ద్వితీయో 18:15-20
1కొరింతి 7:32-35
మార్కు1:21-28
ఈనాటి పరిశుద్ధ గ్రంధ పఠణములు దేవుని యొక్క సేవకుల యొక్క అధికారం వారి యొక్క బాధ్యతల గురించి తెలియజేస్తున్నాయి. సేవకులు యొక్క అధికారము అంతయు కూడా దేవుని దగ్గర నుండి వచ్చినది. వారిని ఎన్నుకునే సందర్భంలోనే దేవుడు వారికి సంపూర్ణ అధికారం ఇస్తున్నారు.
ఈనాటి మొదటి పఠణంలో మోషే ప్రవక్త ఆయన మరణము గురించి తెలియజేసినప్పుడు వారు మేము ఒక గొప్ప నాయకుడిని కోల్పోతున్నాము అనేటటువంటి భయములో ఉన్న సందర్భంలో ఇశ్రాయేలు ప్రజలకు ఊరటనిచ్చుటకు ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేసేటటువంటి మాట ఏమిటంటే తనలాంటి ప్రవక్తని ప్రజల మధ్యకు దేవుడు పంపిస్తానని తెలియజేస్తున్నారు. మొట్టమొదటిగా మనందరం కూడా ఎవరు ప్రవక్త అని తెలుచుకోవాలి.
ప్రవక్త అనగా దేవుని స్వరము, దేవుని మార్గములను బోధించేవాడు, దేవునికి మానవునికి మధ్య వారధిగా నిలబడే వ్యక్తి , పరలోక సత్యమును బోధించే వ్యక్తి, అన్యాయమును ఎదిరించే వ్యక్తి, అందుకనే ఈనాటి మొదటి పఠణంలో ప్రభువు ఇస్రాయేలు ప్రజలకు మోషే ప్రవక్త వంటి వాడిని పంపిస్తామంటున్నారు. మరి మోషే ఎలాంటి ప్రవక్త? ఆయన కూడా ప్రజల నుండి వచ్చినవాడే, ఆయన కూడా బలహీనుడే ,అయినప్పటికీ దేవునికి అతి సమీపమున జీవించి ఉన్నారు. మోషే ప్రవక్త దేవుని యొక్క పిలుపుని అందుకున్న తర్వాత ఇజ్రాయేల్ ప్రజలను నడిపించుటకు ఆయన ఒక నాయకుడిగా అదే విధముగా ఒక మార్గం చూపరీగా నిలిచి ఉన్నారు దేవుని యొక్క పరమ రహస్యములను ప్రజలకు బోధిస్తూ జీవించారు. అలాగే ప్రతి ఒక్క ప్రవక్త కూడా మోషే ప్రవక్త వలే మార్గ చూపరిగా ఉంటూ ప్రజలను దేవుని వైపు నడిపించాలి. ఆయన తన జీవితంలో గుర్తుపెట్టుకోవలసిన రెండు ప్రధానమైన అంశములు ఏమిటి అంటే తాను ఎల్లప్పుడూ దేవుడికి దగ్గర అయి ఉండాలి అదేవిధంగా తాను దేవుడి యొక్క మాటను మాత్రమే బోధించాలి. తన సొంత ప్రణాళికలు కానీ తన సొంత ఆలోచన గానీ తెలియజేయకూడదు కేవలము దేవుడు చెప్పవలసినది మాత్రమే మనము తెలియజేయాలి అది ప్రవక్త యొక్క ముఖ్యమైన బాధ్యత. అలా వారు చేయకపోతే దేవుని యొక్క శిక్ష కూడా వస్తుంది.
మోషే ప్రవక్త ఇజ్రాయేల్ ప్రజలకు కూడా తెలియజేసే అంశము ఏమిటి అంటే వారు ఆ ప్రవక్త యొక్క మాటను వినాలి.
ఆ ప్రవక్త యొక్క మాట సంపూర్ణంగా దేవుని యొక్క మాట కాబట్టి దానిని తమ యొక్క జీవితములో ఆచరించి జీవించాలి అది ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత మరి ఈనాడు ఎంతమంది దేవుని సేవకులు యొక్క మాటను వారి హెచ్చరికలను ఆలకించి విధేయత చూపుతున్నామా?
ఈనాటి రెండవ పఠణంలో కూడా పునీత పౌలు గారు సమర్పణ జీవితం గురించి తెలియజేస్తున్నారు. వివాహ జీవితంలో ఉన్నటువంటి భార్యాభర్తలు వారికి సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛ లేనందున దేవునికి తముతాము పూర్తిగా సమర్పించుకోలేరు కానీ ఎవరైతే పౌలు గారి వలే సమస్తమును కూడా దేవునికి త్యాగం చేసి జీవిస్తున్నారో వారందరూ తమయొక్క జీవితమును తాము దేవునికి సమర్పించుకొని జీవిస్తారు.
ఈనాటి సువిశేష పఠణంలో ఏసుప్రభు యొక్క అధికారం గురించి తెలియజేయబడుతుంది ఆయన బోధన అధికారంతో కూడుకున్నటువంటిది. ఏసుప్రభువు యొక్క బోధనలో ఎటువంటి సందేహాలు లేవు ఆయన సమస్తము మీద అధికారం కలిగినటువంటి దేవుడు కాబట్టి తన తండ్రి చిత్తమును సంపూర్ణంగా ఎరిగి ఎటువంటి భయము లేకుండా ఒక మధ్యవర్తిగా తన తండ్రి సందేశములను ప్రజలకు తెలియజేశారు. ఏసుప్రభు యొక్క అధికారము తన తండ్రి నుండి వచ్చినది సృష్టికి పూర్వం నుండి తండ్రి దగ్గర ఉన్నటువంటి కుమారుడు ఈ యొక్క అధికారం ను కలిగి ఉన్నారు ఆయన అధికారము మంచి కొరకు మాత్రమే ఆయన అధికారము సేవ కొరకు మాత్రమే ఆయన అధికారం వినయముతో కూడుకున్నది కాబట్టి ఈరోజు మనము కూడా ధ్యానించవలసిన అంశం ఏమిటి అంటే దేవుడు మనకు ఇచ్చిన అధికారం ఒక యజమానుడిగా నాయకుడిగా ఇచ్చిన అధికారమును మనము సద్వినియోగపరచుకొని జీవించాలి.
Fr. Bala Yesu OCD