7, సెప్టెంబర్ 2024, శనివారం
23వ సామాన్య ఆదివారం
2, సెప్టెంబర్ 2024, సోమవారం
1 కొరింతి 2:1-5, లూకా 4:16-30
1 కొరింతి 2:1-5, లూకా 4:16-30
తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్ధనామందిరమునకు వెళ్లెను. అచట ఆయన చదువుటకు నిలుచుండగా, యెషయా ప్రవక్త గ్రంధమును ఆయనకు అందించిరి. ఆ గ్రంథమును తెరవగా ఆయనకు ఈ క్రింది వచనములు కనబడెను. "ప్రభువు ఆత్మ నాపై ఉన్నది. పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనమును కలుగ చేయుటకును, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను." దీనిని చదివి యేసు గ్రంధమును మూసి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను. ప్రార్థనా మందిరములోని వారందరు, ఆయనవంక తేరిచూచుచుండగా, ఆయన వారితో "నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది"అని పలికెను. అది వినిన ప్రజలందరు దయాపూరితములగు ఆయన మాటలకు ఆశ్చర్యపడి "యితడు యోసేపు కుమారుడు కాడా ?" అని చెప్పుకొనసాగిరి. అంతట యేసు వారితో 'ఓ వైద్యుడా! నీకు నీవే చికిత్స చేసికొనుము అను సామెతను చెప్పి, "నీవు కఫర్నాములో ఏ యే కార్యములు చేసితివని మేము వింటిమో, ఆ కార్యములనెల్ల ఇచట నీ స్వదేశంలో సైతము చేయుము అని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురు. ఏ ప్రవక్తయు తన స్వదేశమున గౌరవింపబడడని మీతో నిశ్చయముగా పలుకుచున్నాను. వాస్తవము ఏమనగా, ఏలీయా కాలమున మూడు సంవత్సరములు ఆరు మాసములు అనావృష్టివలన దేశమంతట గొప్ప కరువు వ్యాపించినది. ఆనాడు యిస్రాయేలీయులలో పెక్కుమంది విధవరాండ్రు ఉండినను సీదోనులోని సరేఫాతు గ్రామమున నివసించు విధవరాలి యొద్దకు మాత్రమే ఏలీయా పంపబడెను. ప్రవక్తయగు ఎలీషా కాలములో యిస్రాయేలీయులలో చాలామంది కుష్ఠ రోగులు ఉన్నను, సిరియా నివాసియగు నామాను తప్ప మరి ఎవ్వరును స్వస్థత పొందలేదు" అని పలికెను. అపుడు ప్రార్ధనామందిరములోని ప్రజలు అందరు యేసు మాటలను విని మండిపడిరి. వారు లేచి యేసును నగరము వెలుపలకునెట్టుకొని పోయి, తమ నగరము నిర్మింపబడిన పర్వతాగ్రమునకు తీసుకొనివెళ్ళి, అచట నుండి తలక్రిందుగా పడత్రోయతలచిరి. కాని యేసు వారి మధ్య నుండి తొలగి తనదారిన తాను వెళ్లిపోయెను.
మొదటి పఠనములో మానవ జ్ఞానము నిష్ఫలమైనదని పౌలుగారు తెలియజేస్తున్నారు. పౌలుగారుప్రసంగాలు కేవలం దేవుని వాక్యమే. మనం కూడా పౌలులాగా వాక్యంలో క్రీస్తును చూపించాలి. లోక జ్ఞానాన్ని ప్రదర్శించే ప్రయత్నం పౌలు ఎన్నడు చేయలేదు.
మన విశ్వాసము, మనుషుల జ్ఞానమును ఆధారము చేసికొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని యుండవలెను. ఈ రోజుల్లో ఆకర్షణీయమైన మాటలు చెప్పే బోధకులున్నారు. కానీ పవిత్రాత్మ చే నడపబడి దేవుని శక్తి వ్యక్తమయ్యే బోధకులు తక్కువగా ఉన్నారు.. మానవ జ్ఞానానికి దారి తియ్యని మాటలకు ఆకర్షితులై ఎంతో మంది విశ్వాసంలో తప్పు దోవ పడుతున్నారు.
ఓ తండ్రి, పది సంవత్సరాల కొడుకు బస్సు ప్రయాణం చేస్తున్నారు. మాములుగా చిన్న పిల్లలు అడిగే ప్రశ్నలు ఎక్కడ? ఎప్పుడు?ఎందుకు? ఏమిటి? ఇలా ఆ అబ్బాయి తండ్రిని ఎన్నో ప్రశ్నలు అడిగాడు. చివరికి డాడీ రోడ్డుకు వేసే తారును దేనితో తయారు చేస్తారు? అని అడిగాడు. తండ్రి కొద్దిగా కొపంతో బాబు నీవు ఈ రోజు నన్నడిగిన ప్రశ్నల్లో ఇది 999 వ ప్రశ్న. దయచేసి కొంత సేపు నన్ను వదిలెయ్యి అంటూ. నేను గనుక మా నాన్నను యిన్ని ప్రశ్నలను అడిగి ఉంటె నాకేమయ్యేది? అని అనుకున్నాడు. కొడుకు కొద్దిసేపు ఆలోచించి నా ప్రశ్నలకు చాలావరకు నాకు సమాధానాలు నాకు తెలిసేవి అన్నాడు. ఈ లోక జ్ఞానం చూసి, విని తెలుసుకునేలా ఉంటుంది. కానీ పరలోక సంబంధమైన జ్ఞానము పవిత్రాత్మ మాత్రమే ఒసగుతుంది.
ఇవి అద్భుతం ద్వారా నిరూపిస్తున్నారు. అపవిత్రాత్మలు సైతం క్రీస్తు వాక్కుకు లోబడి ఉన్నవి . అధికారపూర్వమైన హెచ్చరిక రాగానే అపవిత్రాత్మ వెళ్ళిపోతుంది. సువార్తలో ఈ అద్భుతాన్ని చూసి ప్రజలు క్రీస్తు అధికారాన్ని అంగీకరించారు. ఇలా గుర్తుల ద్వారా వచ్చిన విశ్వాసం గొప్పది చూసి విశ్వసించిన వారికంటే చూడక విశ్వసించిన వారు ధ్యనులు. ఆ ధన్యతను మనకు ప్రసాదించమని విశ్వాసంలో బలపడేలా దీవించమని ఈనాడు ప్రత్యేకంగా ప్రార్ధించుదాం. ఆమెన్
ఫా. రాజు సాలి OCD
The Feast of Epiphany
The Feast of Epiphany క్రీస్తు సాక్షాత్కార పండుగ యెషయా 60:1-6,ఎఫేసీ3:2-3, మత్తయి 2:1-12 ఈనాడు తల్లి శ్రీ సభ ముగ్గురు జ్ఞానులపండుగను కొనియాడ...