29, సెప్టెంబర్ 2023, శుక్రవారం

 

ఇరవై ఆరవ సామాన్య ఆదివారం

ఏజెకియేలు 18: 25- 28, ఫిలిప్పీ 2: 1- 11, మత్తయి 21 : 28-32


దేవునికి విధేయత చూపుడు.సర్వోన్నతుడు విధేయులను రక్షించును.

వారిని అత్యున్నత స్థానమునకు లేవనెత్తును.

అన్యాయ మార్గమునుండి వైదొలగి  సన్మార్గమున పయనిస్తే దేవుని రక్షణ లభిస్తుంది.

సాధారణంగా మనము మన జీవితాలలో రెండు విధాలైన మార్గాలుంటాయి. మంచి మార్గం మరియు చెడు మార్గం. ప్రతి తల్లిదండ్రులు,  తమ బిడ్డలు మంచి మార్గములో జీవించాలని, గురువులు తమ విద్యార్థులను మంచి మార్గములో నడిపించాలని, అదేవిధంగా దేవుడు తన ప్రజలను దేవుని మార్గములో నడిపించాలని కోరుకుంటున్నారు.

మొదటి పఠనము:

నాటి మొదటి పఠనంలో, రెండు రకాల వ్యక్తుత్వాలను మరియు రెండు మార్గాలను, గురించి మనం నేర్చుకుంటున్నాం..

1. సజ్జనుడు , సన్మార్గము

2. దుష్టుడు , చెడు మార్గము.

దేవుడు ఏజెకియేలు ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలను ఈవిధంగా హెచ్చరిస్తున్నారు. దేవుని ప్రజలు సజ్జనులు, దేవుని మార్గాన్ని విడిచి పెట్టి, సత్కార్యములను విడిచి పెట్టి, చెడు మార్గంలో జీవిస్తున్నారు, పాపా కార్యాలు చేస్తున్నారు.

కావున దేవుడు తన ప్రజలను కాపాడు కోవడానికై , తిరిగి వారిని, మారుమనస్సు పొంది దేవుని మార్గంలో పయనించమని, జీవించమని కోరుతున్నారు.

మొదటి పఠనం ద్వారా మనందరం ఒక్క విషయాన్ని అర్థంచేసుకోవచ్చు. దేవునికి విధేయులై జీవించమని.

దేవునికి విధేయులై జీవించడమంటే దేవుని మార్గములో పయనించమని, ఆయన ఆలోచనల ప్రకారం జీవించమని.

అప్పుడే మనందరికీ జీవితముంటుంది.

అందుకే దేవుడు ఏజెకియెల్ ప్రవక్త తో నాటి మొదటి పఠనంలో పలికిన విధంగా " న్యాయ మార్గములో జీవించి, మంచి పనులు చేస్తే, ప్రాణాలు కాపాడుకొందురు. చెడు మార్గాన జీవిస్తూ పాపపు పనులు చేస్తే చావుతప్పదు అని బోధిస్తున్నారు.

ఇక్కడ మొదటి పఠనం, మనందరి వ్యక్తిగత బాధ్యతలను గురించి భోదిస్తుంది. మన రక్షణకు మనమే భాద్యులమని భోదిస్తుంది.

సువిశేష పఠనము;

సువిశేష పఠనంలో కూడా ఇద్దరు వ్యక్తులను వారి వ్యక్తుత్వాలను గురించి నేర్చుకుంటున్నాం.

1 . ఒకరు విధేయుడు,

2 . ఇంకొకరు అవిధేయుడు.

తండ్రి ద్రాక్ష తోటలో పనిచేయడానికి  సిద్దత, భాద్యతలను  కలిగిన కుమారిని చూస్తున్నాం. ఇక్కడ తండ్రి తోట అంటే దేవుని రాజ్యం.

పనిచేయడానికి పిలుపు , అంటే దేవుని సువార్త సేవచేయడానికి పిలుపు.

సువార్త పఠనంలో ద్రాక్ష తోటలో తండ్రి పనిచేయమని అడిగినప్పుడు ఒక కుమారుడు తాను సిద్ధముగా ఉన్నాను అని వ్యక్త పరుస్తాడు, కానీ పని చేయుటకు లేదా సేవ చేయుటకు వెళ్ళలేదు . అవిధేయుడవుతున్నాడు, భాద్యతను మరిచి పోయి జీవిస్తున్నాడు.

ఇంకొకరు సిద్ధముగా లేనని వ్యక్త పరుస్తాడు, కానీ తండ్రి మీద ప్రేమ, గౌరవము ఉంది కాబట్టి తండ్రి తోటలో పనిచేయడాని, వెళ్తాడు. తండ్రి ఆలోచనలకు, బాధ్యతలకు విధేయుడై, జీవిస్తున్నాడు. ముఖ్యముగా వ్యక్తిగత భాద్యత కలిగి జీవిస్తున్నాడు .ఇక్కడ తండ్రి ఆజ్ఞలను పాటించిన కుమారుని క్రీస్తు ప్రభువు మెచ్చుకుంటున్నాడు.

దేవుని మార్గానికి వ్యతిరేఖంగా జీవిస్తే, దేవుని ఆజ్ఞలకు వ్యతిరేఖంగా జీవిస్తే ఏం జరుగుతుందో మనము పరిశుద్ధ గ్రంధంలో చూస్తున్నాం.

దేవుని మార్గమునుడి వైదొలగడం పాపం. పాపము యొక్క ఫలితం మరణం.

ఉదాహరణకి ;

ఆది తల్లిదండ్రుల పాపము. (ఆది : 3 : 2 - 3 .)

ప్రభువునకు అవిధేయుడైన బిలాము పరిస్థితి (సంఖ్యా ఖాండము : 22 : 31 - 35 )

ద్వితియో 4 : 1 - 4 , ద్వితియో 5 : 32 - 33 , ఉపదేశకుడు 7 ; 8 .

అవిధేయులు దైవ శిక్షకు గురిఅవుదురు రోమీయులు  7 : 14 .

దేవునికి విధేయులై ఆయన మార్గమున, ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించిన వారిని దేవుడు దీవించును, అత్యున్నత స్థానమునకు లేవనెత్తును.

ఉదాహరణకు:

అబ్రహాము, యానోకు, ప్రవక్తలు, మరియతల్లి , క్రీస్తు ప్రభువు etc.

ఇంకొక ఉదాహరణ

ద్వితియో 28 : 1 - 14 .

రెండవ పఠనము :

దీనినే క్రీస్తుని గురించి పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన శ్లోక గీతం అంటారు. ఇది క్రీస్తుని వినయమనే త్యాగాన్ని గురించి భోదిస్తుంది.

వినయం మరియు కీర్తి రెండూ ఎప్పుడు కూడా  ఒకదానికొకటి నిలబడవు, కానీ ఒకదానికొకటి  నడిపిస్తాయి మరియు రెండూకూడా ప్రత్యేకంగా నిలుస్తాయి. వినయము అనే త్యాగము లేనిదే కీర్తి లేదు.

రెండవ పఠనం క్రీస్తు ప్రభునికి దేవుని (తండ్రి) చిత్తం నెరవేర్చడానికి గల  సంసిద్ధతను గురించి భోదిస్తుంది.

క్రీస్తు తన విధేయతతో చేసిన త్యాగం వలన మానవాళి అందరికి రక్షణ కలిగినదని భోదిస్తుంది. క్రీస్తు ప్రభువు దేవుని చిత్తం పట్ల భాద్యత కలిగి జీవించాడు.

అందుకే పునీత పౌలు గారు, క్రీస్తు ప్రభుని, సువిశేష పఠనంలో తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన మంచికుమారునిగా , మనకు గొప్ప ఉదాహరణగా చూపిస్తున్నాడు.

క్రీస్తు ప్రభువు త్యాగముతో జీవించలేదు

దేవుని చిత్తాన్ని విడిచిపెట్టలేదు

దేవుని మార్గాన్ని అనుసరించాడు .

కాబట్టి చివరిగా

మనందరమూ కూడా ధ్యానించవలసిన విషయం

ద్రాక్ష తోట అనే దేవుని రాజ్యంలో మనందరమూ కూడా జీవిస్తున్నాం మరి మన వ్యక్తిగత మరియు, సంఘములో ఉన్న మన భాద్యతలు ఏమిటో అని మనందరమూ కూడా ధ్యానించాలి.

క్రీస్తు వలె, మంచి కుమారుని వలె దేవుని చిత్తానికి విధేయులై, ఆయన మార్గములో పయనించాలి. దేవుని రాజ్యానికి కృషి చేయాలి.

మనందరమూ కూడా వ్యక్తిగతంగాను మరియు సంఘ రక్షణకై కృషి చేద్దాం,, దేవుని దీవెనలు పొందుకుందాం.

బ్రదర్డీకన్ . సుభాష్  సిడి.

పాస్కా ఆరవ ఆదివారం

పాస్కా ఆరవ ఆదివారం  అపో 10:25-26, 34-35,44-48 1యోహను 5:7-10 యోహాను 15:9-17 ఈనాటి పరిశుద్ధ గ్రంథములు పఠనములు దేవుని యొక్క ప్రేమ గురించి మరియు...