క్రీస్తు దివ్యరూపధారణ మహోత్సవం
దానియేలు 7 : 9 -10 , 13 -14, 2 పేతురు 1: 16 -19, మత్తయి 17 : 1 -9
బ్రదర్. సుభాష్ఓ.సి.డి
ఈరోజు తిరుసభ క్రీస్తు దివ్యరూపధారణ మహోత్సవాన్ని కొనియాడుతుంది
ఈనాటి మూడు పఠనాలద్వారా తల్లి తిరుసభ మనందరినీకూడా క్రీస్తువలె దివ్యరూపాన్నిదాల్చి తండ్రి దేవుని ప్రియమైన పుత్రులుగా పిలువబడాలని ఆహ్వానిస్తోంది.
దివ్యరూపధారణ అంటే క్రీస్తుప్రభువు ఒక మానవుడిగా ఉంటూనే, తన దైవరూపాన్ని పొందుతున్నాడు, దివ్యరూపాన్ని శిష్యులకు తెలియపరుస్తున్నారు. తన దైవత్వాన్ని పొందుతున్నాడు. మానవులకోసం మానవునిగా పుట్టి, మానవులను దేవుని బిడ్డలుగా చేయడానికి, దైవ ప్రజలుగా మార్చడానికి క్రీస్తు మరణించబోతున్నాడు, తన శరీరము కొరడాలతో కొట్టబడి, తన రూపాన్ని కోల్పోయాడు, క్రీస్తుని ముఖం వికృతిగావించబడింది. శ్రమల ద్వారా సిలువలో క్రీస్తు దివ్యరూపం వికృతికావడం ద్వారా, మానవులందురుకుడా , పాపం అనే వికృతరూపం నుండి, పాపపు జీవితం నుండి దేవుని బిడ్డలుగా మారుతున్నాం ఇక్కడ క్రీస్తు దివ్యరూపందాల్చడం అంటే ఆయన పాపం చేసాడనికాదు అర్థం. మానవులకోసమై ఆయన మరణించబోతున్నాడు.
ఈ సంఘటనని ప్రతిరోజూ మనందరమూ దివ్యబలిపూజలో గుర్తుచేసుకుంటాం.
గోధుమఅప్పము ద్రాక్షారములు క్రీస్తుని దివ్యశరీర రక్తలుగా రూపంతరం చెందుతున్నాయి.
వాటిని స్వీకరించిన మనం కూడా మన పాపాన్ని వదిలి క్రీస్తువలె దివ్యముగా జీవించాలి
మొదటిపఠనం:
దానియేలు మానవరూపంలో ఉన్నటువంటి దైవదర్శనం పొందాడు.
ఈదర్శనములో ఇశ్రాయేలు ప్రజలు పొందబోయే శాంతి రాజ్యాన్ని సూచిస్తుంది.
మొదటిపఠనం యొక్క చరిత్ర చూస్తే, దేవుని ప్రజలు బబులోనియా బానిసత్వంలో ఉన్నారు. ప్రజలకు మంచిరోజులు రాబోతున్నాయి, దేవునిరాజ్యం సమీపిస్తుందని, విశ్వాసముతో వేచియుండుమని, దేవుని ప్రజలను “దేవుడు రక్షిస్తాడు” అనే ఒక ఆశను వారిలో పురికొల్పుతున్నాడు, ప్రజలకు ఒక కోరిక (ఆశ) ను దానియేలు ప్రవక్తకు ఈదర్శనం ద్వారా దేవుడు దయచేస్తున్నాడు.
ఈ ప్రస్తుత అధ్యాయానికి ముందు చూస్తే, దానియేలు ప్రవక్త బబులోనియా దేశంలో బానిసగా కొనిపోబడి, అక్కడ రాజుగారి మన్నను పొంది ఒక గొప్ప స్థాయికి చేరుకుంటాడు, కానీ ఆరాజ్యంలో ఉన్న మిగిలిన అధికారులకు నచ్చక, దానియేలు ప్రవక్తని ఎలాగైనా హతమార్చాలని నిర్ణయించు కుంటారు. అందరు కలిసి రాజు చెంతకు వెళ్లి ఒక ఆదేశాన్ని జారీచేయిస్తారు, అదే బబులోనియా దేవుళ్లను, దేవతలను తప్ప ముప్పది సంవత్సరాల వరకు వేరే దేవుళ్లను, దేవతలను ఆరాధించకూడదు లేదా పూజించకూడదు అని ఒక ఆదేశాన్ని జారీచేస్తారు.
కానీ దానియేలు ప్రవక్త మాత్రం తన గదిలోనికి వెళ్లి , తలుపులు మూసి, రహస్యముగా తమ స్వదేశమైన యెరూషలేము వైపు కిటికీలు తీసి యావే దేవుడిని మాత్రమే ఆరాధిస్తారు. ఇది చూసినటువంటి అధికారులు, ఎలాగైనా దానియేలు ప్రవక్తని మట్టు పెట్టాలని రాజు చెంతకు తీసుకెళ్లి, ప్రవక్తని సింహాల బోనులో ఉంచుతారు. దానియేలు ప్రవక్తకు దేవుడి మీదవున్నా విశ్వాసమువలెనే ప్రవక్తకి ఎలాంటి హాని కలగకుండా దేవదూతలచే రక్షించబడ్డాడు. ఆసంఘటనతో బబులోనియా రాజుకు, ఆరాజ్యంలో ఉన్న ప్రజలందరికీ యావేదేవుడంటే ఎవరో తెలియపరుస్తున్నారు. ఈఅద్భుతం ద్వారా యావేదేవుడిని అందరికి తెలియపరుస్తున్నారు.
చివరిగా ఈ మొదటి పఠనంలో రాబోయే దేవుని రాజ్యాన్ని గురించి, దానియేలు ప్రవక్త విశ్వాసం గురించి మనము గ్రహించవచ్చు. ఇశ్రాయేలు ప్రజలు తమ బానిసత్వం నుండి స్వేచ్చా జీవితంలోకి రావడాన్ని రూపాంతరం చెందడం అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. బానిసత్వం నుండి, అన్యుల దేశం నుండి స్వదేశానికి వస్తున్నారు. స్వేచ్చా బిడ్డలుగా జీవించబోతున్నారు. ఆదర్శన్నే దేవుడు దానియేలు ప్రవక్తకు ఇస్తున్నారు.
సువిశేషం
సువిశేష పఠనాన్ని మనం ధ్యానించినట్లయితే. క్రీస్తుని దివ్యరూపాన్ని పొందటం మనం చదువుతున్నాం. మరియు ఆకాశము నుండి తండ్రి దేవుడు క్రీస్తుని ప్రియమైన కుమారుడిగా పిలవడం, మరియు క్రీస్తుని విశ్వసించమని చెప్పటం కూడా మనం గమనిస్తున్నాం.
దివ్యరూపధారణ : ఆసమయంలో క్రీస్తుతో పాటు మోషే మరియు ఏలీయా ప్రవక్తలు వీరు ముగ్గురు కూడా ఇశ్రాయేలు ప్రజల రక్షణకు దేవునికి సహకరించినవారు.
ఇప్పుడు తాబోరు కొండమీద రాబోతున్నటువంటి, క్రీస్తు పొందబోతున్నటువంటి శ్రమలు, మరణ పునరుత్తానాల గురించి చర్చిస్తున్నారు. క్రీస్తు తన మరణం పునరుత్తానం ద్వారా సమస్త ప్రజలందరూకూడా, క్రీస్తు నిజమైన దేవుని కుమారుడా గుర్తించబడతారు.
ఆచర్చలో క్రీస్తు తాను దేవుని చిత్తాన్ని అంగీకరించి, మరణించాడని కూడా సిద్దమయ్యాడు.
ఈ అధ్యాయానికి ముందు అధ్యయాలు అన్ని కూడా, విశ్వాసం గురించి తెలియచేస్తాయి.
క్రీస్తుప్రభువు దైవరాజ్యాన్ని గురించి భోదిస్తున్నప్పుడు, యూదులు, ధర్మశాస్త్రబోధకులు, పరిశయ్యులు క్రీస్తుని తిరస్కరిస్తున్నారు, ఆయనను రూపుమాపాలని పన్నాగాలు పడుతున్నారు.
ఆ సందర్భంలోనే క్రీస్తుప్రభువు తన శిష్యులను ఈవిధంగా అడుగుతున్నారు. నేను ఎవరినని మీరు విశ్వసిస్తున్నారు ? వెంటనే పేతురుగారు “ నీవు సజీవుడైన దేవుని కుమారుడవు” అని బదులు పలికెను.
అందుకే క్రీస్తుప్రభువు నిరాతిమీద నారాజ్యాన్ని, నాసంఘాన్ని నిర్మిస్తాను అన్నాడు.
ఈనాటి సువిశేషంలో కూడా తండ్రి దేవుడు, ఆసత్యాన్నే ఈముగ్గురు శిష్యుల ఎదుట, వారికీ తెలిసేలా క్రీస్తుని గురించి “ఈయన నా ప్రియమైన కుమారుడు, ఇతనిని విశ్వసించండి అని తెలుపుతున్నారు”.
ఈనాటి సువిశేషంలో కూడా తండ్రి దేవుడు, ఆసత్యాన్నే ముగ్గురు శిష్యుల ఎదుట వారికీ తెలిసేలా క్రీస్తుని గురించి “ఈయన నా ప్రియమైన కుమారుడు, ఇతనిని విశ్వసించండి అని తెలుపుతున్నారు”. క్రీస్తు యొర్దాను నదిలో జ్ఞానస్నానం పొందినప్పుడు కూడా , దేవుని స్వరం ఈవిధంగా పలుకడం మనం గమనించవచ్చు. అప్పుడు కూడా క్రీస్తు ప్రభువు మానవుల రక్షణ చర్యలో దేవుని చిత్తాన్ని అంగీకరించాడు. అందుకుగాను దేవుని స్వరం ఆవిధంగ పలికింది .
ఎవరైతే దేవుని చిత్తాన్ని అంగీకరించి నెరవేరుస్తారో వారిని దేవుడు కూడా ప్రిమయైన బిడ్డలుగా పిలుస్తారు.
అంటే లోకాన్ని పాపము నుండి విముక్తి గావించాడని, రక్షించాడనికి వచ్చినది క్రీస్తే అని విశ్వసించండి అని తండ్రి దేవుడు తెలియచేస్తున్నారు.
మానవులకు దైవరూపాన్ని ఇవ్వుటకు క్రీస్తు తాను సిలువలో వికృతరూపం దాల్చుటకు సిద్ధమవుతున్నారు
కాబట్టి మనం కూడా మనకోసం మరియు ఇతరుల కోసం రూపాంతరం చెందడానికి మనల్ని మనం వికృతీకరించుకోవాలి
రెండవపఠనం
రెండవపఠనంలో, పేతురుగారు క్రీస్తుని గొప్పతనాన్ని వివరిస్తున్నారు. పేతురుగారు క్రీస్తుప్రభువు దివ్యరూపధారణ సమయంలో ఉన్న ప్రత్యక్ష సాక్షి. అందుకే అంటున్నారు, తండ్రి దేవుడు క్రీస్తుని గూర్చి చెప్పిన సందేశాన్ని, మాటలను, నాకన్నులార క్రీస్తుని దివ్యరూపాన్ని గాంచితిని, దేవుని స్వరమును స్వయముగా , చెవులారా వింటిని అంటున్నారు.
కావున క్రీస్తుని విశ్వసించండి. ఏలయన క్రీస్తుప్రభువే మన అంధకార జీవితాలను , మానవ జీవితాలను, దేవుని బిడ్డలుగా, పవిత్ర జీవితాలుగా మార్పు చెందించే దేవుడు. మన అంధకార జీవితాలకు వేకువ జామున
వెలుగునిచ్చే వేగుచుక్కవంటివాడు ఆయనను విశ్వసించండి అని బోధిస్తున్నారు. ఆయన మానవుడిగా రూపందాల్చి
మానవులందరికి దైవరూపాన్ని ఇవ్వాలని సిలువలో మరణించాడు. కనుక ఆయేసును మీరు విశ్వసించండి అని బోధిస్తున్నారు.