18, మార్చి 2022, శుక్రవారం

తపస్సు కాల 3 వ ఆదివారం

తపస్సు కాల 3 వ ఆదివారం 

నిర్గ 3:1-8,13-15  1 కోరింథీ 10:1-6, 10-12 లూకా 13:1-9  

క్రీస్తు నాధుని యందు ప్రియమైన విశ్వాసులారా !ఈ నాడు మన తల్లి అయిన తిరుసభ తపస్సు కాల మూడవ ఆదివారంలోనికి  ప్రవేశిస్తుంది.  అయితే  ఈనాటి మూడు దివ్య గ్రంధ పఠనాలను  ధ్యానించినట్లయితే ముఖ్యముగా హృదయపరివర్తన గూర్చి భోధిస్తున్నాయి. 

మొదటి పఠనములో  మోషే ప్రవక్తను యిస్రాయేలీయుల  బానిసత్వం నుండి విడిపించుటకై ఎన్నుకుంటున్నాడు. ఇతని ద్వారానే తమ పూర్వులు కొలిచినటువంటి యావే దేవుని గూర్చి  తెలియ చేస్తున్నాడు. 

రెండవ పఠనములో  మనం చూస్తే  ఈలోక  సంబంధమైన  విషయములపై , వస్తువులపై విగ్రహములపై మన మనస్సులను  లగ్నం చేయక,  ఆధ్యాత్మిక శిలయగు యేసు క్రీస్తునందు జాగ్రత్త కలిగి జీవించాలి అని తెలియజేస్తుంది. 

సువిశేష పఠనములో మనం చూస్తే, హృదయ పరివర్తనం గురించి మరియు ఫలభరితమైన జీవితం గురించి భోదిస్తుంది. 

మొదటి పఠనం :- 

ఈనాటి మొదటి పఠనములో ముఖ్యముగా మోషే ప్రవక్త ఎన్నికను మనం చూస్తున్నాం. ఎందుకు దేవుడు మోషేను ఎన్నుకున్నాడంటే, యిస్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఫరో రాజు బానిసత్వంలో మునిగిపోయి ఎన్నో ఇబ్బందులు పడుచున్నారు. వారిని ఎంతో ఘోరంగా చూసెడివారు. వారిని బానిసలుగా ఎంచి ఇటుకలు చేయడానికి ఇల్లు కట్టడానికి ఇలా ఎన్నో రకాలుగా వారిని వాడుకుంటూ చిత్ర హింసలకు గురిచేసెడివారు. నిర్గ 2:23. అటువంటి సమయంలో యిస్రాయేలు ప్రజలు దేవుని సహాయాన్ని అర్ధించారు. అప్పుడు ఆర్తనాదాలు దేవుని చెవిన పడి వారిని రక్షించడానికి ఈ మోషే ప్రవక్తను ఒక పనిముట్టుగా ఉపయోగించుకున్నాడు. 

మోషే జీవితాన్ని మనం చూసినట్లయితే, నిర్గ 3:1 లో ఇతను తన మామ అయినటువంటి యిత్రో మందలను మేపెడివాడు. తనకంటూ ఏమి లేదు. తన మామ దగ్గర సేవకుడుగా జీవించాడు. తన గొర్రెల నిమిత్తం మోషే హోరెబు కొండకు  వెళ్ళాడు. ఈ హోరెబు  కొండ అంటే దేవుని కొండ అని అర్ధం. దేవుడు నివసించే  ప్రదేశమునకు దేవుని చేత కొండకు నడిపింపబడ్డాడు. ఎప్పుడైతే మోషే  ఆ కొండ దగ్గరికి వచ్చాడో అక్కడ  దేవుని సాక్షాత్కారాన్ని చూసాడు. నిర్గ 3:2.  అక్కడ ఒక పొదనడిమి నుండి వెలువడు నిప్పు మంట రూపమున యావే దూత  అతనికి సాక్షాత్కారించేను. యోష  6:1-2 లో చూస్తే  ప్రభువు ఉన్నతమైన సింహాసనము పై  ఆసీనుడై ఉండెను. అతనికి పై భాగమున జ్వలించుచున్న  సెరాఫీము దేవ దూతలు నిల్చియుండిరి అని చదువుచున్నాం. అదే విధంగా సమువేలు కూడా దేవుని దర్శనములు ఎప్పుడు లభించుచునే ఉండెను. 1 సమూ 3:21. ఇలా ఎంతో మందికి దేవుడు ప్రత్యక్షమవుతూ ఆయన యొక్క మహిమను తెలియ చేస్తున్నాడు. 

ఎందుకు దేవుడు తన పనికి ఎంతో మందిని పిలుస్తున్నాడు? 1. శ్రమలలో ఉన్న వారికి విడుదల కలుగ చేయడానికి.(నిర్గ 3:7-8) 2. పాపములో ఉన్న వారిని దేవుని మార్గంలో నడిపించడానికి (యోనా 3:4-6) 3. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి (నిర్గ 3:14) 

దేవుని యొక్క చిత్తం నెరవేర్చడమంటే, దేవుని  గూర్చి భోధించాలి. కానీ ఈ సమాజంలో మనం చూస్తే ఎంతో మంది దేవుని మాటలను వినడానికి, దేవుని చెంతకు రావడానికి, ఆయనను గురించి  భోదించదానికి వెనకాడుచున్నారు. మోషే ప్రవక్త జీవితంలో చూస్తే ఆయన దేవుని మాట శిరస్సా వహించి 1. ప్రజల దగ్గరికి వెళ్ళి వారితో ఉన్నవాడైన దేవుని గురించి తెలియ చేశాడు. 2. ఫరో రాజు దగ్గరకు వెళ్ళి దేవుని యొక్క ప్రణాళికను అతనికి తెలియజేసి ఎన్నో విపత్తుల తర్వాత ప్రజలను ఐగుప్తు దేశం నుండి కానాను దేశమునకు తీసుకెళ్ళాడు. 3. దేవుని ఆజ్ఞలను వారికి అందించాడు. 4. వారి గురించి ప్రార్దన చేశాడు. 

ఈనాడు నీవు నేను కూడా క్రైస్తవులుగా పిలవబడుతున్నాం. క్రైస్తవుడు అంటే క్రీస్తును అనుసరిస్తున్నవాడు. కాబట్టి మనం కూడా మోషే ప్రవక్తవలే , ఇంకా ఇతర ప్రవక్తల వలె దేవుని మాట శిరస్సా వహించి, దానిని పఠిస్తూ, పాటిస్తూ దానిని ఇతరులకు పంచుదాం. దేవుని యొక్క ప్రేమను ప్రణాళికను తెలియచేద్దాం. 

సువిశేష పఠనం లూకా 13: 1-13 

ఈనాటి  సువిశేష పఠనం ముఖ్యంగా హృదయ పరివర్తన గురించి తెలియచేస్తుంది. దేవుడు ఎలాగా వారిపై జాలి చూపిస్తున్నాడు. తన కరుణను తెలియచేస్తున్నాడని తెలుపుతుంది. అయితే ఈ సువార్త పఠనం లూకా 12 వ అధ్యాయం నుండి ప్రారంభమవుతుంది. ఎందుకంటే లూకా 12 వ అధ్యాయంలో మొదటి మూడు వచనములలోకపట ప్రవర్తనను గూర్చి జాగరూపులై ఉండాలి అంటున్నాడు. 

4 నుండి 7 వ  వచనములలో  ఎవరికి మనం భయ పడాలి. ఎవరికి భయ పడకూడదని  తెలుపుచున్నాడు. మనం ఎవరికి భయ పడాలి అంటే  మన శరీరమును నాశనం  చేయు వారికి భయపడకూడదు. కానీ మిమ్ము చంపి నరక కూపములో పడవేయగల వానికి భయ పడాలి అని తెలుపుచున్నాడు. 

8 వ వచనం నుండి 12 వ వచనములలో  దేవునికి బహిరంగ సాక్షులుగా మారాలి అని భోదిస్తున్నారు. అట్టి వాడిని దేవదూతల ఎదుట  అంగీకరించును, వారు ఎట్లు మాట్లాడవలయునో పవిత్రాత్మ ద్వారా తెలుపబడును. 

ఇలా జీవించుటద్వారా  ఈ లోక సంబంధమైన విషయములపై , లోకాశలపై చింతించక దేవుని రాజ్యమును, నీతిని వెదుకుతారు అప్పుడు వారికి అన్నియు సమకూర్చబడును అని 13 వ వచనం నుండి 31 వరకు తెలుపుచున్నది. 

మరి ఎందుకు దేవుడు తన రాజ్యమును ఇస్తాడు అంటే ఇది తన ఇష్టం ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము దానిని చేద పురుగులు తినివేయవు. లూకా 12:32-33. 

ఈ రాజ్యం కోసం ప్రతి ఒక్క సేవకుడు  సిద్ధ పాటు కలిగి జీవించాలి. లూకా 12:32. ఎందుకంటే మనుష్య కుమారుడు ఏ గడియాలో వస్తాడో తెలియదు. లూకా 12:40. ఈ సిద్ద పాటు ద్వార ప్రతి ఒక్క సేవకుడు తన కర్తవ్యాన్ని నెరవేరుస్తాడు. లూకా 12:43. అలా జీవించనిచో తన యజమాని చేతిలో కొరడా దెబ్బలతో కఠిన శిక్ష ఉంటుంది. లూకా 12: 47-48. 

అప్పుడు తమ జీవితంలో విభేదాలు ఏర్పాడుతాయి. ఈ విభేదాలు ద్వార  తండ్రి కుమారున్నీ, కుమారుడు తండ్రిని,  తల్లి  కుమార్తెను , కుమార్తె తల్లీని, అత్త కోడలని, కోడలు అత్తని ఎదురిస్తారు. లూకా 12:53. ఇలా జరగకుండా ఒకరినొకరు సఖ్యత కలిగి జీవించినట్లయితే దేవుని శిక్షకు అర్హులు కాక ప్రేమకు పాత్రులవుతారు. 

ఇప్పుడు మనం సువిశేష పఠనం క్లుప్తంగా  పరిశీలిద్దాం. ఈనాటి సువిశేష పఠనం  ఒకే అంశము గురించి చర్చించిన  రెండు భాగాలుగా విభజింపబడింది. 1. ఇతరులను వ్రేలుఎత్తి  చూపడం 2.మనల్ని మనం మార్చుకోవడం. 

1. ఇతరులను వ్రేలెత్తి చూపడం : హృదయ కాఠిన్యం :- మొదటి వచనంలో చూస్తే, కొంత మంది యేసు ప్రభువు దగ్గరికి కొంత మంది వచ్చి గలీలియా విదేశీయలను చంపిన వదంతులను తెలియ చేస్తున్నారు. అప్పుడు యసు , గలిలీయా  సిలోము బురుజు కూలి  ప్రజల మరణం వారికి తెలియ చేస్తూ , హృదయ పరివర్తన  చెందనిచో అందరు అట్లే  నాశన మగుదురు అని చెప్పుచున్నారు. లూకా 13:1-5. 

అయితే ఇక్కడ పిలాతు గలీలియ దేశీయులను ఎందుకు చంపిస్తున్నాడంటే, సలోమోను  కాలంలో పిలాతు ఒక నూతన  జెరుషలేమును నిర్మించాలి అనుకున్నప్పుడు ఆ  ప్రజల దగ్గరకు వెళ్ళి వారు దేవునికి సొమ్ములో కొంత భాగం  పిలాతుకు ఇవ్వాలని వార్తనందించాడు. కానీ ప్రజలు దానికి అంగీకరించలేదు. అటువంటి సమయంలో పిలాతు తన సైనికులను వారి దగ్గరకు మారు వేషంలో పంపించి బలులు అర్పించు సమయంలో వారి మీద పడి చంపించేశాడు. 

అదే విధంగా  శిలోయములో మరణించిన ప్రజల జీవితాలలో చూస్తే  అక్కడ కాల వైపరీత్యం వల్ల అక్కడ నిర్మించినటువంటి బురుజు కూలి మరణిస్తున్నారు. అయితే మరణం  ఎప్పుడు, ఎలాగా , ఎటువంటి సమయంలో సంభవిస్తుందో తెలియదు. కాబట్టి దానికంటే ముందు మనం మార్పుచెందాలి. 

అయితే ఇక్కడ ప్రజల ఏ విధంగానైతే  గలీలియ ప్రజల మరణంను  వ్రేలెత్తి చూపకుండా, దేవుని యొక్క రాకడ కోసం సిద్దపాటు కలిగి జీవించాలి. అప్పుడే మనం  హృదయ పరి వర్తనం చెంది మారు మనస్సు పొందుతాం.  

ఆమోసు 1:3,6,9,11,13 వచనములలో మనం చూస్తే అక్కడ ప్రజలపై జాలి లేకుండా దమాస్కు , గాజా , తూరు ప్రజలు తరచూ పాపం చిసిరి కాన నేను వారిని దండించి తీరుతాను అని దేవుడు పలుకుచున్నారు. వారు ఏమి చేస్తున్నారంటే 

ఆమోదు ప్రజలు గిలాదు గర్భవతుల కడుపులు చీల్చివేశారు. ఆమోసు 1:13 

మోవాబు ప్రజలు ఏదోము రాజు ఎముకలను బుగ్గి అగునట్లు కాల్చి వేశారు. ఆమోసు 2:1-2 

యూదా ప్రజలు దేవుని ఉపదేశములను తృణీకరించారు. ఆజ్ఞలను పాటింపలేదు. ఆమోసు 2:4-5 వారి పితరులు కొలచిన దేవతలను కొలిచి అపమార్గము పట్టారు. 

యిస్రాయేలు ప్రజలు బాకీలు తీర్చలేని సజ్జనులను చెప్పుల జోడు కరీదు కూడా చేయలేని పేదలను బానిసలుగా అమ్మివేశారు. ఆమో 2:6 

ఈ ఆమోను, మోవాబు , యూద  యిస్రాయేలు ప్రజలు ఇతరులను ఎలాగైనా  నాశనం  చేయాలని పూనుకొని ఇంత ఘోర పాపానికి ఒడి గట్టారు. మరి అటువంటి వారి మీదకు నిప్పులు కురిపింతును అని పలుకుచున్నారు. వారి హృదయంలో కాఠిన్యం కారణముగానే వారు ఇంత పాపానికి ఒడి గట్టారు. 

యవేలు 2:12 లో ప్రభువు  ఇట్లనుచున్నాడు. ఇప్పుడైనను  మీరు పూర్ణ హృదయముతో  నా చెంతకు మరలిరండు మీ బట్టలు చించుకొనుట చాలదు. మీ గుండెలను వ్రయ్యలు చేసి కొనుడు అంటున్నాడు. 

కాబట్టి తపస్సు కాలంలో  నీవు నేను దేవుని చెంతకు పూర్ణ హృదయముతో వచ్చి మనం చేసిన పాపములను ఒప్పు కోవాలి అప్పుడే దేవుడు మనలను దీవిస్తాడు. 

ఈ లోకంలో ఎంతో మంది ఎన్నో కాల విపత్తుల ద్వారా భూకంపము, రోగములు, సునామీ వర్షము , కరొన  ఎంతో మంది మరణిస్తున్నారు. ఇలా మరణించడం వారి తప్పిదముల వల్ల కాదు కానీ ఈ లోక వైపరీత్యాల వల్ల జరుగుతుంది అని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. ఇదే మొదటి భాగంలో దేవుడు అనేది. ఆట్లు చంపబడిన గలీలియ వాసులకంటే, శీలోయము బురుజు కూలి దాని క్రింద పడి మరణించిన 18 మంది  తక్కిన యెరుషలేము నివాసులకంటే ఎక్కువ పాపులని, అపరాధులని ఎంచుచున్నారా?అంటున్నాడు. కాబట్టి మనం ఎప్పుడు ఇతరులను నిందించకుండా సిద్దపాటు కలిగి పాశ్చాత్తాపములో దేవుని చెంతకు తిరిగి రావాలి. 

2.  మనల్ని మనం మార్చుకోవాలి :-

ఇక్కడ రెండవ భాగంలో  అంజూరపు చెట్టు గురించి తెలియచేస్తున్నాడు. అయితే ఈ అంజూరపు చెట్టును యూదా ప్రజలకు ఉదాహరణగా తీసుకొనుచున్నాడు యేసు ప్రభువు లూకా 13:6 లో చూస్తే ఒకడు తన ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటించేను అంటున్నాడు. ఇక్కడ ద్రాక్ష తోట అంటే ఈ లోకములో ఉన్నటువంటి సమస్తమును సూచిస్తుంది. దేవుడు ఈ లోకములో ఉన్నటువంటిలో కెల్ల యూదా ప్రజలను ప్రత్యేకంగా ఎన్నుకోంటున్నారు. ఎందుకంటే వారికి సురక్షితమైన జీవితాన్ని ఇవ్వడానికి.  ఈ సురక్షిత జీవితం ద్వార వారు ఎప్పుడు దేవునికి వినయ విధేయత చూపిస్తూ, పండ్లు అను మంచి పనులను వారి నుండి  ఆశించాలనుకున్నాడు. కానీ వారు ఎప్పుడు వారి స్వార్ధం కోసమే జీవిస్తూ, దేవునికి దూరంగా వెళ్ళి పోతున్నారు. ఆది కాండం 2:1 లో ఈ విధంగా ఆకాశం భూమి సమస్త వస్తువులతో సంపూర్ణంగా  రూపొందెను అని తెలుపుచున్నాడు. ఇదంతా సృష్టించిన తరువాత దేవుడైన యావే ఏదేనులో తూర్పుగా ఒక తోట వేసి అందులో తాను సృజించిన నరుని ఉంచాడు. ఆదికాండం 2:8. వారు సంతోషముగా జీవించుటకు, తినుటకు  తియ్యని పండ్లనిచ్చు చెట్లను ఆ తోటలో పెరుగునట్లు చేశాడు. తరువాత నరుని సంతోషం కోసం స్త్రీని సృష్టించాడు.

 దేవుడైన  యావే వారిని సృష్టించిన తరువాత ఈ నేలపై అన్ని రకాలైన  మృగములను , పక్షులను సృజించి వాటిపై మానవునికి ఆధికారాన్ని కలుగజేశాడు. దేవుడు వారిని ఎంతో ప్రేమించి ముందుగా 1. ఈ లోకాన్ని సృష్టించి,2. సమస్త వస్తువులను రూపొందిచాడు, 3. వారు నివసించుటకు ఏదేను తోటను ఎన్నుకొన్నాడు. 4. ఆ తోటలో నరునికి నివాసం ఏర్పరిచాడు. 4. రుచికరమైన పండ్లనిచ్చాడు. 6. ఆయన సంతోషం కోసం స్త్రీని సృష్టించాడు,7. తరువాత వారికి అన్నింటిమీద ఆధికారం కల్పించాడు. 

దేవుడు ఇన్ని చేసిన కానీ దేవుడు చెప్పిన మాటకు విరుద్దముగా జీవించారు. వారిని తినవద్దని చెప్పిన పండును తిన్నారు. దీని ద్వారా వారిని ఆ తోట నుండి పంపివేస్తున్నాడు. 

మరి ఈనాడు సువిశేష పఠనంలో  దేవుడు అంజూరపు చెట్టు పై తన అసంతృప్తిని వ్యక్త పరుస్తున్నారు. తన తోట మాలితో ఇదిగో నేను మూడెండ్లనుండి ఈ అంజూరపు చెట్టు పండ్ల కొరకు వచ్చు చున్నాను. కాని నాకు ఏమియు దొరకలేదు అంటున్నాడు. దేవుడు దేవుడు ఎన్నోసార్లు మనం మారుమనస్సు పొందాలని ఎదురుచూశాడు కానీ మనం మాత్రం  మారు మనస్సు పొందకుండా  స్వార్ధపు జీవితాన్ని దూరంగా వేదలిపోతున్నాం. యోష 1: 2 లో చూస్తే " భూమి, ఆకాశములారా! వినుడు, నేను పెంచి పెద్ద చేసిన ప్రజలే నన్ను విడనాడిరి అంటున్నాడు. దేవుడు ఎంతో బాధతో ఆకాశము, పక్షులతో  మాట్లాడుతున్నారు. తనతో ఉండటానికి మానవుణ్ణి సృష్టిస్తే మనం మాత్రం  మన స్వార్ధం కోసం చూసుకుంటున్నాం. 

తరువాత వచనంలో  దీనిని నరికి వేయుడు (లూకా 13:7  )  ఇది వృధాగా భూమిని ఆక్రమించుట ఎందుకు అని అంటున్నాడు. 

అప్పుడు తోటమాలి తన యజమానికి ప్రార్ధన చేస్తున్నాడు. అయ్యా !ఇంకొక యేడు ఓపిక పట్టుడు అంటున్నాడు. పాత నిబందనలో చూసినట్లయితే అబ్రహాము గారు దేవుడు సొదొము, గోమోర్ర ప్రజల పాపం పెరిగిపోయినప్పుడు దానిని నాశనం చేయపునుకొనినప్పుడు అబ్రహాము గారికి దాని గురించి వివరించాడు. ఎందుకంటే, 1. సర్వ శక్తి వంతమైన ఒక మహా జాతి ఇతని వల్ల ఏర్పడుతుంది. 2. భూమండలమందంతట సకల జాతి జనులు దీవెనలు పొందుతారు. 

మరి ఆటువంటి వ్యక్తికి దేవుడు తన ప్రణాళికను తెలియజేస్తున్నాడు. అప్పుడు అబ్రహాము ప్రభువుకి ఆరు సార్లు ప్రార్దన చేయుచున్నాడు. వారికి శిక్ష ఎలాగైనా పడకుండా చూడాలని 50 మంది నుండి 45 కు చేశాడు, 45 నుండి 40 కి చేశాడు, 40 నుండి 30 కి, 30 నుండి 20 కి , 20 నుండి 10 కి చేసి వారిని ఎలాగైనా రక్షించాలని ఎంతో ధైర్యం చేశాడు. కానీ వారి పాపం వలన వారిని అగ్ని దహించి వేసింది. 

ఈనాటి సువిశేష పఠనంలో కూడా ఇలాంటి సన్నివేశాన్ని చూస్తున్నాం. యజమానుడు అనే యావే దేవుడు, తోటమాలి అనే యేసుప్రభువుకు అంజూరపు చెట్టు అనే జనాంగాన్ని యిచ్చియున్నాడు. ఎప్పుడైతే ఈ ప్రజలు దేవుడు చేసిన గొప్ప కార్యాలు మరిచిపోతూ ఇష్టానుసారంగా జీవిస్తూ హృదయ పరివర్తనం చెందకుండా పశ్చత్తాపపడకుండా దేవుని నుండి దూరమైపోతున్న వారికోసం ప్రార్థన చేస్తున్నాడు లూకా 13:8; అయ్యా ఇంకొక ఏడు ఓపికపట్టుడు నేను దీని చుట్టూ పాదుచేసి, ఎరువు వేసెదను అంటున్నాడు.

పాదుచేయటం అంటే యేసుప్రభువు మూడు సంవత్సరములు తన శ్రమలు, మరణము, మరియు పునరుత్తానముల ద్వారా ప్రతి ఒక్కరికి రక్షణ కలుగుతుంది అని తెలియజేసాడు.

దేవుడంటున్నాడు యెషయా 14:18 నేను మిమల్ని ఆనాధులుగా విడిచిపెట్టను. నేను మీ యొద్దకు వత్తును. మన దేవుడు ఫలభరితముగా ఉన్న మనల్ని ఎప్పుడు విడిచిపెట్టడు. ఆయనకు ఎప్పుడు అంటుకట్టుకొని జీవించు బిడ్డలుగా మారుస్తాడు.నేను ద్రాక్షావల్లిని మీరు నా కొమ్మలు. ఎవడు నాయందు ఉండునో, నేను వాని యందు ఉందును అతడు అధికముగా ఫలించును యోహాను 15:5.

ఎరువు వేయటం :-    

యేసుప్రభువు తన జీవితం ద్వారా మనకు దృఢతవాన్ని కలుగచేస్తునాడు. ఇది ఎలాంటి ఎరువు అంటే ప్రార్ధన అనే ఎరువు, ఉపవాసం అనే ఎరువు, ధన రుణ అనే ఎరువు, క్షమాపణ అనే ఎరువు, వినయం అనే ఎరువు, విశ్వాసం అనే ఎరువు.

ఇలాంటి ఎరువుల ద్వారా దేవుడు మనలో హృదయ పరివర్తన కలిగించి మనలను ఫలవంతముగా చేస్తుంటాడు. ఇలా ఫలవంతంగా మారిన మనము ఇతరులకు ఆహారముగా మారుతుంటాము. దీని ద్వారా ఇతరులకు మంచికార్యాలు  చేస్తూ దేవునికి సాక్షులుగా జీవిస్తుంటాం. ముందు చూపినట్లుగా కపట ప్రవర్తనను మార్చుకొని జాగరూకులై ఉంటూ ఈలోక సంబంధమైన వ్యక్తులకు, వస్తువులకు భయపడకుండా ఎన్నో శ్రమలు అనుభవించినాకూడా సిద్ధపాటు జీవితాన్ని కలిగి జీవిస్తూ దేవునికి బహిరంగ సాక్షులుగా జీవిద్దాం. ఆలా జీవించనిచో ఈ అంజూరపు చెట్టును ఏవిధంగానైతే ఫలించకపోతే కొట్టి పారవేస్తారో మన జీవితంకూడా అదేవిధంగా జరుగుతుంది.ఈ నాటి రెండొవ పఠనంలో కూడా పునీత పౌలుగారు అదే బోధిస్తున్నారు.

రెండవ పఠనము :-1 కొరింతు 10 : 1-6 , 10 - 12

మన పూర్వులు మేఘముక్రింద ఉండినపుడు వారు సముద్రమును దాటి సురక్షితముగా అవతలకి చేరారు కానీ  వారు ఎప్పుడైతే దేవునిమీద సణుగుకొని దేవునికి విరుద్ధముగా జీవించారో  విగ్రహములను ఆరాదించారో, వ్యభిచరించారో అప్పుడు 25 వేలు మంది మరణించారు. పాము కాటుతో ఎంతోమంది మరణించారు కాబట్టి ఈ చిట్టచివరి రోజులలో తపస్సు కాల రోజులలో ప్రార్ధన, ఉపవాసం, దాన ధర్మ క్రియలను పాటించు రోజులలో మనం దేవునితో, దేవుని సన్నిధిలో మనం మన నివాసాన్ని దేవునితో ఏర్పరుచుకొని, ఆయనకు వినయ, విధేయతను చూపిస్తూ జాగ్రత్తగా అయన యొక్క రక్షణ ప్రణాలికను మన సాక్షపు జీవితం ద్వారా తెలియజేయాలి అప్పుడే మన జీవితం ఫలవంతమవుతుంది.



బ్రదర్ . జోసెఫ్  మారియో ఓ.సి.డి.

12, మార్చి 2022, శనివారం

తపస్సు కాలం 2 వ ఆదివారం

తపస్సు కాలం 2 వ ఆదివారం

ఆది 15: 5-12, 17-18,  ఫిలిప్పి 3: 17,4: 1 , లూకా 9: 28-36.

-ఈ నాటి దివ్య పఠనాలు మన యొక్క రూపాంతరం గురించి భోదిస్తున్నాయి.
-మనం దేవునితో జీవించే సమయంలో మన యొక్క జీవితాలు కొంచెమైనా మారాలి. ఈ తపస్సు కాలం రెండవ వారంలో తల్లి శ్రీ సభ రూపాంతరం చెందమని కోరుతుంది.
-మన యొక్క ఉపవాస, ప్రార్థన, ధాన ధర్మాలు చేస్తూ మన జీవితాలు మార్చుకొంటూ దేవునికి దగ్గరై జీవించాలి.
-ప్రతి ఒక్కరు ఏదో ఒక విధంగా తమ జీవితంలో మార్పును కోరుకుంటారు, కావాలనుకుంటారు.
-మనయొక్క జీవితాలు రూపాంతరం చెందాలంటే మనలో దైవాను గ్రహం ఉండాలి. దైవాను గ్రహం మనలోకి రావాలంటే మనం దేవుడ్ని విశ్వసించాలి. దేవుడ్ని వెంబడించి జీవించాలి. అదే విధంగా పవిత్రాత్మ దేవునికి మనం సహకరించుకొని జీవిస్తే మన జీవితాలు నిజంగా రూపాంతరం చెందుతాయి.

-ఈ నలభై రోజులు ధీక్షాకాలా సమయంలో మనం కూడా ఏదో ఒక విధంగా రూపాంతరం చెందాలి. బహుశా ప్రార్థించుటలోనో, విశ్వసించుటలోనో, చదువుటలోనో, బాధ్యత కలిగి జీవించుటలోనో ఏదో ఒక విధంగా మనం మారాలి.
-గొంగళి పురుగు గూడులో ఉండి కొన్నిరోజుల తరువాత సీతాకోక చిలుక అయినా విధంగా విశ్వాసులుకూడా రూపాంతరం చెందితే దేవుడు ఆనందిస్తారు.

ఈ నాటి మొదటి పఠనంలో దేవుడు అబ్రామును, అబ్రహాముగా మార్చుటను అదేవిధంగా అబ్రహాముతో చేసుకొన్న మొదటి ఒడంబడికను గురించి భోదిస్తుంది.
-దేవుడు ఎప్పుడు కూడా ప్రజలకు చేరువలోనే ఉంటారు. మానవుడు దేవుడ్ని విస్మరించి తప్పు చేసినప్పటికీ మళ్లీ మానవులతో సంబంధం కలిగి ఉండుటకు వారితో ఒడంబడికను చేసుకొంటున్నారు.

-అబ్రహాము కు దేవుడు ప్రత్యక్షమై తనకు సంతానం కలుగుతుందని చెప్పుచున్నారు.
-అబ్రహామునకు వయస్సు మల్లినది ముసలి ప్రాయంలో వున్నారు. అతని భార్య కూడా గొడ్రాలుగ ఉన్నారు. ఎన్నో సంవత్సరములు సంతానం కోసం ఎదురు చూశారు. కానీ ఫలితం దక్కలేదు.
-యావే దేవుడు అబ్రహామునకు దర్శనమిచ్చి నీకు ఆకాశమునందలి నక్షత్రములవలె, సముద్ర తీరమునందలి ఇసుకరేణువులవలె సంతానం కలిగి వృద్ధి చెందుతావు అని వాగ్దానం చేస్తున్నారు.
-ఆయన యొక్క జీవితాన్ని వృద్ధి చెందిస్తానని, వారికి కానాను దేశమును ఇస్తానని వాగ్దానం చేస్తున్నారు.

-అబ్రహాము వాస్తవానికి అన్యుడు అయినప్పటికీ యావే దేవుని యొక్క మాటలు విశ్వసించారు. ఎటువంటి అనుభవం లేనప్పటికిని, అసంభవంగా ఉన్నప్పటికినీ అబ్రహాము  దేవుడ్ని నమ్ముచున్నారు.  
-అబ్రహాము దేవుని యొక్క మాటలను పూర్తిగా విశ్వసించారు అందుకే ఆయనను విశ్వాసులకు తండ్రి అని పిలుస్తాం. ఆయన విశ్వాసమును బట్టియే నీటి మంతుడుగా పరిగణించ బడుతున్నారు .
-దేవుడు అబ్రహం తో చేసుకొన్న ఒడంబడిక బలమైనది అని తెలుపుటకు కొన్ని జంతువులను నడిమికి కోస్తున్నారు, వాటిని ప్రక్క ప్రక్కన పెడుతున్నారు. 

-ఆ కాలపు నియమాల ప్రకారం ఒప్పందం చేసుకొనేవారు నరకబడిన జంతువులమధ్య నడుస్తారు. అలా ఎందుకు చేసేవారంటే ఒక వేళా ఎవరైనా ఒప్పందం కు అవిధేయులై, మరిచి పోయి జీవిస్తే వారికి కూడా అలంటి దుస్థితి వస్తుందని వారియొక్క ఆచార నమ్మకం.
-ఇదే సాంగ్యం యొక్క విధానం యిర్మీయా 34: 18 - 19 లో కూడ చదువుతున్నాం.
-దేవుడు అబ్రహాం యొక్క విశ్వాసాన్ని, ఒడంబడికను బలపరచడానికి ఆ మామాసపు ఖండలు నిప్పుతో కదిల్చారు. ఆ యొక్క నిప్పు దేవుని యొక్క సాన్నిధ్యంకు గుర్తు.
-ఈ మొదటి పఠనంద్వారా అబ్రహాం దేవుడి మీద ఉన్న గొప్ప నమ్మకమును వెల్లడిచేస్తున్నారు. ఆది 15 : 6 .

-ఈ యొక్క ఒడంబడిక ద్వారా దేవుడు అబ్రామును అబ్రహాముగా మార్చుతున్నారు.  పేరు మార్చుట ద్వారా అబ్రహాము దేవునితో ఒక క్రొత్త జీవితమును ప్రారంభిస్తున్నారు.
-అబ్రహాము దేవునియొక్క సాన్నిధ్యమును కనులార అగ్నిరూపంలో చూడగలుగుతున్నాడు. దేవుని యొక్క అనుభూతిని తన జీవితంలో పొందుకుంటున్నారు.

- మన యొక్క విశ్వాస జీవితంలో కూడ మనం దేవుడ్ని విశ్వసించాలి అబ్రహాము వలె దేవునితో క్రొత్త జీవితం ప్రారంభించాలి, దేవునితో చేసుకొన్న ఒడంబడిక ప్రకారం జీవించాలి.
-అబ్రహాము కూడ దేవుని యొక్క కార్యం ఎలాగ జరుగునని ఒక వివరణ అడుగుచున్నారు. అబ్రహాము వలె మరియ తల్లి కూడ దేవుని యొక్క జన్మం గురించి ఎట్లా జరుగును అని అడిగారు. వీరిద్దరియొక్క ఆలోచనలకు తగిన విధంగా దేవుడు వారికి అంతా విశిదీకరిస్తున్నారు. ఇద్దరుకూడా దేవుడ్ని సంపూర్ణంగా నమ్మినవారే.

-ఈనాటి రెండవ పఠనంలో పునీత పౌలు గారు మనందరం పరలోక పౌరులమని గుర్తు చేస్తున్నారు. 
-భూలోక సంభందమైన విషయాల గురించి కాకుండా పరలోక సంభందమైన విషయాలు ఆలోచిస్తూ వాటి ప్రకారం జీవిస్తే మర్త్య శరీరములైన మన శరీరములను దేవుడు దివ్య శరీరం లుగా మార్చుతానని పౌలు గారు బోధిస్తున్నారు.
-మన యొక్క మర్త్య శరీరంలు వాటంతట అవే దివ్య శరీరములుగా మారవు పవిత్రాత్మ శక్తితోనే అది సాధ్యమవుతుంది.
-మన యొక్క శరీరాలు దివ్య శరీరాలుగా మార్చ బడాలంటే మనం శరీరం కు తగిన విధంగా కాకుండా ఆత్మకు తగిన విధంగా నడుచుకోవాలి. శారీరక వాంఛలకు దాసులు కాకూడదు అందుకు మనం పవిత్రాత్మ సహవాసం లో జీవించాలి. 

-జ్ఞానస్నానం ద్వారా మనం పవిత్రతను పొందాము ఇంకా పరిపూర్ణం గా పవిత్రులు కావాలంటే అనుదినం ప్రయత్నిఇంచాలి.
-పౌలు గారు అనేక మార్లు విశ్వాసులకు తెలియ చేస్తున్నారు. శరీరాను సారంగా కాకుండా ఆత్మను సారంగా జీవించమని .రోమి 8 : 5 -13 , గలతి 5 : 16 .

మన యొక్క జీవితంలో ఆత్మను సారంగా జీవిస్తే దేవున్ని సంతృప్తి పరచవచ్చు. పరలోక పౌరులు పరలోక ఆలోచనలు కలిగి జీవించాలి.
-మనం పరలోక పౌరులం అని మరిచి పోతున్నాం. ఈ లోకంలో ఉన్నప్పటికీ మనం దేవుని యొక్క వాకు అనుసారంగా జీవించటానికి ప్రయత్నఇంచాలి. 
-ఇహలోక దేహ వాంఛలకు లోనైనా వారు పరలోక రాజ్యంలో ప్రవేశించరు.
-ఆదాము అవ్వ తమ యొక్క దేహ వాంఛలను తృప్తి పరుచుకొన్నారు (తినవద్దన్న పండు తిన్నారు). పరలోకం గురించి మరిచి పోయారు. దేవుడిని సంతృప్తి పరచలేదు.
-లోభియెక్క ఉపమానంలో లూకా 12 :13 -21. ఈలోకమే శాశ్వతం అని భావించి తన ఆత్మతో తాను మాట్లాడుతూ తినుము త్రాగుము అని చెప్పుకొంటున్నారు. ఈ లోకం కన్నా పరలోకం విలువైనది అని మరిచిపోతున్నాడు. 
 
-మనం కూడ ఈ లోకంలో పేరు ప్రతిష్ఠలకోసం, ఆస్తిపాస్తుల కోసం కొట్టు మిట్టాడుతున్నాం, కానీ పరలోక పౌరులం కాబట్టి పరలోకంలో ప్రవేశించాలంటే పుణ్య కార్యాలు చేయాలనే అంశం మరిచిపోతున్నాం.

-దేవుని బిడ్డలుగా పవిత్రులుగా, పరలోకం పౌరులుగా మారాలంటే యేసు ప్రభువు చూపిన ఆ నీతి మార్గంలో మనందరం నడవాలి.
-మానవ శక్తితో ప్రయత్నిస్తే మనం చాల సార్లు శరీరమునే సంతృప్తి పరుస్తాం. కాబట్టి దేవుని యొక్క శక్తితో నడిచి పరలోకానికి వెళదాం.

ఈనాటి సువిశేష పఠనంలో యేసు ప్రభువుయొక్క రూపాంతరం చెందుటను మనం చదువుకున్నాం. 
-యేసుప్రభువు యొక్క దివ్య రూప ధారణ వలన తండ్రి దేవుడు యేసుప్రభువు తన యొక్క ప్రియమైన కుమారుడని తెలుపుచున్నారు. ఆయన యొక్క దైవత్వం ప్రకటిస్తున్నారు.
-దివ్య బలిపూజలో గోధుమ అప్పం, ద్రాక్షా రసము యేసుప్రభువు యొక్క శరీర రక్తలుగా రూపాంతరం చెందుతున్నాయి.

-జ్ఞానస్నాన దివ్య సంస్కారం మనల్ని దేవునియొక్క పుత్రులుగా రూపాంతరం చెందిస్తుంది.
-పాప సంకీర్తనం ద్వారా పాపి పవిత్రుడయ్యెలా చేస్తుంది, వ్యక్తి మార్పు చెందుతున్నారు. వారి జీవితం మరి గొప్పవారిగా చేయబడుతున్నారు.
-దేవుడిని కలుసుకున్న సమయాలలో ప్రతి ఒక్కరి జీవితం రూపాంతరం చెందుతుంది.

మోషే జీవితం రూపాంతరం చెందుతుంది.
సౌలు జీవితం
పేతురు యొక్క జీవితం
మగ్దలా మరియమ్మ జీవితం.
-ఇంకా చాలామంది యొక్క జీవితాలు మారుతున్నాయి.

-మన జీవితంలో కూడ యేసు ప్రభువు వలె పర్వత అనుభూతి కావాలి.
-తూర్పు దేశంలో ఆధ్యాత్మికత లో ఒక ప్రత్యేక స్థానం ఉంది.
-దేవునితో గడపటానికి, దేవుని యొక్క సాన్నిధ్యం అనుభవించటానికి అదేవిధంగా దేవునితో ఆత్మీయ అనుభూతిని పొందడానికి ఎత్తైన పర్వతాలు సరైన ప్రాంతం అని కొందరి యొక్క విశ్వాసం, నమ్మిక అందుకే పర్వతాల మీదకు వెళుతుంటారు. 
-దేవుడు ఉన్నత స్థలంలో నివసిస్తున్నాడని కొందరి యొక్క నమ్మకం. కొన్ని శతాబ్దాలుగా ఈ నమ్మకం కొనసాగుతూనే ఉంది చాల మంది విశ్వాసులు దీనిని అనుసరిస్తున్నారు. కొండను ఎక్కి వెళ్ళటం ద్వారా దేవునికి మరింత దగ్గర అవుతామని కూడ కొంతమంది భావించేవారు. 
-పర్వతం పైన వున్న చల్లని వాతావరణం, గాలి, ప్రశాంతత కూడ దేవుడిని కలుసుకొనుటకు ఉపయోగపడును.

-పవిత్ర గ్రంధంలో కొన్ని సంఘటనలున్నాయి. దేవుడు మనుషులను కొన్న సమ్యలు.
మోరియా పర్వతం వద్ద అబ్రహాము దేవుడిని కలుసుకున్నారు.(ఆది 22 :11 -12 ).
సీనాయి పర్వతం పైన మోషే దేవుడిని కలుసుకున్నారు (నిర్గమ 24 :12 -18).
కార్మెల్ కొండమీద ఏలీయా దేవుడిని కలుసుకున్నారు (1 రాజులు 18: 31 -41).
తాబోరు కొండమీద శిష్యులు దేవుడిని కలుసుకున్నారు.
కల్వరి కొండమీద యేసు ప్రభువు నిజమైన దేవుడని సైనికుడు గ్రహిస్తూ ఆయన్ను కలుసుకున్నారు. 
-యేసు ప్రభువు యొక్క మరణం తరువాత కూడ శిష్యులు పర్వతం వద్దకు వెళ్లారు అని కొందరి నమ్మకం. 

మనం చుసిన అన్ని ఉదాహరణాలలో అందరూ పర్వతం ఎక్కిన తరువాతనే దేవుడు వారిని కలుసుకుంటున్నారు. 
-మనయొక్క విశ్వాస జీవితంలో కూడ 
పవిత్రత అనే పర్వతం ఎక్కాలి.
మంచితనం అనే పర్వతం ఎక్కాలి.
స్వార్థం విడిచి ముందుకు సాగాలి.
ప్రేమని అలవర్చుకుని పర్వతం ఎక్కాలి. 
శోధనలు అనే పర్వతం ఎక్కాలి. 
శ్రమలు అనే పర్వతం ఎక్కాలి.

-ఎప్పుడైతే మనం ఇహలోక కోరికలు, శోధనలు అధిగమించి మంచిగా ప్రార్థన చేసుకుంటూ దేవుని యొక్క మాట ప్రకారం ఆయనకు విధేయత చూపుతూ ఆయనయొక్క ఆజ్ఞలు పాటిస్తామో అప్పుడు మనకు దేవుని దర్శనం, అనుభూతి కలుగుతుంది. ప్రయత్నం చేసినవారందరు పర్వతం ఎక్కలేరు కేవలం కష్టపడి, అన్ని ఇబ్బందులను అలసటలను ఎదుర్కొని వెళ్లే వారే  ఎక్కగలరు. 
-పర్వతం ఎక్కే సమయంలో జాగ్రత్తగా ఉండాలి, కష్టపడాలి, అలిసిపోతాం, అయినా సరే ముందుకు వెళితే దైవ అనుభూతి కలుగుతుంది. మనయొక్క విశ్వాస జీవితంలో కూడ దైవ అనుభూతి కావాలంటే ఆధ్యాత్మికంగా మనం కష్టపడాలి. ఈలోక ఆశలు విడిచి పెట్టడానికి కష్టపడాలి, శోధనలలో పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి . అప్పుడే మనం దేవుడిని కలుసుకొనగలం.

-యేసు ప్రభువు తాబోరు పర్వతం ఎక్కినది తండ్రిని కలుసుకొనుటకు తండ్రి చిత్తమును సంపూర్ణంగా నెరవేర్చుటకు కావల్సిన శక్తిని, ధైర్యం ను పొందుటకు అలాగే తండ్రి యొక్క సమ్మతి తీసుకొనుటకు ఆయన పర్వతం మీదకు వెళ్లుచున్నారు.

-వ్యక్తిగతంగా తనను తాను సిద్ధం చేసుకొనుటకు, ప్రార్థించుటకు ప్రభువు పర్వతం మీదకు వెళ్లారు.
-తపస్సుకాల మొదటి ఆదివారంలో యేసుప్రభువు మానవ స్వభావంలో ఎదుర్కొన్న విషయాలు మనం నేర్చుకున్నాం. ఈ రెండవ వారంలో యేసుప్రభువు యొక్క దైవత్వంను ధ్యానించుకోవాలి.  ఆయన నిజముగా దేవుని కుమారుడని తెలుసుకోవాలి.

-ప్రభువు శిష్యుల యొక్క విశ్వాసాన్ని బలపరుస్తున్నారా. ఆయనయే వారు ఊహించే మెస్సయ్య అని ఎరుక పరుచుచున్నారు. యేసు ప్రభువు పేతురు, యోహాను, యాకోబులను ఎందుకు పర్వతంకు తీసుకొని వెళుతున్నారంటే ఇద్దరు లేక ముగ్గురు చెప్పే సాక్ష్యం నిజమవుతుందని. (ద్వితీ 19 : 15 ) అంటే ఒక విషయాన్ని నిరూపించాలంటే ఇద్దరు లేక ముగ్గురు సాక్షులవసరం . అందుకే ప్రభువు ముగ్గురిని తీసుకొని వెళుతున్నారు. ఆయన యొక్క దివ్య రూప ధారణకు వారే సాక్ష్యులు.

-యేసు ప్రభువు ప్రార్థించే సమయంలో రూపాంతరం చెందుతున్నారు. మనయొక్క జీవితాలు కూడ ప్రార్థనలో రూపాంతరం చెందాలి.
-ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆనాటి యూదులు యొక్క నమ్మకం అలాగే పౌలు గారి యొక్క భోదన ఏమిటంటే నీతిమంతులు యొక్క శరీరాలు దివ్య శరీరములుగా మారె అవకాశం ఉందని తెలుపుచున్నారు. (1 కొరింతి 15 :49 , 2 కొరింతి 5 : 1 -10 ).

-నీతిమంతులు దేవుని యొక్క మహిమను పంచుకొంటారు. మోషే 40 రోజులు దేవునితో గడిపిన తరువాత ఆయన మహిమను పంచుకొంటున్నారు. (నిర్గమ 34 )
-మనం కూడ నీతిమంతులుగా జీవించాలి, అదియే దేవుడు మన నుండి కోరుకుంటారు.
-యేసుప్రభువు వస్త్రాలు తెల్లగా వున్నాయి. అవి ఆయన యొక్క పవిత్రతకు గుర్తు కాబట్టి.
-మోషే, ఏలీయాలకు కూడ పర్వతం మీద దేవుని యొక్క అనుభూతి కలిగినది అందుకే వారిద్దరూ అక్కడ దర్శనంలో కనిపించారు. 

-మండుచున్న పొదలో దేవుడు మోషేకు దర్శనం ఇచ్చారు, నిర్గమ 3: 1 -4.
-సీనాయి పర్వతం మీద దేవునితో గడిపారు. దేవునితో ఉన్నప్పుడు ఆయన ముఖం ప్రకాశించింది.(నిర్గమ 24 :1 , 34 : 29 ).
-ఏలీయా హోరేబు కొండవద్ద కలుసుకున్నారు (1 రాజు 19: 9 -18).
-మోషే అలాగే ఏలీయాలు ఇద్దరు గొప్ప ప్రవక్తలు ఎందుకంటే మోషే దేవుని వల్ల వారికి ధర్మ శాస్త్రమును ఇచ్చారు. ఏలీయా ప్రవక్తలందరికి నాయకుడు వంటివారు అందుకే యేసు ప్రభువు యొక్క సిలువ శ్రమలు పొందటానికి సరైన సమయం అని తెలియచేయుటకు ఇద్దరు కనబడుచున్నారు.

-ఈ దర్శనంలో తండ్రి దేవుడు ఇతడు నా ప్రియమైన కుమారుడు ఇతడిని ఆలకించండి అని పలుకుచున్నారు.
-ఆయన స్వరమును ఆలకించి జీవిస్తే మన జీవితాలు సంతోషంగా ఉంటాయి. ఆయన మాటలు వినక పొతే మన జీవితంలో ఆధ్యాత్మిక ఎదుగుదల ఉండదు.
-పవిత్ర గ్రంధంలో కొంతమంది దేవుని స్వరం విన్నారు. కొందరు వినలేదు, వారికి చివరి ఫలితం ఎలావుంటుందో కూడ మనకు తెలుసు కాబట్టి ఆయన మాటలు వినాలి.

-మనయొక్క జీవితంలో మరి ముఖ్యంగా ఆధ్యాత్మిక జీవితంలో మనం దినమూ రూపాంతరం చెందాలి. ఈ తపస్సు కాలంలో మన జీవితాలు దేవునికి ఇష్టమైన విధంగా మారాలి. 
మనం మన యొక్క పాపపు జీవితం నుండి రూపాంతరం చెందాలి 
స్వార్థంనుండి, నిస్వార్థిగా రూపాంతరం చెందాలి.
లోక వ్యామోహాలనుండి దేవుని వైపుకు రూపాంతరం చెందాలి. 
అధికార వాంఛలనుండి, సేవా భావమునకు రూపాంతరం చెందాలి.
అసూయా, ద్వేషం నుండి ప్రేమించుటకు రూపాంతరం చెందాలి.
ప్రార్థించుటలో, ప్రేమించుటలో రూపాంతరం చెందాలి.
-దేవుని యొక్క అనుగ్రహం తో రూపాంతరం చెంది దేవునికి మనయొక్క తల్లిదండ్రులకు సంతోషమును ఇద్దాం.

REV. FR. BALA YESU OCD

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...