15, జులై 2021, గురువారం

కార్మెల్ మాత మహోత్సవం

కార్మెల్ మాత మహోత్సవము 

పాలస్తీనాలోని కార్మెల్ కొండలు చాలా ప్రసిద్దమైనటువంటివి. ఇక్కడ బైబిల్ లోని ప్రసిద్ద సంఘటనలు జరిగాయి. మరి ముఖ్యమైనటువంటి సంఘటన ఏమిటి అంటే ఏలియా ప్రవక్త  యవే దేవుని మహిమను, మహోన్నతను చూపిస్తూ బాలు ప్రవక్తలను చంపినది ఈ పర్వతము మీదనే. అదే విధముగా కీర్తన గ్రంధములో ఈ పర్వతము యొక్క అందాన్ని వివరించడము  మనము చూస్తాము. ప్రవక్తలు ఈ పర్వతము గురించి మాటలాడుతారు. ఈ పర్వతము నిజ దేవుని మహిమను చాటుతుంది.  ఈ పర్వతములో పుట్టిన టువంటి ఒక సన్యస కుటుంబమే కార్మెల్ సభ. ఈ సభకు ఈ పేరు అక్కడ మరియమాతకు అర్పించినటువంటి ఒక చిన్న దేవాలయము నుండి వచ్చింది. ఆ పర్వతము మీద ఉన్న టువంటి దేవాలయము పేరు కార్మెల్ మాత దేవాలయము.  

     ప్రతి సన్యాస సభ తన యొక్క పేరును ఒక స్థలం నుండి లేక  వారి పునీతుని నుండి పొందుతుంది. కార్మెల్ అనేది పాలస్తీనా లో ఉన్నటువంటి ఒక కొండ . సిలువ యుద్దాలు జరిగిన తరువాత 11 మరియు 12 వ  శతాబ్దాలలో ఈ కొండలలో సన్యాస జీవితము ప్రబలిల్లీనది. సిలువ యుద్దాలలో పాల్గొన్న టువంటి  కొంతమంది సైనికులు దేవునికి తమ జీవితాన్ని  అంకితము చేస్తూ అక్కడ ఉన్న కొండ గృహాలలో ప్రార్దన జీవితము జీవిస్తూ బ్రతికారు.  వీరు తమ జీవితాలను మఠవాసులు కంటే ఎక్కువగా  ప్రార్దన జీవితానికి కేటాయించారు.  ఎక్కువ సమయము ధ్యానము చేస్తూ  మౌనమును పాటిస్తూ జీవించారు. వీరిలో మనకు   ఈజిప్టు ఎడారిలో ఉన్నటువంటి ఆదిమ క్రైస్తవ సన్యాసుల జీవన శైలి కనుపడుతువుండేది. వీరు ఎక్కువగా వారి వారి గదులలో ఒంటరిగా జీవిస్తూ  ప్రార్దనకు ప్రాముఖ్యత ఇస్తూ జీవించేవారు. వీరిని  కార్మెల్ మాత సహోదరులు అనే పేరుతో  పిలుస్తారు. ఇది  వారు మరియమాతకు ఇచ్చే ప్రాముఖ్యతను సూచిస్తుంది.  కార్మెల్ కొండలలో ఉన్న ఈ  సభ ఇస్లాం ప్రభావము వలన ఆ ప్రాంతాన్ని వదలి ఐరోపా కు వెల్ల వలసి వచ్చినది . కేవలము కార్మెల్ సభ సభ్యులు మాత్రమే కాక అనేక సభల వారు ఆక్కడనుండి వేరే ప్రదేశాలకు వెళ్ళేరు. 

    అనతి కాలములోనే ఈ  సభ అనేక ప్రాంతాలకు వ్యాప్తి చెందడము జరిగింది. ఐరోపా ఖండములో ఈ సభ సభ్యలు వారి క్రొత్త దేవాలయాలను కార్మెల్ మాత పేరున ఏర్పాటుచేయడము జరిగినది. కార్మెల్ సభ  మరియమాతకు అంకితము చేయబడియన ఒక సన్యస సభ ,అది సంపూర్తిగా మరియమాత సభ  totus marianus est . చారిత్రకముగా కార్మెల్ కొండలలో ఉన్నటువంటి  సన్యాసులు వారీ పేరును ,గుర్తింపును వారు ఏర్పాటు చేసుకున్న చిన్న మరియమాత దేవలయము నుండి పొందేరు. మారియమాత భక్తి అనేది వారి జీవితాలలో ఒక ప్రదాన అంశము. 14 వ శతాబ్దములో ఉన్నటువంటి  కార్మెల్ రచనలలో వారి జీవిత విదానము మరియమాత వలె ఉండాలి అని కోరుకునేవారు. మరియ మాత  కార్మెలీయులకు సోదరి మాత్రమే కాదు వారి తల్లీకూడ.   ఆమెలో వారు చూసెదీ ఏమిటి అంటే ఏ విధముగా ఆమె జీవితాన్ని దేవుని కోసము జీవించినది అని, ఒక సారి ఆమె జీవితము చూసినట్లయితే ఆమె జీవితములో దేవుడు ఎంతో ప్రముఖమైన పాత్ర పోషిస్తుంటాడు. ఆమె దేవుని కోసము పరితపిస్తుంది . ఆమె మనస్సు  , ఆమె ఇంద్రియాలను, ఆమె శక్తి యుక్తులను మొత్తన్ని దేవుని కోసమే ఆమె హెచ్చించినది. ఆమె మనస్సు  దేవుని చూడడానికి ఆయన ఇష్ట ప్రకారముగా జీవించడానికి ప్రాముఖ్యతను ఇస్తుంది. కార్మెల్ సభ సభ్యులు కూడా మరియమాత వలే జీవించడానికి ముఖ్యముగా , ఆ  ఆధ్యాత్మిక జీవితాన్ని, మౌన జీవితాన్ని , ధ్యాన జీవితాన్ని మారియమాత నుండి  పొందుతారు లేక నేర్చుకుంటారు. వీరు పరిశుద్ద కన్య మరియ సహోదరులు అను  పేరును కలిగిఉన్నారు.  ఆమె ప్రేమకు, సేవకు  అంకితము చేయబడ్డ ఒక సన్యాస  సభకూ చెందినవారు కనుకనే. మరియమాత తో ఈ ప్రత్యేక సంభందము వీరి జీవితలను పరిపూర్ణ ప్రేమను చేరే విధముగా చేస్తుంది. మరియమాత  సాన్నిధ్యం  ఈ సభ చరిత్ర మొత్తము ఉన్నది. ఈ సభ దాని పుట్టుపూర్వోత్తరాలు  ఈ కొండ మీదనే జరుగుతున్నాయి. మరియమాతను  ప్రార్దనకు  మరియు దేవునికి జీవితాన్ని అంకితము చేయటములో మాతృకగా తీసుకొని వీరు జీవిస్తారు. అదే విధముగా  మరియమాతను దేవుని వాక్కును ఎల్లప్పుడూ ధ్యానిస్తూ జీవించే వ్యక్తిగా మరియు దేవుని చిత్తానికి సంపూర్తిగా అర్పించుకున్న వ్యక్తిగా చూస్తారు. ఈ  సభ అందరి వలె ప్రార్దన చేస్తుంది. కానీ ఈ సభ ముఖ్య ఉద్దేశమే ప్రార్ధనలో దేవుని కనుగొని  ఆయనను అనుభవపూర్వకముగా తెలుసుకొని ఈ అనుభవాన్ని ఇతరులకు చెప్పడము.  మరియమాత అడుగు జాడలలో నడుస్తూ దేవుని ఏ విధముగా  చేరుకోవాలి , దేవుణ్ణి ఈ లోకములోనే ఉండగా ఏ విధముగా  ఆయనలో ఐక్యము కావాలి  అని నేర్పిన వారు ఈ సభ పునీతులయిన  ఆవిలపూరీ తెరేసమ్మ , పునిత సిలువ యోహాను గార్లు అధె  విధముగా చిన్న తెరేసమ్మ గారు కూడా చిన్న చిన్న పనులు చేస్తూ దేవుని ఏ విధమూగ చే రుకోవలో చెపుతుంది ఈమె కూడా ఈ సభ పునీతురాలే. వీరి  జీవితము మరియమాతను అనుసరించి ఉంటుంది. దైవ ప్రేమ, దైవ అన్వేషణ వీరిలో మనము ఎక్కువగా  చూస్తాము. పునీత సిలువ యోహాను గారు రాసిన రచనలలో మరి ముఖ్యముగా కార్మెల్ పర్వత ఆరోహణము , ఆంధకార రాత్రి, ఆధ్యాత్మీక గీతం  మరియు  సజీవ ప్రేమాగ్ని జ్వాల అనే పుస్తకాలలో మనము దేవుని అన్వేషించడము,  ఆయనను  చేరుకోవడము చూస్తూంటాము. ఇది నిజానికి చాలా గొప్ప జీవితము, మరియమాత  వలె వేరొక చింతన లేకుండా కేవలము  దైవ చింతనతో జీవించే ఒక జీవితము. అందుకె  మరియమాత తన ఉత్తరియాన్ని విరికి ఇవ్వడము జరిగినది.   తిరుసభలో ఉన్నటువంటి వెదపండితులలో నలుగురు మాత్రమే స్త్రీలు, వారీలో  ఇద్దరు  ఆవిలపూరి తెరజమ్మ  మరియు చిన్న తెరేజమ్మ ఈ సభ  వారే. కార్మెల్ మాత పండుగకు ఈ సభకు  చాలా  విడదీయయరాని బందాన్ని మనము చూస్తాము. ఎప్పుడైతే ఈ సభ ఇటువంటి  జీవితాన్ని విడనాడి దాని సభ్యులు వారి ఇష్ట  ప్రకారముగా జీవిస్తూ ఉన్నారో అప్పుడు ఆ సభ పెద్దలు అయిన పునీత సైమన్ స్టాక్ గారు ప్రతిరోజూ ప్రార్దన చేస్తు మరియమాత  సహాయాన్ని కోరుతూ తన సభను  కాపాడుకోమని కోరేవాడు. ఒక రోజు ఆమె ఆయనకు ఆ సభకు  అభయమిస్తూ ఆమె ఉత్తరియాన్ని పునీత సైమన్ స్టాక్ గారికి ఇచ్చింది. ఈ  ఉత్తరియాన్ని ఇస్తూ ఎవరియతే దీనిని ధరించి చనిపోతారో వారిని  కాపాడుతాను అని అభయము ఇచ్చింది. అప్పటి నుండి  మనము ఉత్తరియము  ద్వారా మారియమాత ఇచ్చిన  అభయాన్ని పండుగగా  జరుపుకుంటున్నాము. 

    అనేక దేశాలలో ముక్యముగా ఐరోపా , లాటిన అమెరికాను దేశాలలో చాలా గొప్పగా ఈ పండుగను జరుపుకుంటారు. పతన స్థితిలో ఉన్న కార్మెల్ సభ మరలా ఏ విధముగా పునరుద్దరిచబడిందో అదే విధముగా మన జీవితాలు కూడా పునరుద్దరిచబడాలి  అని ఆ మరియమాత  ఉత్తరియాన్ని ధరించి , ఆమె మద్యస్థ  ప్రార్ధన ద్వార  వేడుకొందాము. 

Fr. Amrutha Raju OCD

4, జులై 2021, ఆదివారం

14 వ సామాన్య ఆదివారము

 

14 వ సామాన్య ఆదివారము 

యెహేజ్కెలు 2  : 2  - 6 / 2  కొరింతి 12 : 7  - 10 /  మార్కు 6 : 1  - 6 

 

క్రిస్తునాధుని యందు ప్రియమైన స్నేహితులారా  ఈ నాదు మనము పధ్నాలుగోవా సామాన్య ఆదివారములోనికి ప్రవేశించియున్నాము ఈ నటి పరిశుద్ధ గ్రంథ పఠనలద్వారా త తండ్రి  దేవునికి మన పై ఉన్నటువంటి ప్రేమను తల్లి శ్రీ సభ మనకి తెలియజేస్తుంది 

ఐతే  మొదటిపఠనములో మనము గమనించినట్లు ఐతే ప్రభువైన యావే యెహేజ్కెలు ప్రవక్తతో పలుకుచున్న మాటలను మనము వింటున్నాము నర పుత్రుడా ఇశ్రాయేలు ప్రజలు తిరుగుబాటు చేసిరి వారు  మొండివారిగా నన్ను లెక్కచేయతలేదు వారి మధ్యకు నిన్ను పంపుచున్నాను వారితో ప్రవక్త వున్నాడని గ్రహించి ఐన దేవునివైపు మారులుతారు అని మనకి అర్ధమగుచున్నది  

  ఈ ఇశ్రాయేలీయులు ఎవరయ్యా అంటే ఇక స్వరముతూ యావెను స్తుతించినవారే యావెను నమ్మినవారే ప్రభు నిన్ను పోలినదేవుడు ఎవరు అని పలికిన వారే నీవే అద్భుతకార్యములను  చేసినవాడవు అని ముక్త కంఠముతో స్తుతించినవారు ఈ ఇశ్రాయేలీయులు [నిర్గమ 15 : 11 ]  అహాబు రాజు పరిపాలన కాలములో బాలు దేవతలు పూజిస్తూ ప్రభువుని మరచిపోయి అందరు ప్రష్టులైపోయారు పాపముతో నిండి పోయారు పూర్తిగా వారి జీవన వ్యాపారములో మునిగి పోయారు త్రాగడం సుకించడం అనేదే వారి జీవిత వాంఛగా మారినిది వారి పనులలో దేవుని యొక్క ప్రస్తావనే లేదు దేవుడిని మరచి పోయారు ఇశ్రాయేలీయుల గురించి ప్రభువైన యావే ప్రవక్త అయినటువంటి ఎహేజ్కెళుతో పలికెళిన మాటలను మనము ఈనాటి మొదటి పట్టణములో వింటున్నాము దేవుడు తన ప్రజల తప్పులను ఏత్తిచూపిన విధానం ఆసక్తి కరంగా ఉంటుంది వారు కేవలం విశ్వాసం లేని వారు అవిధేయులు మాత్రమే కారని వారు తిరుగుబారు దారులని మొండి వారని ప్రభువు ప్రవక్తకు తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. దేవుడు పలికిన ఈ పలుకులు ఇశ్రాయేలీయుల పట్ల అనాదిగ అయన చూపిన ప్రేమ పరోక్షముగా వెల్లడిస్తాయి అయినప్పటికీ తాను ఎన్నుకున్న ప్రజలలో తాను కోరుకున్న మార్పు వస్తుంది అన్న ఆశతో ప్రవక్తని పంపించడం దేవుని  యొక్క ప్రేమకు నిలువెత్తు సాక్షం. ఏదో ఒకనాటికి వారిలో హృదయ పరివర్తనం కలుగుతుంది తమ మధ్య గల ప్రవక్తను వారు గురుతిస్తారు తెలుసుకుంటారు అవిధేయులైన ఇశ్రాయేలు ప్రజల పట్ల ప్రభువైన దేవునికి వారిమీద గల నమ్మకం.

ఈ నాటి రెండవ పట్టణములో పునీత పాల్ గారు నా శరీరములో ఒక ముళ్ళు గ్రుచ్చ బడినది అది సైతాను దూత అంటారు. ఏమిటి ఆ ముళ్ళు? ఎవరు ఈ సైతాను దూత? [2 కొరింథీలు 11 : 12 - 15  ]  పౌలు అసత్యపు ఆపోస్టులను సైతాను ప్రతిరూపాలతో పోలుస్తున్నాడు. అసత్యపు ఆపోస్టులలో ఒకడు శరీరములో ముల్లువలె పౌలును బాధించేవాడు పౌలు సువార్త పరిచేర్యకు అడ్డు పడుతూనేఉన్నాడు కనుక ఆ అసత్యపు అపోస్తులను ఉదేశించి పౌలు శరీరములో ముళ్ళు అని అన్నాడు నిజానికి క్రీస్తు ప్రభువు బలహీనులైన వ్యక్తులద్వారానే  తన శ్రీసభ నిర్మాణం కొనసాగిస్తూ ఉంటారు అందుకే పౌలు తన బలహీనతల గురించి యంత ఎక్కువగా ప్రకటిస్తూ ఉండేవాడో అంత ఎక్కువగా ప్రజలు ఆయనలో పునరుతనా క్రీస్తును దర్శించ గలిగేవారు ఒక్క మాటలో చెప్పాలంటే వేద ప్రచారములో పౌలు ఎన్ని వేదనలకు గురి అయ్యాడో ఏవిందంగా తిరస్కరించ బడ్డాడో ఈ నాటి రెండవ పఠనం తెలియజేస్తుంది. యేసు క్రీస్తు ప్రభువే సొంత ప్రజలతో తృణీకరించ బడినపుడు పౌలు వంటి సువార్తికులు బోధకులు ప్రభువు అడుగు జడలలో నడిచే క్రెస్తవ విశ్వాసులు ఏదో ఒక్క రూపములో తిరస్కారానికి గురికావడం సహజమేనని ఈనాటి సువిశేషములో స్పష్టమగుతుంది. యేసు ప్రభువు తన సొంత ఊరు నజరేతుకు వెళ్లారు సొంత ప్రజలే ఆయనను నిరాకరించారు తృణీకరించారు బోధకుడిగా అయన చేసిన బోధనలను కూడా తిరస్కరించారు యేసు ప్రభువు తన సొంత ప్రదేశానికి నజరేతుకి రాకమునిపే ఆ పట్టణ ప్రజలు యేసు బోధనలు చేస్తున్నాడు అని అద్భుతాలు కూడా చేస్తున్నాడని చెప్పుకున్నారు. ఈ నాటి సువిశేషములో యేసు ప్రభువు ప్రధానమందిరములో బోధించడంతో ప్రారంభమై పరిసర గ్రామాలలో బోధించడం ముగుస్తుంది.

యేసు ప్రభువు గల బోధన సామర్ధ్యాన్ని జ్ఞానాన్ని చూసి నజరేతువాసులోతో సహా ప్రజలందరూ ఆచార్య పోయారు అయితే అయన బోధిస్తున్నవి సత్యసందేశాలు అయినప్పటికీ ప్రజలు వాటిని ఆమోదించలేక పోయారు మన మధ్య పుట్టి పెరిగినవాడు మనకే బోధన చేస్తాడా అన్న చులకన భావం వలన వారు బోధకుడిగా యేసు ప్రభుని అదరణిచలేక పోయారు తృణీకరించారు

ప్రియమైన స్నేహితులారా క్రీస్తు ప్రభు పలికిన ప్రతి మాట నిత్యా సత్యమని విశ్వసించాలి ఎందుకంటె పలికిన వాడు పురాతనుడైన ప్రభువు మహిమాన్వితుడైన తండ్రి దేవుని సన్నిధానంలో ఉన్నారు. ఈ సత్యాన్ని మనసారా నమ్మి ప్రభు మాటలను త్రికరణ శుద్ధిగా పాటించక పోతే అనజరేతు ప్రజలు తిరస్కరించిన దానికంటే మనము ఏవిధముగా మెరుగైన వరమని అనిపించుకోము తనని నమ్మి వచ్చిన రోగులను స్వస్థ పరిచారు క్రీస్తుప్రభువు. మనము కూడా ఆయనను నమ్మి క్రీస్తు సువార్తలో పాలుపంచుకోవాలని మహిమలు చూడాలని ఈ నాటి పరిశుద్ధగ్రంధ పఠనాలు మనకు తెలియచేస్తున్నాయి ఆమెన్.

                                                                                      -BR. MANOJ

 

 

 

 

లూకా 17:11-19

 సమరియుని కృతజ్ఞత  యేసు సమరియా, గలిలియా ప్రాంతముల మీదుగా యెరూషలేమునకు పోవుచుండెను. ఒక గ్రామమున అడుగు పెట్టగనే పదిమంది కుష్ఠ రోగులు ఆయనకు ఎదు...