26, ఆగస్టు 2023, శనివారం

 

21వ సామాన్యఆదివారం

మొదటి పఠనం: యెషయా 22:15, 19-23

రెండొవ పఠనం: రోమియులు 11:33-36

సువార్త: మత్తయి 16:13-20

 

 

క్రీస్తునాధునియందు ప్రియమైనటువంటి సహోదరి, సహోదరులారా ఈనాడు మనమందరం  కూడా సామాన్యకాలపు 21  ఆదివారంలోనికి ప్రవెశించియున్నాం. ఈనాటి మూడు దివ్యగ్రంధ  పఠనాలను మనం ధ్యానించినట్లైతే  మూడు పఠనాలు మనకు తెలియజేసే అంశం ఏమిటంటే. దేవుడు మనకు ఇచ్చిన అధికారాన్ని విశ్వాసంతో పాటించినట్లయితే మన జీవితాలలో గొప్ప అద్భుతాలు జరుగుతాయని ఈ మూడు పఠనాలు మనకందరికీ తెలియజేస్తున్నాయి. ఆలా కాకుండా దేవునికి వ్యతిరేకంగా లేక ఇష్టానుసారంగా జీవించినట్లైతే షబ్న వాలే మన మందరము కూడా దేవుని యొక్క దండనకు గురి అవుతామని చెబుతున్నాయి.

నేటి సమాజంలో మనం చూస్తుంటాము అనేక మంది ఉన్నత అదికారాలలో ఉన్నపుడు వారు వారి ఇష్టానుసారంగా జీవిస్తున్న సమయాలలో వారి జీవితంలో  మనశాంతి లేకుండా పోతుంది  దానికి కారణం వారు దేవునికి విధేయులై జీవించకపోవటం. క్రైస్తవులమైన మన జీవితాలలో కూడా అంతే, ఎందుకంటే మనం దేవునికి ఇస్తానుసారంగా జీవిస్తే మన జీవితాలలో అద్భుతాలు జరుగుతాయి ఆలా కాకుండా దేవునికి వెతిరేకంగా జీవిస్తే కష్టాలు తప్పవు. దీనికి ఉదాహరణ  మనం ఈ మొదటి పఠనములో చూస్తున్నాము.

యెషయా గ్రంధంలో, యెషయా ప్రవక్తగా ఎన్నిక చేయబడిన రోజులలో షబ్న అనే అధికారి దేవునికి వెతిరేకంగా జీవిస్తున్నపుడు దేవుడు యెషయా ప్రవక్తను అతని యొద్దకు పంపిస్తూ తన అధికారం నుండి తనని తొలగించి ఎల్యాకీమును అతని స్థానములో రాజు యొక్క భవనంలో అధికారిగా చేయటం చూస్తున్నాము.అసలు దేవుడు షబ్నను ఎందుకు అధికారంలోనుండి తీసివేస్తునాడో ఇప్పుడు మనమందరము కూడా ఈ మొదటి పఠనములో చూద్దాము. షబ్న హిజ్కియా రాజు పరిపాలన కాలంలో షబ్న ఒక ఉన్నత అధికారిగా నియమింపబడ్డాడు.

రాజా భవనంలో ఒక అధికారి అంటే ఆటను రాజు తరవాత రాజు వంటి వాడు. అట్టి స్థానాన్ని పొందిన షబ్న, ఒక నాడు అసిరియా రాజు యూదా రాజ్యంపై దండెత్తి వస్తున్న సమయంలో హిజ్కియా రాజు యెషయా ప్రవక్తను పిలిచి యుధం గురించి అడిగినప్పుడు యెషయా ప్రవక్త చెబుతున్నాడు మీరు దేవునిపై ఆధారపడి, దేవునిపై విశ్వాసం ఉంచి ముందుకు బయలుదేరండి అంత మీకు మంచి జరుగును అని చెప్పినప్పుడు, షబ్న ప్రవక్తకు మరియు దేవునికి వెతిరేకంగా వెళుతూవున్నాడు అదేమిటంటే దేవునిపై ఆధారపడకుండా ఐగుప్త  రాజునూ సహాయమాడగమని చెబుతూ హిజ్కియా రాజును తప్పు దారిలో నడిపిస్తున్నాడు అందుకే దేవుడు షబ్నను తన అధికారంనుండి తొలగించి, ఆ అధికారాన్ని ఎల్యాకీముకు యిచ్చియున్నాడు.

ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏమిటంటే మనము కూడా మన జీవితంలో దేవునికి వెతిరేకంగా జీవిస్తూ ఉంటె మన జీవితాలలో కూడా కష్టాలు వస్తాయని మొదటి పఠనం తెలియజేస్తుంది. దేవుడు వివేకమంతుడు, విజ్ఞానవంతుడు కాబట్టి ఆయనయందు ఎవరైతే విశ్వాసంతో జీవిస్తారో అతి వారు దేవుని యొక్క బిడ్డలుగా ఎన్నుకోబడతారని తెలియజేస్తుంది.ఇక్కడ మనం అప్పుడైతే దేవుడు ఇచ్చిన మార్గంలో జీవిస్తామో దేవుడు మనలందరినీ నూరంతలాగా దివిస్తాడని రెండొవ పఠనము మనకు తెలియజేస్తుంది.

చివరిగా సువిశేష పతనాన్ని మనం ధ్యానించినట్లతే క్రీస్తు ప్రభు శిస్యులను అడుగుచున్నాడు, అదేమిటంటే మీరు నన్ను గూర్చి ఏమి అనుకొనుచున్నారు అని. అప్పుడు సీమోను పేతురు ప్రభువుతో అంటున్నారు నీవు సజీవ దేవునియొక్క కుమారుడని. ఇక్కడ మన గమనించాలి ఏవిధంగానైతే క్రీస్తు ప్రభు శిస్యులను అడిగాడో అదేవిధంగా ఈ రోజు నిన్ను నన్ను క్రీస్తుప్రభు అడుగుచున్నారు మీరు నా గురించి ఏమనుకుంటున్నారు అని. మరి మన సంధానం ఏమిటి పేతురు వాలే ఉందా లేదా అని మనలను మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే పేతురు క్రీస్తు ప్రభును దేవునిగా అంగికరించి క్రీస్తుపై విశ్వాసం ఉంచి జీవించాడు కాబ్బటి, క్రీస్తు ప్రభు తన అధికారాన్ని పేతురుకు అప్పజెబుతునాడు. మరి అధికారం ఏమిటని మనం ఛుసినట్లతే ఎవిధంగానైతే తండ్రి దేవుడు షెబ్నా యొక్క అధికారాన్ని ఎల్యాకీముకు ఇచ్చాడో  అదే విధంగా క్రీస్తు ప్రభు పరలోక రాజ్యపు యొక్క తాళాలను పేతురు చేతికి ఇస్తున్నాడు.

కాబట్టి క్రిస్తునాధునియందు ప్రియా సహోదయులారా ఈ రోజు మనమందరము కూడా ప్రార్ధించుకుందాం ఎటువంటి జీవితాన్ని నేను జీవిస్తున్నాను అని. పేతురు వాలే విశ్వాసం కలిగి ఎల్యాకీము వాలే ఉన్నత అధికారాన్ని అందుకుంటున్నానా లేక షబ్న వాలే అవిశ్వాసంతో జీవిస్తున్నానా అని. మనలను మనం ప్రశ్నించుకుంటూ ఈ యొక్క పూజ బలిలో పాల్గొందము.

 

Dn. Johannes VeeraPogu OCD

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...