8, అక్టోబర్ 2022, శనివారం

28వ సామాన్య ఆదివారం

 

28 సామాన్య ఆదివారం 

2 రాజులు 5:14-17

2 తిమోతి 2:8-13

లూకా 17:11-19

 

ఈనాటి దివ్య నాలు దేవునిపట్ల కృతజ్ఞతా భావం కలిగి జీవించుట గురించి బోధిస్తున్నాయి. దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి ఒక్క మేలుకు మనం ఆయనకు కృతజ్ఞతా తెలపాలి,  పొందిన మేలులకు దేవుని యెడల కృతజ్ఞతా భావంను చూపించాలి. దేవుడు తన బిడ్డలు తనకు కృతజ్ఞతా చూపిస్తారని ఎదురు చూస్తారు, కాబట్టి మనలో కృతజ్ఞతా అనే భావం ఎప్పుడు ఉండాలి. దేవుడు ఇస్తాడు మన్నిస్తాడు మనిషి తీసుకుంటాడు దానిని మరిచిపోతాడు అనే సామెత ఉంది God gives and forgives, man gets and forgets. దేవుని కృపవలన ఆశీర్వదించబడుతున్నామని ఆయనయే మనలను రక్షిస్తున్నాడని అందరూ గ్రహించి ఆయనను అంటిపెట్టుకొని స్తుతించి జీవించాలి.

ఈనాటి మొదటి పఠనంలో అన్యుడైన నామాను దేవునికి కృతజ్ఞతా తెలిపిన
విధానాన్ని చదువుకున్నాం. నామాను సిరియా రాజు దగ్గర సైనాధిపతిగా పనిచేసేవారు పేరు
ప్రఖ్యాతలుగాంచిన వ్యక్తి నామాను స్వస్థత ద్వారా దేవుడు ఒక్కడే. అనే సత్యంను వెల్లడిస్తున్నారు. యావే మాత్రమే నిజమైన దేవుడు అనే అంశం ను తెలియజేస్తున్నారు. నామాను ద్వారా సిరియా రాజుకు అనేక విజయాలు వచ్చాయి నామాను యొక్క స్వస్థత మనకు అనేక విషయాలు తెలియజేస్తుంది. నామాను శరీర సంబంధమైన అనారోగ్యంతో బాధపడుతున్నారు అది పక్షవాతమో లేదా వేరే ఇతర చర్మవ్యాధియో ఎందుకంటే పక్షవాతం అనే హీబ్రూ పదంకు అనేక చర్మవ్యాధులు ముడిపడి ఉన్నాయి.

నామాను అనారోగ్యంతో బాధపడే సందర్భంలో అనేక మందిని సంప్రదించి ఉండవచ్చు వారు ఎవరి వల్ల ఆయనకు మేలు కలుగలేదు. నామాను ఎలీషా ప్రవక్త చేయు అద్భుతములను గురించి తన యొక్క ఇంటిలో పని చేసే బాలిక ద్వారా విన్నారు బాలిక తన యొక్క యజమానురాలితో మన యజమానుడు సమరియాలో ఉన్న ప్రవక్త యొద్దకు వెళితే మంచిది అని సలహా ఇచ్చింది.2 రాజులు 5:3.

మొదటి పఠనంలో మనం గ్రహించవలసిన విషయాలు:

1. ఇశ్రాయేలుకు చెందిన బాలిక (పని అమ్మాయి) మంచితనం. తన సొంత ప్రజలను రాజ్యంలో ధ్వంసం చేసిన వానికి సైతం బాలిక సహాయం చేయాలి అని అనుకున్నది ఇశ్రాయేలీయులను బానిసలుగా చేసినప్పటికీ బాలిక అతడు స్వస్థత పొందాలని కోరుకుంది అందుకే ప్రవక్త చెంతకు పంపిస్తుంది. శత్రువులను సైతం మేలు చేయాలన్న ఆమె మనసు చాలా గొప్పది.

2. నామాను యొక్క విశ్వాసం: నామాను తన యొక్క పనిమనిషి

 చెప్పిన విధంగా వెంటనే ప్రయాణం చేసి సమరియ చేరుకున్నాడు. నాకు స్వస్థత కలుగుతుంది అని విశ్వసించాడు. దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేయాలంటే మొదటిగా విశ్వాసం ఉండాలి. విశ్వాసమే క్రైస్తవ జీవితమునకు పునాది విశ్వాసం ద్వారానే దేవుడు అందరినీ దీవిస్తున్నారు. అబ్రహాము విశ్వాసం వల్లనే తన ప్రయాణం కొనసాగించి దేవుని చేత దీవించబడ్డారు అదే విధంగా అన్ని అద్భుతాలు ఎదుటివారి విశ్వాసాలను బట్టి ప్రభువు చేస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలకు గుర్తించని నిజమైన దేవుడిని నామాను గుర్తించాడు

3. నామాను యొక్క విధేయత: ఎప్పుడైతే ఎలీషా ప్రవక్త నామానును ఏడుసార్లు యోర్థాను నదిలో మునగమని చెప్పాడో వెంటనే నామాను ఉగ్రుడయ్యాడు. 2 రాజులు 5:11 అతనికి యుద్ధాను నదిలో ఏడుసార్లు మొరగటం అయిష్టంగా ఉన్నప్పటికీ తన యొక్క సేవకుల మేరకు కష్టమైనది కూడా చేయగలిగాడు. ప్రవక్త యొక్క మాటకు విధేయత చూపించారు విధేయత అంటే కష్టమైనది చేయటమే. కష్టమైనది సైతం విదేయించి చేస్తే దేవుడు ఆశీర్వదిస్తారు. నామాను ఆలోచన ప్రకారం ధమస్కులో ఉన్న అబానా, ఫర్పరు నదులు మెలైనవి. 2రాజులు 5:12 అయినా సరే తన ఆలోచనలు చిత్తమును పక్కనపెట్టి ప్రవక్త ప్రకారం చేశాడు ఆశీర్వదించబడ్డారు

4. నామాను యొక్క వినయం: అప్పటివరకు తన అనే దేవుళ్ళు గొప్ప అని భావించిన అతడు తన ఆలోచన మార్చుకొని యావే దేవుని గురించి విన్నది మొత్తం నిజం అని తెలుసుకొని ఆయనను అంగీకరించి యావే మాత్రమే నిజమైన దేవుడని తెలుసుకున్నారు తన దేవుడు ఆశీర్వదించాడు

ఆయన ఎలీషా ప్రవక్తకు కృతజ్ఞతా తెలుపుచున్నాడు తనను తాను తగ్గించుకొని ప్రవక్త దగ్గరకు వెళ్లి ఆయనకు ధన్యవాదములు తెలుపుచున్నాడు. నామాను ప్రవక్తకు బహుమానం ఇవ్వాలని అనుకున్న సమయంలో ఎలీషా ప్రవక్త దానిని నిరాకరించారు ఇక్కడ ఎలీషా యొక్క నిస్వార్థ సేవను చూస్తున్నాం.

5. నామాను రెండు గాడిదలను మట్టిని తీసుకొని పోవుట అర్థం.

కాలంలో ప్రజల యొక్క నమ్మకం ఏమిటి అంటే దేశానికి చెందిన దేవుడు అక్కడికి మాత్రమే పరిమితి కలిగిన వారు. ఒక దేవుడు ఒక ప్రాంతంలో మాత్రమే పాలించేవారు అని గట్టిగ నమ్మేవారు. ఒక వ్యక్తి వేరే దేవుని తమ సొంత దేశంలో ఆరాధించాలంటే అక్కడనుండి కొంత మట్టిని తీసుకొని పోవాలి మట్టిని తామ నివసించే ప్రదేశం క్రింద ఉంచి దేవుడిని ఆరాధించాలి. నామాను యావే దేవునికి బలిపీఠంను నిర్మించి దేవుడిని ఆరాధించాలనుకున్నాడు. బలిపీఠం కింద పవిత్ర మట్టిని ఉంచాలని అనుకున్నాడు అందుకే మట్టిని తీసుకొని వెళ్ళాడు. నామాను ఇస్రాయేలు దేవుడు గొప్ప దేవుడని అక్కడ ఉండే దేవుడు తన సొంత భూమిలో కూడా ఉండాలని కోరుకున్నాడు. యావే దేవుడు తిరిగే నేల పవిత్రమైనది అని గ్రహించారు. తాను తీసుకొని వచ్చిన మట్టి ద్వారా తన భూమిని సైతం పవిత్ర భూమిగా చేయాలి అని అనుకున్నాడు. మట్టి పవిత్రమైనది అని దానిలో దేవుని శక్తి ఉంది అని మనం గ్రహిస్తాం అందుకే పుణ్యక్షేత్రాలకు వెళ్లినప్పుడు అక్కడనుండి కొంచెం మట్టి తీసుకొని వస్తాము.. పెద్ద అవుటపల్లి అక్కడనుండి మట్టి తీసుకొని వచ్చి మనం దానిని ఎప్పుడైనా అనారోగ్యంగా ఉన్నా దానిని తీసుకొని ప్రార్థిస్తాం. ఎందుకంటే పవిత్ర మట్టి ద్వారా దేవుడు స్వస్థత ఇస్తారు అని. నామాను వలే మనం కూడా విశ్వాసం విధేయత వినయం కృతజ్ఞతా భావం కలిగి జీవించాలి. చేసిన మేలులు ఎన్నడూ మరువకూడదు. ఆయన వలే దేవునికి సాక్షులై జీవించాలి.

ఈనాటి రెండవ పఠనంలో పౌలు గారు తిమోతికి తన యొక్క వ్యక్తిగత జీవితంలో పొందిన శ్రమలను తెలియజేస్తూ దేవుని ఎడల విశ్వాసం కలిగి జీవించమని కోరుతున్నారు. సువార్త కొరకు ఆయన అనేక శ్రమలు అనుభవించారు అని తెలిపారు. తాను బంధించబడినప్పటికీ దేవుని యొక్క వాక్కుబంధించబడలేదు అని తెలుపుతూ మనం ఆయన కొరకు జీవించాలని తెలిపారు. ఆయన్ను నమ్మి ఆధారపడి చూపించినట్లు అయితే దేవుడు మనకు మేలు చేస్తారని కూడా పౌలు గారు తెలిపారు. మనం దేవునికి నమ్మదగని వారమైనా కానీ దేవుడు మాత్రము నమ్మదగిన దేవుడు 2 తిమోతి 2:13 కాబట్టి దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞులమై జీవించాలి. మనం క్రీస్తుతో మరణిస్తే ఆయనతో జీవిస్తామని పౌలు గారు తెలుపుచున్నారు. అంటే దేవునికి సాక్షులై జీవిస్తే మనకు పరలోక రాజ్యం ఇవ్వబడుతుంది.

ఈనాటి విశేష పఠనంలో యేసు ప్రభువు 10 మంది కృస్ట రోగులను స్వస్థత పరిచిన విధానాన్ని చదువుకుంటున్నాం. విశేషం ను ధ్యానించుకునే ముందు ఒక విషయమును అర్థం చేసుకోవాలి అది ఏమిటంటే యేసు ప్రభువు జీవించిన సమయంలో నాలుగు రకాల ప్రజలు జీవించిన వారు మరణించిన వారితో సమానం.

1. పేదవారు

2. గ్రుడ్డివారు

3. సంతానం లేని వారు

4. కృష్ట రోగము 

ఎందుకు జీవించిన వారు మరణించిన వారితో సమానం అంటే గ్రుడ్డివారు పేదవారు సంతానం లేని వారు కుష్ఠ రోగులు దేవుని చేత రక్షింపబడ్డారు. మరీ ముఖ్యంగా కృస్టరోగం

దేవుని శిక్షకు గుర్తు ఎందుకంటే మిరియమును దేవుడు కుష్ఠ రోగంతో శిక్షించారు. సంఖ్య 12:9-10.

గేహసీని దేవుడు శిక్షించుటవలన కుష్ఠ రోగం వచ్చింది 2 రాజులు 5:27.

ఉజ్జియాను దేవుడు శిక్షించుట 2 రాజుల దిన 26:19.

యూదుల నమ్మకం ప్రకారం కుష్ఠ రోగం అనేది దేవుని శిక్షకు గుర్తు అందుకే వారు బ్రతికే ఉన్నా చనిపోయిన వారితో సమానం. కుష్ఠ రోగం వచ్చిన వారి గురించి లేవియా కాండం 13,14 అధ్యాయాలలో వివరించబడింది. వారి యొక్క పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది ఎందుకంటే అశుద్ధులుగా పరిగణించబడతారు లేవి 13:44 నేను అశుద్ధుడను అశుద్ధుడను అని బికరగా అరవాలి కుటుంబాలకు దూరంగా ఉండాలి. సంఖ్యా 5:23.కష్టతరమైన జీవితం అది ఏసుప్రభువు యేరుషలేమునకు వెళ్లేటప్పుడు పదిమంది కృష్టరోగులు క్రీస్తు ప్రభువును సంప్రదించారు. సమాజం వారిని తృణీకరించింది ప్రభువు వారిని చేరదీశారు పదిమందిలో తొమ్మిది మంది యూదులు ఉన్నారు ఒకడు అన్యుడు సమరయుడు ఉన్నాడు. వారి యొక్క అనారోగ్యమే వారిని ఏకం చేసింది యూదులకు సమరీయులకు శత్రుత్వం ఉన్నప్పటికిని వారి యొక్క వ్యాధి వలన వారు ఏకం అయ్యారు. ఏసుప్రభు అందరినీ రక్షించాలని లోకంలోనికి వచ్చారు అందుకే వారి మీద కనికరం చూపుచున్నారు ఏసుప్రభువు చెంతకు వచ్చినప్పుడు మీరు వెళ్లి అర్చకులకు కనిపించడు అని ఒకే ఒక మాట చెప్పారు యొక్క మాటను పదిమంది విశ్వసించి వెళ్లారు. ప్రభు యొక్క మాటను విదేయించి వారు వెళ్లారు అందుకే వారు స్వస్థత పొందారు. పదిమందిలో 9 మంది దేవుని స్వస్థత పొందినప్పటికిని వారు క్రీస్తు ప్రభువు చెంతకు తిరిగి రాలేదు. కేవలం ఒక్కడు మాత్రమే అది మంచి సమరీయుడు ఏసుప్రభువుకు తిరిగి వచ్చి కృతజ్ఞతలు తెలిపాడు. మంచి సమరయుడు ఒక మంచి ఉదాహరణగా ఉన్నాడు ఆయన యేసయ్య నిజమైన యాజకుడని విశ్వసించాడు. ఆయనకు స్వస్థత ప్రసాదించిన క్రీస్తు ప్రభువు చెంతకు తిరిగివచ్చి కృతజ్ఞతా తెలిపాడు. దేవుని గొప్పతనం తెలుసుకొని ఆయన చెంతకు మరల రావటం అన్నది గొప్ప అంశం

ఈనాటి మొదటి పట్ణమునకు విశేష పఠనమునకు కొన్ని పోలికలు ఉన్నాయి.

-ఇద్దరు వ్యక్తులు కూడా అన్యులే- నామాను - సమరియా కుష్ఠ రోగి.

-ఇద్దరూ చెప్పిన విధంగా చేశారు.

-ఇద్దరూ కృతజ్ఞతా తెలపటానికి తిరిగి వచ్చారు.

-ఇద్దరూ విశ్వసించారు

-ఇద్దరూ అన్యులైనప్పటికీ యూదుల దేవుని చెంతకు వచ్చారు. ఇద్దరూ కూడా వారి యొక్క ఆలోచనలకు భిన్నమైన పనులను చేశారు. నామాను నదిలో ఏడుసార్లు మునిగాడు. సమరియా కుష్ఠ రోగి వెళ్లి అర్చకులకు కనిపించటానికి ప్రయాణం సాగించాడు.

ఇద్దరూ నిజమైన దేవుని గుర్తించారు.

మన విశ్వాస జీవితంలో కూడా దేవుని చెంతకు వచ్చి కృతజ్ఞతా తెలపాలి అన్ని భావాలలో కృతజ్ఞతా భావం మేలైనది. ఇశ్రాయేలు ప్రజలు అనేకసార్లు దేవునికి కృతజ్ఞతా తెలుపుట మరిచిపోయారు. యెషయా 1:2-4 , యోహాను 1:11.

మన జీవితంలో ప్రతి నిత్యం కృతజ్ఞతా దేవునికి తెలపాలి. ఎఫెసి 5:20, కొలోస్సి 3:17, కీర్తన 107:1, యోహాను 11:41.

దేవునికి కృతజ్ఞతా తెలుపుతూ నిజమైన విశ్వాసులుగా దేవుని బిడ్డలుగా జీవించుదాం.

FR. BALAYESU OCD

 

1, అక్టోబర్ 2022, శనివారం

27 వ సామాన్య ఆదివారం

 27 వ సామాన్య ఆదివారం

హబక్కుకు 1:2-3,2:2-4
2తిమో 1:6-8,13-14
లుకా 17:11-19

ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు విశ్వాసం గురించి తెలుపుచున్నాయి. ద్రుడ విశ్వాసం కలిగి ఉండుట ద్వారా దేవుడు మన జీవితంలో చాలా అద్భుతాలు చేస్తారు.
అందరి జీవితాలలో కష్టనష్టాలు, బాధ, సంతోషాలు ఉంటూనే ఉంటాయి అలాంటి సందర్భంలో దేవుని మీద మనకు ఉన్న విశ్వాసం ఎలాంటిది.
విశ్వాసం గురించి వివరించే సందర్భంలో పునీతా థామస్ అక్వినస్ గారు ఈ విధంగా అంటారు "విశ్వాసం ఉన్నవారికి ఎలాంటి వివరణ అవసరం లేదు ఎవరికైతే విశ్వాసం ఉండదో వారికి ఎంత వివరణ ఇచ్చినా సరే వారు విశ్వసించారు". దేవుని యొక్క విషయాలు మన యందు నెరవేరతాయి అని ఆయన ఎడల మనం పూర్తి విశ్వాసంను కలిగి జీవించాలి.
ఈనాటి అన్ని పట్ణాలు కూడా మనం దేవుని యెడల ఆయన వాగ్దానాల పట్ల అంచంచల విశ్వాసం కలిగి జీవించాలని తెలుపుచున్నాయి.
ఈనాటి మొదటి పట్ణంలో హబక్కుకు ప్రవక్త తోటి యోధ ప్రజలను విశ్వాసం కలిగి ఉండమని తెలుపుచున్నారు. హబక్కూక్ ప్రవక్త క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దంలో జీవించారు అది ఎరుషలేము పతనమయ్యే సమయం (586 BC). ప్రవక్త జీవించే సమయంలో యూదా రాజ్యంలో ఎక్కడ చూసినా సరే అవినీతి, దౌర్జన్యం, అన్యాయం, హింసకాండలు జరుగుతుండేవి.
బాబిలోనియా రాజు యోధ పై రాజ్యంపై దండెత్తి వచ్చి వారిని అనేక కష్టాలు పాలు చేశారు అలాంటి కష్ట పరిస్థితులలో హబక్కూకు ప్రవక్త తోటి యూదా ప్రజలను ఉత్సాహపరుస్తూ దేవుని యెడల విశ్వాసం కోల్పోవద్దని తెలిపారు.
హబక్కుకు మొదటి అధ్యాయం రెండవ అధ్యాయంలో ప్రవక్త మరియు దేవుని యొక్క సంభాషణల గురించి తెలియజేయబడింది. ప్రవక్త మొదటి దేవునికి ప్రజల యొక్క బాధల గురించి దేవునికి ఫిర్యాదు చేసేవారు తరువాత దేవుడు తన ప్రజలకు సమాధానం ఇచ్చేవారు.
క్రీస్తుపూర్వం 600 వ సంవత్సరంలో ఇశ్రాయేలు ప్రజలు దేవుని వడంబడిటకు వ్యతిరేకంగా జీవించినప్పుడు దేవుడు వారికి నేర్పించుట కొరకు వారిని బాబిలోనియాకు బానిసలుగా పంపించారు. ప్రజల యొక్క పాప ఫలితం గానే తమకు కష్టాలు వచ్చాయి అనే ప్రవక్త గ్రహించారు.
హబక్కుకు ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలు అన్యుల క్రింద హింసించబడట అంతగా నచ్చలేదు ఎందుకంటే వారు కూడా అన్యాయం చేసిన వారే. ప్రవక్త ఎందుకు దేవుడు అన్యులకు సహకరిస్తున్నారు అని కూడా అనుకున్నారు. ఎందుకు దేవుడు తన శత్రువులను శిక్షించుటలేదు అని భావించారు అయినప్పటికీ దేవుడు దయామయుడు ఆపదలో ఆదుకునేవాడు పాపాన్ని శిక్షించిన దాన్ని మరలా మన్నించి పాపిని దగ్గరకు చేర్చుకుంటాడు అనీ గ్రహించాడు.ప్రజల యొక్క జీవితం ఎంత బాధగా ఉన్నా దేవుడు మాత్రము ప్రవర్తన తన్ను విశ్వసించమని తెలిపారు. యావే దేవుడిని విశ్వసించి ఆయన యందు సహనం కలిగి జీవించమని ప్రవక్తకు తెలియజేశారు. ప్రజలు ఏ విధంగా ఉన్నా కానీ దేవుడు మాత్రము తన యొక్క విశ్వాసనీయతను ప్రదర్శించుచున్నారు.
ఈ మొదటి పట్ణం చివరి మాటల్లో దేవుడు ప్రజలకు మేలు చేస్తానని పలుకుచున్నారు అదేవిధంగా నీతిమంతులు భక్తి విశ్వాసము వలన జీవిస్తారు అని ప్రభువు ప్రవక్తకు తెలియజేశారు. (హెబ్రీ 2:4 రోమి 1:17, గలతి3:11, హెబ్రీ 10:38).
నీతిమంతులు దేవుని యెడల విశ్వాసమును నిలుపుకుంటారు. వారి జీవితంలో ఎన్ని బాధలు వచ్చినా వారు మాత్రము దేవుని యెడల విశ్వాసం కోల్పోరు. నీతిమంతులు తమ భక్తి విశ్వాసం వలన జీవిస్తారు ఎందుకంటే దేవునితో ఉన్న అనుబంధం అలాంటిది.
ఈనాటి మొదటి పట్ణం ద్వారా మనం గ్రహించవలసిన విషయాలు:
1. దేవుని యెడల గొప్ప విశ్వాసం ఉండాలి ఎందుకంటే ఆయన విశ్వాసనీయుడు.
2. బాధలలో కష్టాలలో దేవుడిని విడువకూడదు. ఆయన మీదనే ఆధారపడి జీవించాలి. 
3.మన హింసలలో మనకు సహనం ఉండాలి.
4. దేవుడి మనకు సమాధానం ఇస్తారు అనే నమ్మకం ఉండాలి.
5. దేవుని దయ అపారమైనది.
ఈనాటి రెండవ పట్ణంలో పుణ్యత పౌలు గారు సువార్త ప్రకటించమని తిమోతి గారిని కోరుచున్నారు. సువార్త ప్రకటన అనేది శ్రమలతో కూడుకున్నది కాబట్టి సువార్తకై పాటుపడమని పౌలు తిమోతికి తెలుపుచున్నారు. పౌలు గారు కూడా క్రీస్తు ప్రభువుని తెలుసుకొనకముందు అనేకమందిని హింసించారు తరువాత ఆయన గురించి సువార్త ప్రకటించారు. మనం జీవితంలో కూడా సువార్త ప్రకటించాలి పౌలు గారు తన పరిచర్యలో అనేక హింసలు పొందారు అయినా విశ్వాసం కోల్పోలేదు ప్రభువు హక్కును ప్రకటించారు అదేవిధంగా చేయమని తిమోతిని కోరారు. 
తన వలి సత్య సువార్త కోసం శ్రమలు అనుభవించడానికి సిద్ధంగా ఉండాలని తిమోతికి తెలుపుచున్నారు. ఈనాటి సువిశేషంలో ప్రభువు విశ్వాసం గురించి తెలుపుచున్నారు అదేవిధంగా ఒక సేవకుని యొక్క కర్తవ్యం గురించి కూడా తెలుపుచున్నారు. 
ఈ విశేష భాగమునకు ముందు వచనాలు చదివినట్లయితే అక్కడ పొరుగు వారిని క్షమించుట గురించి తెలియజేయబడినవి. ఒక వ్యక్తిని పదేపదే క్షమించాలంటే చాలా గొప్ప విశ్వాసమే ఉండాలి అందుకే మా విశ్వాసమును పెంపొందించమని అన్నారు. దానికి సమాధానం క్రీస్తు ప్రభువు ఆవగింజ విశ్వాసం ఉన్న కంబళి చెట్టును వేరుతో పెల్లగిలి సముద్రమనా పడుము అని ఆజ్ఞాపించిన అది అట్లే జరుగును అని అన్నారు.ఆవగింజ చూడటానికి చాలా చిన్నగా ఉంటుంది ఒక ఇసుక రేణువలే ఉంటుంది అలాంటి చిన్న నిజమైన విశ్వాసం మన జీవితంలో అనేక మార్పులు చేస్తుంది అనే ప్రభువు తెలిపారు.
విశ్వాసం అంటే నమ్మకం. మనకు ఉన్న డబ్బును బ్యాంకులలో వేస్తాము ఎందుకంటే ఆ బ్యాంకు మీద ఉన్న నమ్మకమును బట్టి మన డబ్బును దాచుకుంటాం. అదేవిధంగా మన నమ్మకం దేవుని యందు ఉంచాలి. దేవుని యందు ఉంచితే అది మేలు చేకూర్చుతుంది. 
పునీత పౌలు గారు అంటారు విశ్వాసం అంటే చూడని విషయాలు జరుగుతుంటాయి అనే నమ్మకమును కలిగి ఉండటమే. హెబ్రీ 11:1.
ఈ విశ్వాసమును కలిగి ఉండటం ద్వారా దేవుడు అనేక అద్భుత కార్యాలు చేస్తారు. 
1. విశ్వాసం ద్వారా దేవుడు అబ్రహామును మహాజాతిగా తీర్చిదిద్దారు.
2. విశ్వాసం ద్వారానే మోషే ఎర్ర సముద్రమును కర్రతో కొట్టి రెండు పాయలుగా చేశారు.
3. విశ్వాసం ద్వారానే సారేఫతు వితంతువు ఏలియా కు సహాయం చేశారు.
4. విశ్వాసం ద్వారానే నామాను ఎలీషా చెప్పిన విధంగా చేశారు.
5. విశ్వాసం ద్వారానే కణనీయ స్త్రీ తన కుమార్తెకు స్వస్థత వచ్చేలా చేసింది.
6. విశ్వాసం ద్వారానే యాయీరు తన కుమార్తెను బ్రతికించుకున్నారు.
ఈ విధంగా దేవుని యందు విశ్వాసం కలిగి ఉండుట ద్వారా అనేకమంది జీవితాలలో దేవుడు అద్భుతాలు చేశారు.
2. విశ్వాసం దేవునితో ఉన్న బంధంను చూసిస్తుంది. మనకు దేవునితో చిన్న బంధం ఉన్నట్లయితే అది చాలు చాలా అద్భుతాలు జరుగుతాయి అని ప్రభువు తెలుపుచున్నారు. విశ్వాసం కలిగి జీవించుట ద్వారా ఎంతటి పెద్ద సమస్యను అయినా పరిష్కరించుకోవచ్చు అని తెలుపుచున్నారు. భూమిలోకి పాతుకొని పోయిన ఒక పెద్ద చెట్టు సైతం విశ్వాసం ద్వారా పిలికించవచ్చని ప్రభువు అన్నారు. 
ఇక్కడ ఏసుప్రభువు శిష్యులను కేవలం పొరుగు వారిని క్షమించుటకే విశ్వాసమును కలిగి ఉండమని తెలుపుచున్నారు. విశ్వాసం అంటే దేవునితో ఉన్న ప్రేమ అనుబంధం దానివలన మనం ఇతరులకు మేలు చేస్తాం. 
సువిశేష రెండవ భాగంలో సేవకుని కర్తవ్యం గురించి ఏసు ప్రభువు తెలుపుచున్నారు. మన యొక్క విశ్వాసం ఏ విధంగా నిరూపించబడుతుంది అంటే మన యొక్క క్రియల వలన. విశ్వాసమున సేవకుడు తన యొక్క బాధ్యతను సక్రమంగా నెరవేర్చుతాడు. మనము దేవుని యొక్క సేవకులం కాబట్టి యజమాని యొక్క పని చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి ఎటువంటి బహుమానంను ఆశించకూడదు మన యొక్క బాధ్యతలు నెరవేర్చటలో ఏ విధంగా మనం ఉంటున్నాం. ఒక గురువుగా తల్లిగా తండ్రిగా ఉపాధ్యాయుడిగా మన బాధ్యతలు ఎలాగ నెరవేర్చుతున్నాము..
విశ్వాసము ద్వారా దేవుడు అసాధ్యమైనవి సుసాధ్యం చేస్తారు కాబట్టి ఆయన ఎంతో నమ్మకం కోల్పోరాదు. .
విశ్వసించుట అంటే ఆయన ఆజ్ఞలకు కట్టుబడి ఉండటమే.
విశ్వసించుట అంటే ఆయన్ను ప్రేమించడమే.
విశ్వసించుట అంటే ఆయన్ను విదేయించుటయే.
విశ్వసించుట అంటే దేవుని వాగ్దానాలు నెరవేరతాయి అని నమ్ముటయే కాబట్టి ప్రభువుని విశ్వసించి ఆయన యొక్క వాక్కు అనుసారంగా జీవించి దేవునికి ఇష్టమైన సేవకులుగా జీవించుదాం.

BY.  FR. BALAYESU OCD

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...