15, జులై 2022, శుక్రవారం

16వ సామాన్య ఆదివారము

16 సామాన్య  ఆదివారము

ది 18: 1-10
కోలస్సి  1: 24-28
లూకా 10: 38-42

క్రీస్తునాదునియందు ప్రియమైనటువంటి పూజ్యగురువులు మరియు దేవునిబిడ్డలైనటువంటి క్రైస్తవ విశ్వాసులారానాడు తల్లి శ్రీసభ పదహారోవ సామాన్య ఆదివారంలోనికి ప్రవేశించియున్నది. 

 నాటి మూడు దివ్య గ్రంథ పఠనములను గ్రహించినట్లైతే మూడు కూడా ముఖ్యమైనటువంటి  రెండు అంశాల గురించి మనకు తెలియజేస్తున్నాయి అవి ఏమిటంటే.

1) దేవుని మానవుడు ఆహ్వానించటం

2) దేవుని యొక్క  ఆశీర్వాదం.

  రెండు అంశాలు  నాటి పఠనాలలో క్లుప్తంగా చూస్తున్నాముమొదటి పఠనముమరియుసువిశేషపఠనములలో చూసినట్లయితే 

దేవుడు మానవుల యొద్దకు వచినప్పుడు మానవుడు విధంగా దేవుని ఆహ్వానించి తనకు ఉన్న దానిలో దేవునికి సమర్పించింది మరియు దేవుని యొక్క ఆశీర్వాదాలు విధంగా పొందియున్నారో చూస్తున్నాముమానవుడు దేవుని యొక్క ఆశీర్వాదములు పొందాలంటే ఏమి చేయాలి అని మనం గమనించినట్లయితే  నాటి పఠనాలలో చూస్తున్నాము అబ్రాహాము మరియు మార్తమ్మమరియమ్మలు విధంగా దేవుని యొక్క అనుగ్రహాలను పొందియున్నారో.

ముందుగా మొదటి పఠనంలో చూసినట్లయితే రెండు మూడు వచనాలలో అబ్రాహామునకు అతిధులు కనిపించినప్పుడు అబ్రాహాము వారి యొద్దకు వెళ్లి ఏవిధంగా వారిని తనయొక్క ఇంటిలోనికి ఆహ్వానించి వారికీ అన్ని విధాలుగా పరిచర్య లేదాసేవ చేస్తున్నాడో మనమందరము కూడా గమనిస్తున్నాము అతని యొక్కసేవ మరియు విశ్వాసము ద్వారా ముగ్గురు వ్యక్తులు అబ్రాహామును మరియు సారాను దీవించి వారికీ సంతాన ప్రాప్తిని దయచేసి ఉన్నారునిజంగా చెప్పాలంటే ముసలి వయసులో బిడ్డలను కనడం అంటే ఒక గొప్ప అద్భుతమేయొక్క అద్భుతాన్ని దేవుడుతప్ప మానవుడు చేయలేడు కాబ్బటి అబ్రాహాము మరియు సారాను ఆశీర్వదించిన వారు దేవుడనే చెప్పవచ్చు.

సువార్త పఠనంలో మరియామార్తలు ఒక గొప్ప వ్యక్తిని తనయొక్క ఇంటికి ఆహ్వానించి  వ్యక్తికి అతిధి సంప్రదాయాలు చేయటం మనం చూస్తున్నాము.  వ్యక్తియే యేసుప్రభు ఇక్క మనం గమనించినట్లయితే మానవుడు దేవుని పట్ల చూపాల్సి ప్రేమశ్రద్ధ మరియు అంకిత భావం ఎప్పుడైతే కలిగి జీవిస్తునాడో అప్పుడే దేవుడు మానవుని ఆశీర్వదించటం మనమందరము చూస్తున్నాము అతిధిని ఎలా సత్క రించాలో  నాటి పఠనములు మనకు ప్రత్యే కంగా తెలియజేస్తున్నాయిన మరియు మన తోటి వారిని  విధంగా గౌరవించాలివారితో  విధంగా ఉండాలో అబ్రాహాము మరియు మార్తామరియల ద్వారా మనం తెలుసుకోవచ్చు  అంటే  రెండు సన్ని వేశాలు కూడా మనకు ఇంకొక్క విషయాన్ని కూడా తెలియజేస్తున్నాయి అదే విందు

రెండు పఠనాలు కూడా అబ్రాహాము మరియు మార్తలు అతిధులను ఆహ్వానించినప్పుడు వారికీ వీరిద్దరూ కూడా విందును తయారు చేసి వారికీ గౌరవప్రదంగా పెట్టడం మనం చూస్తున్నాము.

అదే విధంగా క్రైస్తవులమైన మనం దివ్యబలి పూజలో పాల్గొన్నప్పుడు విధంగా వుంటున్నామో ఒక్కసారి మనం గమనించుకోవాలి ముఖ్యంగా ప్రతిరోజు మనం దివ్య బలిపూజలో పాల్గొన్నప్పుడు విధంగా పాల్గొంటున్నామో మరి ముఖ్యంగా దివ్య సప్రసాదాన్ని స్వీకరించేటప్పుడు మనము భక్తితో మరియు ప్రేమతో స్వీకరిస్తున్నామరియా విధంగానైతే క్రీస్తు యొక్క  పాదా చంత కూర్చొని క్రీస్తు చెప్పి ప్రతి ఒక్క  మాటను ప్రేమతో మరియు శ్రద్ధతో విన్నదో అదే విధంగా మనం దివ్య సత్ప్ర సాదాన్ని స్వీకరించే ముందు చేయాల్సి పని గురువు చెప్పి దానిని శ్రద్ధగా విని  యొక్క వాక్యాన్ని ప్రేమతో ఆహ్వానించి దివ్య సత్ప్రసాదని స్వీకరించాలి అప్పుడు మనం దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుతాము అంతే కాకుండా క్రీస్తు ప్రభు మన యొక్క  హృదయంలోనికి ప్రవేశిస్తారుకాబ్బటి ప్రియ దేవుని బిడ్డలారా  విధంగానైతే అబ్రాహాముమార్త మరియు మరియలు అతిధులను ఆహ్వానించి మరియు వారు ఇచ్చినటువంటి ఆశీర్వాదములను ప్రేమతో స్వీకరించారో అదే విధంగా క్రైస్తవులమైన మనము దేవుడు ఇచ్చి ఆశీర్వా దాలు మరియు దేవుడు చెప్పి దానిని మన జీవితాలలో పాటించాలని  దివ్య బలిపూజలో ప్రార్దించుదాం మరియు దేవుని యొక్క ఆశీర్వాదాలను ప్రేమతో స్వీకరించుదాం, ఆమెన్

బ్రదర్. జొహాన్నెస్. ఓ.సి.డి 

9, జులై 2022, శనివారం

15 వ సామాన్య ఆదివారము (2)

 15  సామాన్య ఆదివారము

ద్వితీ:- 30:- 10-14, కొలిసి:- 1:- 15-20, లూకా:- 10:- 25-37 

  నాటి దివ్య పఠనాలు  దేవుని యొక్క ఆజ్ఞలను పాటించటంగురించి తెలుపుతున్నాయిదేవుడిచ్చిన ప్రేమ ఆజ్ఞలను పాటిస్తూ మనమందరం కూడా పరలోక రాజ్యము చేరాలన్నది వీటి సారాంశం. 

క్రైస్తవ జీవితంలో దేవుడిని ప్రేమించుట మరియు మన పొరుగువారిని ప్రేమించుట అన్న అంశములు ప్రధానమైనవి. 

 ఈనాటి మొదటి పఠనములో  మోషే ప్రవక్త దేవుని యొక్క ఆజ్ఞలు పాటించి జీవిస్తే దీవించబడతారు అని తెలుపుచున్నారు.

 ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చిన ధర్మశాస్త్రము చాల ప్రధానమైనది దానిని పాటించుట, పాటించకపోవుట మీదనే వారి యొక్క జీవితములు ఆదారపడివున్నవి.

 దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఒడంబడిక చేసుకొనేముందే ఆయన యొక్క నియమములు, ఆజ్ఞలను తెలియపరిచినసమయములో ఇశ్రాయేలు ప్రజలందరూ ఏక కంఠంతో దేవునికి విధేయులమై  జీవిస్తామని, ఆయన నియమములు పాటిస్తాం అని పలికారు (నిర్గ 24:-7).

  ఒక్క ఒడంబడిక ద్వారానే దేవుడు వారిని దీవిస్తునారు తన యొక్క బిడ్డలుగా వారిని అక్కున చేర్చుకున్నారు వారితో కొత్త జీవితం ప్రారంభించి వారిని వాగ్దత్తభూమికి నడిపించాడు.

మోషే వాగ్దత్త భూమిలో ప్రవేశించక పోయినప్పటికీ ప్రవేశించబోయే ఇశ్రాయేలు ప్రజలు దేవునికి వినయులై జీవించమని తెలిపారువారి యొక్క 40 సవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో అనేక సారులు ఇశ్రాయేలు ప్రజలు యావే దేవున్నీ మరచి అనేక దేవతలను పూజించిఆరాధించిదేవునికి మరియు దేవునియొక్క సేవకులకు వ్యతిరేకముగా మాట్లాడారు వీటన్నింటిని గ్రహించిన ప్రవక్త మరొకసారి వారికీ తెలియజేసే అంశం ఏమిటంటే దేవుని చెంతకు తిరిగివస్తే దేవుడు తప్పక ఆదరిస్తాడు, దీవిస్తాడు.

 దేవుని చెంతకు పూర్ణ హుర్దయంతోఆత్మతో  తిరిగి రావాలి అంటే సంపూర్ణంగా  దేవుని మీద ఆధారపడి జీవించాలి ఆయన తప్ప వేరే వారు ఆదుకొనే వారు లేరని గ్రహించి దేవుని చెంతకు తిరిగి రావాలి.

 ప్రభువు చెంతకు వస్తే మరొకసారి వారిని దీవిస్తానని యావే దేవుడు స్వయంగా పలుకుతున్నారు. (యిర్మీయా 23: 3; 29: 13-14; 32: 37-38).

 దేవుడే స్వయంగా  ఇశ్రాయేలు ప్రజల హృదయంతో, ఆత్మతో తన చెంతకు వచ్చేలా చేస్తారు.

 వాస్తవానికి ఈనాటి మొదటి పఠనం యొక్క మాటలు యెరూషలేము యూదా పట్టణములు నాశనం ఆయినా తరువాత (క్రీస్తు పూర్వం 587) ఇశ్రాయేలు ప్రజలు దేవుని చెంతకు తిరిగి రావటం అనే విషయమును తెలుపుచున్నవి 

 అంతా కోల్పోయిన తరువాత ఇశ్రాయేలు ప్రజలు యావే దేవుని యొక్క ప్రేమను గుర్తించి ఆయనను నమ్మి తిరిగి వచ్చి ఆయనకు విధేయులై ప్రభువుయొక్క శాసనములను పాటిస్తే తప్పక దీవిస్తానని పలుకుచున్నారు ఇక వారి పాపములుఅవిశ్వాసంఅవిధేయత  ఏమియు లెక్కకు రావు కేవలం దేవుని యొక్క ప్రేమక్షమా ఆశీర్వాదమే ఇశ్రాయేలు ప్రజల జీవితంలో ఉంటుందిపూర్వం ఉన్న వైభవము మొత్తము వారికీ కలగజేస్తానని ప్రభువు పలుకుచున్నారు.

 మన జీవితంలో కూడా దేవిని చెంతకు మరలి రావటం నేర్చుకోవాలి మనయొక్క సొంత చిత్తాను సారంగా చాలాసార్లు జీవిస్తుంటాంమన యొక్క ఆనందాల కోసం  లోక వ్యామోహాలకు లోనై దేవునికి దూరమై జీవిస్తాం అలాంటి పాపపు జీవితంకు పశ్చత్తాపపడి దేవుని చెంతకు తిరిగి వస్తే దేవుడు మనల్ని దీవిస్తాడు.

 తప్పిపోయిన  కుమారున్నీ ఆశిర్వదించి, ఆదరించిన విధంగా మనందరినీ కూడా దీవిస్తారు.

 మనం చేయవలిసిన పని ఒక్కటే పచ్చాత్తాపంతో ప్రభువుని ఆశ్రయించుట.

 దేవుడు మోషే ద్వారా ఇజ్రాయేలు ప్రజలతో ధర్మశాస్త్రము గురించి తెలుపుతూ  యొక్క ధర్మశాస్త్రము అనుసరించటం కష్టం కాదు అంటున్నారు ఎందుకంటె దేవుడిని ప్రేమించిఆయనకు విధేయులై జీవించే వారందరికీ  ఏది ఎంత కష్టమైన సరే అది తేలికగానే ఉంటుంది.

  ధర్మశాస్త్రము ఎప్పుడు అందుబాటలోనే ఉంటుంది అది దేవుడు వారి నోటిలోనే వారి చెంతనే, వారి హృదయంలోనే ఉంచారు (యిర్మీయా 31 :౩౩)

 ధర్మశాసనం అంటే దేవుని యొక్క వాక్కుయే మనం దేవుని యొక్క వాక్కు చేత నింపబడినట్లైతే ప్రభువు వాక్కుయే మనల్ని నడిపిస్తుంది.

 దేవుడు మొదటిగా తన యొక్క ఆజ్ఞలు పలక మీద ఇచ్చారు ఎందుకంటె ప్రజలయొక్క హృదయాలు దేవుని వాక్కును స్వీకరించుటకు సిద్ధంగా లేవు కాబట్టివారి హృదయాలు రాతివలె కఠినంగా ఉన్నాయి 

యెహెఙ్కేలు36:26-27

ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు దేవుని వాక్కును స్వీకరిస్తూ పాటిస్తూ జీవిస్తున్నారు  సమయంలో దేవుడు తన వాక్కును వారి హృదయములమీద వ్రాస్తున్నారు.

 హెబ్రీయుల ప్రకారం హృదయం అనేది (ది సీట్  అఫ్ ది విల్ అండ్ ఇంటెలెక్ట్ ) అంటే మన హృదయం కేవలం మనయొక్క భావాలను మాత్రమే కాదు కేంద్రం, మనయొక్క చిత్తముకు అదేవిధంగా మన యొక్క తెలివికి కూడా కేంద్రం.

 ప్రజలయొక్క హృదయాలమీద దేవుని శాసనం ఉంచటం ద్వారా వారు దేవుని చిత్తము నెరవేర్చుతూ  దేవుని జ్ఞానం కలిగి  జీవిస్తూ దేవునికి విదేయులై జీవిస్తారు అన్నదే అంశం. కాబట్టి మనమందరం  కూడా దేవుని యొక్క చిత్తం నెరవేర్చుతూ దేవుని యొక్క వాక్కు ప్రకారం    జీవించాలి.

 దేవుని యొక్క వాక్కు ద్వారా దేవుడు మనకు ఎప్పుడు దెగ్గరగా ఉన్నారు, మన యొక్క  సోదరుల యొక్క ప్రతిరూపంలో ఉన్నారు కాబట్టి మనకు దెగ్గరగా ఉన్న ప్రభువును గ్రహించి ఆయన చిత్తాను  సారంగా జీవించాలి 

 ఈనాటి రెండవ పఠనంలో పౌలుగారు క్రీస్తు ప్రభువు యొక్క గొప్ప తనాన్ని తెలుపుతున్నారు.

  కొంతమంది   అసత్య బోధకులు క్రీస్తు ప్రభువు యొక్క స్వభావము గురించి అసత్య బోధనలు చేసారు దానిని ఖండిస్తూ ప్రభువు యొక్క  ఉనికిని  తెలుపుచున్నారు.

 అసత్య బోధకులు చేసిన బోధన ఏమిటంటే క్రీస్తు ప్రభువు కేవలం మానవుడే కానీ ఆయన మరణ, పునురుత్తానం తరువాత దేవుడుక్రీస్తు ప్రభువు అయ్యారు అని బోధించారు దానికి వ్యతిరేకంగా పౌలుగారు ఆయన మొదటినుండి దేవుడే అని తెలిపారు అందుకే ఆయన దేవుని యొక్క ప్రతిరూపం అని పలికారు సృష్టికి పూర్వమే ఆయన ఉన్నారు అని బోధించారు సమస్తము ఆయన కొరకే సృష్టించబడినవి, ఆయన చేతనే మనం రక్షించబడ్డాం అని తెలిపారు.

 క్రీస్తు ప్రభువు సమస్త సృష్టిలో తొలుత జన్మించిన పుత్రుడు దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభువు నిజమైన దేవుడు ఆయన తండ్రి చెంతనే ఉన్నారు అనే సత్యం వెల్లడించారు.

 క్రీస్తు ప్రభువు మరణం జయించి పునరుత్తానం ఆయన మొదటి వ్యక్తి ఒక్క మాటలో చెప్పాలంటే పరిపూర్ణ దైవత్వం, పరిపూర్ణ మానవత్వం కలిగిన దేవుడు.

 పౌలుగారు క్రీస్తు ప్రభువుయొక్క తత్వ గీతం ద్వారా క్రీస్తు ప్రభువు సృష్టికి మునుపు నుండీ దేవుడే అని తెలిపారు ఆయన రక్షకుడు అని తెలిపారు.

 క్రీస్తు ప్రభువు యొక్క గొప్పతనం గ్రహించిన పౌలుగారు ఆయన యొక్క రక్షణ గురించి తెలిపారు. సమస్తము కూడా కుమారునికి అప్పజెప్పబడిందిసిలువ బలి ద్వారా మనలను రక్షించారు అని తెలిపారుఆయన మానవుడు మాత్రమే కాదు సృష్టికి మునుపే రెండవ వ్యక్తి అని తెలిపారు క్రీస్తు ప్రభువు దేవుడు అని కొలిసి ప్రజలకు తెలిపారు.

ఈనాటి సువిశేషములో నిత్యాజీవం పొందుటకు ప్రతిఒక్కరు ఏమి చేయాలి అనే అంశం గురించి    తెలిపారు.

 శాశ్వత జీవితం పొందటానికి క్రీస్తు ప్రభువు  మనకు ఒక మంచి మార్గమును, ప్రేమ మార్గమును చూపిస్తున్నారు అంటే దైవప్రేమసోదర ప్రేమ ఆజ్ఞలు పాటిస్తే జీవిస్తే మనమందరం దేవుడు ప్రసాదించే నిత్య జీవితమును పొందుతాం.

 దైవ ప్రేమ సోదర ప్రేమ ఎప్పుడు కలిసియే ఉంటాయి రెండింటిలో  ఒక్కటి పాటించకపోయిన అది  పూర్ణ క్రైస్తవ జీవితం కాదు.

 ఈనాటి సువిశేష పఠనం ద్వారా  దేవుడు ధర్మశాస్త్ర బోధకునికి ఒక క్రొత్త విషయం తెలుపుచున్నారు. యూదుల యొక్క ఆలోచన ప్రకారం పొరుగువారంటే కేవలం ప్రక్కన ఉండే తోటి యూదుడు మాత్రమే   కాదు అవసరంలో ఉన్న  వ్యక్తి ఆయన సరే పరుగువారే అని ప్రభువు చెప్పారు.

 ధర్మశాస్త్ర బోధకుడు యేసు ప్రభువును నిత్యజీవము ఎలా పొందాలని ప్రశ్నించాడుమొదటిగా ప్రణువును ప్రతిఒక్కరు 

 పూర్ణ హృదయంతో 

 పూర్ణ ఆత్మతో 

 పూర్ణ శక్తితో 

 పూర్ణ మనస్సులో దేవుడిని ప్రేమించాలి 

 దేవుని ప్రేమించిన తరువాత  ప్రేమ కార్యరూపంలో మన పొరుగు వారికీ చూపించాలి.

 ప్రతిఒక్కరి జీవితంలో అందరు కూడా సులువుగా మొదటి ఆజ్ఞ  మాటను పాటిస్తారు దేవుడిని   ప్రేమించుట అందరికి తేలికయే కనపడని దేవుడ్ని ప్రేమించే మనం కనిపించే సోదరి సోదరులను    ప్రేమించలేం.

 దైవ ప్రేమసోదర ప్రేమను అనుసరించుటలో దేనిలో విఫలమైన సరే మనం నిండు క్రైస్తవ జీవితాన్ని జీవించనట్లే. సిలువకు రెండు కమ్ములు అనగా అడ్డ కమ్మనిలువు కమ్మ అనుసంధానం చేయబడిన విధంగా మన   క్రైస్తవ జీవితం కూడా  రెండింటివలె ముడిపడి ఉన్నాయి.

 దైవమును అందరు ప్రేమిస్తారు కాబట్టి  రోజు మనమందరం ముఖ్యముగా మన యొక్క పొరుగువారు  ఎవరు వారిని ఏవిధంగా ప్రేమించాలో ధ్యానించుదాం.

 ధర్మశాస్త్ర బోధకునికి ప్రభువు మంచి సమరియుడే అని తెలిపారుఎందుకు ప్రభువు  విధంగా చెప్పారంటే యూదుల యొక్క ప్రేమ నియమ నిబంధనలకంటే తోటి యూదులకే కాకుండా వారి ప్రేమ అన్నింటి కన్నా ఎక్కువగా ఉండాలని తెలిపారు.

 చరిత్రను తెలుసుకుంటే  రోజులలో యూదులకుసమరియులకు ఎటువంటి స్నేహ బంధం ఉండేదికాదు.  

 యూదులకు సమరియులంటే ద్వేషం ఎందుకంటె వారు కల్తీ జాతివారనియావే దేవుని కాక అన్య దైవాలను ఆరాదించి మతాన్ని కల్తీ చేసారని వారి అభిప్రాయం అందుకే ఎప్పుడు వారి మధ్య గొడవలు, యుద్దాలు జరుగుతుండేవి.

  రోజు సువిశేషములో చెప్పబడిన గాయపడిన వ్యక్తి యుధుడే ఆయితే ఇక్కడ మంచి సమారీయుడు గాయపడిన యుధుడిని చూసి అక్కడే వదిలి వేయలేదు.

  మార్గంగుండా వెళ్లిన తోటి యూదుడైన యాజకుడులేవీయుడు తన తోటి వాడిని అక్కడే వదిలి వేసి వెళ్లారు మంచి సమరియుడు మాత్రము జాతుల మధ్య ఎన్ని గొడవలు ఉన్న వాటిని వ్యక్తిగతంగా తీసుకోకుండా అవసరంలో ఉన్న తోటి యుధుడిని కాపాడారు.

 తన మిత్రులకు మాత్రమే కాకుండా శత్రువులను సహితము సమరియుడు ప్రేమించాడు.

  సమరియునిలో కొన్ని ప్రధానకరమైన అంశాలు చుస్తునాం 

 అవసరతలో ఉన్న వ్యక్తిని చూసి జాలిపడుతున్నాడు. 

 ఆపదలో ఉన్న వారికీ దెగ్గర ఉండటం.

 సహాయం చేయుటకు ముందుకురావడం.

మంచి సమరియుడు జాలి పడటం మాత్రమేకాక ఆయన దేగ్గరకు వెళ్లి తనను పరామర్శించి, సత్రానికి తీసుకొని వెళ్లి తగిన ఏర్పాట్లు చేసాడు. ఆయన ప్రేమ క్రియ పూర్వకమైన ప్రేమ.

 మంచి సమరియుడు గాయపడిన యూదుడు పట్ల దయ గుణాన్ని చూపుతున్నారుఅందుకే ఏమి ఆలోచించకుండా వెళ్లి సహాయం చేస్తున్నాడు.

 మంచి సమరియుడు గాయపడిన వ్యక్తి కోసం యెంత ఇబ్బందులు పడటానికైనా సిద్ధముగా ఉన్నాడు. ప్రత్యేకముగా తానే శ్రద్ద  తీసుకొని ఆసుపత్రికి తీసుకొని వచ్చి ఎంత డబ్బైనా ఖర్చు చేయుటకు సిద్ధంగా ఉన్నాడు.

మంచి సమరియుడు మానవత్వం కలిగిన వ్యక్తి ఆయన గాయపడిన వ్యక్తిని తోటి సోదరునిగానే చూసాడు కానీ శత్రువుగా,  యూదుడిగా చూడలేదు అందుకే గాయపడిన వ్యక్తిని ఆదుకోవాలని సిద్ధంగా ఉండి ముందుకు వెళ్ళాడు.  తన యొక్క గాయముకు కట్టు కట్టారు, గాయాలకు తైలము, ద్రాక్షారసము పోసి కట్టు కట్టారు.

మంచి సమరియుడు తన యొక్క శక్తిని హేచించాడుతన యొక్క సమయమును, ధనమును  హెచ్చించాడు. డు తన యొక్క పనిని సైతం ప్రక్కన పెట్టి గాయపడిన వ్యక్తిని కావలిసిన మొత్తం సమకూర్చాడు.

 మంచి సమరియుడు పరిపూర్ణ ప్రేమను చూపించాడు సత్రంలోనికి తీసుకోని వెళ్లి జాగ్రత్తగా చూసుకున్న తరువాత మధ్యలోనే ఆయన్ను విడిచిపెట్టలేదు చివరివరకు ఆయనకు అయ్యే ఖర్చు అంతా ముందే   కట్టి వెళ్ళాడు అది గొప్ప ప్రేమ.   

 అక్కడ యాజకుడు, లేవీయుడు కేవలం వారి యొక్క విధులకు మాత్రమే ప్రాధాన్యత నిచ్చారు. వీరికి వారి మత చట్టాలే ముఖ్యంఒక వేళ  మనిషి చనిపోయిఉంటే అతన్ని తాకితే మనం ఏడు రోజులపాటు మైల పడిపోతాం అని మరియు ఆలయ సేవల నిర్వహించేందుకు అర్హత కోల్పోతాం అని అనుకున్నారు (సంఖ్య 19: 11)

 మంచి సమరియునికి మత ఆచారాలుచట్టములునియమములు ఏమి  గుర్తుకు రాలేదు  క్షణంలో  కేవలం సోదర ప్రేమయే గుర్తుకు వచ్చింది. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలనే తలపు వచ్చింది.

 మంచి సమరియునిలో నిస్వార్థ ప్రేమను చుస్తున్నాం కోన ప్రాణంతో పడిఉన్న వ్యక్తికి సహాయం చేసేటప్పుడు అక్కడ ఎవ్వరు లేరు ఎవరి పొగడ్తలకై ఆయన మంచి చేయలేదు ఆయన చేసిన మంచి పని కేవలం దేవునికి మాత్రమే తెలుసు  దైవ ప్రేమ కోసమే అవసరంలో ఉన్న వ్యక్తికి  సహాయం చేసేలా సహాయపడింది (మత్తయి 25:35-40) (ఆపో 20:35).

 మన అందరి ప్రేమ కూడా మంచి సమరియుని వలె ఉండాలి మనం మన  యొక్క బంధువులను, మిత్రులనుఇష్టమైన వారిని మాత్రమే కాకుండా జాతిమతకుల విచక్షణ లేకుండా అందరిని    ప్రేమించాలి.

 క్రీస్తు ప్రభువు అందరిని ప్రేమించి, ఆదరించి సహాయం చేసిన విధంగా మనం కూడా చేయాలి. మనయొక్క ప్రేమ మిగతా వారి కన్నా బిన్నంగా ఉండాలి. (మత్తయి 5: 46-48).

 అందరు మన పొరుగువారే కాబట్టి అవసరంలో ఉన్న వారిని ఆడుకుంటూ మనం జీవించాలిమనం చూపించే ప్రేమ పొరుగువారికి సహకరించేలా ఉండాలి ప్రేమ దేవుని కొరకే గాని సొంత లాభం కోసం   కాకూడదు.

 దేవుని యొక్క నిత్యజీవితం పొందాలంటే ప్రభువు ఏంచేయాలి అని చెప్పాడు   ధర్మశాస్త్ర బోధకుడు తన పొరుగు వారు ఎవరని తెలుసుకున్నాడుమనం కూడా దేవుని విషయాలు తెలుసుకొని దాని ప్రకారంగా జీవిస్తే తప్పని సరిగా నిత్యజీవితం పొందుతాం.

 దేవున్నీ ప్రేమిస్తూ మన పొరుగువారిని కూడా ప్రేమించి జీవిస్తే మన జీవితాలు ఎప్పుడు సంతోషంగానే ఉంటాయి.

 ధర్మశాస్త్ర బోధకుడు ఉద్దేశం నిత్య జీవం పొందుట అందుకే ప్రభువు అడిగి తెలుసుకున్నాడు అలాగే మన యొక్క క్రైస్తవ ఉద్దేశం దేవుని రాజ్యంలో ప్రవేశించి ఆయనలో ఐక్యమై జీవించుట కాబట్టి మనం కూడా తెలుసుకొని ఆచరించి పరలోక రాజ్యం పొందుదాందేవుని యొక్క ఆజ్ఞలను పాటించుదాం.

                                                                                                         ఫాదర్. బాల యేసు. ఓసిడి   

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...