33 వ సామాన్య
ఆదివారం
సామెతలు 31:10-13,19-20,30-31
1 తెస్సలోనిక 5:1-6
మత్తయి 25:14-30
ఈనాటి పరిశుద్ధ దివ్య
గ్రంథ పఠనములు దేవుని యొక్క రాకడ కొరకై ఆయన ఇచ్చినటువంటి అనుగ్రహములను సద్వినియోగం
చేసుకుని మనందరం కూడా సిద్ధముగా ఉండాలి అని ప్రభువు తెలుపుచున్నారు. క్రీస్తు ప్రభువు
యొక్క మరణ పునరుద్ధానం తర్వాత అందరి యొక్క ఆలోచన ఏమిటంటే ఆయన ఎప్పుడెప్పుడు వచ్చును
అని. కొంతమంది ఆయన రాక కొరకు ఎంతో ఆశతో ఆనందంతో ఎదురు చూశారు మరి కొంతమంది ఆయన రాక
త్వరలో సంభవించును అని అది ఏ గడియలో ఏ విధంగా వస్తుందో ఊహాగానాలు చేస్తూ జీవించారు
మరి కొంత మంది ఆయన రాకడ చిన్నగా జరుగును అని భావించి సోమరిపోతులుగా జీవించటం ప్రారంభించారు
అలాంటి సమయంలో దేవుడి యొక్క రాక రాత్రి వేళ దొంగ వలె అకస్మాత్తుగా వచ్చును అని ప్రభువు
మనకు తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి ఆయన రాకడ కొరకై ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడి ఉండాలి
ఈరోజు మనందరం కూడా ఈ దైవార్చన సంవత్సర చివరి ఆదివారంలో ఉన్నా వచ్చే ఆదివారం క్రీస్తు
రాజు యొక్క పండుగను కొనియాడబోతున్నాము కాబట్టి ఆయన రాక కొరకు మనం సిద్ధంగా ఉండాలి.
ఈనాటి మొదటి పట్టణములో
రచయిత ఒక ఆదర్శ గృహిణి గురించి తెలుపుచున్నారు ఈమెలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏమిటి
అంటే ఆమె తన జీవితమును అన్నిటికీ సంసిద్ధం చేసుకున్నటువంటిది. ఆదర్శ గృహని అనగా మంచి
సుగుణములను కలిగిన వ్యక్తి. ఆమె తన కుటుంబమును మంచి మార్గములో నడిపిస్తుంది. ఆమె పగడముల
కంటే విలువైనది అనగా మాణిక్యాల కన్నా విలువైనది అని అర్థం ఆమెను పొందిన వ్యక్తి ఎంతో
అదృష్టవంతుడు ఎందుకంటే ఆమె ఇంటికి వెలుగుగా ఉంటూ తన ఇల్లును చక్కదిద్దుకొని తన కుటుంబమును
మంచి మార్గంలో నడిపిస్తుంది. ఈ ఆదర్శ గృహిణి తన జీవితములో దేవునికి ఏది ఇష్టమో, భర్తకు ఏది ఇష్టమో
కుటుంబమునకు ఏది ఇష్టమో తెలుసుకొని దాని ప్రకారంగా నడుస్తుంది.
తన కుటుంబమును ఒక
బంగారు కుటుంబం గా ఏర్పరచుకుంటుంది అలాంటి స్త్రీని భర్త సంపూర్ణంగా విశ్వసిస్తాడు
ఆమెను ఎన్నడూ సందేహించడు.
ఈ ఉత్తమ స్త్రీ కుటుంబ
పోషణకై తన శాయశక్తులా ప్రయాసపడుతూ తన భర్తకు
తోడుగా ఉంటుంది. ఏ భర్త అయితే ఇలాంటి స్త్రీని భార్యగా పొందుతూ ఉంటాడు అతడికి ఎల్లవేళలా
మేలు కలుగును ఎందుకంటే ఈమె భర్తకు మేలును మాత్రమే చేయను ఆయనకు ఎన్నడూ హాని తలపెట్టదు
కాబట్టి.
- ఆదర్శ స్త్రీ అనాధలుగా
ఉండే వారిని ఆదరిస్తుంది,
పేదవారికి సాయం చేస్తుంది
దైవభీతితో దేవునికి ఇష్టకరంగా జీవిస్తుంది.
-తన జీవితంలో సౌందర్యమునకు
ప్రాధాన్యత నివ్వక కర్తవ్యం మనకు ప్రాధాన్యత నిచ్చి పరోపకారం చేస్తూ ఆధ్యాత్మిక సంబంధమైన
సౌందర్యాన్ని కలిగి జీవిస్తూ ఉంటుంది కావున అలాంటి స్త్రీని పొందిన వ్యక్తి చాలా అదృష్టవంతుడు
-ఆదర్శ గృహిణి తన యొక్క
భర్తను గౌరవిస్తుంది భర్తకు మంచి పేరును తీసుకుని వస్తుంది.
-ఈ ఉత్తమ స్త్రీ కుటుంబ
అభివృద్ధి కొరకై అహర్నిశలు కృషి చేస్తుంది ఆమె వేకువనే నిద్రలేచి తన కుటుంబం కోసం పనిచేస్తుంది
సోమరితనమునకు అసలు తావు ఇవ్వదు
ఈనాటి రెండవ పట్టణంలో
ప్రభువు యొక్క రాకడ ఊహించని గడియలో జరుగును కావున రాక కొరకై మనందరం కూడా సంసిద్ధత కలిగి
జీవించమని తెలియజేస్తున్నారు. ఈనాటి విశేష పట్టణంలో ప్రభువు మరొక్కసారి ఆయన యొక్క రాకడ
కోసం విశ్వాసులు అందరు కూడా ఎలాగా సిద్ధపడి జీవించాలి అని తెలుపుచున్నారు. ప్రభువు
ఒక్కొక్కరికి తమ యొక్క సామర్ధ్యమును బట్టి ఒకనికి 5 లక్షల వరహాలు ఇంకొకనికి రెండు లక్షల వరహాలు మనకు
ఒక లక్ష వరహాలు ఇచ్చి ఉన్నారు అయితే ఇచ్చినటువంటి ఆ వరహాలను ఏ విధముగా వారు సద్వినియోగం
చేసుకొని యజమానుడు యొక్క రాక కొరకు సిద్ధంగా ఉన్నారు అని తెలుపుచున్నారు.
ఈ సువిశేష భాగములు
యజమానుడు అయిన దేవుడు తన యొక్క ఉదార స్వభావముతో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధముగా తన యొక్క
వరములను ఇస్తున్నారు యజమానుడిని ఎవరు అడగలేదు కానీ ఆయనయే తన సేవకులు అభివృద్ధి చెందాలి
అనే ఉద్దేశంతో వారికి ఈ వరములను ఇస్తున్నారు. ఆయన కూడా తనలాగే వారు సంతోషంగా ఉండాలి
అభివృద్ధి చెందాలి అని అనుకున్నారు కాబట్టే తన దగ్గర ఉన్నది ఉదారంగా ఇవ్వటానికి ఇష్టపడ్డారు.
యశమానుడికి ఒక్కొక్క వ్యక్తి యొక్క సామర్థ్యం తెలుసు కాబట్టి వారికి తగిన విధంగా అతడు
సహాయం చేస్తున్నారు ఎక్కడ ఆ యజమానుడు వీరు వ్యాపారం చేస్తే నష్టపోతారా అని ఆలోచన చేయలేదు
కానీ వారు ప్రయత్నం చేస్తున్నారా లేదా అని ఎదురు చూశాడు. ఐదు లక్షల వరహాలు రెండు లక్షల
వరహాలు పొందిన వారు తమ జీవితంలో ఎంత రిస్క్ తీసుకొని అయినా సరే ముందుకు వెళ్లాలనుకున్నారు
అందుకనే వారు తమ జీవితంలో అభివృద్ధిని చూడగలిగాను. వీరిద్దరూ కూడా తమ జీవితంలో కష్టపడటానికి
సిద్ధంగా ఉన్నారు. దేవుడు మనందరికీ కూడా వరహాలు ఇచ్చారు అని తెలుపుతున్నారు (ఎఫేసీ 4:8). మనం ఈ లోకంలో చూసుకుంటే ఏ ఇద్దరు వ్యక్తులకు అన్నింటిలో
సరి సమానమైన టాలెంట్స్ ఉండవు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధముగా ఇవ్వబడినది. మనకు ఇవ్వబడిన
దానిలో మనము విశ్వాసులుగా ఉండాలి. దేవుడు మన జీవితంలో చూసేది ఏమిటంటే ఎంత మాత్రం మనము
విశ్వాస పాత్రులుగా ఉంటున్నా మనము చేసే దానిని బట్టి దేవుడు మనకు తీర్పు చేయను మత్తయి
16: 27. కావున మనము కూడా దేవుడు
మనకు అప్పజెప్పినా బాధ్యతగాని లేదా ఆయన మనకు ఇచ్చినటువంటి వరములను గాని సద్వినియోగం
చేసుకొని జీవించాలి. లక్ష వరహాలు పొందిన వ్యక్తి తన జీవితంలో ఎటువంటి కష్టం కూడా పడకుండా
యజమానుడి యొక్క సొమ్మును భూమిలో దాచి ఉంచాడు ఇతడు సాహసించటానికి వెనుకాడాడు తెగించటానికి
భయపడ్డాడు ఒక సోమరిగా తన కాలాన్ని వెల్లబుచ్చాడు. పవిత్ర గ్రంథం మనము సోమరులుగా జీవించకూడదు
అని బోధిస్తూ ఉన్నది. రోమీయులు12:11, 2తెస్స 3:11, హెబ్రీ 6:12. మనందరం కూడా పనిచేసే వ్యక్తులుగా జీవించాలి అనగా మన యొక్క బాధ్యతలను
మనము సంపూర్ణంగా నెరవేర్చుటటువంటి వ్యక్తులుగా ఉండండి.
దేవుడు మన యొక్క మంచి
కొరకే ఇచ్చినటువంటి వరాలను మనము సద్వినియోగం చేసుకోకపోతే అవి మన నుండి తీసుకుంటారు
దానికి ముఖ్యమైన నిదర్శనం పాత నిబంధన గ్రంథంలో ఉన్న సౌలు యొక్క జీవితం ఆయనకు దేవుడు
రాజు బాధ్యతలు అప్పచెప్పారు కానీ ఆయన దానిని సద్వినియోగం చేసుకోలేదు కావున తన యొక్క
గొప్ప పదవిని దేవుడి యొక్క సహకారాన్ని ప్రేమను కోల్పోయారు కాబట్టి మన జీవితంలో దేవుడు
మనకు ఇచ్చిన ప్రతి వరాన్ని సద్వినియోగం చేసుకొని ఆయనకు విశ్వాసపాత్రులుగా జీవించాలి.
Fr. Bala Yesu OCD