3, ఏప్రిల్ 2023, సోమవారం

ఐదవ పదం

ఐదవ పదం

"నాకు దాహమగుచున్నది" యోహాను 19:28
ప్రియమైన మిత్రులారా, సాధారణంగా మనం క్రీస్తు గురించి ఆలోచించినప్పుడు, మనం ప్రశాంతమైన మరియు నిర్మలమైన చిత్రాన్ని మదిలో తలచుకుంటాము, కానీ సిలువపై రక్తసిక్తమైన మరియు బాధతో ఉన్న రూపాన్ని తలచుకోము.
సందర్భము మరియు పరిస్థితి: క్రీస్తు ప్రభువు శిలువేయబడి చాల సేపు అవుతుంది, ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా మారింది, వేలాడతీయబడిన చేతులు, భారంతో ఉన్న భుజాలు, పొరబడిన నాలుక(నోరు), సూర్యుని వేడికి అలసి సొమ్మసిల్లి పోతున్న దేహము, ఒక తీవ్ర విషాద కరమైన సమయము, యేసుక్రీస్తు మానవ జీవిత ముగింపు సమయము బాదమయము.
ఈ ఐదవ పదంలో రెండు ముఖ్యమైన అంశాలు మరియు సందేశము దాగిఉంది.
యేసు క్రీస్తు ప్రభుని మానవ (భౌతిక స్వభావము) - భౌతిక దాహము
యేసు క్రీస్తు ప్రభుని దైవ స్వభావము - ఆధ్యాత్మిక దాహము.
యేసు క్రీస్తు ప్రభుని మానవ (భౌతిక స్వభావము) - భౌతిక దాహము
అన్నిటికంటే మొదటిది, చాలా ముఖ్యమైనది ఏమిటంటే ఈ పవిత్ర పదం క్రీస్తు యొక్క భౌతిక స్వభావాన్ని మరియు అతని మానవత్వాన్ని స్పష్టంగా గుర్తు చేస్తుంది.
మన జీవితంలో కూడా శారీరకంగ పని చేసిన తర్వాత లేదా ఎండలో ప్రయాణించినట్లైతే మనకు కూడా దాహమేస్తుంది, సొమ్మసిల్లిపోతాము. మనందరమూ అనుభవించినవాళ్ళమే. అందుకే దాహం తీర్చుకోవడం ఎంత ముఖ్యమో మనకు తెలుసు.
నాకు దాహమేస్తుంది అని యేసు చెప్పినప్పుడు, ప్రభువు కూడా అదే అనుభవించారు. యోహాను సువార్త 4 అధ్యాయం :5- 7 వచనాలలో చూసినట్లయితే, యేసు సుదూర ప్రయాణం చేసి అలసిపోయి, ఒక బావి వద్ద కూర్చొని, ఒక సమరయ స్త్రీని త్రాగడానికి నీళ్ళు అడిగారు. ఇక్కడ కూడా బాధతో మరియు మండుటెండలో శిలువను మోసిన తర్వాత, ప్రభువు అలసిపోయి, సొలసిపోయి తీవ్ర దాహ వేదనకు గురయ్యారు. అంటే, దీనిని బట్టి మనకు తెలిసేదేమిటంటే దైవ కుమారుడైన తన దైవత్వము రూపంలో దాక్కోలేదు, బాధలు అనుభవిస్తున్నట్లు నటించలేదు, ఎలాంటి నటన, నాటకాలు లేవు.
నిజముగా, వాస్తవికంగా శరీర రూపధారిగా బాధలను అనుభవిస్తున్నారు, నడవలేక పడిపోతున్నారు, రక్తము ధారలుగా కారుతుంది, ఇంతటి వేదనల వలన నిజముగా దాహము వేస్తుంది. త్రాగడానికి కొంచెం నీరు అడుగుతున్నారు.
క్రీస్తు నిజంగా బాధపడ్డారు మరియు తన మానవ రూపంలో మన పాపాల శిక్షను భరించాడు. అతను మన కోసం మరియు మన పాపాల కోసం శరీర దాహంతో మరణించాడని ఇది మనకు గుర్తుచేస్తుంది, దీనిని తిరస్కరించే ప్రసక్తే లేదు.
యేసు క్రీస్తు ప్రభుని దైవ స్వభావము - ఆధ్యాత్మిక దాహము.
ఈ దాహము ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కూడా కలిగి ఉంది. ఈ దాహము మనందరి కోసం, మన ఆత్మల కోసం ఉన్న దాహాన్ని వ్యక్తపరుస్తుంది. సిలువపై ఉన్నక్రీస్తు మానవాళి అంతా తనను తెలుసుకోవాలని మరియు ప్రేమించాలనే దాహమును తెలియపరుస్తుంది. పునీత అగస్టీన్ గారు చెప్పినట్లుగా మనమందరం దాహంతో ఉన్నాము, "మనం దేవుని కోసం దాహం తో ఉండాలని ముందుగా దేవుడే మనకోసం దాహంతో ఉన్నారు." (సత్యోపదేశ సంక్షేమము, 2560). ఆధ్యాత్మిక కోణంలో ధ్యానించి నట్లైతే క్రీస్తు దాహము దేనికి సూచిస్తుందంటే:
యేసు నీటి కోసం దాహంతో ఉన్నప్పటికీ, మన మోక్షం కోసం, దేవునితో సంబంధం కోసం ఎక్కువ దాహంతో ఉన్నారు.
యేసుకు మన పరిస్థితి తెలుసు, కాబట్టి మన విశ్వాస ప్రకటన కోసం మరింత దాహంతో ఉన్నారు.
మన జీవితం యొక్క మార్పు కోసం దాహంతో ఉన్నారు.
మన ఆత్మల సంరక్షణ కోసం దాహంతో ఉన్నారు..
మనలను సరైన దారిలో నడవాలనే దాహంతో ఉన్నారు.
మనకు జీవజలాన్ని బహుమతిగా అందించాలని దాహంతో ఉన్నారు.
మన శారీరక తృప్తి నుండి ఆధ్యాత్మికంగా ఎదగాలనే దాహంతో ఉన్నారు.
మనలను క్షమించాలని దాహంతో ఉన్నారు.
మనలను తన సువార్తికులుగా (ఆయన సందేశాన్ని పంచుకునేవారు) చేయడానికి ఆయన దాహంతో ఉన్నారు.
నిజానికి మన హృదయాలలో కూడా ఒక ఆధ్యాత్మిక దాహం ఉంది, జీవిత అర్థం మరియు నిజమైన ప్రేమ కోసం దాహంతో ఉన్నాము, యేసు ఒక సమారియా స్త్రీకి వాగ్దానం చేసిన జీవజలాన్ని వాగ్దానము వలె మన దాహాన్ని తీర్చగల ఏకైక వ్యక్తి యేసు.
"ఎవడైనా దప్పిక కొన్నచో నా దగ్గరకు వచ్చి దప్పిక తీర్చుకొనును గాక." యోహాను 7:37
లేఖనాలను నెరవేర్చడానికి మరియు అతని తండ్రి చిత్తాన్ని పూర్తి చేయడానికి.
ఈ మాట ద్వారా లేఖనాల మరియు ప్రవక్తల ప్రవచనాలు నెరవేరాయి. ప్రభువుకు లేఖనాలు తెలుసునని ఈ పదం ద్వారర నెరవేర్చి మనలను వాక్యము ద్వారా ఒకటి చేస్తున్నారు. నెరవేరిన కొన్ని వచనాలు:
"నా శక్తి పెంకు వలె ఎండిపోయినది. నా నాలుక అంగిటికి అంటుకొనుచున్నది. నేను చచ్చి దుమ్ములో పడిఉండినట్లు చేసితివి." (కీర్తన 22:15)
"అరచి అరచి నేను అలసిపోతిని. నా గొంతు బొంగురు పోయినది... వారు నాకు భోజనము మారుగా విషమును ఒసగిరి. నేను దప్పిక గొనిఉన్నపుడు ద్రాక్షాసవం ఇచ్చిరి". (కీర్తన 69:3, 21)
క్రీస్తు తనను తాను బలపరచుకోవాలని, తండ్రి అప్పగించిన చిత్తాన్ని పూర్తి చేయడానికి దాహంతో ఉన్నారు. క్రీస్తు భయంకరమైన నొప్పి, శారీరక అలసటతో బాధపడుతున్నప్పటికీ, మన కోసం, దేవునితో మనకు సంబంధం ఏర్పాటు చేయడం కోసం తనకు ఉన్న శక్తినంతా చేర్చి పలికారు.
ధ్యానము & మనస్సాక్షిపరీక్ష
మన పాపాల కోసం యేసు శారీరకంగా అనుభవించిన దప్పిక ఎంత బాదమయము మరియు గొప్పది ?
యేసు మానవ స్వభావము - ధ్యానము
నా జీవితంలో పరిశుద్ధ గ్రంధము యొక్క ప్రాముఖ్యత ఏమిటి?
ఆయన ఆధ్యాత్మికంగా మన కోసం దప్పిక గొన్నట్లే మనం దేవుని కోసం దప్పికతో ఉంటున్నామా ? ముఖ్యంగా కీర్తన 42: 2 వాక్యంతో ధ్యానించుదాం. " సజీవ దేవుడైన నీ కొరకు నా ఆత్మ ఆరాట పడుచున్నది. నీ దివ్యముఖమును నేనెపుడు దర్శింతునా అని తపించుచున్నది."
The Fifth Word
“I thirst.” John 19:28

Dear friends, usually when we think of Christ image, we picture a calm and serene picture, but we do not reflect on bloodied and cringing in pain and suffering on the Cross. But here in this situation Jesus utters his gift word, “ I THIRST”.

Situation: he is there on the cross for almost six hours now. It has become hard for him even to breathe, he must pull himself up as he is hung on the arms, the shoulder aches, his mouth parched and is clearly exhausted as the sun directly hits his head and body. The end of Jesus' human life.

It has two different levels to reflect on:

Physical nature (Jesus’ humanity)
First of all, it is very significant, because this word clearly reminds us of His physical nature and his humanity. We all can relate to being thirsty. After continuous work,we feel tired bodily and if we are under the sun for a long time, we feel dehydrated. We know how important it is to quench our thirst.

When Jesus said I Thirst, he too experienced the same. In John Chapter 4:5-7, we see Jesus tired from a long journey, sitting at a well, asking a Samaritan woman for water to drink. Here on the after carrying the cross in pain and under the sun, he is tired and wearied, dehydrated. That means, Jesus the Son of God, the God himself is not hiding under the veil of his Divinity, nor pretending to suffer. There is neither drama nor action. But in a real and tangible way in his bodily form undergoing the suffering, he is falling, bleeding and now thirsting for something to drink.

He truly suffered and bore the penalty of our sins in his humanity. This reminds us that He thirsted and died in the flesh for us and for our sins, there is no denying of this.

Spiritual Nature (Divinity)
The Thirst is also a spiritual reality, containing spiritual significance. It expresses his thirst for us all, for our souls. He thirsts on the cross for all mankind to know and love him. We all thirst for, as St. Augustine tells, “God thirsts that we may thirst for him” (Catechism, 2560). His thirst in spiritual sense: Although Jesus is thirsty for water, He is more thirsty for salvation, for a relationship with him.

Jesus knows her situation, so he was more thirsty for expression of faith
He was thirsty for conversion of life
He was thirsty for Soul.
He was thirsty to keep on right path
He was thirsty to offer gift of Living Water
He was thirsty to raise from physical satisfaction to spiritual nourishment
He was thirsty for to acknowledge her mistakes
He was thirsty to make us His evangelisers (sharers of His message)
Deep down even in our hearts, we have a spiritual thirst to be satisfied, we thirst for meaning in life and for true love, Jesus is the only one who can quench our thirst by giving the Living Water which he promised to a Samaritan woman at the well.

“Let anyone who is thirsty come to me, and let the one who believes in me drink.” John 7:37

2. To fulfil the Scriptures and complete His Mission.
There is also fulfilment of the Scriptures, and the prophecies which remind us that he knows the scriptures and is determined to fulfil that he is truly the One, who comes to save us from our sins and give us salvation. The scriptures fulfilled are:

My strength is dried up like a potsherd, and my tongue sticks to my jaws; you lay me in the dust of death. (Psalm 22:15)

I am weary with my crying out; My throat is parched, They gave me poison for food,

And for my thirst they gave me sour wine to drink. (Psalm 69:3, 21)

He thirsted to strengthen himself, to bring to completion the mission entrusted to Him by Father. He is both undergoing terrible pain, physical exhaustion but summoned all his strength to remind us that he Thirst for us, for our relationship with God.

Let us reflect
How much excruciating pain and suffering did Jesus undergo physically for our sins?

Why is it so important to reflect on Jesus' humanity?

What is the importance of Scriptures in life?

Do we thirst for God, as he thirst for us spiritually? Let us reflect with Psalm 42:2

The only way we satisfy our thirst is with the Living Water, the word made flesh, the Holy Spirit poured into our heart.

whoever drinks the water I shall never thirst; the water I shall give will become in him a spring of water welling up to eternal life.” (John 4:14)

Fr. Jayaraju Manthena OCD

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...