19, ఆగస్టు 2023, శనివారం

20 వ సామాన్య ఆదివారం

 

20 వ సామాన్య ఆదివారం

యెషయ 56:1, 6-7

రోమియులు 11:13-15,29-32

మత్తయి: 15:21-28

 

ఈనాటి దివ్య గ్రంథ పఠణాలు దేవుని యొక్క రక్షణము ప్రపంచమంతటకు విస్తరిల్ల చేయబడినది అనే అంశము గురించి. అందరూ కూడా ఆయన రక్షణకు అర్హులే అనే అంశమును ప్రభువు తెలియచేస్తున్నారు. ఆయన అందరిని రక్షించుటకు సంసిద్ధముగా ఉన్నారు. ఎవరైతే ఆయనను తెలుసుకొని ఆయన చెంతకు వచ్చి ఆయన రక్షణ కొరకు ఎదురు చూస్తారో వారందరూ కూడా దీవించబడతారు. చాలా సందర్భాలలో మనందరికీ కూడా ఎదురయ్యేటటువంటి ప్రశ్న ఏమిటంటే నేను రక్షణ పొందగలనా? అదే విధముగా కొన్ని కొన్ని సందర్భాలలో మనము మంచిగా జీవించకపోతే మరణించే సమయంలో రక్షణ పొందుతామా లేదా? అని అలా ఆలోచన చేసే వారందరికీ ఈనాటి దివ్య పఠణాలు రక్షణ అందరూ పొందుతారు అని అంశమును గురించి బోధిస్తున్నాయి. 

కాకపోతే మన జీవితంలో మనము గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని అంశాలు ఏమిటంటే మొట్టమొదటిగా మన జీవితంలో  అంతట మనము రక్షణ పొందలేము కేవలం దేవుడు మాత్రమే మనకు రక్షణ ప్రసాదించగలరు. రెండవదిగా దేవుని యొక్క రక్షణ అందరికీ చెందుతూ ఉంది. కాబట్టి వినయముతో విశ్వాసముతో జీవించాలి. మూడవదిగా నేనే మాత్రమే రక్షణ పొందగలను అనే అహంతో ఎవరు కూడా ఉండకూడదు వారి యొక్క మతమును బట్టి కానీ, జీవితమును బట్టి గాని, లేదా వారు చేసే కార్యమును బట్టి గాని గర్వంగా ఉండకుండా జీవించినప్పుడే దేవుని యొక్క రక్షణ పొందగలుగుతారు.

దేవునికి ఎవరు నశించి పోవుట ఇష్టము లేదు (2 పేతురు 3:9), యెహెజ్కె 18:23, 33:11.

అదే విధముగా దేవుడికి ఎవ్వరూ కూడా ఏ దేశం కూడా ఒక ప్రత్యేకమైనది కాదు అందరూ కూడా ఆయన దృష్టిలో సరి సమానులే అందుకనే ఆయన అందరి మీద వర్షమును, సూర్యుడిని కురిపింప చేస్తున్నారు.

ఈనాటి మొదటి పఠణంలో దేవుడు యెషయ‌ప్రవక్త ద్వారా తన యొక్క రక్షణ అందరికీ కూడా చెందుతుంది అనే అంశం గురించి తెలియజేశారు. సృష్టి ప్రారంభంలో మానవుడు దేవుడు యొక్క మాటను అవిధేయించినప్పటి నుండి దేవుడు మానవుడుని రక్షించాలి అని అనుకున్నారు. దానిలో భాగంగానే ఆయన అబ్రహామును ఎన్నుకున్నారు ఆయన ద్వారా మిగతా దేశాలందరినీ రక్షించాలని అనుకున్నారు. అబ్రహాము యొక్క సంతతి తామే దేవుని బిడ్డలం అనేటటువంటి అహంతో జీవించకుండా దేవుడు మిగతా వారిని కూడా తన బిడ్డలగా అంగీకరిస్తున్నారు అనే సత్యమును ఈనాటి మొదటి పఠణం వెల్లడిస్తున్నది. ప్రభువు అంటున్నారు ఎవరైతే తన యొక్క నీతి న్యాయమును పాటిస్తూ ఉంటారో వారందరూ కూడా రక్షణ పొందుతారు అని తెలుపుతున్నారు. యెరుషలేములో ఉన్న దేవుని ఆలయం అందరికీ ప్రార్థనాలయం అవుతుంది అని తెలిపారు. అనగా అందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో చేరి ఆ ప్రభువుని స్తుతించి ఆరాధిస్తారని దేవుడు కేవలం ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే కాకుండా మిగతా వారిని కూడా తన బిడ్డలగా స్వీకరిస్తున్నారు. 

యావే దేవుడు చాలా సందర్భాలలో ప్రవక్తల ద్వారా తెలియచేయాలనుకున్న అంశం ఏమిటంటే ఆయన అందరికీ ప్రభువుని. కేవలం యూదులకు మాత్రమే కాకుండా  అన్యులకు కూడా ఆయన ప్రభువు అని తెలియచేయాలనుకున్నారు దానికి ముఖ్య నిదర్శనం ఈనాటి మొదటి పఠణం. ప్రభువు ఎందుకు అన్యులను ఇశ్రాయేలీలతో కలవకూడదు అన్నారు అంటే ఇశ్రాయేలీయులు దేవునికి దూరమైనా సమయాలు చాలా ఉన్నాయి, విగ్రహారాధన చేసిన సమయాలు చాలా ఉన్నాయి అందుకనే ఈ అన్యుల యొక్క జీవితము వారిలాగా మారకూడదు అనే ఆలోచనతో యావే దేవుడు అన్యులను ఇశ్రాయేలీలతో కలవ వద్దన్నారు.

 కానీ ఈ మాటలను ఇస్రాయేలీయులు తమ స్వంత స్వార్థం కోసం తప్పుగా అర్థం చేసుకున్నారు వారి యొక్క ఆలోచన ఏమిటంటే కేవలం వారు మాత్రమే దేవుని చేత ఎన్నుకొనబడ్డవారని, రక్షణ కేవలం వారికి మాత్రమే చెందినది అని మిగతా  వారు రక్షణ పొందలేరు అనే అంశాన్ని వారు తప్పుగా అర్థం చేసుకున్నారు. కొంతమంది యూదుల యొక్క ఆలోచన ఏమిటంటే అన్యులు కూడా రక్షణ పొందుతారు కానీ వారు మొదటిగా యూదా మతాన్ని స్వీకరించినప్పుడు మాత్రమే. ఈ మొదటి పఠణము మనకి తెలియచేసే అంశం ఏమిటంటే దేవుని యొక్క రక్షణ అందరికీ చెందినది అందరూ కూడా ఆయనకు ఇష్టమైన వారు కేవలం ఆయనను తెలుసుకొని విశ్వసించి వెంబడించే వారందరూ కూడా ప్రభువుని రక్షణను పొందుతారు.

ఈనాటి రెండవ పఠణంలో కూడా పౌలు గారు ఆయన ఎన్నుకొనబడినది అన్యులకు  సువార్త ప్రకటన చేయుటకు, తన యొక్క సువార్త ప్రారంభంలో పౌలు గారు మొదటిలోనూ యూదులకు సువార్త ప్రకటించినప్పుడు వారు ఎవ్వరు కూడా దానిని అంగీకరించలేదు అందుకని పౌలును అన్యులకు సువార్త బోధించుటకు వివిధ ప్రాంతాలకు ప్రయాణమై వెళ్లారు ఆయన బోధించిన ప్రతి చోట కూడా అన్యులు దేవుని యొక్క సువార్త  అంగీకరించారు దేవుని యొక్క సువార్తను రక్షణను పొందారు. అవును అన్యుల యొక్క అపోస్తులను అని పిలుస్తుంటారు పిలుస్తుంటారు. ఏసుక్రీస్తు నందు అందరూ కూడా రక్షణ పొందుతారు అనే అంశాన్ని పౌలు గారు తెలియజేశారు. 

ఈనాటి సువిశేష పట్టణంలో దేవుడు కననీయ స్త్రీ యొక్క ప్రార్థనను ఆలకించిన విధానం గురించి తెలియజేస్తున్నారు. కననియ స్త్రీ యూదా మతమునకు చెందినటువంటిది కాదు అయినప్పటికీ కూడా ఆమె ఏసుప్రభువును దావీదు కుమారుడా అని సంబోధిస్తున్నది అంటే ఆయన గురించి బహుశా ఆమె విని ఉండవచ్చు, ఆయన గొప్పతనమును అద్భుత కార్యములను తెలుసుకొని ఉండవచ్చు, అందుకని దావీదు కుమారుడా అని ఆమె సంబోధిస్తున్నది. ఏసుప్రభు ఆమె మొరను ఆలకించినప్పటికీ ఆమెలో ఉన్నటువంటి గొప్ప విశ్వాసమును బయటకు తీసుకుని రావటకు మరియు మిగతా అక్కడ ఉన్న శిష్యులకు అందరకు అన్యుల యొక్క విశ్వాసము ఎంత గొప్పది అని తెలియజేయుటకు ప్రభువు ఆమె మెరుపు పెడచెవిని పెట్టిన విధంగా ఆయనవ మనందరికీ కూడా కనబడుతున్నారు. కానీ వాస్తవానికి ఏసుప్రభువు అన్యులను ఎక్కువగా ప్రేమించారు ఎందుకంటే ఆయన సువార్తను చాలా అన్య ప్రదేశాలలో బోధించారు, వారితో కలసి భుజించారు,ప్రయాణం చేశారు జీవించారు. ఈమె యొక్క విన్నపమును కూడా దేవుడు గౌరవించారు కేవలము ఆమెను ఒక సుమాతృకగా ఇతరులకు చూపించటకు మాత్రమే ప్రభువు ఆమెను తృణీకరించిన విధముగా ఇక్కడ కనబడుతున్నారు. 

ఈమె యొక్క విశ్వాస జీవితము నుంచి కొన్ని అంశాలు మన ఆధ్యాత్మిక జీవితమునకు తీసుకోవాలి. మొదటిగా ఆమెలో ఉన్న విశ్వాసం- ఆమె విశ్వాసము చాలా గొప్పది ఎందుకంటే ఏసుప్రభువు మాత్రమే తన కుమార్తెకు స్వస్థతను ప్రసాదించగలరు అని ఆమె విశ్వసించినది కాబట్టే యూదులకు అన్యులకు మధ్య ఉన్న భేదాలు ఏమి పట్టించుకోకుండా ఆమె ఏసుక్రీస్తు ప్రభువు చెంతకు రాగలిగినది ఆమె విశ్వాసము ద్వారానే తన కుమార్తెకు స్వస్థతను చేకూర్చుకోగలిగినది.

రెండవదిగా ఆమెలో ఉన్న పట్టుదల-ఏసుప్రభు తనను కొంచెం బాధించే విధంగా మాట్లాడినప్పటికీ ఆమె తన పట్టుదల కోల్పోలేదు పదేపదే అడుగుతూనే ఉంటూ ఉన్నది ఆ యొక్క పట్టుదలను బట్టి తను అనుకున్నది సాధించగలుగుతున్నది. యాకోబుకు కూడా పట్టుదల ఎక్కువగా ఉన్నది కాబట్టే ఆయన దేవునితో కుస్తిపట్టే సందర్భంలో దేవుడి చేతిని విడిచిపెట్టడం లేదు అప్పటికే ఆయన తుంటి ఇరిగినప్పటికీ ఆయన దేవుడిని ఆశీర్వదించమని అడుగుతున్నారు ఆశీర్వదిస్తేనే నేను మిమ్మల్ని వదిలిపెట్టను అని పట్టుదలతో అడిగాడు కాబట్టే ఆయన అనుకున్నది పొందగలిగాడు కాబట్టి మనం కూడా మన విశ్వాస జీవితంలో పట్టుదలను ఎప్పుడూ మరచిపోకూడదు అడుగుతూనే ఉండాలి ప్రయత్నం చేస్తూనే ఉండాలి కష్టపడుతూనే ఉండాలి అప్పుడు మాత్రమే మన జీవితంలో ఫలితములు చూడగలుగుతుంటాము.

మూడవదిగా ఆమెలో ఉన్న వినయం: ఏసుప్రభు ఆమెతో సంభాషణీ సందర్భంలో బిడ్డల రొట్టెలను కుక్కలకు వెయ్యి తగదు అని ప్రభువు ఆమెతో అన్నారు ఈ మాటలు ఎవరు విన్నా సరే బాధపడుతూ ఉంటారు కానీ ఆమె మాత్రం ఏమి కూడా పట్టించుకోకుండా ఏసుప్రభువుకి ఎంతో వినయముతో సమాధానం చెబుతుంది అది ఆమెలో ఉన్న గొప్ప వినయం. 

కొన్ని కొన్ని సందర్భాల్లో మనల్ని ఎవరో తిట్టారు ఏదో అన్నారని మనం నిరాకరించబడ్డామని చాలామంది తాము సాధించాల్సింది మరిచిపోతూ ఉంటారు దేవాలయపు దూరమై వెళుతూ ఉంటారు కానీ ఈమె మాత్రం ఏసుప్రభువు చెప్పిన ప్రతి మాటను వినయముతో అంగీకరించి స్వీకరించినది అందుకని ఏసుప్రభు ఆమె విశ్వాస జీవితమును మెచ్చుకుంటున్నారు. దేవుని యొక్క రక్షణలో అందరూ కూడా భాగస్తులే కాబట్టి ఆయనను విశ్వసించి జీవించాలి.

 

Fr. Bala Yesu OCD

12, ఆగస్టు 2023, శనివారం

 

19 సామాన్య ఆదివారము

1 రాజులు 19 :9 , 11 -13

రోమా 9 : 1 - 5

మత్తయి 14 : 22 - 33

క్రిస్తునాధుని యందు ప్రియా సహోదరి సహోదరులారా!

ఈనాడు తల్లి తిరుసభ 19 సామాన్య ఆదివారములోనికి ప్రవేశిస్తున్నది. ఒక మనిషి తన జీవితంలో అనేకమైన సందర్భాలలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటు ఉంటాడు. మనము ఎదుర్కొనే సమస్యలు, అన్నింటిలో దేవుని యొక్క చేయూత మన జీవితంలో ఉన్నట్లయితే మన సమస్యలు అన్ని కూడా ఒక సమస్యగా కనిపించకుండా ఒక సాధారణ విషయంగా కనిపిస్తూ ఉంటుంది. ఈనాటి మూడు దివ్య గ్రంథ పఠనాలు మనము ధ్యానించినట్లయితే మనయొక్క జీవితము గురించి మన జీవితంలో ఎదుర్కొనే సమస్యల గురించి తెలియజేస్తున్నాయి. మనకు ఏమైనా సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉంటాము, మనము ఏం చేయాలి అనేది ఈనాటి మూడు పఠనాలలో మనం చూస్తూ ఉన్నాము. ఒకసారి మనము ధ్యానించుకున్నట్లు అయితే జీవన నౌక అనే అంశాన్ని మనము గమనించవచ్చు.

నౌక అనగా మనకు గుర్తు వచ్చేది ఏంటంటే నీటి పై పయనించే ఒక వాహనము. యొక్క నౌకను చుస్తే ఎంతో ప్రశాంతంగా విహరిస్తున్నట్లు మనకు కనిపిస్తుంది కానీ యొక్క నౌకను నడిపే నౌక దారికి మాత్రమే తెలుస్తుంది నౌకను నడపడం ఎంత కష్టమైన పని అని. నౌక హరి అనేవాడు లేక పోతే నౌకకు ఒక గమ్యము అనేది లేకుండా పోతుంది. అపుడు అది దాని పతనానికి ధరి తెస్తుంది. అదే నౌక ధరి ఉన్నట్లయితే అది దాని గమ్యానికి చేరుకుంటుంది. మన యొక్క జీవితాలు కూడా యొక్క నౌకను పోలి ఉన్నాయి. మరి మన జీవితాలకు నౌకాదరి ఎవరన్నా ఉన్నారా అంటే అది ఒక దేహ్వుని వాక్యము మాత్రమే. కీర్తనల గ్రంధము 119 : 105 వచనంలో మనం చూస్తున్నాం " నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు". దేవుని యొక్క వాక్యము మన జీవితాలలో ఉన్నట్లయితే వాక్యము మనలను మన యొక్క గమ్యము వైపు నడిపిస్తుంది అంటే దేవుని యొక్క చేయూత మనకు ఉన్నట్లయితే మనం గమ్యము వైపు పయనించగలం. మరి దేవుని యొక్క చేయూత మనకు కలగాలి అంటే దేవుని పట్ల మనము ధృడమైన నమ్మకము కలిగి ఉండాలి. విధమైన నమ్మకము అనేది మనము ఈనాటి మొదటి పట్టణములో ఏలీయా ప్రవక్త జీవితం ద్వారా మనము చూస్తూ ఉన్నాం.

ఏలీయా ప్రవక్త గురించి మనము చూస్తున్నాము తాను విధంగా బాలు దేవతలను వధించి యావే ప్రభువు మాత్రమే నిజమైన దేవుడని విధంగా నిరూపించాడో. మనకు విదితమే. అదే అలియా ప్రవక్తే ఏనాడూ తన యొక్క ప్రాణ రక్షణార్ధమై పారిపోవడాన్ని మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలతో ఇదిగో మీరు  మిమ్మల్ని బానిసత్వము నుండి కాపాడిన యావే ప్రభుని మరిచి యెజెబెలు రాణిచే సృష్టించిన చిల్లర దేవుళ్లను అనగా అన్య దేవుళ్లను ఆరాధిస్తున్నారు. మరు మనసు పొందండి అని ఇశ్రాయేలు ప్రజలను ఖండిస్తున్నాడు. యెజెబెలు రాణి ఇది అంత చూస్తూ తనయొక్క సైన్యంతో ఏలీయా ప్రవక్తను హతమార్చమని ఆజ్ఞాపిస్తుంది. ఏలీయా తన యొక్క ప్రాణ రక్షణార్ధమై దేశాన్ని వదిలి వెళ్లిపోవడం జరుగుతుంది.

ఎందుకు ఏలీయా ప్రవక్త ఇలా చేసాడు అంటే తాను నమ్మింది ఒకే ఒక్క శాసనం. అది ఏంటంటే "యావే ప్రభువు మాత్రమే దేవుడు. “యావే ప్రభువు తప్ప మరియొక్క దేవుడు లేడు" అనే ఒక ధృడ నమ్మకాన్ని కలిగి ఉండి ఒక్క మాటకై తన యొక్క ప్రాణాన్ని ఫణంగా పెడుతూ ఉన్నాడు. ఏలీయా ప్రవక్త పారిపోతూ ఉన్నాడు ఎవరి దగ్గిరకి అని అంటే మానవమాత్రుడి దగ్గిరకు కాదు కానీ దేవుని దగ్గిరకి పారిపోవుచు ఉన్నాడు. ఏలీయా ప్రవక్త మానవుని కాక దేవుని నమ్మి ఉన్నాడు కాబట్టి దేవుని ఆశ్రయిస్తూ ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా మన జీవితాలలో కూడా మనము అనేకమైన సమస్యలను ఎదుర్కొంటు ఉన్నాము. కానీ మనము దేవుని తప్ప అందరిని ఆశ్రయిస్తాము. కానీ మనము కూడా ఏలీయా ప్రవక్తలాగ దేవుని ఆశ్రయించినట్లయితే మన సమస్యలకు దేవుడే పరిష్కారం చూపిస్తాడు.

రెండొవ పట్టణములో పునీత పౌలు తనయొక్క జీవితంలో దేవుడు చేసిన మేలులను గుర్తు చేసుకొంటూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. మొదటి వచనాలలో మనం చూస్తున్నాము. " నేను క్రీస్తునందు సత్యము పలుకుచున్నాను. అసత్యము పలుకుట లేదు". యేసు క్రీస్తు నిజముగా ప్రభువు. అని తన యొక్క నమ్మకాన్ని ప్రకటిస్తున్నాడు.

ఈనాటి సువిశేష పట్నంలో యేసు ప్రభు తనయొక్క శిష్యులకు ఒక అభయాన్ని ఒసగుతూ ఉన్నాడు. శిష్యులు పడవలో ప్రయాణం చేస్తుండగా ప్రమాదానికి గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు యేసు వారిని రక్షించడానికి నీటిపై నడిచి రావడాన్ని మనం చూస్తున్నాము. కానీ సిష్యులు యేసు ప్రభుని గుర్తించక పెను భూతము అనుకొని భయపడి నపుడు" భయపడవలదు, నేనే కదా " అని వారికి అభయాన్ని ఒసగుతూ ఉన్నాడు. కానీ పేతురు అవిస్వాసుడై ప్రభు అది నీవే అయితే నీటి పై నడచి రావడానికి నాకు ఆజ్ఞ ఇమ్ము అని ప్రభుని కోరినప్పుడు అలాగే రమ్ము అని ప్రభు పలికితే పేతురు తన దృష్టిని ప్రభుని వైపు కాక తన భయము వైపు మలిచి తన యొక్క విశ్వాసాన్ని పరీక్షించుకున్నాడు. ప్రియా బిడ్డలారా !మనయొక్క జీవితాలలో ఎదో ఒక విధంగా దేవుని యొక్క అనుగ్రహం అనేది మనకు కలుగుతున్నది. కానీ పేతురు వాలే మనము మన దృష్టిని మనకు కావలసిన వాటి మీద కాక వేరే వాటి పై దృష్టి సారిస్తున్నాము. మన యొక్క విశ్వాసాన్ని మనమే పరీక్షించుకుంటున్నాము.

మరి మన యొక్క దేవుని పై ఉండాలంటే మనము చేయవలసిన ఒక పని ఏంటంటే ఏలీయా ప్రవక్తలాగ, పౌలు గారు లాగ " యావే ప్రభువు మాత్రమే నిజమైన దేవుడు" అని  ధృడమైన నమ్మకాన్ని మనము కలిగి ఉండాలి. కాబట్టి ప్రియ సహోదరులారా, మనము ధృడమైన నమ్మకాన్ని కలిగి జీవించడానికి ప్రయత్నిధం. ముందుగా మనము చెప్పుకున్న విధంగా మన జీవన నౌకకు అనగా మన జీవితానికి దేవుని యొక్క వాక్యాన్ని మూలముగా చేసుకున్నట్లయితే మనయందు దేవుని రక్ష ఉంటుంది కాబట్టి యొక్క దేవుని యొక్క వాక్యాన్ని మన జీవితానికి మార్గ చూపరిగా నియమించుకుందాం. " నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు". ఆమెన్.

బ్రదర్ పవన్ కుమార్ . సి. డి

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...