29, సెప్టెంబర్ 2023, శుక్రవారం

 

26 సామాన్య ఆదివారం

యెహెజ్కేలు 18:25-28

ఫిలిప్పీ 2:1-11

మత్తయి 21:28-32

దేవుని తోటలో పని

మనం లోకంలో దుష్క్రియలుగాక, సత్క్రియలను చేయాలి. మన క్రియలకు మనమే బాధ్యులం మన బాధ్యతలను మనం సక్రమంగా నెరవేర్చాలి. దేవుని చిత్తమునునెరవేర్చడంలో క్రీస్తే మన ఆదర్శం: “నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటయు, ఆయన పనిని పూర్తిచేయుటయే నా ఆహారము" (యోహాను 4:34). కనుక, మనం కూడా స్వార్థంతోగాక, నిస్వార్థ బుద్ధితో జీవించాలనేది నేటి సందేశం.

            ఈనాటి సువిశేష పఠనంలో ఇద్దరు కుమారుల ఉపమానాన్ని వింటున్నాం. ప్రభువు ఉపమానాన్ని ప్రధానార్చకులకు పెద్దలను ఉద్దేశించి చెప్పాడు. యేసు దేవాలయంలో ప్రవేశించి బోధిస్తున్నప్పుడు ప్రధానార్చకులు, పెద్దలు వచ్చి, “ అధికారంతో నీవు పనులు (బోధనలు, స్వస్తతలు, అద్భుతాలు) చేస్తున్నావు? నీకు అధికారమిచ్చిన వాడె వడు? అని ప్రశ్నించారు (మత్తయి 21:23). సందర్భంలో ప్రభువు మూడు ఉపమానాలు చెప్పాడు. అందులో మొదటిదిఇద్దరు కుమారుల ఉపమానం.” ఉపమానంలో రెండు వేరువేరు వ్యక్తిత్వాలను చూడవచ్చు. ఒకటి ప్రధానార్చకులు, పెద్దలు. మరొకటి సుంకరులు, జారిణులు. మొదటి కుమారుని, ద్రాక్షాతోటలో పనిచేయమని తండ్రి పిలిచినప్పుడు, మొదట అతడువెళ్లడం నాకిష్టం లేదుఅని చెప్పినా తర్వాత తన మనస్సు మార్చుకొని వెళ్ళాడు.ఇతనుబలహీనులను, అవివేకులను, పాపాత్ములను, అన్యులను సూచిస్తున్నాడు. దేవుడు అన్యులను (మనలను) పిలువకముందు, మొదటి కుమారుని మనస్తత్వాన్ని కలిగియున్నారు. లోకాశలతో జీవించారు. దేవునికి వ్యతిరేకంగా జీవించారు. మొదటగా అవిధేయించినా దేవుని వాక్యాన్ని (బాప్తిస్మ యోహాను, క్రీస్తు బోధనల ద్వారా) ఆలకించి, విశ్వసించి, మారుమనస్సు పొందియున్నారు. రెండవ కుమారుడు మొదటనేను వెళ్ళుచున్నానుఅని చెప్పినా పనికి వెళ్ళలేదు. ఇతను కపట వేషదారులను (తమను తాము నీతిమంతులుగా పరిగణించే వారు) సూచిస్తున్నాడు. అతను గొప్ప వాగ్దానం చేసాడు కాని పాటించలేదు. పని చేయాలనే ఉద్దేశ్యం కూడా అతనికి లేదు. మాటకు, చేతకు పొంతన లేదు. ఇలాంటి వారు అబద్ద మాడువారు. (చదువుము, లూకా 6:45).

ఇద్దరు కుమారులు పాపాత్ములే! ఒకడు అవిధేయించాడు. ఇంకొకడు చేస్తానన్న పనిని చేయలేదు. ఒకడు నోటిమాటతో తండ్రిని బాధపెట్టాడు. ఇంకొకడు చేతలతో బాధపె ట్టాడు. ఇచ్చటమారుమనస్సుచాలా ముఖ్య మైనది. మనమందరం పాపం చేస్తాం. కాని, చేసిన తప్పును తెలుసుకొని మారుమనస్సు పొంది, తప్పును సరిదిద్దుకోవాలని దేవుడు కోరుతున్నాడు. పెద్దకుమారుడు వెళ్లనని చెప్పినా మనసు మార్చుకొని వెళ్ళాడు. తద్వారా, అతను తండ్రి ఆజ్ఞను పాటించిన వాడయ్యాడు. రెండవ వాడు, విధంగానూ మారుమనస్సు పొందలేదు. కనుక, మనం లోకంలో చేసే పనులు, కార్యాలు దేవుని ఆజ్ఞను పాటించే విధంగా ఉండాలి.

ప్రధానార్చకులు, పెద్దలు, పరిసయ్యులు  తమ్ముతాము నీతిమంతులుగా పరిగణించుకొనే వారు. దేవుని గురించి ఎన్నో విషయాలను ప్రజలకు బోధించేవారు. కాని, వారు చేసే పనులు అందుకు విరుద్ధంగా ఉండేవి. దైవ రాజ్యానికి వారే వారసులు అని భావించేవారు. కాని వారు సువార్తను విశ్వసించలేదు. యేసును మెస్సయ్యగా (క్రీస్తుగా) అంగీకరించ లేదు. హృదయ పరివర్తన చెందలేదు. బాప్తిస్మ యోహాను బోధించిన నీతి మార్గాన్ని వారు విశ్వసించలేదు. వారిని గురించి ప్రభువు సామాన్య ప్రజలతో ఇలా అన్నారు: “ధర్మశాస్త్ర బోధకులును, పరిసయ్యులును మోషే ధర్మాసన మున కూర్చొని ఉన్నారు. కాబట్టి వారి క్రియ లనుగాక వారి ఉపదేశములను అనుసరించి పాటింపుడు. ఏలయన వారు బోధించునది వారే ఆచరింపరు (మత్తయి 23:1-3). వారి బోధనలు, ఉపదేశాలు అద్భుతంగా ఉంటాయి. కాని, బోధించిన విధంగా వారు జీవించడం లేదు. కాని, పాపాత్ములు, సుంకరులు, జారిణులు సువార్తను (యేసు) విశ్వసించారు. స్యాన హృదయ పరివర్తన చెందారు. కనుక వీరు ముందుగా, దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు అని ప్రభువు చెప్పారు. ఉపమానంలో కుమారుల వ్యక్తిత్వాలు వేరైనా వారికి తండ్రి ఒక్కడే! అనగా సర్వ మానవాళికి (క్రైస్తవులు-క్రైస్తవేత్తరులు) దేవుడు (తండ్రి) ఒక్కడే అని అర్థం చేసుకోవాలి. ఇరు వురికి ఒకే ఆజ్ఞ ఇవ్వబడినది. "కుమారులారా! నేడు మీరు మన ద్రాక్షాతోటలోనికి పోయి పని చేయండిఅని. తల్లిదండ్రులు తమ పిల్లలను సోమరులుగా పెంచరాదు. మనమందరం దేవునికి వారసులం అయినప్పటికీ మనం పని చేయాలని దేవుడు ఆజ్ఞాపించాడు. ఆజ్ఞ ప్రతి ఒక్కరికి ఇవ్వబడింది. ఆది తల్లిదండ్రుల అవిధేయత (పాపం) వలన మనం దేవుని (ద్రాక్షా) తోట నుండి గెంటివేయబడి, కష్టపడి పని చేయవలసి వచ్చింది. మరల యేసుక్రీస్తు కృపవలన, దేవుని ద్రాక్షాతోటలో పనిచేసే అవకాశాన్ని పొందాము. దేవుని ద్రాక్షాతోటలో పని చేయడానికి మనకు కావలసింది వినయం, విధేయత. ప్రతి ఒక్కరం కూడా దేవుని పని (చిత్తము) చేయడానికి పంపబడి నాము. తండ్రి తోటలో పని చేయడం అంటే మన కొరకు పని చేయడమే. ఇచ్చట మరియు తల్లిని మనం ఉదాహరణగా, ఆదర్శంగా తీసు కోవచ్చు (లూకా 1:38). ఆమె లోకంలో తనకు అప్పజెప్పబడిన పనిని నూరుశాతం పరిపూర్ణంగా నెరవేర్చింది. మనకు గొప్ప ఆదర్శ తల్లిగా నిలిచింది.

డీకన్. మనోజ్ చౌటపల్లి

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...