4, సెప్టెంబర్ 2025, గురువారం

22 వ సామాన్య ఆదివారం

22 వ సామాన్య ఆదివారం

మొదటి పఠనము    సిరాకు : 3 :17 -18 ,20 ,28 ,29

రెండవ పఠనము     హెబ్రి 12 : 18-19-,22-24

సువార్త పఠనము     లూకా  14 : 1, 7-14

          క్రీస్తు నాదునియందు ప్రియమయిన విశ్వాసులారా, దేవును బిడ్డలారా ఈనాడు తల్లి అయిన శ్రీ సభ దేవుని యొక్క వాక్యాని ఆలకించి, ధ్యానించి, వాక్యానుసరముగా జీవించమని మనందరిని 22 వ సామాన్య ఆదివారము లోనికి ఆహ్వానిస్తుంది.

ఈనాటి ఈ మూడు పఠనముల ముఖ్య ఉదేశ్యం మరియు ధ్యానంశం  క్రైస్తవ జీవితం – వినయం కలిగిన జీవితం

ప్రతి క్రైస్తవుడు కూడా తన జీవితంలో దేవున్ని దగ్గర మరియు తన తోటి సహోదరుల  దగ్గర  వినయత్మకంగా మెలగాలి. వినయం అనే గుణము మనలో వుంటే ప్రతి ఒక్కరు కూడా దేవునిచే దీవించబడతారు అదేవిధంగా మన తోటి మానవుల చేత ప్రేమించాబడతాము. మానవుడి హృదయంలో ఉండే గర్వాన్ని, అహంకారాన్ని దేవుడు ఎలా నిరసిస్తాడో, వినమ్రత ద్వారా మనం ఎలా ఆయనకు ప్రియపడతామో ఈ రోజు ధ్యానించే   వాక్యాలు మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాయి.

మొదటి పఠనము  పఠనంలో, జ్ఞానగ్రంథకర్త మనకు ఒక మంచి ఉపదేశం ఇస్తున్నాడు:

"కుమారా! నీవు చేయు పనులన్నిట వినయముతో చేయుము ................... ." (సిరాక్ 3:17-18, 20)

అంటే మనము దీనులమై  యుంటే, దేవుని అనుగ్రహము మన మీద  కురిపిస్తాడు . మనము  చేయగలిగినంత వరకు దీనులకు సహాయము చేయాలి. అప్పుడే  దేవుడు మన మనవులను ఆలకిస్తాడు. ఇక్కడ "దీనుడవై యుండు" అంటే గర్వం లేకుండా, తన్ను తాను చిన్నచూపు చూసుకునే వినమ్ర భావంతో ఉండమని అర్థం. తన శక్తి కొలది ఇతరులకు సేవ చేసే వారిని దేవుడు ప్రేమిస్తాడు. సిరాక్ మరో ముఖ్యమైన విషయం చెప్పాడు: "వినమ్రత విద్యకు తలబంతి". వినమ్రత లేనివాడు ఎంత చదివినా, ఎంత తెలివైనవాడైనా, నిజమైన జ్ఞానాన్ని పొందలేడు. ఇక్కడ మనము వినయానికి మరియు గర్వానికి వున్నా వ్యత్యసాన్ని గమనించవచ్చు.

గర్వం దేనివలన వస్తుంది: 3 కారణాలు

1.       నేను నాపైనే  ఆధారపడి జీవించగలను అన్న ఆలోచన వచ్చినప్పుడు.

2.      తన సంపద వలన.

3.      తనకున్న విజ్ఞానం వలన.

 

1.      నేను నాపైనే  ఆధారపడి జీవించగలను అన్న ఆలోచన వచ్చినప్పుడు.

మనం కొన్నిసార్లు స్వయం-ఆధారితత్వాన్ని(self-dependence), నాపై నేను ఆధారపడగలను  అనుకునే సంస్కృతిలో జీవిస్తున్నాము. స్వతంత్రంగా ఉండడం, తన స్వంత ప్రయత్నాలతో ముందుకు సాగడం, తన సొంత జీవితాన్ని  తనే నిర్మించుకోవడం మనకు చూస్తుంటాము . కాని వ్యక్తిగత బాధ్యతకు ఒక స్థానం ఉంది, కానీ ఈ మనోభావం/ఆలోచన మన ఆధ్యాత్మిక జీవితంలోకి ప్రవేశించినప్పుడు, అది మన శక్తి మరియు జీవానికి మూలమైన దేవుని నుండి మనల్ని వేరు చేసే పరిస్థితులు ఉంటాయి. మనం ఎప్పుడు దేవుని మీద ఆధారపడి జీవించాలి. ఎందుకంటే ఆయనే మనకు జీవము,మూలము [అపో.కా. 17 : 28]. మనము ఆ దేవుని పోలికలము [ఆది. 2:7].

ఈ రోజు, దేవుడిపై ఆధారపడకుండా మనపైనే ఆధారపడటం గురించి బైబిల్ ఏమి చెబుతుందో  పరిశీలిద్దాం

మొట్టమొదటి పాపం కేవలం ఒక పండు తినడం గురించి మాత్రమె కాదు; అది ఆధారపడే విధానంలో మార్పు గురించి చెబుతుంది . సాతాను ప్రలోభం ఏమిటంటే, దేవుని వాక్యంపై ఆధారపడటం మానేసి, స్వయంగా తీర్మానాలు తీసుకునే వ్యక్తిగా మారమని ఆదాము, అవ్వను ప్రేరేపిస్తుంది.

మూల పాపము (ఆదికాండం 3:4-5) అప్పుడు సర్పము స్త్రీతో ఇట్లనెను మీరు చావరు, మీరు దాని ననుభవించు దినమున మీ కన్నులు తెరచబడును, మీరు మంచిచెడ్డలు తెలిసికొని దేవతలవలె ఔదురు గనుక దేవుడు దానిని నిషేధించెననెను.

వారు తమకు తామే దేవుళ్లుగా మారగలరు, వారి స్వంత అవగాహన దేవుని ఆజ్ఞను తిరస్కరించారు. ఇదే మానవాళి యొక్క మూల పాపం: దేవుని ఆజ్ఞకు బదులుగా మన స్వంత తీర్పును నమ్మడం.

బాబెల్ గోపురం (ఆదికాండం 11:1-9)
ప్రజలు  తమలో తాము ఇలా అన్నారు"రండి, మనకు ఓ పట్టణాన్నీ, పైకి ఆకాశం వరకు ఎత్తైన ఓ గోపురాన్నీ కట్టుకుందాం. అప్పుడు మనకు పేరు రాగలదు." వారి నిర్మాణం  మానవ సాధ్యత మరియు స్వయం-గౌరవానికి ఒక స్మారకచిహ్నంగా ఉండేది, దేవునిపై ఆధారపడటం to entirely devoid. దేవుడు వారి భాషను గందరగోళపరచి, వారిని చెదరగొట్టాడు. మానవ స్వయం-సంపూర్ణతపై నిర్మించబడిన ఎలాంటి నిర్మాణం , అది ఎంతగా impressing ఉన్నా, దేవుని సంకల్పానికి ఎదురు నిలవదు.

2.      తన సంపద మీద ఆధారపడటం వలన.

ధనిక మూఢుడు (లూకా 12:16-21) 

యేసు ఒక successful రైతు యొక్క ఉపమానాన్ని చెబుతాడు, తన  పంటలు అత్యధిక దిగుబడిని  ఇచ్చాయి. అతను తనలో తనే ఇలా అన్నాడు"నా ప్రాణా, నీకు అనేక సంవత్సరములవరకు పడియుండు ధనధాన్యాదులు గలవు, సుఖించుము, తిని, ద్రావకములు త్రావి, ఆనందించుము." అతని మొత్తం సంభాషణ తనతో తానే. అతను దేవునికి కృతజ్ఞత తెలియజేయలేదు, దేవునిని సంప్రదించలేదు, లేదా తన జీవితం దేవుని చేతుల్లో ఉందని పరిగణించలేదు. దేవుని అప్పుడు  ఇలా అన్నాడు "మూర్కుడా , ఈ రాత్రియే నిన్ను నీ ప్రాణము తీయబడును."  చివరగా యేసు ప్రభు ఇలా  చెప్తారు "తనకొరకు ధనమును సంగ్రహించుకొని దేవునికి ధనవంతుడు కానివాడు ఈలాగే ఉందును.

3.      తనకున్న విజ్ఞానం వలన.

             కొరింథీయులు 3:18-20

పౌలు స్పష్టంగా హెచ్చరిస్తాడు. "ఎవడైనను తనకు తానే జ్ఞానవంతుడని భావించినయెడల, అతడు మూఢుడగు నట్లు భావించుకొనియెడల, అతడు నిజముగా జ్ఞానవంతుడగును. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి మూఢత్వము..." ఈ లోకం యొక్క జ్ఞానం దేవుని దృష్టిలో మూఢత్వమే. దేవుని జ్ఞానం కన్నా తన స్వంత బుద్ధిని, తర్కాన్ని ఎక్కువగా విలువిస్తే, అది దేవునికి వ్యతిరేకంగా గర్వంగా మారుతుంది, ఇది పాపం.

యెషయా 5:21 దేవుడు తనను తానే జ్ఞాని అని భావించే వారిని గర్విష్ఠులుగా నిందిస్తాడు.

కనుక ప్రియమయిన దేవుని బిడ్డలారా ఎల్లప్పుడూ వినయము కలిగి జీవించాలి. లేకపోతే మనం దేవుని నుండి దూరం అవుతాము. మనం చేసే ప్రతి పనిని కూడా వినయముతో చేయాలి. అప్పుడే దీవునికి మహిమా కలుగుతుంది. మన గీవితం ద్వారా దేవుడు ఎప్పుడూ కూడా మహిమ పరచాబడాలి.

సువార్త పఠనము  పఠనంలో , యేసు ప్రభువు మనకు వినమ్రత గురించి ఒక చక్కని ఉపమానం ద్వారా బోధిస్తున్నాడు.

"నీవు ఎవరినైనా వివాహమునకు ఆహ్వానించినప్పుడు, గౌరవస్థానములలో కూర్చొనవద్దు... కడపటి స్థానమున కూర్చొనుము. అప్పుడు నిన్ను ఆహ్వానించినవాడు వచ్చి 'స్నేహితుడా, ముందుకు రా' అని చెప్పును." (లూకా 14:8, 10)

ఇది కేవలం ఒక సామాజిక టిప్పు కాదు. ఇది మన ఆధ్యాత్మిక జీవనానికి అవసరం అయ్యే సూత్రం. దేవుని ఎదుట  మనందరం పాపులు. మనకు ఎటువంటి హక్కు లేదు. కానీ మనం మన పాపపు దీనత్వాన్ని గుర్తించి, దేవుని దయ మీద ఆధారపడి జీవిస్తే, ఆయన తన విందులో మనల్ని "ముందున్న స్థానానికి" ఆహ్వానిస్తాడు. అంటే, మనకు నిత్యజీవాన్ని, ఆనందాన్ని ఇస్తాడు.

 ఉదా : సెయింట్ ఆగస్టీన్ చెప్పినట్లు"వినమ్రత సత్యానికి పునాది". దేవుడే సత్యం. కాబట్టి, వినమ్రత లేకుండా మనం దేవుణ్ణి, ఆయన సత్యాన్ని ఎప్పటికీ తెలుసుకోలేము.

మరియు ప్రభువు మరొక ముఖ్యమైన బోధన ఇస్తాడు: "నీ విందునకు నీ స్నేహితులను, నీ సహోదరులను, నీ బంధువులను, నీ పొరుగువారిని ఆహ్వానించకుము... దరిద్రులను, వికలాంగులను, మొండివారిని, గ్రుడ్డివారిని ఆహ్వానించుము."

దీని అర్థం మన సేవ, మన ప్రేమ నిస్వార్థంగా ఉండాలి. ఎవరిని ఆహ్వానిస్తే తిరిగి మనకు లాభం వస్తుందో కాకుండా, ఎవరికి నిజంగా అవసరమో, ఎవరు తిరిగి ఇవ్వలేరో అలాంటివారికి సేవ చేయాలి. ఇదే నిజమైన వినమ్రత మరియు నిస్వార్థ ప్రేమ.

 ఉదా : సెయింట్ తెరేసా ఆఫ్ కల్కట్టా (మదర్ తెరేసా) ఈ సూత్రాన్ని తన జీవితంలో నిలబెట్టుకుంది. ఆమె "అత్యంత దరిద్రులలో దరిద్రురాలు"గా మారింది. సమాజం విస్మరించిన, త్యజించిన వ్యక్తులను ఆదరించి, వారి జీవితం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పింది. ఆమె సేవకు ఎటువంటి ప్రతిఫలం అపేక్షించలేదు. ఇది నిజమైన ఖ్రీస్తుపోలిక.

ముగింపు :

చివరగా ప్రియ సహోదరులారా,

ఈ రోజు దైవవచనం మనల్ని మూడు విధాలుగా ఆహ్వానిస్తోంది:

1.     మన క్రియలలో వినమ్రత: మన పనులు, మన విజయాలు, మన ప్రతిభ అన్నీ దేవుని కృప వల్లనే అని గుర్తించి, గర్వించకుండా ఉండటం.

2.    ఇతరుల పట్ల వినమ్రత: మనకంటే తక్కువవారిని, బడుగు జీవితం గడిపేవారిని చిన్నచూపు చూడకుండా, వారికి నిస్వార్థంగా సేవ చేయడం.

3.    దేవుని వినమ్రత: ప్రార్థనలో, ఆరాధనలో తన పాపపు దీనత్వాన్ని గుర్తించి, దేవుని దయ మీద మాత్రమే ఆధారపడి ఉండటం.

మన ప్రభువు యేసు ఖ్రీస్తు స్వయంగా మనకు వినమ్రతకు ఆదర్శంగా నిలిచాడు. రాజుల రాజు అయినవాడు ఒక పశుశాలలో జన్మించాడు, ఒక బడుగు కుటుంబంలో పెరిగాడు, చివరికి మన పాపాలకు ప్రాయశ్చిత్తంగా భరించాడు. ఆయనే చెప్పాడు: "నేను సాత్వికుడను, హృదయము వినమ్రతగలవాడను; నా నుగ్గు ఆశ్రయించుకొనినవారికి విశ్రాంతి కలుగును" (మత్తయి 11:29).

ఈ వారంలో, ప్రభువు మన హృదయాలను వినమ్రతతో నింపి, ఇతరులకు సేవ చేసే భాగ్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిద్దాం.

Br. Sunny OCD

13, జూన్ 2025, శుక్రవారం

దేవుని ఆజ్ఞలు- బాహ్య ఆచరణ, ఆంతరంగిక శుద్ధి

 మత్తయి 5: 20-26

ధర్మ శాస్త్ర బోధకులకంటే, పరిసయ్యులకంటే మీరు నీతిమంతమైన జీవితమును జీవించిననేతప్ప పరలోకరాజ్యమున ప్రవేశింపరని చెప్పుచున్నాను. "నరహత్యచేయరాదు, నరహత్యకావించు వాడు తీర్పునకు గురియగునని పూర్వులకు శాశింపబడిన మాట మీరు వినియున్నారుగదా!నేను ఇప్పుడు మీతో చెప్పునదేమనగా: తన సోదరునిపై కోపపడువాడు తీర్పునకు గురియగును. అదే విధముగా తన సోదరుని 'వ్యర్థుడా!' అని అనువాడు నరకాగ్నిలో మ్రగ్గును. కనుక, బలిపీఠసన్నిధికి నీ కానుకను తెచ్చినప్పుడు నీ సోదరునికి నీపై మనస్పర్దయున్నట్లు నీకు స్ఫురించినచో, ఆ కానుకను పీఠము చెంతనే వదలిపెట్టి, పోయి,  మొదట నీ సోదరునితో సఖ్యపడి, తిరిగివచ్చి నీ కానుకను చెల్లింపుము. నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగనే అతనితో సత్వరము సమాధానపడుము. లేనిచో నీ ప్రతివాది నిన్ను న్యాయవాదికి అప్పగించును. న్యాయాధిపతి నిన్ను పరిచారకునికి అప్పగించును. అంతట నీవు చెరసాలలో వేయబడుదువు.  నీవు చెల్లింపవలసిన ఋణములో కడపటి కాసు చెల్లించువరకు నీవు చెరసాలలోనే ఉందువు అని నొక్కి వక్కాణించుచున్నాను.  

ఈ సువిశేషభాగంలో ఆంతరంగిక శుద్దిగురించి, మనం గొప్పవారిగా పరిగణించేవారి కంటే మనం మనం మంచి జీవితం జీవించాలని, సోదర ప్రేమ మరియు క్షమాగుణం కలిగి ఉండాలని, మొదట మనమే మనకు వ్యతిరేకంగా ఉన్నవారితో సఖ్యత ఏర్పరుచుకోవాలని ప్రభువు కోరుతున్నాడు. 

మీ నీతి బాహ్య ఆచరణ  లేక హృదయ శుద్ధి ఆవిష్కృతమా?

ధర్మ శాస్త్ర బోధకులకంటే, పరిసయ్యులకంటే మీరు నీతిమంతమైన జీవితమును జీవించిననేతప్ప పరలోకరాజ్యమున ప్రవేశింపరని చెప్పుచున్నాను. యేసు ప్రభువు ప్రధానమైన బోధ పరలోక రాజ్యము. ఈ రాజ్యములో ప్రతివక్కరికి  శాంతి సమాధానము ఉంటుంది. ఈ రాజ్యములో ప్రవేశించడానికి ధర్మ శాస్త్ర బోధకులకంటే పరిసయ్యులకంటే నీతి వంతమైన జీవితం జీవించాలని ప్రభువు చెబుతున్నాడు.  పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు నీతివంతమైన జీవితంలో ఏమైన లోపమున్నదా?  అంటే మరియొక సందర్భంలో ప్రభువు వారు చెప్పునది చెయ్యండి కాని వారు చేసేది కాదని చెప్పారు. ఈ ధర్మశాస్త్ర బోధకులు మరియు పరిసయ్యులు బాహ్యంగా మంచి పేరు పొందాలనే ఆశతో అనేక ఆధ్యాత్మిక పనులు చేస్తూ ఉన్నారు కాని వారి నీతి హృదయపూర్వకమైనది కాదు, కేవలం బయట కనపడుటకు మాత్రమే చేస్తున్నారు. అందుకే ప్రభువు వారితో మీ నీతో వారికంటే గొప్పగా ఉండాలి అని చెబుతున్నారు. దీనికి మనం చేయవలసినది హృదయ పరివర్తన కలిగివుండటం. మనం చేసే పని హృదయపూర్వకంగా చేయడం. దేవుని ఆజ్ఞలను ప్రేమతో పాటించాలి. నీతి అంటే మనం చేయవలసిన పని , లేక బాధ్యతను ఖచ్చితంగా, ఎటువంటి కపటత్వం లేకుండా చేయడం. ఇందుకు మనలోని కోపం, అసూయ, మొహలను త్యజించుకోవాలి. 

నీ సోదరుని గౌరవించుట 

 "నరహత్యచేయరాదు, నరహత్యకావించు వాడు తీర్పునకు గురియగునని పూర్వులకు శాశింపబడిన మాట మీరు వినియున్నారుగదా!నేను ఇప్పుడు మీతో చెప్పునదేమనగా: తన సోదరునిపై కోపపడువాడు తీర్పునకు గురియగును. అదే విధముగా తన సోదరుని 'వ్యర్థుడా!' అని అనువాడు నరకాగ్నిలో మ్రగ్గును.  ఈమాటలు పాత నిబంధనలో ఉన్న నరహత్య చేయరాదు అనే ఆజ్ఞకు నూతన వివరణ ప్రభువు ఇచ్చాడు.  ఒక సోదరుని వ్యర్థుడా అని చెప్పిన కూడా అది నేరంగా పరిగణించబడుతుందని ప్రభువు చెబుతున్నాడు. దీనినుండి మనం ఏ వ్యక్తిని కించపరచడం లేక అవమానించడం అనేవి కూడా దేవుడు మన నుండి ఆశించడం లేదు. నరహత్య చేయువాడు తీర్పునకు గురియగును అని పాత నిబంధన చెబుతుంటే ప్రభువు సోదరుణ్ణి వ్యర్థుడా అని సంబోధించినవాడు నరకాగ్నిలో మండును అని చెబుతున్నాడు. మన సోదరులను, బంధుమిత్రులను లేక ఈ లోకంలో ఏ వ్యక్తిని కించపరచడం, అవమానించడం అనేవి మనలను నరకాగ్నిలో మండేలా చేస్తాయి. మన సోదరులను గౌరవిస్తూ, మనకు సాధ్యమైనంత వరకు వారికి మంచి చేయుటకు ప్రయత్నించాలి. 

సఖ్యత కలిగి ఉండాలి

బలిపీఠసన్నిధికి నీ కానుకను తెచ్చినప్పుడు నీ సోదరునికి నీపై మనస్పర్దయున్నట్లు నీకు స్ఫురించినచో, ఆ కానుకను పీఠము చెంతనే వదలిపెట్టి, పోయి,  మొదట నీ సోదరునితో సఖ్యపడి, తిరిగివచ్చి నీ కానుకను చెల్లింపుము. ఈ మాటలు మన సోదరులతో మనకు ఉండవలసిన బాంధవ్యాలను గురించి తెలియజేస్తుంది. పవిత్ర గ్రంథంలో సహోదరుల మధ్యలో అమరికలు ఉండటం ఒకరి నాశనము మరియొకరు కోరుకోవడం ఎప్పుడు హర్షించలేదు. వారిని శిక్షించుటకు వెనుకాడలేదు. దైవ రాజ్యంలో చేరుటకు, దేవుడు మన ప్రవర్తను హర్షించుటకు మరియు మనలను శిక్షించకుండ ఉండుటకు ఏమి చేయవచ్చో యేసు ప్రభువు ఈ సువిశేషభాగంలో తెలియజేస్తున్నాడు. అది ఏమిటంటే మన సోదరులతో ఎప్పుడు సఖ్యత కలిగివుండటం. మన సోదరులకు మన మీద మనస్పర్ధ ఉందని మనకు తెలిస్తే ఆ సోదరునితో మొదటగా సఖ్యపడాలి. సఖ్యత, సమాధానం మన సోదరులతో ఎల్లపుడు మనకు ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. అది జరిగిన తరువాతనే మనం దేవునికి అర్పించే బలి అర్పించాలని చెబుతున్నారు. అపుడు దేవునికి బలి అర్పించే సమయంలో మన మనసులో ఏ చెడు ఆలోచనకాని, అసూయకాని మనలో ఉండదు. అది మనము పరలోక రాజ్యంలో చేరుటకు అర్హతను సాధిస్తుంది. 

నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగనే అతనితో సత్వరము సమాధానపడుము. ఏ వ్యక్తి కూడా నాశనము కావడం ప్రభువుకు ఇష్టంలేదు. కనుక యేసు ప్రభువు మనము ఏమి చేయాలో చెబుతున్నాడు. మన ప్రతివాదులతొ ముందుగానే సమాధాన పడాలి అని చెబుతున్నాడు. దాని ద్వారా మనం రానున్న శిక్షనుండి తప్పించుకొనవచ్చు. ఎల్లప్పుడూ మనం అందరితో సమాధానపడి జీవించుదాం. 

ప్రార్థన: 

ప్రభువా! మానవులు అందరు మీ రాజ్యంలో ఉండాలని కోరుకున్నారు. అందుకు మేము ఏమిచేయాలో నేర్పుతున్నారు. మా మనసు ఎల్లప్పుడు ఎటువంటి కల్మషం, అసూయా, ఇతరుల చేదు లేకుండా ఉండాలని కోరుతున్నారు.  మేము ఎటువంటి కపటత్వం లేకుండా ఉండాలని, హృదయ శుద్ధి కలిగి జీవించాలని కోరుతున్నారు. మా సోదరులలో సఖ్యత కలిగి ఉండాలని, ఎవరిని అవమానించకుండా, గౌరవించాలని నేర్పుతున్నారు. కేవలం చెప్పడమే కాక మీరు మాకు ఎలా జీవించాలో చూపించారు.  ప్రభువా మీరు చూపించిన జీవితానికి కృతజ్ఞతలు, మీ మాటలను, జీవితమును ఆదర్శముగా  తీసుకొని జీవించే భాగ్యమును మాకు అనుగ్రహించండి. ఆమెన్ 

9, జూన్ 2025, సోమవారం

మరియమాత శ్రీ సభ తల్లి

 యోహాను 19: 25-34 

యేసు సిలువ చెంత ఆయన తల్లియు, ఆమె సోదరి, క్లొఫా భార్యయగు  మరియమ్మయు, మగ్ధలా మరియమ్మయు నిలువబడి ఉండిరి. తన తల్లియు, తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచియుండుట యేసు చూచి, యేసు తన తల్లితో, "స్త్రీ! ఇదిగో నీ కుమారుడు!" అనెను. ఆ తరువాత శిష్యునితో "ఇదిగో నీ తల్లి" అనెను. శిష్యుడు ఆ గడియనుండి ఆమెను స్వీకరించి తన స్వంత ఇంటికి తీసికొనిపోయెను. పిదప, యేసు అంతయు సమాప్తమైనదని గ్రహించి, "నాకు దాహమగుచున్నది." అనెను. అక్కడ పులిసిన ద్రాక్షారసముతో నిండిన పాత్ర ఉండెను. వారు నీటి పాచిని ఆ రసములో ముంచి దానిని 'హిస్సోపు' కొలకు తగిలించి ఆయనకు అందించిరి. యేసు  ఆ రసమును  అందుకొని "సమాప్తమైనది" అని తలవంచి, ప్రాణము విడిచెను. అది పాస్కపండుగకు సిద్దపడు దినము. అందుచే యూదులు పిలాతును, "రేపటి విశ్రాంతి దినము గొప్పదినము. ఆనాడు దేహములు సిలువ మీద ఉండరాదు. కాళ్ళు విరుగగొట్టి వానిని దింపి వేయుటకు అనుమతినిండు" అని అడిగిరి. కావున సైనికులు వెళ్లి, యేసుతో పాటు సిలువవేయబడిన మొదటివాని కాళ్ళను, మరియొకని కాళ్ళను విరుగగొట్టిరి. కాని వారు యేసువద్దకు వచ్చినప్పుడు ఆయన అప్పటికే మరణించి ఉండుటను చూచి, ఆయన కాళ్ళు విరుగగొట్టలేదు. అయితే, సైనికులలో ఒకడు ఆయన ప్రక్కను బళ్లెముతో పొడిచెను. వెంటనే రక్తము, నీరు స్రవించెను. 

మరియమాత శ్రీ సభ తల్లి 

యేసు ప్రభువు మరణించే ముందు సిలువ మీద ఉన్నప్పుడు తాను ప్రేమించిన శిష్యుడు యోహానును పిలిచి ఇదిగో నీ తల్లి అని, మరియు మరియమాతతో యోహాను చూపిస్తూ ఇదిగో నీ కుమారుడు అని చెబుతున్నాడు. మరియమాత మనకు తల్లిగా తిరుసభను అన్ని విధాలుగా మనలను ఆదరిస్తుంది. ఎప్పుడు తిరుసభకు తోడుగా ఉంటూ, తిరుసభకు అవసరమైన వాటికోసం ప్రార్థిస్తుంది. 

ఇదిగో నీ కుమారుడు: పునీత యోహాను యేసు ప్రభువు ప్రేమించిన శిష్యుడు, కడరా భోజన సమయంలో యేసు ప్రభువుని హృదయమునుకు దగ్గరగా ఉన్నవాడు, ప్రభువుని ముఖ్యమైన ముగ్గురు శిష్యులలో ఒకడు. యేసు ప్రభువుని శ్రమల సమయంలో రహస్యంగా ప్రభువును అనుసరించినవాడు. ప్రభువు సిలువ మీద ఉన్నప్పుడు సిలువ క్రింద ఉన్నవాడు. అటువంటి శిష్యుని ప్రభువు తన తల్లికి అప్పగిస్తూ ఇదిగో నీ కుమారుడు అని చెబుతున్నాడు. మరియమాతకు కుమారునిగా ఇచ్చినది కేవలం యోహానును కాదు, తాను ప్రేమించితిన శిష్యుడను,  ఇక్కడ ప్రభువుచే ప్రేమించబడిన ఆ శిష్యుడు తిరుసభకు గుర్తు. ప్రభువు మరియమాతకు ఇచ్చినది యోహాను రూపంలో తిరుసభను. యోహాను ప్రభువును విశ్వసించే ప్రతి విశ్వాసికి ప్రతిరూపంగా  ఉన్నాడు. 

నిన్ను వీడని తల్లి 

తల్లిగా మరియమాత ఎప్పుడు తన కుమారున్ని విడువలేదు. యేసు ప్రభువును ఈ లోకములోనికి తీసుకొనిరావడానికి మరియమాత తాను పొందబోయే అవమానమునుకాని కష్టమును కాని ఆమె పట్టించుకొనలేదు. కేవలం ప్రభువును అంటిపెట్టుకొని ఉండుటకు ఆమె ఎక్కువ ప్రాముఖ్యతను ఇచ్చింది. యేసు ప్రభువు పసిబాలునిగా ఉన్నప్పుడు హేరోదు ఆయనను చెంపుటకు ప్రయత్నిస్తున్నప్పుడు ఆమె యోసేపుతో కలిసి ప్రభువును కాపాడుటకు రాత్రి పగలు తేడాలేకుండా ప్రభువును తీసుకొని సురక్షితమైన ప్రాంతమునకు పోయేది. యేసు ప్రభువును అన్ని సమయాలలో ప్రభువును గురించే ఆమె ఆలోచించేది. ప్రభువు తన ప్రేషిత కార్యం ప్రారంభించినప్పుడు ఆయన గురించి తెలుసుకొనుటకు ప్రభువు దగ్గరకు వెళుతుంది. ప్రభువు శ్రమలు అనుభవిస్తున్నప్పుడు శిష్యులు అందరు ఆయనను వదలి వెళ్ళిపోయినా తల్లి మాత్రము ఆయనను వెంబడిస్తూనే ఉంది. సిలువ క్రింద ప్రభువు చనిపోయే సమయంలో కూడా ఆమె ఉంది. ప్రభువును ప్రతి క్షణము అంటిపెట్టుకొని ఆమె జీవించేది. అటువంటి ఆమెను యేసు ప్రభువు తాను ప్రేమించిన శిష్యునికి తల్లిగా ఇస్తున్నాడు. ఆయనను ఎలా ఎప్పుడు వెన్నంటివున్నదో అదే విధముగా ఆ శిష్యునికి మరియు ఆయన శిష్యులందరికి ఆమె తోడుగా,  వారి బాధలలో ఓదార్పుగా, వారికి ఆదర్శముగా ఉండుటకు ప్రభువు ఆమెను తన శిష్యునికి తల్లిగా ఇస్తున్నాడు. 

తల్లిగా శ్రీ సభతో మరియమాత 

మరియమాత పెంతుకోస్తు రోజున శిష్యులందరు, యూదుల భయంతో ఉన్నప్పుడు, మరియమాత వారితో ఉండి ప్రార్ధన చేస్తుంది. పవిత్రాత్మతో తిరుసభ పుట్టిన రోజన మరియమాత అక్కడనే ఉన్నది. వారితో పాటు ఉండి వారికి ధైర్యమును ఇస్తుంది.  అందరు మనలను అపార్ధం చేసుకున్నాకాని ఎలా  దైవ చిత్తమును నెరవేర్చుటకు ధైర్యంగా ఉండాలో నేర్పుతుంది. శిష్యులు భయంతో ఉన్నప్పుడు ఆమె వారికి ధైర్యమును ఇస్తుంది.  ప్రభువును పవిత్రంగా ఈ లోకమునకు తీసుకురావడానికి ఆమె కన్యగా గర్భం ధరించడానికి ఆమె ధైర్యంగా ఒప్పుకున్నది. అలానే శిష్యులు ప్రభువు అజ్ఞానుసారం జీవించేలా ఆమె ధైర్యం ఇస్తుంది. ఆమె కేవలం వారికి తోడుగా మాత్రమేకాక తన జీవితం ద్వారా ఆదర్శమును చూపిస్తుంది.  

Fr. Amruth 

22 వ సామాన్య ఆదివారం

22 వ సామాన్య ఆదివారం మొదటి పఠనము     సిరాకు : 3 :17 -18 ,20 ,28 ,29 రెండవ పఠనము      హెబ్రి 12 : 18-19-,22-24 సువార్త పఠనము      లూకా ...