22, ఫిబ్రవరి 2023, బుధవారం

ENGLISH & TELUGU (ASH WEDNESDAY)

 ASH WEDNESDAY

Reading I: Joel 2:12–18 

Psalm: 51:3–4, 5–6ab, 12–13, 14 and 17 

Reading II: 2 Corinthians 5:20–6:2 

Gospel: Matthew 6:1–6, 16–18

 

Dear Brothers and sisters from Christ Jesus, From today onwards we begin our Lenten journey. We are entering into  a season of reflection , repentance and renewal. It’s a season to reflect our lives in the light of the scripture and our relationship with God and others. It’s a season to repent to keep our priorities right and keep our hearts clean and it’s a season to renew and restore the lost hope, love and grace once again. And today’s readings perfectly set us on this path and perfectly guide us in this journey.

The whole bible and the message of God is all ultimately about one thing: allowing God to win over our hearts. 

In the first reading from the prophet Joel, the lord invites his people

To put aside everything that they are doing so far and come to him and change their direction and focus towards him.

He calls upon his people to acknowledge and repent for the sins.

He insists that he wants complete focus, complete experience of conversion of heart not just a simple sorrow, an outward activity rather a change of heart. That’s why he says “Tear your hearts, and not your garments” (Joel 2:13).

 

In the second reading, St. Paul reminds us of the hope and salvation which Jesus Christ has brought through his death.

And this grace of salvation can only be received through repentance and faith in him.

 

In the Gospel reading, Jesus challenges us to embrace three pillars of season: Prayer, Fasting, and Almsgiving in order to journey through this of lent. He also instructs us to assimilate the true spirit of fasting and prayer.

As the people of Israel were made to wander in the desert for forty years for their conversion, as Moses spent 40 days on Mount Sinai in God’s presence for his commandments and just as Jesus went out for forty days to be strengthened for the ministry, so too we should see these next forty days as a journey for enormous spiritual growth. Let us pray for the grace to have our hearts purified, renewed, and set afire this Lent.  

First, Prayer:

Prayer is to depend on God, acknowledging our weaknesses.

Prayer is to submit to God, surrendering our will to God’s will.

Prayer is to believe that “I can do nothing, but God can do everything,” and to ask him humbly.

Prayer is conversation with God and connection with God who awaits for us.  

 

With regard to prayer, Jesus wishes us that our focus should be on God not on public opinion or public appreciation. And it should not be a time to showcase one’s talents and skills rather what Jesus meant by saying “ But when you pray, go to your inner room, close the door, and pray to your Father in secret” is that a kind of personal contemplative prayer where shut all the doors of  distractions, intentions and focus only God and his will to us. And then truly God repays us with his life giving relationship and strengthens us in our journey.

Fasting & Abstinence:

In terms of fasting, the Lord Jesus teaches us that it’s a means of communion with God and while fasting there should be joy and praise  not gloom and criticism.  Because the purpose of fasting is to help us be detached from the pleasures of this world and focus our attention on God. Therefore, in no way should we neglect our joy and praise.

In modern terms : fasting need not be only from food, it also can be from social media, technology, gossip, and excessive screen time. Fasting should remind us of our hunger for God.

Advantages of fasting:  

a - It reduces the excessive accumulation of “fat” in our soul in the form of evil tendencies and evil habits (=spiritual obesity).

b - It gives us additional moral and spiritual strength.

c - It offers us more time to be with God in prayer.

d - It encourages us to share our food and goods with the needy.

Almsgiving:

With regard to this Jesus instructs that  it’s not about showcasing your wealth, rather It's a response to God’s blessing. It’s more about showing compassion towards other people and less about proclaiming our name and fame. Jesus invites not just share our material goods, but also show gratitude to God by sharing our gifts of resources, Time, and talents to the people in need.

 

Prayer, Fasting, and Almsgiving  prepare and purify our hearts, body, mind and spirit in this journey to a deeper conversion and to receive light of Christ at Easter. That’s why we begin with Ashes reminding us that we are dust and end with fire/light reminding us that we ought to reach Christ/God/eternal life of light.


విభూది బుదవారం

మొదటి పఠనము : 2:1218

కీర్తన: 51:34, 56ab, 1213, 14 మరియు 17

రెండవ  పఠనము : 2 కొరింథీయులు 5:206:2

సువార్త: మత్తయి 6:16, 1618

 

క్రీస్తు యేసు నందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజు నుండి మనం మన తపస్సు కాల  ప్రయాణాన్ని ప్రారంభించాము. మనము ధ్యానము, పశ్చాత్తాపం మరియు పునరుద్ధరణ అనే సమయాలోనికి  ప్రవేశిస్తున్నాము. ఇది మన జీవితాలను దేవుని వాక్యం ద్వారా పరిశీలించుకుని మరియు దేవుడు మరియు ఇతరులతో మన సంబంధాన్ని గమనించుకొని, మరియు  మన ప్రాధాన్యతలను సరైన దారిలో మలచుకోవడానికి మరియు మన హృదయాలను శుభ్రం చేసు కోవడానికి ప్రయత్నిచే సమయం  మరియు కోల్పోయిన మన జీవిత ఆశ, ప్రేమ మరియు దయను మళ్లీ పునరుద్ధరించడానికి అరుదైన ఆధ్యాత్మిక కాలం. నేటి పఠనాలు మనల్ని ఈ మార్గంలో సంపూర్ణంగా ఉంచుతాయి మరియు ఈ ప్రయాణంలో మనకు  సంపూర్ణంగా మార్గనిర్దేశం చేస్తాయి.

మొత్తం పవిత్ర గ్రంధము మరియు దేవుని సందేశం అంతిమంగా ఒక విషయానికి నిమిడిఉంది: దేవుడు మన హృదయాలను గెలుచుకోవడానికి సహకరించడం మరియు అనుమతించడం.

 

మొదటి పఠనంలో యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు తన సందేశాన్ని అందిస్తున్నాడు.

మొదటగా ఇశ్రాయేలు ప్రజలను ఆహ్వానిస్తూ మనలను కూడా ఆహ్వానిస్తాడు

ఇప్పటి వరకు చేస్తున్నదంతా పక్కనబెట్టి తన వద్దకు వచ్చి మన  మార్గముని  మార్చుకుని అతని వైపు దృష్టి సారించడం.

అంటే మన పాపాలను గుర్తించి, వాటికి పశ్చాత్తాపపడమని మనలను   పిలుస్తాడు.

సంపూర్ణ దృష్టిని, సంపూర్ణ హృదయ మార్ఫు ను  కోరుకుంటున్నాడు,  కేవలం కొంచెం దుఃఖం పడటం మాత్రమే కాదు, బయటకు చేస్తున్నట్లు కనపడటం కాదు కోరుకునేది, మన వస్త్రాలలో కాదు మార్ఫు మన హృదయాలలో రావాలి అదే దేవుడు మానాలనుంచి కోరుకునేది.  అందుకే "మీ వస్త్రాలు కాదు, మీ హృదయాలను చించుకోండి" (యోవేలు 2:13).

 

రెండవ పఠనంలో, పునీత పౌలు గారు  యేసుక్రీస్తు తన మరణం ద్వారా తెచ్చిన నిరీక్షణ మరియు రక్షణ గురించి మనకు గుర్తు చేస్తున్నాడు. మనము ఈ ఆశీర్వాదాలు , ఈ రక్షణ పొందాలంటే పశ్చాత్తాపం మరియు విశ్వాసం ద్వారా మాత్రమే సాధ్యమౌతుంది అని వెల్లడిస్తున్నారు.

ఎదో నామ మాత్రపు నమ్మకు, పేరుకు మాత్రమే విశ్వాలుగా ఉండటం వాళ్ళ పొందేది ఏమి లేదు. సంపూర్ణంగ , స్వేచ్ఛగా, స్వతహాగా మన ఆలోచన, మాటలు మరియు క్రియలు ద్వారా వెల్లడి చేస్తామే అప్పుడే స్వీకరించగలుగుతాం. ఈ తపస్సు  కాలం ఆ విశ్వాసాన్ని పునరుద్ధరించు కోవడానికి అవకాశం అని పునీత పౌలు గారు ఆహ్వానిస్తున్నారు.

 

సువార్త పఠనంలో, ఈ ఆధ్యాత్మిక ప్రయాణం చేయడానికి ప్రార్థన, ఉపవాసం మరియు దానము అనే మూడు మూల స్తంభాలను  స్వీకరించమని యేసు మనలను ఆహ్వానం పలుకుతున్నాడు. ప్రార్థన ఉపవాసం మరియు దానము వీటి యొక్క నిజమైన భావమును గ్రహించమని కూడా క్రీస్తు మనల్ని సూచిస్తున్నాడు.

ఇశ్రాయేలు ప్రజలు తమ మార్ఫు కోసం నలభై సంవత్సరాలు ఎడారిలో ప్రయాణించినట్లుగా, మోషే ప్రభు ఆజ్ఞల కోసం దేవుని సన్నిధిలో సీనాయి పర్వతంపై 40 రోజులు గడిపినట్లుగ మరియు సువార్త పరిచర్య కోసం ఆధ్యాత్మిక శక్తిని పొందటానికి  యేసు నలభై రోజులు ప్రార్థన మరియు ఉపవాసం చేసి ఉన్నారు. ఈ నలభై రోజులను కూడా మనం అపారమైన ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం ఒక ప్రయాణంగా చూడాలి. మన హృదయాలు శుద్ధి చేయబడి, పునరుద్ధరించబడాలని మరియు దేవుని వెలుగు తో నింపబడాలని తన  కృప కోసం ప్రార్థిద్దాం.

 

మొదటగ, ప్రార్థన:

ప్రార్థన అంటే మన బలహీనతలను గుర్తించి దేవునిపై ఆధారపడటమే ప్రార్థన.

ప్రార్థన అంటే దేవునికి సమర్పించడం, మన చిత్తాన్ని దేవుని చిత్తానికి అప్పగించడం.

ప్రార్థన అంటే "నేను ఏమీ చేయలేను, కానీ దేవుడు అసాధ్యమైనది ఏది లేదు" అని నమ్మడం మరియు వినయంగా అతనిని సహాయం కోరడమే ప్రార్థన.

ప్రార్థన అనేది దేవునితో సంబాషించుట మరియు మన కోసం ఎదురుచూస్తున్న దేవునితో అనుసంధానం/ అన్యోన్య సంబంధము ఏర్పాటు చేసుకొనుట.

 

ప్రార్థనకు సంబంధించి, మన దృష్టి ప్రజల అభిప్రాయం లేదా ప్రజల ప్రశంసలపై కాకుండా దేవునిపై ఉండాలని యేసు కోరుకుంటున్నాడు. మరియు ఇది ఒకరి ప్రతిభను మరియు నైపుణ్యాలను ప్రదర్శించే సమయం కాకూడదు “అయితే మీరు ప్రార్థించేటప్పుడు, మీ లోపలి గదికి వెళ్లండి, తలుపులు మూసివేసి, మీ తండ్రికి రహస్యంగా ప్రార్థించండి” అని యేసు చెప్పడం ద్వారా స్పష్టం చేయబడింది. ప్రార్థన, ధ్యానం అనగా , మన కలతలు, కలవరాన్ని మరియు ఉద్దేశాల యొక్క అన్ని తలుపులను మూసివేసి, దేవుడు మరియు అతని చిత్తంపై మాత్రమే దృష్టిని ఉంచడమే. దీని ద్వారా  నిజంగా దేవుడు తన ఐక్యత సంబంధం ఇచ్చి మనకు ప్రతిఫలమిస్తాడు మరియు మన ప్రయాణంలో మనల్ని బలపరుస్తాడు.

ఉపవాసం & సంయమనం:

ఉపవాసం గురించి మాట్లాడుతూ, ఇది దేవునితో సహవాసం చేసే సాధనమని మరియు ఉపవాసం ఉన్నప్పుడు మనము ఆనందంతో మరియు దేవుని స్తుతిస్తూ ఉండాలని బోధిస్తున్నారు. దానికి బదులు ఎప్పుడు బాధతో మరియు విమర్శలతో, కలవరతో ఉండకుడు అని ఉద్దేశం.  ఎందుకంటే ఉపవాసం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఈ ప్రపంచంలోని సుఖాల నుండి వేరుగా ఉండటానికి మరియు భగవంతునిపై మన దృష్టిని కేంద్రీకరించడానికి సహాయపడుతుంది. కాబట్టి, మన ఆనందాన్ని మరియు దేవుని స్తుతులను  ఏ విధంగానూ నిర్లక్ష్యం చేయకూడదు.

ఉపవాసం కేవలం ఆహారం నుండి మాత్రమే కాదు, మనలను దేవుని నుంచి దూరం చేసే ఏదైనా, శారీరకంగా,  సాంకేతికంగా, చెడు తలంపులు, చెడు మాటలు, చెడు క్రియలు నుంచి కూడా ఉపవాసం ఉండాలి.  ఉపవాసం భగవంతుని పట్ల మనకున్న ఆధ్యాత్మిక కోరికను గుర్తు చేయాలి.

ఉపవాసం వల్ల కలిగే ప్రయోజనాలు:

a - ఇది చెడు ధోరణులు మరియు చెడు అలవాట్లు రూపంలో ఉన్న చెడు అనే కొవ్వు  మన ఆత్మలో చేరడాన్ని తగ్గిస్తుంది.

b - ఇది మనకు అదనపు నైతిక మరియు ఆధ్యాత్మిక బలాన్ని ఇస్తుంది.

సి - ఇది ప్రార్థనలో దేవునితో ఉండటానికి ఎక్కువ సమయాన్ని అందిస్తుంది.

d - ఇది మన ఆహారం మరియు వస్తువులను అవసరమైన వారితో పంచుకునేలా ప్రోత్సహిస్తుంది.

దానధర్మాలు:

దీనికి సంబంధించి, ఈ ఆధ్యాత్మిక క్రియ ద్వారా మన సంపదను ప్రదర్శించడం గురించి కాదు, అది దేవుని ఆశీర్వాదానికి మనము ప్రతిస్పందించే సమయము అని యేసు ఆదేశిస్తున్నాడు.మన పేరు మరియు కీర్తిని ప్రకటించడం గురించి కాదు కానీ ఇది ఇతర వ్యక్తుల పట్ల కనికరం చూపడం . యేసు మనలను వస్తు రూపంలో పంచడమే కాకుండా మనకు ఆశీర్వదించ బడిన ఆధ్యాత్మిక వనరులు, సమయం మరియు ప్రతిభను అవసరమైన వ్యక్తులకు పంచుకోవడం ద్వారా దేవునికి కృతజ్ఞతలు తెలియజేయమని కూడా ఆహ్వానిస్తున్నాడు.

 

ప్రార్థన, ఉపవాసం మరియు దానధర్మము  మన హృదయాలను, శరీరాన్ని, మనస్సును సుద్ధి చేసి  మరియు ఆత్మను నిజమైన మార్పుతో  క్రీస్తు వెలుగును పొందేందుకు ఈ ప్రయాణంలో మనలను సిద్ధం చేస్తాయి. అందుకే మనం ధూళి వంటి వంటి వారము అని గుర్తుచేసే విభూదితో ప్రారంభించి, పునరుత్తానా నిప్పు/వెలుగుతో ముగిస్తాం, మనం క్రీస్తు యొక్క నిత్యజీవిత కాంతిని చేరుకోవాలని గుర్తుచేస్తాం.

 FR. JAYARAJU MANTHENA OCD

 

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...