22, ఫిబ్రవరి 2023, బుధవారం

 

విభూది బుధవారం తర్వాత గురువారం

 

ద్వితీయోపదేశకాండము 30:15-20

లూకా 9:22-25

"మీరు మరియు మీ వారసులు జీవించేలా జీవితాన్ని ఎన్నుకోండి." (ద్వితీయోపదేశకాండము 30:19)

క్రీస్తు యేసునందు  ప్రియమైన సహోదరి సహోదరులారా,  ఈనాటి పఠనాలు మన జీవితంలో మనం చేసుకునే ఎంపికల గురించి భోదిస్తున్నాయి. మనము మన  రోజువారీ కార్యకలాపాలలో ఎంపికలు చేస్తూ ఉంటాము. మేల్కొన్నప్పటి నుండి నిద్రపోయే వరకు మరియు పగటిపూట వివిధ అవసరాల కోసం (ఆహారం, దుస్తులు మరియు సంబంధాలు) అనేక ఎంపికలు చేస్తాము. మనం చేసే ఎంపికలు ఫలితాలను నిర్ణయిస్తాయి, అది మన వ్యక్తిగత జీవితం, సంబంధాలు, మన పని మరియు మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనం ఎలా చూస్తాము మరియు దానిలో మనం ఎలా పాల్గొంటాము అనేది తెలియచేస్తాయి.

కొన్నిసార్లు మనము మంచి ఎంపికలు చేస్తాము, మరికొన్ని సార్లు కాదు; కొన్నిసార్లు మనం చేసిన వాటి గురించి ఖచ్చితంగా ఉంటాము మరియు ఇతర సమయాల్లో  కాదు. ఏది ఏమైనప్పటికీ, గత ఎంపికలు మన జీవితాన్ని మరియు మన చుట్టూ ఉన్న జీవితాన్ని ఇప్పుడు ఎలా ఉన్నప్పటికీ మలచుకోవడానికి  మనల్ని ప్రభావితం చేశాయి. జీవితంలో విజయం, భద్రత, శక్తి మరియు రక్షణ మరియు అనేక ఇతర వ్యక్తిగత కారణాల కోసం అదే విధంగా మనల్ని అంగీకరించాలని, ఇష్టపడాలని, గుర్తించాలని, వంటి వివిధ కారణాల వల్ల మనము ఎంపికలు చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఎంపికలు అనుకూలంగా ఉంటాయి మరి కొన్ని సార్లు కాదు.

మొదటి పఠనంలో మోషే ఇశ్రాయేలు  ప్రజల ముందు రెండు ప్రత్యామ్నాయాలను ఉంచాడు మరియు తెలివిగా ఎన్నుకోమని విజ్ఞప్తి చేశాడు.

1.విధేయత, ఇది జీవితం మరియు శ్రేయస్సుకు దారితీస్తుంది.

2.అవిధేయత, ఇది వినాశనానికి  మరియు మరణానికి దారితీస్తుంది.

మోషే ప్రవక్త జీవితాన్ని ఎంచుకోమని ఆజ్ఞాపించాడు, కేవలం సలహా లేదా సూచన కాదు. మీరు మరియు మీ వారసులు జీవించడానికి అనుకూల జీవితాన్ని ఎంచుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం.

16 మరియు 20 వచనాలు జీవితాన్ని ఎంచుకోవడం ద్వారా దాని అర్థం ఏమిటో అందంగా వర్ణిస్తుంది:

1.దేవుని ప్రేమ

2.దేవుని ఆలకించడం  మరియు దైవ మార్గాల్లో నడవడం

3.దేవుని అంటిపెట్టుకొని మరియు దైవ ఆజ్ఞలను పాటించండి


1.జీవితాన్ని ఎన్నుకోవడం అంటే దేవుణ్ణి ప్రేమించడమె అంటే, ప్రేమ తాత్కాలికమైనది లేదా క్షణికమైనది కాదు, కానీ పవిత్ర గ్రంధం ప్రకారం చెప్పినట్లుగా, “సజీవుడైన దేవుణ్ణి, నీ దేవుణ్ణి, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ శక్తితో ప్రేమించాలి.” ప్రేమ అనేది ఒక భావోద్వేగ అనుభవంగా కాకుండా సంపూర్ణ వ్యక్తిత్వంలో ఉండాలి.  కాబట్టి జీవితాన్ని ఎన్నుకోవడంలో, కాపాడటంలో సంపూర్ణంగ అదేవిధంగా జీవిత పవిత్రతను సంపూర్ణం కాపాడుతూ ఉండటమే దైవ ప్రేమ.

2.జీవితాన్ని ఎన్నుకోవడం అంటే దేవుని ఆలకించడం  మరియు దేవుని మార్గాల్లో నడవడం. మనం ఆలకించడంలో ఉత్సాహం మరియు దేవుని వెలుగులో నడవడంలో అనందం కలిగివుండాలి.  మనము ద్వితీయోపదేశకాండము 5 అధ్యాయం లో చూసినట్లయితే అక్కడ దేవుని యొక్క మార్గము అదే పది ఆజ్ఞలు మనకు కనిపిస్తాయి. మరియు యోహాను 14:6లో నేనే మార్గము అని యేసు చెప్పాడు. క్రీస్తు యొక్క జీవితాన్ని అనుసరించడమే దేవుని మార్గం. సువిశేషంలో కూడా యేసు కోరుకునేది అదే.

3.జీవితాన్ని ఎన్నుకోవడం అంటే ప్రభువు ఆజ్ఞలను అంటిపెట్టుకుని ఉండడం మరియు పాటించడం. ఇవి మనకు భారంగా ఉండడానికి ఉద్దేశించినవి కావు కానీ దేవుని పట్ల, వ్యక్తిగతంగ మరియు ఇతరుల పట్ల స్థిరమైన ప్రేమ మరియు విశ్వాసంతో కూడిన జీవితాన్ని కలిగి ఉండాలని  ప్రోత్సహిస్తాయి.

కానీ ప్రజలు ఇతర దేవుళ్ళ వైపు, ఇతర ప్రేమ, అభిరుచుల వైపు, ఇతర స్వరాలు మరియు ప్రాపంచిక సుఖాలు అదేవిధంగా,  ఇతర ఆజ్ఞల వైపు మొగ్గు చూపితే, వారు ఖచ్చితంగా నశించి, వాగ్దానం చేసిన భూమిని చేరుకోలేరు ఇంకా  శాపం మరియు మరణానికి గురవుతారు.

దురదృష్టవశాత్తు, అనేక క్రైస్తవ దేశాలలో, విశ్వాసాన్ని విడిచిపెట్టిన  చాలామంది ఇప్పుడు మరణం వైపు మొగ్గు చూపుతున్నారు. అబార్షన్ కోసం ర్యాలీలు, స్వేచ్ఛ మరియు జెండర్ పేరుతో పిల్లల (తరువాతి తరం) జీవితాన్ని నాశనం చేయడానికి ర్యాలీలు చీసుత్న్నారు.

సువార్తలో యేసు తన శిష్యులను మరియు అతని అనుచరులను జీవితానికి మరియు మోక్షానికి దారితీసే మార్గాలను ఎంచుకోవాలని సంబోధించాడు. మనం నశించాలని కోరుకోవడం లేదు. తనను అనుసరించే వారు జీవితం  వైపు మొగ్గు చూపాలని పిలిపునిస్తున్నారు.

కాబట్టి  రోజు పవిత్ర పఠనాలు మనకు తెలియచేసింది ఏమిటంటే అన్ని కారణాల కంటే గొప్పది, అన్నిటికి ఆధారమైనది తెలియచేస్తుంది అదే,  జీవితం మరియు మరణం మధ్య గల ఎంపిక, ఇది ఇతర ఎంపికలకు మూలం మరియు అంతిమ ప్రమాణం కూడా. కాబట్టి మనం ఎంచుకున్న ప్రతిదీ జీవితాన్ని పోలి ఉండాలి, మన కోసం మరియు ఇతరుల కోసం జీవితాన్ని కొనసాగించాలి మరియు పెంపొందించాలి. ఒకవేళ మన ఎంపిక దానికి విరుద్ధంగా ఉంటే, అది తన జీవితాన్ని మరియు ఇతరులను నాశనం చేయడం మరియు తిరస్కరించడం జరిగితే నిజమైన ఎంపిక కాదు. అందువల్ల దేవుని అనుగ్రంతో, దేవుని విజ్ఞానం తో ఎంపిక చేయమని మనలను ఆహ్వానిస్తున్నాయ్ ఈనాటి పఠనాలు. ఎందుకంటే సిరా పుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథ ప్రకారం మనం ఎన్నుకున్నది ఇవ్వబడుతుంది.  అధ్యాయం 15: 17లో "మీరు ఏది ఎంచుకుంటే అది ఇవ్వబడుతుంది" అని ధృవీకరిస్తుంది. మన కోసం మరియు తరువాతి తరాని కోసం జీవితాన్ని ఎంచుకుందాం.

మరణం కంటే జీవితాన్ని ఎంచుకోండి

 FR. JAYARAJU MANTHENA OCD

 

 

 

THURSDAY AFTER ASH WEDNESDAY

Deuteronomy 30:15-20

Luke 9:22-25

 

“Choose life, then, that you and your descendants may live.” (Deuteronomy 15:19)

Dear Brothers and sisters in Christ Jesus, the readings of the day speak about the choices we make in our lives. We make choices in our daily activities. We make a lot of choices right from waking up to sleeping and during the day various choices for various needs (food, clothing and relations). The choices that we make determine the results, the quality be it in our personal life,  relationships, our work  and also how we view the world around us  and how we participate in it.

Sometimes we make good choices, other times not; sometimes we are sure of it and other times we are not. Nevertheless the past choices have influenced us to shape our life and life around us however it is now. We are aware that we make choices for various reasons, like to be accepted, to be liked, to be identified, for success, security, power and protection and many other personal reasons. Sometimes those choices are realised but oftentimes not.

In the first reading Moses sets before the people of Israel two alternatives and appeals them to choose wisely.

1.     Obedience, which leads to life and prosperity.

2.     Disobedience, which leads to adversity and death.

He commands to choose life, not a mere advice or suggestion.  This is the setting for pro-life choose life, so that you and your descendant will live. 

Verse 16 and 20 beautifully depicts what it meant by choosing life: it involves

1.     love of God

2.     Hearing and walking in his Ways

3.     Clinging to him and keeping his commandments

1.     Choosing life means loving God, this love is not temporary or momentary but as the scripture puts it “You shall love The Living God, your God, with all your heart, and with all your self, and with all your might.” Love involves the whole person not just as an emotional experience. So also choosing life involves more, its holistic commitment preserves the sanctity of life.

2.     Choosing life means listening and walking in the ways of God. it’s an active listening and walking in the light of His law. As we go through chapter 5 the book of Deuteronomy we find from ver 1 onwards the ways of the Lord - The Ten commandments. And jesus said I am the way in John 14:6

3.     Choosing life means clinging to and keeping the Commandments of the Lord. these were not meant to burdensome but encourage a life of steadfast Love and faithfulness towards God, oneself and others

But if the people choose to turn away, drawn away towards other gods, other love interests, other voices and other commandments of worldly pleasures, they will surely perish and ruin the land, will not reach the promised land and will suffer the curse and death.

Unfortunately, in many christian countries, many who have left faith and who have abandoned faith are now turning towards choosing death. There are rallies for abortion, rallies for ruining children's life (the next generation) in the name of freedom and Gender.

Jesus in the Gospel too addresses his disciples and his followers to choose his ways which lead to life and salvation. He does not wish us to be lost and forfeit oneself.

Therefore the reading gives us today an ultimate reason. What matters is the choice between life and death which is both the ultimate choice and ultimate criteria for other choices. So everything that we choose should resemble life, should sustain and nurture life for oneself and others. If the choice is in contrast to that it would result in destroying and denying life oneself and others. Hence it is an invitation for all of us to make wise choices because it will be granted for sure, the book of sirach affirms it in 15: 17 “whichever you choose will be given” . let us choose life for us and for the next generation.

Choose LIFE over DEATH

FR. JAYARAJU MANTHENA OCD


 

 






FR. JAYARAJU MANTHENA OCD







 

The season of Lent is the season of spring

 

Time is fulfilled. Mark 1:15

The night is far gone, The day is near. Romans 13:12.

 

Dear friends, this year we are entering the season of lent on February 22nd,. Lent is an important and glorious spiritual period in the Christian faith. Lent begins with Ash Wednesday and ends with Resurrection.

 

     Prophet Moses spent forty days in God's presence on Mount Sinai and received God's commandments.

     Prophet Elijah made a spiritual journey for forty days to Horeb, the mountain of God, and found God.

     Lord Jesus fasted and prayed for forty days in the desert and was ready for the establishment of the kingdom of God and the ministry of the gospel.

     For us too, these forty days are a great opportunity to make ourselves good.

 

In what way? Reflect - Repent - Renew

       By Reflecting upon and considering thoroughly our lives and our relationship with God

       By Repenting and dying to our sins and trespasses

       By Renewing our conviction to our faith and being born again to our devoted life

 

But as usual, we tend to think about what to do, what not to do, what to listen to, what not to listen to, what to see, what not to see, what to leave behind. Along with these it is common to participate in some spiritual activities. We are tempted to do it very faithfully. Everything is good.But once this period of lent is over and the resurrection comes, it has become common to resume our old life with old enthusiasm. Many of us have related to this category. In the end, something is missing, lacking in us. Because of this, our attitude towards lent is whether we see it as an annual rule, obligation or self-discipline. We observe it as it is only a  period of just repentance

 

Reflect - Repent - Renew

 

Reflect - The time of lent is the time to examine ourselves, understand ourselves, and know the spiritual condition we are in. This spiritual journey is a time to examine our lives and relationship with God and unity with fellow believers and fellow brothers and sisters.

Repent/ Death - True repentance and death to sin by turning away from our sinful ways, focusing our attention on God and living as witnesses of God's love. This is what is expected from us.

Renew/Rebirth – lent is a period of renewal and rebirth to a life of dedicated faith by changing our way of thinking, speaking and acting. That is why lent is a spring season

    Spiritual springtime

    A time of grace

    Joyful season

    A time to start a new chapter.

Season of Spring- everyone's favourite

A time when nature is budding, everything appears beautiful and pleasant.

It becomes conducive for plant growth. Nature revives itself during this season. Everyone likes and tries to enjoy themselves to the fullest.

Such is the lenten season

It infuses a new vitality into our spiritual life. Because this is the time to be filled with God, grow up in Christ, and be anointed with the Spirit. This spiritual springtime is the renewal / rebirth of our withered life into a new life with a new bud.

 

Three pillars of Lent

They are the vehicles that guide us in our spiritual life and journey through this period of penance

1.      Prayer

2.      Fasting

3.      Almsgiving

 

1.      Prayer: We do pray daily. As we speak to God, God speaks to us. But what we need to do in this period is to understand their meaning and significance. Spend some time with sincerity. Prayer is about establishing a relationship with God

 

2.      Fasting: it’s not just discarding our Likes and Dislikes, Fasting should be practised not with sorrow, but with humility, with joy and a high purpose. The focus is about being with God and near God. We should do it with joy that we are getting closer to God, not with sadness that we are discarding things, and fasting from things.

 

3.      Almsgiving: We know that there are many kinds of charities. So donating some material is not the focus here, but giving ourselves to the fullest as much as we can for the needy. It’s not all about material things but also sharing our time and talents, sources and skills for the other.

Prayer, Fasting and Almsgiving are interrelated. We come near to God in fasting by discarding our sins, we connect to God in Prayer by reflection and we share that experience in our acts of charity/almsgiving.

We begin the period of lent with ashes and end with fire, filled with the flame of the resurrection, the flame of the Holy Spirit. It's time for Christ to wash our lives with His blood and give us new life. Therefore let us overthink about

       What we shouldn’t do

       Let us make full use of this period of lent to see how our life should be.


FR. JAYARAJU MANTHENA OCD

 

ENGLISH & TELUGU (ASH WEDNESDAY)

 ASH WEDNESDAY

Reading I: Joel 2:12–18 

Psalm: 51:3–4, 5–6ab, 12–13, 14 and 17 

Reading II: 2 Corinthians 5:20–6:2 

Gospel: Matthew 6:1–6, 16–18

 

Dear Brothers and sisters from Christ Jesus, From today onwards we begin our Lenten journey. We are entering into  a season of reflection , repentance and renewal. It’s a season to reflect our lives in the light of the scripture and our relationship with God and others. It’s a season to repent to keep our priorities right and keep our hearts clean and it’s a season to renew and restore the lost hope, love and grace once again. And today’s readings perfectly set us on this path and perfectly guide us in this journey.

The whole bible and the message of God is all ultimately about one thing: allowing God to win over our hearts. 

In the first reading from the prophet Joel, the lord invites his people

To put aside everything that they are doing so far and come to him and change their direction and focus towards him.

He calls upon his people to acknowledge and repent for the sins.

He insists that he wants complete focus, complete experience of conversion of heart not just a simple sorrow, an outward activity rather a change of heart. That’s why he says “Tear your hearts, and not your garments” (Joel 2:13).

 

In the second reading, St. Paul reminds us of the hope and salvation which Jesus Christ has brought through his death.

And this grace of salvation can only be received through repentance and faith in him.

 

In the Gospel reading, Jesus challenges us to embrace three pillars of season: Prayer, Fasting, and Almsgiving in order to journey through this of lent. He also instructs us to assimilate the true spirit of fasting and prayer.

As the people of Israel were made to wander in the desert for forty years for their conversion, as Moses spent 40 days on Mount Sinai in God’s presence for his commandments and just as Jesus went out for forty days to be strengthened for the ministry, so too we should see these next forty days as a journey for enormous spiritual growth. Let us pray for the grace to have our hearts purified, renewed, and set afire this Lent.  

First, Prayer:

Prayer is to depend on God, acknowledging our weaknesses.

Prayer is to submit to God, surrendering our will to God’s will.

Prayer is to believe that “I can do nothing, but God can do everything,” and to ask him humbly.

Prayer is conversation with God and connection with God who awaits for us.  

 

With regard to prayer, Jesus wishes us that our focus should be on God not on public opinion or public appreciation. And it should not be a time to showcase one’s talents and skills rather what Jesus meant by saying “ But when you pray, go to your inner room, close the door, and pray to your Father in secret” is that a kind of personal contemplative prayer where shut all the doors of  distractions, intentions and focus only God and his will to us. And then truly God repays us with his life giving relationship and strengthens us in our journey.

Fasting & Abstinence:

In terms of fasting, the Lord Jesus teaches us that it’s a means of communion with God and while fasting there should be joy and praise  not gloom and criticism.  Because the purpose of fasting is to help us be detached from the pleasures of this world and focus our attention on God. Therefore, in no way should we neglect our joy and praise.

In modern terms : fasting need not be only from food, it also can be from social media, technology, gossip, and excessive screen time. Fasting should remind us of our hunger for God.

Advantages of fasting:  

a - It reduces the excessive accumulation of “fat” in our soul in the form of evil tendencies and evil habits (=spiritual obesity).

b - It gives us additional moral and spiritual strength.

c - It offers us more time to be with God in prayer.

d - It encourages us to share our food and goods with the needy.

Almsgiving:

With regard to this Jesus instructs that  it’s not about showcasing your wealth, rather It's a response to God’s blessing. It’s more about showing compassion towards other people and less about proclaiming our name and fame. Jesus invites not just share our material goods, but also show gratitude to God by sharing our gifts of resources, Time, and talents to the people in need.

 

Prayer, Fasting, and Almsgiving  prepare and purify our hearts, body, mind and spirit in this journey to a deeper conversion and to receive light of Christ at Easter. That’s why we begin with Ashes reminding us that we are dust and end with fire/light reminding us that we ought to reach Christ/God/eternal life of light.


విభూది బుదవారం

మొదటి పఠనము : 2:1218

కీర్తన: 51:34, 56ab, 1213, 14 మరియు 17

రెండవ  పఠనము : 2 కొరింథీయులు 5:206:2

సువార్త: మత్తయి 6:16, 1618

 

క్రీస్తు యేసు నందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజు నుండి మనం మన తపస్సు కాల  ప్రయాణాన్ని ప్రారంభించాము. మనము ధ్యానము, పశ్చాత్తాపం మరియు పునరుద్ధరణ అనే సమయాలోనికి  ప్రవేశిస్తున్నాము. ఇది మన జీవితాలను దేవుని వాక్యం ద్వారా పరిశీలించుకుని మరియు దేవుడు మరియు ఇతరులతో మన సంబంధాన్ని గమనించుకొని, మరియు  మన ప్రాధాన్యతలను సరైన దారిలో మలచుకోవడానికి మరియు మన హృదయాలను శుభ్రం చేసు కోవడానికి ప్రయత్నిచే సమయం  మరియు కోల్పోయిన మన జీవిత ఆశ, ప్రేమ మరియు దయను మళ్లీ పునరుద్ధరించడానికి అరుదైన ఆధ్యాత్మిక కాలం. నేటి పఠనాలు మనల్ని ఈ మార్గంలో సంపూర్ణంగా ఉంచుతాయి మరియు ఈ ప్రయాణంలో మనకు  సంపూర్ణంగా మార్గనిర్దేశం చేస్తాయి.

మొత్తం పవిత్ర గ్రంధము మరియు దేవుని సందేశం అంతిమంగా ఒక విషయానికి నిమిడిఉంది: దేవుడు మన హృదయాలను గెలుచుకోవడానికి సహకరించడం మరియు అనుమతించడం.

 

మొదటి పఠనంలో యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు తన సందేశాన్ని అందిస్తున్నాడు.

మొదటగా ఇశ్రాయేలు ప్రజలను ఆహ్వానిస్తూ మనలను కూడా ఆహ్వానిస్తాడు

ఇప్పటి వరకు చేస్తున్నదంతా పక్కనబెట్టి తన వద్దకు వచ్చి మన  మార్గముని  మార్చుకుని అతని వైపు దృష్టి సారించడం.

అంటే మన పాపాలను గుర్తించి, వాటికి పశ్చాత్తాపపడమని మనలను   పిలుస్తాడు.

సంపూర్ణ దృష్టిని, సంపూర్ణ హృదయ మార్ఫు ను  కోరుకుంటున్నాడు,  కేవలం కొంచెం దుఃఖం పడటం మాత్రమే కాదు, బయటకు చేస్తున్నట్లు కనపడటం కాదు కోరుకునేది, మన వస్త్రాలలో కాదు మార్ఫు మన హృదయాలలో రావాలి అదే దేవుడు మానాలనుంచి కోరుకునేది.  అందుకే "మీ వస్త్రాలు కాదు, మీ హృదయాలను చించుకోండి" (యోవేలు 2:13).

 

రెండవ పఠనంలో, పునీత పౌలు గారు  యేసుక్రీస్తు తన మరణం ద్వారా తెచ్చిన నిరీక్షణ మరియు రక్షణ గురించి మనకు గుర్తు చేస్తున్నాడు. మనము ఈ ఆశీర్వాదాలు , ఈ రక్షణ పొందాలంటే పశ్చాత్తాపం మరియు విశ్వాసం ద్వారా మాత్రమే సాధ్యమౌతుంది అని వెల్లడిస్తున్నారు.

ఎదో నామ మాత్రపు నమ్మకు, పేరుకు మాత్రమే విశ్వాలుగా ఉండటం వాళ్ళ పొందేది ఏమి లేదు. సంపూర్ణంగ , స్వేచ్ఛగా, స్వతహాగా మన ఆలోచన, మాటలు మరియు క్రియలు ద్వారా వెల్లడి చేస్తామే అప్పుడే స్వీకరించగలుగుతాం. ఈ తపస్సు  కాలం ఆ విశ్వాసాన్ని పునరుద్ధరించు కోవడానికి అవకాశం అని పునీత పౌలు గారు ఆహ్వానిస్తున్నారు.

 

సువార్త పఠనంలో, ఈ ఆధ్యాత్మిక ప్రయాణం చేయడానికి ప్రార్థన, ఉపవాసం మరియు దానము అనే మూడు మూల స్తంభాలను  స్వీకరించమని యేసు మనలను ఆహ్వానం పలుకుతున్నాడు. ప్రార్థన ఉపవాసం మరియు దానము వీటి యొక్క నిజమైన భావమును గ్రహించమని కూడా క్రీస్తు మనల్ని సూచిస్తున్నాడు.

ఇశ్రాయేలు ప్రజలు తమ మార్ఫు కోసం నలభై సంవత్సరాలు ఎడారిలో ప్రయాణించినట్లుగా, మోషే ప్రభు ఆజ్ఞల కోసం దేవుని సన్నిధిలో సీనాయి పర్వతంపై 40 రోజులు గడిపినట్లుగ మరియు సువార్త పరిచర్య కోసం ఆధ్యాత్మిక శక్తిని పొందటానికి  యేసు నలభై రోజులు ప్రార్థన మరియు ఉపవాసం చేసి ఉన్నారు. ఈ నలభై రోజులను కూడా మనం అపారమైన ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం ఒక ప్రయాణంగా చూడాలి. మన హృదయాలు శుద్ధి చేయబడి, పునరుద్ధరించబడాలని మరియు దేవుని వెలుగు తో నింపబడాలని తన  కృప కోసం ప్రార్థిద్దాం.

 

మొదటగ, ప్రార్థన:

ప్రార్థన అంటే మన బలహీనతలను గుర్తించి దేవునిపై ఆధారపడటమే ప్రార్థన.

ప్రార్థన అంటే దేవునికి సమర్పించడం, మన చిత్తాన్ని దేవుని చిత్తానికి అప్పగించడం.

ప్రార్థన అంటే "నేను ఏమీ చేయలేను, కానీ దేవుడు అసాధ్యమైనది ఏది లేదు" అని నమ్మడం మరియు వినయంగా అతనిని సహాయం కోరడమే ప్రార్థన.

ప్రార్థన అనేది దేవునితో సంబాషించుట మరియు మన కోసం ఎదురుచూస్తున్న దేవునితో అనుసంధానం/ అన్యోన్య సంబంధము ఏర్పాటు చేసుకొనుట.

 

ప్రార్థనకు సంబంధించి, మన దృష్టి ప్రజల అభిప్రాయం లేదా ప్రజల ప్రశంసలపై కాకుండా దేవునిపై ఉండాలని యేసు కోరుకుంటున్నాడు. మరియు ఇది ఒకరి ప్రతిభను మరియు నైపుణ్యాలను ప్రదర్శించే సమయం కాకూడదు “అయితే మీరు ప్రార్థించేటప్పుడు, మీ లోపలి గదికి వెళ్లండి, తలుపులు మూసివేసి, మీ తండ్రికి రహస్యంగా ప్రార్థించండి” అని యేసు చెప్పడం ద్వారా స్పష్టం చేయబడింది. ప్రార్థన, ధ్యానం అనగా , మన కలతలు, కలవరాన్ని మరియు ఉద్దేశాల యొక్క అన్ని తలుపులను మూసివేసి, దేవుడు మరియు అతని చిత్తంపై మాత్రమే దృష్టిని ఉంచడమే. దీని ద్వారా  నిజంగా దేవుడు తన ఐక్యత సంబంధం ఇచ్చి మనకు ప్రతిఫలమిస్తాడు మరియు మన ప్రయాణంలో మనల్ని బలపరుస్తాడు.

ఉపవాసం & సంయమనం:

ఉపవాసం గురించి మాట్లాడుతూ, ఇది దేవునితో సహవాసం చేసే సాధనమని మరియు ఉపవాసం ఉన్నప్పుడు మనము ఆనందంతో మరియు దేవుని స్తుతిస్తూ ఉండాలని బోధిస్తున్నారు. దానికి బదులు ఎప్పుడు బాధతో మరియు విమర్శలతో, కలవరతో ఉండకుడు అని ఉద్దేశం.  ఎందుకంటే ఉపవాసం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఈ ప్రపంచంలోని సుఖాల నుండి వేరుగా ఉండటానికి మరియు భగవంతునిపై మన దృష్టిని కేంద్రీకరించడానికి సహాయపడుతుంది. కాబట్టి, మన ఆనందాన్ని మరియు దేవుని స్తుతులను  ఏ విధంగానూ నిర్లక్ష్యం చేయకూడదు.

ఉపవాసం కేవలం ఆహారం నుండి మాత్రమే కాదు, మనలను దేవుని నుంచి దూరం చేసే ఏదైనా, శారీరకంగా,  సాంకేతికంగా, చెడు తలంపులు, చెడు మాటలు, చెడు క్రియలు నుంచి కూడా ఉపవాసం ఉండాలి.  ఉపవాసం భగవంతుని పట్ల మనకున్న ఆధ్యాత్మిక కోరికను గుర్తు చేయాలి.

ఉపవాసం వల్ల కలిగే ప్రయోజనాలు:

a - ఇది చెడు ధోరణులు మరియు చెడు అలవాట్లు రూపంలో ఉన్న చెడు అనే కొవ్వు  మన ఆత్మలో చేరడాన్ని తగ్గిస్తుంది.

b - ఇది మనకు అదనపు నైతిక మరియు ఆధ్యాత్మిక బలాన్ని ఇస్తుంది.

సి - ఇది ప్రార్థనలో దేవునితో ఉండటానికి ఎక్కువ సమయాన్ని అందిస్తుంది.

d - ఇది మన ఆహారం మరియు వస్తువులను అవసరమైన వారితో పంచుకునేలా ప్రోత్సహిస్తుంది.

దానధర్మాలు:

దీనికి సంబంధించి, ఈ ఆధ్యాత్మిక క్రియ ద్వారా మన సంపదను ప్రదర్శించడం గురించి కాదు, అది దేవుని ఆశీర్వాదానికి మనము ప్రతిస్పందించే సమయము అని యేసు ఆదేశిస్తున్నాడు.మన పేరు మరియు కీర్తిని ప్రకటించడం గురించి కాదు కానీ ఇది ఇతర వ్యక్తుల పట్ల కనికరం చూపడం . యేసు మనలను వస్తు రూపంలో పంచడమే కాకుండా మనకు ఆశీర్వదించ బడిన ఆధ్యాత్మిక వనరులు, సమయం మరియు ప్రతిభను అవసరమైన వ్యక్తులకు పంచుకోవడం ద్వారా దేవునికి కృతజ్ఞతలు తెలియజేయమని కూడా ఆహ్వానిస్తున్నాడు.

 

ప్రార్థన, ఉపవాసం మరియు దానధర్మము  మన హృదయాలను, శరీరాన్ని, మనస్సును సుద్ధి చేసి  మరియు ఆత్మను నిజమైన మార్పుతో  క్రీస్తు వెలుగును పొందేందుకు ఈ ప్రయాణంలో మనలను సిద్ధం చేస్తాయి. అందుకే మనం ధూళి వంటి వంటి వారము అని గుర్తుచేసే విభూదితో ప్రారంభించి, పునరుత్తానా నిప్పు/వెలుగుతో ముగిస్తాం, మనం క్రీస్తు యొక్క నిత్యజీవిత కాంతిని చేరుకోవాలని గుర్తుచేస్తాం.

 FR. JAYARAJU MANTHENA OCD

 

 

నిత్య జీవము ఎలా వస్తుంది

 యోహాను 6: 22-29  మరునాడు, సరస్సు ఆవలితీరమున నిలచియున్న జనసమూహము అచటనున్న  ఒకే ఒక చిన్న పడవ తప్ప మరియొకటి లేదనియు, ఆ పడవలో శిష్యులతో పాటు యే...