29, జనవరి 2022, శనివారం

4 వ సామాన్య ఆదివారము

 4 వ సామాన్య ఆదివారము

యిర్మీయా 1 : 4-5, 17-19., 1కొరింతి 12: 31-13: 13., లూకా 4: 21-30.

-నేటి దివ్య పఠనాలు సువార్త వ్యాప్తిలో దేవుని అనుసరణలో ఎదురయ్యే తిరస్కరణలను దైర్యంగా ఎదుర్కోవాలి అని తెలుపుతుంది. 
- మన జీవితంలో ఎన్ని తిరస్కరణలు వచ్చినా గాని దేవుని మీద నమ్మకం ఉంచి, దైవ సేవ ప్రేమతో చేయాలనీ ఈ పఠనాలు భోదిస్తున్నాయి.
-చాలా సందర్భాలలో విశ్వాసానికి  సంభందించిన  తిరస్కరణలు, హింసలు ఎదురవుతాయి అయితే వాటన్నింటిని ఎదుర్కొని విశ్వాస సాక్ష్యం మిగతా వారికీ ఇవ్వాలి.
-ఈ నాటి మొదటి పఠనంలో దేవుడు యిర్మియా ప్రవక్తను తన యొక్క సేవకి ఎన్నుకొని ఆయన్ను బలపరిచిన విధానం తెలుసుకుంటున్నాం.
-దేవునిసేవలో ఎదురయ్యే కష్టాలను ముందుగానే ప్రవక్తకు తెలుపుచున్నారు.
-దేవుడు యిర్మీయాను పిలిచి తన ప్రవక్తగా నియమించారు. యిర్మియా తన తల్లి గర్భమున రూపొందకమునుపే దేవుడు తన్ను ఎన్నుకున్నారు అని పలుకుచున్నారు.
-ఆయన ఈ లోకంలో ఇంకా పుట్టక మునుపే అభిషేకించారు, అని తెలుపుచున్నారు. ఆయన్ను ఎన్నుకొన్నది ఒక ప్రవక్తగా జాతులకు తోడుగా ఉండుటకు.
-ప్రవక్త అంటే దేవుని స్వరం. దేవుడు పలకమన్న మాటనే పలుకుతూ దేవునికి మానవునికి మధ్యవర్తిగా నిలబడే దైవ సేవకుడే ప్రవక్త.
-దేవుడు యిర్మియాను పిలిచి, ఎన్నుకొని ఆయన్ను పవిత్ర పరచుచున్నారు. పవిత్ర పరచినది ఎందుకంటే, నిస్వార్థ సేవ చేయుటకు.
-పవిత్ర పరచినది దేవునితో వ్యక్తిగత సన్నిహిత సంబంధం కలిగి జీవించడానికి.
-పవిత్ర పరచినది దేవుణ్ణి సేవించుటకు, ఆయన మాటలను, వినుటకు, ఆయనలో ఐక్యమై జీవించుటకు దేవుడు యిర్మియాను ఎన్నుకొన్నారు, పవిత్ర పరిచారు.
-మనందరినీ దేవుడు జ్ఞాన స్నానం ద్వారా పవిత్ర పరుస్తున్నారు. అయితే మనం ఆయనలో ఐక్యమై జీవిస్తున్నామా, దేవునితో బంధం కలిగి పాపం, విడిచి దైవ చిత్తాన్ని నెరవేర్చుతున్నామా?
-యిర్మియా ప్రవక్త జీవితంలో దేవుడు ఆయన్ను జాతులకు ప్రవక్తగా ఉండుటకు అభిషేకిస్తున్నారు. కేవలం తన సొంత ప్రజల కోసం మాత్రమే కాదు అన్ని జాతుల వారికోసం అని ప్రభువు సుస్పష్టంగా తెలియచేస్తున్నారు.
-యిర్మియా మాత్రమే కాదు అన్య జాతులు వద్దకు పంపబడినవారు ఏలీయా, ఎలీషా, యోనా, లాంటి వారు కూడా అన్య జాతి జనులకు సేవలందించారు. 
-దేవుడు తన యొక్క ప్రవక్తను పరిచర్యకు ముందుగానే ఎదుర్కొన బోయే సమస్యలకు, హింసలకు, తిరస్కరణలకు, సిద్ధంచేస్తున్నారు.
-ప్రవక్తను పిలిచినప్పుడు వారి జీవితం పులపాన్పువలె సంతోషంగా ఉంటుందని వాగ్దానం చేయలేదు, వారి జీవితంలో కష్టాలు ఉంటాయి అని తెలిపారు.
-కష్టాలు, నిందలు, భాదలు, ఎదురైనా సరే నేను నీకు తోడుగా ఉంటాను అనే అభయం ఇస్తున్నారు.
-ప్రవక్తతో అంటున్నారు 1: 7   నీవు నడుము కట్టుకొని నిలబడి నేను ఆజ్ఞాపించిన సంగతులెల్ల వారితో చెప్పుము, నీవు వారికి భయపడ వలదని తెలుపుచున్నారు.
-ప్రవక్త లేదా దేవుని సేవకులు మాట్లాడే ప్రతి యొక్క మాట దేవుని యొక్క సందేశమే, దేవుడు తెలియచేయ మన్న మాటలే గురువులు, ప్రవక్తలు తెలుపుతారు.
-దేవునియొక్క సత్యమైన మాటలు మాట్లాడితే చాలామందికి నచ్చదు. ఎందుకంటే వారు మార్పు అంగీకరించలేరు. కాబట్టి వాస్తవానికి ఇశ్రాయేలు ప్రజల్లో మనం ఇలాంటి స్వభావాలు చూస్తున్నాం.
-ఇశ్రాయేలు ప్రజల్ని దేవునిలో ఐక్య పరచటానికి ప్రవక్త ప్రయత్నిస్తున్నారు అలాగే ఇశ్రాయేలు ప్రజల జీవితంలో శుద్ధీకరణ కోసం కృషి చేస్తున్నారు, వారి పాపపు జీవితం విడిచి పెట్టి, నీతిమంతమైన జీవితం జీవించాలని, దేవునికి విధేయులై జీవించాలన్న సత్యమైన దేవుని మాటలు ప్రజలతో పలికినప్పుడు అవి చాల మందికి నచ్చలేదు, ఎందుకంటే వారు మార్పును అంగీకరించలేక పోయారు అలాగే వారికి నచ్చిన సొంత జీవితం జీవించాలనుకున్నారు. అందుకే ప్రవక్తలను తిరస్కరిస్తున్నారు.
-ప్రభువు అంటున్నారు “నా మాటలు పలుకుటకు, నా సేవ చేయుటకు సిద్ధంగా ఉండుమని తెలుపుచున్నారు. నిజంగా మన జీవితాలను సంపూర్ణంగా దేవునికి సమర్పించుకుంటే ఎటువంటి ఇబ్బందులకు భయపడనవసరంలేదు” .
-దేవుడే అంటున్నారు 'బయపడనవసరం లేదు '. స్వార్థ పరులైన ఇశ్రాయేలు రాజకీయ,మత నాయకులు అనేక ఆటంకాలు పరిచర్యకు  కలిపిస్తారు, అలాంటి తరుణంలో నిర్భయంగా ముందుకు సాగమని దేవుడు అభయం ఇస్తున్నారు.
- దేవుడు తనకు తోడుగా ఉంటానని తెలుపుచున్నారు. యెషయా 41 : 10 
- ఎవరు ఎదురించినా సరే దేవుడు తోడుగా ఉంటాననే అభయం ఇస్తున్నారు.
-వారికి తోడుగా ఉండే విధానంలో దేవుడు మూడు ప్రతీకలను ఉదాహరిస్తున్నారు;
1. సురక్షిత నగరం.
2. ఇనుప స్తంభం 
3. ఇత్తడి తలుపు.
1. సురక్షిత నగరం- భద్రతకు గుర్తు. ఎంతమంది శత్రువులు దాడి చేసినా సరే చెక్కు చెదరకుండా, పడిపోకుండా, దృడంగా నిలబడుతుంది. 
2.ఇనుప స్తంభం - బలానికి, మహా శక్తికి గుర్తు. దేవుని యొక్క అభిషేకం ద్వారా మహాశక్తి ప్రతిఒక్కరిలో దాగి ఉంది, కాబట్టి ఆ శక్తి తో ఎన్ని సమస్యలైనా ఎదుర్కొని దైర్యంగా ఉండుమని తెలుపుతుంది.
3. ఇత్తడి తలుపు- భాదలు, అవమానాలు తట్టుకొని నిలబడే ఒక ఆయుధం, సాధనం.
-యిర్మియా తో దేవునియొక్క సంరక్షణ గురించి ప్రభువు తెలుపుచున్నారు. ఆయన ఒక రక్షణ కవచంగా ఉంటానని వాగ్దానం ఇస్తున్నారు.
- చాలా సందర్భాలలో దైవ సేవ చేసేటప్పుడు మనం భయ పడుతూ ఉంటాం. కొంతమంది ప్రవక్తలు కూడా ఉదాహరణగా మనకు నిలుస్తారు. 
మోషే, యిర్మియా, యోనా, ఏలీయా. 
-మోషే ప్రవక్త నత్తివాడినని   సాకులు చెబుతూ తప్పించుకోవాలని అనుకున్నాడు. 
-యిర్మియా - చిన్నవాడినని భయపడ్డాడు. 
-యోనా - అన్యులు అంగీకరిస్తారా లేదా అని భయ పడ్డాడు. 
-ఏలీయా - ఎసెబేలు రాణికి భయ పడ్డారు.
- వారిజీవితంలో ఎదురవ్వబోయే పరిణామాలకు ప్రవక్తలని భయపడ్డారు. దానికి తోడుగా ఇశ్రాయేలు ప్రజలు కూడా అనేక మంది ప్రవక్తలను నిరాకరించింది కాబట్టి వారు భయ పడ్డారు. 
- హోషేయా 9: 7, యిర్మియా 2: 30 
-2 వ రాజుల దిన 36: 16, ఆమోసు 2: 12 
-లూకా 13: 34, మత్తయి 23: 37, హెబ్రీ 11: 32, 1 థెస్స 2; 15 
-ప్రవక్తలు తమ జీవితంలో దేవుని కొరకు మాత్రమే పనిచేసారు. వారు అధికారులకు భయపడలేదు, మత పెద్దలకు, నాయకులకు, భయపడలేదు ఎందుకంటే వారు దేవునికి సంపూర్ణ, విధేయత చూపించారు. దేవుని చిత్తం నెరవేర్చారు, సొంత స్వార్థం చిత్తం చూసుకోలేదు. 
-మనం కూడా గుర్తించు కోవాల్సిన విషయం ఏమిటంటే దేవుని సేవ చేసినప్పుడు అంగీకారం మరియు తిరస్కారం అనేవి సర్వ సాధారణ అనుభవాలు అయితే తిరస్కరింప బడినప్పుడు క్రుంగి పోనవసరంలేదు ఎందుకంటే యేసేపు అన్నల చేత తిరస్కరించబడ్డారు, అయినా దేవుడు తన పక్షాన వున్నారు, ఆయన మాత్రం దైర్యంగా వున్నాడు, అభివృద్ధిలో ముందుకు సాగరు. ఆది ఖా: 37 .
-యేసు ప్రభువు నిరాకరించబడ్డారు, యోహాను 15: 18, మార్కు 3: 21 
ప్రభువు మాత్రం తండ్రి చిత్తం నెరవేర్చారు. 
- యిర్మియాను నిరాకరించారు అయినా దైవ సేవ చేశారు. నిరాకరించిన సరే దైవ వాక్కు తనను నిశబ్దంగా ఉంచుటలేదు, ఆయన దేవుని మాటలు దైర్యంగా ప్రకటిస్తున్నారు. 
-మన జీవితంలో తిరస్కరించ బడినప్పుడు మనకు దేవుడు తోడుగా ఉంటారని తెలుసుకొని దేవుడ్ని నమ్ముకొని ముందుకు సాగిపోవాలి.
- రెండవ పఠనంలో పౌలు గారు దైవ వారములు పొందిన విశ్వాసులు ప్రేమతో కూడిన జీవితం జీవించాలని తెలుపుచున్నారు.
-కొరింతు క్రైస్తవ సంగంలో ప్రేమ అనే వరము కొరవడింది. దేవుని యొక్క వారములు పొందినవారు వేవుణ్ణి, పొరుగు వారిని ప్రేమిస్తూ జీవించాలని పౌలు గారు పలుకుచున్నారు .
-పౌలు గారు తనయొక్క సువార్త పరిచర్య మొత్తం కూడా ప్రేమతో చేశారు.
-దేవుణ్ణి ప్రేమించారు కాబట్టే ఆయన సందేశమును ప్రజలకు ప్రకటించారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని ఆటంకాలు, హింసలు , ఎదురైనా  ఆయన మాత్రమూ దైవ సేవ చేశారు.
- ప్రేమకు ఏదైనా సాధించే బలం ఉంది అలాగే ఎంత శ్రమైన భరించే ఓర్పుకు, ప్రేమ ఉంది.
-దేవుని యొక్క కుమారుని యొక్క జీవితంలో మనకు అర్ధమయ్యే విషయం అదే. ఆయన ప్రేమతోనే మన కోసం ఈ లోకంలో జన్మిమ్చారు. 
-ప్రేమవలనే సుంకరులతో, పాపులతో కలిసి భోజనం చేశారు.
-ప్రేమవలనే అన్ని ప్రాంతాలవారికి సువార్త ప్రకటించారు.
-ప్రేమతో అద్భుతాలు చేశారు.
-ప్రేమ వల్లనే ఆయన్ను నిరాకరించిన కానీ మళ్ళీ వారిని అంగీకరించారు.
-ప్రేమ వల్లనే మోసం చేసినా క్షమించరు
-ప్రేమ వల్లనే తన జీవితం త్యాగం చేశారు
-ప్రేమ వల్లనే మనలను రక్షించారు
-ఆయన ప్రేమను గుర్తించిన పౌలు గారు ఈ విధంగా దేవుని యొక్క ప్రేమ జీవితం గురించి తెలుపుచున్నారు. 
- దేవుడు ప్రేమ స్వరూపి అని యోహాను గారు కూడా వ్రాశారు. 1 వ యోహాను 
-దేవుడు తన వారిని శాశ్వత మైన ప్రేమతో ప్రేమించారు. యిర్మియా 31 : 3  కాబట్టియే తిరస్కరించిన సమయాలలో క్రుంగి పోకుండా దైర్యంగా తన యొక్క పరిచర్యను కొనసాగించారు.
-ప్రేమలో స్వార్థం ఉండదు 
-ప్రేమ ఎదుటి వారి మేలు కోరుకుంటుంది. 
-ప్రేమకు ఎలాంటి చెడుగుణములు లేవు.
-దేవుడు మనలను ప్రేమించిన విధంగానే మనం ఒకరినొకరు ప్రేమించుకొని దైవ సేవ చేద్దాం. దేవుని ప్రేమను పంచుకుందాం.
-నేటి సువార్త పఠనంలో యేసు ప్రభువును తన సొంత ప్రజలే నిరాకరించిన విధానం మనం చూస్తున్నాం.
-సువిశేష భాగంలో రెండు విషయాలు మనం గుర్తించాలి. 
- ప్రజల యొక్క ఆశ్చర్యం 
-సొంత వారి యొక్క నిరాకరణ 
1. ఎప్పుడైతే యేసుప్రభువు యెషయా ప్రవక్త  గ్రంధం ను చదివి లేఖనము నెరవేరింది అని పలికారో అపుడు వారందరు ఆశ్చర్య పడుతున్నారు. 
-ఆయన మాటల్లో నూతనత్వం వున్నదని గ్రహించారు. ఆయన యొక్క భోధన యధార్థమైనదని గ్రహించారు. 
-ఆశ్చర్య పోయినతరువాత ఆయన యొక్క కుటుంభంతో ఆయన్ను పోల్చుతున్నారు. అయన యేసేపు కుమారుడు కాదా అని వారి ఆశ్చర్యం, ద్వేషంగా మారిపోతుంది ఇక్కడ.
-చాలా సందర్భాలలో మనంకూడా కొంతమందిని పోల్చుతారు.
-సమాజంలో పేరు ప్రతిష్టలున్న వారి అబ్బాయి కన్నా ఒక  పేద వానికి  వున్నత ఉద్యోగం వస్తే ఇదెలా అని ఆలోచిస్తూ వ్యత్యాసాలు చూసుకుంటారు.
-వారి అభిప్రాయమేమిటంటే వారికన్నా మిగతా వారందరు తక్కువ వారే, లేని వారే అనే భావన. ఇక్కడ యూదులు కూడా చేసినది అదే, ఆయన్ను (యేసు ప్రభువును) తన తండ్రితో పోల్చుతున్నారు. ఈ పేదవాని కుమారుడు ఎలాగా ఇలా మాట్లాడుతున్నారు అని ఆలోచిస్తున్నారు .
-ఆయన బోధనలు అంగీకరించుటకు బదులుగా ప్రశ్నించుకొంటున్నారు.
-సొంత వారు ఎప్పుడు తమ సొంత ప్రవక్తల గొప్పతనం అంగీకరించలేరు, ఎందుకంటే మన మధ్యలో పుట్టి, పెరిగిన వ్యక్తి, వారికన్నా ఎక్కువగా మంచి చేస్తుంటే, భోదిస్తుంటే ఎవరు కూడా అంగీకరించలేరు. వారిలో ఎక్కువ అసూయా ఉంటుంది.
- ప్రజలు ఎందుకు నిరాకరించారంటే 
1. తన బోధనల ద్వారా వారికి కోపం తెప్పించారు, మరీ ముఖ్యంగా వారి విశ్వాసం అన్యుల కన్నా చిన్నది అని చెప్పారు. 
2. వారి మధ్య అద్భుతాలు చేయుటకు నిరాకరించారు.
3.నాయకులను, మత పెద్దలను ప్రతి నిత్య కపట ప్రవక్తలని సంబోధించినందులకు 
4. తానే మెస్సయ్య అని చెప్పుకున్నందుకు
5. అసూయా వల్ల ప్రభువును నిరాకరించారు చంపాలనుకున్నారు.
6. ఆయన (క్రీస్తు) ప్రజలు అనుకున్న విధంగా నడవలేదు.
7. ప్రజలకు ఇష్టం వచ్చిన విధంగా మాట్లాడలేదు అందుకే వారు కోప పడ్డారు, నిరాకరించారు. 
-దానికి ప్రతి ఫలంగా దేవుడు వారి విశ్వాస జీవితాలను పరీక్షించుటకు రెండు ఉదాహరణలు ఇస్తున్నారు.
1. ఏలీయా - సెరాఫథ్ వితంతువు- 1 రాజు 17: 7 - 24 
2. ఎలిశా - నామాను కుష్టి రోగి (సిరియా) 2 రాజు 7: 3 -10 
ఏలీయా ప్రవక్త సెరాఫత్ లో వున్న వితంతువద్దకు వెళ్లారు. అక్కడ ఆమె ప్రవక్త మాటలను  విశ్వసించింది.
- ఆయన మాటప్రకారం నడుచుకొన్నది.
- నామాను కూడా అన్యుడే అయినప్పటికీ ప్రవక్త మతాల మీద విశ్వాసం ఉంచి విధేయత చూపారు కాబట్టియే స్వస్థత పొందారు. 
-వితంతువు, నామాను, ఇద్దరు కూడా ప్రవక్తలను అంగీకరించారు వారిద్దరిలో ప్రవక్తలో దైవ శక్తి దాగి ఉందని గ్రహించారు. అందుకే వారి మాటలను ఆలకించి వినయంతో వారు చెప్పినది చేసారు. అందువల్ల అద్భుతాలు పొందారు.
-ప్రభువు ప్రేమ అందరికి ఇవ్వబడుతుంది దానిని స్వీకరించకపోతే అది మన లోపమే.
-యూదులకు మొదటి ప్రాముఖ్యత నిచ్చారు కానీ వారు తృణీకరించారు. మనం కూడా అలాగే చేస్తున్నామా?
-అసూయా ఉంటే ఎవరియొక్క గొప్పతనం, మంచితనం, మనం అంగీకరించలేము. ప్రేమ ఉంటే ఎవరినైనా అంగీకరిస్తాం, భరిస్తాం. కాబట్టి మన జీవితంలో అంగీకారం , తిరస్కారం ఉంటూనే ఉంటాయి . కాబట్టి మనం ప్రేమతో అని తెలుసుకొని ప్రవక్తలను యేసుప్రభువును  ఉదాహరణ గా తీసుకొని ముందుకు సాగాలి. వారు నిరాకరించబడిన కానీ గమ్యం మరువలేదు, సువార్త  సేవ ఆపలేదు , క్రుంగి పోయి వెనుకంజ వేయలేదు. దైవ ప్రేమతో సోదరుల మంచికోసం ఎన్ని తిరస్కరణలైన ఎదుర్కోగలిగారు. మనం కూడా ప్రేమ ఉంటె ఎంత కష్టమైన ఇష్టంగా ఏదైనా సాధించవచ్చు.
-దేవుడు అందరిని సువార్త వ్యాప్తి కోసం పిలుస్తున్నారు కాబట్టి ప్రభువు యొక్క వాక్యం అనుసారం జీవించుదాం.
Rev. Fr. Bala Yesu OCD

22, జనవరి 2022, శనివారం

మూడవ సామాన్య ఆదివారం

 మూడవ సామాన్య ఆదివారం 

నెహెమ్యా  8:2-4,5-6,8-10 1 కోరింథీ 12:12-30 లూకా 1:1-4,4:14-21 

నేటి దివ్య పఠనాలు  దేవుని  యొక్క వాక్కు వినేటటువంటి  ప్రజలు ఎలాంటి జీవితం జీవించాలి అనే అంశం గురించి తెలుపుతున్నాయి.  దేవుని యొక్క వాక్కు యొక్క గొప్పతనం  శక్తిని  గ్రహించి దేవుని ప్రజలు ఐక్యత, సక్యత  కలిగి  జీవిస్తూ దేవున్ని అంటి పెట్టుకొని  జీవిస్తూ  దేవుని సేవ చేయాలని కూడా  ఈనాటి పఠనాలు  మనకు తెలుపుచున్నాయి. 

ఈనాటి  మొదటి పఠనంలో  దేవుని వాక్కు యొక్క గొప్పతనం గురించి చదువుకుంటున్నాము. మొదటి పఠనం యొక్క చరిత్ర మనం గ్రహిస్తే, ఆనాటి  పర్షియా రాజు కోరేషు బాబిలోనియా ప్రజలను  జయించిన తరువాత బానిసత్వంలో  దాదాపు 70 సంవత్సరాలు గడిపిన యూదులను  వారి సొంత భూమి అయిన యెరుషలేముకు పంపించారు. 

తిరిగి వచ్చిన యూదులు యెరుషలేము  దేవాలయంణు పునర్నిమించారు. ఎజ్రా 6:15-17 అదే విధంగా ఆ పట్టనపు గొడలు కూడా కట్టడం ముగించిన  పిదప  దేవుని యొక్క వాక్యం చదువుచున్నారు.  దేవుని యొక్క వాక్యం చదువుచున్నారు. దేవుని యొక్క వాక్యం చదివినది ఎజ్రా. ఆయన  ధర్మ శాస్త్ర భోధకుడు , యాజకుడు అదే విధంగా  మత సంబంధిత నాయకుడు (నెహెమ్యా 8:9)

అదేవిధంగా నెహెమ్యా  రాష్ట్ర పాలకుడు  దేవునితో మంచి  అనుభందం  కలిగిన వ్యక్తి, దైవ భయం  వున్న వ్యక్తి ,దేవుడు ఎజ్రాకు  మరియు నెహెమ్యాకు  ఒక ముఖ్యమైన బాధ్యతను అప్పజెప్పారు. ఆదేమిటంటె  దేవుని యొక్క  వాక్కును ప్రకటించుట, ప్రకటించుట మాత్రమే కాదు ప్రజలను ప్రేరేపించాలి. 

ప్రతి ఒక్కరు కూడా ఈ రెండు  విషయాలు గుర్తు పెట్టుకోవాలి. దేవుని వాక్కు మనం ప్రకటించాలి, ఇతరులను దైవ వాక్కుతో ప్రేరేపించాలి. ఈ మొదటి పఠనంలో యిస్రాయేలు  ప్రజలు దేవుని యొక్క వాక్కును వినుటకు కనబరిచిన ఆసక్తి గొప్పది. 

దేవుని యొక్క వాక్కు వినాలని ఎంతో ఆశతో వున్నారు. దేవుని యొక్క వాక్కు దేవునితో సమానమని భావించారు. బానిసత్వంలో  బహిరంగంగా దేవుని వాక్కు ఆలకించే  అవకాశం లేదు అందుకే ఇప్పుడు  దొరికిన  అవకాశంను  బట్టి వారు ఆ వాక్కుకై తయారై వున్నారు. ఎజ్రా దేవుని వాక్కు చదివినప్పుడు ఉదయం నుండి  మధ్యాహ్నం వరకు అందరుకూడా సావదానంగా విన్నారు. వారు విసుగు చెందక, అలసట పొందకు  అదే పనిగా ఎలాగా  వినగలిగారు. అంటే ఆ వాక్కులు  ఆ ప్రజలకు వినసొంపుగా వున్నాయి.  ఆ వాక్కు వల్ల  దేవుని తెలుసుకోవచ్చు అం గ్రహించారు. కీర్తన 119:103 

ఆ వాక్యములు  వారికి  వెలుగును , చూపేలా ఉన్నాయి. అందుకే వాటిని వినడానికి చాలా ఇష్టపడుతున్నారు. దేవుని వాక్కు  యొక్క  ఔనత్యాన్ని తెలుసుకున్నారు. అందుకే  ఎటువంటి  ఇబ్బంది లేకుండా విన్నారు. వారి యొక్క  ఆధ్యాత్మిక జీవితంకు  దైవ వాక్కే ఆహారం. దేవుని యొక్క వాక్కు  సృష్టించే వాక్కు అని. దేవుని యొక్క వాక్కు  ఆదరించే  వాక్కు అని ,దేవుని యొక్క వాక్కు నేర్పించే వాక్కు అని , దేవుని యొక్క వాక్కు పుట్టించే వాక్కు అని , దేవుని యొక్క వాక్కు స్వస్థత నిచ్చే వాక్కు అని వారు గ్రహించారు.

మనం దేవుని  వాక్కుకు  ఎంత ప్రాముఖ్యతనిస్తున్నాం? దేవుని యొక్క వాక్కును ఆలకించడానికి చదవడానికి  ఎంత మందికి ఆసక్తి ఉంది.  యూదుల కాలంలో అందరి దగ్గర దేవుడు మోషే ద్వార ఇచ్చిన  ధర్మ శాస్త్రం  లేదు అయినప్పటికీ అయినప్పటికీ అవకాశం ఉన్న చోటల్లా దేవుని వాక్కు వింటున్నారు. మనందరికీ  ఇప్పుడు బైబుల్  గ్రంధం ఉంది. ఎంత మంది  చదువుతున్నారు? చదువు లేకపోయినా చదువుకున్న బిడ్డల దగ్గర ఎంతమంది చదివించుకొని వింటున్నారు. 

గుడికి వచ్చినప్పుడు యాజకులు బైబుల్ గ్రంధం మొత్తం  వివరించలేరు ప్రసంగంలో , అందుకే  దేవున్ని  తెలుసుకోవాలంటే మన జీవితాలు సన్మార్గంలో నడిపించు కోవాలంటే మనం దేవుని వాక్కు చదవాలి, వినాలి. 

చదివితే మరియు వింటేనే మనలో విశ్వాసం పెరుగుతుంది. రోమి 10:17. ఆనాటి యూదా ప్రజలు సమయం గురించి ఆలోచించలేదు. దేవుని వాక్కు గురించి మాత్రమే  ఆలోచించారు. మనం కూడా పవిత్ర గ్రంధం చదువుట ద్వారా దేవుని ప్రేమ, క్షమా, త్యాగం చాల విషయాలు నేర్చుకోవచ్చు.

అలంటి ఆసక్తి మనలో ఉందా?

2. రెండవది గా దేవుని ధర్మ శాస్త్రమునకు ఇచ్చిన గౌరవం అందరం ధ్యానించుకోవాలి.

నెహెమ్యా 8: 5-6  ఎప్పుడైతే ఏజ్రా గ్రంధమును విప్పారో అప్పుడు అందరుకూడా లేచి నిలబడ్డారు, దేవుణ్ణి స్తుతించి అదేవిధంగా ఆ ప్రభువుని ఆరాధించారు.

- ఆ గ్రంధం గురించి వారికి తెలుసు కాబట్టియే ఆ పుస్తకం కు అంత ప్రాధాన్యత ఇచ్చారు.

-మరి ఈ రోజు మనం పవిత్ర గ్రంథం ను ఎలాంటి స్థలాల్లో ఉంచుతున్నాం?

-కొంతమంది ఎక్కడెక్కడో పెడతారో. అది కాదు మనం చేయాల్సింది, ఆ గ్రంధం దేవుడే కాబట్టి మనం మంచి స్థలం ఇవ్వాలి.

- విలువ గ్రహిస్తే ప్రాధాన్యత ఇస్తాం. ఇశ్రాయేలు ప్రజలు గ్రహించారు కాబట్టియే  అది చేయగలిగారు.

-చర్చిలో నిలబడ్డ సమయంలో కొన్నిసార్లు బైబిలు మన కాళ్ళ దగ్గరఉంటుంది. అది కూడా మనం పట్టుకొని నిలబడితే అప్పుడు ఆ వాక్కు కు మనం గౌరవం ఇచ్చినట్లు అవుతుంది.

- ప్రతి ఒక్కరు పవిత్ర గ్రంధమును దేవాలయానికి తీసుకురావాలి.

-దేవునియొక్క వాక్కును చదివిననప్పుడు వారియొక్క హృదయాలు చలించి పోయాయి. అందుకే దుఃఖం పట్టలేక ఏడ్చిరి . నెహెమ్యా 8:9

- దేవుని ఆజ్ఞలు మీరు జీవించినందుకు ఏడ్చి ఉండవచ్చును.

- వారు బోరున ఏడ్చారు. దేవుని వాక్కును విన్న సమయంలో దేవుడి ప్రేమ వారికి గుర్తుకు వచ్చింది.

-దేవుడు వారిని ఒక కాపరిగా, తండ్రిగా నడిపించిన విధానం గుర్తుకు వచ్చింది.

-వారికి బానిసత్వం వచ్చింది ఆయన యొక్క వాక్కును ధిక్కరించడం వల్లే అని గ్రహించి ఉండవచ్చును.

- వారికి ఇచ్చిన మన్నా, పూరేడు పిట్టలు, సమృద్ధిగా స్వేచ్ఛ జీవితం గుర్తుకు వచ్చింది.

- వారు దైవమును కాదని అన్య దైవములను ఆరాధించిన పాపపు జీవితం గుర్తుకు వచ్చింది.

-దేవుని యొక్క వాక్కు వారి జీవితాలకు అన్వయించారు కాబట్టియే వారియొక్క బలహీనతలు, పాపపు మచ్చలు గుర్తుకు వచ్చాయి.

మనం కూడా దేవుని వాక్కును మన జీవితాలకు అన్వయించుకుంటేనే  మనలో కూడా హృదయ పరివర్తనం అనేది కలుగుతుంది.

- కొన్నిసార్లు మనం కొంతమందిని చూస్తాం ప్రసంగం చెప్పేటప్పుడు ఏడుస్తారు ఎందుకంటే ఆ వాక్యం వారిని తాకింది.

అదేవిధంగా వారియొక్క పాపపు జీవితం గుర్తుకు వచ్చినప్పుడు, ఏడుస్తారు.

-పాపపు జీవితం ద్వారా, స్వార్ధపు జీవితం ద్వారా ఇతరులను దేవుడిని బాధ పెట్టిన సమయాల గురించి వాక్యంతో భోదించినప్పుడు సాధారణంగా అందరూ ఏడుస్తారు. మనం కూడా ప్రభువు యొక్క వాక్కు విన్న సమయంలో భాద కలిగి మార్పు కలగాలి.

1.సౌలు విన్నాడు హృదయ పరివర్తనం చెందాడు. (పౌలు)

2.దావీదు నాతాను ప్రవక్త యొక్క దైవ వాక్కులు విన్నాడు పశ్చాత్తాప పడ్డారు.

3.నినెవె  పట్టణ  వాసులు విన్నారు దుఃఖం తో జీవితాలు సరిచేసుకున్నారు

4.అగస్టీను దేవుని యొక్క వాక్కు విన్నాడు -హృదయ పరివర్తనం చెందాడు. మనం కూడా  అలాగే  మన జీవితాలు మార్చుకోవాలి.

-వాక్యం చదవటానికి, వినటానికి సమయం కేటాయించాలి. అప్పుడే దేవుని గురించి తెలుసుకొని జీవిస్తాము.

-దేవుని వాక్కు చదివితే ఆ వాక్యమే మనలను నడిపిస్తుంది, ప్రేరేపిస్తుంది. మనం ఎలా జీవించాలి అని తెలుపుతుంది.

- దేవుని యొక్క వాక్కు లేని లోపం వారు తెలుసుకున్నారు. అందుకే ఎంత సమయమైనా కాని పట్టించుకోకుండా శ్రద్ధగా విన్నారు, ప్రభువునందు ఆనందించారు. అలాంటి విశ్వాసం, ఆశ మనలో కూడా ఉండాలి.

రెండవ పఠనంలో

దేవుని బిడ్డలు, దేవుని వాక్కు వినేవారు చదివేవారు జీవించవలసిన విధానం గురించి పౌలుగారు తెలుపుచున్నారు.

-కొరింతు ప్రాంతంలో భిన్నమైన ప్రజలు జీవిస్తుండేవారు వారిలో బేధాభిప్రాయాలు ఎక్కువగానే ఉండేయి. ఐతే పౌలు గారు వారందరు కూడా ఐక్యంగా కలిసి జీవించుటకు శరీరం మరియు దానిలో వున్నా అవయవములు ఉదాహరణ తీసుకొని ఐక్యతను గురించి తెలుపుచున్నారు.

-జ్ఞానస్నానం పొందిన ప్రతి యొక్క విశ్వాసి దేవుని యొక్క పవిత్రమైన శరీరంలో భాగమే.

- జ్ఞాన స్నానం స్వీకరించుటకు ముందు మనలో ఎన్నోరకాలైన భావాలూ భేదాలు ఉన్నప్పటికీ వాటన్నింటిని జ్ఞానస్నానం పొందిన తరువాత విడిచిపెట్టాలి అని పౌలుగారు వివరిస్తున్నారు. (1కొరింతి12: 12-13 )

-మన శరీరంలో వున్న ప్రతియొక్క అవయవం ముఖ్యమైనది ఒక్కొక్క దానికి ఒక్కొక్క పని ఉంటుంది. కొన్ని అవయవాలు పెద్దవి అయివుండవచ్చును కొన్ని చిన్నవి అయి ఉండవచ్చు, అయినప్పటికీ దేని ప్రాముఖ్యత దానికి ఉంది.

-కాబట్టి ఒక్క అవయవం ఇంకొక్క దానికి సహకరిస్తూ జీవిస్తే అక్కడ మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది.

-మన శరీరంలో ఉన్న ప్రతి అవయవం పనిచేస్తేనే మనందరం బాగుంటాం. ఏది బాగా లేకపోయినా మనం సంతోషం గా ఉండలేము. అలాగే మనందరం కూడా దేవుని శరీరంలో  భాగస్తులం మరి మనం కూడా ఐక్యంగా జీవించాలి.

చేయి నోటికి సహకరించకపోతే మనం తినలేం

-కన్ను కాలికి సహకరించకపోతే మనం నడవలేం

-నోరు చెవులకు సహకరించకపోతే మనం వినలేం.

అందుకే ప్రతి ఒక్క అవయవం అవసరం, ప్రతి అవయవం శరీర అభివృద్ధి కోసం, మానసిక, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సహాయపడాలి.

-ప్రతి ఒక్క వ్యక్తి తాను శ్రీసభ (శరీరం) కోసం తన వంతు తాను కష్టపడాలి. అప్పుడే శ్రీసభ  ఆనందంగా ఉంటుంది.

- శ్రీ సభ శిరస్సు క్రీస్తుప్రభువే ఆయన లేకుండా మనం లేము. కాబట్టి ఆ శరీరం గొప్పతనం గ్రహించి , సహకరించి జీవించాలి.

-మనందరం కూడా ఐక్యత కలిగి జీవించాలి. పౌలుగారు అంటారు జ్ఞానస్నానం పొందినవారందరు దేవుని బిడ్డలే అందుకే వారు ఐక్యంగా జీవించాలి.

-సాధారణంగా సమాజంలో మనం చుస్తే ఇంకా చాలామందికి జాతి, మత, కుల భేదాభి ప్రాయాలు వున్నాయి. బహుశా ఇంకా వారిని దేవుని యొక్క వాక్కు తాకలేదు.

-స్వయంగా యేసు ప్రభువే తనను తాను తగ్గించుకొని పాపులతో, సుంకరులతో కలిసి జీవించారు.

-పౌలు పరిసయ్యుడు అయినప్పటికీ అన్యులకు సేవచేసారు. ఆయన్ను దేవుని వాక్కు మార్చింది.

-దేవుని వాక్కు అతనికి వివేకాన్ని అందించింది అందుకే భేదాభి ప్రాయాలు లేకుండా జీవించారు.

-మనం దేవుని బిడ్డలం, ఆయన మన తండ్రి మనందరం ఒకే కుటుంబంలో ని బిడ్డలం కాబట్టి అందరితో కలిసి మెలసి ఐక్యంగా జీవించాలి.

-శ్రీ సభ అభివృద్ధి కోసం సహాయపడాలి. అందరుకూడా విలువైన వారే ధనిక -పేద వ్యత్యాసం లేకుండా .

-మనందరం దేవుని వాక్కు చదివి, ధ్యానించి ఆ వాక్కు అనుసారం జీవించాలి, ఎలాంటి భేదాలు మనలో వుండవు. వాక్యమును చదువుకొని జీవించుద్దాం, ఐక్యంగా కృషిచేద్దాం.

-ఈనాటి సువిశేష పఠనంలో యేసు క్రీస్తు ప్రభువు యొక్క పంపబడిన విధానం తెలుసుకుందాం.

-ప్రభువు ఎందుకు ఈ లోకానికి పంపించబడ్డారు అని తెలుపుచున్నారు.

సువార్త ప్రారంభంలో లూకా గారు ఈ సువార్త తెయోఫిలుకు వ్రాస్తున్నారు. అదేవిధంగా అందరి విశ్వాసుల కోసం వ్రాస్తున్నారు.

-తెయోఫిలు బహుశా నీటి గలిగిన వ్యక్తి అయి ఉండవచ్చు, మంచి పేరు కలిగిన వ్యక్తి కావచ్చు, లేకపోతే దేవుణ్ణి తెలుసుకోవాలి అనే ఆసక్తి కలిగి లూకా గారిని యేసు ప్రభువు గురించి వ్రాయమని అడిగివుండవచు.

-బహుశా దేవునియందు విశ్వాసం ఉంచి క్రొత్తగా జ్ఞానస్నానం పొందిన వ్యక్తి అయి ఉండవచ్చు.

-తెయోఫిలు అంటే (a friend of God) దేవునికి స్నేహితుడు, దేవుణ్ణి ప్రేమించువాడు అని అర్థం.

-దేవుణ్ణి ప్రేమించు ప్రతిఒక్కరికి లూకా గారు ఈ సువార్తను వ్రాస్తున్నారు.

-వారియొక్క విశ్వాసంలో దృడంగా ఉండటానికి ఈ విధంగా వ్రాస్తున్నారు.

-సువార్తలో మనం వింటున్నాం లూకా 4:14-15 యేసు ప్రభువు చేసినా సువార్త పరిచర్య గురించి

-ఆయన కేవలం ప్రార్థించుటకు మాత్రమే కాకుండా వీలైన ప్రతి సమయంలో వాక్యాన్ని ప్రకటిస్తున్నారు.

-ప్రకటించిన వాక్యంకు ప్రతి ఫలం ఉండాలి. యేసుప్రభువు తండ్రి గురించి సువార్తలో తెలిపారు. ఆయన యొక్క జీవిత లక్ష్యం, ప్రణాళిక తెలిపారు.

-ప్రభువు ప్రతి ప్రాంతమునకు వెళ్ళేది అందరూ కూడా దేవున్ని తెలుసుకొని, హృదయ పరివర్తనం చెంది, రక్షణ పొందాలి అనే ఉద్దేశంతోనే.

యేసు ప్రభువు చదివిన మాటలు యెషయా 61:1-2 నుండి తీసుకొనబడినవి.

- ఈ మాటలు మోషే ఎన్నికకు దగ్గరగా వున్నాయి. నిర్గమ 3:7-10 మోషేను ఎందుకు ప్రభువు ఎన్నుకున్నారు అని తెలుపుచున్నారు.

-18 వచనం ద్వారా దేవుని ఎన్నిక దేని నిమిత్తం అని అర్థమవుతున్నది.

1. దేవుని  ఆత్మ  ఆయన పై ఉన్నది.

2. పేదలకు సువార్తను భోధించుటకు అభిషేకించారు.

3. చెరలో వున్న వారికి విడుదలను దయచేయుటకు.

4. గ్రుడ్డివారికి చూపును నిచ్చుటకును

5. పీడితులకు విమోచనం కలిగించుటకును

6. ప్రభు హిత సంవత్సరమును ప్రకటించుటకు ఆయన్ను అభిషేకించారు.

-దేవుని కార్యముల కోసం, సువార్త వ్యాప్తి కోసం మూడు రకాల ప్రజలు అభిషేకించబడ్డారు.

1.రాజులు

2.యాజకులు

3.ప్రవక్తలు

1.సమువేలు సౌలును, దావీదును రాజులుగా అభిషేకిస్తున్నారు. దేవుని యొక్క ప్రతినిధులు వుంది దేవుని కార్యములు నెరవేరుచుటకు.

2. యాజకులు ప్రతి ఒక్క యాజకున్ని దేవుడు అభిషేకిస్తారు దేవుని యొక్క యాజకులు ఆరోను దేవుని యొక్క యాజకులు ఆరోను అతని కుమారులు దేవుని సేవకోసం ప్రత్యేకంగా కేటాయించబడిన వారు - 2 రాజులు 29, 30 అధ్యాయాల్లో చెప్పబడినవి.

3. ప్రవక్తలు - దేవుడే  వారికి స్వయంగా పిలుపునిస్తున్నారు. దేవునికి మానవులకు మధ్యవర్తులుగా ఉండటానికి దేవుడు ఏలియాతో ఏలిషాను అభిషేకించడానికి చెప్పారు. 1 రాజులు 19:16-19 వీరందరూ దేవుని యొక్క పనికోశం అభిషేకించబడిన వారే, వారికి అధికారం , శక్తి, ఆత్మ వరములు ఇవ్వబడ్డాయి. కాబట్టి వారు చేసే సువార్త  అంగీకరించి  జీవించాలి. 

1. దేవుని ఆత్మ అభిషేకించబడిన వారి మీద ఉన్నది. దేవుని ఆత్మచె వారు నడిపించబడాలి. యేసు ప్రభువు నాపై ప్రభుని  ఆత్మ ఉన్నది అని పలికారు. ఆ ఆత్మ శక్తిచే శోదనలు  జయించారు, ఆత్మ శక్తిచే  సువార్తను ప్రకటించారు. కష్టలు ఓదార్చుకున్నారు. దేవుని ఆత్మ  తనను పరిచర్యకు సంపూర్ణంగా సిద్దం చేసింది. 

దేవుడు తాను పిలిచిన వారిని బలపరుస్తారు. దేవుని యొక్క ఆత్మ వారిని నడిపిస్తుంది. 

2. పేదలకు సువార్తను భోధించారు. పేదలు అనగా లేని వారు. దేవుని గురించి అవగాహన లేనివారు. దైవ ప్రేమ లేని వారు, దేవుని సుగుణాలు లేని వారు ,దేవుని యొక్క ఆత్మ లేనివారు, దేవుని యొక్క మంచి తనం, గొప్పతనం తెలియని వారికి సువార్తను ప్రకటించుటకు యేసు ప్రభువును తండ్రి దేవుడు అభిషేకించారు. గురువులను కూడా అందుకే  అభిషేకించారు. 

3. చెరసాలలో ఉన్న వారికి విడుదల దయచేయుటకు ఈ లోక ఆశతో , వ్యామోహంతో బంధీలుగా ఉన్నవారిని పాప సంకీర్తనల ద్వారా విడుదల దయ చేయుటకు దేవుని యొక్క పరిశుద్ద వాక్కు ద్వారా విడుదల దయ చేయుటకు ఎన్నుకొనబడ్డారు. 

4. గ్రుడ్డి వారికి చూపు నిచ్చుటకు 

ఎవరైతే దేవుని యొక్క కార్యాలు చూడలేక పోతున్నారు. దేవున్ని తమ జీవితంలో గుర్తించలేక పోతున్నారు. ఎదుటి  వారిలో ఉన్న  ప్రేమను చూడలేని గ్రుడ్డి వారు కొంతమంది కనులుండి గ్రుడ్డి వారిగా ఉండే వాళ్ళు ఉన్నారు. వారు అనుకున్నదే సత్యం అనుకుంటారు అట్టి వారికి దేవుడు మాత్రమే చూపు నివ్వగలరు. 

కొందరికి దేవుడు ఆధ్యాత్మిక చూపు దయ చేస్తారు. 

5.  పిడితులకు  -విమోచనం -ఎవరైతే శారీరకంగా , మానసికంగా ,ఆధ్యాత్మికంగా పీడించబడుతున్నారో అలాగే దయాల చేత పీడించబడేవారికి ,విమోచనం కలిగిస్తారు. మానసిక గాయాలవల్ల పీడించబడే వారు , అణచి వేయబడినవారు , ఎదుటి వారి పట్ల హర్ట్ అయినవారికి  విమోచనం కలుగ చేయుటకు పంపించబడ్డారు. 

6.దేవుని సంవత్సరం ప్రకటించుటకు - దేవుని యొక్క రక్షణ సంవత్సరం అని అర్ధం లేక మెస్సీయ్య యొక్క రాక అని అర్ధం. దేవుడు వారి మధ్యలో ఉన్నారు, అని తెలిపే సంవత్సరం అది. కాబట్టి మనందరం కూడా  దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించి, అనుసరించి ఆ వాక్కు చేత స్వతత్రం పొందుతు సన్మార్గంలో నడుస్తూ దేవునికి అంగీకార జీవితం జీవిద్దాం. సాధ్యమైనంత వరకు సువార్త వ్యాప్తి కోసం కృషి చేద్దాం, దేవుని రాజ్య స్థాపనకు కృషి చేద్దాం. 

REV.FR.BALAYESU OCD



పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...