆయనయే సజీవ శిల అనుయు అలాగే ఇల్లు కట్టడానికి త్రోసి వేయబడిన రాయి మూలరాయిను అని తెలిపారు. దేవుడు యేసు క్రీస్తు ప్రభువును క్రైస్తవ సంఘానికి ఒక మూలరాయిగా ఎన్నుకున్నారు. ఈ క్రైస్తవ సంఘ నిర్మాణం ప్రభు ద్వారానే జరిగింది. తండ్రి దేవుడు పూర్వభేదంలో ఒక మూలరాయిని తన రక్షణ నిమిత్తమై వేసి ఉన్నారు. 

పూర్వ వేదంలో  తండ్రి దేవుడు ఎన్నుకున్న అమూల్యమగు శిల ఆయన ఇశ్రాయేలు ప్రజలకు ప్రసాదించే రక్షణ. దైవ రక్షణ అనేది ఒక విలువైన రాయి. ఆ రాతిని తండ్రి దేవుడు సీయోనులో మూలరాయిగా స్థాపించారు అనగా ఎరుషలేము నగరంలో స్థాపించబడ్డ దావీదు రాజ్యానికి మరియు అతని వంశానికి తండ్రి దేవుడు తన రక్షణ వాగ్దానం చేస్తున్నారు. ఆయన ఇచ్చే రక్షణయే ఇశ్రాయేలు ప్రజలకు ఆయన వేసే మూలరాయి. ఎవరైతే ఆయనను విశ్వసిస్తున్నారు వారందరూ రక్షణ పొందుతారు. 

ఈ వాగ్దానం ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభువు జీవితం ద్వారా నెరవేరింది. ఏసుప్రభు నూతన ఇస్రాయేలు ప్రజలకు రక్షణ తీసుకుని వచ్చారు. ఏసుక్రీస్తు ప్రభువు మొదటిలో నిరాకరించబడిన , తన సొంత ఊరిలోనే, తన సొంత ప్రజలే తనను అర్థం చేసుకోలేదు. ఆయనను నిరాకరించారు, త్రోసివేశారు,  అవమానములకు గురి చేశారు అయినప్పటికీ ఆయన మన అందరి రక్షణ నిమిత్తమై మృతి చెందారు. ఆ నిరాకరించబడిన రాయే ఈనాడు మనందరి రక్షణకు కారణమయ్యారు. ప్రభువు యొక్క మరణం పునరుత్థానము తర్వాత ఆయన యొక్క విలువను గొప్పతనమును తెలుసుకున్నారు అందుకని ఆయనను రక్షకునిగా దేవునిగా అంగీకరించారు. 

ఈ విధముగా క్రైస్తవత్వం రోజురోజుకీ గొప్పగా విస్తరిల్లినది. పేతురు గారు ఈ రెండవ పఠనం లో ఇంకొక గొప్ప సత్యమును తెలియజేస్తున్నారు మనందరం కూడా దేవుని చేత  ఎన్నుకొనబడిన ప్రజలము, రాచరికపు గురుకులము, పవిత్రమైన జనము, దేవుని యొక్క సొంత ప్రజలు. ఈ మాటలన్నీ పూర్వ వేదంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి పలికారు నిర్గమకాండం 19: 5-6. ఇప్పుడు ఈ మాటలన్నీ నూతన క్రైస్తవులందరికీ చెందుతాయి ఎందుకంటే క్రైస్తవులు కూడా ఎన్నుకొనబడిన జాతి. 

ప్రపంచంలోని ప్రజలందరిలో దేవుడు కొందరిని ఒక ప్రత్యేకమైన ఉద్దేశ్యముతో ఎన్నుకొని వారితో ఒడంబడిక చేసి వారికి దేవుడు తోడుగా ఉండి వారి ద్వారా అన్యులకు రక్షణను అందచేయదలిచారు. క్రైస్తవులు రాచరికపు గురుకులము అనగా గురువు దేవుని సమీపంలో ఉండి అన్యులను దేవుని దరికి చేర్చగలుగుతారు దేవునికి బలులు సమర్పిస్తూ, అర్పణలను సమర్పిస్తూ, వారి ఉద్దేశములను దేవుని చెంతకు తీసుకొని వెళతారు. 

క్రైస్తవులందరూ కూడా పవిత్రమైన జనం, ఎందుకంటే జ్ఞాన స్నానము ద్వారా వారు శుద్ధి చేయబడుతున్నారు, దేవుని బిడ్డలుగా మారుతున్నారు, పవిత్రులుగా చేయబడుతున్నారు కాబట్టి వారు ఇక దేవుని చిత్తానుసారంగా జీవిస్తూ తమ జీవితాన్ని దేవునికి అంకితం చేసుకుని ఆయన కొరకై ఈ లోకంలో తమ జీవితాన్ని వినియోగించాలి. క్రైస్తవులు దేవుని సొంత ప్రజలు దేవుడు వారిని ప్రేమతో ఎన్నుకున్నారు కాబట్టి వారు దేవుడి యొక్క చిత్తానుసారంగా నడుచుకోవాలి.

మన విశ్వాస జీవితంలో నిరాకరించబడినప్పుడు మనము బాధపడవలసిన అవసరం లేదు, ఎందుకంటే క్రీస్తు ప్రభువు కూడా నిరాకరించబడ్డారు తరువాత ఆయన గొప్పతనమును అందరూ తెలుసుకున్నారు కాబట్టి మనం కూడా బాధపడకుండా, భయపడకుండా క్రైస్తవ జీవితమును జీవించుదాం. ఎందుకంటే దేవుడు మనలను ప్రత్యేకంగా పిలిచారు ఎన్నుకున్నారు తన బిడ్డలుగా చేశారు. ఈ విధంగా క్రైస్తవత్వం యొక్క ఔన్నత్యం గురించి పేతురు గారు చక్కగా బోధించారు.

ఈనాటి సువిశేషం లో ఏసుప్రభు తోమాసు గారితో అంటున్నారు, నేనే మార్గమును, సత్యమును, జీవమును అని.

పోయిన ఆదివారం శిష్యులతో  ఏసుప్రభు అంటున్నారు నేనే ద్వారమును అని,  I AM THE GATE. ఈవారం సువిశేషంలో ఏసుప్రభు మార్గము, సత్యము, జీవము అని అంటున్నారు.

ఏసుప్రభు అనేక సందర్భాలలో తాను ఏమిటి అని శిష్యులకు తెలుపుచున్నారు.

కొన్ని సందర్భాలలో ప్రభువు అంటున్నారు: 

1. నేను నిజమైన ద్రాక్షావల్లిని

2. నేనే జీవాహారమును

3. నేనే లోకమునకు వెలుగు

4. నేనే పునరుద్దానమును, జీవమును

5. నేను మంచి కాపరిని అని

ఈ విధంగా ఈనాటి శిష్యులతో ప్రభువు మూడు అంశాలు గురించి తెలియజేస్తున్నారు:

1. నేనే మార్గం

2. నేనే సత్యం

3. నేనే జీవం

అంతయు ఏసుక్రీస్తు ద్వారానే మనకు సాధ్యమవుతుంది. తోమస్ ఎ కెంపిస్ గారు 15 వ శతాబ్దంలో ఆయన రాసిన IMITAION OF CHRIST పుస్తకంలో ఈ విధంగా అంటున్నారు: 

- దారి తెలియకుండా మన ప్రయాణం సాగదు, చేయలేము - without way there is no going.

- సత్యం లేకుండా మనం ఏమీ తెలుసుకోలేము - without truth there is no knowing.

- జీవం లేకుండా మానవ మనుగడ లేదు అని తెలుపుచున్నారు - without life there is no living.

- ఏసుప్రభు నేనే మార్గం అని అంటున్నారు, యేసు ప్రభు మన అందరికీ కూడా పరలోకం చేరుటకు ఒక మార్గంగా ఉంటున్నారు, ఆయన ఏది అయితే బోధించారో  అది పాటిస్తూ శిష్యులకు ఒక సుమాతృకగా ఉంటున్నారు.

ఏసుప్రభు మనం పరలోకం ఏ విధంగా చేరాలో ఒక మార్గంగా ఉంటున్నారు, ఇది మాత్రమే కాదు అన్ని విషయాలలో ఆయన మనకు మార్గం చూపిస్తున్నారు.

- శ్రమలు ఏ విధంగా అనుభవించాలి అని

- ఎలాగా సేవ చేయాలని

- ఎలాగ వినయంతో విధేయత తో జీవించాలని

- ఎలాగా తండ్రి ప్రణాళిక నెరవేర్చాలని

- సహనంతో, ప్రేమతో ఎలాగా జీవించాలి అని, అనేక విషయాలలో క్రీస్తు ప్రభువు ఒక మార్గంగా ఉంటున్నారు ఆయన మనకంటే ముందుగా వెళ్లి మనకు సుమాతృకగా నిలిచారు.

ఈరోజు మనం మన తోటి వారికి ఒక మార్గంగా ఉంటున్నామా?

2. ఏసుప్రభువే సత్యము:

ఆయన భూలోకానికి వచ్చినది తండ్రికి సాక్ష్యము ఇచ్చుటకు, ఆయన దేవుని కుమారుడు అనుట సత్యము, తన యొక్క పరిచర్య ద్వారా బోధించిన విషయాలు అన్నియు సత్యము.

ఫిలాతు కూడా ఏసుప్రభు జీవితం చూసి ఆయనలో ఎట్టి అసత్యం లేదు అని పలికారు.

3. ఏసుప్రభువే జీవము: 

సృష్టి ప్రారంభంలో ఏసుప్రభువు వాక్కు రూపంలో ఉండి సృష్టికి జీవం పోశారు, అలాగే ఆయన మానవ రూపంలో ఈ లోకంలో జన్మించినప్పుడు తన పరిచర్య ద్వారా అనేక మందికి జీవమును ప్రసాదించారు.

మరణించిన వారికి సైతం జీవమును ఇచ్చినా గొప్ప దేవుడు యేసు ప్రభువు దివ్య సంస్కారాలు ద్వారా కూడా ప్రభువు మనకు జీవం ప్రసాదిస్తారు.

మనం కూడా ఇతరులకు జీవమును ఇవ్వాలి అనగా నిరాశలో బాధలో ఉన్నవారికి ప్రోత్సాహం ధైర్యమును ఇచ్చుట ఒక విధంగా వారికి జీవము ఇచ్చుటయే.

అదేవిధంగా ఈనాటి సువిశేష పఠనం  లో యేసు ప్రభువు మరియు తండ్రి అన్నిటిలోనూ కలిసి ఉన్నారు అని ప్రభువు తెలుపుచున్నారు, ఇక్కడ తండ్రీ కుమారులకు ఉన్న ఆ ప్రేమ బంధం గురించి మనం ధ్యానించుకోవాలి. వారిది విడదీయరాని బంధం కాబట్టి మనం కూడా ఎల్లప్పుడూ కలిసిమెలిసి జీవించాలి.

క్రైస్తవ జీవితం చాలా గొప్పది ఎందుకంటే ఏసుప్రభువు అన్నింటిలో సుమాతృకగా జీవిస్తూ విశ్వాసులను ముందుకు నడిపించారు ఎందరో క్రైస్తవత్వమును ఆపాలని ప్రయత్నం చేశారు కానీ అది ఈ సాధ్యపడలేదు అందుకు నిదర్శనమే ఈనాటి క్రైస్తవ సంఘం.


FR. BALAYESU OCD

ఆగమన కాలము 2 వ ఆదివారం

ఆగమన కాలము 2 వ ఆదివారం  బారుకు 5:1-9, ఫిలిప్పీ 1:4-6, 8-11, లూకా 3:1-6 ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు దేవుని కొరకు మార్గమును సిద్ధం చేయుటను గు...