6, నవంబర్ 2021, శనివారం

సామాన్య 32 వ ఆదివారం (2)

 1రాజులు 17 :10 - 16, హెబ్రీ 9: 24 - 28, మార్కు 12: 38 -44

క్రిస్తునాధుని యందు ప్రియమైన బిడ్డలారా సహోదరి సహ్ోదరులారా నాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలను మనం గమనించినట్లయితే ఉదార స్వభావం గురించి బోధిస్తున్నాయి

మనం ఒక మంచి గుర్తింపు కోసం తాపత్రయ పడే సమాజంలో జీవిస్తాం. నేటి సమాజంలో హోదా, గౌరవం, ఆకర్షణీయ రూపం చాల ముఖ్యం. వాస్తవానికి మనం ఎలాంటి వారమైన అందరూ మనల్ని ఎలా చుస్తున్నారన్నదే ప్రదానం. నాటి సువార్తలో ధర్మశాస్ర బోధకులను, పదుగురి గుర్తింపు కోసం తాపత్రయ పడే వారీగా చూపిస్తూ, అందుకు భిన్నంగా అసలు గుర్తింపు గురించి ఆలోచన ,ధ్యాసే లేని ఒక పేద విధవరాలితో పోల్చి ఆమెను అణకువకు, సంపూర్ణ ఆత్మ సమర్పణకు ఆదర్శంగా చూపించటం జరిగింది.

గుర్తింపుకై ఆరాటం : ధర్మశాస్త్ర బోధకులు చట్టాన్ని వివరించే వారీగా, వారి గొప్ప జ్ఞానాన్ని బట్టి ప్రజల గౌరవాన్ని పొందేవారు. చట్టం పట్ల వారి భక్తిని వ్యక్తపరుస్తూ వారు పొడుగాటి తెల్లని వస్త్రాలను ధరించే వారు. వారు ఎదురొస్తే ప్రజలు లేచి నిలబడి వారిని బోధకుడా అని గౌరవంగా నమస్కరించాల్సి ఉంటుంది. అసలు సమస్య ఏటంటే ఇలా గౌరవాన్ని పొందడాన్ని వారు తమ హక్కుగా భావించటం మొదలై చివరకు అది వారి అహంభావానికి, హోదాకు, ప్రతిష్టకు గుర్తుగా మారిపోయింది. దేవుని చుట్టం పట్ల చూపాల్సిన గౌరవాన్ని వారు తమ పట్ల చూపాలని కోరుకొసాగారు. ఈనాటి మన సమాజంలో కూడా పదవిలో ఉండే కొందరు ఇలాగే ప్రవర్తిస్తుంటారు అందుకే ప్రభువు, ధర్మశాస్త్ర బోధకులను, విధవరాండ్ర ఆస్తులను దిగమింగే స్వార్థపరులైన దోపిడీ దారులుగా బహిరంగంగా తమ భక్తిని ప్రదర్శించే డాంబికులుగా దుయ్యబట్టారు. అధికారం, పదవి అనేవి చాలా సందర్భాల్లో స్వార్థంతో, అవినీతితో ముడిపడి ఉంటాయి.

ఈనాటి సువార్త మొదటి భాగంలో చెప్పుకున్న ధర్మశాస్త్ర బోధకునికి, రెండవ భాగంలో వివరించిన పేద విధవరాలికి మధ్య ఒక స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తుంది.

సమాజంలో ఎటువంటి గుర్తింపు లేని విధవరాలి అతి సాధారణమైన భక్తిని, తల బిరుసు తనముతో సమాజములో పేరు ప్రతిష్టలు కోసం ఆరాటపడే కొందరు మత పెద్దల భక్తితో పోల్చటం జరిగింది. అదేవిధంగా ఎంతో ఆర్భాటంగా విరాళాలు ప్రకటించే స్తోమత గల్గిన డాంభికులైన దాతలతో కూడా ఆమె పోల్చబడింది. వారు తమకున్న అధిక సంపద నుండి యేవో కొంత ఇచ్చి ఉండవచ్చు. అర్పణలు ఇవ్వటంలో సాధారణంగా మూడు రకాల దాతలు ఉంటారు. ఒకటి సణుగుడు దాతలు వాస్తవానికి వీరికి ఇవ్వటమే ఇష్టం ఉండదు. రెండు నియమ దాతలు ఇవ్వటం తప్పని వ్యక్తిగత బాధ్యత గనుక తప్పనిసరై ఇస్తారు. వారు  గొణగక పోవచ్చు కానీ మనస్ఫూర్తిగా మాత్రం ఇవ్వరు. మూడు కారుణ్య దాతలు వీరు ఎస్టీ పూర్తిగా ఇస్తారు. ఇక అలాగే కొందరు తాము దోచుకున్న దాంట్లోది అన్యాయంగా ఇతరుల నుండి కొల్లగొట్టిన సొమ్ములోంచి ఇస్తారు. ఉదాహరణకు జక్కయ్య (లూకా 19:8 ) అయితే పేద విధవరాలు మాత్రం తన వద్ద ఉన్నదంతా తన కష్టార్జితమంతా ప్రేమతో అర్పించింది. ఈనాటి సువార్త ఆనాడు నివసించినవారివైపు కాదు ఈనాడు నివసిస్తున్న మనవైపు వేలేత్తిచూపుతుంది. మరి మనం కూడా పేరు కోసం డాంబికులుగా ప్రవర్తిసున్నామా  లేక మనస్ఫూర్తిగా ఇస్తున్నామా?

ఉదారతకు దేవుని దీవెనలు :

దేవుని కృపానుగ్రహం పట్ల పేద విధవరాలు తన అపార నమ్మకాన్ని ప్రదర్శించినట్లుగానే ఈనాటి ప్రధమ పఠనం సారఫెతులోని మరొక అన్యురాలైన విధవరాలు దుర్భర కరువు సమయంలో తన కోసం దాచుకున్న తన చివరి ఆహార వనరుల్ని ఏలీయా ప్రవక్తతో ఎలా పంచుకుంటుందో వివరిస్తుంది. ఆమె త్యాగపూరిత ఉదారతకు బహుమానంగా మిగిలిన కరువు కాలమంతా వారి జీవనానికి అవసరమయ్యే అనుదిన ఆహార వనరులతో దేవుడు వారిని సంహృద్దిగా దీవించాడు. కనుక ఉదారత్వం అనేది హృదయం నుండి రావాలి. ఉదారత్వం మన హృదయాల నుండే వస్తుందా? అని మనలను సూటిగా నిరాఘాటంగా ప్రశ్నిస్తున్నారు. విధవరాలి ఉదారత్వాన్ని మన ప్రభువు యేసు మెచ్చుకున్నా విధంగా ఈనాటి రెండవ పఠనం మనలను దేవునికి మన సాటి సహోదరి సహోదరులకు సంపూర్ణముగా ఉదారంగా సమర్పించుకోవాలని పిలుపునిస్తుంది. ఈనాటి సువార్త పఠనం శ్రీసభ పట్ల, పేదల పట్ల మరింత ఉదారత చూపాలని, ధనికులను కలవరపరచి, ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించటం లేదు కానీ మనం పేదలమైన, ధనికులమైన అవసరాల్లో ఉన్న వారిపట్ల ఉదార గుణం కలిగి ఉండాలని పిలుపునిస్తుంది.

మదర్ తెరెసాగారు తన జీవితములో జరిగిన ఒక సంఘటను గురించి చెప్పారు. ఒక రోజు ఆమె ఒక వీధిలో వెళుతున్నప్పుడు ఒక భిక్షగాడు ఆమెవద్దకు వచ్చి అమ్మ అందరు మీకు సహాయం చేస్తుంటారు.  నేను కూడా మీకు ఇస్తానమ్మా రోజంతా ఆడుకుంటే నాకు రెండు రూపాయలు మాత్రమే వచ్చాయి దాన్ని మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను అని అన్నాడు. అప్పుడు మదర్ తెరెసాగారు సందిగ్ధంలో పడ్డారటఒకవేళ అమ్మ అతని దగ్గరనుండి రెండు రూపాయిలు తీసుకుంటే ఆ రాత్రికి అతని తినేందుకు ఏమి ఉండదు. ఒకవేళ తీసుకోకుంటే అతన్ని నిరాశపరిచినట్లు అవుతుంది. కాబట్టి అమ్మ అతని ముందు చేతులు చాచి అతను ఇచ్చిన డబ్బును తీసుకుందట.

తర్వాత ఒకసారి ఆమె మాట్లాడుతూ భిక్షగాడు ఇచ్చిన కానుక నాకు నోబెల్ బహుమతికన్నా గొప్పగా అనిపించింది. ఎందుకంటే అతను తన వద్ద ఉన్నదంతా ఇచ్చేశాడు. ఇవ్వటంలో ఉన్న ఆనందాన్ని నేను అతని ముఖంలో చూశాను రోజంతా ఎండలో తిరుగుతూ  అడుక్కోని పొందిన రెండు రూపాయలను ఇవ్వటం అనేది తన విషయంలో ఎంతో గోపా త్యాగం. రెండు రూపాయలు అంటే చాల తక్కువ డబ్బు  దాంతో పెద్దగా నేనేమి కొనలేను కొనలేక పోవచ్చు. అయితే అతను దాన్ని త్యాగం చేసాడు. త్యాగాన్ని  నేను స్వీకరించాను. అది నా దృష్టిలో ఎన్నో వేలరూపాయల కన్నా ఎక్కువే.  ఎందుకంటె దాన్ని అతను ఎంతో ప్రేమతో ఇచ్చాడు దేవుడు మనం చేసే పని ఎంత గొప్పదా అని చూడరు కానీ దానిని ఎంత ప్రేమతో చేశామా అనే దాన్ని చూస్తారు.

కనుక మనం కూడా మనకు ఉన్నదాంట్లోంచి నిర్భాగ్యులు, పీడితులతో పంచుకోవాలి దానిని గోనుకుంటానో లేక విధిలేక చేస్తున్న పని గానో భావించక మన స్వీయ దృక్పథంతో, మానవీయ సౌబ్రాత్రుత్వంతో, ఇష్టపూర్తిగా చేయాలన్నదే ఈనాటి సందేశం.

బ్రదర్. రత్న రాజ్ .సి.డి.

 

30, అక్టోబర్ 2021, శనివారం

ముప్పది ఒకటవ సామాన్య ఆదివారము

 ముప్పది ఒకటవ సామాన్య ఆదివారము 

ద్వితి:6 :2 :6 , హెబ్రి:7 :23 -28 , మార్కు:12 :28 -34 

ఈనాటి దివ్య పఠనాలు  ఆజ్ఞల యొక్క అంతరంగాన్ని, మరియు వాటి అర్ధాన్ని గురిం చి
తెలియజేస్తున్నాయి. అదే దైవ ప్రేమ,మానవ ప్రేమ అని  బోధిస్తున్నాయి.దానితోపాటు
దేవునియొక్క ఆజ్ఞలను మనం పాటిస్తే కలిగే ప్రయోజనాలు గురించి కూడా ఈనాటి పఠనాలు తెలుపుచున్నాయి. మనం దేవుడి చేత సృష్టించ బడినది దేవుడిని ప్రేమించడానికి అదే విధంగా దైవప్రేమను పొరుగువారితో పాటించడానికి. దేవునియొక్క ప్రేమను పొందాలి అంటే ఆయనయొక్క ఆజ్ఞలను, చట్టాలను తూచా తప్పకుండా పాటిస్తూ, మన పొరుగు వారిని కూడా ప్రేమించాలని, దానిద్వారా దేవునియొక్క ప్రేమను మనం పొందుతామని తెలిజేస్తున్నాయి.

 మొదటి పఠనము :

ఈనాటి మొదటి పఠనంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలను వాగ్ధాతభూమిలో ఆజ్ఞలను
పాటించమని తెలుపుచున్నారు.ఇశ్రాయేలుప్రజలు వాగ్ధత భూమిలో వ్యక్తిగతంగా,సామూహికంగా పాటించవలిసిన నియమాల గురించి దేవుడు మరొకసారి తెలియపరుస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలు దేవునియొక్క ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటిస్తే, వారు కలకాలం  బ్రతుకుతారని, అయన ఏర్పరిచిన  ప్రదేశమునకు చేర్చబడతారని ఉపదేశిస్తున్నాడు. లేకపోతే కలకాలం బానిసత్వంలో మ్రగ్గిపోయి, దేవుని ప్రేమకు దూరముగా వుంటారు. అందుకే దేవుడు వారిని సంరక్షణమైన మార్గములో నడిపించడానికి,నిత్యజీవితమును దయ చేయడానికి దేవుడు ఏర్పరిచిన గొప్ప మార్గం. మోషే ఉపోద్గాతం ఏమిటంటే, దేవుని పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయముతో,పూర్ణ మనసుతో,పూర్ణశక్తితో ప్రేమించాలి అని. ఎందుకంటే, దేవునియొక్క గొప్ప శక్తిని తన కళ్ళతో చూసి, విశ్వసించిన వ్యక్తి. ఈదేవుని ద్వారానే మనకు రక్షణ అని తెలుసుకొని ఆయనకోసమే జీవించినవ్యక్తి ఈ మోషేప్రవక్త.

ప్రభువుని ప్రేమించుటయే ధర్మశాస్త్రముయొక్క సారాంశము.మొదటి పఠనము రెండవ
వచనంలోమోషేప్రవక్త ఇశ్రాయేలీయులతో అంటున్నాడు:మీరు దేవునికి భయ పడుదురేని,
అయన ఆజ్ఞలు శిరసావహిస్తారు.మనలో దైవభయం ఉన్నప్పుడే మనం దేవుని  యొక్క ఆజ్ఞలను పాటిస్తాం. ఆ దైవభయం లేకపోతే మనకు ఇష్టంవచ్చినవిధంగాఉంటాం. ఆదాము, అవ్వ దైవభయం కోల్పోయారు. అందుకే దేవునియొక్క ఆజ్ఞలనుపాటించలేదు.దైవభీతిగలవారు,దేవుని ఆదేశాల ప్రకారం జీవించేవారు ఎల్లకాలము సుఖసంతోషాలతో జీవిస్తారు. మనందరం కూడా, దేవుని యొక్క మాటలు ఆలకించి  ఆయనయొక్క ఆజ్ఞలను పాటిస్తే,మనకు అన్నీ క్షేమమే అని ప్రభువు తెలుపుచున్నారు. ఎప్పుడైతే మనము దేవుని ప్రేమిస్తామో అప్పుడే అయన ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటిస్తాము.దేవునియొక్క ఆజ్ఞలను పాటిస్తే,దేవుడు వారిని పాలు తేనెలు జాలువారి నేలమీద బహుగా అభివృద్ధి చెందుతారని తెలుపుచున్నారు.

    దేవునియొక్క ఆజ్ఞలను పాటిస్తే కలుగు లాభాలు:

1. మనము దీవించబడతాము. ద్వితి:11 :26 -27 .
2. దేవుడిని ప్రేమించి, అయన ఆజ్ఞలను పాటిస్తే,1,000 తరములవరకు దీవెన, కరుణను
 పొందుతాం -నిర్గ:20 :6 .
3. దేవుని మాటలను/ ఆజ్ఞలు పాటిస్తే, దేవుడు మనతో వుంటారు. - యోహాను:14 :23 .
4. దేవునియొక్క సంరక్షణ పొందుతాం. - లేవి:25 : 18 .
5. దేవుడు మనయొక్క స్నేహితుడు అవుతాడు. - సామె:15 :14 .
6. దేవునియొక్క ఆజ్ఞలను పాటించడం ద్వారా 
     -మన జీవితములో సంతోషం కనుగొంటాము.
     - దేవుని చేత దీవించబడతాము.
     -సమాదానం దొరుకుతుంది.
     - దేవుడు మన ప్రార్ధన ఆలకిస్తారు.
     -శాశ్వతజీవమును పొందుకుంటాం.
     -దేవుని ప్రేమను పొందుకుంటాం, విజ్ఞానాన్ని పొందుతాం.
     - మన జీవితములో పరిపూర్ణతను పొందుకుంటాం.
     - దేవునియొక్క సాన్నిధ్యం అనుభవించవచ్చు.
    - దేవునియొక్క స్నేహితులుగా ఉండగలుగుతాం.

సువిశేష పఠనము:
ఈనాటి మొట్టమొదటి వచనాలలో మనం చూస్తే,ధర్మశాస్త్ర బోధకుడు యేసుప్రభువును
సమీపించి, ప్రధానమైన ఆజ్ఞను తెలుసుకుంటున్నారు.అయితే వివిధ ప్రదేశాలలో ఈ ధర్మశాస్త్ర బోధకులు దేవుని సమీపించేది యేసుప్రభువును ఇరకాటంలో పెట్టడానికే.కానీ ఈనాటి ధర్మశాస్త్ర బోధకుడు మాత్రం తన ప్రశ్నకు జవాబు తెలిసిన తరువాత సంతోషపడుచున్నాడు. ఇతనిలో ఎటువంటి కల్మషము లేకుండా దేవునియొక్క అభిప్రాయం తెలుసుకుంటున్నారు. ఇదే మంచి భోధకులయొక్క లక్షణం.  యేసు ప్రభువు అతనియొక్క దేర్యానికి మెచ్చుకొంటున్నాడేకాని కండించడంలేదు. అతనిపై ఎటువంటి పక్షపాతం చూపించడంలేదు.

 ఈలోకంలో  రెండురకాల  ప్రేమలు  ఉన్నాయి. అవి: 

 1. దేవుని ప్రేమ . 2. మానవ ప్రేమ .

     1. దేవుని ప్రేమ : 

       దేవుడిచ్చిన ఆజ్ఞలన్నిటిలో ప్రేమ ఆజ్ఞ మొట్ట మొదటిది. ఈ ఆజ్ఞలయొక్క సారాంశము ఏంటి అంటే,దేవునియొక్క నిత్యరాజ్యములోనికి ప్రవేశింపచేయడానికే. ఆనాడు ఆదాము అవ్వల ద్వారా తెగిపోయిన బంధాన్ని ఈనాడు తిరిగి నిర్మించడానికి ఈ ప్రేమ ఆజ్ఞను మనందరికీ బహుమానంగా ఇస్తున్నాడు.  అయితే మనం ఎందుకు దేవుడిని ప్రేమించాలి? 

 ఎందుకంటే, దేవునియొక్క ప్రేమ ద్వారా మనందరమూ అయన పోలికలోనే  మనందరినీ
  సృష్టించాడు. అయన తోనే నివాసము ఏర్పరచుకునేందుకు, ఆయనతోకలిసి జీవించుటకు
 తరువాత మోక్షం పొందుటకు అయన మనలను సృష్టించాడు.   దేవుని ఆదరణ పొందాలన్నా,
 అయనయొక్క ఆశీర్వాదాలు అందుకోవాలన్నా,అయన ప్రసాదించే అంతిమ బహుమానం
 అందుకోవాలన్న,ఆయనయొక్క ప్రేమఆజ్ఞను పాటించాలి. ప్రభువు అంటారు; మీరు నన్నుప్రేమిస్తే ఆ ఆజ్ఞలు పాటిస్తారని (యోహాను:14 :15 ).
యెష :49: 15-16 లో  చూస్తే , “తల్లి  నిన్ను  మరచినను  నేనునిన్ను  మరువను . నీపేరును
  నా  అరచేతిలో  వ్రాసితిని  అని  అంటున్నాడు ”. అది  దేవునియొక్క ప్రేమ. యోహా : 3:16: “దేవుడు  ఈ  లోకమును  ఎంతో  ప్రేమించి తన  ఏకైక  కుమారుని  మనకు ప్రసాదించెను ”. ఎప్పుడయితే మనమందరం దేవుని దేవుని పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయముతో, పూర్ణ 
మనసుతో,పూర్ణశక్తితో ప్రేమిస్తామో అప్పుడు దేవుడు మన జీవితములలో గొప్పకార్యాలు  చేస్తాడు. పుట్టు గ్రుడ్డివాడయిన భర్తీమాయికి స్వస్థపరిచాడు. మరణించిన లాజరును తిరిగి లేపాడు. పాపా కూపములో జీవిస్తున్న మనుషులను పుణ్యమార్గమునకు నడిపించాడు. ఇది దేవుని యొక్క ప్రేమ.

  2.మానవునియొక్క ప్రేమ:

           ఈలోకంలో మానవులు వివిధప్రేమలకొరకు ప్రాకులాడుచున్నారు. ధనము,
అధికారము,మరియు వివిధవస్తువులమీద ప్రేమ కోసం ఎన్నో తప్పులను చేస్తూ, మనలను
 ప్రేమిస్తున్నటవంటి దేవుని ప్రేమను మాత్రం తెలుసుకోలేక పోతున్నాము. అయితే దేవుడు ఎందుకు పొరుగు వారిపై ప్రేమ కలిగి జీవించాలి అని బోధించాడు అంటే, ఆది:1 :26 లో చూస్తే, "దేవుడు మానవ జాతిని సృజించెను. తన పోలికలో మానవుని చేసెను". ఇందుకుగాను దేవుడు తన పొరుగువారికి ప్రేమించామన్నాడు. ఈలోకంలో జీవిస్తున్న ప్రతిఒక్క వ్యక్తి దేవుని పోలికలోనే సృజింపబడ్డాడు. ఎలా సృజింపబడిన ప్రతిఒక్క వ్యక్తితన పొరుగువారిలో దేవుని చూడాలని ఆ దేవాతి దేవుని కోరిక.పు. చిన్నతెరెసామ్మ గారి జీవితములో చూస్తే, ఆమె జీవించినాన్నాలు, తన పొరుగు వారిలో దేవుణ్ణి చూసింది. అందుకోసమే తన పొరుగువారి ప్రేమను తననుండి ఎప్పుడు కోల్పోలేదు.

పు. మదర్ తెరెసా గారు అనారోగ్యులలో, అనాధలలో, చిన్నారిబిడ్డలలో దేవుని చూసింది. దానిఫలితం ఆమెయొక్క జీవితాన్నిసహితం వారికి సమర్పించి దేవుడినుంచి, మానవులనుంచి గొప్ప మన్నను పొందింది.   

-దానియేలు దేవుడిని ప్రేమించాడు. కాబట్టే ఆయనకు విధేయుడై జీవించాడు. 
-యోసేపుగారు (పాత నిబంధన) దేవుడిని ప్రేమించారు,కాబట్టే, అయన మాటలను పాటించారు.
-యేసు ప్రభువుగారు తన తండ్రిని ప్రేమించారు,అందుకే అయన తన తండ్రి యొక్క మాటలు
 పాటించారు.
- మరియ తల్లి కూడా అదేవిధంగా చేశారు.
 మనజీవితములో కూడా దైవంమీద ప్రేమవుంటే, తప్పనిసరిగా ప్రేమిస్తాం, దేవుని ఆజ్ఞలు
 పాటిస్తాం. మన రక్షకుడయినా యేసుక్రీస్తు కూడా తన జీవితాన్ని సహితం తన తండ్రి
 చిత్తానుసారం ఈలోకంలోవున్న ప్రతిఒక్కరికోసం సమర్పించ బడినది. దాని మూలముననే
ఈనాడు మనమందరము ఆ రక్షణను మన జీవి తములో ఆనందిస్తున్నాము. 


  రెండవ పఠనం:

ఈనాటి రెండవ పఠనంలో, యేసుప్రభువు తన ప్రేమకు నిర్వచనంగా తనను తాను మనందరి 
కోసం శాశ్వత యాజకునిగా మనకోసం సమర్పించుకున్నాడు. కావుననే యేసు ప్రభువు నిత్యము జీవించే వాడినని   తెలుపు చున్నాడు. మన పాపములకు ప్రాయశ్చిత్తం చేయడానికి మోషే చట్ట ప్రకారము కాక తన ప్రేమ అనే చట్టముతో ఒక్కసారే  మనందరికోసం బలిగా సమర్పించి, మరణించి, తిరిగి మూడవనాడు లేచి, ఉత్తానమయ్యి, ఈనాడు నీకు నాకు కాపరిగావుంటూ, మనలను తన ప్రేమమార్గములోనడిపిస్తూ, నిత్యజీవితముఅను బహుమతిని దయచేస్తున్నాడు.

ఈనాడు మనమందరము ఆత్మ పరిశీలన చేసుకోవాలి.నిజముగా నువ్వు నేను మన పొరుగు వారుని ప్రేమిస్తున్నామా? లేదా?. ఒకవేళ ప్రేమిస్తే, దేవుడు నీతో అనే మాట: "నా ఆజ్ఞలను స్వీకరించి పాటించువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నాతండ్రివలన ప్రేమింపబడును.నేను వానిని ప్రేమించి,వానికి నన్ను తెలియపరుచుకొందును" (యోహా:14 :21 ).

 కాబట్టి, ఈనాటి దివ్య బలిపూజలో ఆ దేవాతి దేవునికి ప్రార్ధన చేదాం. మనం ఆ దేవాతిదేవుడిని ఏవిధంగానయితే   ప్రేమిస్తున్నామో, అదేవిధముగా మన పొరుగువారికి కూడా ప్రేమించుటకు మనకు మంచి హృదయాన్ని దయ చేయమని ఒకరినొకరు అర్ధం చేసుకొని జీవించునట్లు చేయమని పశ్చాత్తాప హృదయముతో ప్రార్ధన చేదాం. ఆమెన్.

Rev. Fr. Bala Yesu OCD, Br. Mario 



24, అక్టోబర్ 2021, ఆదివారం

30 వ సామాన్య ఆదివారము(2)

30 వ సామాన్య ఆదివారము(2)

ఈ నాడు మూడు పఠనాలు దేవుని యొక్క రక్షణ మరియు నూతన జీవితం గురించి తెలియజేస్తున్నాయి. తండ్రి ఐన దేవుడు తన ప్రజల పట్ల చూపిన అపారమైన ప్రేమ, ఒక తండ్రికి తన పిల్లపై ఏ విధంగా ఉంటుందో, మరియు దేవున్ని దృఢమైన విశ్వాసంతో ప్రార్థిస్తే మనకు కలిగే రక్షణ మరియు నూతన జీవితం, అనే విషయాలను మనము ఈ నాడు తెలుసుకుంటాము.

మొదటి పఠనము ధ్యానించినట్లైతే బాబిలోను దేశ బానిసత్వంలో మగ్గుచున్న ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఒక తండ్రిగా లేక తండ్రివల్లే విమోచించబోతున్నాడు. మరల వారికీ పూర్వ వైభవం దయచేస్తానని యిర్మీయా ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నాడు. కేవలం బాబిలోనియ నుండి మాత్రమే కాదు ప్రపంచం మొత్తం చెల్లా చెదురైనా వారిని తమ సొంత దేశానికి తరలిస్తున్నాడు దేవుడు. నేల అంచుల నుండి వారిని కొనివత్తును, గ్రుడ్డివారు, కృంటివారు, గర్భవతులు, ప్రసవించుటకు సిద్ధముగా ఉన్నవారను ఎల్లరును కలిసి మహాసముద్రంగా కలిసి వత్తురు. 

కాబ్బటి సంతసముతో పాదుడు, స్తుతిగానము చేయుడు. ఎందుకంటే ప్రభు తన ప్రజలను రక్షించెను. యిర్మీయా 31: 9 వారు ఏడ్పులతోను, ప్రార్థనతోను తిరిగి వత్తురు, ఎప్పుడైతే నువ్వు ఈ విదంగాదేవుని యొద్దకు తిరిగి వస్తావో అప్పుడు దేవుడు నిన్ను నడిపిస్తాడని తెలియజేస్తున్నాడు. మనము దేవుని దగ్గరకు తిరిగి వస్తే మనలను అయన సొంత బిడ్డలుగా మార్చుకుంటాడని చెబుతున్నాడు. ప్రియా స్నేహితులారా ఒక్క మాటలో చెప్పాలంటే నేటి మొదటి పఠనము ద్వారా దేవుని యొక్క ప్రేమ తన ప్రజలపై ఒక తండ్రి వాలే ఉంటుందని తెలియజేస్తున్నాడు.

సువిశేష పఠనములో

ద్రుష్టి ప్రదానం చేసే అద్భుతం సంఘటన దానిలో పరమార్థాన్ని చూస్తున్నాము. మొదటి పట్టణములో యావే ప్రభువు గ్రుడ్డి వారి పట్ల చూపిన ప్రేమను నెరవేర్చు ప్రవచనం. యేసు అయన శిస్యులు, గొప్ప జనసమూహముతో యెరికో పట్టణం దాటి పోతున్నారు. అంటే ఎసరుసలేము పట్టణానికి సమీపంలో ఉన్నారని అర్థం. 

బర్తిమయి అనే గ్రుడ్డి వాడు త్రోవ పక్కన కూర్చొని బిక్షమడుగుకుంటున్నాడు అటువంటి దౌర్భాగ్యులకు ఆ కాలంలో ఆ దేశంలో  గుర్తింపు లేదు.

ఆ వ్యక్తి అక్కడ జనం యొక్క అలజడి విని దానికి కారణం అడగ్గా "నజరేతు నివాసియగు యేసు ఆ మార్గమున వస్తున్నాడని ఒక వ్యక్తి చెప్పాడు" అది విన్న వెంటనే గ్రుడ్డి వాడు, దావీదు కుమారా యేసు ప్రభువు నన్ను కరుణింపుము అని యేసును పిలవడం మొదలుపెట్టాడు. బిగ్గరాగా పిలిచాడు. అక్కడ మనం గమనిస్తే అతని కేకలకు, ఆర్తనాదాలకు ప్రజల యొక్క గదమాయింపు మనం చూస్తున్నాము. చుట్టూ ఉన్న ప్రజలు ఆయన్ను నోరు మూసుకొమ్మని కోపగించుకున్నారు. గ్రుడ్డి వానికి ఆటంకంగా ఉన్నారు కానీ బర్తిమయిని ప్రజలు ఆపలేకపోయారు. పెద్ద పెద్దగా అరవగలిగాడు, అరిచాడు. లూకా 18 : 1-8 వితంతువు ప్రార్థన ద్వారా క్రీస్తు మనకు ఎల్లపుడు ప్రార్ధించండి, నిరుత్సహులు కాకాకండి అని తెలియజేశాడు. చాలాసార్లు మన ప్రార్థన వేడుకోలు ఆర్తనాదాలు ఇతరులకు వెర్రి కేకలుగా కనిపించవచ్చు. మరి నువ్వు నేను దేవుని బర్తిమయి లాగా బిగ్గరగా పిలువగలుగుతున్నామా లేదా?

మనం మన జీవితాలను పరిశీలించినట్లయితే ఎన్నో విషయాలు, వ్యక్తులు, వస్తువులు, మనలను యేసుప్రభువును సమీపించదానికి ఆటంకాలుగా ఉంటునాయి. 

కొన్ని సార్లు మనం ఇతరుల దేవుని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటే వారు దేవుని సన్నిధికి వెళ్లకుండా, ప్రార్థన చేయనీయకుండా అడ్డు పాడతాం, ఆటంకాలు కలుగజేస్తాము. అందుకే మనకు ఉదాహరణగా బర్తిమయి తీసుకోవాలి ఎందుకంటే అతడు పట్టుదలతో ప్రార్ధించాడు, దానికి ఫలితం అంధకారాన్ని తొలగించి నూతన జీవితాన్ని ప్రసాదించాడు. 

నువ్వు నేను  దేవుని పిలిస్తే క్రీస్తు కూడా మనలను అదే ప్రశ్న అడుగుతున్నారు! నీకు ఏమి కావాలి ధనమా, పేరు ప్రఖ్యాతలు, అందమా, ఆరోగ్యంగా లేక ఆయుషా. అందుకే నన్ను ని బిడ్డగా మార్చు ఈ ప్రశ్నకు జవాబు రెండొవ పట్టణములో చూస్తున్నాము, దేవుడు ప్రభువైన క్రీస్తు ప్రభు పలికిన మాటలు మనతోకూడా పలికితే, అది నాకు చాలు అని ప్రార్ధించాలి. ఏంటి ఆ మాట అంటే హెబ్రీ 5 : 5 లో నువ్వు నా కుమారుడవు, నా కుమార్తెవు నేను నీకు తండ్రి నైతిని. క్రీస్తు ప్రభుని భక్తి, వినయాల వల్లనా తండ్రి దేవుడు క్రీస్తు ప్రభుని ప్రార్థన ఆలకించెను అని వింటున్నాము. క్రీస్తు దేవుని పుత్రుడై వుండి కూడా మనకు ఒక గొప్ప సుమాతృకను ఇచ్చి ఉన్నాడు. 

బర్తిమయి దృఢమైన విశ్వాసంతో, పట్టుదలతో ప్రార్ధించాడు, దేవుని కరుణ పొంది నూతన జీవితం పొంది  క్రీస్తును అనుసరించాడు. 

కాబ్బటి ప్రియా స్నేహితులారా మన దేవుడు మన అవసరాలు, బలహీనతలు ఏరిగినవాడు, కావున మన అందరిని ఆదుకోవడానికి సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి విశ్వాసంతో దేవుని ప్రార్ధించి రక్షణ, నూతన జీవితం పొందుదాం! ఆమెన్.

Br.Suresh OCD

23, అక్టోబర్ 2021, శనివారం

30 వ సామాన్య ఆదివారం

30 వ సామాన్య ఆదివారం

 యిర్మియా 31:7-9 , హెబ్రీ 5: 1-6, మార్కు 10:46-52 

ఈనాటి దివ్య పఠనాలు దేవునికి తన ప్రజల పట్ల వున్న అమితమైన ప్రేమ, దయ, క్షమ అనే అంశములను గురించి బోధిస్తున్నాయి. 

తండ్రికి తన బిడ్డల పట్ల ఉన్న మమకారం ఎప్పుడు కూడా మరువనిది అని కూడా ఈనాటి పఠనాల ద్వారా మనం అర్ధం చేసుకోవచ్చు. ఈనాటి మొదటి పఠనంలో దేవుడు ఇస్రాయేలు ప్రజల మీద చూపిన గొప్ప ప్రేమ అర్థమగుచున్నది. 

తండ్రి దేవుడు ప్రజల యొక్క ఆధ్యాత్మిక అంధకారంను తొలగించి వారి యొక్క  జీవితములో సంతోషం అనే వెలుగు నింపుచున్నారు. 

దేవుడు యిస్రాయేలు  ప్రజలను ఎంతగా ప్రేమిస్తున్నారో 31 వ అధ్యాయం 1-4 వచనాలలో అర్థమగుచున్నది. 

దేవుడు ప్రతి సారి కూడా యిస్రాయేలు ప్రజలను నా ప్రజలు అని సంబోధిస్తున్నారు అలాగే నేను వారు దేవుడిని పలుకుచున్నారు. 

ఈ బంధం తండ్రి , బిడ్డల ప్రేమ బంధం విడదీయలేని బంధం, ఎందుకంటే ఎన్నిసార్లు యిస్రాయేలు ప్రజలు తండ్రిని  కాదని అన్య దైవములను పూజించినా ఆ తండ్రి తన బిడ్డలను మరలా ప్రేమిస్తూనే , క్షమిస్తూనే  ఉన్నారు. 

ఈనాడు మనం  విన్న మొదటి పఠనంలో  యిస్రాయేలు  పునరుద్ధరణకు సంబంధించి  దేవుడు చేసిన వాగ్ధానాలు వింటున్నాం. 

బాబిలోనియా బానిసత్వంలో ఉన్న యిస్రాయేలు ప్రజలను దేవుడు విముక్తి చేస్తారు. ఉత్తర దేశమైన బాబిలోనియా నుండి యిస్రాయేలు ప్రజలను  స్వదేశమైన యూదాకు తిరిగి రప్పిస్తారని తెలుపుచున్నారు. ఇక్కడ దేవుడు తన ప్రజలను ఇచ్చే  ఆ స్వేచ్ఛ గురించి , ఆయన తన ప్రజలకు ఇచ్చే సంతోషం గురించి ధ్యానించాలి. 

బానిసత్వంలో స్వేచ్ఛ లేదు, ఆనందం గా గడపడానికి సమయం లేదు, సమూహంగా దేవున్ని  ఆరాధించడానికి స్థలం లేదు. ఎటు చూసినా ఇబ్బందియే,  అంతగా బాధపడే ఒక స్థలం నుండి దేవుడు వారికి విముక్తి  చేస్తున్నారు. వారికి జీవాన్నీ సమృద్దిగా దేవుడు ఇస్తున్నారు. 

మళ్ళీ వారు సంతోషముగా యెరుషలేములో ఆరాధనాలు చేయవచ్చు ,  దేవుడు వారిని తన బిడ్డలుగానే గౌరవించారు. వారిలో ఆనందం  నింపారు. మరలా  ఒకసారి పూర్వ వైభవమును వారికి అందచేశారు. ఎన్ని కష్టాలు వచ్చినా తాను తోడై వుంటా అన్నారు. 

దేవుడు అంటున్నారు 8 వ  వచనంలో నేల అంచుల నుండి వారిని కొనివత్తును అని, అంటే దేవుడు ఏ వ్యక్తిని కూడా మరిచి పోవటం లేదు. అందరిని కూడా స్వేచ్చా వంతులను మరియు తన బిడ్డలుగా చేయాలన్నదే,  దేవుని  యొక్క ఆశ.  ఇప్పటివరకు  బాధలలో ఉన్న గ్రుడ్డి వారు, కుంటివారు ,గర్భవతులు, సంతోషంగా తిరిగి ఒక మహా సమూహంగా వస్తారని ప్రభువు తెలుపుచున్నారు. దేవుడే స్వయంగా వారిని నడిపించుకొని వస్తారు. వారికి చేరువలో ఉంటారు. 

దేవుడు తన ప్రజలను నడిపించుకొని వస్తారు, వారిని చేయిపట్టి నడిపిస్తారు. ఆనాడు ఇదే యిస్రాయేలు  ప్రజలను ఎలాగైతే వాగ్దత్త భూమికి, సంతోష స్థలాలకు  నడిపించారో అదే విధంగా మరొక సారి ఈనాటి విశ్వాస యిస్రాయేలు  ప్రజలను కూడా అదేవిధంగా ప్రేమతో నడిపిస్తారు అని  యిర్మియా తెలుపుచున్నారు. 

వారు ఏడుపులతోను  ప్రార్ధనలతో తిరిగి వస్తారు. ఎందుకు ఏడుస్తారంటే ఆ దేవుని యొక్క గొప్పదైన ప్రేమను  జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు అవిశ్వాసులుగా జీవించిన సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటూ ఏడుస్తారు. అదేవిధంగా బానిసత్వంలో గడిపిన చీకటి సమయాలను గుర్తించుకుంటూ ఇప్పుడు దేవుడిచ్చిన గొప్ప స్వేచ్ఛను, ఆయన యొక్క అనంత ప్రేమను గుర్తుకు తెచ్చుకుంటూ ఏడుస్తారు. 

ఇంకొక విధంగా చెప్పాలంటే వారి యొక్క ఆనందం వల్ల కూడా ఏడ్చి ఉండవచ్చు. ప్రభువు అంటున్నారు వారిని తిన్నని మార్గమున నడిపింతును, అంటే ఇక  అన్య దైవముల వైపు  ప్రయాణం చేయరని మంచి వైపు, దేవుని వైపు మాత్రమే ప్రయాణం చేస్తారని,  వారి గమ్యం తప్పరని అర్ధం. దేవుడు నిర్ధేశించిన స్థానంకు వారు చేరుతారని అర్ధం. 

వారు కాలు జారీ పడిపోరు అంటున్నారు అంటే వారి పట్ల అంత శ్రద్దగా  ఉంటారని దీని యొక్క అర్ధం. యిస్రాయేలు ప్రజల యొక్క జీవితాలలో దేవుడు మరొక సారి తన గొప్ప ప్రేమను వ్యక్త పరుస్తున్నారు. ప్రజలు కూడా  దేవునికి సంతోషంతో కృతజ్ఞతగా పాటలు పాడుచున్నారు. 

రెండవ పఠనంలో దేవుడు యాజకుల యొక్క ఎన్నికను గురించి  వారి యొక్క  జీవితం గురించి బోధిస్తున్నారు. ప్రధాన యాజకుడు  జీవించిన విధంగా  ప్రతి యాజకుడు జీవించాలి. క్రీస్తు ప్రభువు యొక్క యాజకత్వం మిగతా లేవీయుల యాజకత్వం కన్నా  భిన్నంగా  ఉన్నది ఎందుకంటే  స్వయంగా  తండ్రి దేవుడే తన కుమారున్నీ ఈ పనికి నియమించారు. 

తండ్రికి -ప్రజలకు మద్య  ఒక నిచ్చెనలాగా ఉండుటకు, దేవుని యొక్క ప్రతినిధిగా నిత్య యాజకుడు క్రీస్తు ప్రభువు ఉన్నారు. ప్రతి గురువు కూడా దేవుని యొక్క ప్రతినిధే.  

ప్రతి యాజకుడు కూడా ప్రజల మధ్య నుండే ఎన్ను కొనబడిన వాడే . హెబ్రీ 5:1 , ద్వితీ 18:15 ఆయన కూడా సామాన్యుడే బలహీనుడే అయినప్పటికీ దేవుడు తనను ఎన్నుకొని, అభిషేకించి బలవంతున్ని  చేశారు. 

వారిని ఎన్ను కొన్నది ప్రజలను దీవించుటకు.  ద్వితీ 10:8, సంఖ్యా 6:24-26 

వారిని ఎన్ను కొన్నది వాక్యమును ప్రకటించుటకు. ద్వితీ 31:11 , మార్కు 16:15 

తన సేవ చేయుటకు, స్తుతించుటకు ఎన్నుకొనెను.  2 రాజుల దిన 29:11 

ప్రజల కోసం బలులను సమర్పించుటకు ఎన్ను కొనబడిన వారు.  2 రాజుల దిన 29:24 ప్రజల పాపముల కొరకే కాదు యాజకుడు బలులు సమర్పించేది,  తన పాపముల కొరకు కూడా. ఈ యొక్క యాజకత్వ పదవి దేవుడు ఇచ్చినదే, ఆయనకు విధేయులై జీవించాలి. 

ఈనాటి సువిశేష పఠనములో యేసు ప్రభువు,  బర్తిమయి  అను అంధుడికి చూపునిచ్చే విధానం చదువుకుంటున్నాం. యేసు ప్రభువు  యెరుషమలేముకు  ప్రణయమయి వెళ్ళే సమయములో యెరికో మీదుగా వెళ్లుచున్నారు. 

జక్కయ్యది కూడా యెరికో పట్టణమే. యెరికో నుండి యెరుషలేము  వెళ్లుచున్నా ప్రభువు గూర్చి విని, పదే  పదే  ప్రాధేయపడి అడుగుచున్నాడు. 

ఈ బర్తిమయి  జీవితములో దేవుని మీద ఉన్న గొప్ప విశ్వాసం మనం అర్ధం చేసుకోవాలి.( లూకా 18:35-43.) క్రీస్తు ప్రభుని  గురించి  ఆయన యందు విశ్వాసం ఉంచుకున్నాడు . వినుట  వలన విశ్వాసం కలిగింది. వినుట  వలన మేలు కలుగుతుంది అని భావించాడు. క్రీస్తుని గురించి వినుట  వలన తన బాధలు పోతాయని నమ్మకం కలిగింది, క్రీస్తుని గురించి వినుట  వలన, పేదవారి పట్ల నిలిచే దేవుడు తనకి మంచి చేస్తారన్న నమ్మకం ఆయనలో కలిగింది. 

ఆయన ప్రేమ గురించి విని ఉండవచ్చు, దానితో ఆశ కలిగింది. బిక్ష గాడు సాధారణంగా చేసే పని ఏమిటంటే అడగటం, ప్రతి ఒక్కరినీ అడుగుతుంటారు. 

కొందరు బిక్ష గాళ్లు ఇవ్వకపోతే వదిలివేస్తారు. బర్తిమయి తనను ఎంతమంది ఆపినా సరే వదిలి వేయటం లేదు, పట్టు వీడటం లేదు. ఆయనకు బహుశా మత్తయి 7:7 వచనపు దేవుని మాటలు గుర్తుండవచ్చు. అందుకే వెంటనే అడుగుచున్నాడు. 

దేవుడు అనేక సార్లు మన జీవితం గుండా ప్రయాణం చేస్తారు. కాని చాలా సార్లు మనం అది గుర్తించము, బర్తిమయి దేవుడుండే స్థలంకు వెళ్లుచున్నారు. యోషయా 55:6 దేవుని కోసం అన్వేషించండి అని చెబుతుంది. బర్తిమయి మాత్రము యేసు ప్రభువును గుర్తించి, విని, పిలుస్తున్నాడు. వెంటనే ప్రభువు సమాధానము ఇస్తున్నారు.  యిర్మీయా 33:3 వాక్యంలో ప్రభువు అంటారు.  నీవు పిలుతువేని నేను జవాబిత్తును అని.  కీర్తన 34:6. మోషే పిలిచారు దేవుడు సమాధానం ఇచ్చారు. ఏలియా దేవున్ని పిలిచారు. ఆయనకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు.(కార్మెల్ పర్వతంవద్ద). 

బర్తిమయి దెవున్ని పిలిచారు, ఆయనకు స్పందించారు, సమాధానం ఇచ్చారు. సుసన్న దేవున్ని పిలిచారు దేవుడు సమాధానం ఇచ్చారు. యిస్రాయెలు, దేవున్ని ఐగుప్తులో పిలిచారు  దేవుడు సమాధానం ఇచ్చారు.  బర్తిమయి  దేవుడిని కరుణించమని కోరుతున్నారు. తన యొక్క దీన స్థితియందు, దయ ఉంచామని అడుగుచున్నాడు. తన బలహీనత పట్ల, పాపముల పట్ల కనికరం కలిగి తనను ఆదుకోమని ప్రార్థిస్తున్నాడు. 

మనం కూడా దేవుడిని అడుగవలసినది, కరుణయే. ఆనాడు  యిస్రాయేలు ప్రజలు దేవుని కరుణ కొరకు ప్రార్థించారు. కాబట్టే వారికి దేవుడు మరల జీవితాన్ని ప్రసాదించారు. 

బర్తిమయిలో చూసే గొప్ప విషయం  ఏమిటంటే తనకు, దేవుని వరం పొందుటకు దేవుడిచ్చిన,  అవకాశమను చక్కగా వినియోగించుకుంటున్నారు. ఎవరు తనను ఆపినా సరే ఆగటం లేదు. 

బర్తిమయి క్రీస్తును మెస్సయ్య గా గుర్తించారు. అందుకే దావీదు కుమారా, అని సంబోధిస్తున్నారు. మనం అడిగే ప్రతిదీ, దేవునికి నచ్చితే, దేవుడు మనకు సహాయం చేయడానికి, మన చెంతకు వస్తారు. ప్రభువు బర్తిమయి ఆక్రందన విని ఆగిపోయాడు. ప్రభువు పిలుపు వినగానే బర్తిమయి తనపై వస్త్రం విడిచిపెట్టి  ప్రభువు వద్దకు పరుగు తీశారు. అప్పటి వరకు ఆ వస్త్రం తన పడక, దాని మీదే ఆధారపడి జీవించారు, అదియే తన ఆస్తి , ఎన్నో సంవత్సరాలుగా ఆ దౌర్భాగ్య స్థితిలో గడిపి ఉండవచ్చు, కానీ ఇప్పుడు క్రీస్తు చెంతకు రావటం వలన, ఆయన నూతన జీవితం, ప్రసాదిస్తారని గ్రహించి దుప్పటి వదలి వస్తున్నారు. క్రీస్తుతో జీవించాలి అంటే పాతది  వదలి వేయాలి. 

బర్తిమయి జీవితంలో మనం గుర్తించవలసిన కొన్ని విషయాలు 

1. క్రీస్తు ప్రభువును మెస్సయ్య గా గుర్తించట 

2. క్రీస్తు చెంతకు రావడం , విశ్వాసంతో పట్టు విడువకుండా  అడుగటం 

3. ప్రభుని యొక్క దయ , క్షమ కరుణ కోరుట 

4. క్రీస్తుని వెంబడించుట. 

ఈ రోజు  బర్తిమయి చూపుని అడిగిన విధంగా మనం కూడా మన యొక్క ఆధ్యాత్మిక అంధకారం తొలగించి మంచిని చూచేలా, మంచి చేసేలా ,మంచి చెంతకు వెళ్ళేలా చేయమని ప్రార్ధించుదాం. బర్తిమయి ఎంతకాలం గ్రుడ్డివాడో ఎవరికి తెలియదు ,ఆయన గ్రుడ్డివాడు కాబట్టి పట్టించుకునే వారు లేరు. బర్తిమయి, యేసుప్రభుని చూడకుండానే నమ్మారు. ఆయన ప్రభువు ఏ మార్గము గుండా వస్తారో ముందే తెలుసుకొని, అక్కడ కాచుకొని ఆయన కొరకు, ఆయన వచ్చే స్థలం వద్దకు వచ్చి ఎదురు చూస్తున్నాడు. 

చూడక నమ్మువారు ధన్యులు యోహను 20 : 29 . క్రీస్తు ప్రభుని, విని నమ్మే ధన్యులు ఎల్లప్పుడు దేవుడి యొక్క జీవమును , ఆశీర్వాదాలు పొందుతారు. యోహను 5:24 ,20:31,రోమి 10:9-10. బర్తిమయి క్రీస్తును తన రక్షకునిగా, తనకు విముక్తి కలుగచేసే వానిగా, తన నాయకునిగా గుర్తించి ఆయన్ను సంప్రదించారు. దేవున్ని భోజనం పెట్టమని ,సంపదలు ఇవ్వమని అడగలేదు కానీ అతి ప్రధానమైన దయ చూపమని అడుగుచున్నారు. ఆనాడు సుంకరి అడిగినది అదే లూకా 18:13-14 . 

By Rev. Fr. Bala Yesu OCD

The Feast of Epiphany

The Feast of Epiphany  క్రీస్తు సాక్షాత్కార పండుగ యెషయా 60:1-6,ఎఫేసీ3:2-3, మత్తయి 2:1-12 ఈనాడు తల్లి శ్రీ సభ ముగ్గురు జ్ఞానులపండుగను కొనియాడ...