17, జూన్ 2023, శనివారం

11 వ సామాన్య ఆదివారం

11 వ సామాన్య ఆదివారం

నిర్గమ 19:2-6

రోమి 5:6-11

మత్తయి 9:36-10:8

 ఈనాటి దివ్య పఠనాలు దేవుని యొక్క సేవకుల గురించి తెలియజేస్తున్నాయి. మనందరిని కూడా దేవుని యొక్క సువార్త పరిచర్యకు ప్రభువు ఎన్నుకొన్నారు. మనం కూడా పరిచర్య చేస్తూ ఈ లోకంలో ఉన్న వారిని పరలోకం వైపు నడిపించాలి.

ఈనాటి మొదటి పఠనం లో యావే దేవుడు ఇశ్రాయేలు ప్రజల పట్ల ఉన్న ప్రేమను చూపిస్తున్నారు.

యావే  దేవుడు ఇశ్రాయేలును ప్రత్యేకంగా ప్రేమించి, ఎన్నుకొని తన సొంత వారిని గా చేశారు.

ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఐగుప్తు నుండి విడిపించిన తరువాత ఏ విధంగా వారిని ఎడారిలో నడిపించి వారి యొక్క ప్రతి అవసరంలో తోడుగా ఉన్నారో తెలిపారు.

ఏ విధంగానైతే గరుడ పక్షి తన పిల్లలను రెక్కల మీద మోసుకొని పోవునో  అలాగే తాను కూడా ఇస్రాయేలు ప్రజలను మోసుకొని వచ్చారు అని తెలిపారు.

ప్రజలందరిలో కన్నా ఇశ్రాయేలు ప్రజలే మొదటిగా ఎక్కువగా ప్రేమించబడ్డారు. అందుకనే దేవుడు  వారికి అంత ప్రాధాన్యత ఇచ్చి వారిని కంటికి రెప్పలాగా కాపాడారు.

గరుడ పక్షి తన బిడ్డలకు ఎటువంటి ఆపద కలగకుండా కాపాడినట్లు దేవుడు కూడా ఇస్రాయిలను కాచి కాపాడారు. ఇస్రాయేలు ప్రజలు ఎడారిలో ప్రయాణించినప్పుడు ఎటువంటి ఇబ్బందులు కలగలేదు దేవుడు వారికి సకాలంలో అంతయు సమకూర్చారు.

ఈ మొదటి పఠనం లో  యావే దేవుడు ఇశ్రాయేలు ప్రజలను యాజక రూపమైన రాజ్యాంగాను, పరిశుద్ధమైన జనం గాను ఎన్నిక చేసిన విషయంను వెల్లడిస్తున్నారు.

ఎందుకు దేవుడు ఇశ్రాయేలు ప్రజలందరినీ యాజకులు రూపమైన రాజ్యాంగ చేశారంటే ప్రజలందరిలో ఇశ్రాయేలు ప్రజలు సుమాతృకమైన జీవితాన్ని జీవిస్తూ ఇతరులను దేవుని చెంతకు చేర్చాలని ప్రభువు కోరిక.

యాజక రూపమైన రాజ్యం, పరిశుద్ధమైన జనం ఎందుకంటే ఇస్రాయేలీయులు వెలుగుగా ఉండుట కొరకు, ఆ వెలుగు ఇతరులను యావే దేవుని చెంతకు నడిపించుటకు ప్రభువు వారిని యాజక రాజ్యంగా చేశారు.

యాజకుడు ప్రజలను దేవుని చెంతకు నడిపించిన విధంగా ఇశ్రాయేలీయులు కూడా అన్యులను దేవుని చెంతకు నడిపిస్తారని.

యావే దేవుడు ఇస్రాయేలు ప్రజల పట్ల అంత ప్రేమ చూపటానికి కారణం ఏమిటంటే సమస్త జనుల కంటే వారు లెక్కకు తక్కువే వారికి సైనిక బలం తక్కువే నిరాకరించబడిన వారే  అందుకే తక్కువ కలిగిన వారిని ప్రభువు ప్రేమిస్తూ వారిని విముక్తులను చేసి తన సొంత ప్రజలుగా చేశారు.

దేవుడు అందరినీ ప్రేమించారు అందరూ ఆయనకు చెందినవారే, ఒక ప్రజలను ఎన్నుకొని తన యొక్క గొప్పతనం, ప్రేమను చాటి చెప్పాలన్నది ప్రభువు ప్రణాళిక.

అన్యుల  యొక్క నిమిత్తమే ఆయన ఇశ్రాయేలు ప్రజలను ఎన్నుకున్నారు, మానవులందరి రక్షణార్థం ఆయన ఇశ్రాయేలు ప్రజలను ఒక సాధనంగా ఏర్పరుచుకున్నారు.

యాజకులు దేవునికి మానవులకు ఏ విధంగా మధ్యవర్తులుగా ఉన్నారో  అలాగే ఇస్రాయేలు ప్రజలు కూడా అన్యజాతి ప్రజలకు మధ్యవర్తులే, అందుకనే దేవుడు వారిని యాజక రూపమైన రాజ్యమని, పరిశుద్ధమైన రాజ్యమని సంబోధించారు.

ఈనాటి రెండవ పఠనం లో  పౌలు గారు యేసు క్రీస్తు ప్రభువు మన మీద చూపించిన అపారమైన ప్రేమను గురించి తెలుపుచున్నారు.

మనం పాపాత్ములుగా ఉన్నప్పటికీని, బలహీనుల మైనప్పటికిని, దేవుడు మనలను అధికంగా ప్రేమించారు. ఆయన ప్రేమను పొందుటకు అనర్హులమైనప్పటికిని ఆయన తన కుమారుని రక్తం చేత మనలను రక్షించి నీతిమంతులను చేశారు, కాబట్టి మనం కూడా దేవుని యొక్క సొంత ప్రజలం దేవుని చేత ఎన్నుకోబడిన ప్రజలం పవిత్ర జనం కాబట్టి ఆయన యందు మనం ఆనందించాలి.

ఈనాటి సువిశేష పఠనం లో   యేసు ప్రభువు శిష్యులను సువార్త  సేవకు పంపిచ్చుట విధానంను చదువుకుంటునాం. ఈ లోకంలో ఉన్న ప్రజలందరిని సువార్త పరిచర్య ద్వారా పవిత్రపరచుటను దేవుని ప్రజలుగా చేయుటకు శిష్యులను ఎన్నుకొని వారిని వివిధ ప్రాంతాలకు సేవ నిమిత్తమై పంపిస్తున్నారు. ఏసుప్రభువు ఈ 12 మంది శిష్యులను తన యొక్క సాధనములుగా ఎన్నుకుంటున్నారు. వారిని ఎన్నుకొని వారి ద్వారా మిగతా వారిని కూడా తన వారిగా ఎన్నుకుంటున్నారు.

ఈ పన్నిద్దరు  శిష్యులు నూతన యాజక ప్రజలకు పునాది. ఈ సువిశేషంలో మనం గమనించినట్లయితే యేసు ప్రభువు కాపరిలేని ప్రజలను చూసి ఆయన కడుపు తరుగుకొని పోయాను అని చెప్పారు తన యొక్క కరుణ వలన ప్రభువు మన వైపు తిరిగి మనలను ప్రేమించారు.

దేవుడు పని ఇద్దరిని ఎన్నుకున్నది పంపించుట కొరకే - మార్కు 3-13-14.

ప్రజల యొక్క అత్యవసరాలను ప్రభువు గుర్తించి వారిని రక్షించుట కొరకు 

ప్రభువు శిష్యులను పంపిస్తున్నారు శిష్యులను రెండు రకాలైన బాధితులను శిష్యులకు అప్పచెప్పుచున్నారు:

1. ప్రకటించుట

2. స్వస్థపరచుట

1. ప్రకటించుట :

మొట్టమొదటిగా ప్రభుశులను దైవ రాజ్యం సమీపించినది అని ప్రకటించమని కోరుచున్నారు. శిష్యులను అన్నింటిలో సంసిద్ధం చేసిన తర్వాత ప్రభువు వారిని దైవ రాజ్యం గురించి ప్రకటించమన్నారు. దైవ ప్రేమ దేవుని యొక్క రక్షణ గురించి అదే విధంగా పవిత్రంగా జీవించుట గురించి ప్రకటించమని ప్రభువు ఆదేశించారు.

జ్ఞానేస్నానం పొందిన మనందరం కూడా ప్రభువును గురించి ప్రకటించాలి. దేవుని యొక్క కరుణ మంచితనం, జాలి, అన్నిటి గురించి ప్రకటించాలి. ఏసుప్రభు యొక్క అపోస్తులు తమ యొక్క వ్యక్తిగత ఆలోచనలు కాదు ప్రకటించవలసింది కేవలం దేవుని సందేశమే దేవుని దగ్గర నుండి స్వీకరించినది మాత్రమే ప్రకటించాలి.

బాప్తిస్మ యోహాను ప్రకటించింది అదియే - మత్తయి 3:2

ఏసుప్రభు సందేశం అదియే - మత్తయి 4:17,23

అలాగే ప్రతి ఒక్కరూ ప్రభువుని యొక్క రక్షణ సందేశంను ప్రకటించాలి.

2. స్వస్థత పరచుట:

ఏసుప్రభు శిష్యునికి అధికారం ఇచ్చి వ్యాధులను నయం చేసి అనుగ్రహంను దయచేసి ప్రభువు శిష్యులను స్వస్థతపరిచె అనుగ్రహం ఇచ్చారు. ఎందుకంటే వారి యొక్క స్వస్థత వరం ద్వారా ప్రజలందరూ కూడా ఏసుప్రభువు శారీరక గాయాలను అనారోగ్యాలను మాన్పుతారు అని. అదేవిధంగా ఆధ్యాత్మిక సంబంధమైన స్వస్థతను కూడా ప్రభు దయచేశారు. మన ఈ నాటి పట్టణాల ద్వారా నేర్చుకోవలసిన అంశాలు ఏమిటంటే.

1. మనం ఎన్నుకొనబడిన ప్రజలు కాబట్టి పవిత్రంగా జీవించాలి.

2. వెలుగుగా ఉంటూ ఇతరులను వెలుగులోనికి నడిపించాలి.

3. క్రీస్తు ప్రభువు గురించి ప్రకటించాలి.

4. స్వస్థత నిచ్చే వ్యక్తులుగా మనం మారాలి.


FR. BALAYESU OCD

16, జూన్ 2023, శుక్రవారం

11 వ సామాన్య ఆదివారం

 11 వ సామాన్య ఆదివారం

నిర్గమ 19:2-6

రోమి 5:6-11

మత్తయి 9:36-10:8


క్రీస్తు కారుణ్యం - శిష్యులను పిలుచుట - దైవ రాజ్య వ్యాప్తి


ఈనాడు తల్లి శ్రీ సభ 11వ సామాన్య ఆదివారాన్ని కొనియాడుతుంది. ఈనాటి మూడు పఠనాలు  దేవుని కారుణ్యం, ప్రేమ వ్యాప్తి అంశాలపై ప్రస్తావిస్తున్నాయి.

మొదటి పఠనం: దేవుడు మోషేతో ఇశ్రాయేలు నా నిబంధనలు శ్రద్ధగా పాటించినచో వారు నా వారగుదురు అని నుడువుచున్నారు.

భక్తి కీర్తన:  మనము దేవుని ప్రజలము

రెండవ పఠనం:  మనం పాపాత్ములమై ఉన్నప్పుడే క్రీస్తు మన కోసం మరణించి మనలను దేవునితో సఖ్యపరిచెను.

సువార్త పఠనం: క్రీస్తు ప్రభువు పన్నిద్దరిని  దైవ రాజ్య వ్యాప్తికి పంపుట.

వీటిని మూడు అంశాల రూపేనా ధ్యానిస్తూ అర్థం చేసుకొని మన జీవితాలలో అవలంబింపటానికి ప్రయత్నిద్దాం.

1. క్రీస్తు కారుణ్యం:

గ్రీకు భాషలో కారుణ్యం అనే పదం ఎంతో లోతైన భావం కలిగిన పదం, దీనిని మనం మత్తయి, మార్కు, లూకా సువార్తల్లో చూస్తున్నాము. ఏసు రద్దుచేరి గొప్ప జన సమూహమును చూచి జాలిపడి వారిలోని వ్యాధిగ్రస్తులను స్వస్థపరచును (మత్తయి 14: 14), యేసు కనికరించి వారి నేత్రములను తాకేను వెంటనే వారు దృష్టిని పొంది ప్రభువును వెంబడించిరి (20:34), ఏసు జాలిపడి చేయిచాచి వానిని తాకి నాకు ఇష్టమే శుద్ధి పొందుము అనెను (మార్కు 1:41), నాయిను లో వితంతువు కుమారుని చూచి యేసు కనికరించి ఏడవ వద్దమ్మా అని చెప్పి ఆ కుమారునికి జీవాన్ని ప్రసాదించెను (లూకా 7: 13,14). ఇవి యేసు జాలిపడిన, కనికరం చూపిన కొన్ని సన్నివేశాలు.

ఈనాటి సువార్త పఠనం లో కూడా నిస్సహాయులైన బాధలతో కాపరిలేని గొర్రెల వలె చెదిరియున్న జన సమూహమును చూచి జాలితో ఆ కరుణామయుని కడుపు తరుగుకొని పోయెను (మత్తయి 9:36) ఈ సందర్భంలోనే ప్రభువు తన శిష్యులతో పంట మిక్కుటము కానీ కోతగాండ్రు తక్కువ కావున పంటను సేకరించడానికి కావలసిన  కోతగాండ్రును పంపవలసినదని పంట యజమానికి మనవి చేయుడు అని పలికెను మత్తయి (9:37,38) పంట దానికై అది కోసుకోలేదు కానీ కొయ్యడానికి దానిని సంరక్షించడానికి ఎవరైనా కోతగాండ్రు కావాలి అదేవిధంగా గొర్రెలు చెదిరి ఉన్నప్పుడు వాటిని తిరిగి క్రమశిక్షణగా మందలోకి చేర్చడానికి కాపరి అవసరం. ఈనాటి ప్రస్తుత సమాజంలో కాపరులేని సంఘాలు ఎన్నో మరెన్నో. కాపరియున్నసరి అయిన కాపరి కాదు అందుకే ప్రభువు పంటను సేకరించుటకు కావలసిన కోతగాండ్రులను పంపమని మనవి చెయ్యా మనందరిని ఆహ్వానిస్తున్నాడు దానిని మాత్రమే శిష్యులను పిలిచి అపోస్తులగా సువార్త వ్యాప్తి కోసం పంపుతున్నాడు.

2. శిష్యులను పిలుచుట:

దేవుడు ఎవరిని, ఎక్కడ, ఎలా, ఎప్పుడు పిలుస్తారో తెలియదు, కొంతమందిని పౌలు గారిని పిలిచినట్లు, ఇంకా కొంతమందిని అగస్తీయును గారిని పిలిచినట్లు, మరి కొంతమందిని అస్సిపుర ఫ్రాన్సిస్ గారిని పిలిచినట్లు తన సేవకు పిలవచ్చు, పిలుపు దేవుని నుండి పిలవబడేది. 

మార్కు సువార్త లో ప్రాతఃకాలమన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఎన్నిక చేసి వారికి అపోస్తుల అని పేరు పెట్టెను. (లూకా 6:13).

అని ఈనాటి సువిశేషంలో యేసు 12 శిష్యులను తన చెంతకు పిలిచాడని శిష్యుల పిలుపు గురించి ఈ మూడు సువార్తల్లో ధ్యానిస్తున్నాము. పిలవబడిన వారు ఎవరి చేత పిలవబడ్డారు, ఎందుకు పిలవబడ్డారు, పిలుపు ఉద్దేశం ఏమిటో గ్రహించాలి. మార్కు సువార్తలో చాలా చక్కగా రాయబడి ఉంది. పిలవబడినది :

1. తనతో ఉండటానికి

2. సువార్త ప్రకటనకు పంపడానికి (మార్కు 3:14)

తనతో ఉండుట అనేది పిలవబడిన వారు మొట్టమొదటిగా ప్రధమముగా చేయవలసిన పని తనతో ఉంటూ తన ఆజ్ఞలను నియమాలను పాటించాలి. ఈనాటి మొదటి పఠనం లో కూడా దేవుడు మోషేతో ఇశ్రాయేలు ప్రజలకు తెలియపరచమని కోరేది కూడా అదే తన నియమములను పాటిస్తే దేవుని సొంత ప్రజలు రక్షించబడతారు.

తనతో ఉండుట ద్వారా తన ఆజ్ఞలు విధేయించి పాటించుట చాలా సులభం అవుతుంది, తనతో ఉండుట ద్వారా అపర క్రీస్తులా మారగలము, సువార్తను ప్రభావంతంగా శక్తితో అనుగ్రహంతో ప్రకటించగలము అందరిని క్రీస్తు వశం చేయగలం.

3. దైవ రాజ్య వ్యాప్తి:

క్రీస్తు ప్రభువు శిష్యులను పిలుచుటకు  కారణం తనతో ఉండుటకు, అటుపిమ్మట దైవ రాజ్య వ్యాప్తికి, దైవరాజ్య వ్యాప్తి అంటే క్రీస్తు ప్రారంభించిన రక్షణ కార్యాన్ని కొనసాగించడమే పునీత  పౌలు గారు దైవ రాజ్యాన్ని ఈ విధంగా నిర్వహిస్తారు. దేవుని రాజ్యం అనగా తినుట, త్రాగుట కాదు పవిత్రాత్మ ఒసగు నీతి, శాంతి సమాధానములే (రోమి 14:17).

సువార్త పరిచర్య ద్వారా అపోస్తులలు పవిత్రాత్మ ఒసగు శాంతి, సంతోషములు, నీతి ఇవ్వగలగాలి ఈ లోకంలోనే పరలోక రాజ్యాన్ని స్థాపించగలగాలి, ప్రకటించగలగాలి (మత్తయి 10:8), క్రీస్తు ప్రభువు చాలా చక్కగా ఏ విధంగా నీతి శాంతి సమాధానములు వ్యాపింప చేయగలరు తన శిష్యులకు చెబుతున్నారు.

i. వ్యాధిగ్రస్తులు ను స్వస్థపరచుట ద్వారా

ii. మరణించిన వారిని జీవముతో లేపుట ద్వారా

iii. కుష్ఠ రోగులను శుద్దులను గావించుట ద్వారా

iv. దయ్యం లను వెడల గొట్టుట ద్వారా (మత్తయి 10:8)

ఇవన్నీ చేయటానికి ప్రభువు వారికి అధికారాన్ని ఇస్తున్నారు (మత్తయి 10:1)

దీని ద్వారా కేవలం భౌతిక శుద్ధినే కాదు, అంతరంగిక శుద్ధిని కూడా పొందగలరు, ఈ ప్రేషిత  కార్యం బలహీనులకు బలాన్ని, శక్తిహీనులకు శక్తిని బాధలలో అనారోగ్యాలతో, కష్టాలతో, నష్టాలతో ఆర్థిక సమస్యలతో బాధపడే వాళ్లకు సమాజంలో చిన్నచూపు చూడబడే వారికి దేవుడు ఒక ప్రత్యేక స్థానాన్ని వసగుతారు, తన శిలువ మరణం పునరుద్ధానం ద్వారా. (రోమి 5:6-11) ఇదే మనం ఈనాటి రెండో పఠనం లో చూస్తున్నాము దైవరాజ్య వ్యాప్తి కేవలం గురువులకు, కన్య స్త్రీలకు, దైవాంకితులకు, ఉపదేషులకు మాత్రమే పరిమితం కాదు. వారి బాధ్యత మాత్రమే కాదు. మన అందరి బాధ్యత. మన ఆలోచనల ద్వారా  మన కార్యాల ద్వారా మన పరిధిలో మనము సువార్త ప్రకటన చేయగలగాలి సువార్త ప్రకటన అంటే విధులలో బోధించడం, ప్రసంగించడం మాత్రమే కాదు, కుటుంబ జీవితంలో ఒక మంచి భర్తగా, మంచి భార్యగా, మంచి తల్లిగా, మంచి తండ్రిగా మంచి పిల్లలుగా జీవించి మీ జీవిత విధానం ద్వారా ఇతరులకు ఆదర్శప్రాయంగా ఉండి మీరే ఒక సువార్తికుడిగా మారడం కూడా సువార్త ప్రకటన అవుతుంది, క్రీస్తు ప్రభువు వలే ఇతరుల కష్టాలను, బాధలను, ఇబ్బందులను చూచి చలించగలగాలి, జాలి పడాలి, జాలిపడటం మాత్రమే కాదు మనతో మనకు తోచినంత సహాయం చేయగలగాలి, ఈరోజు నీవు నేను ఈ ప్రేషిత కార్యానికే పిలవబడ్డాం. మన పిలుపునకు తగ్గట్టు జీవించడం సువార్త ప్రకటనకు మన వంతు సహకరిద్దాం. ఈ లోకంలోనేదైవారాజ్య  నిర్మాణానికి మన జీవిత విధానం ద్వారా దేవుని ఆజ్ఞలను పాటిస్తూ కృషి చేద్దాం. ఆమెన్.

DN. SUNIL INTURI OCD

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...