32 వ సామాన్య ఆదివారం
మొదటి పఠనము : సీర ; 6 : 12 - 16,
రెండవ పఠనము : 1 తేస్సా ; 4: 13 - 18,
సువిశేష పఠనము : మత్తయి
25: 1-13
క్రీస్తు నాధునియందు ప్రియా సహోదరులారా, ఈనాడు తల్లి శ్రీ సభ 32 వ సామాన్య ఆదివారాన్ని కొనియాడుతున్నది. ఈనాటి దివ్య గ్రంథపాఠనాలు
మనకు మూడు ముఖ్య అంశాలను ధ్యానిoచమని కోరుతున్నది.
1. జ్ఞానం కొరకు అన్వేషించాలి.
2. నిరీక్షణతో ఎదురు చూడాలి.
3. ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడి ఉండాలి.
1. జ్ఞానం కొరకు అన్వేషించాలి.
జ్ఞానం అనేది దేవుడు ఇచ్చే ఒక వరం. ఈ యొక్క జ్ఞానాన్ని "దేవుడు ఈ సృష్టి కంటే ముందుగా సృష్టించాడు." సీర 1:5. కావున ఈనాటి మొదటి పఠనము మనకు జ్ఞానం వెతికే వారలుగా జీవించమని
తెలియపరుస్తుంది. జ్ఞానం వెతకలనంటే ముందుగా ఈ యొక్క జ్ఞానాన్ని ప్రేమించాలి. ఈ యొక్క ప్రేమ ద్వారానే ఈ జ్ఞాన్నాన్ని పొందగలము . ఉదాహరణకు సొలొమోను మహారాజు ఈ జ్ఞానాన్ని ప్రేమించాడు కాబట్టే ఈ లోకంలో ఎవరికీ లేని ఉత్తమమయిన జ్ఞానాన్ని దేవుడు ప్రసాదించాడు . కావున ప్రియా విశ్వాసులారా మనం కూడా ఈ జ్ఞానాన్ని ప్రేమించినట్లయితే దేవుని చేత ఈ యొక్క అనుగ్రహము మనకు కూడా ఒసగబడుతుంది అని ఈనాటి మొదటి పఠనము మనకు తెలియపరుస్తుంది. ప్రియులారా జ్ఞానము వెతికిన వారికే దొరుకుతుంది. వెతకని వారికి ఇది దొరకదు. ఈనాటి సువిశేష పఠనములో కూడా మనం చూసినట్లయితే వివేకంతో ఎదురు చూస్తున్న ఐదుగురు కన్యకలను మాత్రమే ప్రభువు తన సన్నిధిలోనికి ఆహ్వానించారు. అవివేకంతో వున్నా మిగతా ఐదుగురు కన్యకలను త్రోసిపుచ్చారు. కావున ప్రియమయిన విశ్వాసులారా మనంకూడా వివేకంతో ఎదురు చూస్తున్న ఐదుగురు కన్యకలవలె సిద్హపాటు కలిగి ప్రభువు యొక్క రాజ్యాన్ని సంపాదించుకోవాలి.
2. నిరీక్షణతో ఎదురు చూడాలి
ప్రియా విశ్వాసులారా ఒక వ్యక్తి లక్షణాన్ని చెప్పాలంటే ఆ వ్యక్తి యొక్క నిరీక్షణ గుణం ఎలాంటిదో పరీక్షించాలి. నిరీక్షణ అంటే ఎదురు చూడడం. ఓపిక పట్టడం, సహనము కలిగి ఉండటం. ఇది నిరీక్షణ యొక్క లక్షణాలు. కష్టాలలోను శ్రమలలోను ఓర్పు కలిగి ఉండటం పరీక్షలు ఏదురయినప్పుడు ఆంతాయిపోయింది అన్న పరిస్థితులు తారసిలినప్పుడు కూడా ఓర్పు సహనము కలిగి ఉండటం.
దేవుడు అద్భుతం చేస్తాడు నన్ను ఆదుకుంటాడు, ఆదరిస్తాడు అని నమ్మడం నిరీక్షణ యొక్క లక్షణo. దీనికి మన పీత మహుడు అబ్రాహాము గొప్ప నిదర్శనం. కావున మన జీవితం లో ఎన్ని సమస్యలు ఎదురయినా ఓర్పుతో సహనంతో నిరీక్షణతో ఎదురుకొన్నప్పుడే మన జీవితం అనేది ధన్యం
అవుతుంది. అందుకే ఈనటి రెండవ పట్టణములో పునీత పౌలు గారు తెస్సాలోనికా ప్రజల మధ్యలో వున్నా సమస్యలలో గురించి తెలియపరుస్తూ వీటిని ప్రేమతో అధిగమించినప్పుడే మన ప్రభువు యొక్క రాకడలో పాలుపంచుకోగలము.
3. రెండవ రాకడ కొరకు ఎదురు చూడటం
ప్రియా విశ్వాసులారా పరిశుద్ధ గ్రంథ పరంగా చూసినట్లయితే ప్రభువు యొక్క రాకడ అనేది మనము ఊహించని ఘడియలలో అకస్మాత్తుగా వస్తుంది. మనము ఇక్కడ గుర్తుంచుకోవాలిసిన అంశం ఏమిటిఅంటే పెళ్లి కుమారుడు అంటే క్రీస్తు ప్రభువే. వివాహము అనేది ప్రభువు యొక్క రాకడను గుర్తుంచుకోవాలి. చాలామంది బోధకులు ప్రభువు యొక్క రాకడ లేదు అని బోధిస్తూ వుంటారు. కానీ అది దగ్గరలోనే వుంది అని అది తప్పని సరిగా వస్తుందిఆ అని మనం గుర్తుంచుకోవాలి. మన క్రియలను బట్టి మనకు తీర్పు అనేది విధించబడుతుంది. పరలోకమం చేరాలి అంటే అత్యంత ప్రధానమయిన ప్రమాదము ఒకటి వున్నది అది సోమరితనం. దీన్ని దగ్గరికి రానివ్వకూడదు ఇది భయంకరమయినది. క్రైస్తవ విశ్వాసంలో ఆత్మీయ జీవితంలో సోమరితనం ఉంటే అదే అనర్ధము. ఈనాటి సువార్తలో. ఐదుగురు వివేకవంతులు సిద్దపడి వున్నారు. మిగతా ఐదుగురు అవివేకవంతులు మాత్రం సోమరితనంగా, కష్టపడకుండా వున్నారు కాబట్టే వివేకవంతులు పరలోక రాజ్యాన్ని పొందారు. అవివేకవoతులు మాత్రం దానిని దక్కించుకోలేదు కావున మన నిత్యా జీవితం లోకూడా సోమరితనాన్ని అలవరచకుండా కస్టపడి వివేకవంతులవలె పరలోక రాజ్యాన్ని పొందాలి.
బైబుల్ పరంగా రెండవ రాకడ ఏవిధంగా వస్తుంది అంటే దూతల సమీక్షంగా మేఘరూపుడై వస్తాడు. ప్రియమయినటువంటి సహోదరులారా అటువంటి వంటి
రాకడకు సిద్దపడి ఉండాలి అని, మెళుకువకలిగి ఉండాలి, వేచివుండాలి, మరియు ఎదురు చూడాలి అని
ఈనాటి పఠనాలు మనకు బోధిస్తున్నాయి.
BRO. SAMSON OCD