26, ఆగస్టు 2023, శనివారం

 

21వ సామాన్యఆదివారం

మొదటి పఠనం: యెషయా 22:15, 19-23

రెండొవ పఠనం: రోమియులు 11:33-36

సువార్త: మత్తయి 16:13-20

 

 

క్రీస్తునాధునియందు ప్రియమైనటువంటి సహోదరి, సహోదరులారా ఈనాడు మనమందరం  కూడా సామాన్యకాలపు 21  ఆదివారంలోనికి ప్రవెశించియున్నాం. ఈనాటి మూడు దివ్యగ్రంధ  పఠనాలను మనం ధ్యానించినట్లైతే  మూడు పఠనాలు మనకు తెలియజేసే అంశం ఏమిటంటే. దేవుడు మనకు ఇచ్చిన అధికారాన్ని విశ్వాసంతో పాటించినట్లయితే మన జీవితాలలో గొప్ప అద్భుతాలు జరుగుతాయని ఈ మూడు పఠనాలు మనకందరికీ తెలియజేస్తున్నాయి. ఆలా కాకుండా దేవునికి వ్యతిరేకంగా లేక ఇష్టానుసారంగా జీవించినట్లైతే షబ్న వాలే మన మందరము కూడా దేవుని యొక్క దండనకు గురి అవుతామని చెబుతున్నాయి.

నేటి సమాజంలో మనం చూస్తుంటాము అనేక మంది ఉన్నత అదికారాలలో ఉన్నపుడు వారు వారి ఇష్టానుసారంగా జీవిస్తున్న సమయాలలో వారి జీవితంలో  మనశాంతి లేకుండా పోతుంది  దానికి కారణం వారు దేవునికి విధేయులై జీవించకపోవటం. క్రైస్తవులమైన మన జీవితాలలో కూడా అంతే, ఎందుకంటే మనం దేవునికి ఇస్తానుసారంగా జీవిస్తే మన జీవితాలలో అద్భుతాలు జరుగుతాయి ఆలా కాకుండా దేవునికి వెతిరేకంగా జీవిస్తే కష్టాలు తప్పవు. దీనికి ఉదాహరణ  మనం ఈ మొదటి పఠనములో చూస్తున్నాము.

యెషయా గ్రంధంలో, యెషయా ప్రవక్తగా ఎన్నిక చేయబడిన రోజులలో షబ్న అనే అధికారి దేవునికి వెతిరేకంగా జీవిస్తున్నపుడు దేవుడు యెషయా ప్రవక్తను అతని యొద్దకు పంపిస్తూ తన అధికారం నుండి తనని తొలగించి ఎల్యాకీమును అతని స్థానములో రాజు యొక్క భవనంలో అధికారిగా చేయటం చూస్తున్నాము.అసలు దేవుడు షబ్నను ఎందుకు అధికారంలోనుండి తీసివేస్తునాడో ఇప్పుడు మనమందరము కూడా ఈ మొదటి పఠనములో చూద్దాము. షబ్న హిజ్కియా రాజు పరిపాలన కాలంలో షబ్న ఒక ఉన్నత అధికారిగా నియమింపబడ్డాడు.

రాజా భవనంలో ఒక అధికారి అంటే ఆటను రాజు తరవాత రాజు వంటి వాడు. అట్టి స్థానాన్ని పొందిన షబ్న, ఒక నాడు అసిరియా రాజు యూదా రాజ్యంపై దండెత్తి వస్తున్న సమయంలో హిజ్కియా రాజు యెషయా ప్రవక్తను పిలిచి యుధం గురించి అడిగినప్పుడు యెషయా ప్రవక్త చెబుతున్నాడు మీరు దేవునిపై ఆధారపడి, దేవునిపై విశ్వాసం ఉంచి ముందుకు బయలుదేరండి అంత మీకు మంచి జరుగును అని చెప్పినప్పుడు, షబ్న ప్రవక్తకు మరియు దేవునికి వెతిరేకంగా వెళుతూవున్నాడు అదేమిటంటే దేవునిపై ఆధారపడకుండా ఐగుప్త  రాజునూ సహాయమాడగమని చెబుతూ హిజ్కియా రాజును తప్పు దారిలో నడిపిస్తున్నాడు అందుకే దేవుడు షబ్నను తన అధికారంనుండి తొలగించి, ఆ అధికారాన్ని ఎల్యాకీముకు యిచ్చియున్నాడు.

ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏమిటంటే మనము కూడా మన జీవితంలో దేవునికి వెతిరేకంగా జీవిస్తూ ఉంటె మన జీవితాలలో కూడా కష్టాలు వస్తాయని మొదటి పఠనం తెలియజేస్తుంది. దేవుడు వివేకమంతుడు, విజ్ఞానవంతుడు కాబట్టి ఆయనయందు ఎవరైతే విశ్వాసంతో జీవిస్తారో అతి వారు దేవుని యొక్క బిడ్డలుగా ఎన్నుకోబడతారని తెలియజేస్తుంది.ఇక్కడ మనం అప్పుడైతే దేవుడు ఇచ్చిన మార్గంలో జీవిస్తామో దేవుడు మనలందరినీ నూరంతలాగా దివిస్తాడని రెండొవ పఠనము మనకు తెలియజేస్తుంది.

చివరిగా సువిశేష పతనాన్ని మనం ధ్యానించినట్లతే క్రీస్తు ప్రభు శిస్యులను అడుగుచున్నాడు, అదేమిటంటే మీరు నన్ను గూర్చి ఏమి అనుకొనుచున్నారు అని. అప్పుడు సీమోను పేతురు ప్రభువుతో అంటున్నారు నీవు సజీవ దేవునియొక్క కుమారుడని. ఇక్కడ మన గమనించాలి ఏవిధంగానైతే క్రీస్తు ప్రభు శిస్యులను అడిగాడో అదేవిధంగా ఈ రోజు నిన్ను నన్ను క్రీస్తుప్రభు అడుగుచున్నారు మీరు నా గురించి ఏమనుకుంటున్నారు అని. మరి మన సంధానం ఏమిటి పేతురు వాలే ఉందా లేదా అని మనలను మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే పేతురు క్రీస్తు ప్రభును దేవునిగా అంగికరించి క్రీస్తుపై విశ్వాసం ఉంచి జీవించాడు కాబ్బటి, క్రీస్తు ప్రభు తన అధికారాన్ని పేతురుకు అప్పజెబుతునాడు. మరి అధికారం ఏమిటని మనం ఛుసినట్లతే ఎవిధంగానైతే తండ్రి దేవుడు షెబ్నా యొక్క అధికారాన్ని ఎల్యాకీముకు ఇచ్చాడో  అదే విధంగా క్రీస్తు ప్రభు పరలోక రాజ్యపు యొక్క తాళాలను పేతురు చేతికి ఇస్తున్నాడు.

కాబట్టి క్రిస్తునాధునియందు ప్రియా సహోదయులారా ఈ రోజు మనమందరము కూడా ప్రార్ధించుకుందాం ఎటువంటి జీవితాన్ని నేను జీవిస్తున్నాను అని. పేతురు వాలే విశ్వాసం కలిగి ఎల్యాకీము వాలే ఉన్నత అధికారాన్ని అందుకుంటున్నానా లేక షబ్న వాలే అవిశ్వాసంతో జీవిస్తున్నానా అని. మనలను మనం ప్రశ్నించుకుంటూ ఈ యొక్క పూజ బలిలో పాల్గొందము.

 

Dn. Johannes VeeraPogu OCD

19, ఆగస్టు 2023, శనివారం

20 వ సామాన్య ఆదివారం

 

20 వ సామాన్య ఆదివారం

యెషయ 56:1, 6-7

రోమియులు 11:13-15,29-32

మత్తయి: 15:21-28

 

ఈనాటి దివ్య గ్రంథ పఠణాలు దేవుని యొక్క రక్షణము ప్రపంచమంతటకు విస్తరిల్ల చేయబడినది అనే అంశము గురించి. అందరూ కూడా ఆయన రక్షణకు అర్హులే అనే అంశమును ప్రభువు తెలియచేస్తున్నారు. ఆయన అందరిని రక్షించుటకు సంసిద్ధముగా ఉన్నారు. ఎవరైతే ఆయనను తెలుసుకొని ఆయన చెంతకు వచ్చి ఆయన రక్షణ కొరకు ఎదురు చూస్తారో వారందరూ కూడా దీవించబడతారు. చాలా సందర్భాలలో మనందరికీ కూడా ఎదురయ్యేటటువంటి ప్రశ్న ఏమిటంటే నేను రక్షణ పొందగలనా? అదే విధముగా కొన్ని కొన్ని సందర్భాలలో మనము మంచిగా జీవించకపోతే మరణించే సమయంలో రక్షణ పొందుతామా లేదా? అని అలా ఆలోచన చేసే వారందరికీ ఈనాటి దివ్య పఠణాలు రక్షణ అందరూ పొందుతారు అని అంశమును గురించి బోధిస్తున్నాయి. 

కాకపోతే మన జీవితంలో మనము గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని అంశాలు ఏమిటంటే మొట్టమొదటిగా మన జీవితంలో  అంతట మనము రక్షణ పొందలేము కేవలం దేవుడు మాత్రమే మనకు రక్షణ ప్రసాదించగలరు. రెండవదిగా దేవుని యొక్క రక్షణ అందరికీ చెందుతూ ఉంది. కాబట్టి వినయముతో విశ్వాసముతో జీవించాలి. మూడవదిగా నేనే మాత్రమే రక్షణ పొందగలను అనే అహంతో ఎవరు కూడా ఉండకూడదు వారి యొక్క మతమును బట్టి కానీ, జీవితమును బట్టి గాని, లేదా వారు చేసే కార్యమును బట్టి గాని గర్వంగా ఉండకుండా జీవించినప్పుడే దేవుని యొక్క రక్షణ పొందగలుగుతారు.

దేవునికి ఎవరు నశించి పోవుట ఇష్టము లేదు (2 పేతురు 3:9), యెహెజ్కె 18:23, 33:11.

అదే విధముగా దేవుడికి ఎవ్వరూ కూడా ఏ దేశం కూడా ఒక ప్రత్యేకమైనది కాదు అందరూ కూడా ఆయన దృష్టిలో సరి సమానులే అందుకనే ఆయన అందరి మీద వర్షమును, సూర్యుడిని కురిపింప చేస్తున్నారు.

ఈనాటి మొదటి పఠణంలో దేవుడు యెషయ‌ప్రవక్త ద్వారా తన యొక్క రక్షణ అందరికీ కూడా చెందుతుంది అనే అంశం గురించి తెలియజేశారు. సృష్టి ప్రారంభంలో మానవుడు దేవుడు యొక్క మాటను అవిధేయించినప్పటి నుండి దేవుడు మానవుడుని రక్షించాలి అని అనుకున్నారు. దానిలో భాగంగానే ఆయన అబ్రహామును ఎన్నుకున్నారు ఆయన ద్వారా మిగతా దేశాలందరినీ రక్షించాలని అనుకున్నారు. అబ్రహాము యొక్క సంతతి తామే దేవుని బిడ్డలం అనేటటువంటి అహంతో జీవించకుండా దేవుడు మిగతా వారిని కూడా తన బిడ్డలగా అంగీకరిస్తున్నారు అనే సత్యమును ఈనాటి మొదటి పఠణం వెల్లడిస్తున్నది. ప్రభువు అంటున్నారు ఎవరైతే తన యొక్క నీతి న్యాయమును పాటిస్తూ ఉంటారో వారందరూ కూడా రక్షణ పొందుతారు అని తెలుపుతున్నారు. యెరుషలేములో ఉన్న దేవుని ఆలయం అందరికీ ప్రార్థనాలయం అవుతుంది అని తెలిపారు. అనగా అందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో చేరి ఆ ప్రభువుని స్తుతించి ఆరాధిస్తారని దేవుడు కేవలం ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే కాకుండా మిగతా వారిని కూడా తన బిడ్డలగా స్వీకరిస్తున్నారు. 

యావే దేవుడు చాలా సందర్భాలలో ప్రవక్తల ద్వారా తెలియచేయాలనుకున్న అంశం ఏమిటంటే ఆయన అందరికీ ప్రభువుని. కేవలం యూదులకు మాత్రమే కాకుండా  అన్యులకు కూడా ఆయన ప్రభువు అని తెలియచేయాలనుకున్నారు దానికి ముఖ్య నిదర్శనం ఈనాటి మొదటి పఠణం. ప్రభువు ఎందుకు అన్యులను ఇశ్రాయేలీలతో కలవకూడదు అన్నారు అంటే ఇశ్రాయేలీయులు దేవునికి దూరమైనా సమయాలు చాలా ఉన్నాయి, విగ్రహారాధన చేసిన సమయాలు చాలా ఉన్నాయి అందుకనే ఈ అన్యుల యొక్క జీవితము వారిలాగా మారకూడదు అనే ఆలోచనతో యావే దేవుడు అన్యులను ఇశ్రాయేలీలతో కలవ వద్దన్నారు.

 కానీ ఈ మాటలను ఇస్రాయేలీయులు తమ స్వంత స్వార్థం కోసం తప్పుగా అర్థం చేసుకున్నారు వారి యొక్క ఆలోచన ఏమిటంటే కేవలం వారు మాత్రమే దేవుని చేత ఎన్నుకొనబడ్డవారని, రక్షణ కేవలం వారికి మాత్రమే చెందినది అని మిగతా  వారు రక్షణ పొందలేరు అనే అంశాన్ని వారు తప్పుగా అర్థం చేసుకున్నారు. కొంతమంది యూదుల యొక్క ఆలోచన ఏమిటంటే అన్యులు కూడా రక్షణ పొందుతారు కానీ వారు మొదటిగా యూదా మతాన్ని స్వీకరించినప్పుడు మాత్రమే. ఈ మొదటి పఠణము మనకి తెలియచేసే అంశం ఏమిటంటే దేవుని యొక్క రక్షణ అందరికీ చెందినది అందరూ కూడా ఆయనకు ఇష్టమైన వారు కేవలం ఆయనను తెలుసుకొని విశ్వసించి వెంబడించే వారందరూ కూడా ప్రభువుని రక్షణను పొందుతారు.

ఈనాటి రెండవ పఠణంలో కూడా పౌలు గారు ఆయన ఎన్నుకొనబడినది అన్యులకు  సువార్త ప్రకటన చేయుటకు, తన యొక్క సువార్త ప్రారంభంలో పౌలు గారు మొదటిలోనూ యూదులకు సువార్త ప్రకటించినప్పుడు వారు ఎవ్వరు కూడా దానిని అంగీకరించలేదు అందుకని పౌలును అన్యులకు సువార్త బోధించుటకు వివిధ ప్రాంతాలకు ప్రయాణమై వెళ్లారు ఆయన బోధించిన ప్రతి చోట కూడా అన్యులు దేవుని యొక్క సువార్త  అంగీకరించారు దేవుని యొక్క సువార్తను రక్షణను పొందారు. అవును అన్యుల యొక్క అపోస్తులను అని పిలుస్తుంటారు పిలుస్తుంటారు. ఏసుక్రీస్తు నందు అందరూ కూడా రక్షణ పొందుతారు అనే అంశాన్ని పౌలు గారు తెలియజేశారు. 

ఈనాటి సువిశేష పట్టణంలో దేవుడు కననీయ స్త్రీ యొక్క ప్రార్థనను ఆలకించిన విధానం గురించి తెలియజేస్తున్నారు. కననియ స్త్రీ యూదా మతమునకు చెందినటువంటిది కాదు అయినప్పటికీ కూడా ఆమె ఏసుప్రభువును దావీదు కుమారుడా అని సంబోధిస్తున్నది అంటే ఆయన గురించి బహుశా ఆమె విని ఉండవచ్చు, ఆయన గొప్పతనమును అద్భుత కార్యములను తెలుసుకొని ఉండవచ్చు, అందుకని దావీదు కుమారుడా అని ఆమె సంబోధిస్తున్నది. ఏసుప్రభు ఆమె మొరను ఆలకించినప్పటికీ ఆమెలో ఉన్నటువంటి గొప్ప విశ్వాసమును బయటకు తీసుకుని రావటకు మరియు మిగతా అక్కడ ఉన్న శిష్యులకు అందరకు అన్యుల యొక్క విశ్వాసము ఎంత గొప్పది అని తెలియజేయుటకు ప్రభువు ఆమె మెరుపు పెడచెవిని పెట్టిన విధంగా ఆయనవ మనందరికీ కూడా కనబడుతున్నారు. కానీ వాస్తవానికి ఏసుప్రభువు అన్యులను ఎక్కువగా ప్రేమించారు ఎందుకంటే ఆయన సువార్తను చాలా అన్య ప్రదేశాలలో బోధించారు, వారితో కలసి భుజించారు,ప్రయాణం చేశారు జీవించారు. ఈమె యొక్క విన్నపమును కూడా దేవుడు గౌరవించారు కేవలము ఆమెను ఒక సుమాతృకగా ఇతరులకు చూపించటకు మాత్రమే ప్రభువు ఆమెను తృణీకరించిన విధముగా ఇక్కడ కనబడుతున్నారు. 

ఈమె యొక్క విశ్వాస జీవితము నుంచి కొన్ని అంశాలు మన ఆధ్యాత్మిక జీవితమునకు తీసుకోవాలి. మొదటిగా ఆమెలో ఉన్న విశ్వాసం- ఆమె విశ్వాసము చాలా గొప్పది ఎందుకంటే ఏసుప్రభువు మాత్రమే తన కుమార్తెకు స్వస్థతను ప్రసాదించగలరు అని ఆమె విశ్వసించినది కాబట్టే యూదులకు అన్యులకు మధ్య ఉన్న భేదాలు ఏమి పట్టించుకోకుండా ఆమె ఏసుక్రీస్తు ప్రభువు చెంతకు రాగలిగినది ఆమె విశ్వాసము ద్వారానే తన కుమార్తెకు స్వస్థతను చేకూర్చుకోగలిగినది.

రెండవదిగా ఆమెలో ఉన్న పట్టుదల-ఏసుప్రభు తనను కొంచెం బాధించే విధంగా మాట్లాడినప్పటికీ ఆమె తన పట్టుదల కోల్పోలేదు పదేపదే అడుగుతూనే ఉంటూ ఉన్నది ఆ యొక్క పట్టుదలను బట్టి తను అనుకున్నది సాధించగలుగుతున్నది. యాకోబుకు కూడా పట్టుదల ఎక్కువగా ఉన్నది కాబట్టే ఆయన దేవునితో కుస్తిపట్టే సందర్భంలో దేవుడి చేతిని విడిచిపెట్టడం లేదు అప్పటికే ఆయన తుంటి ఇరిగినప్పటికీ ఆయన దేవుడిని ఆశీర్వదించమని అడుగుతున్నారు ఆశీర్వదిస్తేనే నేను మిమ్మల్ని వదిలిపెట్టను అని పట్టుదలతో అడిగాడు కాబట్టే ఆయన అనుకున్నది పొందగలిగాడు కాబట్టి మనం కూడా మన విశ్వాస జీవితంలో పట్టుదలను ఎప్పుడూ మరచిపోకూడదు అడుగుతూనే ఉండాలి ప్రయత్నం చేస్తూనే ఉండాలి కష్టపడుతూనే ఉండాలి అప్పుడు మాత్రమే మన జీవితంలో ఫలితములు చూడగలుగుతుంటాము.

మూడవదిగా ఆమెలో ఉన్న వినయం: ఏసుప్రభు ఆమెతో సంభాషణీ సందర్భంలో బిడ్డల రొట్టెలను కుక్కలకు వెయ్యి తగదు అని ప్రభువు ఆమెతో అన్నారు ఈ మాటలు ఎవరు విన్నా సరే బాధపడుతూ ఉంటారు కానీ ఆమె మాత్రం ఏమి కూడా పట్టించుకోకుండా ఏసుప్రభువుకి ఎంతో వినయముతో సమాధానం చెబుతుంది అది ఆమెలో ఉన్న గొప్ప వినయం. 

కొన్ని కొన్ని సందర్భాల్లో మనల్ని ఎవరో తిట్టారు ఏదో అన్నారని మనం నిరాకరించబడ్డామని చాలామంది తాము సాధించాల్సింది మరిచిపోతూ ఉంటారు దేవాలయపు దూరమై వెళుతూ ఉంటారు కానీ ఈమె మాత్రం ఏసుప్రభువు చెప్పిన ప్రతి మాటను వినయముతో అంగీకరించి స్వీకరించినది అందుకని ఏసుప్రభు ఆమె విశ్వాస జీవితమును మెచ్చుకుంటున్నారు. దేవుని యొక్క రక్షణలో అందరూ కూడా భాగస్తులే కాబట్టి ఆయనను విశ్వసించి జీవించాలి.

 

Fr. Bala Yesu OCD

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...