February 24
సిరా 1:1-10
మార్కు 9:14-29
వారు తక్కిన శిష్యులను చేరుకొని అచ్చట పెద్ద జనసమూహము కూడియుండుట చూచిరి. ధర్మ శాస్త్ర బోధకులు క్కో శిష్యులతో తర్కించుచుండిరి. యేసును చూడగనే ప్రజలు ముగ్గుల ఆశ్చర్యపడి, పరుగునవచ్చి ఆయనకు నమస్కరించిరి. "వారితో ఏ విషయమునుగూర్చి తర్కించుచున్నారు?" అని యేసు శిష్యులను ప్రశ్నించెను. జనసమూహములో ఒకడు "బోధకుడా!మూగ దయ్యము పట్టిన నా కుమారుని తమయొద్దకు తీసుకొనివచ్చితిని. భూతము వీనిని ఆవేశించినపుడెల్ల నేలపై పడవేయును. అప్పుడు వీడు నోటి వెంట నురుగులు క్రక్కుచు పండ్లు కోరుకుచు, కొయ్యబారిపోవును. ఈ దయ్యమును పారద్రోలమీ శిష్యులను కోరితిని. అది వారికి సాధ్యపడలేదు" అని విన్నవించెను. యేసు వారితో "మీరు ఎంత అవిశ్వాసులు! నేను ఎంత కాలము మీ మధ్యనుందును? ఎంతవరకు మిమ్ము సహింతును? ఆ బాలుని ఇటకు తీసుకొని రండు" అనగా, వారు అట్లే వానిని తీసికొని వచ్చిరి. యేసును చూచినవెంటనే ఆ దయ్యము వానిని విలవిలలాడించి నేలపై పడవేసి, అటుఇటు దొర్లించి, నురుగులు క్రక్కించెను. "ఈ దుర్బరావస్థ ఎంత కాలము నుండి?" అని యేసు ఆ బాలుని తండ్రిని అడిగెను. "పసితననము నుండి" అని అతడు బదులు చెప్పి, "అనేక పర్యాయములు ఆ భూతము వీనిని నాశనము చేయవలెనని నీళ్లలోను, నిప్పులలోను పడవేయుచున్నది. తమకిది సాధ్యమగునేని మాపై కరుణించి సాయముచేయుడు" అని ప్రార్ధించెను. అందుకు యేసు "సాధ్యమగునేని' అనుచున్నావా! విస్వసించు వానికి అంతయు సాధ్యమే" అని పలికెను. అప్పుడు ఆ బాలుని తండ్రి "నేను నమ్ముచున్నాను. నాకు అవిశ్వాసము లేకుండునట్లు తోడ్పడుము" అని ఎలుగెత్తి పలికెను. అంతట జనులు గుమికూడి తనయొద్దకు పరుగెత్తుకొనివచ్చుట చూచి యేసు "మూగ చెవిటి దయ్యమా! ఈ బాలుని విడిచిపొమ్ము, మరెన్నడును వీనిని ఆవహింపకుము" అని శాసించెను. అప్పడు ఆ భూతము ఆర్భటించుచు, బాలుని విలవిలలాడించి వెళ్లిపోయెను. బాలుడు పీనుగువలె పడిపోయెను. అనేకులు వాడు చనిపోయెననిరి. కాని, యేసు వాని చేతినిపట్టి లేవనెత్తగా వాడులేచి నిలుచుండెను. యేసు ఇంటికి వెళ్లిన పిదప శిష్యులు ఏకాంతముగ ఆయనతో "ఈ దయ్యమును పారద్రోల మాకు ఏల సాధ్యపడలేదు?" అని ప్రశ్నించిరి. అందుకు ఆయన వారితో, "ప్రార్ధనవలనతప్ప మరే విధమునను ఇట్టి దయ్యములను పారద్రోల సాధ్యపడదు" అని చెప్పెను.
శిష్యులు మూర్ఛరోగిని ‘ స్వస్థపరచలేక’ దుష్టాత్మను వెళ్లగొట్టలేకపోవుటను చూసినప్పుడు, వారు తమ వైఫల్యానికి కారణాన్ని గురువును అడిగారు. ఆయన వారికి ‘సాతానుపై శక్తి మరియు అధికారం, మరియు అన్ని వ్యాధులను నయం చేయడానికి శక్తిని ’ ఇచ్చాడు. వారు తరచుగా ఆ శక్తిని ఉపయోగించారు మరియు వారికి సాతాను ఎలా లోబడి ఉన్నాడో సంతోషంగా చెప్పారు. అయినప్పటికీ, ఆయన కొండపై ఉన్నప్పుడు, వారు పూర్తిగా విఫలమయ్యారు.
దేవుని చిత్తం లేకుండా విముక్తి ప్రసాదించడం, అయన అనుగ్రహం లేకుండా ఏదైనా సాధించడం సాధ్యం కాదు. క్రీస్తు ఆజ్ఞ మేరకు దుష్టాత్మ వెళ్ళిపోయింది. మేమెందుకు చేయలేకపోయాము?’ అనే వారిప్రశ్న, వారు కూడా ఆ దుష్టాత్మను వెళ్ళగకొట్టాలని ప్రయత్నించారని స్పష్టంగా తెలుస్తుంది; వారి ప్రయత్నాలు ఫలించలేదు , ప్రజల ముందు వారి అశక్తి నిరూపితమైంది. దానికి వారు సిగ్గుపడ్డారు.
విశ్వాసం ఆధ్యాత్మిక జీవితంలో అత్యున్నత వ్యాయామం, ఇక్కడ మన ఆత్మ దేవుని ఆత్మకు పరిపూర్ణంగా స్వీకరించడంలో తనను తాను సమర్పించుకుంటుంది మరియు అత్యున్నత కార్యాచరణకు బలపడుతుంది. ఈ విశ్వాసం పూర్తిగా ఆధ్యాత్మిక స్థితిపై ఆధారపడి ఉంటుంది; ఇది బలంగా మరియు పూర్తి ఆరోగ్యంతో ఉన్నప్పుడు, దేవుని ఆత్మ మన జీవితంలో పూర్తిగా ఆధిపత్యం చెలాయించినప్పుడు మాత్రమే, దాని శక్తివంతమైన పనులను చేయడానికి విశ్వాసమునకు శక్తి ఉంటుంది.
అందుకే యేసుప్రభువు సాతాను ఉపవాసం మరియు ప్రార్థన ద్వారా మాత్రమే పారద్రోలబడుతుంది. ఈ దుష్టాత్మలో ఉన్న మొండి పట్టుదలను , ప్రతిఘటనను అధిగమించగల విశ్వాసం, దేవునితో సన్నిహిత సహవాసంలో ఉండి మరియు లోకం దాని క్రియల నుండి సాధించవచ్చు. విశ్వాసం పెరగడానికి మరియు బలంగా ఉండటానికి ప్రార్థన జీవితం అవసరం. ప్రార్థన ఉపవాసం విశ్వాసాన్ని పెంచుతాయి.
విశ్వాసం పెరుగుదల కోసం ప్రార్థన జీవితం అవసరం. ఆధ్యాత్మిక జీవితంలోని అన్ని విభిన్న భాగాలలో, దేవునితో ఎంత దగ్గర సంబంధం కలిగి ఉంటామో అంత పవిత్రత కలిగి ఉంటాము. భగవంతుడిని ఆరాధించడంలో, ఆయన కోసం వేచి ఉండటంలో, దేవుడు తనను తాను మనకు వెల్లడించడానికి సిద్ధపడేది మన విశ్వాసం ప్రకారముగానే తెలుసుకుంటాము. దాని దేవుడిని తెలుసుకునే మరియు విశ్వసించే సామర్థ్యం అభివృద్ధి చెందుతుంది.
Br. Pavan OCD
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి