16, ఫిబ్రవరి 2025, ఆదివారం

మార్కు 9:38-40

 February 26

సిరా 4:11-19

మార్కు 9:38-40

అంతట యోహాను యేసుతో "బోధకుడా! మనలను అనుసరింపని ఒకడు నీపేరిట దయ్యములను పారద్రోలుట మేము చూచి వానిని నిషేధించితిమి" అని పలికెను. అందుకు యేసు "మీరు అతనిని నిషేధింపవలదు, ఏలయన, నా పేరిట అద్భుతములు చేయువాడు వెంటనే నన్ను గూర్చి దుష్ప్రచారము చేయజాలడు. మనకు విరోధికానివాడు మన పక్షమున ఉండువాడు. 

యోహాను  యేసుతో, “బోధకుడా, దయ్యాలను వెళ్ళగొట్టే వ్యక్తిని మేము చూశాము. అతను మనల్ని అనుసరించడు కాబట్టి మేము అతన్ని ఆపడానికి ప్రయత్నించాము” అని చెప్పడంతో ప్రారంభమవుతుంది ఈనాటి సువిశేషం. ఆ  వ్యక్తి దయ్యాలను వెళ్ళగొట్టే సామర్థ్యం పట్ల శిష్యులు  అసూయపడుతున్నారా? వారు ఈ రకమైన శక్తిని కలిగి ఉండాలనుకుంటున్నారా?  అనే ప్రశ్నలను అడిగితే ఆ వ్యక్తి వలే వీరుకూడా చేయాలి అని అనుకోని ఉండవచ్చు. యేసు యోహానుతో, “అతన్ని నిరోధించవద్దు. ఎవరైనా నా నామంలో మంచి పని చేస్తే, నా గురించి వారు ఎలా  చెడుగా మాట్లాడరు” అని అంటాడు. తరువాత యేసు ఇలా అంటాడు: “మనకు వ్యతిరేకంగా లేనివాడు మన పక్షాన ఉన్నాడు.”

ఈ రోజు యేసు ప్రభువు  మనకు ఒక ముఖ్యమైన సూచన ఇస్తున్నాడు. మనకు వ్యతిరేకంగా లేనివాడు మన పక్షాన ఉన్నాడని ఆయన మనకు చెబుతున్నాడు. సాధారణంగా చాలా మంది మానవులకు ఏ వ్యక్తులు తమను ఆదరిస్తారో తెలుసు. అయితే, ఏ వ్యక్తులు మనతో పోరాడవచ్చు, మనల్ని ఇష్టపడకపోవచ్చు లేదా మనల్ని విస్మరించవచ్చు అని కూడా మనకు తెలుసు.  కాని ఈ రోజులలో మనతో మంచిగా మాటలాడి మనము లేని సమయంలో వ్యతిరేకంగా మాటలాడువారే ఎక్కువ మంది ఉండవచ్చు. 

యేసు ప్రభువును అనుసరించకుండా,  ఆయన నామమున ఒక వ్యక్తి దయ్యములను వెడలగొడుతున్నాడు అంటే ఆ వ్యక్తి యేసు ప్రభువును దేవునిగా , రక్షకునిగా అంగీకరించాడు. మరియు యేసు ప్రభువు మాటలను పాటించి జీవిస్తూ ఉండవచ్చు. ఎదో ఒక సమయంలో ప్రభువు మాటలను విని, ఆయన ఈ విధంగా చేస్తున్నాడు. ప్రభువు చెప్పినట్లు ఆ వ్యక్తి ప్రార్థన, మరియు ఉపవాసములతో జీవించేవాడు అయివుండవచ్చు ఎందుకంటే ప్రభువే చెబుతున్నాడు ఇటువంటివి కేవలం ప్రార్ధన మరియు ఉపవాసంతోనే సాధ్యమని కనుక ఆ వ్యక్తి ప్రభువుతో ఉండకపోయినా  ప్రభువుని అనుచరుడే. 

 మానవులుగా, మనలో చాలామంది ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారో దాని గురించి ఎక్కువగా శ్రద్ధ వహించవచ్చు. అయితే, యేసు తన శిష్యులు నిజంగా స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటున్నాడు. వారు ఇతరుల పట్ల అసూయపడటం లేదా మరొకరి సామర్థ్యాలు మరియు బహుమతులను కోరుకోవడం ఆయనకు ఇష్టం లేదు. తన శిష్యులు తమ సొంత బహుమతులను మరియు ఇతరుల బహుమతులను కూడా అభినందించాలని యేసు స్పష్టంగా కోరుకుంటున్నాడు.

Br. Pavan OCD

మార్కు 9:30-37

 February 25

సిరా 2:1-11

మార్కు 9:30-37

వారు ఆ స్థలమును వీడి గలిలీయ ప్రాంతమునకు వెళ్లిరి. తాను ఎచ్చటనున్నది ఎవరికిని తెలియకూడదని ఆయన కోరిక. ఏలయన, "మనుష్యకుమారుడు శత్రువుల చేతికి అప్పగింపబడును. వారు ఆయనను చంపుదురు కాని మరణించిన మూడవదినమున ఆయన పునరుత్తానుడగును" అని యేసు తన శిష్యులకు బోధించుచుండెను. శిష్యులు దీనిని గ్రహింపలేకపోయిరి. అయినను ఆయనను అడుగుటకు భయపడిరి. అంతట వారు కఫర్నామునాకు వచ్చిరి. అందొక ఇంట ప్రవేశించిన పిదప యేసు తన శిష్యులను "మార్గమధ్యమున మీరు ఏ విషయమును గూర్చి తర్కించుచుంటిరి?" అని అడిగెను. తమలో గొప్పవాడెవ్వడని మార్గమధ్యమున వాదించు కొనియుండుటచే వారు ప్రత్యుత్తరమీయలేక ఊరకుండిరి. అప్పుడు యేసు కూర్చుండి పన్నిద్దరు శిష్యులను చేరబిలిచి, "ఎవడు మొదటివాడు కాగోరునో వాడు అందరిలో చివరివాడై, అందరకు సేవకుడుగా ఉండవలయును"అని పలికెను. మరియు ఆయన ఒక చిన్నబిడ్డను చేరదీసి వారి మధ్యనుంచి, వానిని ఎత్తి కౌగలించుకొని శిష్యులతో, "ఇట్టి చిన్న బిడ్డలలో ఒకనిని నా పేరట స్వీకరించువాడు నన్ను స్వీకరించినవాడగును. నన్ను  స్వీకరించినవాడు నన్నుకాదు , నన్ను పంపినవానిని స్వీకరించుచున్నాడు" అనెను. 

యేసు ప్రభువు , పన్నెండు మందిని పిలిచి, మీలో ఎవరైనా మొదటివారిగా  ఉండాలనుకుంటే, అతను చివరివాడిగా మరియు అందరికీ సేవకుడిగా ఉండాలని చెబుతున్నాడు.  అంతకు ముందు  యేసు ప్రభువు   తనకి  అత్యంత  సన్నిహిత శిష్యులను, తీసుకొని ఒక రహస్య ప్రదేశానికి ప్రార్ధించుటకు వెళ్ళాడు, తరువాత  వారు కఫర్నముకు వచ్చారు, యేసు ప్రభువు  వారిని దారిలో దేని గురించి వాదిస్తున్నారని అడిగాడు. ఎవరు గొప్పవారో వారు వాదించుకుంటున్నారని వారు అంగీకరించడానికి ఇష్టపడలేదు.  అది ప్రభువుకు వారు చెప్పలేక పోయారు. 

 మొదటివారిగా  ఉండాలనుకునే ఎవరైనా చివరివారై ఉండాలి, అందరికీ సేవకుడుగా  కావాలని ప్రభువు  చెప్పాడు. కేవలం అది చెప్పడంతో ఆగిపోకుండా  ఒక చిన్న బిడ్డను తీసుకొని , వారి మధ్య ఉంచి తన పేరు మీద ఒక బిడ్డను స్వాగతించేవాడు తనను స్వాగతిస్తాడని చెబుతున్నాడు. చిన్నవాడిని లేక ఇతరుల మీద ఆధారపడేవారిని ఆహ్వానించడం మనలను దైవ స్వభావం కలిగేలా చేస్తుంది. ప్రపంచం తరచుగా నాయకత్వాన్ని, అధికారంతో, శక్తితో సమానం చేస్తుంది. 

దేవుని రాజ్యంలో, అధికార సమీకరణం తారుమారు అవుతుంది. మనం సేవ చేయడం ద్వారా నాయకత్వం వహిస్తాము, దిగువకు మారడం ద్వారా ఉన్నతంగా వెళ్తాము, అత్యల్పంగా ఉండటం ద్వారా అధికారాన్ని ఉపయోగిస్తాము. స్వార్థపూరిత నాయకత్వానికి అలవాటుపడిన ప్రపంచంలో ఇది అర్ధవంతం కాదు. దేవుడిని ప్రేమించడం మరియు ఒకరినొకరు ప్రేమించుకోవడం అనే రెండు గొప్ప ఆజ్ఞలు ఉన్న సమాజ మాత్రమే లో, లోక  నియమాలను తిప్పికొట్టకలుగుతుంది. .

మనం ఇతరులకు సేవ చేసినప్పుడు నాయకత్వం వస్తుంది. ప్రజలకు సహాయం చేయడంలో ప్రభావం వస్తుంది.  అది మనం కోరుకునేది కాదు, ఎందుకంటే మనం కోరుకునేది సేవ చేయడమే. సేవ చేయడంలో అవకాశం నాయకత్వం వహించడానికి రావచ్చు.

Br. Pavan OCD

22 వ సామాన్య ఆదివారం

22 వ సామాన్య ఆదివారం మొదటి పఠనము     సిరాకు : 3 :17 -18 ,20 ,28 ,29 రెండవ పఠనము      హెబ్రి 12 : 18-19-,22-24 సువార్త పఠనము      లూకా ...