3, ఆగస్టు 2023, గురువారం

 

18 వ సామాన్య ఆదివారము

దివ్య రూప ధారణ మహోత్సవము

దానియేలు 7 : 9 -10 , 13 -14

2 పేతురు 1: 16 -19

మత్తయి 17 : 1 -9 

క్రీస్తు నాధుని యందు ప్రియా సహోదరి సహోదరులారా ! 

ఈనాడు మనము సామాన్య 18 వ ఆదివారములోనికి ప్రవేశించి యున్నాము. అదే విధంగా ఈనాడు యేసు క్రీస్తు ప్రభువు యొక్క దివ్య రూప ధారణా పండుగను జరుపుకొనుచున్నాము. ఈనాటి  పరిశుద్ధ గ్రంథమునందు  పఠనాల ద్వారా మనము ధ్యానించబోయే అంశము:“యేసు క్రీస్తు యొక్క రూపాంతరము మరియు సాక్షపూరిత జీవితం. ఈనాటి మొదటి గ్రంథ పఠనములో చూస్తూన్నాము7 : 14 " అతని  యొక్క రాజ్యమునకు అంతమే లేదు అని అతని పరిపాలనము శాశ్వతమైనదని వింటున్నాము". రెండొవ పఠనములో పేతురు పలుకుచుకున్నారు " మా కనులారా మేము ఆయన యొక్క గొప్పతనమును చూచితిమి. పితయగు దేవుడు ఆయనకు కీర్తిని, వైభవమును ప్రసాదించినపుడు మేము అచట ఉంటిమి. ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్న దివ్య వాణి వింటిమి. సువిశేష పఠనములో మొదటి రెండు పఠనాల ద్వారా తెలియజేయబడినట్లు దానియేలు  ప్రవక్త యొక్క  మాటల ద్వారా మరియు పేతురు మాటల ద్వారా మనము విన్నటువంటి వాక్యములన్ని కూడా ఈరోజు, ఈనాటి యొక్క సువిశేష పఠనములో క్రీస్తు ప్రభుని యొక్క దివ్య రూప ధారణ గురించి తెలియచేయబడినాయి.

దివ్య రూప ధారణ అంటే యేసు క్రీస్తు యొక్క రూపాంతరం పండుగ. రూపాంతరము అనేది "మెటామారుఫో" అనే గ్రీకు పదము నుండి వచ్చింది. అంటే మరొక రూపాన్ని పొందుకొనుట అని అర్ధము. భౌధిక జీవితము నుండి అధ్యాద్మిక జీవితంలోనికి మార్పు చెందటం. దేవుని బిడ్డలుగా మనము ఉండాలంటే మన పాపపు జీవితము నుండి మనము రూపాంతరము చెందాలి. అలా రూపాంతరము చెందాలి అంటే దేవునిలో మనము కాస్త పడాలి. కాస్త పడటం ద్వారా మనలో మార్పు వస్తుంది. ఆ మార్పు ఇతరుల చేత తెలియజేయబడాలె గాని మనము మారాము అనడం కాదు. ఇతరులు మనచుట్టూ పక్కల వాళ్ళు మనలను అడగాలి మన మార్పు గురించి. అప్పుడు మన మార్పు గురించి మనకి ఈ మార్పు ఎవరు ఇచ్చారో ఎవరి ద్వారా మనలో ఈ మార్పు  కలిగిందో, ఏ శక్తీ మనలను నడిపిస్తుందో ఆవ్యక్తి గురించి మనము మాట్లాడటమే రూపాంతరము.

ప్రియమైనటువంటి దేవుని బిడాలారా!  ఈనాటి సువిశేషములో మనము కొంతమంది వ్యక్తులను చూస్తూన్నాము. యేసు ప్రభువు ఆయనతో వచ్చిన ముగ్గురు శిష్యులు పేతురు, యాకోబు మరియు యోహాను. అదే విధంగా పర్వతంపై ఇద్దరు వ్యక్తులను చూస్తూన్నారు. వారు మోషే నాయకుడు మరియు ఏలీయా ప్రవక్త. మనము ఎక్కువేసార్లు సువిశేష గ్రంధములో చుస్తూఉంటాము క్రీస్తు ప్రభువు తో ఎప్పుడు ఈ ముగ్గురు శిష్యులే కనుబడతారు. ఈ ముగ్గురికి ఈరోజు ఆ దర్శనముయినటువంటి యేసు రూపాంతరము కనబడింది. అదేవిధంగా దేవుని యొక్క స్వరము కూడా వినపడింది. యేసు మాటలు కూడా వినబడ్డాయి. మోషే ప్రజలను నడిపించే నాయకుడు. ఏలీయా ప్రవక్తలందరిలో ప్రథముడు, మొదటి వాడు.

ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ! ఈనాటి రూపాంతర సమయంలో శిష్యులు ముఖ్యముగా మూడు విషయాలు చూసారు, విన్నారు కూడా.

1.క్రీస్తుని ముఖము సూర్యుని వలె ప్రకాశించుట చూసారు {మత్త 17:2}

2.దేవుని యొక్క స్వరాన్ని విన్నారు. ఈయన నా ప్రియమైన కుమారుడుఅని.{మత్త 17 : 5 }

3.వీరు యేసు క్రీస్తు యొక్క స్వరము కూడా విన్నారు. లేదు భయపడకుడి అని. {మత్త17:7}

పర్వతము మీద ఒక సభ జరిగినది యేసు క్రీస్తు ప్రవక్తలతో మాట్లాడుతున్నటువంటి ఒక సభ. ఈ సమయములోనే ప్రభువుకి దివ్య రూప ధారణ జరిగింది. యేసు ప్రభువుకి దివ్యరూపధారణ ఎందుకు జరిగింది అంటే అయన శ్రమలను అనుభవించి సిలువ మరణము పొందాలనేది దేవుని యొక్క చిత్తాన్ని తెలియజేయడానికి.

* యేసు శిష్యులను పర్వతము పైకి ఎందుకు తీసుకువెళ్లారు? అని మనము ధ్యానిస్తే పరవత స్థానములో దేవాలయము ఉంది. శిష్యుల స్థానంలో మనము ఉన్నాము. యేసు ప్రభువుల వారి స్థానములోజీవ వాక్యము అప్ప ద్రాక్ష రసములు ఉన్నాయి. శిష్యుల జీవితంలో జరిగిన సంఘటన  ఒక సారి మాత్రమే కానీ కథోలికులమైన మన జీవితములో పవిత్ర దివ్య బాలి పూజలో పాల్గున్న ప్రతిసారి ఈ సంఘటన జరుగుతూవున్నది. ఆ ఒక సంఘటన శిష్యుల విశ్వాసాన్ని పెంపొందిస్తే దివ్య బలిపూజలో పాల్గున్న ప్రతి సారి మన విశ్వాసం అధికమధికమై ముందుకు సాగాలని ప్రభువు ఆసిస్తున్నాడు మన నుండి.

*పరవతము నుండి దిగి వచ్చుట అనగా?క్రీస్తు ప్రభువు తిరిగి శిష్యుల వైపు వస్తూన్నారు. అంటే ప్రజల వైపుకు వస్తున్నారు అని అర్ధము. ముందుగా పర్వతమును దేవాలయముగా భావించాము. ఇప్పుడు ఆ దేవాలయమునందు ప్రభువు బయిటకు సమాజంవైపుకు ప్రజల యొద్దకు వస్తున్నారు. యేసుతో ఉండటం అంటే పర్వతము మీద( దేవాలయం) ఉండిపోవడం కాదు. గుడిలో ఉన్నప్పుడు యేసుతో సమయం గడిపినప్పుడు ఎవరికైనా ఆనందం కలుగుతుంది. అందుకే పేతురు అన్నారు  " ప్రభు మనము ఇచటనే ఉండుట మంచిది " మత్త 17 : 4  అంటే పేతురు తన జీవిత శైలిని మర్చిపోయి దేవునిలో లీనమైపోవునట్లు ఉండుట మనకు కనబడుతుంది. అంటే ఆయనకు కిందకు రావడం ఇష్టం లేక ప్రభువుతో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. దేవాలయంలో ఉండటం మంచిదే కానీ మనము అర్ధం చేసుకోవలసినది ఏంటి అంటే ప్రభువు కిందకు దిగి వచ్చింది పరలోకం నుండి దిగి వచ్చింది ప్రజలతో ఉండటానికే. వారి బాధలలో, కష్టాలలో పాలుపంచుకోవడానికి. మనలను పాపపు జీవితము నుండి రక్షించ్చి పుణ్య మార్గములో నడిపించడానికి. క్రీస్తును అనుసరించే మనము భూమికి ఉప్పు వలె లోకమునకు వెలుగు వలె దీప స్తంభముపై పెట్టబడిన దీపముల ఉండాలి. యేసు ప్రభువును ఈ లోక రక్షకుడని ఈ లోకమునకు తెలిపే సాధనములుగా దేవుని ప్రేమ వాహనాలుగా మనము సేవ చేయాలి. 

ప్రియమైనటువంటి బిడ్డలారా ! ఈరోజు క్రీస్తు ప్రభు రూపాంతరాన్ని శిష్యులు చూసినట్లుగా మనము కూడా ప్రతిరోజు దివ్య బాలి పూజలో అప్ప ద్రాక్ష రసములో ఉన్న క్రీస్తు ప్రభు దర్శనాన్ని మనము కూడా చూడాలి. 1 యోహాను 3:2 లో "క్రీస్తు దర్శనం ఇచ్చినప్పుడు ఆయన యదార్ధ రూపమును చూతుము " అని అదేవిధంగా పౌలు రోమయులకు రాసిన లేఖలో కూడా 8: 17 వ వచనంలో చూసినట్లు క్రీస్తు బాధలలో మనము పాలుపంచుకొనిన యెడల అయన మహిమతో కూడా మనము భాగస్థులము అవుతాము. అదే విధంగా పౌలు కోలస్సీయులకు రాసిన లేఖలో 3 : 4 వ వచనంలో మనకు జీవమై యున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు  మీరును ఆయనతో కూడా మహిమయందు కనబడుదురు. ఇవన్నీ మనము ప్రతి దివ్య బాలి పూజలో క్రీస్తు ప్రత్యక్ష రూపాన్ని చూస్తున్నాము.

* రూపాంతము అంటే మార్పు ని అర్ధము చేసుకోవాలి. మనస్సు మారకపోతే శరీరం మారదు. లోపల మారితేనే బయట మార్పు కనిపిస్తుంది. మన మనసు, మన క్రియలు, మన ఆలోచనలు మారాలి. తద్వారా క్రీస్తు ప్రత్యక్ష రూపాన్ని మనము చూడాలి. యోహాను 3 : 3 . మనిష్యుడు నూతనముగా జన్మించిననే తప్ప దేవుని రాజ్యమును చూడజాలడని నేను నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆత్మ పరిశీలన అనేది ఎంతో అవసరం. దేవుని వాక్యమును బట్టి మనము నిజముగా దేవుని కలిగి, నూతన జన్మ కలిగి అయన దర్శనాన్ని శిష్యుల వాలే పొందుతున్నామా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి.

* రూపాంతరము అనగా మానవ శరీరం మహిమ శరీరంగా మారడం అని అర్ధం. ఈరోజు ఏ యొక్క దివ్య ధారణ ద్వారా క్రీస్తు ప్రభువుతో మోషేను, ఏలీయాను చూస్తున్నాము. మోషే ధర్మశాస్త్రానికి ప్రతినిధి. ఏలీయా  ప్రవక్తలందరికి ప్రాథినిత్యం వహిస్తున్నాడు. రూపాంతరము అంటే బయట వెలుగు లోపలి రావడం కాదు, క్రీస్తు ప్రభువులో నుండి వచ్చిన వెలుగు మహిమ బహిర్గతమైంది. యేసు తన రూపాంతర దర్శనం అయన శిష్యులు అయినటువంటి  పేతురు, యాకోబు, యోహానులకు పర్వతము మీద చూపించాడు. యేసు ప్రభు యొక్క పరిపూర్ణత మానవత్వ రూపంలో కనిపిస్తుంది అనగా అయన దైవత్వంతో పాటు మానవత్వం కూడా ఈ యొక్క రూపాంతరములో ప్రత్యక్షమవుతుంది. యేసు ప్రభువు శిష్యులకు కొండా మీద చూపిన దర్శనం రూపాంతరము ద్వారా కిష్టుకు సాక్షులుగా ఉన్నారు.

* క్రీస్తు దివ్య రూప ధారణ చూపించడానికి ముగ్గురు సాక్షులు అయినా ఉన్నారు, మరి క్రీస్తు ప్రభు ప్రతి దినము దివ్య బాలి పీఠము మీద ప్రత్యక్ష మవుతున్నారు.  2 వ పేతురు 1: 16 - 18 లో పేతురు గారు చూచిన దానిని గురించి, అనుభవించిన దానిని గురించి వివరిస్తున్నారు.  అటువంటి అనుభవం మన జీవితంలో ఉందా? క్రీస్తు శిష్యుల వాలే మనము అయన ప్రత్యక్ష రూపాన్ని చూసి ఆయనకు సాక్ష్యులుగా ఉన్నామా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి.

*యేసు క్రీస్తు వాలే అయన శిష్యుల వాలే మనము భౌతికంగ రూపాంతరం చెందాలి అంటే ముందు మన మనసు రూపాంతరము చెందాలి. క్రీస్తు శిష్యులు చూచిన మహిమ మనము మరణించిన తరువాత పరలోకపు పర్వతము మీద ఆ మహిమను అనుభవించడానికి కావలసిన యోగ్యతను ఈ లోకంలో మనము సంపాదించుటకు ప్రయత్నం చేసే వారీగా ఉండాలి. మార్పు అనేది జీవితంలో ఒక నిరంతర ప్రక్రియ. మనలో చాల మందికి మారాలనే కోరిక ఉన్నప్పటికీ మారలేకపోతున్నాము. ఆ మార్పు అనేది బాహ్యంగా కాకుండా అంతరంగికంగా జరగాలి అని ప్రార్ధన చేదాం.

* శ్రీ సభ బోధన ద్వారా పర్వతము మీద ప్రకాశించిన క్రీస్తు ముఖం అయన పర్వతము నుండి క్రిందకు దిగి వచ్చింది. ఆ ప్రకాశించే ముఖమును మనకు ఇచ్చి మన పాప జీవితాన్ని తాను శ్రమల ద్వారా సిలువ మరణం పొందాలి. అటువంటి మహిమ పొందినటువంటి మరియు రూపాంతరము చెందినటువంటి మన శ్రీ సభ పునీతులను మనము ఉదాహరణగా తీసుకొనవచ్చు. వారిలో ముఖ్యమైన వారు పునీత పౌలు గారు, పునీత అగస్టీను గారు, పునీత మాగ్దలా మరియమ్మ గారు అదేవిధంగా క్రీస్తు కోసం తమ ప్రాణాలను అర్పించినటువంటి హత సాక్షులు, పునీతులు ఎందరో ఉన్నారు. వారివలె మన జీవితములో కూడా క్రీస్తు ప్రభు యొక్క మహిమను మనము కూడా పొందుకోవాలి. అయన పొందినటువంటి వెలుగును మన జీవితములో కూడా ఎల్లవేళల అనుభవిస్తూ అయన యొక్క వెలుగు బాటలో నడిచే బిడ్డలుగా ఎదగాలని ప్రార్ధన చేసుకుందాం. ఆమెన్

డీకన్. మనోజ్ చౌటపల్లి ఓ.సి.డి

11వ సామాన్య ఆదివారం

11వ సామాన్య ఆదివారం  యెహెజ్కేలు17:22-24, 1 కొరింతి 5:6-10, మార్కు 4:26-34 ఈనాటి పరిశుద్ధ గ్రంధ పఠణములు దేవుని యొక్క రాజ్య విస్తరణ గురించి బో...