"నా దేవా! నా దేవా! నన్ను ఎందుకు/ఏల విడనాడితివి?" మత్తయి 27:46 & మార్కు 15:34
ఈ నాల్గవ పదంలో, ఇంతటి దిగ్భ్రాంతికరమైన , అత్యంత వేదనతో కూడానా మాటలు యేసు నోటి నుండి రావడం ఎవరు ఊహించారు, ఆశ్చర్యమేస్తుంది మనకు. ఎందుకంటే దేవుని కుమారుడైన యేసును దేవుడు ఎలా విడిచిపెట్టగలరు, పైగా దేవుణ్ణి దేవుడే ఎలా విడిచిపెట్టగలడు మరియు వెలుగు తన వెలుగుని విడిచిపెట్టగలదా ?లేదు కదా.
ప్రధాన /సాధారణ పరిశీలన/అంశాలు:
ఈ పదం యొక్క లోతుగా అర్థం చేసుకోవడానికి, మొదట మనం దానికి సంబంధించి సాధారణ అర్థాన్ని తెలుసుకోవాలి, మొదటి గమనించినట్లయితే, ఇది ఒక వ్యక్తి యొక్క వేదనతో కూడిన ఏడుపును వివరిస్తుంది, అతను విడిచిపెట్టబడ్డాడని మరియు సహాయం కోసం చేసిన ప్రార్థన లేదా ఏడుపు ఎవరు వినలేదు అని మరియు విస్మరించబడి, తిరస్కరించబడి మరియు ఎవ్వరు లేక ఒంటరి వాడై పోయాననే బాధ స్పష్టం గ కనపడుతుంది.
ఒక ముఖ్యమైన ప్రశ్న "ఎందుకు"
ఎందుకు అని ప్రశ్న వేస్తె, దాని సమాధానం కనుకోవడానికి అవకాశం ఏర్పాటుతుంది.
ఒకసారి గమనించినట్లయితే, మన మానవ చరిత్రలో, "ఎందుకు" అనేది నిరంతరం వేధించే ప్రశ్న, మనం ప్రతికూల లేదా చెడు అనుభవాన్ని ఎదుర్కొన్నప్పుడు, మనం ఎందుకు ఇలా జరిగింది అనే ప్రశ్న అడుగుతాము, ఎందుకు నాకే? ఎందుకు ఈ చెడు ? ఎందుకు ఈ బాధ? ఎందుకు ఈ మరణం? మంచి వ్యక్తులకు ఎందుకు చెడు జరుగుతుంది? దేవుడు ఎందుకు దూరంగా ఉన్నట్లు కనిపిస్తున్నాడు? అనేవి మనలో నిత్యం ఉండే ప్రశ్నలు.
ఇప్పుడు మానవ రూపంలో ఉన్న యేసుకు కూడా అదే ప్రశ్న "ఎందుకు" అని ధీనతతో తండ్రి ఎడబాటు భరించలేక విలపిస్తున్నారు, ఆర్చ్‌బిషప్ ఫుల్టన్ షీన్ గారు ఈ విధంగా అంటారు, ఈ ఒక్క సందర్భం లో క్రీస్తు, ఒక్కసారిగా రెప్పపాటులో దేవుడు కూడా నాస్తికుడిలా అనిపించే విధంగా అంతటి గోరమైన వేదన అనుభవించారు.
సమస్య మరియు సమాధానం : త్రిత్వైకం లో ఐక్యత
యేసు సంపూర్ణ మానవ రూపంలో ఉన్నపటికీ, తండ్రి దేవుడు రూపొందించిన దైవిక రక్షణ ప్రణాళిక నెరవేర్చడానికి స్వతహాగా మరియు జాగ్రత్తగా అమలు చేసారు క్రీస్తు ప్రభువు మానవ రూపం ద్వారా. అయినప్పటికీ విశ్వం సృష్టించబడక ముందే క్రీస్తు త్రిత్వైక సర్వేశ్వరుని ఐక్యతలో బాగస్తుడే.
యేసు తన పరిచర్యలో, సందేశాలలో ఈ విషయాన్నీ, ఈ ఐక్యతను నిరంతరం ధృవీకరించాడు, ఉదాహరణకు: “నేను, నా తండ్రి ఏకమైనున్నాము” (యోహాను 10:30), "ఆదిలో వాక్కు ఉండెను. ఆ వాక్కు దేవునితో ఉండెను ఆ వాక్కు దేవుడై ఉండెను."(యోహాను 1:1). నేను తండ్రి యొద్దనుండి బయలుదేరి లోకములోనికి వచ్చితిని. మరల నేను లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్లుచున్నాను అనెను. (యోహాను 16:28) “అయినను నేను వెళ్ళుట మీకు శ్రేయస్కరమని మీతో నిజముగా చెప్పుచున్నాను. నేను వెళ్ళనిచో ఓదార్చువాడు మీ యొద్దకు రాదు. నేను వెళ్ళినచో ఆయనను మీ యొద్దకు పంపెదను" (యోహాను 16:7). దేవుడు లోకమును ఎంతో ప్రేమించి, తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతివాడు నాశనము చెందక నిత్యజీవము పొందుటకై అట్లు చేసెను. (యోహాను 3:16)
ఒక మాటలో చెప్పాలంటే, యోహాను సువార్త అంత త్రిత్వైక సర్వేశరుని ఐక్యతకు సంబంధించి ఉన్న ఉదాహరణలతో నిండి ఉంది.
కాబట్టి ఈ ప్రశ్న తలెత్తుతుంది మరియు అర్థం చేసుకోవడంలో ఇబ్బంది వస్తుంది, యేసు సిలువపై వేలాడుతున్నప్పుడు, శారీరక మరియు మానసిక వేదనతో పూర్తిగా బాధపడ్డాడు, "నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు విడిచిపెట్టావు?" అని పెద్ద స్వరంతో తన హృదయ వేదన అంత వ్యక్తపరిచారు,
కాని దేవుడై ఉండి ఈ బాధలు, మరియు నిస్పృహలను అధిగమించి పైకి రావాలి కదా, క్రుంగిపోకుండా, బలహీనమవ్వకుండా శక్తితో అధిగమించాలి కదా అనే ప్రశ్నలు తలెత్తుతాయి మనకు. ఈ నిస్సహాయత, పరిత్యాగం మరియు నిరాశ యొక్క క్షణంలో ఏల రోదించగలడు అనే ప్రశ్న వస్తుంది. ప్రేమకు అవధులు లేని తండ్రి తన ఏకైక కుమారునికి అత్యంత అవసరమైన సమయంలో ఎలా విడిచిపెట్టగలడు? ఇలా ప్రశ్నలు మనకు వస్తాయి
సమాధానము: "విడనాడటం " యొక్క అర్థం మరియు ప్రాముఖ్యత
విడనాడటం అంటే, ప్రత్యేకంగా అవసరమైన సమయంలో ఎవరైనా లేదా దేనినైనా విడిచిపెట్టడం లేదా వదిలివేయడం. మన జీవితంలో ఏదైనా అవసరం లేదా కష్టం వచ్చినపుడు మన సన్నిహితులు, స్నేహితులు మనలను విడిచిపెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఆ అనుభవం ఎంత బాధను మిగిల్చిందో మనకు తెలిసిందే అదేవిధంగా మనకు అవసరమైనప్పుడు మరియు మనల్ని దేవుని నుండి దూరం చేసే పాపంలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని విడిచిపెడుతున్నాడని (అతను చేయనప్పటికీ) మనకు అనిపిస్తుంది. .
అలాగే యేసు ప్రభువు పరిస్థితిలో కూడా, తండ్రి అయిన దేవుడు తన కుమారుని బాధలో విడిచిపెట్టడం, ఏకాకిని చేశాడా అని అనిపిస్తుంది. కానీ తన కుమారుడిని విడిచిపెట్టలేదు, కానీ క్రీస్తు యొక్క మానవ స్వభావం లో మాత్రమే దైవిక పరిత్యాగ భావనను , ఎడబాటును అనుభవించడానికి అనుమతించాడు ఎందుకంటే యేసు మన పాపాల బరువును మోస్తూ, మన తరపున సిలువను మోస్తూ మరియు మన పాపాలకు వేతనాన్నిచెల్లించాడు మరియు ఆ విధంగా తండ్రి అయిన దేవుని నుండి పరిత్యజించిన భావనను అనుభవించారు, వాస్తవానికి మనం అనుభవించాల్సిన ఆ ఎడబాటు, శిక్ష, జరిమానా మనకు బదులుగా ప్రభువు అనుభవించారు. తద్వారా మనం దేవుని ముందు నీతిమంతులం అవగలం అని. పునీత పౌలు ఈ విధంగా అన్నారు. "క్రీస్తు పాపా రహితుడు. కానీ, దేవుడు మన నిమిత్తమై ఆయనను పాపముగా చేసెను. ఏలన, ఆయనతో ఏకమగుట వలన మనము దేవుని నీతిగా రోపొందవలెనని అట్లు చేసెను. (2 కొరింథీయులు 5:21). ఆ సమయంలో ఆ భారం ఎంత వేదనతో ఉందొ వర్ణించలేము.
క్రీస్తు నిజంగా సిలువ యొక్క బాధను మరియు వేదనను అనుభవించాడు అనడంలో అతిశయోక్తి లేదు, ఇంకా ఎటువంటి సందేహం లేదు, అయితే ఈ విధంగా చేయడం ద్వారా ముఖ్యంగా 22వ కీర్తన మరియు యెషయా 53 వివరించిన ప్రకారం ఎవరైతే తమ పాపాలలోఎం కన్నీటి లోయలలో, చీకటి బ్రతుకులతో ఉంటారో వారికిసం యేసు ఇంకా సర్వ మానవాళి కోసం వేడుకోవడం కోసం జరిగింది, ప్రభువు ఎడబాటు అనుభవించారు.
విలువైన వాక్యము: దేవుడు ఎప్పటికీ విడనాడడు
దేవుడు మనల్ని విడిచిపెట్టినట్లు అనిపిస్తే ఎప్పుడైనా, అది యేసు ప్రభువు కూడా అనుభవించారు అని గుర్తు పెట్టుకోవాలి. ఆ సిలువ వేదనలో ఆ ఎడబాటును అనుభవించారు. కానీ మనము గమనించవలసిన అంశము ఏమిటంటే దేవుడు ఎప్పటికీ మరచిపోడు లేదా విడిచిపెట్టడు అని వాక్యమే తెలియచేస్తుంది, యెషయా ప్రవక్త పుస్తకంలోని 49వ అధ్యాయంలో, “నేను నిన్ను మరచిపోను మరియు నేను అనాథలను వదిలివేయను….అందుకే దేవుడు ఎప్పటికీ అతనికి మొఱ్ఱపెట్టేవారి నుండి ఉపసంహరించుకోడు" కానీ అతను సమాధానం ఇస్తాడు. అందువల్ల, ఇది తండ్రిపై విశ్వాసంతో నిండిన మొర, ఆశ మరియు అతనిపై నమ్మకంతో కూడిన నివేదన, దేవుని వైపు నడిపించేలా ఉన్న ప్రార్థన అని మనం అర్థం చేసుకోవచ్చు. యేసు ప్రభువు ని సమాధి నుండి జీవముతో లేపారు, ఆలకించే, సమాధానమిచ్చే ప్రభువు మన దేవుడు.
సిలువ పాదాల వద్ద, సైనికులు మరియు అన్యమత శతాధిపతి ఈ మొరను విన్నప్పుడు, వారు మొదట తీరనిమొరగ భావించినప్పటికీ, వెంటనే గ్రహించి, ఇది నిరాశతో కూడిన నివేదన కాదని గ్రహించారు, కానీ నిజంగా అతను దేవుని కుమారుడని తెలుసుకొన్నారు, వారి మార్పు మరియు పరివర్తన ఆ మొరనుంచే , క్రీస్తు సిలువ వేదనలనుంచే ప్రారంభమైంది.
కాబట్టి, ఈ రోజు మనజీవితానికి అన్వయించుకొని అడగవలసిన అసలు ప్రశ్న ఏమిటంటే, ఎవరు ఎవరిని విడిచిపెడుతున్నారు?
విడిచిపెట్టేది దేవుడు కాదు, మన స్వార్థ ప్రయోజనాల కోసం మరియు మన అనవసరమైన జీవనశైలి కోసం మనం భగవంతుడిని విడిచిపెడుతున్నాము, దూరం చేస్తున్నాము మరియు వదులుకుంటున్నాము, అందుకే మన జీవితాలు వినాశనానికి దారి తీస్తున్నాయి.
కాబట్టి ఈ పదం ద్వారా మన వలన క్రీస్తు పొందిన వేదన ధ్యానించుకొని, మరల అటువంటి వేదనకు, ఎడబాటుకు గురిచేయనని ప్రార్ధించుకుందాం, ప్రభుని వేడుకొందాం.
The Fourth Word
“My God, My God, why have you forsaken me?” Matthew 27:46 & Mark 15:34
It is surprising to see that in the Fourth word, Jesus utters the most shocking words which no one would have imagined from his mouth because being a Son of God, how could Jesus be forsaken moreover how can God forsake God and Can light forsake the light? The Answer is No.
General observations:
In order to understand the deeper meaning of it, first we need to establish some general connotation to it. Upon first observation it illustrates the anguished cry of a person, who feels is being forsaken and whose prayer or cry for help is not heard and whose situation is being ignored, rejected and left alone to die with no one to lean on.
The important question of “Why”
Therefore, In our human history, we have a constant haunting question of “why”, when we go through a negative or bad experience, we ask the question why, as in Why me? Why evil? Why suffering? Why death? Why do bad things happen to good people? Why does God seem so distant from everything happening?
Now even Jesus identifying with the man seems to have the same question “why” The Archbishop Fulton Sheen made the intriguing observation that in this one line of Christ, for a twinkling of an eye, even God sounded like an atheist.
The Difficulty: the Unity in Trinity
Jesus Is, although fully human who carefully and wilfully implemented God, the Father’s beautifully orchestrated divine plan of salvation, is also fully Divine in Union with the Trinity even before the creation of the universe.
Jesus indeed has constantly confirmed this Unity in his life on earth, for example: “the Father and I are One” (Jn 10:30), “In the beginning was the Word, and the Word was with God, and the Word was God.” In the beginning was the Word, and the Word was with God, and the Word was God.(John 1:1). I came forth from the Father and have come into the world; I am leaving the world again and going to the Father.” (John 16:28) “Nevertheless I tell you the truth; It is expedient for you that I go away: for if I go not away, the Comforter will not come unto you; but if I depart, I will send him unto you” (John 16:7). For God so loved the world that he gave his one and only Son, that whoever believes in him shall not perish but have eternal life. (John 3:16)
In simple words, the Gospel of John is full of examples of Jesus' unity with the Trinity.
Therefore the question arises and difficulty in understanding, Jesus while hanging on the Cross, utterly tormented by physical and mental suffering and pain cries out in a loud voice, "My God My God, why have you forsaken me?", but shouldn’t be strong to rise above the pain and despair?, how could he cry out what seems to be a moment of hopelessness, abandonment and despair.? How can a Father, whose love has no bounds forsake His only Son at the time of his greatest need?
The Fact: The Meaning and significance of “Forsaken”
Forsaken means, being abandoning or leaving someone or something especially in the time of need. As we feel abandoned by our close family and friends in the time of need we know the experience of it and also when we need and are in sin which distances us from God but we feel that God is abandoning us (even though he does not).
So also in Jesus' situation, God the Father did not abandon his Son in his Son’s suffering but allowed him in his humanity to experience the sense of divine abandonment because Jesus carried the weight of our sins, carried the cross on behalf of us and paid the penalty for our sins and thus felt a sense of abandonment from God the Father which in fact we rightfully deserve so that we become righteous before God that’s St. Paul tells us For our sake he made him to be sin who knew no sin, so that in him we might become the righteousness of God. (2 Corinthians 5:21). This must have been exceedingly heavy at that point.
hence, there is no doubt, he really felt the pain and anguish of the cross but He does this is to fulfil the scriptures especially Psalm 22 and Isaiah 53 where it is described about the suffering servant now personified in Jesus and to beseech for the humanity, who feels abandoned by God in their sins, in the darkness of the valley of tears.
Final thoughts : God Never abandons
If you've ever felt like God has forsaken you, always remember that Jesus knows what that's like. He experienced that in his human nature on the cross, but he also assures that God will never forget nor abandon, in the chapter 49 of book of prophet Isaiah, “I will not forget you and I will not leave orphaned….therefore God never withdraws from those who cry out to him” but he will answer. Therefore, we can understand this is a cry full of faith in father, a cry of hope and in trust in him, A cry of prayer, which is directed towards God. God answers, indeed God the father raised Jesus from Dead, God answers our prayers.
We also notice, at the foot of the cross, when the soldiers and pagan centurion heard this cry, though they thought first as desperate cry but soon realised and said this is no cry of desperation but truly he was the Son of God, Just. The change and transformation has begun right at the cross itself.
So, today the real question is who is abandoning or forsaking who?
It is not God who is forsaking but we are forsaking, distancing and abandoning God for our vested interests and lifestyle, that’s why our lives are in utter destruction.
Let us offering ourselves, our lives, our families, let us promise today that we will never do things again that will crucify Jesus and that will torture him physically and mentally.
Fr. Jayaraju Manthena OCD