14, అక్టోబర్ 2023, శనివారం

28వ సామాన్య ఆదివారం

28వ సామాన్య ఆదివారం
యెషయ 25:6-10, ఫిలిప్పీ 4:12-14,19-20, మత్తయి 22:1-14

ఈనాటి దివ్య పఠణాలు దేవుడు సమర్పించే ప్రేమ విందు గురించి సెలవిస్తున్నాయి. ఏదైనా పండగ చేసుకునేటప్పుడు ఆహ్వానాన్ని పంపించడం మన యొక్క సాంప్రదాయం. ఇచ్చిన ఆహ్వానని మన్నించి వారి యొక్క ఆతిధ్యాన్ని స్వీకరించుట ఆహ్వానం పొందిన వారి యొక్క బాధ్యత. ఇది పరస్పర ప్రేమకు గుర్తు. యూదుల యొక్క ఆచారం ప్రకారం విందు జరుపుకునే ముందు ఆహ్వానం పంపించుట వారి యొక్క ఆనతి.
ఈనాటి మొదటి పఠణంలో యావే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకై సిద్ధపరచినటువంటి విందు గురించి బోధించబడింది. ఈ విందు యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది కేవలం కొంతమందికి మాత్రమే కాదు అందరి కొరకై సిద్ధపరచబడినటువంటి విందు. ఈ విందు సకల జాతి జనులకు సిద్ధము చేయబడినది. సాధారణంగా మనము ఏదైనా పండుగ కానీ వివాహ సందర్భముగాని జరుపుకున్నట్లయితే మనం కేవలము మనకు తెలిసిన వారిని మనకు నచ్చిన వారిని మాత్రమే పిలుస్తుంటాం కానీ ఇక్కడ ప్రభువు ఈ విందును అందరికీ కూడా సిద్ధం చేస్తున్నారు. ప్రతి విందు కూడా సంతోషకరమైనది. ఎందుకంటే మన యొక్క ఆనందం పంచిపెట్టుకొరకై వారికి మనము భోజనమును ఒక ప్రేమను వ్యక్తపరిచేదానిగా ఇస్తూ ఉంటాం. దేవుడు ఏర్పరచినటువంటి విందు నిజముగా ప్రజల యొక్క జీవితంలో ఉన్నటువంటి విచారమును తొలగించి వారిలో సంతోషాన్ని నింపినది. బహుశా ఆకలితో ఉన్న వారి యొక్క ఆకలిని తీర్చినప్పుడు ఆ వ్యక్తి ఏ విధముగానైతే సంతోషంగా ఉంటారు. అదేవిధంగా దేవుడు ప్రజలకు తన యొక్క ఆధ్యాత్మిక విందును ఏర్పరచినప్పుడు వారి యొక్క జీవితమును కూడా అంతే సంతోషముగా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క విందు యొక్క ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే ఇది అందరిని కూడా సమావేశపరచేటటువంటి విందు కేవలము కొలది మంది మాత్రమే అందరూ కూడా భాగస్తులై తమ యొక్క స్నేహమును, ప్రేమను వ్యక్తపరచుకునే విందు. అదేవిధంగా దేవుడు తన యొక్క ప్రజల యొక్క కన్నీళ్ళను తుడిచివేయను, తన ప్రజల యొక్క అవమానము తొలగించును. ప్రభువు తన ప్రజల పట్ల చూపించినటువంటి ఆ ప్రేమ, కరుణ వలన ప్రజలు ఇంకా ఆయన యందు విశ్వాసాన్ని పెంపొందించుకొని జీవిస్తారు. వారి యొక్క విశ్వాసమును కూడా ఈ విధముగా ప్రకటిస్తారు. మనము ప్రభువుని నమ్మితిని కావున ప్రభువు మనలను కాపాడును. మన పక్షమున దేవుడు పోరాడి శత్రు సైన్యమును నాశనము చేసెను అని దేవుని యొక్క రక్షణ మన గురించి సంతోషించెదరు. ఈ మొదటి పఠణం ద్వారా దేవుడు తన ప్రజల యొక్క ఆకలిని సంతృప్తి పరచే విధానమును మనము గ్రహిస్తున్న ఆయన ఏ విధముగానయితే అందరిమీద వర్షమును సూర్యుడిని ఒకే విధముగా పంపిస్తున్నారు అదేవిధంగా తన యొక్క ప్రేమ విందును అందరి కొరకై సిద్ధం చేస్తున్నారు.ఆయన దృష్టిలో అందరూ సరిసమానులే. ఈనాటి రెండవ పఠణంలో పునీత పౌలు గారు ఫిలిప్పీయులకు చెప్పినటువంటి మాటలు ఏమిటంటే క్రీస్తు ప్రభువు అనుగ్రహించినటువంటి శక్తిచే ఎటువంటి కష్టములైన ఎదుర్కొనుటకు తాను సిద్ధము అని తెలుపుతున్నారు. తన యొక్క సువార్త పరిచర్య జీవితంలో ఆకలిగా ఉన్న లేదా కడుపునిండా భుజించిన తనకు కొద్దిగా లభించిన లేక ఎక్కువగా లభించునా గాని అన్ని సందర్భములను బట్టి జీవించుట నేర్చుకున్నాను అని పౌలు గారు తెలుపుతున్నారు. పౌలు గారు తన యొక్క సేవా జీవితంలో అన్ని పరిస్థితులకు తన జీవితమును అలవాటు చేసుకుని జీవింప సాగారు. మనము కూడా నాకు ఇది లేదు అది లేదు అని నిందించకుండా అన్నింటికీ సర్దుకుని జీవించాలి ప్రభువు ఇచ్చే శక్తిచే పౌలు గారు అన్నీ కూడా అర్థం చేసుకొని సర్దుకుని ఉన్నదానితో సంతృప్తి చెందుతూ జీవించారు మనము కూడా అదే విధముగా జీవించాలి.
ఈనాటి సువిశేష పఠణంలో ఏసుప్రభు ప్రజలకు పరలోక రాజ్యము గురించి ఒక ఉపమాన రీతిగా బోధించారు అది ఏమిటంటే ఒక రాజు తన ప్రజల కొరకై సిద్ధము చేసినటువంటి విందు ద్వారా దేవుడు ఏ విధముగా తన రాజ్యములోనికి ప్రజలను ఆహ్వానిస్తున్నారు. ఒక రాజు తన యొక్క కుమారుని పెండ్లికి విందును సిద్ధం చేసి ఎవరినైతే ఆహ్వానించి ఉన్నారు వారిని పిలుచుటకు సేవకులను పంపిస్తున్నారు కానీ పిలవబడినటువంటి వారు ఈ యొక్క సేవకులను లక్షపెట్టలేదు వారి యొక్క పనులకు వారి పోయి మిగతావారు సేవకులను పట్టి, కొట్టి చంపారు. తర్వాత రాజు మండిపడి తన యొక్క సైనికులను పంపించి వారిని శిక్షిస్తున్నారు. ఇక్కడ రాజు యొక్క ఉద్దేశంను తెలుసుకుంటున్నాం ఆయన యధావిధిగా అందరికీ తన ప్రేమను వ్యక్తపరచుట కొరకు తన ఆనందంలో భాగస్తులై జీవించుట కొరకు యొక్క ఆహ్వానాన్ని పంపిస్తున్నారు కానీ దానిని తృణీకరిస్తున్నారు ఎందుకంటే ప్రభువు అందరి కంటే మొదటిగా ఆహ్వానం ఇచ్చినది ఇశ్రాయేలు ప్రజలకు కానీ వారే తన యొక్క మాటను వినకుండా వారి యొక్క ఇష్టానుసారంగా జీవించారు దాని ప్రతిఫలముగా దేవుడు అందరిని కూడా తన యొక్క విందులో భావిస్తులై జీవించుటకు పిలుస్తున్నారు అనగా దేవుని యొక్క ప్రేమ అన్యులకు సకల జాతి జనులకు పంచబడినది. రాజువసగినటువంటి విందులో తాను ఎవరినైతే పిలిచి ఉన్నారు వారి నుండి కోరుకున్నది ఒకే ఒక్కటి అది ఏమిటంటే వివాహ వస్త్రం ఈ వివాహ వస్త్రము పవిత్రతకు గుర్తు అదే విధముగా ప్రేమకు గుర్తు ఎందుకంటే దేవుని యొక్క విందులో పాల్గొనుటకు మనము ఎల్లప్పుడూ కూడా పవిత్రత కలిగి వినయము కలిగి ప్రేమ కలిగి స్వీకరించాలి అప్పుడు మాత్రమే ఆ విందు మనలను బలవంతులను చేస్తున్నది. ఈ విందు దివ్య సత్రసాధనకు సూచనగా ఉన్నది కాబట్టి దివ్య సత్రపసాదం స్వీకరించే సందర్భములో మనము కూడా పవిత్రముగా ఉండాలి. దేవుడు మనందరం కూడా పౌష్టికంగా ఉండాలి అదేవిధంగా ఆ యొక్క ఆహారంతో ముందుకు సాగాలి అనే ఉద్దేశంతోనే ఈ యొక్క విందును ఏర్పరిచి కాబట్టి మనము ప్రభువు ఇచ్చిన విందును స్వీకరించి ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగాలి.
రాజు వలె ప్రతిరోజు కూడా దేవుడు తన విందులో పాల్గొనటకు మనలను ఆహ్వానిస్తూనే ఉంటున్నారు కాబట్టి ప్రభువుని విందులో పాల్గొని దేవుని యొక్క మార్గంలో నడవాలి.
Fr. Bala Yesu OCD

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాస్కా ఆరవ ఆదివారం

పాస్కా ఆరవ ఆదివారం  అపో 10:25-26, 34-35,44-48 1యోహను 5:7-10 యోహాను 15:9-17 ఈనాటి పరిశుద్ధ గ్రంథములు పఠనములు దేవుని యొక్క ప్రేమ గురించి మరియు...