22, ఫిబ్రవరి 2023, బుధవారం

 

తపస్సు కాలం-వసంత కాలం

 

కాలము సంపూర్ణమైనది. మార్కు 1:15

రేయి ముగియవచ్చినది. పగలు సమీపించినది. రోమా 13:12.

 

ప్రియ స్నేహితులారా, సంవత్సరం ఫిబ్రవరి 22, విభూది బుధవారం తో మనము తపస్సు కాలంలోకి ప్రవేశిస్తున్నాము. క్రైస్తవ విశ్వాసం లో తపస్సు కాలం ముఖ్యమైన మరియు మహిమాన్వితమైన ఆధ్యాత్మిక కాలం. విభూది బుధవారం తో ప్రారంభమై పునరుత్తానం తో ముగుస్తుంది.

l  మోషే ప్రవక్త నలభై రోజులు దేవుని సన్నిధిలో సీనాయి పర్వతంపై గడిపి దేవుని ఆజ్ఞలు స్వీకరించాడు.

l  ఏలీయా ప్రవక్త నలభై రోజులు ఆధ్యాత్మిక ప్రయాణం చేసి దేవుని పర్వతమైన హోరేబుకు చేసుకుని, దేవుని కనుకొన్నాడు.

l  యేసు ప్రభు నలభై రోజులు  ఎడారిలో ప్రార్ధన ఉపవాసం చేసి దైవ రాజ్య స్థాపనకై, సువార్త పరిచర్యకై సంసిద్దులైయ్యారు.

l  మనకు కూడా   నలభై రోజులు    మనల్ని మనం సంసిద్దులుగా చేసుకుటకు ఉన్న గొప్ప అవకాశం.

విధంగా అంటే?  మననం -  మరణం -  జననం

u  మన యొక్క జీవతలను క్షుణ్ణం మననం చేసుకొనుట ద్వారా

u  మన యొక్క పాపాలకు  మరియు తప్పిదాలకు మరణించుట ద్వారా

u  మన యొక్క అంకితపు జీవితానికి మరల జన్మించుట ద్వారా

కానీ  యెప్పటివలెనే, యథాప్రకారముగ మనం  ఏమి చేయలి, ఏమి చేయకుడదు, ఏమి వినాలి, ఏమి వినకూడదు, ఏమి చూడలి, ఏమి చూడకూడదు, ఏమి విడిచిపెట్టాలి అనే ఆలోచన ధోరణిలో ఉంటాము. వీటితో పాటు కొన్ని ఆధ్యాత్మిక  కార్యక్రమలలో పాల్గొనడం మాములే. చాలా నిష్ఠతో చేయలాని తాపత్రయపడతాం. అంతా మంచిది. కానీ ఒకసారి తపస్సు కాలం పూర్తయు ఉత్తాన పండుగ రాగానే మరల పాత  ఉత్సాహంతో మనయొక్క పాత జీవితాన్ని పున:ప్రారంభించడం కూడా  మాములే. మనలో చాలా మంది కోవకు సంబందించిన వారమే. చివరికి ఏదో తెలియని లోటు, వెలితి. ఏందుకంటె  తపస్సుకాలం పట్ల మన వ్యవహార తీరు ఎలాంటిది అంటే ఒక వార్షిక  నియమము, భాద్యత లేక స్వీయ క్రమశిక్షణ గా బావిస్తాం. ఒక్క ప్రాయశ్చిత కాలంగా మాత్రమే అని గ్రహిస్తాం.

మననం - తపస్సుకాలం అంటే మనల్ని మనం పరీశీలించుకునె, అవగాహన చేసుకునె సమయం, ఆద్యాత్మికంగా పరిస్థితిలో ఉన్నామో  తెలుసుకునె సమయం.  మన జీవితం ఎటు సాగుతుందో అన్న అవగాహన మంచిది. ఆధ్యాత్మిక ప్రయాణంలో మన జీవితాలు మరియు దేవునితో గల సంబంధం  మరియు తోటి విశ్వాసులతో మరియు తోటి సహోదలి సహోదరులతో గల ఐక్యత పరీశీలించుకునె సమయం.

మరణం - మన పాపపు మార్గాల నుంచి దూరమై, మన దృష్టిని దేవునిపై కేంద్రీకరించడం ద్వారా మరియు దేవుని ప్రేమకు సాక్షులుగా జీవించుట ద్వారా నిజమైన పశ్చాత్తాపము మరియు పాపానికి మరణినిస్తాము. మననుంచి ఆశించేది ఇదే.

జననం  - మన ఆలోచన విధానము, మాట తీరు, పనిచేసే తీరు మార్చుకొని అంకితమైన విశ్వాస  జీవితానికి మరల జన్మించడమే తపస్సుకాలం

అందుకే తపస్సుకాలం ఓ వసంతకాలం

v  ఆద్యాత్మిక వసంతకాలం

v  కృపావరముల కాలం

v  ఆనందోత్సవ కాలం

v  ఓ నూతన అద్యయానికి నాంది పలికే కాలం.

వసంతకాలం- అందరికి ఇష్టమైనది

v            ప్రకృతి చిగురించే, మనస్సు పులకించే, అందమైన, ఆహ్లదకరమైన కాలం.

v                పచ్చదనం పరవళ్లు తోక్కుతు, పూల వర్ణాలు ప్రకాశించే కాలం ఈ వసంతకాలం. ప్రతిఒక్కరు పూర్తిగా ఆశ్వాదించడానికి ప్రయత్నిస్తారు.

తపస్సుకాలం కూడ అలాంటిది.

మన ఆద్యాత్మిక జీవితంలో ఒక నూతన ఉత్తేజాన్ని నింపుతుంది. ఏందుకంటే ఈ సమయం దేవునితో నింపబడి, క్రీస్తులో ఎదిగి, ఆత్మతో అబిషేకించబడె కాలం.   వాడిపోయు వేసారిపోయు ఉన్న జీవితానికి   నూతన చిగురుతో నూతన జీవితంలోకి   జన్మించడమే         ఆద్యాత్మిక వసంతకాలం.

తపస్సు కాల మూడు మూల స్తంబాలు

మనలను ఆధ్యాతిమా జీవితంలో మరియు తపస్సు కాలం  ప్రయాణంలో   నడిపించే వాహనాలు

1.        ప్రార్ధన

2.        ఉపవాసం

3.        దాన ధర్మాలు

 

 

ప్రార్థన: ప్రార్థన రోజు చేస్తుంటాము. మనము దేవునితో మాట్లాడుట, దేవుడు మనతో మాట్లాడుట. కాని మనం ఈ కాలంలో చేయవలసినదేమిటంటే,  వాటి బావాన్ని, అంతరర్ధాన్ని గ్రహించాలి. కొంచెం సమయమైన చిత్తసుద్ధితో గడపాలి. దేవునితో అన్యోన్య సంబంధము ఏర్పాటు చేసుకొనుటయే ప్రార్ధన

 

ఉపవాసం:  మనకు నచ్చినవి, నచ్చనివి; ఇష్టమైనవి, ఇష్టంకానివి విడిచిపెట్టడం మాత్రమే కాదు. దిగులుతో కాదు, దీనత్వంతో, ఆనందంతో ఒక ఉన్నత ఉద్దేశంతో సంయమనం పాటించాలి. ఉప అంటే దగ్గర మరియు వాసం అంటే నివాసం లేక ఉండటం అని అర్ధం: కావున ఉపవాసం అంటే దేవుని దగ్గర ఉండటం అని అర్ధం. విడిచి పెడుతున్నాము అని దిగులుతో కాకుండా దేవునికి దగ్గర అవుతున్నామని సంతోషం తో చేయాలి

 

దానము:  మనకు తెలుసు చాలరకాలైన దానలున్నాయని. కావున దానం అంటే దనం మాత్రమే కాకుండ, మన పూర్తి సహకారం చేయకలిగినంత అందించాలి. ఆకలి తీర్చడం మాత్రమే కాదు ఆశ్రయం చూపుట మన మాట ద్వారా, సమయము మరియు సహకారం ద్వారా కూడా.

 

అదేవిధంగా ప్రార్థన, ఉపవాసం, దానము ఒకదానితో ఒకటి సంబందం కలిగి ఉన్నాయు. ప్రార్థనలో దేవున్ని స్తుతించి, ఉపవాసంతో వాటి భావం గ్రహించి, దానం అనె క్రియ ద్వారా సంపూర్ణమవుతాయు.

మనం తపస్సు కాలాన్ని బూడిదతో మొదలుపెట్టి అగ్నితో ముగిస్తాము, ఉత్తాన జ్వాలతో, పరిశుద్ధాత్మ జ్వాలతో నింపబడతాము. క్రీస్తు తన రక్తంతో మన బూడిదవంటి జీవితాన్ని తడిపి నూతన జీవం ఒసగేకాలం. కావున

u  మనం ఏమి చేయాలి, చేయకూడదు అని కాకుండ

u  మన జీవితం ఎలా ఉండాలి  అని  ఈ తపస్సు కాలాన్ని సంపూర్ణంగా ఉపయొగించుదాం.

 FR. JAYARAJU MANTHENA OCD

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...