సామెతల గ్రంధం 9:1-6 ఎఫెసీ 5: 15-20 యోహాను 6: 51-58
ఈనాటి మొదటి పఠనంలో విజ్ఞానమను స్త్రీ మూర్తి ప్రజలను "రమ్ము నేను తయారు చేసిన భోజనమును ఆరగింపుము. జ్ఞానము లేని వారు ఇచ్చటకు రెండు అని ఆహ్వానిస్తుంది. మూర్ఖత్వమును విడనాడి బ్రతుకుడు. విజ్ఞాన పథమున నడువుడు అని మనం మొదటి పఠనంలో విటున్నాం. ప్రియ విశ్వాసులారా జ్ఞానము లేని వారు ఇచటకు రెండు అని విజ్ఞానమను స్త్రీ మూర్తి పిలిచినట్లే దేవుడు మనందరినీ పిలుస్తున్నాడు. మనలను దేవుని వాక్కు అనే భోజనమును ఆరగించమని ఆహ్వానిస్తున్నారు. మానవుడు కేవలం, రొట్టె వలెనే కాక దేవుని నోటి నుండి వచ్చు వాక్కు వలన జీవించును. ఇది అక్షరాల సత్యం. కానీ చాలా మంది ఇంకా మూర్ఖత్వంలోనే జీవిస్తున్నారు. అజ్ఞానములోనే ఉండిపోతున్నారు. నా యొద్దకు రెండు అని పిలిచిన దేవుని మాటను వినలేక పోతున్నారు. దేవుని విజ్ఞాన మార్గంలో నడవమని ఆహ్వానిస్తుంది. మనము జ్ఞానము కలిగిన వారిగా జీవించి విజ్ఞాన పథంలో జీవించుదాం.
ఈనాటి సువిశేషంలో మనం వింటున్నాం పరలోకము నుండి దిగివచ్చిన జీవముగల ఆహారము నేనే. అదే విధంగా ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నాశరీరమే అని క్రీస్తు ప్రభువు తెలియజేస్తున్నాడు.
అదే విధంగా నా శరీరమును భుజించి, నా రక్తమును పానము చేయువారు నిత్యజీవము పొందును. నేను వారి యందు వారు నాయందు ఉండును. నేను తండ్రి మూలమున జీవించునట్లే నన్ను భుజించువాడు నా మూలమున ఎల్లప్పుడును జీవించును. ఇది గొప్ప భాగ్యం మానవులమైన మనందరికీ.
కాబట్టి ప్రియ విశ్వాసులారా మనం నిత్య జీవం పొందాలంటే , మనం మనము దేవుని యందు ఉండాలంటే దేవుని శరీర రక్తాలను నిత్యం స్వికరించాలి. మరి క్రీస్తు ప్రభువుని శరీర రక్తలను స్వీకరించాలంటే పరిశుద్ధతతో జీవించాలి. దేవుని చిత్తాను సారం నీవు నేను మనందరం ఆ ప్రభుని చిత్తం తెలుసుకొని జీవించాలి. పవిత్రతతో నింపబడాలి.
మనం ఏమి చేయాలంటే? దేవుని పిలుపును , ఆహ్వానాన్ని విని దేవుని దగ్గరకు వెళ్ళాలి. దేవుని యొక్క జ్ఞానమును, జ్ఞాన ఫలములను పొంది దేవుని వాక్కుతోను శరీర రక్తములతోను నింపబడాలి. మన మూర్ఖత్వాన్ని తొలగించమని ఆ దేవుని జ్ఞానము కొరకు ప్రార్ధించాలి. నిత్య జీవం, పొందాలంటే మూర్ఖత్వాన్ని అజ్ఞానాన్ని విడనాడి దేవుని త్రోవలో నడవాలి. దేవునితో నిత్యం కలకాలం జీవించడానికి ప్రయత్నించుదాం.
ప్రార్ధన: ప్రేమ మయుడైన దేవా మేము ముర్ఖులం, మా మూర్ఖత్వంలో, అజ్ఞానంలో జీవిస్తున్నాం. నీ జ్ఞానమును, జ్ఞానవరములను పవిత్రత్మను మాపై కుమ్మరించి విజ్ఞానముతో నింపుము, నిత్యం నీ త్రోవలో నడుస్తూ నిత్య జీవం పొందే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.
ఫా. సురేష్ కొలకలూరి OCD
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి