25, ఫిబ్రవరి 2023, శనివారం

 తపస్సుకాలపు మొదటి ఆదివారము

ఆది 2:7-9,3:1-7

రోమా 5:12-19

మత్త 4:1-11.

ఈనాడు మన తల్లియైన తిరుసభ మనలనందరిని కూడా తపస్సుకాలములోకి ఆహ్వానిస్తుంది. అయితే,

తపస్సు కాలము అనగా దేవుని చెంతకు మరలి వచ్చు కాలమని , హృదయ పరివర్తనా కాలమని,

పచ్చాతాపకాలమని మనల్ని మనము తయారు చేసుకొని సిద్ధపడే కాలం అని అంటాం. ఈ కాలములో ఆ దేవాతి

దేవుని శక్తిని స్వీకరించుటకు ఏసుప్రభు వలే ఉపవాసము, ప్రార్థన మరియు దానధర్మములతో మనలను మనము

తయారు చేసుకోవాలి.

ఈనాడు మన తల్లియైన తిరుసభ నాలుగు విషయాలను ధ్యానించమని మనందరినికూడా ఆహ్వానిస్తుంది.

1.యేసుప్రభువు పవిత్రాత్మతో పరిపూర్ణుడై ఆత్మ ప్రేరణ వలన ఎడారి ప్రదేశమునకు కొనిపోబడును.

2. ఎందుకు ఏసుప్రభువు ఎడారికి కొనిపోబడును?

3. క్రీస్తుకు శోధనలు దేనికి?

4.శోధనలపై విజయము సాధించిన క్రీస్తు ప్రభువు.

మొదటిగా,

1.యేసుప్రభువు పవిత్రాత్మతో పరిపూర్ణుడై ఆత్మ ప్రేరణ వలన ఎడారి ప్రదేశమునకు కొనిపోబడును:


 ఏసుప్రభువు యొక్క జన్మము నుంచి మరణం వరకు పరిశుదాత్మతో నింపబడి ఉండటం

చూస్తున్నాం.

గాబ్రియేలు దూత మరియమ్మతో పలికిన పలుకులు పవిత్రాత్మ నీపై వేయించేయును

సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని

పిలవబడును.

 లూకా2:40 బాల యేసు పెరిగి దృడకాయుడై పరిపూర్ణ జ్ఞానము కలవాడు ఆయన దేవుని

అనుగ్రహము ఆయనపై ఉండెను. బాల యేసు దేవాలయములో సమర్పణ సమయంలో సన్నివేశం.

 బాల యేసు 12 ఏళ్లు వయస్సు గలవాడైనప్పుడు జ్ఞానమందును ప్రాయమందును వర్ధిల్లుచు

దేవుని అనుగ్రహమును, ప్రజల ఆదరాభిమానములను పొందుచుండెను.


 యొర్దాను నదిలో యేసుప్రభువు బాప్తిస్మము సమయంలో, పవిత్రాత్మ పావురము రూపమున

ఆయనపై దిగివచ్చెను. ఆ సమయమున నీవు నా ప్రియమైన కుమారుడవు నిన్ను గూర్చి నేను

ఆనందించుచున్నాను అని ఒక దివ్యవాణి వినిపించెను.

2. ఎందుకు ఏసుప్రభువు ఎడారికి కొనిపోబడును?

ఇశ్రాయేలు సాంప్రదాయం ప్రకారం ఎడారి దేవుని కలుసుకునే తావు, శోధనలకు గురయ్యే ప్రదేశం.

 క్రీస్తు ముందు ఇశ్రాయేలు ప్రజలు 40 ఏళ్ల పాటు ఎడారిలో ప్రయాణం చేశారు. ఈ కాలంలోనే మోషే 40

రోజులపాటు ప్రార్థనలతో ఉపవాసములతో సీనాయి కొండమీద ఏకాంతముగా గడిపారు.

 ఏలియా ప్రవక్త కూడా 40 రోజులు ఎడారి గుండా నడిచిపోయి హోరేబు కొండ చేరుకుని అక్కడ దైవ

సాక్షాత్కారం పొందాడు.

వీరిలాగే ఏసు కూడా ఎడారిలో దైవసాక్షాత్కారం కలిగించుకోబోతున్నాడు. అంటే తాను దేవుని కుమారుడని

సైతానుకు తెలుసు. ఇంకా ఎడారి నిలయం కూడా. దేవుని మొదటి కుమారుడు ఇశ్రాయేలు ప్రజలను, పిచాచి

ఎడారిలో శోధించింది.వారు దానికి లొంగిపోయారు కూడా. క్రీస్తు దేవుని ఏకైక కుమారుడు, ఈ కుమారుని కూడా

సాతాను ప్రలోభ పెట్టింది కానీ మొదటి కుమారుడు పడిపోయాడు, కానీ ఈ ఏకైక కుమారుడు సైతానుపై విజయం

సాధించాడు.మరియు తన పూర్వికుల పాపాలకు పరిహారం కూడా చేశాడు.

3. క్రీస్తుకు శోధనలు దేనికి?

పాపం ఏ మాత్రం సోకని పావన మూర్తి క్రీస్తు. మరి అతడు శోధన గురి కావడం దేనికి? ఈ శోధన

అనుభవించింది తన కోసం కాదు పాపులమైన మన కోసం. అతడు నూతన మానవజాతికి శిరస్సు, నాయకుడు.

తరువాత మానవులు శోధనకు గురి అవుతారు. కనుక తాను ఈ నరుల తరపున ముందుగానే శోధనను

ఆహ్వానించాడు. వాటి మీద విజయం సాధించాడు కూడా. అప్పటినుండి మన నాయకుని విజయం మన శోధనను

ఎదుర్కొనేటప్పుడు క్రీస్తు విజయం మన మీద సోకి మనకు గెలుపును దయచేస్తుంది.

4.శోధనలపై విజయము సాధించిన క్రీస్తు ప్రభువు:

4.1. భోజనం ప్రీతి:

“సైతాను యేసుతో నీవు దేవుని కుమారుడవైనచో అనే అనుమానం విత్తనం నాటుతుంది".

“మానవుడు కేవలం రొట్టెవలనే జీవింపడు, దేవుని నుండి వచ్చు ప్రతి వాక్కు వలన జీవించును” అని

దేవుడు ఎందుకు పలికాడు. ఎందుకంటే ఏసుప్రభువుకు రాళ్లను రొట్టెగా మార్చడం సాధ్యమే కానీ, ఇలా చేస్తే

ఏసుప్రభువు ఒక రొట్టెచేసేవాడైపోతాడు. ఏసుప్రభు ఈ లోకానికి వచ్చినది మనిషి పొట్టను రొట్టెతో నింపడానికి కాదు,


కానీ పాపములో పడిపోయిన మనుషులను రక్షించడానికి, మరియు వారి ఆత్మలను తన యొక్క దివ్య శరీర

రక్తంతో తృప్తి పరచడానికి. ఇలాంటి శోధనని మొదట ఎడారిలో ప్రయాణం చేస్తున ఇశ్రాయేలు ప్రజలకు కూడా

తెచ్చిపెట్టింది సైతాను. అక్కడ వారు సైతానుకు లొంగిపోయారు. కానీ క్రీస్తు ఇక్కడ సైతానుపై విజయం సాధించాడు.

మరియ మొదటి పఠనంలో కూడా అవ్వ భోజనం మీద ప్రీతితో దేవుడు తినవద్దన్న పండును తిన్నది. దాని

ద్వారా పాపం కట్టుకున్నది,మరణమును చవిచూచింది. మన క్రైస్తవ లేక విశ్వాసపు జీవితములలో శరీరానికి

ఆహారము ఎంత అవసరమో మన ఆత్మకు దేవునియొక్క వాక్కు కూడా అంతే అవసరము. ఈ వాక్కు ద్వారానే

మనము రక్షింపబడుతున్నాం. ఎందుకంటే ఈ వాక్కు ఎవరో కాదు సాక్షాత్తు ఆ దేవాతి దేవుడైన యేసుప్రభువు.

మన యేసు ప్రభువు ఎలాగయితే ఈ ఆహారముపై ఎక్కువగా మొగ్గుచూపకుండా తన తండ్రి ఇచ్చిన వాక్కును

పరిపూర్ణము చేస్తున్నాడో, మనము కూడా అలాగే జీవించాలి. అప్పుడే, ఆ సైతానును మనము సులువుగా

జయించగలము.


4.2.విగ్రహారాధన:

సైతాను క్రీస్తు ప్రభువుతో ప్రపంచంలోని రాజ్యాలను నీకు ఇస్తాను, కానీ నీవు నన్ను ఆరాధించాలి. అని

ఎప్పుడయితే పలికినదో అప్పుడు క్రీస్తు, "దేవుడైన ప్రభువును ఆరాధించి ఆయనను మాత్రమే సేవించవలెను" అని

చెప్పారు. అంటే పాపంతో నిండి ఉన్న వారి జీవితాలు, రాజ్యాలు క్రీస్తుకు వద్దు.కానీ మారుమనస్సు పొందిన

జీవితాలు క్రీస్తుకు కావాలి. దానికి క్రీస్తు శ్రమలు, సిలువ మరణం ,తన పునరుద్ధానం ద్వారా నెరవేరుతుంది.

ఇశ్రాయేలు ప్రజలు ఆనాడు బంగారు దూడను తయారు చేసి, దానిని పూజించడం మొదలుపెట్టారు. దీని ద్వారా

వారు పాపం కట్టుకుని దేవుని ఆజ్ఞలకు విరుద్ధముగా జీవించి ఆయనతో స్నేహ సంబంధాన్ని కోల్పోయారు.

మొదటి పఠనంలో కూడా, పాము చెప్పినట్లు, ఆది తల్లిదండ్రులు మంచి చెడులు తీసుకొని వారు దేవునిగా

మారాలని అనుకున్నారు. దీని ద్వారా పాపం కట్టుకున్నారు.


4.3. దేవుని పరీక్షకు గురి చేయటం:

సైతాను ఏసుప్రభుతో "నీవు దేవుని కుమారుడ వైనచో,క్రిందికి దూకు. ఏలయన, నిన్ను రక్షింప దేవుడు తన

దూతలను పంపిస్తాడు". ఏసుప్రభు సమాధానం: "ప్రభువునైన నీ దేవుని శోధించరాదు" అని సమాధానం

చెప్పారు. ఇశ్రాయేలు ప్రజలకు దాహం వేసినప్పుడు పిచాచి ఆలోచనలతో మోషే మీద తిరగబడ్డారు. ఇజ్రాయిల్

ప్రజలు అనుకున్నారు, దేవుడు కనుక మనతో ఉంటే ఈ యొక్క కష్టాలు మనకెందుకు వస్తాయి అని దూషించి

పాపము కట్టుకున్నారు. మరి మొదటి పఠనంలో కూడా మనం చూస్తున్నాము, ఆది తల్లిదండ్రులతో, మీరు

తినకూడదు అన్న పండును వారు తిని, దేవుని ప్రేమకు దూరమయ్యి పాపము కట్టుకున్నారు. కానీ,

యేసుప్రభువు మాత్రము తన తండ్రి యందు అచంచలమైన నమ్మకముకలిగి ఎటువంటి పరీక్షకుకూడా


గురిచేయలేదు. ఎందుకంటే, ఆయన తన తండ్రియందే ఆధారపడి జీవించాడు కాబట్టి. కానీ, మనము మాత్రము,

ఈలోక ఆశలకు ఆశయాలకు బానిసలమవుతూ ఆదేవాతి దేవుని ప్రేమను అర్ధం చేసుకోకుండా మన ఇష్టానుసారం

జీవిస్తూ, ఇష్టమొచ్చిన దేవుళ్లను కొలుస్తూ ఆయనకు అయిష్టముగా జీవిస్తూ, ఆ దేవాతి దేవున్నే పరీక్షకు

గురిచేస్తున్నాము. కాబట్టి, మనము ఆయనయందు మాత్రమే విశ్వాసము కలిగి ఆయనను పరీక్షకు

గురిచేయకుండా విశ్వాసవంతులుగా జీవించాలి.

పునీత పౌలు గారు చెబుతున్నాడు, "దేవుని నుండి నర జాతి పుట్టింది ఆదాము, క్రీస్తు మొదటి మనిషి

ఆదాము ఊపిరి పోసుకున్నవాడు అయ్యాడు. రెండవ మనిషి క్రీస్తు ఊపిరి పోసేవాడు. మొదటి ఆదాము కు

మరణము ఉంది. చివరి ఆదాముకు అంతం లేదు. ఎందుకంటే, ఈ చివరి ఆదాము నిజంగా మొదటి ఆదాము.

ఆయనే స్వయంగా తనను తానే ఆదియు, అంతము అని తెలియజేసాడు . మానవుడు దేవుని వలె మారాలన్న

కోరిక నాశనమునకు, మరణానికి దారి తీసింది .

ఆదాము పాపము అందరి శిక్షకు కారమైనట్లు, ఒక్కని నీతిమంతమైన క్రియ అందరికీ విముక్తి ప్రసాదించి

వారికి జీవమును అనుగ్రహించుచున్నది. ఆ ఒక్క మానవుని అవిధేయత ఫలితముగా అనేకులు పాపాత్ములుగా

చేయబడినట్లే ఒక్క మానవుని విధేయత ఫలితముగా అనేకులు నీతిమంతులగుదురు.

ప్రతిమానవుని జీవితములో శోధనలను జయించాలి అంటే ప్రార్ధన ఎంతో అవసరము. ఈ ప్రార్ధన ద్వారానే

మనము సైతాను శోధనలను జయించగలము, ఇంకా దేవుని చేరగలము. మానవుడు శరీరము, ఆత్మచేత

సృష్టింపబడ్డాడు. మనము శోధనలో పడనివ్వకండి అని తండ్రి దేవునికి ప్రార్ధన చేస్తున్నాం. ఎందుకంటే నీ సంపాదన

చోటనే నీ హృదయం కూడా ఉంటుంది ఎవరు ఇద్దరు యజమానులను సేవింపలేరు. మనము ఎప్పుడయితే

ఆత్మవలన జీవిస్తామో అప్పుడే ఆ ఆత్మ వలన నడిపింపబడతాం.

పవిత్రాత్మతో ఏకీభవించడం వల్ల తండ్రి మనకు శక్తినిస్తాడు. ఏ పరీక్ష మనలను అధిగమింపలేదు. దేవుడు

విశ్వాసపాత్రుడు నీ శక్తిని మించి శోధనకు గురికానీయడు. శోధనతో పాటు తప్పుకొనేమార్గాన్ని కూడా

సమకూర్చుతాడు. అందువల్ల ప్రార్ధన, ఉపవాసము మరియు దానధర్మములు ద్వారానే మనకు శోధనలు

ఎదుర్కొనే శక్తి లభిస్తుంది. అంతటి పోరాటం, అలాంటి విజయం సాధన ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. యేసు

ప్రభువు శోధనకారుని వెడలగొట్టాడు. మన పరలోక తండ్రికి చేసిన ఈ విన్నపంతో క్రీస్తు తన పోరాటంలోనూ, తన

శ్రమల తోనూ మనల్ని ఐక్యం చేశాడు. కాబట్టి, ఈ తపస్సు కాలములో ముఖ్యముగా ప్రార్ధన, ఉపవాసము

మరియు దానధర్మములకు ప్రాధాన్యతఇస్తూ దేవునికి దగ్గరవుదాం.


బ్రదర్. సైమన్ ఓ సీ డి.

తపస్సు కాల 1 వ ఆదివారం

 తపస్సు కాల 1 వ ఆదివారం

ఆది 2:7-9

రోమి 5:12-19

మత్తయి 4:1-11

ఈనాటి తపస్సు కాలపు మొదటి ఆదివారపు దివ్య పఠనాలు మానవ జీవితంలో అనుదినం అనుభవించే శోధనలు గురించి బోధిస్తున్నాయి.

తపస్సు కాలం మొదలైన మొదటి వారమే శోధనలు గురించి తెలియజేస్తున్నాయి, ఎందుకంటే ఈ నలభై రోజులు మనం ఎంతో నిష్టగా యేసు ప్రభువును అనుసరించాలని ప్రయత్నిస్తుంటాం. ఆయన యొక్క సిలువ శ్రమలలో, మరణంలో భాగస్తులమై మనం జీవించబోతున్నాము, అందుకే సైతానుడు మనల్ని దేవుని నుండి దూరం చేయుటకు ప్రయత్నిస్తాడు.

శోధనలు ప్రతి ఒక్కరి జీవితంలో సర్వసాధారణం, ఎవరైతే దేవుని సేవింప గోరుతారో వారందరి జీవితాలలో శోధనలు వస్తాయి, ఎందుకంటే దేవునికి దగ్గరగా ఉండే వారిని దూరం చేయటమే సైతాను  యొక్క పని.

సృష్టి ప్రారంభం నుండి దేవునితో కలిసి దేవుని కొరకు జీవించే దేవుని ప్రజలకు శోధనలు ఎదురయ్యాయి. మనకు ఎదురయ్యే శోధనలలో సైతానుకు లొంగకుండా దైవ శక్తితో, ప్రార్థన ఆయుధంతో శోధనలు చేయించాలని ప్రభువు తెలుపుచున్నారు. శోధనలు ఎందుకంటే మన విశ్వాస జీవితం బలంగా ఉండాలని పవిత్ర గ్రంథంలో మన విశ్వాస జీవితం పరీక్షించబడాలని చెప్పబడింది  - పేతురు 1:7

అదేవిధంగా ప్రభువును సేవించే అందరూ పరీక్షకు సిద్ధం కామని తెలుపుతుంది - సీరా 2:1.

చాలా సందర్భాలలో మనకు శోధనలు వచ్చినప్పుడు మనం దేవునికి దూరమైపోతాం, వాస్తవానికి శోధనలు జయించినప్పుడే మన యొక్క నిజమైన విశ్వాసం ఎలాంటిది, మన యొక్క అనుసరణ ఎలాంటిది అని తెలుస్తుంది. మన జీవితంలో మనల్ని శోధించేది సైతానుడే - యాకోబు 1:13, యోబు యొక్క జీవితంలో మనం చూసే అంశం ఏమిటంటే ఆయన దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తూ, ఒక మంచి జీవితం జీవించే సందర్భంలో సైతాను ఆయనను శోధిస్తుంది - యోబు 1:6-22.

ఎవరి జీవితంలోనూ శోధనలు వారికి వారి యొక్క శక్తిని మించి కలుగవు - 1 కోరింతి 10:13. కాబట్టి మనం శోధనలు ఎంతవరకు ఎదుర్కొనగలమో అంతవరకే దేవుడు అనుమతి ఇస్తారు. మానవ ప్రయత్నంతో మనం శోధనలు ఎదుర్కొనాలంటే కష్టం, కానీ దైవ శక్తితో మరియు దేవుని మీద ఆధారపడి జీవించి ముందుకు సాగితే ఎన్ని శోధనలైనా ఎదుర్కొనగలం.

ఈ నలభై రోజులు తపస్సు కాల జీవితం మనందరిలో దైవ శక్తిని నింపాలి, ప్రభువు ఎలాగైతే శోధనలు చేయించారో  అలాగే మనం కూడా మన యొక్క బలహీనతలను, వ్యసనాలను పాపాలను జయించి ఒక క్రొత్త జీవితం జీవించాలి.

మానవులము బలహీనులము, అందుకే సైతాను మనల్ని వివిధ రకాలుగా శోధిస్తుంది. చాలా సందర్భాలలో మనం పడిపోయేంతవరకు సైతాను మనల్ని శోధిస్తూనే ఉంటుంది, కాబట్టి మనం మెలుకువ కలిగి సైతాను చేతుల్లో చిక్కుకోకుండా జీవించాలి.

ఈనాటి మొదటి పఠనం లో  ఆది తల్లిదండ్రుల యొక్క శోధన గురించి తెలియజేస్తున్నారు.

దేవుడు ఆదాము, అవ్వలకు ఇచ్చిన స్వేచ్ఛ జీవితంలో వారు శోధించబడినప్పుడు వారు సైతానుకు లొంగిపోయారు.

ఆదాము, అవ్వ భౌతికంగా, ఆధ్యాత్మికంగా బలహీనులు అందుకే వారు శోధనలలో పడిపోయారు వారి యొక్క బలహీనత మనకు సోకింది.

ఈ మొదటి పఠనం లో  గ్రంథకర్త కొన్ని ముఖ్యమైన సత్యాలను ఒక కథ ద్వారా తెలియజేస్తున్నారు. అందులోని ముఖ్యమైన పాత్రధారులు యావే  దేవుడు, ఆదాము, అవ్వ మరియు సర్ప రూపంలో ఉన్న సైతాను, దానిలో ఉన్న ముఖ్యమైన వస్తువులు తోట, చెట్టు, పండు.

ఈ యొక్క కథ ద్వారా దేవుడు తెలియజేసే అంశం ఏమిటంటే దేవుడు సృష్టిని చేసిన తరువాత మానవుని ఏదేను తోటలో ఉంచారు, అతనికి, ఆమెకు స్వేచ్ఛనిచ్చారు కానీ తమ యొక్క స్వేచ్ఛ జీవితంలో దేవుని మీద ఆధారపడి జీవించకుండా ఈ లోక ఆశలకు లోనై వారు దేవుని మాటలను ధిక్కరించి తమ యొక్క ఉన్నత స్థితిని స్నేహం ను దేవుని యొక్క వరాలు కోల్పోయారు.

సైతాను ఆదామును ఏవలను శోధించింది, మొట్టమొదటిగా దేవుని యొక్క మాటను సందేహించేలా చేసింది - ఆది 3:1 సైతాను ఎంతో చాకచక్యంగా, ఆకర్షణీయంగా వారిని ఇష్టమైన రీతిలో శోధించింది, సాధారణంగా సైతాను అంటే మనం సినిమాలలో చూసింది విన్నది ఏమిటంటే సైతానుకు రెండు కొమ్ములు నల్లగా జుట్టూ విరబూచుకొని ఉంటారని కానీ ఇక్కడ ఆదాము అవ్వలతో సంభాషించిన వితంను చూస్తే సైతాను ఒక స్నేహితుడి లాగా వారితో మాట్లాడుచున్నాడు.

వారిని ప్రేరేపించే విధంగా మరియు ఆకర్షించే విధంగా వారితో మాట్లాడుచున్నారు, అందుకే ఆదాముకు, అవ్వకు ఆ మాటలు బాగా నచ్చాయి, అందుకే దేవుని యొక్క మాటలు మరచి సైతానుకు విధేయత చూపారు. కొన్ని సందర్భాలలో మన పొరుగు వారే మనల్ని పాపం చేయుటకు మంచి మాటలతో ప్రేరేపిస్తారు. ఏదోను తోటలో సైతాను శోధించక ముందు అవ్వ ఆ చెట్టు పండును ఎన్నోసార్లు చూసి ఉండవచ్చు అప్పుడు ఆమెకు ఎటువంటి ఆలోచన లేదు, ఎప్పుడైతే సైతాను మాట సైతాను ఆమెకు ఆకర్షణీయమైన మాటలు చెప్పిందో అప్పుడే ఆ చెట్టు పండు ఆమెకు కన్నుల పండుగగా ఉంది, ఆ పండు రుచి బాగుండును అని అనిపించింది, అలాగే దేవుడి వలే అవ్వాలి అని అనిపించింది.

మూడు శోధనలు ఆమెకు ఎదురయ్యాయి, తన యొక్క కళ్ళకు చెట్టు పండు చాలా నచ్చింది, మొట్టమొదటిగా కన్నుల ద్వారా చూడడం మనం పాపంలో పడటానికి అవకాశం ఉంది. రెండవదిగా తన యొక్క శరీరంను సంతృప్తి పరచాలని అనుకున్నది దాని ద్వారా ఆనందం పొందాలని భావించింది. మూడవదిగా గర్వంతో దేవుని వలె ఉండాలి అని భావించి అవ్వమ్మ శోధనలకు లొంగిపోయింది.

దేవుడు వారికి ఇచ్చిన ఆ స్వేచ్ఛను బాధ్యతను విధేయతను కోల్పోయారు మరీ ముఖ్యంగా దేవునితో ఉన్న స్నేహబంధంను కోల్పోయారు, దేవుడు ప్రసాదించిన జీవితంను కోల్పోయారు ఆనందంను కోల్పోయారు.

మన యొక్క అనుదిన జీవితంలో కొన్నిసార్లు మన యొక్క మిత్రులే, బంధువులే పరిచయం ఉన్నవారే మనల్ని పాపం చేయుటకు ప్రేరేపిస్తారు.

సైతాను అవ్వను, ఆదామును మోసం చేసింది. అలాగే చాలామంది మనల్ని ప్రతిసారి మోసం చేస్తూనే ఉంటారు,  పాపం చేయుట ద్వారా మానవుడు తన యొక్క స్వేచ్ఛను ఏ విధంగా దుర్వినియోగం చేసుకున్నాడు తెలుసుకుంటున్నాం, దేవుని మాటను మార్గంను ఎన్నుకొనుటకు బదులుగా సైతాను మార్గంలో ఎన్నుకున్నారు, దేవుని మీద ఆధారపడుటకు బదులుగా సైతాన్ మీద ఆధారపడ్డారు చివరికి మోసగించబడ్డారు.

మనం పాపంలో పడిపోవడానికి మన యొక్క కోరికలే కారణం. మనకు ఉండే వివిధ రకాలైన కోరికలే మనల్ని పాపం చేసేలా ద్రోహద పడతాయి, పంచంద్రియాల ద్వారా వచ్చే కోరికల వల్ల మనం పదే పదే పాపంలో పడిపోతుంటాం.

పాపం యొక్క ఫలితం మరణం, దైవ ప్రేమను కోల్పోవటం కాబట్టి పాపంలో పడిపోకుండా దేవుని మార్గాన్ని అనుసరించి జీవించుదాం.

కొన్ని సందర్భాలలో మనం పాపం చేయటమే కాకుండా ఇతరులు కూడా పాపం చేయడానికి కారణం అవుతాము, చేసినది తన యొక్క పాపంలో భాగస్తుడు అవ్వడానికి కారణం అయ్యింది, కాబట్టి ఎవరిని పాపం చేయటానికి మనం కారణం కాకూడదు.

ఈనాటి రెండవ పఠనం లో  పునీత  పౌలు గారు మొదటి ఆదాముకు, రెండవ ఆదాముకు ఉన్న వ్యత్యాసం గురించి తెలిపారు.

మొదటి ఆదాముకు ఈ లోక సంబంధమైన శోధనలు వచ్చినప్పుడు ఆయన పడిపోయాడు, దేవునికి అవిధేయత చూపించారు, దాని ద్వారా ఈ లోకంలోకి పాపం తీసుకొని వచ్చారు, మరణం తీసుకొచ్చారు, అలాగే దేవునితో ఉన్న ఆ బంధం కూడా కోల్పోయేలాగా దోహదపడ్డాడు.

మొదటి ఆదాము ద్వారా పాపం, మరణం ఈ లోకంలోనికి ప్రవేశించాయి. రెండవ ఆదాము అయిన క్రీస్తు ద్వారా జీవం, రక్షణావచ్చాయి. రెండోవ ఆదాము మొదటి ఆదాముకు భిన్నంగా జీవించారు. ఈ లోకంలో అనేకసార్లు శోధించబడినప్పటికిని ఆయన పాపం చేయలేదు ఆయన దేవునికి సంపూర్ణ విధేయత చూపించారు, నీతివంతమైన జీవితం జీవించారు, ఆయన్ను అనుసరిస్తూ మనం కూడా మంచి జీవితంను జీవించాలి.

ఈనాటి సువిశేష పట్టణంలో యేసు ప్రభువు ఎదుర్కొన్న శోధనలు గురించి తెలియజేస్తుంది. కేవలం మూడు శోధనలు మాత్రమే కాదు ప్రభువు అనుభవించింది కానీ ఈ మూడు రకాలైన శోధనలోనే మానవ జీవితం ఉంటుంది, యేసుప్రభు అనేక రకాల శోధనలు అనుభవించి వాటిని జయించారు.

ఏసుప్రభు యొక్క శోధన మూడు విధాలుగా వర్ణించబడింది, ఎందుకని మూడు శోధనలను ప్రత్యేకంగా తెలుపుతున్నారంటే ఈ మూడు రకాల శోధనల గురించి ప్రాత నిబంధన గ్రంథంలో వింటున్నాం. ఎడారిలో ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేసేటప్పుడు మూడు ముఖ్యమైన శోధనలకు గురి అయ్యారు. ఆ మూడు శోధనలలో వారు విఫలమయ్యారు. ఇవే మూడు శోధనలలో ఎడారిలో నూతన ఇశ్రాయేలు అయిన యేసు ప్రభువు సైతాను శోధనలను జయించారు. మానవ రూపంలో ఉన్న ఏసుప్రభువును సైతం సైతానుడు పడవేయాలనుకున్నారు కానీ సాద్య పడలేదు . మనం దేవునికి దగ్గరయ్యే కొద్ది మన జీవితంలో సైతానుడు ప్రవేశించి మనలను ఆయననుండి దూరం చేయాలనుకుంటాడు, అందుకే మనల్ని శోధిస్తారు.

ఈ యొక్క మూడు శోధనలు మనం గమనించినట్లయితే ఏసు ప్రభువు 40 రోజులు ఆయన ఉపవాసం చేసిన తర్వాత ఆయనను సైతానుడు శోధిస్తున్నాడు.

మనం కూడా ఈ నలభై రోజుల ఉపవాస సమయంలో నిష్టగా ఉంటాం, మరి ఈస్టర్ పండుగ తరువాత ఎలాగ జీవిస్తున్నాం? 41వ రోజునే మనల్ని సైతాను శోధిస్తే దాని ఒడిలో పడిపోతున్నాం. కేవలం మనం 40 రోజులు మాత్రమే ప్రభువును వెంబడిస్తూ జీవిస్తున్నాం, అదే విధంగా విదేయించి జీవిస్తున్నాం, మిగతా అన్ని రోజులు సైతానుకు దగ్గరవుతున్నాం. మరీ ముఖ్యంగా త్రాగుడుకు బానిసలైన వారు వ్యసనాలకు బానిసలు అయినవారు 41వ రోజునే మందు షాపులకు వెళుతుంటారు, ఇది సరైన విశ్వాసి జీవితం కాదు, 40 రోజుల శోధనలు జయించిన తర్వాత కూడా మనం మంచిగా పవిత్రంగా జీవించాలి.

సువిశేష ప్రారంభంలో ఏసుప్రభు పవిత్రాత్మ పరిపూర్ణుడాయెను, ఆయన ఆత్మ ప్రేరణ ఎడారికి శోధించబడుటకై వెళ్ళెను. ఎడారిలో నీరు ఉండదు, ఆహారం ఉండదు అయినప్పటికీ యేసు ప్రభువు కేవలం తండ్రితో గడుపుటకు, దైవ శక్తిని సమ్మతిని తీసుకొనుటకు ప్రభువు ఎడారి కి వెళ్లారు. ఎడారి విషయాలవంతమైన స్థలం, నిశ్శబ్దంతో కూడిన స్థలం, దేవునితో గడపటానికి వీలుగా ఉన్న స్థలం, తనను తండ్రి కార్యం కొరకు ఆధ్యాత్మికంగా మానసికంగా శరీరకంగా సిద్ధం చేసుకోవడానికి అక్కడికి వెళ్లారు, అదేవిధంగా ఇస్రాయేలు ప్రజలు శోధనలకు ఎడారిలో పడిపోయారు. ఏసుప్రభు అదే ఎడారిలో శోధనలు జయించారు.

ఏసుప్రభువును సైతాను 40 రోజులు శోధించారు. పవిత్ర గ్రంథంలో చూసినట్లయితే సైతానుడు రెండోసారి ఏసుప్రభువును తుద ముట్టించాలనుకుంటున్నాడు చిన్నప్రాయంలో సైతానుడు హెరోదును ప్రేరేపించి శోధించి చంపాలనుకున్నాడు, కానీ వీలుపడలేదు ఇప్పుడు మరొకసారి ఏసుప్రభును తన యొక్క తండ్రి కార్యము నుండి సంపూర్ణంగా వైదొలిగేలాగా చేయాలనుకున్నాడు, అందుకే శోధిస్తుంది.

సైతానుడు మనల్ని ఈ నలభై రోజులు ఎక్కువగా శోధిస్తుంది, మరీ ముఖ్యంగా దీక్ష తీసుకునే వాళ్ళని ఎక్కువగా శోధిస్తుంటాడు, వారిని ఆటంకం పరుచుటకు వారిని దేవుడి నుండి దూరం చేయుటకు శోధిస్తుంటాడు.

ఏసుప్రభు యొక్క మొదటి శోధన ఆహారం గురించి శారీరక వాంఛ గురించి.

సైతాను చాలా జిత్తులు మారిది, మనం ఎక్కడ బలహీనులమో  తాను అక్కడే శోధిస్తుంది, కొంతమందికి అధికారం బలహీనత కొంతమందికి కోపం బలహీనత కొంతమందికి అసూయ, కక్కుర్తి ,శారీరక కోరికలు, బలహీనతలు అందుకనే వారిని ఎక్కువగా వారి యొక్క బలహీనతలు బట్టి శోధిస్తుంది, కొందరికి త్రాగుడు బలహీనత కాబట్టి వారిని కూడా ఎక్కువగా శోధిస్తుంది. ఏసుప్రభు శరీరకంగా బలహీనులుగా ఉన్నారు 4 రోజులు ఆయన ఎటువంటి ఆహారం తీసుకొనలేదు అందుకనే వెంటనే తన బలహీనత దగ్గర శోధిస్తే వెంటనే పడిపోతారు అనే భావించింది.

పాత నిబంధన గ్రంథంలో ఆది తల్లిదండ్రుల దగ్గర నుండి ఇశ్రాయేలు ప్రజల వరకు ఆకలికి సంబంధించిన శోధనలు వచ్చినప్పుడు వారి శోధనలో పడిపోయారు. ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో మోషే ప్రవక్తను దూషించి దేవునికి పాపం చేశారు, దేవుడు వారికి ఆ సమయంలో మన్నాను వసగుతూ నేర్పించిన పాఠం ఏమిటంటే మానవుడి కేవలం రొట్టెల వలనే కాదు దేవుని యొక్క వాక్యము వలన కూడా జీవిస్తారని తెలిపారు - నిర్గమ 16:2-3.

శరీరానికి సంబంధించిన శోధనలలో మనం వెంటనే పడిపోతాం, మనం ఎక్కువగా శరీరంను సంతృప్తి పరచాలి అనుకుంటాం, మన యొక్క పంచంద్రియాలు మనల్ని పడిపోయేలా చేస్తాయి, కనులతో చూసిందల్లా కొన్నిసార్లు మనసు కావాలనుకుంటుంది, చెవులతో విన్నది స్పర్శతో తాకినది మన కోరికలు కావాలని కోరుకుంటాయి. అందుకే పంచంద్రియాలను మనం అదుపులో ఉంచుకొని నిగ్రహ శక్తిని కలిగి ఉండాలి.

ఈ యొక్క మొదటి శోధన తన యొక్క దైవత్వమును నిరూపించుటకు సైతానుడు శోధిస్తున్నాడు వాస్తవానికి సైతానుడు ఏసుప్రభు తన యొక్క శక్తులను తన యొక్క సొంత లాభం కోసం అవసరతల కోసం వినియోగించుకుంటారా లేదా అనే శోధిస్తుంది. అయితే యేసు ప్రభువు శరీరకంగా వాంఛలకు లొంగకుండా తన యొక్క శక్తిని స్వంత లాభం కోసం వినియోగించలేదు.

ఏసుప్రభు ఈ లోక శారీరక సుఖాల వలన సంతృప్తి చెందరు ఆయన యొక్క నిజమైన ఆహారం తండ్రి చిత్తమును నెరవేర్చుటయే - యోహాను 4:34, మనకు వచ్చి శారీరక శోధనలు జయించాలంటే దేవుని వాక్కును సంపూర్ణంగా స్వీకరిస్తూ జీవించాలి.

రెండొవ  శోధన దేవుని పరీక్షకు గురి చేయటం - ఇశ్రాయేలు ప్రజలు అనేకసార్లు దేవుని పరీక్షించారు, ఆయన శక్తిని పరీక్షించారు. ఏసుప్రభువు కింద పడితే ఏమీ కాదని దూకమని సైతాను దేవుని శక్తిని పరీక్షించింది. ఇశ్రాయేలు ప్రజలు మస్యా, మెరీబా వద్ద దేవుణ్ణి పరీక్షించారు - నిర్గమ 17:1-7 దేవుడిని మనతో ఉన్నాడా లేదా అని. ఏసుప్రభు ఎన్నడు దైవ శక్తిని పరీక్షించలేదు ఆయనకు తండ్రి మీద సంపూర్ణ విశ్వాసం ఉన్నది కాబట్టి దేవుని పరీక్షించలేదు. మన యొక్క విశ్వాస జీవితంలో శోధనలు వచ్చినప్పుడు దేవుణ్ణి చాలాసార్లు పరీక్షిస్తాం.

దేవుడా నీవు నాకిదిస్తే నేను గుడికి వస్తానని పరీక్షిస్తాం.

పరీక్షల్లో మంచి మార్కులు వస్తే గుణదల వస్తానని పరీక్షిస్తాం. ఇంక చాలా విధాలుగా మనం దేవుని పరీక్షిస్తాం.

అన్నిటికన్నా కావాల్సింది దేవుని పరీక్షించడం కాదు దేవుని మీద ఆధారపడి జీవించుట ఆయన యందు సంపూర్ణ విశ్వాసం కలిగి జీవించుట.

కాబట్టి మన యొక్క విశ్వాస జీవితంలో శోధనలు వచ్చినప్పుడు దైవ శక్తితో ప్రార్థనతో వాటిని జయించుదాం.

ఏసుప్రభు వారు అన్నిచోట్ల శోధించబడ్డారు అయినా సైతానుకు లొంగలేదు.

మూడోవ  శోధన అధికారం గురించి - ఈ లోక సామ్రాజ్యాలను చూపించి తనను ఆరాధిస్తే అటువంటి సామ్రాజ్యాలను సైతానులు ఇస్తానని యేసుతో అంటున్నారు. ఏసుప్రభు యొక్క సిలువ మార్గాన్ని అడ్డుకోవాలని ఉన్నది (మత్తయి 16:22) ఈ లోకంలోనే ఆయన్ను ఉంచి తనకు లోబర్చుకోవాలనుకున్నది సైతాను.

ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో ఇతర దేవుళ్ళను ఆరాధించారు. ఎడారి కొండ వారిని నడిపిన దేవుని మరిచిపోయారు ఒక బంగారు తోడను ఆరాధించారు - నిర్గమ 32:1-6 విగ్రహారాధన చేశారు.

ఎక్కడ మీరు విగ్రహారాధన చేయటం మాత్రమే కాదు దేవునికి చెందవలసిన స్థానం ప్రాముఖ్యతను సృష్టి మానవులకు ఇస్తున్నారు. అధికారం కోసం మనం కొన్ని సార్లు ఏదైనా చేస్తాం ఎక్కడికైనా వెళ్తాం కానీ ఏసుప్రభువు అందుకు ఒప్పుకోలేదు లోక సంపదలు అన్నింటికంటే దేవుడే ముఖ్యమని ఆయన మీదనే ఆధారపడి జీవించాలని తెలియజేస్తున్నారు.

అధికారం కోసం కొన్నిసార్లు ఎవరి కాలైనా మొక్కుతాం, ఎంతకైనా దిగజారతం, ఇక్కడ ప్రభువు నేర్పించేది ఏమిటంటే అధికారం కోసం సంపదల కోసం దేవుని విడిచి పెట్టకూడదు.

- పవిత్ర గ్రంథంలో శోధించబడిన వారు:

- ఆదాము శోధించబడ్డాడు, సైతానుకు పడిపోయాడు

- అబ్రహాము శోధించబడ్డాడు, సైతాను నువ్వు జయించాడు

- ఇశ్రాయేలీయులు శోధించబడ్డారు, సైతాను మాయలో పడ్డారు

-దావీదు శోధించబడ్డాడు, ఆయన కూడా పడిపోయారు 

కొన్ని సందర్భాలలో సొలోమోను, సంసోను శోధించబడ్డారు వారు కూడా పడిపోయారు.

ఏసుప్రభు కూడా శోధించబడినప్పటికీ సైతాను వలలో చిక్కుకొనక అన్ని శోధనలు చేయించారు. మన విశ్వాసాన్ని పరీక్షించినప్పుడు మనం కూడా శోధనలు జయించాలి మన యొక్క శక్తిని మించి మనం శోధించబడతాం - 1 కోరింతి 10:13 కాబట్టి దైవ శక్తితో శోధనలు ఎదుర్కొందం దేవునికి సాక్షు లై జీవించుదాం. మనకు వచ్చే శోధనలో దేవుని మీద ఆధారపడి జీవిస్తూ, మన యొక్క విశ్వాస జీవితంను కొనసాగించూద్దాం. మన జీవితంలో ఒకదాని తరువాత ఒక శోధన వస్తూనే ఉంటుంది వాటన్నిటిని దైవ శక్తితో యించుదాం.


FR. BALAYESU OCD

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...